prize winning
-
MasterChef India 7: Nayanjyoti Saikia: వంటకోసం ప్రాణం ఇస్తాడు
వంట అమ్మ చేయాలి.. అది రూలట. తర్వాత అమ్మాయి చేయాలి.. అది పెంపకం అట. కాని అబ్బాయి చేస్తే? అబ్బాయి నేర్చుకుంటే? వంట ద్వారానే విజేతగా మారితే? అస్సాంలో టీ తోటల్లో కార్మికుడిగా ఉన్న నయన్జ్యోతి సైకియా వంట మీద ధ్యాస పెట్టాడు. మునివేళ్ల మంత్రం నేర్చాడు. మాస్టర్ చెఫ్ పోటీలో విజేతగా నిలిచి 25 లక్షల ప్రైజు సాధించాడు. అమ్మ ఊరికెళితే కర్రీ పాయింట్ వైపు అడుగులు వేసే పుత్రరత్నాలు ఇతని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. 27 ఏళ్ల నయన్జ్యోతి సైకియాకు రాని వంట లేదు. మూడు నెలల పాటు ముంబైలో ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో కోసం ఉండి, రకరకాల వంటలు చేసి, భేష్ అనిపించుకుని, వారం క్రితం 25 లక్షల రూపాయల మొదటి ప్రైజ్ గెలిచాక ఎగువ అస్సాంలో ఉండే అతని ఊరి ప్రజలు ఉత్సవం జరుపుకుంటూ, ట్రోఫీతో తిరిగి వస్తున్న అతనికి స్వాగతం చెప్పడానికి రకరకాల వంటలు చేయిస్తూ ‘ప్రత్యేకంగా ఏం చేయించమంటావ్’ అని అడిగితే నయన్జ్యోతి సైకియా ‘ఏం వద్దు... మా ఇంట్లో చేసే టొమాటో చేప కూర చాలు’ అన్నాడు. దాదాపు రెండు వేల మంది అతనికి స్వాగతం చెప్పడానికి ఊరిలో జమ అయితే ఈ కూర నాలుకకు తగిలాకే ‘అమ్మయ్య... ఇప్పటికి మన ఊరు చేరినట్టయ్యింది’ అని నవ్వాడు. ఇవాళ నయన్జ్యోతి సైకియాను అస్సాం అంతా తనవాడు అని గర్వంగా చెప్పుకుంటోంది. అతను ఆస్కారో నోబెలో తేలేదు. కేవలం వంట ద్వారానే తన ప్రాంతం తల ఎత్తుకు తిరిగేలా చేశాడు. మెకానికల్ ఇంజనీర్ నయన్జ్యోతి సైకియా సొంత ఊరు తిన్ సుకియ. ఇది గౌహతికి 490 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సైకియా తండ్రి టీ ఎస్టేట్లలో పని చేస్తాడు. రైతు. 2018లో గౌహతిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సైకియా ఊరికి తిరిగి వచ్చి టీ ఎస్టేట్‌లో తండ్రి పనికి సాయంగా ఉంటూ వచ్చాడు. నిజానికి చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట విషయంలో సాయం చేస్తూ వచ్చిన సైకియాకు వంట మీద రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోయిందని ఇంటి వాళ్లు గుర్తించలేదు. అది ఒక ముఖ్య ఉపాధి అని కూడా భావించలేదు. కాని సైకియా మాత్రం తన బెడ్రూమ్లో ఒక మూల చిన్న స్టవ్‌ను ఏర్పాటు చేసుకొని రకరాల వంటలు తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్ వరకూ ఇది కొంత రహస్యం గా సాగినా ఇంజనీరింగ్ కోసం గౌహతికి వెళ్లాక ఆ నాలుగేళ్లు అతని ప్రయోగాలకు అడ్డు చెప్పేవారు లేకపోయారు. ఇంటర్నెట్ గురువు ‘నాకు గురువులు లేరు. వంట శాస్త్రం కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. నాకు వచ్చిందంతా ఇంటర్నెట్లో రకరకాల షెఫ్‌లను ఫాలో అయి నేర్చుకున్నదే. నేను మంచి ఫొటోగ్రాఫర్‌ని. నేను చేసిన వంటలను చాలా ఆకర్షణీయంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పెట్టేవాణ్ణి. అలా అందరి దృష్టి నా మీద పడింది. ప్రఖ్యాత షెఫ్ వికాస్ ఖన్నా నా ఇన్‌స్టా పేజీలో నా వంటలను చూసి నన్ను వెతుక్కుంటూ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి మా ఊరు వచ్చారు. మా ఇంట్లో మా సంప్రదాయ వంటలు వండి చూపించారు. నన్ను మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్‌గా తీసుకెళతానని అడిగారు. గట్టిపోటీలో ఈశాన్య రుచులు చూపి ‘మాస్టర్ షెఫ్’ రియాలిటీ షో అంటే మాటలు కాదు. కొమ్ములు తిరిగిన పార్టిసిపెంట్లు వస్తారు. అనుభవం సంపాదించుకున్నవారు వారిలో ఉంటారు. వారందరితో తలపడి మొదటి స్థానానికి వెళ్లడం చాలా గొప్ప. అదీ గాక జడ్జీలను మెప్పించాలి. ఈ షోకు జడ్జీలుగా వచ్చిన రణ్వీర్ బ్రార్, గరిమ అరోర, వికాస్ ఖన్నాను ఆకట్టుకున్నాడు సైకియా. ‘అందుకు కారణం నేను నా వంటల్లో మా ఊరి దినుసులను దాదాపుగా వాడటం. వాటితో ప్రయోగాలు చేయడం.’ అంటాడు సైకియా. ఎన్నో అడ్డంకులున్నా ఇంత విజయం సాధించాక పెద్ద పెద్ద రెస్టరెంట్లే అతణ్ణి భాగస్వామిని కమ్మని అడుగుతున్నాయి. విజయం అంటే ఇది. కోరుకున్న కలను ఛేదించాలంటే ఇలాంటి పట్టుదలే ఉండాలి. ‘నేను జీవితంలో ఇప్పటికీ పెద్ద రెస్టరెంట్‌కు వెళ్లలేదు. మా ఊళ్లో లేకపోవడం వల్ల. అంత డబ్బు లేకపోవడం వల్ల. కాని పెద్ద రెస్టరెంట్లలో చేసేవన్నీ నేను అంతకన్నా బాగా చేయడం నేర్చుకున్నాను’ నార్త్ ఈస్ట్ అంటే మాంసాహారం అని ఎక్కువమంది అనుకుంటారు. నేను శాకాహారం రెసిపీలు కూడా చేసి చూపించాను. మణిపూర్ నల్లబియ్యంతో సంగటి వొండితే వారికి బాగా నచ్చింది. ఇక రకరకాల పాస్తాలు చేయడంలో నన్ను మించినవారు లేరు. – నయన్జ్యోతి సైకియా -
అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!
పనీపాటా లేకుండా తిని, పడుకుంటే డబ్బులొస్తాయా? అంటారు కానీ... నిజంగానే ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్డౌన్ కాంపిటీషన్’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహుమతి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్. నగదుతోపాటు ఇద్దరికి రెస్టారెంట్లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్స్టే, రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకున్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడటానికి కుటుంబసభ్యులెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు. వంద సంవత్సరాల కిందటి ఓ చెట్టు కింద పోటీ నిర్వహించారు. తొమ్మిది మందితో పోటీ ప్రారంభమైనా.. ఏడుగురు మొదటిరోజు సాయంత్రానికే ఓడిపోయారు. తరువాతి రెండురోజులు మిగిలిన ఇద్దరి మధ్యే కాంపిటీషన్ జరిగింది. చివరకు జర్కో గెలిచాడు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..:) -
ఒక చిత్రం వెయ్యి పదాలు.. కాదు వెయ్యి కావ్యాలు!
కొన్ని ఫొటోలను చూస్తుంటే, ఒక చిత్రం వెయ్యి పదాలు కాదు వెయ్యి కావ్యాలు అనిపిస్తుంది! సొసైటీస్ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌ల కోసం పలు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫొటోలు వచ్చాయి. వాటిని కాచి వడపోసిన తరువాత మిగిలిన ఫొటోలను చూస్తుంటే ఎవరికైనా సరే భావుకత్వం వరదలెత్తుతుంది. ‘న్యూ బార్న్’ విభాగంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ రాచెల్ బర్టన్ తీసిన బేబీ జాస్మిన్ ఫొటో ‘టాప్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘వెడ్డింగ్’ విభాగంలో బంధుమిత్రులంతా కలిసి సంతోషంతో వధువును పైకి ఎగరేస్తున్న ఫొటో, ‘ఫ్యామిలీ’ విభాగంలో చల్లటి అనుబంధన చందనం ఉట్టిపడే తండ్రీకొడుకుల ఫొటోలు బహుమతులు గెలుచుకున్నాయి. -
భూసార నిపుణుడు డా. లాల్‌కు ‘జపాన్ ప్రైజ్’
దుక్కి చెయ్యకుండా పంట విత్తటం, వాతావరణంలోని ఉద్గారాలను భూమి పీల్చుకునేలా సాగు పద్ధతులను రూపొందించడంలో విశేష కృషి చేసిన భారతీయ సంతతికి చెందిన డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో భారతీయ సంతతికి చెందిన భూసార శాస్త్రవేత్త డాక్టర్ రత్తన్ లాల్ ప్రతిష్టాత్మకమైన జపాన్ ప్రైౖజ్ –2019ను గెల్చుకున్నారు. పంజాబ్‌లో జన్మించిన డాక్టర్ లాల్ ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫుడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భూసార శాస్త్రవేత్తగా సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. డా. లాల్‌కు జపాన్ ప్రైజ్ కింద 4.5 లక్షల డాలర్ల నగదు పురస్కారాన్ని జపాన్ రాజు అకిహిటో, ప్రధాని షింజో అబెల నుంచి ఏప్రిల్ 8న ప్రదానం చేస్తారు. ఇంతకుముందు గ్లింకా వరల్డ్ సాయిల్ ప్రైజ్‌ను, వరల్డ్ అగ్రికల్చర్ ప్రైజ్‌లను కూడా ఆయన అందుకోవడం విశేషం. నగదు బహుమతులను కర్బన ఉద్గారాలపై పరిశోధనలకే వెచ్చిస్తానని ఈ సందర్భంగా డా. లాల్ ప్రకటించి తన ఉదాత్తతను చాటుకున్నారు. -
రూ కోటి చేతికి అందినట్టే అంది..
సాక్షి, ముంబై : కష్టాన్ని నమ్ముకుని బతికే సుహాస్ కదమ్ లాటరీలో రూ కోటికి పైగా గెలుచుకున్నాడని తెలియగానే ఇక తన కష్టాలు తీరాయనుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల సుహాస్ కదమ్ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బతుకు మారుతుందనే ఆశతో గత ఐదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఉన్నట్టుండి లాటరీలో రూ కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందడంతో కదమ్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. నలసపరకు చెదిన కదం తాను లాటరీలో గెలుచుకున్న బహుమతి మొత్తం వసూలు చేసుకునేందుకు లాటరీ విభాగానికి వెళ్లగా ఒకే ప్రైజ్‌ను ముగ్గురు వ్యక్తులు తామే గెలుచుకున్నామని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. సరైన టికెట్‌తో వచ్చిన వ్యక్తికి లాటరీ బహుమతిని అప్పగించామని వారు కదమ్‌తో చెప్పారు. తాను కొన్న టికెట్ నకిలీదని లాటరీ డిపార్ట్మెంట్ తేల్చిచెప్పడంతో నిరుత్సాహానికి లోనైన కదమ్ నగరంలోని మహాత్మా ఫూలే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తింపు కలిగిన కేంద్రాల్లోనే నకిలీ టికెట్లు ఎలా అమ్ముతున్నారో బట్టబయలు చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. తన బంధువులు సైతం లాటరీలో తాను గెలుపొందినందుకు అభినందనలు తెలిపిన క్రమంలో జరిగిన పరిణామాలపై తాను తీవ్రంగా కలత చెందానని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, నకిలీ లాటరీ టికెట్ల ముద్రణ, పంపిణీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. -
నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కన్నుమూత