టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని! | We feel anxiety to watch in Television serials | Sakshi
Sakshi News home page

టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!

Published Sun, Jan 19 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!

టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!

ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అతిథుల సంగతేమోగానీ, ఏదైనా కొత్త సీరియల్ ప్రారంభమవుతోందంటే దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ టైముకి వస్తుంది, ఎలా ఉంటుంది అంటూ మొదట ఆసక్తి. సీరియల్ కానీ నచ్చిందంటే... తర్వాత ఏమవుతుంది, కథ ఏ మలుపులు తిరుగుతుంది అంటూ ఉత్కంఠ. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే... ప్రతి చానెల్ అడపా దడపా ఏదో ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతూనే ఉంటోంది. అలా ఇటీవలే ప్రారంభమైన సీరియల్... దామిని.
 
 అచ్చమైన ఆధునిక యువతి దామిని. ఆకట్టుకునే అందం, ఎవరినైనా ఎదిరించగల ఆత్మవిశ్వాసం, ఎంతటి పోరాటానికైనా వెరవని దృఢత్వం ఆమె సొంతం. అదే ఆమెకు ఓ యువకుడితో గొడవ తెచ్చిపెడుతుంది. అతడి అహంకారానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి మధ్య పోరాటం మొదలవుతుంది. ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తోందీ ధారావాహిక.
 
 దామిని పాత్రలో ఒదిగిపోయిన ప్రీతి అభినయం, శ్రీరామ్ లాంటి ఫేమస్ హీరో నెగిటివ్ రోల్ చేయడం, చాలాకాలం తరువాత సీనియర్ నటి యమున ఓ వైవిధ్యభరితమైన పాత్ర పోషించడం వంటి వాటితో పాటు... బలమైన కథ, అందమైన స్క్రీన్‌ప్లే ఈ సీరియల్‌కు ప్లస్ పాయింట్స్. అయితే ఆదిలో ఉన్న పటుత్వం రోజులు గడిచేకొద్దీ సన్నగిల్లడం కొన్ని సీరియళ్లలో కనిపిస్తోంది. దామిని అలా కాదనే అనుకుందాం. ముందు ముందు దామిని జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, తెలుగు ప్రేక్షకులను ఇంకెంత కట్టిపడేస్తుందో చూద్దాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement