Montenegro
-
అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!
పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్డౌన్ కాంపిటీషన్’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకున్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడటానికి కుటుంబసభ్యులెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు. వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..:) -
కుటుంబంతో గొడవ.. ఆగ్రహంతో 11 మందిని కాల్చిచంపిన వ్యక్తి
ఆగ్నేయ ఐరోపా దేశం మెంటెనెగ్రోలో మాస్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో విధ్వంసం సృష్టించాడు. తన చుట్టుపక్కల ఉన్నవారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే సెటింజేకు చెందిన వ్యక్తి కుటుంబసభ్యులతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఇరుగుపొరుగువారిపై తుపాకీతో తూటాల వర్షం కురిపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్పిచంపారు. మాంటెనెగ్రో అంతర్గత వ్యవహారాల శాఖ కూడా ఈఘటనపై స్పందించలేదు. పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇలాంటి భయానక ఘటన జరగడం దశాబ్దాల్లోనే ఇదే తొలిసారి. చుట్టూ పర్వతాలుండే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచదేశాల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. అక్కడి పర్యటక రంగానికి ఇదే మంచి సీజన్. ఎక్కువ మంది సందర్శకులు వచ్చే సమయంలో మాస్ షూటింగ్ జరగడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. చదవండి: వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై దాడి -
కరోనాతో బిషప్ మృతి, మృతదేహానికి ముద్దులు
పోడ్గోరికా: మాంటెనెగ్రోలో బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ పార్థీవదేహాన్ని సందర్శించే సమయంలో చాలా మంది కోవిడ్-19 భద్రతా నియమాలను విస్మరించారు. బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ చివరి అంత్యక్రియలను ఆదివారం పోడ్గోరికాలోని సెర్బియన్ ఆర్థోడాక్స్ కేథడ్రాల్లో నిర్వహించారు. అయితే ఆయనను చూడటానికి వచ్చిన వారిలో చాలా మంది ఆయన గౌరవార్థం ఆయన చేతిపై, నుదిటిపై మాస్క్‌లు లేకుండానే ముద్దులు పెట్టారు. ఈ విషయం గురించి బిషప్కు చికిత్సనందించిన డాక్టర్ మాట్లాడుతూ, ముందు ఆయన పార్థీవదేహాన్ని అలా తెరచి పెట్టకుండా నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆయన శరీరంపై కరోనా వైరస్ ఒక పొరలా ఉంటుందని వివరించారు. ఇప్పటికే ఈ చిన్న దేశంలో మూడు వంతుల మంది దాదాపు ఆరు లక్షలకు పైగా కోవిడ్-19 బారిన పడ్డారు. ఇక బిషప్ అమ్ఫిలోహిజే రాడోవిక్ విషయానికి వస్తే ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ సోషలిస్ట్ నేత మిలో జుకానోవిక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని గట్టిగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో జరిగే ఎన్నకల ప్రచారంలో డీపీఎస్‌కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. బిషప్ అమ్ఫిలోహిజే, పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకి, మోంటెనిగ్రో నుంచి సెర్బియా విడిపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఎన్నికల ప్రచారంలో చాలా చోట్ల ఆయన మాస్క్ లేకుండా తిరిగారు. సామాజిక దూరం పాటించకుండా చాలా మందిని కలిశారు. దీంతో ఆయన కరోనా బారిన పడి శుక్రవారం నాడు మరణించారు. ఇప్పుడు ఆయనకు కడసారి వీడోల్కు పలకడానికి వచ్చిన వారు కూడా కరోనా నియమాలు పాటించకుండా మాస్క్‌లు లేకుండా ఆయన మృతదేహాన్ని తాకుతూ ముద్దులు పెట్టడం చర్చనీయ అంశంగా మారింది. చదవండి: జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఫేజ్-2 పూర్తి -
యువతిని కాపాడిన శునకం
లండన్: ఊర్లలో వీధి కుక్కలను కాపాడాలని పెద్దవాళ్లు ఎందుకు చెప్పేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక వీధి కుక్క ... ఓ యువతిని ముష్కరుడి నుంచి కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాంటెనీగ్రో.. ఐరోపాలోని చిన్న దేశం. పడగోరికా.. పట్టణం ఆ దేశ రాజధాని. ఈ నగరంలో.. ఒక యువతి రెండు రోజుల కిందట షాపింగ్ చేసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఆమె వెళుతున్న దారిలోనే ఒక వీధికుక్క విశ్రాంతి తీసుకుంటోంది. ఇంతలో యువతిని అనుసరిస్తూ వస్తున్న ఓ యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి దాడి చేశాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు.. విలువైన వస్తువులను దోచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న గ్రామసింహం.. ఒక్కసారిగా యువకుడిపై దాడికి దిగింది. గట్టిగా అరుస్తూ.. అతడి పిక్క పట్టుకుంది. అంతే యువతిని వదిలేసి.. అతగాడు పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అని కుక్కను తలుచుకుంటూ.. యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. -
కుక్క ధైర్యం.. యువతిని రక్షించింది
-
ద బెస్ట్ బాస్ ఇన్ ద బాల్కన్స్
రాడొమిర్ నోవాకోవిక్ కకా.. మాంటెనీగ్రోకు చెందిన ఈయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఇతని ఉద్యోగులు నోవాకోవిక్ను ముద్దుగా ‘ద బెస్ట్ బాస్ ఇన్ ద బాల్కన్స్’, ‘బ్రదర్’ అని పిలుచుకుంటారు. కకాన్ స్పోర్ట్స్ అనే అతి పెద్ద క్రీడా వస్తువుల స్టోర్స్ యజమాని ఈ నోవాకోవిక్. ఇటీవలే ఆయన రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేశారు. కొన్ని ఏళ్లుగా బాల్కన్స్ దేశాల్లో ఈయన పేరు మారుమోగుతోంది. వ్యాపారంలో విపరీతంగా లాభాలు ఆర్జించడం వల్ల ఈయన పేరు ప్రఖ్యాతులు గడించలేదు కానీ తన కంపెనీలో నిజాయితీగా కష్టించి పనిచేసే ఉద్యోగులపై ఆయన చూపే ఔదార్యంతో ఎంతో ఫేమస్ అయిపోయారు. ఉద్యోగులను సంతోషంగా ఉంచితేనే తన కంపెనీ లాభాల బాట పడుతోందనే మాటను ఆయన గట్టిగా నమ్ముతారు. తన ఉద్యోగులకు బహుమతులను అందజేస్తారు. 2012లో తొలిసారిగా తన కంపెనీలో పనిచేసే నలుగురికి 4 బ్రాండెడ్ కార్లను బహూకరించారు. 2014లో తన కంపెనీలో ఒక ఉద్యోగికి సాకర్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడాలనుందని తెలియగానే అతని కోసం ఒక టికెట్ కొనిచ్చారు. రెండేళ్ల క్రితం 14 మంది ఉద్యోగులను బహమాస్, సిచెల్లెస్ ద్వీపాలకు వెకేషన్‌కు పంపించారు. మరోసారి మరికొంతమంది ఉద్యోగులను విలాసవంతమైన సముద్రయాత్రకు పంపించారు. బోనస్‌లు, జీతాలు పెంచి వారిని సంతృప్తి పరిస్తే సరిపోతుంది కదా అని నోవాకోవిక్ను చాలా మంది ప్రశ్నించగా ‘డబ్బులు వస్తాయి.. పోతాయి.. కానీ జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోతాయి’ అని బదులిస్తాడు. నోవాకోవిక్ తమ పట్ల చూపే ప్రేమకు ఉద్యోగులు కూడా మెచ్చి ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. ఆయన కంపెనీ స్టోర్లలో పనిచేసే ఒక్క ఉద్యోగి కూడా ఆలస్యంగా విధులకు రాడంటే నమ్మగలమా? -
రిసార్ట్‌గా మారనున్న కాన్సెంట్రేషన్ క్యాంప్
పోడ్కోరికా: రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్ గల మోంటోనిగ్రొ తీరంలోని మాముల దీవిని ఇప్పుడు అందమైన లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మోంటోనిగ్రొ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటలీకి చెందిన అప్పటి నాజీ నియంత బెనిటో ముస్సోలిని శత్రు ఖైదీలను నిర్భంధించేందుకు మాముల దీవిలో ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో 2,300 మంది ఖైదీలను నిర్బంధించగా వారిలో 130 మంది ఆకలితో చనిపోవడంగానీ, చంపేయడంగానీ జరిగింది. చారిత్రక గుర్తుగా ఈ దీవిని అలాగే ఉంచాలంటూ స్థానిక ప్రజలతోపాటు పలు ప్రపంచ దేశాలు చేసిన సూచనలను ఖాతరు చేయకుండా అక్కడ సుందరమైన రిసార్ట్‌ను నిర్మించి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిసార్ట్‌ను నిర్మించేందుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా అంచనా వేసింది. ‘మాముల క్యాంప్’ పేరుతో 1950లో ఓ హాలివుడ్ సినిమా కూడా వచ్చింది. మాముల దీవి దానంతట అదే శిథిలమయ్యేలా వదిలేయడం లేదా దాన్ని అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్డడం అనే రెండే ప్రత్యామ్నాయాలు తమకు ఉన్నాయని జాతీయ పర్యాటక శాఖ డెరైక్టర్ ఆలివెరా బ్రజోవిక్ తెలిపారు. రెండో ప్రత్యామ్నాయమే ఉత్తమమైనదని భావించామని, ఎందుకంటే స్థానికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు. ఈ కాన్స్ట్రేషన్ క్యాంప్‌లో స్థానికులే ఎక్కువ మంది మరణించడం వల్ల రిసార్ట్‌గా తీర్చిదిద్దడం వారికి ఇష్టం లేదు. క్యాంప్‌ను మ్యూజియంగానే ఉంచడం ఉత్తమమన్నది వారి వాదన. వారి వాదనకు తగ్గట్టుగా అవసరమైతే క్యాంప్ ఉన్న ప్రాంతంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆలివెరా అన్నారు. రిసార్ట్ నిర్మాణం కోసం స్విస్-ఈజిప్షియన్ కంపెనీ ‘ఓరస్కామ్’కు ఈ దీవిని 49 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. చదరపు మీటరుకు 150 రూపాయల చొప్పున ఈ కంపెనీ లీజు దక్కించుకుంది.