
కొన్ని ఫొటోలను చూస్తుంటే, ఒక చిత్రం వెయ్యి పదాలు కాదు వెయ్యి కావ్యాలు అనిపిస్తుంది! సొసైటీస్ ఆఫ్ ఫొటోగ్రాఫర్స్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌ల కోసం పలు విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫొటోలు వచ్చాయి. వాటిని కాచి వడపోసిన తరువాత మిగిలిన ఫొటోలను చూస్తుంటే ఎవరికైనా సరే భావుకత్వం వరదలెత్తుతుంది.
‘న్యూ బార్న్’ విభాగంలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ రాచెల్ బర్టన్ తీసిన బేబీ జాస్మిన్ ఫొటో ‘టాప్ ప్రైజ్’ గెలుచుకుంది. ‘వెడ్డింగ్’ విభాగంలో బంధుమిత్రులంతా కలిసి సంతోషంతో వధువును పైకి ఎగరేస్తున్న ఫొటో, ‘ఫ్యామిలీ’ విభాగంలో చల్లటి అనుబంధన చందనం ఉట్టిపడే తండ్రీకొడుకుల ఫొటోలు బహుమతులు గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment