యువతిని కాపాడిన శునకం | brave DOG saves a woman | Sakshi
Sakshi News home page

యువతిని కాపాడిన శునకం

Published Sun, Nov 26 2017 6:09 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

brave DOG saves a woman - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

లండన్‌: ఊర్లలో వీధి కుక్కలను కాపాడాలని పెద్దవాళ్లు ఎందుకు చెప్పేవారో.. ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక వీధి కుక్క ... ఓ యువతిని ముష్కరుడి నుంచి కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మాంటెనీగ్రో.. ఐరోపాలోని చిన్న దేశం. పడగోరికా.. పట్టణం ఆ దేశ రాజధాని. ఈ నగరంలో.. ఒక యువతి రెండు రోజుల కిందట షాపింగ్‌ చేసుకుని ఒంటరిగా నడుచుకుంటూ వెళుతోంది. ఆమె వెళుతున్న దారిలోనే ఒక వీధికుక్క విశ్రాంతి తీసుకుంటోంది.


ఇంతలో యువతిని అనుసరిస్తూ వస్తున్న ఓ యువకుడు.. ఎవరూ లేని సమయం చూసి దాడి చేశాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు.. విలువైన వస్తువులను దోచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న గ్రామసింహం.. ఒక్కసారిగా యువకుడిపై దాడికి దిగింది. గట్టిగా అరుస్తూ.. అతడి పిక్క పట్టుకుంది. అంతే యువతిని వదిలేసి.. అతగాడు పలాయనం చిత్తగించాడు. బతుకు జీవుడా అని కుక్కను తలుచుకుంటూ.. యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో ఫుటేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement