ప్రతీకాత్మక చిత్రం
సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి చేసే కుటుంబానికి బంధువులు, స్నేహితులు డబ్బు, వస్తువులు సమకూర్చటం చూస్తూవుంటారు. అయితే వారు అడగకపోయినా పిలిచిమరీ ఖర్చులకు అవసరం అవుతుందని డబ్బు అందిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా ఓ వధువు తన బంధువులు, స్నేహితులను వింతమైన విన్నపంతో వివాహ రిషెప్షన్‌కు ఆహ్వానించింది. తన వివాహానికి వచ్చే అతిథులు, బంధువులు తలో రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎందుకంటే పెళ్లి రిషెప్షన్ చేయడానికి తగినంత డబ్బు లేదని పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అయితే వధువు స్నేహితుడొకరు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ‘మా వద్ద పెళ్లివేడుకలు నిర్వహించడానికి తగిన డబ్బు లేదు. పెళ్లికి వచ్చే బంధువులు, అతిథులుకు తలో రూ.7వేలు ($99) ఇవ్వాలని కోరుతున్నాము’ అని పెళ్లి ఆహ్వాన పత్రికలో తెలిపారని చెప్పాడు. ఇక తను ఉండే ప్రాంతం నుంచి వివాహం జరిగే చోటు చాలా దూరమని తెలిపాడు.
వివాహం జరిగే చోట ఏకంగా ఓ బాక్స్ ఏర్పాటు చేసి ఉందని చెప్పాడు. దానిపై ‘అతిథులారా మా భవిష్యత్తు, కొత్త నివాసం కోసం దయచేసి డబ్బు విరాళంగా ఇవ్వండి’ అని రాసిపెట్టి ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వివాహ వేడుక అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి కూతురు డబ్బు డిమాండ్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘నేను అలాంటి పెళ్లి వేడుకలకు అస్సలు వెళ్లను.. వాళ్లు ఎంత దగ్గరవాళ్లు అయినా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఆ జంట ఇలా చేసి ఉండాల్సింది కాదు.. అయితే వారు చెప్పింది నిజమై కూడా ఉండవచ్చు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment