Self-confidence
-
మంచి మాట: వర్తమానమే జీవితం
మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా. ‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్ టోల్ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు. దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి. ‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది. గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి. ‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు. గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి. వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు. – శ్రీకాంత్ జయంతి -
నొప్పి తెలియకుండా విముక్తి
మరొకరి సాయంతో జీవితాన్ని చాలించడాన్ని (అసిస్టెడ్ సూసైడ్) సులభతరం చేసేదే ఈ ‘సార్కో మెషీన్’. నయం కాని వ్యాధులతో బాధపడుతూ... నిత్యం నొప్పిని, మానసిక క్షోభనూ అనుభవిస్తూ అనుక్షణం చచ్చేకంటే... ఎలాగూ బతికే అవకాశాలు లేవు కాబట్టి... పలుదేశాలు స్వీయ సమ్మతితో ప్రాణాలు విడవడాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తున్నాయి. అందులో స్విట్జర్లాండ్ ఒకటి. అసిస్టెడ్ సూసైడ్‌కు ఈ సార్కో మెషీన్ ఒక సులువైన, బాధ తెలియనివ్వని సాధనం. స్విట్జర్లాండ్‌లో న్యాయ సమీక్షలో దీనికి ఆమోదముద్ర పడిందని తయారీ సంస్థ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (లాభాపేక్ష లేని సంస్థ. స్వచ్చంద సంస్థ లాంటిది) గతవారం వెల్లడించింది. ఎలా పని చేస్తుందంటే... శవపేటిక ఆకారంలో ఉండే సార్కో త్రీడీ ముద్రిత క్యాప్సుల్. ఎవరైనా ఇందులోకి ప్రవేశించి పడుకొంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సమాధానాలు ఇచ్చాక లోపల ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా దీన్ని పనిచేసేటట్లుగా చేయవచ్చు. ఎప్పుడు ప్రారంభం కావాలనే సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నైట్రోజన్‌తో నిండిన ఒక పరికరం ఉపరితలంపై దీని నిర్మాణం జరుగుతుంది. బటన్ నొక్కిన వెంటనే క్యాప్సుల్‌లోకి శరవేగంగా నైట్రోజన్ నిండుతుంది. సెకన్లలో ఆక్సిజన్ స్థాయి 21 నుంచి ఒకటికి పడిపోతుంది. క్యాప్సుల్‌లోని వ్యక్తి వినికిడి శక్తిని కొద్దిగా కోల్పోయిన భావన కలుగుతుంది... ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతాడు. శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డయాౖMð్సడ్ స్థాయిలు పడిపోయి మరణం సంభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 సెకన్లలో ముగుస్తుందని దీని రూపకర్త డాక్టర్ ఫిలిప్ నిష్కే తెలిపారు. తీవ్ర భయాందోళనలకు లోనుకావడం, ఊపిరి ఆడని ఫీలింగ్, యాతన... ఇవేవీ ఉండవు. ఆటోమేషన్ చేసే ఆలోచన స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్ చట్టబద్ధంగా అనుమతించడం పరోక్షంగా జరుగుతుంది. నేరుగా దీన్ని అనుమతించే చట్టాలు లేవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకొకరు సహాయపడితే... దాని వెనుకగనక అతనికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని రుజువు చేయగలిగితే శిక్షార్హుడని చట్టం చెబుతోంది. అసిస్టెడ్ సూసైడ్‌కు ఒక ప్రొసీజర్ ఉంటుంది. జీవించే అవకాశాల్లేని రోగి... తనువు చాలించాలని నిర్ణయం తీసుకొనేటపుడు మానసిక సమతౌల్యంతో ఉన్నట్లు సైకియాట్రిస్టు ధ్రువీకరించాలి. తర్వాత రోగి నోటి ద్వారా ద్రవరూపంలో ఉన్న సోడియం పెంటోబార్బిటాల్ తీసుకుంటాడు. 2 నుంచి 5 నిమిషాల్లోపే నిద్రలోకి... ఆపై గాఢ కోమాలోకి వెళ్లిపోతాడు. అనంతరం మరణం సంభవిస్తుంది. చాలాదేశాల్లో అసిస్టెడ్ సూసైడ్ డాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్‌లో డాక్టర్లు కాని వారు కూడా ఆత్మహత్యలో సహాయపడవచ్చు. సైకియాట్రిస్టు ధ్రువీకరణ కూడా యాంత్రికంగా జరిగేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని సార్కోకు జోడించే యత్నాలు చేస్తున్నామని డాక్టర్ ఫిలిప్ తెలిపారు. అసిస్టెడ్ సూసైడ్– యుథనేసియా ఒకటేనా! కాదు తేడా ఉంది. యూకే నేçషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం యుథనేసియా/మెర్సీకి ల్లింగ్ (కారుణ్య మరణం)లో ఒక వ్యక్తికి భరింపలేని, నిరంతర బాధ నుంచి విముక్తి ప్రసాదించడానికి డాక్టర్ ప్రాణాలు తీసే మందును తానే ఇంజక్ట్ చేస్తాడు. రోగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిల్లో ఉంటే మెర్సీకిల్లింగ్లో అతని లేదా ఆమె బంధువులు కూడా రాతపూర్వకంగా సమ్మతి తెలుపవచ్చు. అసిస్టెడ్ సూసైడ్... ఒక బాధిత రోగి ప్రాణాలు తీసుకోవడానికి వైద్యుడు ప్రిస్కిప్షన్ రాస్తాడు.. రోగి స్వయంగా ఇంజక్షన్ లేదా నోటిద్వారా మందును వేసుకుంటాడు. స్విట్జర్లాండ్‌లో మాత్రమే డాక్టర్లు కాని వారు కూడా అసిస్టెడ్ సూసైడ్‌లో సహాయపడవచ్చు. ఏయే దేశాలు అనుమతిస్తున్నాయి... స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా, కొలంబియా, స్పెయిన్, న్యూజిలాండ్ (6నెలలకు మించి బతకడని ఇద్దరు డాక్టర్లు ధ్రువీకరించాలి) దేశాల్లో చట్టబద్ధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోనూ ఇది అమల్లో ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, న్యూజెర్సీ, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మోంటానా, వెర్మోంట్ల్లో చట్టబద్ధం. ఎవరు అర్హులనే విషయంలో నిబంధనలు మాత్రం వేరుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రెండు అతిపెద్ద అసిస్టెడ్ సూసైడ్ సంస్థలు... ఎగ్జిట్, డిగ్నిటాస్ల సేవలు ఉపయోగించుకొని 2020లో 1,300 మంది విముక్తి పొందారు. చట్టబద్ధత లేని దేశాల వారు స్విట్జర్లాం డ్ వచ్చి మరీ ప్రాణాలు వదులుతున్నారు. ఇది ‘డెత్ టూరిజం’గా మారుతోందనే విమర్శలున్నాయి. నైతికంగా సబబేనా? జాతస్య మరణం ధృవంః. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ, ఇక బతికే అవకాశాలేమాత్రం లేనపుడు నొప్పిని భరిస్తూ బతికుండటానికి బదులు తనువు చాలించడమే మేలని భావిస్తారు బాధితులు. శారీరకంగా నొప్పిని భరిస్తూ, మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూడటమనేది అన్నింటికంటే పెద్ద నరకం. అలాంటి జీవికి సాధ్యమైనంత తేలికైన మార్గంలో ముక్తిని ప్రసాదించడమే మేలనేది కొందరి వాదన. అందుకే చట్టాలు దీన్ని అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఏంటి స్థితి? అసిస్టెడ్ సూసైడ్, యుథనేసియా/మెర్సీ కిల్లింగ్ రెండూ మనదేశంలో చట్ట విరుద్ధం. నేరం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు అరుణా షాన్‌బాగ్ కేసులో 2011లో ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అరుణా షాన్‌బాగ్‌పై వార్డుబాయ్ 1973లో అత్యాచారం చేశాడు. దాంతో కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకోలేదు. 37 ఏళ్లు అలా ఆసుపత్రిలో జీవచ్చవంగా బెడ్‌పై ఉండిపోయిన ఆమె తరఫున 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడో న్యాయవాది. ఆమెకు విముక్తి కల్పించాలని కోరాడు. మెడికల్ లైఫ్‌సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించడానికి (పాసివ్ యుథనేసియా) సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ అది జరగలేదు. 42 ఏళ్లు కోమాలో ఉన్న తర్వాత 2015లో న్యూమోనియాతో అరుణ మరణించారు. అనంతరం 2018లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... ఒక వ్యక్తిని వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని రూలింగ్ ఇచ్చింది. ‘వయోజనుడైన ఓ వ్యక్తి మానసిక సమతౌల్యంతో నిర్ణయం తీసుకోగలిని స్థితిలో ఉంటే... ప్రాణాలు నిలిపే పరికరాలను తొలగించడంతో సహా ఎలాం టి వైద్య చికిత్సనైనా నిరాకరించే హక్కు అతను లేదా ఆమెకు ఉంటుంది’ అని స్పష్టం చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పెద్దగీత– చిన్నగీత
ఆత్మీయం పూర్వం ఒక గురువుగారు పాఠం చెబుతూ, నల్లబల్లపై ఒక గీత గీసి, ఆ గీతను చెరపకుండా చిన్నదిగా చేయమని విద్యార్థులను అడిగారు. ఎలా చేయగలం? ఆ గీతను ముట్టుకోకుండా చిన్నదిగా చేయాలి. అపుడు వారిలో ఒక తెలివైన విద్యార్థి లేచి ఆ గీత కింద మరొక పెద్దగీతను గీశాడు. దానితో మొదటి గీత చిన్నదిగా అయిపోయింది. ఇక్కడ నీతి ఏమంటే, మీ కష్టాలు చాలా పెద్దవిగా అనిపించినపుడు, ఒక్కసారి కనులు పైకెత్తి చూడండి. ఎందుకంటే ఇప్పటివరకూ మీ దృష్టిని మీ పైనే కేంద్రీకరించి ఉంచారు. ఒకసారి మీ చుట్టూ ఉన్నవారిని, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నవారిని చూడండి. మీ కష్టం మీరనుకున్నంత పెద్దదేమీ కాదని మీకు అనిపిస్తుంది. మీకు ఏదైనా పెద్దకష్టం వచ్చినపుడు మీకంటే పెద్ద కష్టాలు పడుతున్నవారికేసి చూడండి. మీలో ఒక ఆత్మవిశ్వాసం, నా సమస్య చిన్నది, నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం కలుగుతాయి. కాబట్టి, ఆనందంగా ఉండటానికి మొదటి సూత్రం ఏమంటే, ప్రపంచంలో ఎక్కడైతే పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయో అక్కడ చూడండి. అపుడు మీ సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయో అప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే, లేదా పరిష్కరించే శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. స్థూలంగా చెప్పాలంటే, ఎక్కువ కష్టాలు ఎవరికైతే ఉన్నవో అటువంటివారికి సహాయపడండి. సేవ చేయండి. -
ఆత్మన్యూనత... ఆత్మవిశ్వాసం
ఎన్నో మంచిగుణాలున్న వారు కూడా, తమలో ఒక చిన్న గుణాన్ని భూతద్దంలో చూస్తూ, తాము దేనికీ పనికిరామని భావిస్తూ, ఆత్మన్యూనతలో విలువైన కాలాన్నీ, జీవితాన్నీ వృథా చేసుకుంటుండటం చూస్తుంటాం. చక్కని మాటకారి కాదని, చూడచక్కని రూపం లేదని, పెద్ద చదువులు లేవని, సిరిసంపదలు లేవని, లలితకళలు లేవని, ఇవన్నీ కాకపోతే అదృష్టహీనులనీ పక్కవారితో పోల్చుకుంటూ అనుక్షణం బాధపడేవారు కోకొల్లలు. అటువంటి ఆత్మవిశ్వాసం లేనివారికి ధైర్యం కలిగించేలా చాణక్యుడు చక్కని ఉదాహరణను చెప్పాడు. మొగలి పొదలు బురదలో పెరుగుతాయి. విషసర్పాలు చుట్టుకుని ఉంటాయి. ఆకులనిండా ముళ్ళు ఉంటాయి. మొగలి పూరేకులు, ఆకులు వంకరగా, అడ్డదిడ్డంగా, క్రమపద్ధతి లేకుండా పెరుగుతాయి. ఇన్ని అవలక్షణాలున్నా మొగలిపూవుకున్న ఒకే ఒక సుగుణం మైమరపించే సువాసన మాత్రమే. ఆ ఒక్క పరిమళంతో అందరినీ ఇట్టే తనవైపునకు ఆకర్షిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం అనే ఒక్క సుగుణం ఉంటే చాలు... వారికి ఏ విధమైన ప్రత్యేకతలు లేకపోయినా ఎటువంటి వారైనా వారికి దాసోహ మనవలసిందే. -
టారో 30 ఏప్రిల్ నుంచి 6 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో సాగిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, వీపునొప్పి, కొద్దిపాటి మానసిక ఒత్తిడి బాధించవచ్చు. సంగీత చికిత్స లేదా ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. మీ కలలు నిజం అయే అవకాశం కలుగుతుంది.Sపలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం ప్రయోజనం చేకూరుతుంది. మీ ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి మంచి కబురు అందుతుంది. చదువుకు సంబంధించిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. విందు వినోదాలలో తీరుబడి లేకుండా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుని, వేగంగా పని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కలిసి వచ్చే రంగు: » ంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూత్న శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంగా పని చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశీయానం చేయవలసి రావచ్చు. ఒక స్త్రీ మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పెట్టిన పెట్టుబడల నుంచి లాభపడతారు. మార్నింగ్ వాక్, యోగ వంటివి కొనసాగించడం మంచిది. కలిసివచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు అందుతాయి. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. మీ కష్టసుఖాలను స్నేహితులకు చెప్పుకుని ఉపశమనం పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు చేసిన పనులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి ఓర్చుకోలేక మిమ్మల్ని చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. తెలివిగా తిప్పికొట్టడం అలవరచుకోండి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యం అవవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. Ðఅవకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 23 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పనిలో బాధ్యతాయుతంగా మెలిగి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉరవడిని కనిపెడతారు. లక్ష్యాలను నిర్ణయించుకుని పని చేస్తే మెరుగైన ఫలితాలను పొందగలమని గ్రహిస్తారు. ఈ వారం మీ స్నేహితుడి నుంచి ఒక శుభవార్తను అందుకుంటారు. ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండటం అవసరం అని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పనిప్రదేశంలో కొత్త సవాళ్లు, కొన్ని ప్రతిబంధకాలూ ఏర్పడవచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోక, సహోద్యోగుల సహకారంతో తగిన చర్యలు చేపట్టండి. ఎంతోకాలంగా ఒక వ్యాపారం ఆరంభించడానికి లేదా కొత్త ఆదాయ మార్గం కోసం ఎంతోకాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది తగిన సమయం. ప్రేమలో మీకున్న చిక్కులు తొలగుతాయి. కలిసొచ్చే రంగు: నీలాకాశం మిథునం (మే 21 – జూన్ 20) మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే విజయానికి చేరువ అవుతారని గ్రహించండి. పాత జ్ఞాపకాలు కొంత బాధపెట్టవచ్చు. అయితే గతంలోని చేదును మాత్రమే కాకుండా, తీపి అనుభవాలనూ నెమరు వేసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ విషయంలో కొద్దిపాటి చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: పచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది ముఖ్యమైనదో కాదో అవగాహన ఏర్పరచుకుని అందుకు తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరినీ కలుపుకుంటూ పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం మీరు మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. బద్ధకమనే మీ శత్రువును వదిలించుకుంటే మంచిది. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పాత బాకీలనుంచి, అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు. కలిసిచ్చే రంగు: దొండపండు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) చాలా కాలంగా మీరు అణగదొక్కి ఉంచిన సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. జాగ్రత్త. ఇది మీ ప్రస్తుత జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి పలుకుబడిని ఉపయోగించి, తిరిగి ఆ సమస్యలను అణిచేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్లద్దు. కలిసొచ్చే రంగు: కాఫీ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త విషయాలను నేర్చుకోవాలన్న మీ జిజ్ఞాసను ఈ వారంలో తీర్చుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ కళ అందరినీ అలరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. భావోద్వేగాలలో మునిగి తేలతారు. కలిసొచ్చే రంగు: తెలుపు -
చిన్నప్పటి నుంచి నేనింతే!
అసాధ్యం అన్నది నా డిక్షనరీలోనే లేదు అంటున్నారు నటి శ్రుతీహాసన్. తనకు నచ్చింది చేసే, మనసుకు అనిపించింది చెప్పే నటి శ్రుతీహాసన్. నటిగా ఆదిలో అపజయాలను చవిచూసినా, ఆ తరువాత విజయాల బాట పట్టిన శ్రుతీ నేడు భారతీయ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్న నాయకి.తొలి చిత్రంలోనే గ్లామర్ విషయంలో(హిందీ చిత్రం లక్) చాలా బోల్డ్‌గా నటించి పలు విమర్శలను మూటకట్టుకున్న ఈ అమ్మడు ఆ తరువాత కూడా అందాలారబోత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఇంకా చెప్పాలంటే గ్లామర్ అంటే అర్థం ఏమిటని ఎదరు ప్రశ్న వేసే గట్స్ ఉన్న నటి శ్రుతీహాసన్. చిన్నతనం నుంచీ నేనింతే అంటున్న ఆ బ్యూటీ చెప్పే సంగతులు చూద్దాం. చిన్న తనం నుంచి ఇది నీ వల్ల కాదు అని ఎవరైనా అంటే ఆ పనిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదల పెరిగేది. దాన్ని సాధించే వరకూ నిద్ర పోయేదాన్ని కాదు.ఇప్పటి వరకూ ఆ మొండి పట్టుదల నన్ను విడిచి పోలేదు. నేను దేనికీ భయపడను. సాధించాలన్న నాలో కసి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా కష్టమైన పాత్రలో నటించాల్సి వస్తే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతానా? అన్న సంకోచం కలగదు. కచ్చితంగా చేయగలనన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళతాను. నేను నటిగా సక్సెస్ అయ్యాను, ఏమైనా చెబుతాను అనుకోవద్దు.పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎక్కువగా సంగీతం, ఇతర కాలక్షేప అంశాలపైనే ఆసక్తి చూపడంతో చదువును నిర్లక్ష్యం చేసేదాన్ని.అయితే పరీక్షలు దగ్గర పడగానే రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులు తెసుకునేదాన్ని. మరొకరైతే మొదటి నుంచి చదవలేదు ఇప్పుడు చదివి ఏం మార్కులు తెచ్చుకుంటాంలే అని నిరాశకు గురవుతారు. నేనలాకాదు, అలాంటి పట్టుదలతోనే సినిమారంగంలోకి ప్రవేశించాను. శ్రమిస్తే కచ్చితంగా ఫలితం ఉం టుంది.అలాంటి ధైర్యంతోనే నటినయ్యా. ఇప్పుడు సినిమా నాకు చాలా మంచి చేస్తోంది. -
టారో 16 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విజయం వరిస్తుంది. మీ కృషి, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంభాషణా చాతుర్యంతో సభలు, సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితానికీ, బిజినెస్కీ సమన్వయం ఉండేలా చూసుకోండి. కుటుంబం వల్ల ఆనందం కలుగుతుంది. లక్కీ కలర్: లేత గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చురుకుగా, అంకితభావంతో పని చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఉదారంగా, నిజాయితీగా ఉంటారు. మీ హాస్య చతురతే క్లిష్ట పరిస్థితులనుంచి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. మీ కుమారుడు లేదా ఆప్తుడు వృద్ధిలోకి వచ్చి మీకు చేయూతగా నిలుస్తారు. ధ్యానం ద్వారా మీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ నీతి నిజాయితీలు, పరోపకార గుణాలే మిమ్మల్ని వ్యాపారంలో లాభాలబాటలో నడిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారానికి పురిగొల్పుతాయి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. వారికి స్వాంతన చేకూరుస్తారు. పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: ముదురు గులాబీ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. లక్కీ కలర్: లేత బూడిద రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీ చుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తెలివిగా తిప్పికొడతారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ కలర్: బంగారు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పనిలో కొద్దిపాటి ఒత్తిడి తప్పదు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. లక్కీ కలర్: స్ట్రాబెర్రీ వంటి ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కలిసొచ్చే వారమిది. ఏదైనా విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకుంటే తటపటాయించవద్దు. లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. విదేశీయానం ఉండవచ్చు. శరీరాకృతిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: మావి చిగురు -
టారో : 9 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉత్సాహంతో పనులు చకచకా చే స్తారు. ముఖ్య విషయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అవమానం తప్పదు. మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు. కెరీర్లో లేదా మీ జీవితంలో భారీ మార్పు చేర్పులుండవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారం. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ కూచోవద్దు. అధికార యోగం లేదా పదవీయోగం తలుపు తడుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. వారసత్వపు ఆస్తులు కలిసి రావడం వల్ల సంపద పెరుగుతుంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కెరీర్‌పరంగా మార్పు చేర్పులుండవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బుర్రకు పదును పెట్టి, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతే అంతా శుభమే! ఒక విషయంలో సందిగ్ధత నెలకొనవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపడతారు లేదా కొత్తవారితో పనిచేయవలసి రావచ్చు. పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. అననుకూలతలనూ అధిగమిస్తారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడతాయి. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ కెరీర్ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో‡మార్పు చేర్పులు చేసుకుంటారు. తొందరపడి మాట ఇవ్వడం లేదా మొహమాటానికి పోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టి, మంచి. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మౌనంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొహమాటంతో మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకపోతే మునిగిపోతారు. కుటుంబ వ్యవహారాలలో పట్టీపట్టనట్టు ఉండే మీ ధోరణి మంచిది కాదు. కలిసొచ్చే రంగు: గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. విసుగువల్ల, తప్పదన్నట్లు పని చేసి, నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: నలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఉన్నతమైన హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టినకొద్దీ, మీకు మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కెరీర్‌పరమైన విషయాలలో మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయ వ్యయాలలో ప్రణాళిక ప్రకారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 2 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కల్యాణ ఘడియలు మోగవచ్చు సంసిద్ధంగా ఉండండి. సన్నిహితుల సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పగటికలలు మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. న్యాయపరమైన వివాదాలలో అనవసర జాప్యం మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు. గురువులు లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటారు. కుటుంబపరంగా సంతృప్తి. కలిసొచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విజయాల బాటలో నడుస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. జీవితంలో పెద్ద మలుపునకు దారితీయవచ్చు. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి. అంచనా వ్యాపారాలు, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్లవద్దు. అవకాశాలకోసం నిశిత పరిశీలన చేస్తారు. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి రావచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలకు, లక్ష్యాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) చాలా అవిశ్రాంతంగా గడుపుతారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిం^è ండి. సానుకూల భావనలతో ఉండండి. పెట్టుబడులలోఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జిమ్ లేదా యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా ఉల్లాసంగా పని చేస్తారు. అదే మిమ్మల్ని విజయాలబాటలో నడిపిస్తుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. పిల్లల విషయమై మంచి వార్తలు వింటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వ్యాపార విస్తరణకు మంచి అవకాశం లభిస్తుంది. మీ సహాయ సహకారాల కోసం టీమంతా ఎదురు చూస్తుంటుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అలసిపోయిన శరీరాన్నీ మనస్సునూ సేదతీర్చడానికి విందు వినోదాలలో గడుపుతారు. విహార యాత్రలు చేసేందుకు తగిన సంసిద్ధతలో ఉంటారు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. కలిసి వచ్చే రంగు: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) నిత్యం పనుల ఒత్తిడితో అలసిపోయిన మీరు సేదతీర్చుకోవడానికి ఇష్టమైన వారితో కలసి పిక్నిక్కు లేదా దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళదామని ఆలోచన చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ సన్నిహితులకు వచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపించి, వారి అభినందనలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: వెండి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదే కానీ, అలాగని కుటుంబ జీవితాన్ని త్యాగం చేయకూడదు కదా... ప్రణాళికాబద్ధంగా పని చేసి, ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. వెన్నుపోటు దారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అవసరం. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ద్వారా ఆశించినంత ఆదాయం లభించకపోవడం నిరాశకు గురి చేస్తుంది. రోజూ ఉదయమే లేలేత సూర్యకిరణాలలో స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మీ విజ్ఞానంతో, సృజనాత్మకతతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలను, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. గృహ సంబంధమైన కొత్తవస్తువులు లేదా బంగారం కొంటారు. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) శక్తిసామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ప్రజా సంబంధాలను మెరుగు పరచుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. మనసు చెప్పిన మాట వినండి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: నారింజ లేదా కాషాయం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంటారు. కలిసి వచ్చే రంగు: గోధుమరంగు -
టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు మీ వెంటే ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరెంతో ముందుచూపుతో, ఆశావహ, సానుకూల దృక్పథంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది. తిరస్కృతులు, హేళనలు ఎదురయినా పట్టించుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ మార్గంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుముళ్లన్నీ వీడిపోతాయి. మీరు మీ అంతరాత్మ మాట వినడం లేదు. మీ మంచి చెడులలో అనుక్షణం మిమ్మల్ని హెచ్చరిస్తూ, మేలు చేద్దామని చూస్తుంటే, తోసిపుచ్చడం తప్పు. వెంటనే మనసు మాట వినండి. చెడు స్నేహాల పట్ల జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) డబ్బుకు సంబంధించి కొన్ని భయాందోళనలు నెలకొనవచ్చు. ముఖ్యంగా డబ్బు భద్రతకు సంబంధించినవి. అలాగే ధన సంపాదన విషయంలో కూడా అంతే ఇబ్బంది. వృత్తిపరంగా మీరు మేటి. అలాగని మీ వ్యక్తిగత సంతోషాలు, జీవితాన్ని వదులుకోవద్దు. మీ ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని మీద దృష్టి పెట్టండి. మీరు సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనక గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త పడటం మంచిది. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అవసరం. సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టసుఖాలను శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. లాభదాయకమైన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి తగిన సమర్థులను అన్వేషించండి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. మీ విజయానికి వేడుకలు చేసుకుంటారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా మీరు మాట్లాడే ప్రతి మాటా నిజం అవుతుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. కెరీర్లో రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు -
మహిళలమన్న సంగతి మర్చిపోవాలి
స్ఫూర్తి సిన్హా ‘‘మహిళగా... మహిళా శాస్త్రవేత్తగా రెండు పాత్రలు పోషించేందుకు రెండింతలు కష్టపడ్డాను అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు చిన్న వయసులో ఉండగానే భర్తను కోల్పోయాను. ఒక్కోసారి ఆఫీసు పనులు ముగించుకుని ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇంటికొస్తే... తినేందుకు కూడా ఏమీ ఉండేది కాదు. కొన్నిసార్లు నా బిడ్డ పవిత్ర సైకిలేసుకుని డీఆర్డీవో క్యాంటీన్ నుంచి బ్రెడ్ లాంటివి పట్టుకొచ్చేది. తగిన అవకాశమిస్తే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తారు. మహిళలు ఆఫీస్ మీటింగ్స్‌లో, క్లాస్‌రూమ్‌లోనైనా, ఇతర ప్రాంతాల్లోనూ తాము మహిళలమని, ఒంటరిగా ఉన్నామన్న సంగతిని మరచిపోవాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. అయితే దీంట్లో సమాజం పాత్ర కూడా చాలా ఉంది. మహిళలు తమతమ రంగాల్లో వృద్ధి చెందేందుకు సురక్షితమైన వాతావరణం ఉండాలి. దురదృష్టవశాత్తూ దేశంలో ఇప్పటికీ అలాంటి పరిస్థితులు లేవు. మహిళలు ఎలాంటి దుస్తులేసుకోవాలి? ఎలాంటి చోట్లకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అని సినిమాల ద్వారా సమాజానికి సందేశాలు పంపాల్సిన పరిస్థితి ఇంకా ఎందుకుంది? నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని కచ్చితంగా చెప్పగలను. మీకు పెద్దకట్నాలిచ్చి పెళ్లి చేయగలనో లేదో తెలియదుగానీ... శక్తివంచన లేకుండా మీరు చదివినంత చదివిస్తాను అనేవారు ఆయన. ఇలాంటి ప్రోత్సాహం అందరికీ లభించాలని కోరుకుంటున్నాను’’ – శశికళా సిన్హా, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్ ప్రోగ్రామ్, డీఆర్డీవో -
టారో : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీకు ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనుక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠ, హోదాలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఒక విషయంలో ముఖ్యనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇతరులకు అది కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. అయితే మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొద్దిగా ఒడిదుడుకులతో కూడి ఉండవచ్చు. అంతమాత్రాన మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో... దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలుతీర్చేస్తారు. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీ పూజలు నిరాడంబరంగా ఉండాలి. హంగూ ఆర్భాటాలు అక్కరలేదు. ఆర్థికంగా కొద్దిపాటి మందకొడితనం నెలకొనవచ్చు కానీ, నిరుత్సాహ పడకండి. సానుకూలంగా తీసుకోండి. వృత్తిపరంగా, పనిపరంగా మిమ్మల్ని ఆవరించి ఉన్న కొన్ని భ్రమలు తొలగి, నిజాలు బయటపడతాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అన్ని విషయాల్లోనూ మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా! కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ -
టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
పనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపుకోసం మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సూచనలకు తగ్గట్టు మీ సిబ్బంది పని చేస్తారు. ఉద్యోగార్థుల ఎదురు చూపులు ఫలిస్తాయి. వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శక్తి సామర్థ్యాలను మెరుగు పరచుకుంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మనం చకచకా ముందుకెళ్లాలంటే ముందు మన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవాలని గ్రహించండి. మీ నిర్ణయాత్మక శక్తి ఇతరులు ప్రశ్నించేలా ఉండకూడదు. ఎదుటివాళ్ల బాహ్యవేషాలను బట్టి అంచనాలు వేసుకోకండి. మీకు అనుమానంగా ఉన్నవాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోండి. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ సన్నిహితులొకరు వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా, మీకు దూరంగా మెలగుతున్నట్లుగా అనిపించవచ్చు. వారిని ప్రశ్నించేముందు వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూడండి. ఆర్థికంగా బాగుంటుంది. నిద్రలేమి చికాకు పరచవచ్చు. చిన్న చిన్న రుగ్మతలకు గృహ చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈ వారం మీరు బోలెడన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. ఒక వ్యక్తితో అనుకోకుండా జరిగిన పరిచయం బలపడుతుంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సన్నిహితులొకరితో మీకు వివాదం ఏర్పడవచ్చు. అది ఒత్తిడి మూలంగా జరిగినదే కాని, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరంగా కుంగిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒకదారి మూసుకుపోతే వంద దారులు ఉంటాయని గుర్తు చేసుకోండి. చాలాకాలంగా ఉన్న ఒక బంధం బలహీన పడవచ్చు లేదా తెగిపోవచ్చు. అది మీరూహించిందేగా, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. గత పరిణామాల నుంచి పాఠాలను నేర్చుకోండి. ఆసక్తికరమైన ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు లేదా మీరు కొత్త ప్రదేశాలకు ఆహ్వానం అందుతుంది. వర్తమానంలో జీవించండి. కలిసొచ్చే రంగు: గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) సానుకూల భావనలు, ఉత్సాహకర వాతావరణం నడుమ ఉల్లాసంగా ఉంటారు. ప్రకృతి ఎన్నో అందాలను, వింతలు, విడ్డూరాలను ప్రసాదించింది కదా, హాయిగా అనుభవించండి, ఆనందించండి. మీ ఆధ్యాత్మిక మార్గం లేదా బోధలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. వివిధ రకాల రుగ్మతలకు మీకు మీరు చికిత్స చేసుకోవడమే గాక ఇతరులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపశమనం కలిగిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ మనస్సును, మెదడును పనికి సన్నద్ధం చేయండి. నిదానమే ప్రధానం అన్న సూక్తిని ప్రస్తుతానికి పక్కనపెట్టి ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని అనుసరించి పని చేయండి. మీ కుటుంబంతో, ముఖ్యంగా సహోద్యోగులతో పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల్లో అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. కలిసొచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మబ్బులు కమ్మిన ఆకాశంలోనే సూర్యోదయం కూడా జరుగుతుందని గుర్తు తెచ్చుకోండి. పాత వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రశాంతంగా, స్థిమితంగా, తేటపడిన మనస్సుతో ఉంటారు. పిల్లల మూలంగా ఆనందం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కాలానుగుణంగా జరుగుతున్న మార్పులను ఆమోదించక తప్పదని గుర్తించండి. మీ కోణంలో నుంచే కాదు, ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం మంచిది. బూజుపట్టుకుపోయిన పాత అలవాట్లను వదులుకోకపోతే ఇబ్బందులు తప్పదు. మీకొక అవకాశం వస్తుంది. అయితే అది కొద్దిపాటి రిస్క్‌తో కూడుకున్నందువల్ల ఎటూ తేల్చుకోలేకపోతారు. పనితో అలసిన మనస్సును, శరీరాన్ని సేదతీర్చడం అవసరం. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంటుందీ వారమంతా! పనులలో జాప్యం. శుష్కవాగ్దానాలకు బోల్తా పడవద్దు. మీలాగే అందరూ నిజాయితీపరులని అనుకోవద్దు. ముద్రణ, యంత్రాలతో పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పనిని సమీక్షించుకుని, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడం మంచిది. విందువినోదాలలో గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కష్టాలు వచ్చినప్పుడే మనకు కావలసిన వారెవరో తెలిసొస్తుంది. అంతేకాదు, మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు వెలికి వస్తాయని గుర్తించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పదు. పనిప్రదేశంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. పాతశత్రువుల పట్ల అప్రమత్తత, ఇరుగు పొరుగుతో సఖ్యత అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆశయాల సాధనకు తగిన కృషి, ప్రణాళికతో కార్యాచరణలోకి దిగండి. మీకేదైనా కొత్త ఆలోచన వచ్చినా, సృజనాత్మకత చూపించాలనుకున్నా, మీలోనే ఉంచుకోండి. బయటికి చెప్పవద్దు. వెంటనే అమలు చేసేయండి. ఒక బంధం విషయంలో నిజానిజాలు తెలుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఒక ఆకర్షణ బంధంగా మారేంతగా బలపడవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు -
టారో :19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉద్వేగభరితంగా, సాహసోపేతంగా సాగిపోతుందీవారమంతా! ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు క్రీడలలో పాల్గొనండి. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో కూడి ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. కలిసొచ్చే రంగు: పచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు: తెలుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. మీ హితులకు, సన్నిహితులకు ఏ సమస్య వచ్చినా, వారికి మీరే గుర్తుకొస్తారు. వారికి తగిన పరిష్కారం చూపించి, ఆత్మసంతృప్తి పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల విషయంలో భయం వదిలి సంగీత చికిత్స తీసుకోండి. కలిసివచ్చే రంగు: వంకాయ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికవనరులు సమకూరుతాయి. గత చేదుజ్ఞాపకాలను మరచిపోండి. వాటినుంచి అనుభవ పాఠాలను నేర్చుకోండి. ధనపరంగా త్వరలోనే ఒక శుభవార్త అందుకుంటారు. గతంలో మీ చేజారిపోయిందనుకున్న ఒక అవకాశం తిరిగి మీ తలుపు తడుతుంది. ఈసారి జారవిడుచుకోరు. మీ జీవితభాగస్వామి నుంచి మీకో అనూహ్య కానుక అందుతుంది. కలిసొచ్చే రంగు: సిరా నీలం -
టారో :12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవసరాలకు తగిన డబ్బు చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ప్రేమలో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో కొద్దిగా ముందడుగు వేస్తారు కూడా! పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఇతరుల సమస్యలను విని, మీకు చేతనైన సాయం చేస్తారు. అలా సాయం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీరు విద్యార్థులైతే మంచి మార్కులు సాధించి, అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లుగా సాగుతుంది. మీకు కావలసిన వారికోసం బాగా ధనం ఖర్చు చేస్తారు. గత జ్ఞాపకాలతో కుంగిపోకుండా, వాటినుంచి పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి కోసం అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ సన్నిహితులతో వీలయినంత నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం మంచిది. దానివల్ల లేనిపోని అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లేదా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతర వ్యాపకాలలో పడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) రకరకాల కారణాల వల్ల పని పేరుకుపోవడంతో అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఒకోసారి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. టెన్షన్ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దృఢంగా ఉంటారు. విందు, వినోదాలు, దూరపు ప్రయాణాలతో సేదతీరే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: తెలుపు, వంగపువ్వు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలం. కలిసి వచ్చే రంగు: వెండి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఎప్పుడూ గెలుపు మనదే అనుకోవడం పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం అవివేకం. ఎందుకంటే ఓడినప్పుడే కదా, మీ శక్తిసామర్థ్యాలు మీకు తెలిసేది. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటారు. మంచి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసి, ప్రశంసలు పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. వెన్నునొప్పి బాధించవచ్చు. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఆందోళన మాని, ప్రకృతి ఉత్పాదనల వాడకంతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. జీవితమంటే ఎప్పుడూ పని, పరుగులే కాదు, కాస్త విశ్రాంతి, ప్రేమ, ఉల్లాసం కూడా అవసరం అని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీది కాని కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఉత్పాదనలు, స్వచ్ఛమైన గాలి, నీరు వల్ల స్వాంతన పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను నెరపడంలో, వాటిని మరింత మెరుగు పరచుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆందోళన మాని వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. మనసు చెప్పినట్లు నడచుకోండి. చెవి లేదా గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికంగా చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంటారు. అలా ఎన్నోసార్లు. కానీ, చెడ్డ అలవాట్లు అలవడినంత తొందరగా వదలవని గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి ధోరణి మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఒకరికొకరు సర్దుకుపోయి. సామరస్యంగా జీవించడమే కదా జీవితం. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా -
టారో 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అవరోధాలనూ అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు.. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభాసామర్థ్యాలకి గుర్తింపు కోసం మరింత కష్టపడాలి. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు. కలిసొచ్చే రంగు: చాకొలేట్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం విందు వినోదాలలో గడుపుతారు. పనిలో విసుగు అనిపించినా, చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెలకువ లేకపోతే మాట పడక తప్పదు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకోకుండా కొత్తవారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే పనులు విజయవంతమవుతాయని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ -
టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని చూసి, మీ సహోద్యోగులు అసూయపడతారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. భయాందోళనలు వదిలేసి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కలిసి వచ్చే రంగు: పచ్చబంగారు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవిశ్రాంతంగా పని చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు, తెలివితేటలకు మరింత పదును పెట్టుకుని, మీ వాక్చాతుర్యంతో మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు చెప్పినట్లు నడచుకోండి. ఇతరులను మీరు గౌరవిస్తేనే, వారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) స్నేహితులతో, బంధుమిత్రులతో కలసి సరదాగా గడుపుతూ మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సంతోషంగా గడుపుతారు. కలిసివచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉద్యోగ భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజులు సాఫీగా గడవడం లేదనిపించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకంగా పనులు చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తిరుగుతుంది. కలిసి వచ్చే రంగు: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఏదో కలలో జరిగినట్లుగా నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో చకచకా పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. ప్రతిదానికీ కుటుంబసభ్యులమీద, కిందిస్థాయి ఉద్యోగుల మీద ఆధారపడకుండా మీపనులు మీరు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి. కలిసి వచ్చే రంగు: ముదురాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను లేదా పంటి నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీచుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటివి అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. ఏనాడో తెగిపోయిన ఒక బంధాన్ని మీ ప్రేమతో తిరిగి అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. బహుమతులు అందుతాయి. గతాన్ని తలచుకుని కుమిలిపోవద్దు. వర్తమానంలో ఏం చేయాలో ఆలోచించండి. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. హుందాగా ముందుకు సాగండి. దిగువస్థాయి వారితో కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. సహోద్యోగుల సహకార లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. పరోపకారగుణాన్ని అలవరచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మొహమాటానికి పోయి తలకు మించిన బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈ వారం మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు కోరుకున్న వారి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికతను అలవరచుకుంటారు. మీ నిక్కచ్చితనం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కలిసి వచ్చే రంగు: నీలం -
టారో: 18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పూర్తిగా అంకితభావంతో పని చేయమన్నది ఈ వారం వీరికి చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అధికారం కోసం మీరు పడుతున్న ఆరాటం ఫలించే అవకాశాలున్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఏమాత్రం తొందరలేకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కు వెళ్లడానికి అనుకూలమైన కాలం ఇది. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. లేదంటే మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు, కాస్త పట్టువిడుపు ధోరణిని అలవరచుకోండి. స్నేహితులు, మీ కింది స్థాయి వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీకు చాలా అనుకూలమైన వారమిది. పనిలో కొత్త పద్ధతులు నేర్చుకుని, వాటిని విజయవంతంగా అమలు చేసి, మంచి పేరు, ప్రశంసలు తెచ్చుకుంటారు. బృందంతో కలిసి మీరు చేసే పని విజయవంతమవుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం వస్తుంది. కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు చేస్తుంది. కలిసి వచ్చే రంగు: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఏదో అద్భుతం జరిగినట్లుగా మీ ప్రేమ ఫలిస్తుంది. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. భౌతిక శక్తులమీదనే కాదు, ఆధ్యాత్మికత మీద కూడా మనసు పెట్టి, నమ్మకంతో పని చేస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. కలిసి వచ్చేరంగు: పాలమీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీకు అన్నివిధాలుగా కలిసి వచ్చే కాలమిది. గొప్ప అవకాశాల కోసం, మంచి సమయం కోసం మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. ప్రేమ విషయంలో కొంత నైరాశ్యం, ఎదురుదెబ్బలూ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించ వలసిన సమయమిది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: వెండిరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కుటుంబపరంగా మీకు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. అంకితభావంతో కష్టపడి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి, దానిని ఆచరణలో పెట్టి ఘనవిజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేయడం సత్ఫలితాలనిస్తుంది. మీ విల్ పవర్ మీకు మంచి చేస్తుంది. రానున్న సంవత్సరంలో మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు. కలిసి వచ్చే రంగు: గచ్చకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) గులాబీ చెట్టుకు ఎన్ని ముళ్లున్నా, ఎంత గాలిఒత్తిడి ఎదురైనా తట్టుకుని అందమైన పూలనే ఇచ్చినట్లు మీరు కూడా అన్ని రకాల ఒత్తిళ్లనూ తట్టుకుని అందరికీ ఆనందాన్నే పంచుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అలసిన మనస్సును, శరీరాన్ని విహార యాత్రలతో సేదదీర్చేందుకు ఇది తగిన సమయం. ఈవారంలో మీ కెరీర్ మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: వంకాయరంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు త్యాగాలు చేయవలసిన సమయం. బాగా కష్టపడి పని చేయాల్సిన సమయం కూడా. ఒక్కోసారి మీ ప్రేమను కూడా త్యాగం చేయక తప్పదు. పనిపరంగా మీకు చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ పని అంటూ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఉద్యోగ భద్రత కోసం చిన్న చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది. దేనిలోనైనా ఉదాశీనత పనికి రాదు. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికంగా మీకు అనూహ్యమైన లాభాలు కళ్లజూస్తారు. ధనయోగం కలుగుతుంది. కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. భగవంతుడి మీద భారం వేసి, ధైర్యం చేసి మీరు వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని లక్ష్యసాధనకు, విజయానికి చేరువ చేస్తాయి. మీ సృజనాత్మకత మీకెంతో ఉపయోగపడుతుంది. ఎన్ని పనులున్నా, కుటుంబాన్ని, స్నేహితులను దూరం చేసుకోవద్దు. విద్యార్థులకు అనుకూల కాలమిది. కలిసి వచ్చే రంగు: లేత గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పనిపరంగా కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. అనూహ్యంగా విజయం సాధించి, ఎంతోకాలంగా మీరనుభవిస్తున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. కొత్తగా ఒక మంచి ఆదాయ మార్గాన్ని తెలుసుకుంటారు. అన్ని గాయాలనూ మాన్పగలిగే గొప్ప శక్తి కాలానికి ఉందని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: పొద్దుతిరుగుడు పువ్వు వన్నె కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) గతంలో మీరు చేసిన ఒక మంచి పని ప్రస్తుతం మీకెంతో మేలు చేస్తుంది. దానిమేలు భవిష్యత్తులో కూడా ఉంటుంది. బహుశ ఇది మీరు రాసిన వీలునామా లేదా మీ పూర్వుల ఆస్తిపాస్తులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక ముందుజాగ్రత్త కావచ్చు. లక్ష్యసాధనలో విజయాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. డబ్బు, విజయంతో ఆనందంగా తిరిగి వస్తారు. కలిసి వచ్చే రంగు: లేత నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ చిరకాల కోరిక తీరుతుంది. పనిపరంగా, కెరీర్‌పరంగా ఏది ముందో, ఏది వెనకో తేల్చుకోలేని గందరగోళంలో చిక్కుకుంటారు. ఒత్తిడి మూలంగా ఏకాగ్రత కోల్పోయి, లక్ష్యసాధనకు మీరు వేసుకున్న ప్రణాళికలో మార్పులు అనివార్యం అవుతాయి. గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా, శాంతంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: బంగారు -
టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది. విజయవంతంగా గడుస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు. భావోద్వేగాలపరంగా చాలా బలంగా ఉంటారు. కలిసొచ్చే రంగు: నారింజ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వారిని సంతోషపెడతారు. మీరు కూడా అందంగా, ఆనందంగా కనిపిస్తారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది కానీ, మరికొంచెం జాగ్రత్త అవసరం. మీ ప్రాధాన్యతాక్రమాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆకాశనీలం మిథునం (మే 21 - జూన్ 20) అదృష్టం, ఆర్థికభద్రత మీ వెన్నంటే ఉంటాయి. మీ స్వీయశక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన తరుణం ఇది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య తొలగిపోతుంది. పరిష్కృతమవుతుంది. దాంతో ఒకవిధమైన నిశ్చింతతో ఉంటారు. మీ చిక్కులను మీరే నేర్పుగా పరిష్కరించుకుంటారు. కలిసొచ్చే రంగు: గోధుమరంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీరు అసాధ్యాలుగా భావించినవన్నీ సుసాధ్యాలవుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరకొచ్చేసినట్లే! మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దు, ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. బంధుత్వమంటే మీకు ఎంత ఇష్టమైనప్పటికీ, మీకు ఇష్టమైన వారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మీకు మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. విందు వినోదాలలో, విహార యాత్రలలో సేదదీరడం వల్ల మీరు పునరుత్సాహం పొందుతారు. మనసు మాట వినండి. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోండి. మీ ప్రతిభ, సామర్థ్యాలు మీకు విలువని తెచ్చిపెట్టవచ్చు కానీ, సామాజిక సంబంధాలూ అవసరమే అని గ్రహించండి. పనిలో కొత్త ప్రయోగాలు మంచిది కాదు. కలిసొచ్చేరంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ సృజనాత్మకతే మీకు శ్రీరామ రక్ష. పెద్దవాళ్ల నుంచి మీకో మంచి వార్త అందుతుంది. అది మీ కెరీర్‌నే మలుపు తిప్పుతుంది. సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామికీ మీకూ అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్త అవసరం. సమస్యలు మిమ్మల్ని నీరు గార్చేందుకు కాదు, మీకు పాఠాలు చెప్పేందుకే అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కలిగిన ప్రతికోరికనూ తీర్చుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించండి. మీ జీవితాశయం నెరవేరేందుకు చాలా సమయం పడుతుందని నిరాశ పడవద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండాలి.. అవిశ్రాంతంగా పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త ఉద్యోగాలు, వృత్తి, వ్యాపకాలకు ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) మీరు కోరుకున్నవాటిని పొందడానికి, మీ మనసులోని కోరికలను, భావాలను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం. మీ బంధంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. అలాగే సంతోషం కూడా. మీ దైనందిన వ్యవహారాలతో తీరికలేకుండా గడుపుతారు. మీ వృత్తి, వ్యాపకాలలోకి బంధుమిత్రులు, స్నేహితులను తీసుకు వస్తారు లేదా వారి పనులలో మీరు పాలుపంచుకుంటారు. కలిసొచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సంసిద్ధంగా లేకపోవడం వల్ల అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మితిమీరకుండా చూసుకోవడం మంచిది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. మీ సానుకూల దృక్పథమే మీకు మేలు చేస్తుంది. చిన్ననాటి స్నేహితుల రాక ఊరట కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) నూత్న గృహం లేదా వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మనసు చెప్పిన మాట వినండి. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీరు గీసుకున్న గిరి నుంచి బయట పడటం మేలు చేస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరిగే కొన్ని సంఘటనలు జరగవచ్చు. సృజనాత్మకంగా పని చేసి, మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచన అవసరం. ప్రేమ వ్యవహారాలో కొంత నిరాశ కలగవచ్చు. అనుకోని తగాదాలు, వ్యవహారాలలో వేలు పెట్టవలసి రావడం ఇబ్బంది కలిగించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) జాగ్రత్త, మెలకువ అవసరం. కొత్త ఆలోచనలను సృజనాత్మకంగా అమలు చేసి, మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఉపకరిస్తుంది. భార్య లేదా భార్య తరఫు బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కలిసొచ్చే రంగు: కాఫీ పొడి రంగు -
టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఒత్తిళ్లు, చికాకులు, కోపాలు, ఇతరులతో వివాదాలు మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగే నేర్పరితనం అలవడుతుంది. కెరీర్ పరంగా కొత్తమార్గాలు ఆవిష్కృతమవుతాయి. తికమకలు, పరధ్యానాలను పక్కన పెట్టండి. ప్రశాంతంగా పని చేసుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మీరనుకున్న పనులన్నీ నెరవేరాయన్న సంతృప్తి కలుగుతుంది. అయితే మీలోని స్తబ్దతను, నిస్తేజాన్ని తొలగించుకోండి. సరైన సంబంధం కుదురుతుంది. ఒక ఇంటి వాళ్లవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గుర్తింపును పొందుతారు. అభద్రతాభావాన్ని విడనాడి, ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి. ఒక స్త్రీ మూలంగా అదృష్టం, ఆస్తి కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కీర్తిప్రతిష్ఠలు, విజయం వరిస్తాయి. ఆర్థికంగా కొంత అభద్రత, అస్థిరత ఉండవచ్చు. భయపడకండి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు వెంటాడవచ్చు. ఆధ్యాత్మికతను అలవరచుకోండి. ప్రశాంతత అదే వస్తుంది. పనిపరంగా అంతా సవ్యంగా సాగుతుంది. ఆఫీసులో అంతా మిమ్మల్ని మెచ్చుకునేలా పని చేస్తారు. ప్రయాణాలు, సాహసాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లండి. అన్నీ ఉన్నాయన్న సంతృప్తి కలుగుతుంది. పనిలో మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. అయితే మౌనంగా విధులను నిర్వహించడమే కాదు, మీ హక్కులను గురించి గుర్తు చేసుకోండి. ఆర్థికభద్రత కలుగుతుంది. సాహసాలు, ప్రయాణాలు చేస్తారు. పాతను వదిలి కొత్తదనాన్ని అలవరచుకుంటారు. కలిసొచ్చే రంగు: పగడం రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈవారమంతా మీకు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. భావసారూప్యత కలిగిన వారితో కలిసి ప్రయాణిస్తారు. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) పనులలో కొద్దిపాటి అడ్డంకులు, అవరోధాలు తప్పకపోవచ్చు. కష్టించి పని చేయండి. మేలు జరుగుతుంది. ఈ వారం మీ జీవితం మలుపు తిరిగే మంచి సంఘటనలు జరగవచ్చు. పనిలో కొత్తపంథాను అనుసరించి, సృజనాత్మకంగా పని చేయండి. భారీమొత్తాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇంకొంచె జాగ్రత్త తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: పాచిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఈవారం మీరు అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా, మెలకువగా ఉండటం అవసరం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న మీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, లౌక్యంగా మాట్లాడటం అవసరమని గ్రహించండి. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పగటికలలు కనడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, నిజాయితీతో పని చేయడం ఎంతో మేలు చేస్తుంది. కొత్త పని లేదా ప్రాజెక్టులో క్షణం తీరికలేకుండా గడుపుతారు. రకరకాల అవకాశాలు మీ తలుపు ఒకేసారి తడతాయి. మీకు నచ్చినది, మీరు చేయగలిగినది ఎంచుకుని కెరీర్‌ను మీరు అనుకున్నట్లుగా తీర్చిదిద్దుకోండి. మీ పుట్టినరోజు తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆర్థిక భద్రత, స్థిరత్వం కలుగుతాయి. అయితే అందుకు మరికొంత సమయం ఉంది. ఆందోళన చెందకండి. పని, ప్రయాణాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. మీరు ఉద్యోగులైతే వ్యాపారావకాశం మీ తలుపు తడుతుంది. వ్యాపారులైతే ఉద్యోగావకాశం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. అందుకు తగ్గట్టు పని చేయాలి కదా! సానుకూల భావనలు, సాను కూల ఆలోచనలు మీకెంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీ ప్రేమ ఫలించేందుకు, మీ విషయం పెద్దల వరకు వెళ్లేందుకు ఒకరి సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తగిన ప్రణాళిక లేకపోవటం, సిద్ధంగా ఉండకపోవడం వల్ల కొద్దిపాటి ఆందోళన, అనిశ్చితి, గందరగోళం తప్పకపోవచ్చు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. గతం గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, దానినుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అవసరమే కానీ, అతి వద్దు. ప్రేమవ్యవహారాలలో కొంచెం వేగిరపాటు ఉండచ్చు. మీ సానుకూల భావనలు మీకెంతో మేలు చేస్తాయి. కలిసొచ్చే రంగు: వెండిరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీపాటికి మీరు ప్రశాంతంగా గడుపుతారు. తెలియనివారికి మీరు కొంచెం అహంభావి అనిపింవచ్చుగాక.. అయినా, మీ గురించి తెలిసిన తర్వాత మీరెంత స్నేహశీలి అన్నదీ వారికే అర్థం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలు, బాధలు, భయాల నుంచి నెమ్మదిగా బయట పడతారు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీరుస్తారు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు -
టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈ వారం చాలా బిజీగా ఉంటారు. నీతి నిజాయితీలతో మీరు చేసే పనులు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అదనపు బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. మీ ముందొకమాట, వెనకొక మాటా మాట్లాడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఫలించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కొత్త అవకాశం తలుపు తడుతుంది. కలిసి వచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఆదాయానికి లోటుండదు. ఆనందానికి అవధి ఉండదు అన్నట్లు ఉంటుంది ఈ వారమంతా. చదువుమీద, మీరు చేసే పనిపట్ల జాగ్రత్తవహించండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చి, చిక్కులు తెచ్చుకోవద్దు. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక పరిశీలన అవసరం. అనుకోకుండా బహుమతులు అందుతాయి. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ మిథునం (మే 21 - జూన్ 20) కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీరు మనసులో ఊహించుకున్న దానికి, జరిగేవాటికి పొంతన కుదరదు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ధైర్యంగా ఉండండి. మంచే జరుగుతుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవడం కోసం మీరు మారనక్కరలేదు. వివాదాస్పదమైన వ్యక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల మీద కన్నేసి ఉంచండి. పనిమీద శ్రధ్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ మనసులో ఉన్నదానిని బయటకు చెప్పడం, దాని మీదనే గట్టిగా నిలబడటమే ధైర్యమంటే! అవతలివాళ్లు చెప్పినదానిని ఓపికగా వినడం కూడా ధైర్యమే! ఏమి జరుగుతోందో పరిశీలించండి, ధైర్యంగా వినండి. ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాల్లోనూ నిదానంగా వ్యవహరించడం అన్ని వేళల్లోనూ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండండి. కలిసి వచ్చే రంగు:సముద్రపు నాచు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వారమంతా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా గడుస్తుంది. పెట్టుబడులు సంతృప్తికరమైన ఫలితాన్నిస్తాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భారంగా పరిణమించవచ్చు. పనులలో చోటు చేసుకునే జాప్యానికి, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సృజనాత్మక నిర్ణయాలు, సృజనాత్మక వ్యాపార వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కలిసి వచ్చే రంగు:పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. సానుకూల భావనలను పెంపొందించుకోండి. కొత్త స్నేహితులు, కొత్తగా ఏర్పడ్డ బంధాల వల్ల మీ కోరికలను కొన్నింటిని వదులుకోవలసి రావచ్చు. అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పూర్తికాని వ్యాపార పనులను. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. ఆలోచనలకు తగ్గట్టు పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మీరు అనుకున్న చోట్లకి వెళ్లడానికి, కొత్తపనులు చేపట్టడానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలసి వారమంతా రిలాక్స్డ్గా గడుపుతారు. మీ ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఉత్సాహంగా పనిచేయండి. పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి. పనులలో కొత్త విధానాలకు వెళ్లకపోవడం మంచిది. జీవితంలో కొత్తదనాన్ని నింపుకోవడం మరచిపోవద్దు. కలిసి వచ్చే రంగు: బూడిదరంగు / వెండి వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శక్తియుక్తులు, తెలివితేటలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మంచిది. మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే మంచి లాభాలు పొందుతారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కారం దిక్కుగా పయనిస్తాయి. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయం సాధిస్తారు. మీరు ఇష్టపడే వారి మనసును గెలుచుకుంటారు. కష్టపడి పని చేసి, విజయపథంలో నడుస్తారు. కలిసి వచ్చే రంగు: చాకొలెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విందువినోదాలలో పాల్గొంటారు. గొప్పవారినుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీకూ, మీ స్నేహితుడికీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. అయితే నేర్పుగా వ్యవహరించి, ఎట్లాగో ఒడ్డెక్కుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చింత మాని వర్తమానంలో జీవించండి. ప్రతిక్షణాన్నీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ గడపండి. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. మొండిబకాయిలు వసూలు చేసుకోవడమంచిది. నూత్నవాహనాన్ని కొనుగోలు చేస్తారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసు మాట వినండి.ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. దైవంపట్ల సరైన అవగాహనను పెంచుకుంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. పనిపట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కలిసి వచ్చే రంగు: ముదురు పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా లాభాలను పొందుతారు. తెలివితేటలు, కష్టించే తత్వంతో ప్రమోషన్లు పొందుతారు. లౌక్యం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అవసరం. మీ ప్రతిభా సామర్థ్యాలతో సీనియర్లను ఆకట్టుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించలేకపోయానని బాధపడవద్దు. కొత్త అనుభవం ఎదురయినందుకు ఆనందించండి. కలిసి వచ్చే రంగు: లేత గులాబి -
టారో (13-11-2016 to 19-11-2016)
13 నవంబర్ నుంచి 19 నవంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తారు. మీ అంతశ్చేతన అద్దంలా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా సాగుతుంది. చిన్న చిన్న ఒడుదొడుకులుండవచ్చు కానీ, జీవితంలోని ఇతర ఆనందాలతో పోల్చుకుంటే అవెంత? మీ పని మీరు మనసు పెట్టి, ఆత్మవిశ్వాసంతో చేయండి. లక్కీ కలర్: లేతగులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరిస్తే భయాలు తొలగుతాయి. మిమ్మల్ని బాధిస్తున్న ముల్లును నేర్పుగా పెకలించి వేస్తే మీ అంత కచ్చితమైన వ్యక్తి మరొకరు లేరని మీకే అర్థం అవుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ఇంటి ఆధునీకరణ పనుల్లో పడతారు. మీ సత్తా నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా జరగనున్న కొన్ని ప్రధాన సంఘటనలు మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. మీరు చేస్తున్నదంతా బాధ్యతాయుతంగా చేస్తున్నదేనని మీరు గ్రహిస్తే జీవితంలో అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఎప్పుడో విడిచిపెట్టిన బంధువులు, బంధుత్వాలు, పాత సంబంధాలు తిరిగి కలుస్తాయి. ఛలోక్తులు విసిరేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్: మావిచిగురు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గురుబలం వల్ల మీకు ఈవారం బాగా కలిసి వస్తుంది. విజయం వరిస్తుంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి భూతభవిష్యత్ కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో సంపూర్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. అవిశ్రాంతంగా పని చేయడం అనారోగ్యకరం అని గ్రహించండి. మార్మిక కవితలు లేదా ప్రేమగీతాల రచనకు శ్రీకారం చుట్టండి. మీ అంతర్గత శక్తులను వెలికి తీయండి. లక్కీ కలర్: చాకొలేట్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త అవకాశంతోపాటే కొత్త సవాళ్లూ పొంచి ఉంటాయని తెలుసుకోండి.సమస్యలను ఎదుర్కొంటేనే అధిగమించగలం. ఆత్మవిశ్వాసంతో సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా, మీ సామర్థ్యం బయటపడేది. కొత్తదనం కోసం అన్వేషించండి. మనసు చెప్పే మాటను వినండి. మీ సృజనాత్మకత మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సమస్యలు, సవాళ్లు లేని జీవితం చప్పిడి పప్పు వంటిది. మీరు కోరినవన్నిటినీ పొందాలనుకుంటే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే కదా జీవితం చైతన్యంతో ప్రకాశించేది! ఈ వారంలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని, డబ్బును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామిని కానుకలతో సంతృప్తి పరచేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: వెండిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) వృత్తిపరంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. రేపటికోసం తపన పడుతూ ఉంటే ఈరోజు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుందని గ్రహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు తక్షణం మీకు తగిన అత్యుత్తమమైన మార్గం కనిపించకపోవచ్చు కానీ, మీ ముందున్న మార్గం కూడా ఉత్తమమైనదే. ఇతరుల అవసరాలను తీర్చేముందు మీవి మీకు ముఖ్యమే కదా! లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీకు మంచి వినోదభరితంగా, ఉల్లాసంగా... ఇంకా చెప్పాలంటే సరసంగా గడిచిపోతుంది. మీ ప్రేమకోసం పడిగాపులు పడుతున్న వారిని పనిగట్టుకుని మరీ పలకరించి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. ఛాందసమైన ఆలోచనలను విడిచిపెట్టి, కొత్తగా, వైవిధ్యంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీ చరిష్మా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికీ పోదు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీరనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు అనుకుంటున్న కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మంచి లాభాలను కళ్లజూస్తారు. గొప్ప ఆదాయాన్ని పొందుతారు. తమ శక్తి సామర్థ్యాలేమిటో తమకే తెలియని వారికి ప్రతివిషయంలోనూ భయమే! జ్ఞాని దేనికీ భయపడడు. ఈవారం ఓ గొప్ప సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. లక్కీ కలర్: దొండపండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితమంటేనే స్వేచ్ఛ. ఎవరూ ఎవరినీ కట్టడి చేయజాలరని అనుకుంటారు. మనం ప్రేమించే వారిని మనం కట్టడి చేస్తాం. మనల్ని ప్రేమించే వారు తమ ప్రేమతో మన ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. అహాన్ని అణ చిపెడితేనే ఆనందం. త్వరలోనే కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడనున్నాయి. ఆమోదించక తప్పదు. లక్కీ కలర్: బూడిదరంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితం అంటే ప్రశ్న కాదు.. సమస్య అసలే కాదు. జీవితమంటే జీవించడమే! ఎదురైనవాటన్నింటినీ ఆమోదిస్తూ, అనుభవిస్తూ వాలుకు కొట్టుకుపోవడమే జీవితం. బోర్డమ్ నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్తగా తయారవండి. స్నేహితులతో సరదాగా గడపండి. కుటుంబంతో కలసి లాంగ్‌టూర్‌కి వెళ్లండి. రొటీన్ నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండండి. లక్కీ కలర్: వంకాయరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తివ్యాపారాలలో ఊహలనుంచి బయటపడి, వాస్తవంగా ఆలోచించడం, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంటిలో లేదా ఆఫీసులో కొత్త మార్పు చోటు చేసుకోబోతోంది. సృజనాత్మక ఆలోచనతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అత్యుత్తమమైన వాటి గురించి ఆలోచన చేయండి. అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించండి. మీ అభిప్రాయాలలో కాస్త పట్టువిడుపు ధోరణి అవసరం. లక్కీ కలర్: లేత పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
వ్యక్తిగత లక్ష్యాలు
సంతోషం సగం బలం... బీ హ్యాపీ పగటికల: మీ కలల్లోని అందమైన ప్రాంతాన్ని ఊహించుకోండి. నిదానంగా శ్వాస పీల్చి వదులుతుండండి. అది ఒక బీచ్, శిఖరాగ్రం, మీ గతంలోని ఓ చక్కని గది... ఇలా ఏదైనా కావచ్చు. ఆ ప్రాంతాన్ని తలచుకోవడం ఒక ప్రశాంతతను, ఏకాగ్రతను అందిస్తుంది. పాజిటివ్‌గా: సంతోషకరమైన ఆనందదాయకమైన క్షణాలను నెమరువేసుకోండి. మీకున్న సౌకర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి వ్యక్తుల సామీప్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏది జరిగినా మన మంచికే అన్న ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. వీలైనంత వరకూ ఎదుటివారి గురించి కూడా మంచే ఆలోచించండి. నెగిటివ్‌కి నో: {పతికూల ఆలోచన మైండ్‌ను పాడు చేస్తుంది. దానిని దరిచేరనీయకండి. ఎంజాయ్ ద వర్క్. అలా అని ఊరకే ఏదో ఒక పని చేస్తూనే ఉండకండి. ఒకసారి ఒక పని మాత్రమే చేయండి. అప్పుడు ఒత్తిడి ఉండదు. అలాగే వాకింగో, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లకో వెళుతుంటే సెల్ ఫోన్‌కి గుడ్‌బై చెప్పండి. దాంతో చేస్తున్న పనిని ఆనందించే అవకాశం పెరుగుతుంది. అభిరుచులు: {పతి ఒక్కరూ ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా కేవలం ఆనందం కోసం మాత్రమే చిన్నదో పెద్దదో అభిరుచిని ఏర్పరచుకోవాలి. పూర్తి ఇష్టంతో చేసే పనుల ద్వారా మనలోని సామర్ధ్యాలన్నీ పూర్తి స్థాయిలో వెలికి వస్తాయి. పైగా నచ్చిన పని చేయడంలో ఉండే ఆనందమే వేరు. వ్యక్తిగత లక్ష్యాలు: లక్ష్యాలనేవి పెద్దవే కానక్కర్లేదు. ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్న బుక్ కావచ్చు లేదా కొన్ని క్లిష్టమైన పదాలకు అర్థం తెలుసుకోవడం కావచ్చు, ఎప్పటి నుంచో ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటున్న ఫ్రెండ్స్‌కి ఫోన్ చేయడం కావచ్చు... ఇలాంటి చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం పెద్ద ఆనందాన్ని అందిస్తాయి. ఆ ఆనందం మనల్ని ఆరోగ్యంగా మారుస్తుంది. గోడతో ముచ్చట్లు: రోజువారీ పనుల్లో అన్ని భావాలనూ స్వేచ్చగా వ్యక్తీకరించలేం. చాలా వరకూ అదిమి పెట్టేస్తాం. వాటిని ఏదో ఒక సమయంలో బయటకు పంపేస్తే మనసు ఖాళీగా మారిపోయి ఆనందం నిండుతుంది. ఎందుకంటే ఆ భావాల్లో నెగిటివ్ భావాలేమైనా ఉంటే అవి మనల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి వాటినలా మనసులో ఉంచేసుకోవడం అస్సలు మంచిది కాదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భావాలన్నింటినీ బయటకు నెట్టేయండి. గోడకో, పైకప్పుకో, లేక అద్దంలోని ప్రతిబింబానికో మీ మనసులోని మాటలు చెప్పండి. స్వేచ్ఛగా మీ భావాలు పంచుకోండి. నవ్వండి: జీవితంలో చాలా సమస్యలకు కారణం అనవసరమైన సీరియస్‌నెస్. కాబట్టి దాని జోలికి పోకండి. మిమ్మల్ని నవ్వించేది, నవ్వు తెప్పించేది ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వండి. దాన్ని వీలైనన్నిసార్లు ఆహ్వానించి ఆనందాన్ని పొందండి. సన్నిహితులతో ఆరోగ్యకరమైన నవ్వులు పంచుకోండి. స్వచ్ఛందంగా: ఇతరులకు సహకరించడం అంటే మనకు మనం సహకరించుకోవడమే. అలా అని తప్పనిసరై చేసే సేవలో సంతోషం ఉండదు. కృత్రిమంగా ఉంటుంది. కానీ ఎంతో ఇష్టంగా స్వచ్ఛందంగా చేసే సేవ, సహకారం ఏదైనా సరే... మనకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. మన సామాజిక దృష్టిని మారుస్తుంది. విశాలదృక్పథాన్ని అలవరుస్తుంది. మనపై సమాజానికి కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. మీ కోసం మీరు: జీవితం అన్నాక ఎన్నో బాధ్యతలు. ‘మన’ అనుకున్న వాళ్లందరినీ సంతోషంగా ఉంచడం కోసం పరిపరి విధాల ప్రయత్నాలు చేస్తాం. పరుగులు పెడతాం. మరి మన సంగతేంటి? మనకోసం మనం ఏం చేసుకుంటున్నాం? అది చాలాసార్లు ఆలోచించం. జీవన ప్రవాహంలో పడి కొట్టుకుపోవడమే తప్ప... మనం సంతోషంగా ఉన్నామా అని ఆలోచించడం చాలాసార్లు మర్చిపోతుంటాం. జీవితాన్ని సాగిస్తే సరిపోదు... జీవితాన్ని జీవించాలి. అందుకుగాను మన కోసం మనం ఏదైనా చేసుకోవాలి. ఒకరోజు వంటతో సహా అన్నీ మీకు ఇష్టమైనవి చేసుకోండి. పార్క్‌కి వెళ్ళి ఒంటరిగా బెంచ్ మీద కూర్చోండి. పూలు, గడ్డి సువాసనలను ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఇంకెందులోనైనా సంతోషం ఉంటుందంటే అదీ చేయండి. ఏం చేసినా... సంతోషంగా ఉండండి. -
సెల్ లేదు... విల్ ఉంది...
స్ఫూర్తి ఆ ఊర్లో ఉండే కుటుంబాల సంఖ్య 150కి మించ దు. కరెంటొచ్చి ఆరేళ్లయింది. ఇప్పటికీ సెల్ఫోన్లో కబుర్లు చెప్పుకునే చాన్స్ లేదు. ఎందుకంటే 50 కి.మీ దూరం వెళితేగాని సిగ్నల్స్ లేవు మరి. ఇంతగా వెనుకబడిన మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఊర్లో లేని సౌకర్యాల గురించి తిట్టుకుంటూ కూర్చోలేదు. అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో తమ చిన్న ఊరి ప్రతిష్టను కొండంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన భద్రయ్య... తలచుకుంటే కొండలు సైతం తలవంచుతాయని నిరూపించారు. ‘‘రెండేళ్ల క్రితం భద్రాచలం యువకుడు ఆనంద్‌కుమార్ ఎవరెస్ట్ ఎక్కడంతో దీనిపై ఆసక్తి వచ్చింది. ఆయన దగ్గర నుంచే ఆ వివరాలను తెలుసుకున్నా’’నన్నారు ఎపి జెన్కోలో కాంట్రాక్ట్ ఉద్యోగి భద్రాచలం సమీపంలోని చింతూరు గ్రామవాసి భద్రయ్య. తూర్పుగోదావరిజిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రంలో రోజుకు రూ.120 వేతనం అందుకునే కాంట్రాక్ట్ ఉద్యోగి దూబి భద్రయ్య... ఎవరెస్ట్ శిఖరాధిరోహణపై ఆసక్తి చూపడమే విశేషం. ఆసక్తినే అద్వితీయ శక్తిగా మలచుకుని కొండంత ఆశయాన్ని సాధించడం మరింత గొప్ప విశేషం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను సాక్షికి ఇలా వివరించారాయన. క్రమశిక్షణతో...కఠోరశిక్షణ... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే ఆలోచన తర్వాత దీనికి సంబంధించి శిక్షణ కోసం ఈ సాహసయాత్రకు గత కొంతకాలంగా మార్గదర్శకత్వం చేస్తున్న శేఖర్‌బాబును కలిశాను. ఆయన నాకు అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేశారు. ఫిట్నెస్ను నిర్ధారించుకున్నారు. జులైలో నన్ను ఎంపిక చేశారు. అత్యంత శీతల వాతావరణాన్ని నా శరీరం తట్టుకుంటుందా లేదా అనే పరిశీలన కూడా చేశారు. అనంతరం సిక్కిం, హిమాలయాల్లో శిక్షణ. అది నవంబరు నెల వరకూ సాగింది. అదైపోయాక భువనగిరిలో సాంకేతిక అంశాలపై 3నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత చింతూరు ఆంధ్రప్రదేశ్‌లో కలవడం, నా గుర్తింపు కార్డులన్నీ తెలంగాణకు చెందినవి కావడంతో పాస్‌పోర్ట్ జారీలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇంత కష్టపడిందీ వృధా పోతుందేమో అని భయపడినా... జిల్లా కలెక్టర్, స్థానిక ఐటీడిఎ పిఓల సహకారంతో ఈ సమస్య పరిష్కారమైంది. సాహసయాత్రకు శ్రీకారం... అన్ని బాలారిష్టాలు అధిగమించాక... ఏప్రిల్7న సాహసయాత్రకు శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి ఖాట్మండు అనంతరం సిసలైన కఠిన పరీక్షకు సిద్ధం అయ్యాను. గత ఏడాది తీవ్ర భూకంపం తర్వాత ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గాలన్నీ దాదాపు మూసుకుపోయాయి. ఖాట్మండు నుంచి కొడారి వెళ్లే దారి సైతం దెబ్బతింది. నేపాల్ చైనాల మధ్య వంతెన పాడైపోయింది. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లలేక విమానంలో లాసా వరకు వెళ్లాను. లాసా నుంచి ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ 800కి.మీ దూరం ఉంటుంది. నేరుగా వెళితే రెండ్రోజులు పడుతుంది. అక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు దేహం అనువుగా మారేందుకు ఈ దూరం ఉపకరిస్తుంది. అక్కడక్కడ ఆగుతూ లాసా నుంచి బేస్ క్యాంప్‌కు చేరడానికి 7 రోజులు పట్టింది. బేస్‌క్యాంప్ సముద్రమట్టానికి దాదాపు 5200కి.మీ ఎత్తులో ఉంటుంది. దీని తర్వాత 6400 కి.మీ ఎత్తులో మరో అడ్వాన్స్ బేస్ క్యాంప్ ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితం... అత్యంత ఎత్తులో ఆక్సిజన్ అందని పరిస్థితుల మధ్య పర్వతారోహణ సాగింది. శరీరంపై 15 కిలోల బరువుతో మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ గడ్డకట్టించేస్తుంటే, విపరీతమైన వేగంతో వీచే చలిగాలులు కోసేంత పదునుగా తాకుతుంటే ఇబ్బందుల్ని మొక్కవోని పట్టుదలతో అధిగమిస్తూ ముందడుగేశా. అడుగడుగునా ఆత్మవిశ్వాసానికి సవాళ్లు ఎదురవుతాయీ పర్వతారోహణలో. ఒక్కసారి కాలు జారితే కొన్ని వేల కిలోమీటర్ల దిగువకు పడిపోతాం. ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేసి విఫలమైన వారి మృతదేహాలు అడుగుకొకటి కనపడుతూ ధైర్యానికి పరీక్ష పెట్టాయి. ఏదేమైతేనేం... సాధించాలి అనే పట్టుదల తప్ప మరే ఆలోచనను, భయాన్నీ దరిచేరనీయకుండా ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరాక... ముందుగా గుర్తొచ్చింది మా చిన్న ఊరు. ఒక మారుమూల ప్రాంతపు గిరిజన తెగకు చెందిన వ్యక్తిగా అంత గొప్ప కలను సాకారం చేసుకోవడం కొండంత సంతృప్తిని అందించింది’’ అంటూ చెప్పారు భద్రయ్య. అత్యంత వ్యయప్రయాసలతో కూడిన ఈ యాత్రకు శిక్షణా ఖర్చుల్ని శేఖర్‌బాబు సారథ్యంలోని రాక్‌క్లైంబింగ్ స్కూల్ భరిస్తే, రంపచోడవరం ఐటీడిఎ పిఓ రూ.23.5 లక్షల ఆర్థిక సాయం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు. - ఎస్.సత్యబాబు -
స్వేచ్ఛాడే
శోభాడేని స్వేచ్ఛాడే అనడానికి రెండు కారణాలు. ఒకటి: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నెలల్లో ఆమె జన్మించారు. రెండు: రచయిత్రి, కాలమిస్టు కనుక ఆమె ఊహల్లో కావలసినంత స్వేచ్ఛ. అయితే ఈ రెండూ పైపై కారణాలు మాత్రమే. లోతైన కారణం ఏమిటంటే... స్వేచ్ఛ ఆమె జీవన విధానం. ఇంట్లో, బయటి ఇరుకులో ఆమె ఎప్పుడూ ఫిట్ కాలేదు. ఒళ్లు విరుచుకున్నట్లుగా... ఆలోచనలు పరుచుకోడానికి స్పేస్ ఉన్నచోటే ఆమె కుదురుగా ఉన్నారు. శోభాడేను అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాకుమారి కేట్ మిడిల్టన్ ఆ మధ్య ఇండియా వచ్చినప్పుడు.. ‘చీర కట్టుకోడానికి తగిన ఒంపులు ఆ పిల్లకు లేవు’ అని శోభాడే బహిరంగంగా అనడం భారతీయులందరినీ నివ్వెరపరిచింది. నిజానికి శోభాడే మాట్లాడింది కేట్కి లేని వాటి గురించి కాదు. చీరకు ఉండవలసిన వాటి గురించి! శోభ.. చీరల డిజైనింగ్‌లో కూడాస్పెషలిస్టు మరి. తనకు తెలిసిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేని స్వేచ్ఛాప్రియత్వమే ఈ డెబ్బై ఏళ్ల సౌందర్యరాశి వ్యక్తిత్వాన్ని నిత్యం శోభాయమానం చేస్తోంది. సోఫిస్టికేటెడ్, స్లెండర్, స్మార్ట్, షార్ప్, ష్రూడ్! ఇవన్నీ ‘ఎస్’తో మొదలయ్యే మాటలు. శోభాడేని నిర్వచించే మాటలు కూడా! శోభాడే పేరూ ‘ఎస్’తోనే మొదలౌతుంది. ఆమె రాసిన పుస్తకాల్లో దాదాపుగా అన్నీ ‘ఎస్’తో స్టార్ట్ అయినవే.. సిస్టర్స్, స్టారీ నైట్స్, సల్ట్రీ డేస్, సెకండ్ థాట్స్, సెలెక్టివ్ మెమరీ, సర్వైవింగ్ మెన్.. ఇలా. శోభాడే నవనాగరికురాలు (సోఫిస్టికేటెడ్). ఆమెవి నాజూకైన భావాలు (స్లెండర్). వివేకవంతురాలు (స్మార్ట్). చురుకైన మనిషి (షార్ప్). నేర్పరి (ష్రూడ్). ఏంటీ ‘ఎస్’? సెంటిమెంటా? ‘ఎస్’లో ఏదైనా పవర్ ఉందా? శోభాడేని చాలామంది అడిగారు. పవర్ ‘ఎస్’లో లేదు. ‘నో’లో ఉంది. ‘నో’ చెప్పడంలో ఉంది.. అన్నట్లు నవ్వేస్తారు శోభాడే. జీవితంలో ప్రతి విషయాన్నీ ఆమె తేలిగ్గానే తీసుకున్నారు. విత్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఏదైనా.. తొలగించుకోవడంలో లేదు.. తగిలించుకోవడంలో ఉంది అని నమ్ముతారు శోభ! తలచినదే జరగాలి! సంప్రదాయం కుటుంబంలో సంకెళ్లు తెంచుకోలేనివిగా ఉంటాయి. అసలు తెంచుకోవాలన్న ఊహే రానివ్వని విధంగా ఉంటాయి. మహారాష్ట్ర సారస్వత బ్రాహ్మణ కుటుంబంలోని ఈ ఆడపిల్ల ఊహనూ రానిచ్చింది, వాటిని తెంపుకునీ బయటికి రానూ వచ్చింది! సాధారణంగా.. వద్దన్న పని చెయ్యొద్దు అన్నప్పుడు పెద్దవాళ్ల భ్రుకుటి ముడివడుతుంది. కానీ.. చెయ్యాలనుకున్న పనిని చెయ్యొద్దు అన్నప్పుడు శోభాడే భ్రుకుటి ముడివేస్తుంది! ఆమె జీవితమంతా ఇదే ధోరణి. నాన్న చెప్పినా వినలేదు శోభాడే సెయింట్ జేవియర్స్ కాలేజీ స్టూడెంట్. అంతవరకు బాగుంది. మోడలింగ్ చేస్తానంటే మాత్రం తండ్రి ఒప్పుకోలేదు. ‘మా అమ్మాయి న్యాయ మంత్రిత్వశాఖలో ప్రభుత్వ కార్యదర్శి లేదా పెద్ద అధికారి’ అని చెప్పుకోవడం ఆయనకు గర్వం. అప్పటికే ఆయన రెండు మూడు గర్వాలను తలపై కిరీటంలా ధరించి ఉన్నారు. కొడుకు ఇంజినీర్. ఒక కూతురు ఆఫ్తాల్మిక్ సర్జన్. ఇంకో కూతురు ‘లా’ గ్రాడ్యుయేట్. వీళ్లందరి వరుసలోనే చిన్న కూతురు శోభను ఐ.ఎ.ఎస్.కు పంపించాలనుకున్నారు. కానీ శోభ పెదవి విరిచింది. ఊహు.. ఈ మాటను ఇలా చెప్పకూడదు. తండ్రి ముందు పెదవి విరిచేంత ధైర్యం చేసింది! ‘వావ్’ అంటూ వచ్చి అడిగారు శోభ శరీర నిర్మాణం పెళుసుగా ఉంటుంది. ఈ మాట సరిగా అర్థం కాకపోతే ‘నాజూకు’గా అనుకోవచ్చు. మోడలింగ్ చూపు ఇలాగే ఉంటుంది. ఇక ఆ దృఢమైన దవడ కండరాలు, ఆమె ఆత్మవిశ్వాసం కూడా మోడలింగ్‌కు అవసరమైన సౌందర్య సాధనాలే. అయితే శోభకు తనలో ఇంతుందని తెలీదు! తండ్రీకూతుళ్లు ఓ రోజు తాజ్ లాంజ్‌లో కూర్చొని ఉన్నారు. ఏ అతిథి కోసమో ఎదురుచూస్తున్నారు. అటుగా వెళుతున్న వారెవరో శోభను చూశారు! ‘వావ్’ అనుకున్నారు. అలా చాలామంది శోభను చూసి వావ్ అనుకోవడం మామూలే కానీ, ఇక్కడ వావ్ అనుకున్నది, వీళ్ల దగ్గరికొచ్చి శోభను పరిచయం చేసుకున్నది మోడలింగ్ ఫీల్డ్ వాళ్లు. ఆ తర్వాత శోభ ఖటావ్ శారీస్, తాజ్ టీ, పాండ్స్, బాంబే డయింగ్.. అన్నీ టాప్ బ్రాండ్స్.. వాటికి మోడల్ అయ్యారు. ఆరేళ్లు తన 22 వ యేట వరకు శోభ మోడలింగ్‌కి శోభ తెచ్చారు. మరి బాలీవుడ్ శోభకు ఎట్రాక్ట్ కాలేదా? అయింది. కానీ శోభే బాలీవుడ్‌కి ఎట్రాక్ట్ కాలేదు! ఏంటీ అమ్మాయి? ఏం లేదు. మృదుభాషి. ఆమె ఆలోచనలు మాత్రమే నిరంతరం మాట్లాడుతూ ఉంటాయి. వాటి ధ్వని అక్షరాల్లో వినిపిస్తుంది. అంతే తప్ప అస్తమానం మానవలోకంలో తిరుగాడుతుండే స్త్రీ కాదు శోభాడే. సత్యజిత్‌రాయ్, ఇంకా ఒకరిద్దరు బెంగాలీ దర్శకులు.. సినిమాల్లోకి వస్తారా అని శోభను అడిగారు. శోభ రాలేననలేదు. చేయలేనన్నారు. క్రీడలు.. క్రియేటివిటీ శోభ అథ్లెట్ కూడా అని చెబితే సడెన్‌గా ఇక్కడ టాపిక్ డైవర్ట్ అయినట్లు ఉంటుంది. శోభ కూడా ఇలాగే ఆటల్నుంచి డైవర్ట్ అయ్యారు. చదువుకునే రోజుల్లో ఆమె రాష్ట్ర స్థాయి అథ్లెట్. ఇక బాస్కెట్ బాల్లో అయితే ఆమె రికార్డ్ హోల్డర్. కానీ అటువైపే వెళ్లలేదు. మోడలింగ్ చేస్తూనే మాస్ కమ్యూనికేషన్స్‌లోకి వచ్చేశారు. భవాన్స్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తర్వాత ‘క్రియేటివ్ యూనిట్’లో కాపీ రైటర్‌గా చేశారు. అదొక యాడ్ ఏజెన్సీ. స్టార్‌డస్ట్, సొసైటీ, సెలబ్రిటీ పత్రికలకు ఎడిటర్‌గా చేయడం శోభ జర్నలిజం కెరీర్‌లోని శిఖరాగ్ర దశ. మూడూ ఒకే దేహంలా ఉండే ఈ పత్రికలకు మూడు వేర్వేరు ఆత్మలను ఇచ్చి, కొత్త తరం జర్నలిస్టులను తయారు చేశారు శోభా డే. రాయలేదు! చెక్కారు!! మరి ఇన్నిన్ని పుస్తకాలు ఎలా రాశారు? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? మొదటిది: తపన. అది ఆమెను నిలవనివ్వలేదు. అందుకు రాశారు. రెండోది: తపన. దానికి టైమింగ్స్ ఉండవు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు రాశారు. మూడోది: తపన. దాని పని అది చేసుకుపోయింది. పుస్తకాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చేశాయి. జీవితంలోని ప్రతిక్షణం ఆమెకొక ప్రేరణ. ‘సోషలైట్ ఈవినింగ్స్’ లో శోభాడే ముంబై మహా నగరపు సంపన్న జీవితాల్లోని ఏకాంతపు విషాదాన్ని, విఫల వివాహాలను, పరస్పర్శలోని ఓదార్పును కోరుకునే దేహాలను, ఆత్మలను... శిల్పాల నీడల్లా చెక్కారు. న్యూ యాంగిల్ సామాజిక పరిణామాల్లో కొత్త కోణాలను చూస్తారు, వ్యాఖ్యానిస్తారు శోభాడే. దేశంలో ముందు వరుసలో ఉన్న కాలమిస్టు ఆమె. రోజుకి కనీసం 1500 పదాలైనా రాయగల శక్తిమంతురాలు. ఒక్కోరోజు రాయడానికి ఏమీ ఉండదు. అయినా సరే ఏమీ రాయకుండా ఉండలేదు. సంతృప్తి... పశ్చాత్తాపం ఏ కళతోనూ, ఏ కలలోనూ సంతృప్తి చెందని మనిషి శోభాడే. ఆవులకు మాత్రమే సంతృప్తి ఉంటుందని ఆమె అభిప్రాయం. ఆవు అయినా ఎలా సంతృప్తి చెందుతుంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని శోభాడే మాటల్లో వినడమే బాగుంటుంది. ‘‘కొంచెం దాణా, కుడితి, నీడ, పక్కనే తన లేగదూడలు ఉంటే చాలు ఆవు సంతృప్తి చెందుతుంది’ అంటారు శోభ. మరి జీవితంలోని పశ్చాత్తాపాలు? అవి లేకుండా జీవితం ఎలా ఉంటుందని ఆమె ప్రశ్న. బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ శోభాడే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. కాలేజ్ బయట, కాలేజ్ లోపల. అలా గడిచాయి ఆ రోజులు. ఇప్పుడీ జనరేషన్ మీద ఏమిటి ఆమె అభిప్రాయం? అసలు మనకో అభిప్రాయం ఎందుకు ఉండాలి అనేది శోభ క్వొశ్చన్. ఎందుకంటే ఆమె కొన్ని పుస్తకాల్లో రాశారు.. ఇప్పటి అమ్మాయిలు మరీ గడుసుగా తయారయ్యారని. అయ్యారని రాశాను కానీ, అవకూడదని రాయలేదుగా అని శోభ! అమె చిన్న కూతురు డీజే అవుదామని అనుకుంది. ఆ మాటే అమ్మతో చెప్పింది. వద్దన్నారు శోభ.. తన స్వభావానికి భిన్నంగా. నేను చేసేది చేసేదే అన్నట్లు డీజే దారిలోకి వెళ్లింది చిన్నమ్మాయి. ఆ మాత్రం ధైర్యం ఉండాలి అమ్మాయిలకు అంటారు శోభ. దీన్ని మనం ద్వంద్వ వైఖరి అనుకోనవసరం లేదు. ద్వైదీభావం అనుకోవాలి. శోభాడే మనోగతం మగవాళ్లలో నచ్చనివి? నోటి దుర్వాసన, చుండ్రు ఆదర్శ పురుషుడు అంటే? ఆదర్శ పురుషులంటూ ఎవరూ ఉండరు. సూపర్‌మేన్, రావణ్ కాంబినేషన్ నచ్చుతుంది నాకు. కానీ ఈ కాంబినేషన్‌తో మనకు మగాళ్లెవరూ కనిపించరు. మీ చర్మం నిగారింపు రహస్యం ఏమిటి? జీన్స్ బట్టి వచ్చింది. ప్లస్ మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్... రచయిత్రి కాకపోయుంటే... ఆర్కిటెక్ట్ ని అయుండేదాన్ని. చక్కటి ఆకాశ హర్మ్యాలను కట్టి ఉండేదాన్ని. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాగే పుడతారా? మీరు ఇప్పుడు ఉన్నట్లే.. ఈ ప్రశ్న మీరు ఏ మిస్ ఇండియాకో వెయ్యవలసింది (నవ్వుతూ) మీ సోషల్ స్టేటస్‌ని మీ భర్త దిలీప్ డే ఎంజాయ్ చేస్తారా? ఏం ప్రశ్న అండీ ఇది! ఏకాలంలో ఉన్నారు? మీకు ఇంకా ఏమేం ఇష్టం? సినిమాలు... సినిమాలు. చాలా చూస్తాను. అలాగే ప్రయాణాలు నాకు ఇష్టం. తెల్లారేసరికల్లా మిలియన్ డాలర్లు (సుమారు 7 కోట్ల రూపాయలు) మీ ముంగిట్లోకి వచ్చిపడితే.. అవన్నీ ఖర్చయిపోయేంత వరకు దక్షిణమెరికాలో పర్యటిస్తాను. మీకు చాలా భాషలు తెలుసంటారు? చాలా కాదు. కొన్ని. హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్.. కొద్దిగా ఫ్రెంచి. అభిమాన రచయిత విక్రమ్ సేథ్, స్కాట్ ఫిట్టెగరాల్డ్ నచ్చిన సినిమాలు చాలా. ‘పాకీజా’ వాటిల్లో ఒకటి. ఎవరంటే ప్రేమ? జీవించడం, ప్రేమించడం. -
ఆడదానిగా పుట్టినందుకు గర్వపడతా!
ఇంటర్వ్యూ మంచి ఒడ్డూ పొడవూ ఫిట్నెస్తో చెక్కిన శిల్పంలా కనిపించే శిల్పాశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఆమె తనువు మాత్రమే అందమైనది కాదు. ఆమె మనసూ అందమే. ఆమె భావాలు ఇంకా అందమైనవి. తనలోని ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల చూస్తే... ప్రతి అమ్మాయీ ఇలానే ఉండాలి అన్న అభిప్రాయం కలుగుతుంది. శిల్ప గురించి మరిన్ని తెలుసుకుందామా! * ఏం చేసినా పక్కాగా ప్లాన్ చేసుకుని చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. నటన, మోడలింగ్, పెళ్లి, వ్యాపారం... ఏదీ ఓ ప్రణాళిక లేకుండా చేయలేదు. అదే నన్ను ఈ రోజు సెలెబ్రిటీ స్టేటస్‌లో నిలబెట్టిందని కచ్చితంగా చెప్పగలను. * ఎంత మోడ్రన్ ఉమన్‌ని అయినా దేవుడు, విధి వంటి వాటిని నమ్ముతాను. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అష్టకష్టాలు పడిందట. నాలుగో నెల వచ్చేవరకూ అసలు గర్భం నిలుస్తుందని అనుకోలేదట. ఎనిమిదో నెలలో ఉన్నప్పుడు మెట్ల మీది నుంచి పడిపోయిందట. తను, నేను ఇద్దరం చనిపోతామని అందరూ అనుకున్నారట. అయినా తన ప్రాణాలు నిలిచాయి. నాకూ ఏమీ కాలేదు. అంటే మమ్మల్ని ఏదో శక్తి కాపాడిందనే కదా! మా విధి రాత మరోలా రాసుందనేగా! * నా కొడుకు వివాన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణమే నా జీవితంలో అన్నిటికంటే గొప్ప క్షణం. అమ్మ కావడంలో ఉన్న ఆనందమే వేరు. ఇప్పుడు వాడే నా జీవితం అయిపోయాడు. వాడితో ఉన్నంతసేపూ నాకు సమయమే తెలియడం లేదు. * ఈ మధ్య ఆడపిల్లలు కెరీర్‌ను నిర్మించుకోవడంలో మునిగిపోయి ఆలస్యంగా తల్లులవుతున్నారు. అదంత మంచిది కాదు. నేను 37 యేళ్ల వయసులో తల్లినయ్యాను. అదృష్టంకొద్దీ నేను, నా బిడ్డ బాగున్నాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. * నన్ను ఎప్పుడూ అందరూ అడిగే ప్రశ్న... ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారు అని! దానికి కారణం మంచి ఆహారం, తగినంత వ్యాయామం. వాటి విషయంలో నేనస్సలు కాంప్రమైజ్ అవ్వను. * యోగా సాధన చేయడం మొదలు పెట్టాక శారీరకంగాను, మానసికంగాను కూడా నాలో మార్పులు వచ్చాయి. ఫిట్నెస్ పెరిగింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించడం లాంటివి అలవడ్డాయి. అయితే అందరూ అనుకున్నట్టు నేను అందాన్ని కాపాడుకోవడానికి యోగా మొదలు పెట్టలేదు. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. అది నయం కాని ఆరోగ్య సమస్య. యోగా చేస్తే కాస్తయినా ఫలితం ఉంటుందన్నారని మొదలెట్టాను. కానీ దానివల్ల ఉన్న ఇంకెన్ని లాభాలు ఉన్నాయో తెలిశాక ఇక వదిలి పెట్టలేకపోయాను. * ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలి అంటే కావలసినది నిబద్ధత. సంతోషంగా ఉండాలి అంటే ఉండాల్సింది తృప్తిపడే తత్వం. పనిని మనస్ఫూర్తిగా చేస్తే విజయం వరిస్తుంది. ఉన్నది చాలని లేనిదాని కోసం వెంపర్లాడకుండా ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రెండు విషయాలూ తెలుసుకుంటే జీవితం సఫలమవుతుంది. ఇదే నా లైఫ్ ఫిలాసఫీ. * నాకు డెరైక్షన్ చేయాలని ఉంది. కాకపోతే అందుకు నేను సూట్ కానేమోనని నా అనుమానం. ఎందుకంటే నేను చాలా హైపర్‌గా ఉంటాను. చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఎదుటివాళ్లను డీల్ చేయలేరు. దర్శకులంటే మిగతా టెక్నీషియన్లను, నటీనటులను అందరినీ మేనేజ్ చేయాలి కదా! అది నేను చేయలేనేమోనని ఓ చిన్న డౌట్! * ఏ స్థాయికి వచ్చినా, ఎంత సాధించినా ఆడది అనగానే ఓ చిన్నచూపు ఇప్పటికీ సమాజంలో ఉందని అనిపిస్తుంది నాకు. అమ్మాయి అనగానే ఏదో లోకువగా చూస్తారు. తను ఎంత సాధించినా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బయటకు వచ్చి ఏదైనా చేయాలని తపించే అమ్మాయిల గురించి మరీ త్వరగా కామెంట్ చేసేస్తుంటారు. అసలు అలా ధైర్యంగా అన్నీ సాధించగలుగుతున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అంతేకానీ ఏదో రకంగా నెగిటివ్ కామెంట్లు చేసి, పిచ్చి రాతలు రాసి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అసలు నేను ఆడదానిగా పుట్టినందుకే ఎంతో గర్వపడుతూ ఉంటాను. అందుకే ఎవరైనా మహిళలు గడప దాటి బయటకు వచ్చి ఏదైనా సాధిస్తే వాళ్లమీద నాకు ఎంతో గౌరవం కలుగుతుంది! -
తనను తాను అతిగా ప్రేమించుకునే జబ్బు!
మెడి క్షనరీ తనను తాను ప్రేమించుకోవడం అందరికీ ఉండే సహజాతం. ఇదే లేకపోతే మనిషి మనుగడే కష్టం. అయితే కొందరు తమ గొప్పలు తాము అదేపనిగా చెబుతుంటారు. ఇది కూడా పెద్ద సమస్య కాదు. నిజానికి అలా ఉండటం వల్లనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ తన సామర్థ్యాలను అతిగా ఊహించుకొని తప్పులు చేస్తుంటే మాత్రం ఇది సమస్య అవుతుంది. తనను తాను ప్రేమించుకోవడం మితిమీరితే దాన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు నిపుణులు. దీన్ని వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి (పర్సనాలిటీ)కి సంబంధించిన ఆరోగ్య సమస్యగా డాక్టర్లు పేర్కొంటారు. ఇలా తమ పట్ల తమకు ఉన్న అతి ప్రేమ రుగ్మతను నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎన్పీడీ)గా చెబుతారు. ఒకరు తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడనేందుకు ‘నార్సిసస్’ అనే వ్యక్తి ఒక తార్కాణం. ఆ గ్రీకు పురాణపురుషుడు నీళ్లలోని తన ప్రతిబింబాన్నీ తాను చూసుకొని ఎప్పుడూ మురిసిపోతుంటాడు. ఆయన పేరిటే ఈ రుగ్మతకు ‘నార్సిస్టిక్ పర్సనాటిటీ డిజార్డర్’ అనే పేరు వచ్చింది. -
ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిదే!
పరిపరి శోధన మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అవలక్షణంగా పరిగణిస్తాం. అలాంటి లక్షణం ఉన్నవారికి కాస్త దూరంగా మెలగుతాం. వారిపై రకరకాల వ్యాఖ్యానాలూ చేస్తుంటాం. అయితే, ఆత్మవిశ్వాసం కాస్త మితిమీరితే మరేం ఫర్వాలేదని, అలాంటి వారే కార్యసాధకులు కాగలరని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. అన్నీ తమకే తెలుసునంటూ అందరి వద్దా ప్రగల్భాలు పలికేవారిని తీసిపారేయడం తగదని అంటున్నారు. అలాంటి వాళ్లలో దూసుకుపోయే లక్షణం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఏ రంగంలోనైనా అలాంటి వాళ్లు కార్యసాధకులుగా నిలవగలరని తమ అధ్యయనంలో తేలిందని పెన్సిల్వేనియాలోని ఫ్రాంక్లిన్ అండ్ మార్షల్ కాలేజీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. -
అనుకున్న పనులు పూర్తవుతాయి
అక్టోబర్ 3 నుంచి 9 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ ఆత్మవిశ్వాసం పాళ్లు పెరగడం మూలంగా మీ శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. ఈ సామర్థ్యాన్ని, తెలివితేటలను ఉపయోగించి పెండింగ్ పనులు పూర్తి చేయండి. ఏవిషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోకుండా ఊగిసలాడే మీ ధోరణిని మాని, బాధ్యతగా పని చేయండి. తలిదండ్రులు, భార్య, పిల్లల పట్ల ప్రేమగా, బాధ్యతగా మెలగండి. కలిసొచ్చే రంగు: బ్లూ టారస్ (ఏప్రిల్ 21-మే 20) జీవితంలో సంభవించనున్న భారీ మార్పులకు ఈ వారంలో పునాది పడుతుంది. ఎప్పుడు టూర్లో ఉంటారో, ఎప్పుడు ఇంట్లో ఉంటారో తెలియనంతగా టూర్లకు తిరగాల్సి వస్తుంది. అనుకోని సంఘటనల వల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం మీ శక్తి సామర్థ్యాలన్నింటినీ ఒడ్డాల్సి రావచ్చు. కలిసొచ్చే రంగు: రెడ్ జెమిని (మే 21-జూన్ 21) మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. అయితే మీరు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం అవసరం. ఆకస్మిక ప్రయాణం ఉండవచ్చు. మీరు మనసులో చేస్తున్న ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ సలహాల వల్ల కొందరు బాగుపడతారు. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: పాచిరంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) గతాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి, వర్తమానంలో జీవించడం మంచిది. త్వరలో మిమ్మల్ని విజయం వరిస్తుంది. వారసత్వపు ఆస్తి ద్వారా మీకు కొంత డబ్బు చేతికందుతుంది. ఆ వచ్చిన డబ్బును కొత్త ప్రాజెక్టులో మదుపు చేయాలన్న ఆలోచన చేస్తారు. మీ ఆలోచన ఫలిస్తుంది. మీ కెరీర్‌కు ఇది మంచి మలుపు అవుతుంది. ఇది మీకు అనుకూల సమయం. కలిసొచ్చే రంగు: ఎలో లియో (జూలై 24-ఆగస్టు 23) రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ధైర్యంగా రిస్క్ తీసుకుని పని చేస్తే మీకు అంతా సానుకూలమవుతుంది. పెద్ద ముందడుగు వేసే ముందు అది పాతాళంలోకి కూరుకుపోయేలా చేస్తుందో, ఆకాశంలోకి ఎగిరేలా చేస్తుందో మనకు తెలియదు కదా! ఈ వారం ప్రోత్సాహకరమైన వార్తలు అందుతాయి. మాంచి రొమాన్స్ కూడా ఉండచ్చు. కలిసొచ్చే రంగు: పీచ్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీకోసం ఒక మంచి వార్త ఎదురు చూస్తుంటుంది. అయితే ఆ వార్తలోని అంశం కన్నా, ఆ వార్తను అందించే వారే మీకు ముఖ్యం. పనిప్రదేశంలో చాలాకాల ంగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంతకాలంగా మీకు ఉన్న ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా పరిణమిస్తాయి. వారంలో విస్తృతంగా ప్రయాణాలు ఉండ చ్చు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ క ష్టాలు, కడగండ్లను కాసేపు పక్కన బెట్టి కెరీర్ మీద దృష్టి పెడ్టడం మంచిది. మీ పనిని సాధ్యమైనంత వేగంగా, సంతోషంగా చేయండి. అవే సానుకూలపడతాయి. మీకున్న ఆర్థిక వనరులను పరిపుష్టం చేసుకుంటారు. స్నేహితులు, బంధువులు, కుటుంబంతో ఉన్న సామరస్యత ఇందుకు ఉపకరిస్తుంది. కలిసొచ్చే రంగు: బ్లూ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కెరీర్ పరంగా మీరు తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితాన్నే మలుపు తిప్పవచ్చు. గతజ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కొద్దిపాటి ఒడుదొడుకులున్నా, జీవితం సాఫీగానే నడుస్తుంది. మీరు చేసిన పనులన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. అనవసర ఆందోళన మాని పనిని చేపట్టండి. కలిసొచ్చే రంగు: వ యొలెట్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల మూలంగా మీరు ఎంతో కోల్పోయినట్లుగా, నష్టపోయినట్లుగా భావిస్తారు కానీ, అంతే మొత్తంలో ఆదాయం కూడా లభించినట్లు తెలుసుకుని ఊరట పొందుతారు. ఆత్మీయులైన కొందరు తమ సూచనలు, సలహాలతో మిమ్మల్ని మంచి దారిలో నడిపిస్తారు. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కొన్ని బంధాలు, బంధుత్వాలు, సంబంధీకుల మూలంగా ఏర్పడ్డ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కోరిక నెరవేరుతుంది. మీ అచంచలమైన కృషితో కెరీర్ కలను సాకారం చేసుకుంటారు. కాంట్రాక్టు వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. ఒప్పంద పత్రాలపై గుడ్డిగా సంతకాలు చేయవద్దు. కలిసొచ్చే రంగు: లెమన్ ఎల్లో పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కెరీర్ పరంగా మీరు కన్న కలలను, కోరికలను నెరవేర్చుకుంటారు. మీ మొండితనాన్ని తగ్గించుకోవడం మంచిది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మీరు చేసే ఒక ప్రయాణం మూలంగా ప్రయోజం పొందుతారు. శుభవార్తలు వింటారు. అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు. క లిసొచ్చేరంగు: ఆరంజ్ ఇన్సియా కె.టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అనుకున్న పనులు పూర్తవుతాయి. వాటి గురించి దిగులు పడక్కర్లేదు. బంధువులు వస్తూపోతూ ఉండే కారణంగా ఆత్మీయబంధం బాగుంటుంది. కొంత పెట్టుపోతలకు వ్యయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఆలోచించుకుని ఉండడం మంచిది. ఒక అనుకోని పని ద్వారా ఆదాయం లభించే అవకాశం వుంది. కాబట్టి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) దైవకార్యాల పట్ల ఆసక్తీ, ఆధ్యాత్మిక ప్రసంగాల విషయంలో ఇష్టం, యధాశక్తి దానధర్మాలు చేయాలనే బుద్ధీ కలుగుతుంది. ఇది మంచి పరిణామం! ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు చేతికందే అవకాశముంది. గతంలో ప్రారంభించిన పనులు కొంతవరకు నెరవేరే వీలుంది. అయితే ఈవారంలో చేసే కొత్త ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. జెమిని (మే 21-జూన్ 21) ఎందుకో తెలీకుండా అనవసర వ్యయం వచ్చిపడుతుంది. తప్పనిసరి వ్యయమైన కారణంగా పొదుపు చేసుకున్న సొమ్ము నుండి తగ్గుదల తప్పదు. ఈవారంలో మీ విలువైన సమయం ధనం... దాదాపుగా సద్వినియోగమవుతుందనే చెప్పాలి. మీ సంయమన స్వభావం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఎంత ప్రయత్నించినా, మీ మానాన మీరు పోతున్నా ఏదో ఒక చిక్కు ఎదురవడం, మీ గురించి అపనింద ఒకటి ప్రచారంలోకి రావడంవల్ల మానసికంగా కొంత వ్యధపడే అవకాశముంది. చేసిన పనినే తిరిగి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి బాగా ఆలోచించిన మీదనే ఏ పనినైనా చేపట్టండి. ఏదేమైనా ఈవారం అంత గొప్పగా లేదనుకుని ధైర్యంతో ఉండడానికి సిద్ధంకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రస్తుత గ్రహస్థితి కారణంగా ప్రతిపనీ వాయిదా పడుతూ, చివరి క్షణం వరకూ కూడా అవుతుందా? కాదా? అనే మనోవ్యధ ఉన్నా, చివరికి పూర్తవుతుంది. చేస్తున్న పనినిగానీ, వృత్తిని గానీ, స్థలాన్ని గానీ మార్చడం ఈ మాసంలో అనుకూలం కాదు. బయటి వ్యక్తుల మాటలను వినకుండా కుటుంబ సభ్యుల్ని దృఢం చేసుకోవడం అవసరం. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఏవిధమైన అనారోగ్యం లేకున్నా, ఉందేమోననుకునే భయం; ఎక్కడీ వెళ్లడం మీకిష్టం లేకున్నా, అవసరం లేకున్నా ‘ఊరు మారడం మంచిదేమో’ అనే భయంతో కూడిన ఊహ రావచ్చు. ఆవిధమైన ఆలోచనే సరికాదని గ్రహించండి. ఓ క్షణంలో ఎంతో ధైర్యంతో ఉండి, మరుక్షణం లోనే తెలియని అధైర్యంతో ఉంటారు. అయితే ఏ హానీ, వ్యతిరేకతా జరగదని గ్రహించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈవారం మీకు అనుకూలంగా ఉండొచ్చు. అనుకున్న ఆలోచనలన్నీ అమలయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. కుటుంబ విషమ సమస్య ఒకటి మనసును తొలుస్తూనే, వాయిదా పడుతూ వెళ్తుంది. ఓ గట్టి సమస్యకి పరిష్కారాన్ని వెదికే సమయంలో ‘తొందరపడి ఓ నిర్ణయం తీసుకున్నారేమో’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) కోపాన్ని ప్రదర్శించడానికి సమయాన్ని, సందర్భాన్నీ గమనించుకోవలసి ఉండడమే కాక, మీ భావాన్ని సున్నితంగా వ్యక్తీకరించవలసిన అవసరం ఉంది. లోపల హాలాహలం దాగినా పైకి ప్రశాంతంగా కన్పించే తీరుగా ద్విపాత్రాభినయం చేయని పక్షంలో చిక్కులు తప్పవు. మీ ప్రతిపనినీ గమనిస్తూ శత్రువులున్నారనే యదార్థాన్ని గ్రహించండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) వ్యవసాయదారులకు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త చదువుల్ని చదవాలనే ఊహలు మీకు కలిగే సమయం ఇది. అవకాశముంటే మీకు ప్రయోజనపడతారనుకున్న పెద్దలకోసం ప్రయాణాలని సిద్ధం చేసుకోవచ్చు. పొగడ్తలకు లొంగిపోవద్దు. నిత్య పూజని మరవద్దు. కలుగుతున్న శుభ పరిణామాలకి అహంకరించవద్దు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అనుకున్న కోరిక ఎంతో శ్రమ మీద నెరవేరే అవకాశముంది. ఎవరేమనుకున్నా వాటిని పట్టించుకోకండి. వాటిద్వారా మీ ఏకాగ్రత చెడడమే కాక, మీ వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభని చూపించలేరు. పొదుపు పాటించడం అవసరం. కుటుంబ సభ్యుల మెప్పుకోసం అనవసర ప్రయాణాలూ, కొనుగోళ్లూ వద్దేవద్దు. కొత్త వ్యాపారం మెల్లగా పెరిగే అవకాశముంది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) గ్రహస్థితి సామాన్యంగా ఉన్న కారణంగా పనుల్లో పెద్ద కదలిక ఉండక, నిరుత్సాహకరంగా అనిపించవచ్చు. కనిపించిన ప్రతి వ్యక్తినీ నమ్మి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలను చర్చించడం సరికాదు. బంధుమిత్రులెవరైనా మీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోతే, నిర్ద్వంద్వంగా ఖండించడం కాకుండా లౌక్యంగా తప్పించుకోవడం మంచిది. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కుటుంబ సభ్యులూ, పెద్దలు కలిసి మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేవడం మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీనరాశికి చెందిన మీరు భార్య అయితే మీ శ్రీవారికీ, మీరు భర్త అయితే మీ శ్రీమతికీ ఆరోగ్యం విషయంలో అనవసర ఆందోళనపడే పరిస్థితి రావచ్చు. సంతానం చదువులో రాణిస్తూ, మీ ఆనందాన్ని ఇనుమడింపచేస్తారు. -
చెప్పులు చెప్పే మర్మం ఏమిటి?
స్వప్నలిపి చెప్పులే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. కలలో కనిపించే ‘చెప్పులు’ కూడా ఎన్నో అర్థాలు చెబుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే జీవితం పట్ల మన దృక్పథానికి, నమ్మక అపనమ్మకాలకు ఇవి అద్దం పడతాయి. చెప్పులు పాత పాడి, మరీ పాతబడి... నడవడానికి ఇబ్బంది పడడం అనే దృశ్యం తరచుగా కలలోకి వస్తే మీ వృత్తిలోనో, మీరు ఎంచుకున్న మార్గంలోనో ఆటంకాలు ఎదురవుతున్నట్లు. ఇక తరచుగా చెప్పులు మార్చడానికి కూడా ఒక అర్థం ఉంది. మనం ఏర్పర్చుకున్న అభిప్రాయాల్లో స్థిమితం కోల్పోవడాన్ని సూచిస్తుంది. చాలామందికి ఎక్కువగా వచ్చే కల... చెప్పులు పోవడం! ఒక దేవాలయంలోకి వెళ్లివస్తాం. బయట విడిచిన చెప్పులు కనిపించవు. ఏదో విందుకు హాజరవుతాం. బయట అందరి చెప్పులు ఉంటాయి... మన చెప్పులు కనిపించవు... ఇలా చాలా సందర్భాల్లో మన చెప్పులు మిస్ అవుతూ ఉంటాయి. ఇలా మాయం కావడం వెనుక ఏదైనా అర్థం ఉందా? ఉందనే అంటున్నాయి రకరకాల స్వప్నవిశ్లేషణలు. ముఖ్యకారణం చెప్పుకోవాల్సి వస్తే మనలోని ‘అతి జాగ్రత్త’ను, దాని గురించే చేసే పదేపదే ఆలోచన పరంపరకు ఇది అద్దం పడుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోవడం, లేని ప్రమాదాన్ని ఊహించుకునే సందర్భాల్లో కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. -
అగ్నిశక్తి!
వారి చేతల్లో శక్తిసామర్థ్యాలు కనిపిస్తాయి. వారి మాటల్లో పట్టుదల ప్రతిధ్వనిస్తుంది. ఇటీవలే జార్ఖండ్‌లోని కాన్కెర్ జిల్లాలో ‘సిటిజెడబ్ల్యూసి’(కౌంటర్ టైజం అండ్ జంగిల్ వార్ఫేర్ కాలేజీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న 44 మంది మహిళలతో మాట్లాడితే నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో మాట్లాడినట్లే అనిపిస్తుంది. ఇందులో చాలామంది మహిళలు గ్రామాలు, పేదకుటుంబాల నుంచి వచ్చిన వారే. నలభై అయిదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకొని ‘కమెండో’ సర్టిఫికెట్ తీసుకున్న ఒక మహిళా ఆఫీసర్‌ను కదిలిస్తే-‘‘అడవిలోని గెరిల్లాలతో గెరిల్లాగా పోరాడడానికి మాలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు’’ అన్నారు. నాయకత్వ లక్షణాలలాంటి మానసిక విషయాలతో పాటు లైట్ మెషిన్ గన్స్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్, ఎకె-47 రైఫిల్స్, అండర్-బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్, మోర్టార్స్, లైట్ వెపన్స్, హ్యాండ్గ్రానేడ్స్... తదితర అంశాల్లో ఆయుధశిక్షణ తీసుకున్నారు మహిళా కమెండోలు. - ‘‘నేను శ్రీమతి సరస్వతి నిషాద్ నుంచి కమెండో నిషాద్గా మారిపోయాను’’ అన్నారు ఇరవై ఆరు సంవత్సరాల సరస్వతి గర్వంగా. - సరస్వతి మాత్రమే కాదు మిగిలిన 43 మంది కూడా తమను తాము కొత్తగా చూసుకుంటున్నారు. - ‘సబల’ అని నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కృతజ్ఞతాభివందనాలు శనివారం... హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జెఆర్సి కన్వెన్షన్ హాలులో సాక్షి మీడియా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ‘ఉమెన్స్ డే సెలబ్రేషన్స్’లో భాగంగా వివిధ విభాగాలకు సంబంధించిన పురస్కారాలను (అమ్మ, అర్ధాంగి, మహిళా రైతు) ‘ఉమెన్స్ వరల్డ్’ సమర్పించి, సహాయసహకారాలను అందించింది. వీరితోపాటు 91.1 ఎఫ్.ఎం. రేడియో సిటీ, జెఆర్సి కన్వెన్షన్స్ అండ్ ట్రేడ్ ఫేర్స్, నేచురల్స్ (ఇండియాస్ నెం.1 హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్), అనూస్... వేడుకల విజయానికి తమవంతు తోడ్పాటు అందించారు. వీరందరికీ ‘సాక్షి’ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తోంది. -
ఐష్‌లా కనిపించాలని ఆశ
కాస్త అందం.. దానికి తగ్గట్టుగా ఆత్మవిశ్వాసం ఉంటే బ్యూటీ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవచ్చంటోంది.. మిస్ సుప్ర నేషనల్ ఆశాభట్. కూకట్‌పల్లిలోని సుజనామాల్ మేబాజ్ ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్‌ను శుక్రవారం లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో తళుక్కుమన్న ఆశాభట్తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి 2014 ఎప్పటికీ మరచిపోలేను. ఈ నెల 5న నేను ‘మిస్ సుప్ర నేషనల్’గా ఎంపికయ్యాను. ఏషియా నుంచి ఈ కిరీటం దక్కించుకున్న తొలి వనితను నేనే కావడం గర్వంగా ఉంది. మా సొంతూరు కర్ణాటకలోని భద్రావతి. నా స్కూలింగ్ అంతా అక్కడే సాగింది. పూణెలో ఇంటర్ చేశాను. ప్రస్తుతం బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నా. చిన్నప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. ఆమెలా అందాలరాణిని కావాలని ఆశ పడేదాన్ని. ఇంటర్‌కొచ్చాక నా కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేశాను. నా పేరెంట్స్ సపోర్ట్‌తో.. ఈ అందాల కిరీటం దక్కించుకున్నాను. అమ్మాయిలకే స్కోప్.. అన్నింటా అబ్బాయిలే పై చేయి అనుకుంటారు. ఆడవాళ్లూ ఎందులోనూ తక్కువకాదు. ఏదైనా సాధించడంలో అమ్మాయిలకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. నేను ఈ విషయాన్ని గట్టిగా నమ్మాను, కృషి చేశాను.. గెలిచాను. చిన్నప్పుడు నేను సరదాగా అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను. ఒక ఐఏఎస్ కావాలన్నా, లాయర్ కావాలన్నా.. ఎంత కష్టపడాలో, ఈ బ్యూటీ ఫీల్డ్‌లో రాణించాలంటే అంతకు మించి కృషి చేయాలి. ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా అందుకు ప్రిపేర్ అయి ఉండాలి. కాన్ఫిడెంట్ ఉంటే రావొచ్చు.. ప్రతి రోజు ఉదయం 4.30 గంటలకు లేచి గంట పాటు యోగా, తర్వాత రెండు గంటలు జిమ్, ఎరోబిక్స్, ఈవెనింగ్ ఒక గంట బ్రిస్క్ వాకింగ్ చేసేదాన్ని. నాకు ట్రైనర్ ఉన్నా, ఎంకరేజ్మెంట్ కోసం అమ్మ కూడా నాతో పాటు పోటీపడి మరీ వాకింగ్ చేసేది. నా బాడీ ఇంత ఫిట్‌గా ఉండటానికి యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. డైట్ అంటే ఉపవాసం చేయడం కాదు. మూడు గంటలకొకసారి సలాడ్స్, గ్రిల్డ్ శాండ్విచ్, మాల్ట్, సింపుల్ ఫుడ్ ఇలా అన్ని రకాలూ తిన్నాను. కానీ ఆయిల్, ఫ్యాట్ ఉండే ఫుడ్‌కు మాత్రం దూరంగా ఉండేదాన్ని. ఇంతగా కృషి చేస్తేనే ఈ కిరీటంతో మీ ముందు నిలవగలిగాను. టీనేజర్స్‌కు నేను సజెస్ట్ చేసేది ఒక్కటే.. బ్యూటీఫీల్డ్లో అగ్రస్థాయిలో నిలబడగలమన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటే ఈ ఫీల్డ్‌ను మీ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. నేను హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. చాలా కంఫర్ట్‌గా ఉంది. లాస్ట్ ఇయర్ బిజీ షెడ్యూల్‌తో ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. న్యూ ఇయర్లో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నా. ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
7th సెన్స్‌ను మేల్కొలపండి...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలుదీరింది...ఇక కొలువుల ప్రక్రియ మొదలు కానుంది. ఉద్యోగ ప్రకటనలు త్వరలో రాగలవనే సమాచారం నిరుద్యోగుల్లో కొండంత ఆశలను రేకెత్తిస్తున్నాయి. దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనుండటం అరుదైన విషయమే. ఈ సమాచారంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులే దర్శనమిస్తున్నారు. ఇదే సమయంలో ఈ పోటీలో మేం సాధించగలమా? అన్న ప్రశ్న వేలాది మందిని వేధిస్తోంది. కానీ మనిషి అనుకుంటే సాధించలేనిదేమి లేదు. మన పంచేంద్రియాలు(జ్ఞానేంద్రియాలు) రోజు వారీ పనులను చక్కబెడతాయి...ఆపద నుంచి బయటపడేసేది సిక్త్‌సెన్స్...కానీ మనకు గతంలో పరిచయం, ఊహించని శక్తి దాగివుందని తెలిపేది ‘సెవెంత్ సెన్స్ ’ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు సరిగ్గా దాన్ని నిద్ర లేపాల్సిన తరుణమిదే. * సంశయం వీడి ముందుకు సాగండి * ఆత్మ విశ్వాసం ఉంటే ఉజ్వల భవిత మీదే నల్లగొండ అర్బన్: మూడేళ్ల క్రితం విడుదలైన సెవెంత్‌సెన్స్ సినిమా గుర్తుందా...అందులో 1600 ఏళ్ల క్రితం జీవించిన బోధిధర్ముడిని తిరిగి రప్పించటం ఆ సినిమా కథాంశం. కాకపోతే అది జన్యు నిర్మాణం(జెనెటిక్ ఇంజినీరింగ్). మనం ఎంచుకున్న లక్ష్యాని కనుగుణంగా మానసికంగా తమనితాము తీర్చిదిద్దుకోవడం భవిష్యత్ నిర్మాణం... ఇది మరో సెవెంత్ సెన్స్. వ్యక్తి మేధస్సుపై 15 నుంచి 20 శాతం లక్షణాల్లోనే అతని వంశపారం పర్య ప్రభావం ఉంటుందట. మరో 15 నుంచి 20శాతం వరకు పరిసరాలు అతన్ని ప్రభావితం చేస్తే మిగతా 60 నుంచి 70 శాతం మాత్రం వ్యక్తి సొంత నిర్ణయంపైనే ఆధారపడి జీవితం సాగుతుందట. అందుకోసం మానసికంగా ముందు సిద్ధమవ్వాలని హార్వార్డ్ పరిశోధకులు చానాళ్ల క్రితమే తేల్చారు. ముందుకు సాగాలి ఇలా... ఏ ఉద్యోగాన్ని ఇష్టపడుతున్నారో ముందు స్పష్టత ఉండాలి. ఆ రంగంలో రాణించిన ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలి. జెనెటిక్ ఇంజి నీరింగ్ ద్వారా వారి జీన్స్‌ను మీకు ఎక్కించడం సాధ్యమయ్యే(ఇప్పటికైతే) పనికాదు కాబట్టి వారు సాధిం చిన విజయాలు, వృత్తిలో ముందుకెళ్లిన తీరును మీకు మీరు ఆపాదించుకోవాలి. ఉదాహారణకు పోలీసు కావాలనుకుంటున్న వారు, ఆ శాఖలో పేరు ప్రఖ్యాతలు సాధించిన కిరణ్‌బేడి లాంటి వారిని ఆదర్శంగా భావించాలి. అలా ఆయా రం గాల్లోని వారిని ఆదర్శంగా తీసుకుని వారి తీరును గుర్తు చేసుకోవాలి. అదే బాట లో పయనించాలనే మీ లక్ష్యానికి పట్టుదలతో పదును జోడించాలి. అదే భవిష్యత్ నిర్మాణానికి పునాది వేస్తుంది. 1 ఆత్మ పరిశీలన పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు.వారి బలం, బలహీనతలపై ఆత్మ పరి శీలన చేసుకోవాలి. వాటిని ఎప్పటికపుడు ఓ పుస్తకంలో రాసుకుని అధిగమించేందుకు కృషి చేయాలి. 2 అనుకూల పరిసరాలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. తప్పదనుకుంటే వాయిస్‌మెయిల్ ఆన్ చేయాలి. మరీ ఇబ్బందిని అనిపిస్తే నంబర్లు మార్చండి. ఉదయం అరగంట పాటు యోగా, వ్యాయామం చేయాలి. 3 పాజిటివ్ థింకింగ్ చాలా మంది తమ బలాలను గుర్తించరు. పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు గొప్ప విషయాలను చెప్పేవారు, పరీక్షా కేంద్రంలో తడబడతారు. పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. బలాన్ని ద్విగుణీకృతం చేసే యత్నం చేయాలి. 4 ఒక్క అడుగుతోనే మొదలు.. కొండంత సిలబస్‌ను చూసి బెంబేలు చెందొద్దు. ఒకేరోజు అంతా పూర్తిచేయడం ఎవ్వరికి సాధ్యం కాదు. వేయి మైళ్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలుపెడతాం. అలాగే ఎంత పెద్ద సిలబస్ అయినా చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని, చదివినదాన్ని పునఃశ్చరణ చేయాలి. తర్వాత వీలుంటే వాటిని కాగితంపై పెట్టాలి. సమాధానాలతో సరిపోల్చుకోవాలి. అప్పుడే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. 5 నెగెటివ్ ఆలోచనలొద్దు కొందరు ప్రిపరేషన్‌ను బాగానే కొనసాగిస్తుంటారు. ఒకటి, రెండు లక్ష్యాలను చేరుకోలేకపోయేసరికి ఢీలా పడతారు. ఇతరుల కంటే వెనుకబడ్డామనే ఆలోచన వచ్చిందంటే ఇక అంతే వెనుకబడిపోతారు. అది తప్పుడు ఆలోచన. ఎవరు ఎక్కువ చదివారన్నది పోటీ పరీక్షలకు సంబంధం లేదు. ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వగలిగామా అన్నదే ప్రధానం. 6 ఆత్మవిశ్వాసం ఇలాంటి లక్షణాలన్నీ మీరు ఆపాదించుకోవాలంటే ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సాధించాలనే కాంకక్ష ముఖ్యం. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో సలడనీయవద్దు. వేళకు తీనేలా, పడుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక సక్కెస్ మీదే...విష్యూ ఆల్‌ది బెస్ట్. 7 విజేతలతో జట్టు కట్టాలి సంకుచిత ఆలోచనలు మనిషి వెనక్కులాగుతాయి. సానుకూల ఆలోచనలు అంతే ముందుకు తీసుకెళ్తాయి. ఇది వరకు పోటీ పరీక్షల్లో విజయవం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటే ధైర్యం కలుగుతుంది. వీలయితే వారి సూచనలు, సలహాలు స్వీకరించాలి. వారి అనుభవం మీ లక్ష్యాన్ని విజయ పథాలకు తీసుకెళ్లగలదు. -
ఈ వారం మేటి చిత్రాలు
-
ఆత్మవిశ్వాసం తోడుగా...
పాలమూరు : గ్రామీణ నేపథ్యం.. తనదీ వ్యవసాయ కుటుంబమే.. చిన్నప్పటి నుంచి తరగతిలో మంచి మార్కులు సాధిస్తూ.. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు. మామూలు స్థాయినుంచి జిల్లా రెవెన్యూ శాఖ అధికారిగా ఎదిగారు రాంకిషన్. ఆత్మవిశ్వాసంతో ఉన్నతస్థాయికి చేరిన ఆయన నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి. విద్యార్థి దశలోనే ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోనప్పటికీ.. డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత చదువులపై ఆసక్తి కలగడంతో లాకోర్సు పూర్తిచేసి లాయర్‌గా స్థిరపడాలని భావించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దారుగా కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు డీఆర్వో స్థాయికి చేరుకోగలిగారు. తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారో.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కుటుంబ నేపథ్యం ‘‘మా నాన్న మస్త్యాల జగదీశ్వర్.. అమ్మ రామమ్మ.. మాది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి. వ్యవసాయ కుటుంబం. ఒకప్పుడు ఆస్తులు బావుండేవి. అనుకోని పరిస్థితుల్లో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో నేను లా కోర్సు పూర్తి చేయకుండా తక్షణం ఉద్యోగం పొందాలన్న ఉద్ధేశంతో ఎంబీఏ కోర్సు పూర్తిచేశా. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దారుగా చేరా. అయినా.. ఆత్మ విశ్వాసం సడలకుండా.. ఉద్యోగంలో చేరాక కూడా లా కోర్సు పూర్తిచేశాను. దీంతో సివిల్స్ పరీక్షలకు హాజరై మూడుసార్లు మెయిన్స్ అర్హత పొందాను. కుటంబ పరంగా ఆర్థిక స్థోమత ఉంటే.. పూర్తిస్థాయిలో సివిల్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉండేది. ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. పరీక్షలకు సిద్ధం కావడంతో అనుకున్న విధంగా మార్కులు సాధించలేకపోయాను’’. మా అన్నే నాకు స్ఫూర్తి ‘‘చిన్నప్పటి నుంచి నేను చదువుల్లో బాగా రాణించగలిగానంటే మా అన్న విజయ్‌కుమార్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన కష్టపడి చదివే వ్యక్తి. దీంతో ఆయనను అనుసరిస్తూ చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్లే విజ్ఞానాన్ని పెంచుకోగలిగాను. అంతేకాకుండా ఇంటర్, డిగ్రీ కామారెడ్డిలో చదివాను. అక్కడ రోజూ గ్రంథాలయానికి వెళ్లడం, పత్రికలు, రామాయణ, మహాభారతం, పంచ కథలు వంటివి చదవడం వల్ల తెలుగు భాషపై పట్టు సాధించగలిగాను. దీంతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పొందడంతో తోటివారిని మార్గదర్శనం చేస్తూ రెవెన్యూశాఖలో ఓ ప్రత్యేక గుర్తింపుతో డీఆర్వోగా పనిచేయగలుగుతున్నాను’’. ఊహించని సందర్భాలు నేను ఇలా కావాలని ఎన్నడూ కలలు కనలేదు. సమాజం కోసం పాటుపడాలన్న సంకల్పం వల్ల జీవితంలో ఊహించని సందార్భాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానం.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత చదువులపై దృష్టి పెట్టకుండా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. 1985లో తహశీల్దారుగా ఎంపికయ్యాను. 1986లో శిక్షణ పూర్తి చేసుకుని 1987లో మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు తహశీల్దారుగా చేరాను. 2002లో జడ్చర్ల తహశీల్దారుగా పనిచేస్తుండగానే డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతితో హైదరాబాద్ హుడాకు బదిలీ అయ్యాను. హుడా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కోర్టులో చాలా కేసులు నమోదయ్యాయి. వాటి పరిష్కారాన్ని నన్ను ప్రత్యేకాధికారిగా నియమించారు. దీంతో కేసుల పరిష్కారానికి ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా సుప్రీం కోర్టు అడ్వకేట్లు చాలామందితో నాకు సన్నిహితం ఏర్పడింది. సుప్రీంకోర్టు న్యాయవాది కె.కె.గోపాల్ నన్ను పిలిచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించడంలో గంటలో అఫిడవిట్ సిద్ధం చేశాను. ఆ అఫిడవిట్‌తో కోర్టులో కేసు గెలవడం ఎన్నో కేసులకు పరిష్కారం దక్కింది. రెండేళ్ల 5నెలల కిందట డీఆర్వోగా పాలమూరు జిల్లాకు బదిలీపై వచ్చాను. నడిచి వెళ్లే వాణ్ణి ‘‘1987లో తహశీల్దారుగా ఉద్యోగంలో చేరినప్పుడు మాకు ప్రభుత్వ వాహనాలు ఉండేవి కావు. నాకు సొంతంగా స్కూటర్ కూడా లేదు. దీంతో నేను మొదట పనిచేసిన వంగూరు మండలంలో బస్రూట్ ఉన్న గ్రామాలకు బస్సుల్లో వెళ్లడం, లేదంటే కాలినడకన ఆయా గ్రామాలకు వెళ్లేవాణ్ణి’’. జిల్లా పురోగతి సాధించాలి 17 ఏళ్లకుపైగా పాలమూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ఈ జిల్లాతో నాకెంతో అనుబంధం ఏర్పడింది. జిల్లాలో చాలామంది తాగుడుకు బానిసలు కావడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అంతే కాకుండా అక్షరాస్యత కూడా సాధించాల్సిన అవసరముంది. జిల్లాలో మానవ వనరులు పెరగాలి. అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాకు 20 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎంతో అవకాశం ఉంది. పరిశ్రమలు అధికంగా వస్తే జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుంది. -
యువతే దేశానికి సంపద
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆత్మ విశ్వాసం కలిగిన యువతే దేశానికి సంపద అని, విద్యార్థి దశనుంచే మంచి గుణాలు అలవర్చుకోవాలని 8-ఏ బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ సునీత్ ఇస్సార్ అన్నారు. 8-ఏ బెటాలియన్ ఎస్సీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత దేశభక్తిని పెంపొందించుకొని అల్లకల్లోలాలు లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు. సత్యం, అహింస విధానాల్లో నడిచి సమాజానికి మార్గదర్శకులు కావాలన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించారు. రైఫిల్ ఫైరింగ్‌పై మెళకువలు నేర్పించారు. ఫైరింగ్ వలన క్యాడెట్లలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, సమయపాలన, ధైర్యం అలవడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 100 మంది క్యాడెట్లు 550 రౌండ్లు ఫైరింగ్ చేశారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుడెంట్ బి.రఘు, ఎన్సీసీ అధికారులు ఎండీ ఇబ్రహీం, విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, క్యాంప్ సుబేదార్ మేజర్ రవిదత్శర్మ, క్యాంప్ సూపరింటెండెంట్లు రమణ, జనార్దన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
55 రోజులు 17 వేల కిలోమీటర్లు
విశాఖపట్నం... లాసన్స్‌బే కాలనీలోని ‘బేక్ మై విష్’ కాఫీ షాప్. ముగ్గురు మిత్రులు కాఫీ సిప్ చేస్తున్నారు. ‘బైక్‌పై లాంగ్ రైడ్ చేస్తా... మీరొస్తారా?’ తాగేసిన కాఫీ కప్పును టేబుల్‌పై పెడుతూ అన్నాడు కిషోర్... ‘వావ్... సూపర్బ్ ఐడియా.. వియార్ రెడీ... ఎన్నాళ్లు... ఎక్కడికెళ్దాం?... ఎప్పుడొద్దాం?’... బుల్లెట్ స్పీడ్‌తో ప్రశ్నించారు కర్ణ రాజ్, సుధీర్. ‘ఫ్రం హోం.. టు హోం... వయా ఇండియా. ఇంటి నుంచి బయల్దేరాలి. భారతదేశాన్ని క్లోజప్‌లో చూడాలి. రెండు నెలల్లో ఇంటికి రావాలి’... ప్లాన్ వివరించాడు కిషోర్. ‘ఓకే డన్..’ అన్నారు కర్ణ రాజ్, సుధీర్. ముగ్గురూ బైక్‌లపై దూసుకుపోయారు. కన్యాకుమారిలో అందమైన సాయం త్రం. హిమాలయాల్లో రక్తం గడ్డ కట్టే చలితో సహవాసం. లేహ్‌లో మంచువానలో స్నానం. కొండచరియలు విరిగిపడుతున్నా చెదరని ఆత్మవిశ్వా సం. సైనికుల బంకర్లలో ఆతిథ్యం. ఇన్ని అనుభవాలు మిగిల్చిన ఆ దూరం అక్షరాలా 17 వేల కిలోమీటర్లు... 55 రోజులు. విశాఖపట్నం నుంచి సుదూర యాత్ర... బైక్‌పై సుదూర యాత్ర చేయాలన్నది కిషోర్ చిరకాల వాంఛ. దీనికి కర్ణ, సుధీర్ తోడయ్యారు. రెండు నెలల సెలవుకు కర్ణ, కిషోర్ దరఖాస్తు చేశారు. వాళ్ల బాస్‌లు కుదరదన్నారు. అంతే... ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. జూన్ తొమ్మి దిన.. కిషోర్, కర్ణ, సుధీర్ బైకుల్ని సిద్ధం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బైక్ యాత్ర మొదలైంది. మూడోరోజు ఉదయానికి ముగ్గురూ చెన్నై చేరుకున్నారు. అక్కడ చెన్నై బుల్స్ (బుల్లెట్ రైడర్స్) అసోసియేషన్ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ముగ్గురూ మర్నాడు బయల్దేరి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఒకరోజు ఉండి మర్నాడు కొచ్చిన్ మీదుగా వయనాడ్ జిల్లా కల్పెట్టా చేరుకున్నారు. అప్పుడే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఆహ్లాదకర వాతావ రణంలో కల్పెట్టాలో రెండ్రోజులు హాయిగా గడిపారు. ఒకప్పటి వీరప్పన్ సామ్రాజ్యం మీదుగా... అప్పుడే కర్ణ రాజ్ ఓ ఐడియా చెప్పాడు. హైవేపై జర్నీ బోర్ కొడుతోంది.... ఘాట్ రోడ్ అయితే మజా ఉంటుందన్నాడు. వెంటనే ముగ్గురూ కర్ణాటక వైపు బయల్దేరారు. బండిపురా చందనపు అడవుల్లోంచి సాగిపోయారు. ఒకప్పుటి చందనం స్మగ్లర్ వీరప్పన్ సామ్రాజ్యమది. అడవి అందాలను తిలకిస్తూనే మైసూరు మీదు గా బెంగళూరు చేరారు. అక్కడ మూడు రోజులుండి హైదరాబాద్, అటు నుంచి మహారాష్ట్రకు వెళుతూ సాగర్‌కు సమీపంలో ఓ దాబా దగ్గర టీ తాగారు. బాగా అలసిపోవడంతో ఆ దాబాలోనే ఆ రాత్రి నిద్రపోయారు. ‘ఓ రాత్రంతా ఉన్నా మని అద్దె డబ్బులివ్వబోతే దాబా యజమాని పండిట్జీ తీసుకోలేదు. ఆయన చూపిన అభిమానాన్ని మరిచిపోలేం’ అన్నాడు కర్ణ రాజ్. జీరో మైల్స్టోన్ నాగపూర్ పట్టణంలో నుంచి వెళ్తున్నప్పుడు ఓ స్థూపం కనిపించింది. దాన్ని జీరో మైల్స్టోన్ అంటారు. ఇది ఇండియాకు సెంటర్ పాయింట్. నాగపూర్ దాటాక షజాపూర్‌లో ఆగారు. ఆ ఊరి మీదుగా కర్కాటక రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్) వెళ్తోంది. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ముగ్గురు బైకర్లూ ఆగ్రా, ఢిల్లీ, కర్నాల్ మీదుగా చండీగఢ్ చేరుకున్నారు. చండీగఢ్ పట్టణంలో బైకులకు క్లచ్ వైరును టైట్ చేయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చల్లని వాతావరణంలో సేదదీరారు. అడుగడుగునా తనిఖీలు మనాలీ నుంచి శ్రీనగర్ వైపు బైకులు బయల్దేరాయి. అక్కడి నుంచే అసలైన ప్రయాణం మొదలు. హిమాలయాల్లో ఎత్తయిన కచ్చా రోడ్లపై ప్రయాణం అతి కష్టం. సాయంత్రానికి తండి అనే ప్రాంతం చేరుకుని, అక్కడి పెట్రోల్ బంకులో బైకుల ట్యాంకుల్ని నింపుకొన్నారు. తండి తర్వాత 360 కిలోమీటర్ల వరకూ పెట్రోల్ బంకు లేదు. ముప్ఫయ్, నలభై కిలోమీటర్లకు ఒక ఆర్మీ పోస్టు ఎదురయ్యేది. వివరాలన్నీ సరిపోతేనే ముందుకు పంపేవారు. దారి పొడవునా కొండచరియలు విరిగిపడేవి. ఆర్మీకి చెందిన బీఆర్వో (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) సిబ్బంది ప్రొక్లయినర్లతో రాళ్లను తొలగించాక ముందుకు కదిలేవారు. ఇంచుమించు రోజూ వర్షం. దానికితోడు చలి గాలి. రక్తం గడ్డ కట్టుకుపోయేది. ‘ఆ సమయంలో ఆర్మీ అధికారులు, జవాన్ల ఆతిథ్యం అద్భుతం. ఏమైనా సాయం కావాలా? అని స్నేహపూర్వకంగా అడిగేవార’ని కిషోర్ చెప్పాడు. ఆర్మీ బంకర్లో ఓ రాత్రి కిల్లార్ నుంచి కిష్ట్వార్ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపించింది. ఒకరోజు రాత్రిపూట ఓ ఆర్మీ చెక్‌పోస్టు వద్ద ఆగారు. అక్కడి అధికారి బైకర్ల వివరాలు తెలుసుకున్నారు. ముందు రోడ్డు బాగా లేదనీ, అంతకుముందే ఓ వాహనం లోయలో పడిపోయి 18 మంది చనిపోయారనీ చెప్పారు. తర్వాత వచ్చే ఆర్మీ పోస్టు బంకర్లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకోమని చెప్పి... వెంటనే అక్కడి అధికారితో వైర్లెస్ సెట్లో మాట్లాడాడు. ‘ముగ్గురం అష్టకష్టాలు పడుతూ గంట తర్వాత సింతన్ మైదాన్ చెక్‌పోస్టుకు చేరుకున్నాం. మా కోసం అప్పటికే రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ ఆర్మీ అధికారిని చూసి ఆశ్చర్యపోయాం. అతను వేడిగా చపాతీలు, బంగాళదుంప కూరతో భోజనం పెట్టారు. బంకర్లో వెచ్చగా నిద్రపోయాం. ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేం’ అన్నారు సుధీర్. జై జవాన్ నాలుగు రోజుల ప్రయాణం తర్వాత శ్రీనగర్, ద్రాస్ మీదుగా కార్గిల్ వార్ మెమోరియల్‌ను చేరుకున్నారు. ‘అమర జవాన్ల త్యాగాలు గుర్తొచ్చి, మా మనసంతా బరువెక్కిపోయింది. నివాళులర్పించి వెనక్కి వచ్చామ‘ని కర్ణరాజ్ చెప్పాడు. లేహ్ నుంచి 48 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రవాణా మార్గం కర్దూంగ్లా పాస్, అటు నుంచి భారత్-పాక్ సరిహద్దుల్లోని త్యాక్షి చేరుకుని టెంట్లలో బస చేశారు. కిరోసిన్ ఇచ్చి ఆదుకున్న ఆర్మీ అధికారి త్యాక్షి నుంచి ముగ్గురూ సియాచిన్‌కు ముందున్న ససోమా ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. ఇది భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో ఉంది. ‘అప్పటికి మా బైకుల్లో పెట్రోల్ తక్కువగా ఉంది. వెంటనే ఆర్మీపోస్టు అధికారి ప్రతాప్‌సింగ్ లీటర్ పెట్రోల్, ఏడు లీటర్ల కిరోసిన్ ఇచ్చారు. మేం దాన్నే జాగ్రత్తగా వాడుకుంటూ హుండర్, లేహ్ మీదుగా సాగిపోయాం’ అన్నాడు కర్ణరాజ్. లేహ్ నుంచి మనాలీ వైపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ప్యాంగాంగ్ లేక్ చేరుకున్నారు. ఇది భారత్‌లో 48 కిలోమీటర్లు, టిబెట్‌లో 58 కిలోమీటర్లు, చైనాలో 50 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ‘ఈ లేక్ శీతకాలంలో పూర్తిగా గడ్డ కడుతుంది. ఆ సమయంలో జీపులో సరస్సుపై నుంచి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి చైనా పోస్టులు కనిపిస్తాయి’ అని కిషోర్ చెప్పాడు. త్సోమొరారీ, హన్లే లేక్‌లను కూడా చూశాక ముగ్గురూ మనాలీ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. రెండు మార్గాల్లో యాత్ర ముగింపు ఢిల్లీ చేరాక యాత్రలో స్వల్ప మార్పులు చేశారు. కర్ణ రాజ్ లక్నో, పాట్నా, కోల్‌కతా మీదుగా, కిషోర్, సుధీర్‌లు హైదరాబాద్ మీదుగా విశాఖ రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం బయల్దేరారు. ఎప్పటికప్పుడు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆగస్టు 3న ముగ్గురూ ఒకేసారి విశాఖపట్నం చేరుకున్నారు. - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఏం పోగొట్టుకున్నామో తెలిసింది! ‘‘యాత్ర పూర్తయ్యేసరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చయింది. కానీ మేం పొందిన ఆనందం ముందు అదెంత? ఎన్నో జీవితాలను దగ్గర నుంచి చూశాం. ప్రకృతి అందాన్నీ... ఆగ్రహాన్నీ కూడా చవిచూశాం. ఎందరో మంచి స్నేహితులయ్యారు. మా సుదీర్ఘయాత్రలో మేమెక్కడా పర్యావరణానికి హాని కలిగించలేదు. బిస్కెట్లు, చాక్లెట్ల రేపర్లను ఎక్కడపడితే అక్కడ పారేయలేదు. ప్రకృతి లేకుండా మనుగడ లేదని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాం. ఇన్నాళ్లూ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో తెలుసుకున్నాం. మా జీవితాల్లో ఇంతకన్నా మించిన ఆనందం లేదని మనసారా నమ్ముతున్నాం. మా యాత్ర గురించి చదివిన కుర్రాళ్లు ఉత్సాహంతో దుస్సాహసాలు చేయొద్దని మనవి. మేమెంతో ప్రణాళికాబద్ధంగా... అంతకు మించిన అనుభవంతో సాగిపోవడం వల్లే యాత్ర విజయవంతమైంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.’’ - సాహస బైకర్లు కిషోర్, కర్ణ, సుధీర్ -
నా పథం ప్రగతి పథం
డాక్టర్ శరత్... ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు ఏడు పత్రాలు ఏకకాలంలో అందించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడిన ఐఏఎస్. ప్రజలు అండగా నిలబడితే చాలు.. కొండనైనా ఢీ కొట్టి సంక్షేమ పథకాలను నేరుగా పేదింటికి చేరవేస్తానే ఆత్మవిశ్వాసం ఆయనది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా.. అన్నింటికీ మించి రాజకీయ చైతన్యం ఉన్న మెతుకుసీమ ఫుల్చార్జి సంయుక్త కలెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు మోస్తున్నారు. మా రాష్ర్టం.. మా పాలన అంటూ ఫుల్‌జోష్ మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా ఇరువురినీ బ్యాలెన్స్ చేస్తూ సర్కారు బండిని నడిపిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్నదే తన లక్ష్యమంటున్న డాక్టర్ శరత్‌తో ‘సాక్షి’ప్రతినిధి ముఖాముఖి. సాక్షి: జిల్లాలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయా? ఏ ప్రాతిపదికన వాటిని ఏరివేస్తున్నారు? కలెక్టర్: 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్యను నిర్ధారించాం. ఈ లెక్కన చూసినపుడు గ్రామీణ ప్రాంతంలో 5 శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. సాక్షి : ఆధార్ కార్డుకు, రేషన్‌కార్డుకు లింక్ పెడతారా? కలెక్టర్: కచ్చితంగా. ఆధార్‌తో అనుసంధానం చేయని కార్డులను మొదటి సారే బోగస్ కార్డులుగా పరిగణిస్తాం, గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తాం. కార్డులో పేర్లు ఉన్న వ్యక్తులు ఉండి, ఆధార్‌తో అనుసంధానం కాని కార్డులకు కూడా మరో అవకాశం కల్పిస్తాం. అంతేకాకుండా వారికి ఆధార్ కార్డు అందేలా మేమే సపోర్టు చేస్తాం. సాక్షి: బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ఎలా ఉంటుంది? కలెక్టర్: ఈనెల 4 నుంచి 15 తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఆగస్టు 15 లోపు ఈ బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తాం. ఒక ఇంట్లో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయో చూస్తాం. కార్డుల్లో నిర్ధారించిన కుటుంబాలు, వ్యక్తులు ఉన్నారో..లేరో చూస్తాం. తప్పుడు సమాచారంతో కార్డులు పొందిన వారికి నోటీసులు ఇస్తాం. ఇక ఆ తర్వాత రెండు రకాల లిస్టులు తయారు చేస్తాం. అందులో ఒకటి పూర్తిగా బోగస్ కార్డుల లిస్టు , రెండవది మరణాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలతో కూడా మరో లిస్టు. వీఆర్ఓలు, డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేసి మా దగ్గర బోగస్‌కార్డులు లేవు అని నిర్ధారణ పత్రం కూడా రాయించుకుంటున్నాం. అనంతరం ఏరివేత షురూ చేస్తాం. సాక్షి: రేషన్‌కార్డుల ఏరివేతతో ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? కలెక్టర్: నిజమైన లబ్ధిదారులకు ఏ మాత్రం అన్యాయం జరకుండా బోగస్ కార్డు ఏరివేత జరుగుతుంది. అందువల్లే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాదనే భావిస్తున్నాం. కొంత మంది ఉద్యోగుల వద్ద కూడా తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయని తెలిసింది. అలాంటి వారి వివరాలు వెంటనే తెలియజేయాలని కోరాం. సాక్షి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారా? కలెక్టర్: అవును.. వర్షాలు కురవకపోవటం కొంత ఇబ్బందిగానే ఉంది. వ్యవసాయ పంచాంగాన్ని అనుసరించి ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాం. కానీ దురదృష్టవశాత్తు సకాలంలో వానలు కురవటం లేదు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించాం. జూన్ 15 వరకు ఇంకా సమయం ఉందని వారు చెప్పారు. అప్పటి వరకు వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులను అందించేందుకు యంత్రాగం సిద్ధంగా ఉంది. సాక్షి: హరీష్‌రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఆయన నియోజకవర్గంలో ఒక ప్రయోగం చేశారు కాదా? కలెక్టర్: ఓ... అదా..! అవును నిజమే. ఆరో ఫేజ్ భూ పంపిణీలో దాదాపు 3,500 ఎకరాలను పంపిణీ చేయడంతో పాటు లబ్ధిదారునికి ఏడు డాక్యుమెంట్లు ఒకేసారి ఇచ్చాం. దాన్ని ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే (అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు) ప్రయోగాత్మకంగా అమలు చేశాం. అసైన్డ్ చేసిన తర్వాత భూమి చూపించలేదని, పాసు బుక్కులు, టైటిల్ డీడ్, సర్వే మ్యాప్, పహణీ రాలేదనే ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చేశాం. దాన్నే రాష్ట్రమంతటా కూడా అనుసరించారు. సాక్షి: ఇంకా ఏమైనా చేశారా? కలెక్టర్: ప్రభుత్వ భూముల వివరాలను గ్రామాల వారీగా సర్వే నంబర్ల ప్రకారం సర్వే చేసి రికార్డు చేశాం. వాస్తవానికి జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ఎక్కడ ఎంత భూమి కబ్జాకు గురైంది. ఏఏ భూముల మీద కోర్టుల్లో కేసులున్నాయి. ఏఏ భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి తదితర వివరాలను సేకరించి శాశ్వతంగా రికార్డు చేశాం. దీన్ని అప్పటి సీసీఎల్ఏ సీఎస్ మహంతి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి, ఈ విధానం బాగుందని మేం చేసిన ఫార్మాట్‌నే మిగతా జిల్లాలకు ఇచ్చారు. రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలను పరిష్కరించాం. అంతేకాకుండా సమస్య పరిష్కారమైనట్లు లబ్ధిదారులతో సంతకం కూడా తీసుకున్నాం. సాక్షి: వక్ఫ్ భూముల రికవరీ, పరిరక్షణ సాధ్యమేనా? కలెక్టర్: మంత్రి హరీష్‌రావు ఈ భూముల విషయంలో చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో మొదటి సర్వేలోనే 26 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు గుర్తించాం. రెండవ సారి సర్వే చేస్తున్నాం. మరో 8 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి తేలవచ్చు. అంటే దాదాపు 35, 36 వేల ఎకరాల వక్ఫ్ భూమి జిల్లాలో ఉంది. ముతవల్లి ప్రధాన ప్రజాసేవకులు. వక్ఫ్ భూమి వాళ్ల అజమాయిషీలోనే ఉంటుంది. ముందుగా పునఃపరిశీలన చేస్తాం. సర్వే నంబర్ వారీగా భూములు గుర్తించి ఒక గెజిట్ తీసుకొని వస్తాం. ఆక్రమణదారులను గుర్తించి ఆ భూములను పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: హరీష్‌రావు గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు కదా? జిల్లాలో మీరు ఏమైనా గొలుసుకట్టు చెరువులను గుర్తించారా? కలెక్టర్: నిజంగా గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తే పాత రోజులను మనం తిరిగి తెచ్చుకున్నట్టే. పాత రోజుల్లో చూస్తే ఒక చెరువు కింద ఆయకట్టు ఉండేది. చెరువు నిండి అలుగు పారితే... ఆ నీళ్లు మరో చెరువులోకి వెళ్లేవి... అది కూడా అలుగు పారితే మూడో కుంటలోకి ఇలా వాగో.. ఏరో కలిసేంత వరకు చెరువుల మధ్య ఈ గొలుసు సిస్టం కనిపించేది. ఇప్పుడు అలుగులు ఒకరు ఆక్రమిస్తే ... ఆయకట్టునూ మరొకరు చెరపెట్టారు. రెవెన్యూ రికార్డుల్లో ఏది అలుగు, ఏది ఆయకట్టో భద్రంగా ఉంది. వాటి ఆధారంగా చెరువు అలుగులు గుర్తించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేసి గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తాం. సాక్షి: మంత్రి హరీష్‌రావు మిమ్ములను ఆదర్శ కలెక్టర్ అని కీర్తించారు కదా..! ఎందుకని? కలెక్టర్: మొదటి నుంచి నాకు ఆఫీసులో గడపటం కంటే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమంటేనే ఇష్టం. అలా చేసిన పనులే పటిష్టంగా ఉంటాయి. అసైన్డ్ భూముల్లో లబ్ధిదారులకు పట్టాలిస్తారు. కానీ భూమి ఎక్కడుందోచూపించరు. భూమి చూపిస్తే పట్టాలివ్వరు. కొన్ని చోట్ల టైటిల్ డీడ్ ఇవ్వలేదు. సర్వే మ్యాపు ఇవ్వలేదు. నేను సర్వే చేయించి ఎస్సీ,ఎస్టీ భూముల్లో 2,58,116 సమస్యలను గుర్తించాం. వీటి పరిష్కారంలో ఎప్పుడూ మెదక్ జిల్లా చివరిలో ఉండేది. ఇప్పుడు మాత్రం మెదక్ జిల్లా సమస్యలన్నీ పరిష్కరించి మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా ఉంది. వీఆర్ఓలను ఐకేపీ సిబ్బందిని సమన్వయం చేసి ఈ సమస్యలపై విచారణ చేయించి పరిష్కారం చేశాం. పరిష్కార పత్రం కూడా ఇంటింటికి వెళ్లి ఇచ్చాం. సాక్షి: మీరు చేస్తున్న ఆకస్మిక పర్యటనలతో మంచి ఫలితాలు వస్తున్నా...ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది కాదా? కలెక్టర్: చెట్టుకు కాయలు ఉంటేనే రాయి విసురుతారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా పేదలకు అందాలి. బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ బిడ్డగా నా ప్రయత్నం నేను చేస్తాను. మా సిబ్బంది నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. నాకు సహకరిస్తారనే నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాను. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజారోగ్యం చాలా కీలకం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. ముందు ఆస్పత్రుల తీరు మెరుగుపరచాలి. కారణాలు ఏవైనా కావచ్చు...ఈ కాలంలో కూడ ఒక తల్లి రోడ్డు మీద ప్రసవించాల్సిన దుస్థితిని మనం అంగీకరించగలమా? కఠిన నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కొంత వ్యతిరేకత రావొచ్చు. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం నా నైజం కాదు. -
ఎడతెగని సేవా గుణం...
ఎనిమిది పదుల సాహస కోణం... ఆదర్శం హైదరాబాద్ నుంచి ఈజిప్ట్‌కి బయలుదేరిన విమానంలో పదిమంది భారతీయులు ఉన్నారు. వారంతా వారంరోజుల పాటు ఈజిప్ట్‌లో విహరించడానికి బయలుదేరారు. ఆ పదిమందిలో సీతా పెయింటాల్ ఉన్నారు. ఆమె తన బ్యాగ్‌లోంచి ఓ ఐపాడ్ తీసి మెసేజెస్ చెక్ చేసుకుంటూ రిప్లైలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చూసిన వారంతా ‘అంత పెద్దావిడ ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వాడటమా’ అని ఆశ్చర్యపోయారు. కాశ్మీర్ సిక్కు కుటుంబానికి చెందిన సీతా పెయింటాల్కి ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకున్నదీ అంతా ఢిల్లీలోనే. ఎం.ఏ. ఎకనామిక్స్ చదివి, నాలుగేళ్లపాటు లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. భారత నౌకాదళంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న దల్జీత్ సింగ్ పెయింటాల్తో వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి గృహిణిగా మారారు. ‘‘నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. వారి ఆలనపాలనలతోటే సమయమంతా గడిచిపోయేది. మా పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలంటే కష్టమనిపించి, బి.ఇడి. చేశాను. ఇప్పుడు మా పెద్దమ్మాయి డాక్టరు. రెండో అమ్మాయి సైకాలజీలో ఆనర్స్ చేసింది. అబ్బాయి ఐ.ఐ.టి. పూర్తయ్యాక హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎమ్.బి.ఏ, చేసి కెనడాలో స్థిరపడ్డాడు. మా వారి ఉద్యోగరీత్యా అనేక నగరాల్లోనే కాక ఇంగ్లాండ్‌లోనూ ఉన్నాం. ఆయన ఉద్యోగ విరమణ చేశాక ఢిల్లీలోనే స్థిరపడ్డాం’’ అని తన గురించి క్లుప్తంగా వివరించారు సీతా పెయింటాల్. కుటుంబ బాధ్యతలు చూసుకోవడమే కాకుండా, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం ప్రారంభించారు పెయింటాల్. మొబైల్ క్రష్‌లో... కార్మికుల పిల్లలకు విద్య, వైద్యం కోసం ఎన్నో సేవలు చేశారు. అంధ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి కోసం చరిత్ర, ఆర్థికశాస్త్రం మొదలైనవి తన గొంతులో రికార్డ్ చేసి వినిపించారు. అక్కడితో ఆగలేదామె. ప్రత్యేకించి క్యాన్సర్ బాధితులకు ఎన్నోరకాలుగా తన సేవలు విస్తరించారు. ఆమె అలా క్యాన్సర్ బాధితుల పక్షాన నిలవడానికి కారణం... ‘‘ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేస్తున్న మా చెల్లికి రొమ్ము క్యాన్సర్ సోకిందని తెలిసింది. నాకు ఎంతో బాధ అనిపించింది. ఆ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నాను. క్యాన్సర్ గురించిన పుస్తకాలు తెచ్చుకుని కూలంకషంగా అధ్యయనం చేశాను. ఆ వ్యాధి బారిన పడ్డవాళ్లకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. అందుకు తగ్గట్లే ఆమె ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ క్యాన్సర్ సొసైటీ వారి క్యాన్సర్ సహయోగ్ ఢిల్లీ శాఖలో చేరి, ఆరోగ్యసేవ కొనసాగిస్తున్నారు. ఈ సేవాస్ఫూర్తిని మరింతమందిలో రగిలించడానికి ఎంతోమందిని వలంటీర్లుగా తయారుచేసి వారి ద్వారా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ‘‘ఇప్పుడు ఆ సంస్థలో వందలాదిగా స్వచ్ఛంద సేవకులు వచ్చి చేరుతున్నారు. సంస్థకు వచ్చే విరాళాలతో రొమ్ము క్యాన్సర్ పీడితులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నాం’’ అని వివరించారు సీతా పెయింటాల్. వయసెరుగని... ఇటీవలే ఆమె తన కుటుంబ సభ్యులతో ఈజిప్ట్ పర్యటించారు. తనతో పాటు ఓ బుల్లి కెమెరాను తెచ్చుకున్నారు. పిరమిడ్లను చకచకా ఎక్కుతూ ఎన్నో ఫోటోలు తీసుకున్నారు. నైలునదిలో నౌకావిహారం చేస్తూ అక్కడి దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. స్వయంగా తాను కూడా క్యాన్సర్ బారినపడ్డ ఆమె, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, తమ దైనందిన జీవితం ఎలా గడపాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. వారి భావోద్వేగాలను పంచుకుని, వ్యాధిని ఎదుర్కొనడానికి తగిన సలహాలు ఇస్తున్నారు. అప్పుడే ఆమె ఇద్దరు చెల్లెళ్లూ, భర్త మరణించారు. అయినా ఆమె తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. ‘‘క్యాన్సర్ వ్యాధి మీద మరింత మందికి అవగాహన కల్పించాలనుకున్నాను. ‘క్యాన్సర్ సహయోగ్ సంస్థ’ ద్వారా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నాను. ‘నాకు హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. క్యాన్సర్ వ్యాధి బారిన పడినవారెవరైనా ప్రతి రోజూ రాత్రి నాకు ఫోన్ చేయచ్చు (ఫోన్ నం. 9818488122). వారికి నైతిక స్థైర్యాన్ని అందజేస్తాను’’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పే ఈ పండుటాకును జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే వారందరూ ఆదర్శంగా తీసుకుని తీరాలి. ఆమెలోని అనుకూల దృక్పథాన్ని అందరూ అలవరచుకోవాలి. - గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
పేదింటి అమ్మ కట్టించిన పెద్ద ఆసుపత్రి!
స్ఫూర్తి సుభాషిణీ మిస్త్రీ ఆసుపత్రి కట్టాలనుకున్నారు. కాని మనసులో ఆరాటం తప్ప, చేతిలో కానీ లేదు. అయితేనేం...గుండెలనిండా ఆత్మవిశ్వాసం ఉంది... పేదలకు సేవ చేయాలన్న తపన ఉంది... అహరహం శ్రమించింది... అందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారం తోడైంది... అందరి కృషి ఫలించింది... ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో ఆసుపత్రి వెలసింది. ఎందరో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. సుభాషిణిలో చుట్టు పక్కల వారిని నవ్వించే హాస్యచతురత అంతగా ఏమీ లేదు. ఎప్పుడూ కాస్త గంభీరంగానే ఉంటుంది ఆవిడ. కానీ, ఆమె ఒక మాట అంటున్నప్పుడు మాత్రం...వినేవాళ్లు నవ్వినంత పని చేసేవారు. కొందరు వెటకారం కూడా చేసేవారు. అయినా ఆమె వాటికి పెద్దగా స్పందించేది కాదు. ఇంతకీ, కోల్‌కతాకు సమీపంలోని హన్సుపుకుర్ గ్రామానికి చెందిన సుభాషిణీ మిస్త్రీ ఏమనేవారు? ‘‘పేదవాళ్ల కోసం ఆసుపత్రి కడతాను. వాళ్లకు ఏ కష్టం లేకుండా ఉచితంగా వైద్యం చేయిస్తాను’’ పేదవాళ్లకు ఉచిత వైద్యసేవ చేయాలనుకున్న సుభాషిణి పెద్దింటావిడ ఏమీ కాదు. ఊళ్లో పలుకుబడి ఉన్న మహిళ అంతకంటే కాదు. ఆమె ఒక సాధారణమైన పేద మహిళ. ఎర్రటి ఎండల్లో కూలీ పని చేసేది. పెద్దవాళ్ల ఇంట్లో ఇంటి పని చేసేది. వీధి వీధి తిరుగుతూ కూరగాయలు అమ్మేది. ఏ రోజుకు ఆరోజు అన్నట్లుగానే ఉండేది ఆమె ఆర్థిక పరిస్థితి. ఇంతకీ ఆమె ఆసుపత్రి ఎందుకు కట్టాలనుకున్నారు? 23 ఏళ్ల వయసులోనే సరియైన వైద్యసదుపాయాలు లేని స్థితిలో సుభాషిణి భర్త చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఎన్ని కష్టాలు పడిందో ఆ దేవుడికే తెలుసు. కడుపు నిండా తిన్న రోజుల కంటే పస్తులు ఉన్న రోజులే ఎక్కువ. భర్త మాత్రమే కాదు...ఆమె బంధువులలో కొద్దిమంది సరైన వైద్యం లేక చిన్నవయసులోనే చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఆసుపత్రి కట్టాలనేది ఆమె కల, ఆశయం. ఒక పేదరాలికి ఆసుపత్రి కట్టించేంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో సుభాషిణితో అన్నారట- ‘‘ఇదేమన్నా సినిమా అనుకున్నావా? జీవితం’’ అని. అలా అంటారు గానీ, నిజానికి చాలా సినిమాలకు జీవితమే ప్రేరణ. జీవితంలోని ఎగుడుదిగుళ్ల నుంచే ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. సుభాషిణిది కూడా అలాంటి కథే. ఇప్పుడు మళ్లీ ఒకసారి వెనక్కి వెళదాం... సకాలంలో వైద్యం అందక, నిస్సహాయస్థితిలో తన భర్తలాగా ఇకముందు ఎవరూ చనిపోకూడదనుకుంది సుభాషిణీ. భవిష్యత్తు కలను దృష్టిలో పెట్టుకొని తనకు వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదువు చేయడం ప్రారంభించింది. కొన్నిసార్లయితే ఓవర్‌టైమ్ కూడా చేసేది. ఒక భూస్వామి కొంత భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసి అతడిని కలిసింది. అతడి కాళ్ల మీద పడి తన ఆశయం గురించి చెప్పింది. తాను పొదుపు చేసిన డబ్బుతో మార్కెట్ రేటుతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఆ భూమిని కొన్నది. ‘‘తొలి విజయం సాధించాను’’ ఆమె తనలో తాను గర్వంగా అనుకుంది. ఇల్లలకగానే పండగ కాదు కదా! ఆ విషయం...ఆమెకు స్పష్టంగా తెలుసు. ‘పండగ’ వచ్చే రోజు కోసం మరింత ఎక్కువ కష్టపడాలనే విషయం కూడా తెలుసు. ఆసుపత్రి కోసం పైసా, పైసా కూడబెడుతున్న తనకు పిల్లల్ని చదివించడం కష్టమైపోతుందనే విషయం అర్థమై ముగ్గురు పిల్లలలో ఇద్దరిని అనాథాశ్రమంలో చేర్పించింది. ‘హవ్వా’ అనుకున్నారు చుట్టాలు పక్కాలు. ‘‘మీ ఆయన చనిపోవచ్చు. నువ్వు బతికే ఉన్నావు కదా! అలా పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించవచ్చా?’’ అన్నాడు ఒక సన్నిహిత బంధువు. ఎవరేమన్నా ఆమె మౌనంగా ఉండేది. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని వైద్యశాస్త్రం చదివించాలని కూడా ఆమె బలంగా అనుకునేది. అనుకున్నట్లే రెండో కొడుకు అజయ్ మెడిసిన్ చదివాడు. రెండో విజయం! తన తల్లి కల నెరవేర్చడానికి తన వంతు పాత్ర పోషించాడు అజయ్. 1993లో గ్రామస్థుల సహకారంతో ఒకే ఒక్క గదిలో ‘హ్యూమానిటీ హాస్పిటల్’ పేరుతో చిన్నగా మొదలైంది ఆసుపత్రి. ప్రజలు తమకు తోచిన రీతిలో సహాయం అందించారు. కొందరు డబ్బు ఇచ్చారు. కొందరు తమ దగ్గర ఉన్న కలప ఇచ్చారు. కొందరు శ్రమదానం చేశారు. కొందరు ఏమీ ఇవ్వక పోయినా ధైర్యాన్ని మాత్రం ఇచ్చారు. మూడు సంవత్సరాల తరువాత శాశ్వత ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కె.వి.రఘునాథరెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పేదలు ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యచికిత్స పొందారు. పొందుతున్నారు. ‘‘చూడడానికి పొట్టిగా కనిపించే సుభాషిణి ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది’’ అంటారు గ్రామస్థులు. దేశవిదేశాల నుంచి ఎన్నో పురస్కారాలు సుభాషిణిని వరించాయి. అయితే ఇవేవీ కాదు... వైద్యసేవలు పొందిన తరువాత పేదరోగుల కళ్లలో కనిపించే సంతృప్తినే అతి పెద్ద పురస్కారంగా భావిస్తుంటుంది డెబ్బై సంవత్సరాల సుభాషిణీ మిస్త్రీ. నేను చదువుకోలేదు. గడియారం చూసి టైమ్ చెప్పడం కూడా నాకు రాదు. అయినప్పటికీ ఏదో ఒకరోజు నా కోరిక నెరవేరుతుందనే నమ్మకం బలంగా ఉండేది. - సుభాషిణి -
భయం వీడితేనే జయం
పట్టుదల..ఆత్మవిశ్వాసం..స్నేహభావం..ఇంగ్లీష్ మాట్లాడటం,తదితర విషయూలపై బాలికల్లో భరోసా కల్పించేందుకు ‘వారుుస్ 4 గర్ల్స్’అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ వేసవి శిబిరం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల నుంచి ఎంపిక చేసిన అమ్మారుులు పలు విషయూలపై అవగాహన పొందుతున్నారు. ప్రధానంగా సోషల్ అవేర్నెస్ పొంది జీవితంలో ఎలా మెలగాలి అనే అంశాలను కౌన్సెలర్లు పాఠాలుగా బోధిస్తున్నారు. జడ్చర్లటౌన్, న్యూస్‌లైన్ : అమ్మారుుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ‘వారుుస్ 4 గర్ల్స్’ అనే స్వచ్ఛంద సేవాసంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ ద్వారా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సహకారంతో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలు విద్యార్థినులకు వరంగా మారాయి. ఈనెల 19న జడ్చర్ల మండలం చిట్టెబోయినిపల్లి రెసిడెని ్షయల్ స్కూల్లో ప్రారంభమైన ఈ శిబిరంలో రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాలకు చెందిన 73 కస్తూర్బా పాఠశాలల నుంచి 7, 8, 9 తరగతులకు చెందిన 457మంది విద్యార్థినులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిబిరంలో ఆరోగ్యం, రక్షణ, సెల్ఫ్ అవేర్నెస్, హక్కులు, భవిష్యత్ ప్రణాళికలు అనే 5 అంశాలపై 17 సూచికల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 16మంది కౌన్సిలర్లు (వీరంతా సామాజిక సేవాథృ క్పథం కలిగిన పీజీ విద్యార్థినులు) 16మంది కో కౌన్సిలర్లు (ఏపీ రెసిడెన్షి యల్ స్కూల్లకు చెందిన విద్యార్థినులు గత శిబిరంలో శిక్షణ పొందినవారు) విద్యార్థినులకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు శిక్షణ ఇస్తున్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు,సమానత్వం, తోటి ఆడపిల్లకు కష్టం వస్తే ఎలా స్పందించాలి, తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించి శిక్షణ ఇస్తున్నారు. -
ఒక లడ్డూ బాబు విజయగాథ!
విజేత ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ‘‘నా బరువు ఎనభై కిలోలా?’’ అనుకున్నాను...ఆందోళన పడ్డాను. మరిచిపోయాను. కొంతకాలానికి... ‘‘నా బరువు తొంబై కిలోలా?’’ అనుకున్నాను...మరికొంత ఆందోళన పడ్డాను. మళ్లీ మరిచిపోయాను. మరి కొంత కాలానికి... ‘‘నా బరువు 108 కిలోలా?’’ ఆవేదన పడ్డాను...అమ్మోఅనుకున్నాను. మరచిపోలేక పోయాను. ‘‘నన్ను నా పేరుతో కాకుండా నిక్ నేమ్‌లతో వెక్కిరించే కాలం వచ్చింది’’ అని వణికి పోయాను. ఏదో మంత్రం వేసినట్లుగా రాత్రికి రాత్రే బరువు తగ్గాలనేది నా ఆలోచన. దగ్గరి దారుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. బరువు కోల్పోలేదుగానీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిద్ర కోల్పోయాను. ఆటలు ఆడమని ఒకరు సలహా ఇచ్చారు. హమ్మయ్యా...నాకు క్రికెట్ ఆడడం వచ్చు. చాలా రోజుల తరువాత ప్లే గ్రౌండ్లోకి దిగాను. ‘‘ఈత కొట్టి చూడు..’’ అని మరొకరు సలహా ఇచ్చారు. స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగాను. ఏదో కొత్త శక్తి వచ్చి చేరినట్లు అనిపించేది. ఒత్తిడిని చేత్తో తీసేసినట్లు హాయిగా ఉండేది. మా అమ్మ ప్రాణాయమం గురించి చెప్పారు. ఆ దారిలో కూడా వెళ్లాను. ఆరోగ్యవంతమైన శరీరానికి అది ఎంత అవసరమో తెలిసింది. బరువుతో ఉన్నప్పుడు తీయించుకున్న నా ఫొటో ఎప్పుడూ నా పర్స్‌లో ఉండేది. రోజూ పడుకునే ముందు ఆ ఫోటోని చూస్తూ పడుకునేవాడిని. అలా బరువు తగ్గాలనే పట్టుదల పెరిగింది. ఇప్పుడు నా బరువు 70 కిలోలు! - సాహిల్ ర్యాలీ, మోడల్ -
దేవుడెవరు?
దేవుడెవరు? ఇది అనాదిగా వస్తున్న ప్రశ్నే. ఎవరెన్ని విధాలుగా నిర్వచించినా సంతృప్తికరమైన సమాధానం దొరకదు. ‘కలడు కలండనెడివాడు కలడో?! లేదో?!’ ఇదొక కొరకురాని కొయ్య. అయితే ఆయన లేడనుకోవడం కన్నా ఉన్నాడనుకోవటం వల్ల వ్యక్తికీ, వ్యవస్థకీ మేలు జరుగుతుంది. ఇది మాత్రం నిజం. సత్కార్యాలు ఆచరించటం వల్ల మనిషికి దైవత్వం సిద్ధిస్తుంది. ‘భగము’కలవాడు భగవంతుడు. భగమంటే? మాహాత్మ్యం, ధైర్యం, కీర్తి, సంపద, జ్ఞానం, వైరాగ్యం- అనే ఆరు గుణాలని కలిపి ‘భగ’మంటారు. ఎవరికి ఈ ఆరు గుణాలున్నా అతడు భగవంతుడే.‘దేవుడు తలక్రిందయితే - మనిషి అవుతాడు/ మానవుడు తలక్రిందయితే దానవుడవుతాడు!’ అన్నారు కవి తిలక్. రాముడు మానవుడే. ఆయన తన వర్తన వల్ల షోడశ గుణాలతో విరాజిల్లి, మాన్యత నొంది, దైవావతారంగా పరిగణింపబడ్డాడు. జీసస్, మహమ్మదు, బుద్ధుడు మొదలైన వారంతా మహత్కార్యాలు ఆచరించి, మహనీయులై భగవత్స్వరూపులయ్యారు. మనిషి వికృతియైతే మాత్రం దైవం దయ్యమౌతుంది. ఉన్నా, లేకున్నా దేవుడనేది ఆత్మ విశ్వాసం కలిగించే మహాతత్త్వం. సర్కసులో ఎంతో ఎత్తున ఊయలలూగుతున్న వ్యక్తి హఠాత్తుగా చేతులు వదిలేసి, దూకి, మరొక వ్యక్తి చేతులు పట్టుకొని గాలిలో ఊగుతూంటాడు. కింద అతడి రక్షణ కోసం పెద్ద వల కట్టి ఉంటుంది. ఆ ‘వల’ వంటి వాడు భగవంతుడు. ఫీట్స్ చేసేదీ, చేయాల్సిందీ మనిషే! ఒక్కొక్కసారి దైవం తలచినా మనిషి మూర్ఖంగా తన కందిన అవకాశాన్ని కాలదన్నుకుం టాడు. దైవ ప్రేరణకి స్పందిం చడు. మేడ మీద కూర్చున్న ధనవంతుడు కింద రోడ్డు మీద పోతున్న ముష్టివాడిని పిలుస్తోంటే ఆ పిలుపందక వాడు వెళ్లిపోతున్నాడు. ధనికుడు కొన్ని నాణాలు వాడి గిన్నెలో పడేటట్టు విసిరాడు. అది తీసుకుంటున్నాడే తప్ప, ముష్టివాడు తలెత్తి పైకి చూడటం లేదు. ఈసారి ధనవంతుడొక రాయి విసిరాడు. ముష్టివాడు వెంటనే తలెత్తి పైకి చూశాడు. ధనికుణ్ణి గుర్తించాడు. మనిషికి కష్టాల వల్లనే భగవత్స్పృహ కలుగుతోంది. అతడి ‘అస్తిత్వాన్ని’ మనిషి గుర్తిస్తున్నాడు. సుఖాల్లో గుర్తుకి రాడు. ఇంక మంచివానికి కష్టాలూ చెడ్డవానికి సుఖాలూ కర్మ సిద్ధాంతాన్ని నమ్మక తప్పని పరిస్థితిని కలిగిస్తాయి. మూఢ విశ్వాసాన్ని కల్పిస్తాయి. అలాకాక, ‘ఎవని కర్మకు వాడే కర్త!’ అన్న వివేకం ఉన్న వారికి భగవంతుడంటే ఆత్మ విశ్వాసం! వారి విజయాలకి అదే కేంద్రస్థానం. ఈ గీతాశ్లోకం ప్రతి వ్యక్తికీ అవశ్య పఠనీయం... ‘మత్తః పరతరం నాన్యత్కించి దస్తి ధనంజయ! మయి సర్వఖదం ప్రోతం సూత్రే మణిగణాఇవ’ (భగవంతుని కంటె భిన్నమైనదేదీ లేదు. దారానికి మణులు గుచ్చినట్టు సర్వమూ నాచేతనే కూర్పబడినది.) -పొన్నపల్లి శ్రీరామారావు -
ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించి..
అశ్వాపురం, న్యూస్‌లైన్: ఆడేపాడే వయసులో విద్యుత్ ప్రమాదం జరిగి రెండు చేతులు కోల్పోయినా అతను ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తమ్ముడికి, చెల్లెలికి ఉత్తరం రాయాలనే పట్టుదలే అతనిని వైకల్యం జయించేలా చేసింది. కాలితో రాయడంతో పాటు అన్ని పనులు చేసుకునేలా మార్చి ఉన్నత విద్యావంతుడిని చేసింది. అతనే అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పంచాయతీ కుమ్మరిగూడేనికి చెందిన పర్సిక రాజు. కుమ్మరిగూడేనికి చెందిన చంద్రయ్య, సీతమ్మలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1981లో జన్మించిన రాజు ఆరేళ్ల వయసుల్లో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు గ్రామ చివరకు వెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పట్లో సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండు చేతులు కోల్పోయాడు. రెండు చేతులు లేకపోవడంతో అతను మొదట్లో బాధపడ్డాడు. తోటి పిల్లలు బడికెళ్తుంటే తాను వెళ్లలేకపోతున్నానని కుమిలిపోయాడు. ఈ క్రమంలో బూర్గంపాడు, కిన్నెరసాని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న చెల్లెలు భవానీ, తమ్ముడు రామారావులు ఉత్తరం రాయాలని ఆలోచన వచ్చింది. దీంతో అతను ప్రతీ రోజు సాధన చేసి కాలితో రాయడం నేర్చుకుని వారికి ఉత్తరాలు రాశాడు. అతని పట్టుదల, చదువుకోవాలనే ఆశ చూసిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతను మార్చి 2005లో అశ్వాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్‌గా పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2005 -07 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007 నుంచి 2010 వరకు భద్రాచలం ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, ఆ తర్వాత బీఎడ్ పూర్తి చేశాడు. అనంతరం ఖాళీగా ఉండకుండా అశ్వాపురంలోని సన్మార్గ్ వికలాంగుల ఆశ్రమంలో కంప్యూటర్ విద్యను సైతం నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే... చేతులు లేవని ఇంట్లో కూర్చుని ఉండకుండా పట్టుదలతో ఉన్నత చదువులు చదివా. తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహంతో ఇప్పటి వరకు ఆనందంగానే ఉన్నా. నా విద్యార్హతకు తగిన ఉద్యోగం కల్పించి జీవనోపాధి కల్పించాలని పలుమార్లు భద్రాచలం పీఓలకు దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేదు. సీఆర్టీగా ఉద్యోగం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నాకు ఉపాధి కల్పించి ఆదుకోవాలి. - పర్సిక రాజు -
అష్టదిగ్బంధం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం విస్తృత భద్రత ఏర్పాట్లు చేస్తోంది. పది నియోజకవర్గాల్లో భారీస్థాయిలో కేంద్ర బలగాలు, ప్రత్యేక, సాధారణ పోలీసులను వినియోగించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 9,800 మంది పోలీసులను వినియోగించున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చేసే అరాచక శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసి నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు సార్వత్రిక ఎన్నికలను పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లాకు 15 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయి. ఈ ఒక్కో కంపెనీల్లో 120 మంది సిబ్బంది ఉంటారు. ఒక కంపెనీ తమిళనాడు సాయుధ బలగాలు, మూడు కంపెనీల ఇండో-టిబెటేన్ బార్డర్ పోలీసులు, నాలుగు కంపెనీల బార్టర్ సెక్యురిటీ ఫోర్( బీఎస్ఎఫ్), నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ పోలీసులు, జార్కండ్ రాష్ట్రం నుంచి మూడు కంపెనీల బలగాలు త్వరలో జిల్లాకు చేరుకోనున్నాయి. వీరితోపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న 18 మంది ఐపీఎస్ అధికారులు ఎన్నికల పర్యావేక్షణ కోసం ఈనెల 27న జిల్లాకు రానున్నారు. వీరిని పది అసెంబ్లీ స్థానాల్లో నియమించనున్నారు. మావోయిస్టుల గాలింపునకు హెలిక్యాప్టర్.. ఏజెన్సీలో ఈ సార్వత్రిక ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్ర త చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టుల వల్ల ఎన్నిక ల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ తీవ్రతరం చేస్తున్నారు. గగనతలం నుంచి మావోయిస్టుల ముప్పును పసిగట్టేందుకు ఒక హెలిక్యాప్టర్‌ను ఉపయోగిస్తున్నారు. ఏప్రిల్ 28 తేదీ వరకు ఇది జిల్లాకు రానుంది. ఈ మద్య నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని పోలీసు శాఖ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలనే పట్టుదలతో పోలీసు శాఖ ఉం ది. గిరిజన ప్రాంతాల్లో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసి సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ ఓటింగ్ నమోదయ్యే దిశగా ఓటర్లు, పోలింగ్ బూత్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భద్రత కట్టుదిట్టం.. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2,318 పోలింగ్ కేంద్రాల్లో 185 కేంద్రాలు అతి సమస్యాత్మకంగా, 340 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా, 79 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున స్వయం పర్యవేక్షణలో నలుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 180 మంది ఎస్సైలు, 400 మంది ఏఎస్సైలు, 1800 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 3 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది మహిళ పోలీసులు, 800 మంది హోంగార్డులు వీరితోపాటు ప్రత్యేకంగా కర్నూల్ జిల్లా నుంచి వచ్చిన 2,500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. వీరిలో అత్యధిక శాతం మందిని అతి సమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్ బూతులకు తరలించనున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 42 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బార్లు, రెస్టారెంట్లకు రాత్రి 11 గంటల వరకు గడువుగా నిర్ణయించారు. -
విజయవంతంగా సాక్షి ‘మైత్రి మహిళ’
మైత్రి మహిళ సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో, నైపుణ్యంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందుకొనేందుకు ‘సాక్షి’ ప్రారంభించిన శిక్షణా కార్యక్రమం ‘మైత్రిమహిళ’కు విశేష స్పందన వస్తోంది. బుధవారం బంజారాహిల్స్‌లోని ‘మైత్రి మహిళ’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కుకరీ వర్క్‌షాప్ (వంటల శిక్షణ) కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ప్రముఖ చెఫ్ బినా ప్రత్యేకించి కేక్‌లను తయారు చేయడంలో మెలకువలను నేర్పించారు. ‘మైత్రి మహిళ’లో... ఫ్యాబ్రిక్ పెయింటింగ్, త్రీడీ మ్యూరల్ ఆర్ట్, ఎంబ్రాయిడరీ స్టయిల్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ వంటి హస్త కళలు, బేకరీ బిస్కెట్లు, కేకులు, వివిధ రకాల గ్రేవీ కూరలు చేయడంలో శిక్షణ, వివిధ రకాల టైలరింగ్ కోర్సులు, పౌష్టికాహారం ఆరోగ్యాన్ని రక్షించుకోవడం వంటి వివిధ అంశాలలో శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తోంది. ఇంకా... న్యాయపరమైన సలహాల కోసం, ఆదాయాన్నందించే తమకిష్టమైన కోర్సుల వివరాలు కూడా తెలియచేస్తుంది. ఆసక్తి ఉన్నవారు 9505555020 నంబరుకు సంప్రదించి రిజిస్టర్ చేసుకోండి. -
దేవుడిచ్చిన గొప్ప బహుమతి... అపజయం
మై ఫిలాసఫీ విజయం కంటే అపజయానికే ఎక్కువ విలువ ఇవ్వాలి. విజయం నుంచి మాత్రమే ఆత్మవిశ్వాసం పుడుతుంది అనే వాదనతో నేను ఏకీభవించను. అపజయాల నుంచి తలెత్తిన ‘కసి’ నుంచి కూడా దృఢమైన ఆత్మవిశ్వాసం పుడుతుంది. మనం ఒక పని చేస్తున్నామంటే... యాంత్రికంగా కాకుండా ఆ పనిని లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ పని పట్ల గౌరవం ఉండాలి. మన క్రమశిక్షణ దానికి తోడు కావాలి.ఒకరి సహాయం తీసుకోవడం కంటే సొంత కాళ్ల మీద నిలబడి పని చేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. సహాయం తీసుకొని పొందిన విజయం కంటే, ఎవరి సహాయం లేకుండా చేసిన పని తాలూకు ఓటమి నేర్పిన పాఠాన్ని గొప్పగా భావిస్తాను. ప్రతి వ్యక్తికి ఉండే గొప్ప సంపద.. వారి మెదడు. కొన్ని సమయాలలో ప్రతిభావంతులకు తమలో ఉండే ప్రతిభ గురించి తెలియదు. తమకు తగిన పని దొరికినప్పుడు ఆ ప్రతిభ బయటపడుతుంది. రాశి కంటే వాసి ముఖ్యం అనే సూత్రాన్ని బలంగా నమ్ముతాను. ఏ పనికైనా ‘సరైన సమయం’ రావాలని నమ్ముతాను. ‘‘ఫలానా పని నువ్వు చేయగలవు’’ అని ఎవరైనా సలహా ఇస్తే ‘చేయగలను’ అనే ఆత్మవిశ్వాసంతో పాటు ‘సరైన సమయం’ కోసం నిరీక్షించగల ఓపిక కూడా ఉండాలి. - దియా మీర్జా, నటి -
సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందించేందకు ‘సాక్షి’ ప్రారంభించిన ‘మైత్రి మహిళ’కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం మైత్రి మహిళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ వర్క్‌షాప్ (కుట్టు శిక్షణ)నకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఉషా మిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో అధునాతన డిజైన్లతో టైలరింగ్‌లో రాణించేందుకు అవసరమైన మెళుకువలను నిపుణుల పర్యవేక్షణలో నేర్పించారు. ‘మైత్రి మహిళ’ ఎంతో మందికి ఉపయోగపడుతోందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఈ శిక్షణ ద్వారా టైలరింగ్‌లో వస్తున్న ఆధునాతన డిజైన్లు, మార్పులను తెలుసుకోగలిగామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ‘సాక్షి’ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా... వంటలు, స్వయం ఉపాధి, బోధన, వ్యాపార, ఆరోగ్య, న్యాయ సలహాల వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
మణికట్టుతో మణిహారాలు
పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని అడిగితే... పిల్లలు రకరకాల సమాధానాలు చెబుతారు. లండన్‌కు చెందిన అనెట్ గ్యాబ్‌డీ మాత్రం ‘ఏదో ఒకటి చేస్తాను’ అనేది. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. అసలు ఏమైనా చేయగలదో లేదో కూడా తెలియదు. అవును మరి... అనెట్‌కి పుట్టుకతోనే చేతివేళ్లు లేవు! ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోరు తెరవాల్సిందే! ‘నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకున్నాను, కానీ పరిస్థితులు సహకరించలేదు’ అనేవాళ్లని చూస్తుంటాం. ‘డాక్టర్ని అవుదామను కున్నాను, కానీ కాలం కలసి రాలేదు ఏం చేస్తాం’ అని వాపోయేవాళ్లనీ చూస్తుంటాం. నిజానికి కాలం, పరిస్థితులు, అదృష్ట దురదృష్టాల వంటివి ఎదుగుదలకు ఎప్పుడూ ఆటంకం కావు. కృషి, పట్టుదల, సాధించాలన్న కసి, సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లని ఏ అవరోధాలూ అడ్డుకోలేవు. దానికి అనెట్ గ్యాబ్‌డీ జీవితమే ఉదాహరణ! 1966లో, బ్రిటన్‌లో జన్మించింది అనెట్. వేళ్లు లేకుండా మొండి చేతులతో పుట్టిన ఆమెని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది అనెట్ తల్లి. తనంతట తానుగా ఏదీ చేసుకోలేని కూతుర్ని ఎలా పెంచి పెద్ద చేయాలా అని ఆలోచించి కుమిలిపోయాడు తండ్రి. ప్రపంచం పోటీ పడి పరుగులు తీస్తోంది. ఏ కాస్త వెనుకబడినా జీవితం నిస్సారమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన చిట్టితల్లి ఎలా ఎదుగుతుంది? ఏం సాధిస్తుంది? అసలు ఎలా బతుకుతుంది? ఈ ఆలోచనలు వారిని కుంగదీశాయి. చిన్నతనంలో తన తల్లిదండ్రుల దిగులుకు అర్థం తెలిసేది కాదు అనెట్‌కి. కానీ ఎదిగేకొద్దీ ఆ దిగులు తన గురించేనని తెలుసుకుంది. ఈ రోజు ఇలా బాధపడుతోన్న తల్లిదండ్రులు... తనని చూసి గర్వేపడేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారిని అవకరం ఏం చేస్తుంది? ఏం చేయలేక తలవంచుకుని తప్పుకుంటుంది. అనెట్ విషయంలోనూ అదే జరిగింది. చిన్నప్పట్నుంచీ నగల మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అనెట్‌కి. వాటిని ఎలా తయారుచేశారు, ఏ లోహంతో చేశారు, ఏ రాళ్లు పొదిగారు అంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండేది. అందుకే... జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు... ఆమె మనసులో మొదట మెదిలింది నగల డిజైనింగే. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. తినడానికే పనికిరాని తన చేతులతో నగలను చెక్కడం అంత సులువుగా అయ్యే పనికాదని అనెట్‌కి తెలుసు. అయినా సరే... చేసి తీరాలనుకుంది. నగల తయారీ నేర్చుకోవడానికి ఓ ఇన్స్టిట్యూట్లో చేరింది. అప్పుడు కూడా చాలామంది ఆమెను నిరుత్సాహపరిచారు. ‘నగలు తయారు చేయడమనేది పూర్తిగా చేతులతోనే చేసే పని, నీకు కష్టమవుతుంది, వేరే ఏదైనా నేర్చుకో’ అనేవారు. వారికి సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వేది అనెట్. దేవుడు తనకి వేళ్లు ఇవ్వలేదు కానీ, దేనినైనా సాధించగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. జీవన సంగ్రామంలో గెలవడానికి అంతకుమించిన ఆయుధమేదీ అవసరం లేదని అనెట్‌కి తెలుసు. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుపోయింది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసింది. తర్వాత ఆమె చేసిన మొదటి పని... నగల తయారీకి అవసరమైన పనిముట్లను తయారు చేసుకోవడం. ఏమేం పనిముట్లు కావాలో ఆర్డర్ ఇచ్చి, తన చేతులకు పట్టి ఉండే విధంగా వాటికి లెదర్ బెల్టులను అమర్చమంది. వాటితోనే తన లక్ష్యసాధన మొదలుపెట్టింది. ఆలోచనలు బలమైనవైతే ఆచరణ సులువవుతుంది. సంకల్పం దృఢమైనదైతే అసాధ్యమనుకున్నది సుసాధ్యమై ముందుకు నడిపిస్తుంది. అనెట్ కృషి ఫలించింది. జ్యూయెలరీ డిజైనర్‌గా ఆమె ప్రస్థానం మొదలయ్యింది. బంగారం, ప్లాటినం, వజ్రాలు, రాళ్లతో అనెట్ రూపొందించిన ఆభరణాలు అందరినీ విపరీతంగా ఆకర్షించాయి. వారి ఇష్టమే పెట్టుబడిగా తను పుట్టి పెరిగిన లండన్‌లోని తన ఇంట్లోనే ‘గ్యాబ్డీస్’ పేరుతో స్టోర్‌ను తెరిచింది. ఇప్పుడు అనెట్ వయసు 48. దాదాపు ఇరవ య్యేళ్లుగా ఆమె అందమైన డిజైన్లను రూపొందిస్తూనే ఉంది. బ్రిటన్‌లోని ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్లలో ఒకరిగా ఖ్యాతి గడించింది. ‘వేళ్లు లేకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నారు’ అని ఎవరైనా అడిగితే... ‘‘వేళ్లు ఉండి మీరెలా చేస్తున్నారో అలాగే’’ అంటుంది అనెట్ తడుముకోకుండా. తన తల్లిదండ్రులు, భర్త, పిల్లలు తనని ఎప్పుడూ వికలాంగురాలిగా చూడలేదని, అందుకే తానెప్పుడూ దాని గురించి ఆలోచించలేదనీ అంటుందామె. ‘ఏమీ చేయలేం అనుకుంటే చేయలేం, ఎప్పటికీ ఎదగలేం, చేసి తీరతాం అనుకుంటే చేస్తాం, ఎదిగి చూపిస్తాం’ అంటున్నప్పుడు అనెట్ కళ్లలో కొండంత ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తుంది! ‘నగలు తయారు చేయడమనేది పూర్తిగా చేతులతోనే చేసే పని, నీకు కష్టమవుతుంది, వేరే ఏదైనా నేర్చుకో’ అనేవారంతా. వారికి సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వేది అనెట్. దేవుడు తనకి వేళ్లు ఇవ్వలేదు కానీ, దేనినైనా సాధించగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. జీవన సంగ్రామంలో గెలవడానికి అంతకుమించిన ఆయుధమేదీ అవసరం లేదని అనెట్‌కి తెలుసు. -
మీ ఆనందం మీ చేతుల్లోనే...
ఆ మధ్య నన్ను ఒకరు ఓ సందేహం అడిగారు. ‘సహచరుడైన నా మిత్రుడొకరు ఎప్పుడూ తాను చేసిందే సరైనదని అనుకుంటూ ఉంటాడు. అందువల్ల అతనితో ఇబ్బంది పడుతున్నా. నేనేం చేయాలి?’ అని ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి సంఘర్షణలు భార్యాభర్తల మధ్య, తండ్రీ బిడ్డల మధ్య కూడా ఉంటాయి. అందుకే, ముందుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే దాన్ని సమర్థంగా ఎదుర్కోగలం. రెండో విషయం ఏమిటంటే, అవతలివాళ్ళతో కమ్యూనికేషన్ జరపడమే దీనికి పరిష్కార మార్గం. మరి, ఆ కమ్యూనికేషన్ ఎలా జరపాలన్నది ప్రశ్న. మాటామంతి జరిపేది ఎంతసేపటికీ ఎవరిది తప్పు అని నిర్ణయించడానికి కాదు... ఏది ఒప్పు అన్నది చూడడానికి. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎవరితోనైనా అనుబంధం నిలవాలంటే, ఐదు అంశాలు ప్రధానం. ఎదుటి వ్యక్తితో స్నేహంగా ఉండాలి. నిష్పక్షపాతంగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. దృఢంగా ఉండాలి. పట్టు విడుపులుండాలి. ఈ అయిదూ ఉంటే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది. మరి, ఈ అయిదు అంశాలనూ ఎలా ఆచరించాలన్నది ఆలోచించండి. అప్పుడది మీ అనుభవంగా మారుతుంది. జీవితానికి ఉపకరిస్తుంది. ముందు ఆత్మవిశ్వాసంతో నిలబడండి. కళ్ళెదుట కనిపిస్తున్న అంశాలను గుర్తించండి. ఆలోచనల ద్వారా, మనసులోని ఖాళీలను పూరించండి. అలాగే, మనం ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా సరే, అవతలి వ్యక్తి దేని మీద శ్రద్ధ పెడితే అదే వింటారన్నది గుర్తించండి. మిగిలినదంతా గాలికి పోతుంది. అవతలి వ్యక్తి పట్ల కరుణతో మాట్లాడితే, ఆ మాటలు ఎంతో ప్రభావం చూపిస్తాయని గుర్తించాలి. ఒక్కోసారి అవతలి వ్యక్తి ఏది తప్పు ఏది ఒప్పు అని చూడకుండా, తన వాదనను నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అలా ఒకసారి మన కమ్యూనికేషన్ విఫలమైతే, భిన్నమైన మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళకు మన మాట అర్థమయ్యేలా చెప్పాలి. అయితే, ఒక్కమాట... ఏ బంధంలోనైనా మధ్య మధ్యలో సవాళ్ళు లేకపోతే జీవితంలో మజా ఏముంది? అసలు ఎప్పుడైనా సాదాసీదాగా ఉండడంలో ఎంతో ఆనందం ఉంది. అది అనుభవమైతే కానీ అర్థం కాదు. అధికారం, హోదాల ద్వారా అవతలి వ్యక్తి మీద పైచేయి సాధించి, గెలిచామని సంబరపడాలని అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. మామూలుగా ఉండండి... జీవితాన్ని సంక్లిష్టంగా మార్చుకోకుండా, సరళం చేసుకోండి. జీవితమంటే, మనం ఎదగడానికి ఉన్న జాగా. అంతేతప్ప, కేవలం వయసు పెరగడం కాదని గుర్తుంచుకోవాలి. అలవాట్లకు మనం బానిసగా మారితే, అప్పుడు వాటి చేతిలో మనం కీలుబొమ్మలమవుతాం. ఈ సంగతులు గుర్తిస్తే, జీవితం సరళంగా మారుతుంది. మనకు సంతృప్తినిచ్చేది సుఖభోగాలు కాదు... ప్రశాంతత అన్నది అర్థమవుతుంది. ఈ లోచూపు ఉంటే, మీ జీవితమే మారిపోతుంది. - స్వామి సుఖబోధానంద -
నటనకు నిర్వచనం అక్కినేని
వివేక్‌నగర్, న్యూస్‌లైన్: తెలుగు వారికి గర్వకారణమైన నటసామ్రాట్ డా.అక్కినేని నాగేశ్వరరావు భారత చలన చిత్ర రంగంలోనే ఓ దిగ్గజమని శాసన మండలి అధ్యక్షులు డా.ఎ.చక్రపాణి కీర్తించారు. తెలుగు చలన చిత్ర సీమలో ఒక ధ్రువతార రాలిపోయిందంటూ ఆయన అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. డా.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్, శ్రీ త్యాగరాయ గానసభల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన మహానటులు అక్కినేని నాగేశ్వరరావు సంస్మరణ సభలో ఆయన ప్రసంగించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఆదర్శజీవితం ఆయన సొంతమని ఆయన మృతికి తొలిసారిగా శాసన మండలిలో నివాళులర్పించి సంతాప తీర్మానం చేశామన్నారు. నటులు చాట్ల శ్రీరాములు మాట్లాడుతూ నాటక రం గాన్ని అమితంగా ప్రేమించే అక్కినేని పేరిట గురుకుల స్థాయిలో నటనాలయం స్థాపించాలనే యోచన ఉందని ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. సభలో సారిపల్లి కొండలరావు, ఎంఎల్‌సి రుద్రరాజు పద్మరాజు, నటులు కైకాల సత్యనారాయణ, పి.వి.రాజేశ్వరరావు, డా.కె.వి.కష్ణకుమారి, పరుచూరి హనుమంతరావు, వై.కె.నాగేశ్వరరావు, లంక లక్ష్మీనారాయణ, వంశీరామరాజు, డా. యం.కె.రాము, మద్దాళి రఘురామ్, ప్రవాస భారతీయురాలు, యుఎస్ఏ తెలుగు కళాసమితి రేవతి, ఎస్వీ.రామారావు, కళాదీక్షితులు, డా.పోతుకూచి సాం బశివరావు, పలువురు సాహితీవేత్తలు, నాటక రంగ, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఒక నిముషం మౌనం పాటించి దివంగత అక్కినేనికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
టీవీక్షణం: అందం+ఆత్మవిశ్వాసం = దామిని!
ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అతిథుల సంగతేమోగానీ, ఏదైనా కొత్త సీరియల్ ప్రారంభమవుతోందంటే దానికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏ టైముకి వస్తుంది, ఎలా ఉంటుంది అంటూ మొదట ఆసక్తి. సీరియల్ కానీ నచ్చిందంటే... తర్వాత ఏమవుతుంది, కథ ఏ మలుపులు తిరుగుతుంది అంటూ ఉత్కంఠ. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే... ప్రతి చానెల్ అడపా దడపా ఏదో ఒక కొత్త సీరియల్ మొదలుపెడుతూనే ఉంటోంది. అలా ఇటీవలే ప్రారంభమైన సీరియల్... దామిని. అచ్చమైన ఆధునిక యువతి దామిని. ఆకట్టుకునే అందం, ఎవరినైనా ఎదిరించగల ఆత్మవిశ్వాసం, ఎంతటి పోరాటానికైనా వెరవని దృఢత్వం ఆమె సొంతం. అదే ఆమెకు ఓ యువకుడితో గొడవ తెచ్చిపెడుతుంది. అతడి అహంకారానికి, ఆమె ఆత్మవిశ్వాసానికి మధ్య పోరాటం మొదలవుతుంది. ఆ తరువాత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఊపిరాడనివ్వకుండా చేస్తోందీ ధారావాహిక. దామిని పాత్రలో ఒదిగిపోయిన ప్రీతి అభినయం, శ్రీరామ్ లాంటి ఫేమస్ హీరో నెగిటివ్ రోల్ చేయడం, చాలాకాలం తరువాత సీనియర్ నటి యమున ఓ వైవిధ్యభరితమైన పాత్ర పోషించడం వంటి వాటితో పాటు... బలమైన కథ, అందమైన స్క్రీన్‌ప్లే ఈ సీరియల్‌కు ప్లస్ పాయింట్స్. అయితే ఆదిలో ఉన్న పటుత్వం రోజులు గడిచేకొద్దీ సన్నగిల్లడం కొన్ని సీరియళ్లలో కనిపిస్తోంది. దామిని అలా కాదనే అనుకుందాం. ముందు ముందు దామిని జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, తెలుగు ప్రేక్షకులను ఇంకెంత కట్టిపడేస్తుందో చూద్దాం! -
మా అమ్మాయి ఎందుకిలా..?
మా అబ్బాయిది బీటెక్ చదివి, జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. పార్టీలు, విందువినోదాలకు రమ్మని ఎంత బతిమాలినా రాడు, బలవంతం చేస్తే, విసుక్కుంటాడు. వాడితో ఎలా వేగాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా చెప్పగలరు. -పార్వతి, విశాఖపట్నం మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ అబ్బాయి అలా ప్రవర్తించడానికి డిప్రెషన్, రకరకాల భయాలు (ఫోబియాలు) వంటి సాధారణమైన కారణాలతోబాటు స్కిజోఫ్రినియా వంటి తీవ్రమైన కారణం కూడా ఉండవచ్చు. పరిశీలిస్తేగాని నిర్థారణగా చెప్పలేం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పుడు ఎవరితోనూ కలవకపోవడం, తోటిపిల్లలతో ఆటలాడకపోవడం, అల్లరి చేయకుండా, మందకొడిగా ఉండటాన్ని గమనించి కూడా తమ పిల్లలు బుద్ధిమంతులని మురిసిపోతారు. అది చాలా పొరపాటు. అలా వదిలేస్తే వారు పెద్దయ్యాక కూడా స్తబ్దుగా తయారవుతారు. ఫ్రెండ్స్ లేకపోవడం, పదిమందిలోనూ కలవకపోవడం, పార్టీలు, ఫంక్షన్లు అంటే విముఖత ఏర్పడటం వంటి లక్షణాలు పెంపొందుతాయి. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కొరవడి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, ఆత్మన్యూనతాభావంతో ఎవరితోనూ పోటీపడలేక, తమలో తాము కుచించుకుపోతుంటారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడితో బాధపడతారు. మీరు మీ అబ్బాయిని తీసుకుని సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. వైద్యులు అతనికి మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తారు. క్రమంగా అతని పరిస్థితి మెరుగవుతుంది. మా అమ్మాయి ఎంబిఏ చేసింది. చక్కగా ఉంటుంది. 26 ఏళ్లు వచ్చాయి. పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే, ఏదోవంకతో అన్నిటినీ తిరగ్గొడుతోంది. పోనీ ఎవరినైనా ప్రేమించిందా అంటే అదీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - బి. కృష్ణవేణి, హైదరాబాద్ ఇది మనదేశంలో ఇటీవల కనిపిస్తున్న సమస్య. జపాన్ వంటి దేశాల్లో ఇది చాలా ప్రధాన సమస్య. ఇందుకు రెండు కారణాలుండవచ్చు. ప్రస్తుత సమాజంలో చాలా పెళ్లిళ్లు విచ్ఛిన్నమవటం, భార్యాభర్తలలో ఒకరు ఆవేశంతో జీవితాన్ని అంతం చేసుకోవడం, ఫలితంగా వారి కుటుంబంరోడ్డున పడటం వంటి విషాదకరమైన సన్నివేశాలు, సంఘటనల గురించి వింటుంటాం. దాంతో కొందరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు ‘పెళ్లంటే... అయితే అడ్జస్టు, కాకుంటే కలహాల కాపురం లేదంటే బరువు బాధ్యతలు మోయటమే కదా, రేపు నా పరిస్థితీ ఇంతేనేమో’ అన్న ఆలోచిస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల బంధాలు కొరవడిన వారిలో ఇటువంటి భావన క్రమేపీ బలపడి, పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేస్తారు. మరికొందరు తల్లిదండ్రుల అతిభద్రత, అతిజాగ్రత్త, క్రమశిక్షణ వల్ల కూడా పెళ్లి పట్ల వ్యతిరేకభావనలు పెంచుకుంటారు. అలాగే సమాజంలో అడపాదడపా జరిగే కొన్ని సంఘటనలు బంధువులో, తెలిసిన వాళ్ల చేతిలోనో మోసపోవటం, లైంగిక దాడికి గురవటం, ఫలితంగా పెళ్లి పట్ల తీవ్ర విముఖత ఏర్పరచుకుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని, మీ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలను విశ్లేషించండి. ఫ్యామిలీ కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇప్పించండి. నెమ్మదిగా ఆమెలో మార్పు వచ్చే అవకాశం ఉంది. డోంట్ వర్రీ. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
ఇంకా అలవాటు తప్పలేదు... ఏం చేయాలి?
మా అమ్మాయికి పదేళ్లు. చాలా కాలం నుంచి నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. కానీ పాప యుక్తవయసుకు చేరుకుంటున్నా ఇదే సమస్య కనిపిస్తుండటంతో ఆందోళనగా ఉంది. చలికాలం వస్తే సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - ధనలక్ష్మీ, పొన్నూరు మీ అమ్మాయికి ఉన్న సమస్యను వైద్యపరిభాషలో నాక్టర్నల్ అన్యురిసిస్ అంటారు. సాధారణంగా 95 శాతం మంది పిల్లల్లో ఐదారేళ్లు వచ్చేసరికి నిద్రలో మూత్రవిసర్జనపై నియంత్రణ (బ్లాడర్‌పై కంట్రోల్) సాధిస్తారు. కానీ 4 శాతం మంది పిల్లల్లో ఇది కొద్దిగా ఆలస్యం కావచ్చు. అయితే ఒక శాతం మందిలో మాత్రం ఈ సమస్యను పెద్దయ్యాక కూడా చూస్తుంటాం. సాధారణంగా ఇది అబ్బాయిల్లో ఎక్కువ. యాభైశాతం మందిలో ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉండటం చూస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్న 20 శాతం మంది పిల్లల్లో సాధారణంగా యూరినరీ ట్రాక్ అబ్నార్మాలిటీస్ దీనికి కారణం కావచ్చు. ఇంకా నిద్రకు సంబంధించిన రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్), యాంటీ డైయూరెటిక్ హార్మోన్ (ఏడీహెచ్) లోపాలు, మానసికమైన కారణాలు , కొన్ని సందర్భాల్లో అడినాయిడ్స్ వల్ల నిద్ర సంబంధమైన సమస్యలు (స్లీప్ ఆప్నియా) వంటివి ఉన్నప్పుడు కూడా రాత్రివేళల్లో తెలియకుండానే మూత్రవిసర్జన చేస్తుంటారు. ఇక జాగ్రత్తల విషయానికి వస్తే ఆమెను కించపరచడం, శిక్షించడం వంటి పనులు అస్సలు చేయకండి. సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్రవాహారం చాలా తక్కువగా ఇవ్వండి. నాలుగు దాటాక కెఫిన్, చక్కెర ఉన్న పదార్థాలు అస్సలు ఇవ్వకూడదు. ఇక పడుకునేముందు ఒకసారి మూత్రవిసర్జన చేయించడం, నిద్రపోయిన గంటలోపు లేపి మళ్లీ ఒకసారి మూత్రవిసర్జన చేయిస్తుంటే... దాదాపు ఈ సమస్య లేనట్లుగానే ఉంటుంది. దాంతో మీ అమ్మాయిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది క్రమంగా ఆమె అలవాటును తప్పించడానికీ మానసికంగానూ దోహదపడే అంశం. చికిత్స : ఇటీవల అందుబాటులోకి వచ్చిన అలారం వంటి పరికరాలతో బ్లాడర్‌పై నియంత్రణ సాధించేలా ప్రాక్టీస్ చేయించాలి. దీంతోపాటు డెస్మోప్రెసిన్, ఇమెప్రమిన్ వంటి కొన్ని మందులు, స్ప్రేలతో ఫంక్షన్స్ వంటి సోషల్ గ్యాదరింగ్స్ సమయంలో ఆమెను నిర్భయంగా బయటకు తీసుకెళ్లవచ్చు. అలాంటి సందర్భాల్లో వాళ్లకు ఆత్మవిశ్వాసం పెరగడం కూడా ఒక అనుకూలమైన అంశమవుతుంది. ఒకవేళ హార్మోన్లోపాలు ఉన్న సమయంలో 3-6 నెలలపాటు మందులు వాడటం వల్ల ఈ సమస్యను 50 శాతం మందిలో సమర్థంగా అదుపు చేయవచ్చు. అయితే మిగతావారిలో మందులు వాడకకూడా సమస్య అదుపులోకి రాకపోవడం లేదా మందులు మానేశాక మళ్లీ సమస్య తిరగబెట్టడం చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్లు మందు మోతాదును పెంచి ఇవ్వడంతోపాటు కాంబినేషన్స్ ఇస్తుంటారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందేలా మోటివేట్ చేస్తుంటారు. మీరు మీ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ లేదా నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
భాషణం: ఇంగ్లిష్‌లోకి కొత్త మాటొచ్చింది!
Selfie అనే మాట డిక్షనరీలలో ఉండదు. అయితే ఈ ఏడాది కొత్తగా ప్రింట్ అయ్యే ఆంగ్ల నిఘంటువులలో ఈ మాట మనకు కనిపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రచురణకర్తలు word of the year గా selfie ని ఎంపిక చేశారు. Selfie అంటే డిజిటల్ కెమెరాతో గానీ, కెమెరా ఫోన్‌తో గానీ మనకు మనం తీసుకున్న సెల్ఫ్ పోట్రెయిట్ ఫొటోగ్రాఫ్. selfie ని సెల్ఫీ అని పలకాలి. సెల్ఫై అని కూడా అంటున్నారు. వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా సెల్ఫీ ఎంపికైన సందర్భంగా ఈవారం self తో వచ్చే కొన్ని పదబంధాల గురించి తెలుసుకుందాం. self అంటే ‘స్వయంగా’ అని సాధారణ అర్థం. ‘ఆత్మ’ అని కూడా. అయితే ఇక్కడ ఆత్మ అంటే spirit కాదు. ఆత్మగౌరవాన్ని self-respect అనీ, ఆత్మవిశ్వాసాన్ని self-confidence అనీ అంటాం కదా అలా అన్నమాట. self పక్కన - (డాష్) పెట్టి ఏ మాటను ఉంచినా ‘స్వీయ’ అనే అర్థం వస్తుంది. ఉదా: self-addressed, self-appointed, self-awareness, self-conscious, self-styled, self-discipline, self-distruction, self-help, self-image... ఇలా వందల్లోనే ఉంటాయి కనుక మనం ఇలాంటి వాటిని వదిలేసి, self తో వచ్చే ఫ్రేజ్ (పదబంధం)లకే పరిమితం అవడం సులభంగా ఉంటుంది. give yourself airs A…sôæ to behave as if you are more important than you really are. అంత సీన్ లేకపోయినా ఉన్నట్లు బిహేవ్ చెయ్యడమని. ఈ వాక్యాలు చూడండి చక్కగా అర్థమౌతుంది. 1. Put no attention to her. She is just putting on airs. 2. Stop giving yourself airs and act like the rest of us. ఇక, ఏదైనా పని చెయ్యడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని fall over yourself అంటారు. అమెరికన్ ఇంగ్లిషులో ఇది fall all over yourself. (They falling over themselves to be helpful. పడీ పడీ సహాయం చేయబోయారని). gird yourself అనే ఫ్రేజ్ ఒకటి ఉంది. దీనినే gird (up) your loins అని కూడా అంటారు. ఇది హ్యూమరస్ ఎక్స్ప్రెషన్. gird అంటే ఒంటికి బిగించుకోవడం. దీనిని గార్డ్ అని పలకాలి. గిర్డ్ అని కాదు. యుద్ధానికి వెళ్లేటప్పుడు కత్తులు, కవచాలతో సిద్ధమవడం గార్డింగ్. అందుకే ఎవరైనా ఏ పనికైనా పగడ్బందీగా తయారవుతూ యుద్ధానికి వెళ్లినంత పనిచేస్తుంటే girded themselves for the fray (prepared for action or trouble) అని జోక్ చేస్తారు. మరి gird (up) your loins లోని loins అనే మాటకు అర్థం ఏమిటి? కాళ్లకు పైన, నడుముకు కింద ఉండే భాగాన్ని loins (లోయిన్స్) అంటారు. gird the loins అంటే నడుము బిగించడం. బృహత్తర పథకానికి నడుము బిగించారు అంటుంటారు కదా.. అలా దీనిని అర్థం చేసుకోవచ్చు. Unto thine own self be true అని ఇంగ్లిష్‌లో ఓ సామెత. ‘నీ మనసుకు నచ్చిన దానిని మాత్రమే నువ్వు చెయ్యి’ అని చెప్పడం. అంటే ఆత్మవంచన చేసుకోవద్దని. నిన్ను నువ్వు ఒప్పించుకుని, నొప్పించుకుని కాకుండా మనస్ఫూర్తిగా నీకు చేయాలనిపిస్తేనే చెయ్యమని సూచించడం. నిజానికిది సామెత కాదు. Monologue. స్వగతం. విలియమ్ షేక్స్పియర్ రాసిన ‘హ్యామ్లెట్’ నాటకంలోని పోలోనియస్ అనే పాత్ర స్వగతం. ఆ పాత్ర తనలో తాను to thine own self be true అనుకుంటుంది. క్రమేణా అది Unto thine own self be trueగా, ఒక సామెతగా వాడుకలోకి వచ్చింది. ప్రధానంగా ‘నువ్వు నీలా ఉండు’ అనే అర్థంలో దీనిని వాడతారు. be a shadow of your former self మునుపటంత ఆరోగ్యంగా లేవని చెప్పడానికి ఇలా అంటారు. అలాగే మునుపున్నంత ప్రభావం లేకపోవడాన్ని కూడా. అంటే పూర్వ వైభవం లేదని. మనిషి మనిషిలా కాకుండా, మనిషి నీడలా మిగిలాడని. ఈ వాక్యం చూడండి. He came home from hospital cured of the disease but a shadow of his former self. అలాగే ఇంకో వాక్యం. With most of its best players traded away, the team was reduced to a shadow of its former self. -
మనోధైర్యమే మగువను నడిపిస్తుంది, గెలిపిస్తుంది
ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంటుంది. అయితే దురదృష్టమేమిటంటే... తమలో ఆ శక్తి ఉన్న విషయం చాలామంది మహిళలకు తెలియదు. అందుకే తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. తాము చేయగలిగింది కూడా చేయకుండా ఉండిపోతారు. సాధించే సత్తా ఉన్నా, సాధించగలనన్న నమ్మకం లేక వెనకడుగు వేస్తుంటారు. ఎవరిలోనూ లేని ప్రతిభా పాటవాలు ఉన్నా... ఎవరి ప్రోత్సాహం కోసమో ఎదురుచూస్తూ ముందడుగు వేయడానికి సంశయిస్తుంటారు. ఇలాంటి మహిళలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారని నేను నిస్సందేహంగా చెప్పగలను. దుర్గాశక్తి నాగ్‌పాల్ ఐఏఎస్ గురించి విన్నప్పుడు నా అణువణువూ పులకించింది. చిన్న వయసు. పైగా ఆడపిల్ల. అయినా కూడా ఎంత తెగువ ఆమెలో! అవినీతి మీద సమరశంఖం పూరించింది. అవినీతిపరులని వణికించింది. ఎంత ధైర్యం, ఎంత స్థైర్యం! నిజాయతీగా ఉన్నందుకు ఆమెపై వేటుపడినా చలించలేదు. తానెంతో ప్రేమించే ఉద్యోగ బాధ్యతలకు దూరం కావాల్సి వచ్చినా తొణకలేదు, బెణకలేదు. ఆ ఆత్మవిశ్వాసం ఆమెను విజేయురాల్ని చేసింది. ప్రజలు తెచ్చిన ఒత్తిడితో ప్రభుత్వమే తలవంచి, ఆమె ఉద్యోగాన్ని సగౌరవంగా తిరిగిచ్చింది. నేను చెప్పేదేమిటంటే... ప్రతి మహిళలోనూ ఒక దుర్గ ఉంది. కానీ ఆమెను వెలికితీయడంలోనే మహిళ విఫలమవుతోంది. తండ్రో, అన్నో, భర్తో తోడు ఉండాలని ఆశిస్తోంది తప్ప, ప్రయత్నిస్తే తానే ఎంతోమందికి అండగా నిలబడగలనన్న వాస్తవాన్ని గ్రహించడంలో స్త్రీ విఫలమవుతోంది. నిజానికి దుర్గాశక్తి విజయం వెనుక ఆమె తండ్రి, భర్త, మామగారు ఉన్నారు. కానీ అందరి కుటుంబాల్లోనూ అలాంటివాళ్లు ఉండరు. లేనంతమాత్రాన వెనకడుగు వేయాల్సిన పని లేదు. ధైర్యంగా అడుగు వేస్తే... ఆత్మవిశ్వాసమే ఆయుధమవుతుంది. నమ్మకంగా ముందుకు సాగితే... మనోధైర్యమే తోడవుతుంది. అదే ప్రతి మహిళనూ నడిపిస్తుంది... గెలిపిస్తుంది. - శోభా డే ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ -
మొహాలీలోనూ మెరిసేనా!
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం మొహాలీ: రెండో వన్డేలో దుస్సాధ్యమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) పంజాబ్ క్రికెట్ స్టేడియం (పీసీఏ)లో ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ ఛేజింగ్‌తో రికార్డుకెక్కిన భారత ఆటగాళ్ల నుంచి నేటి వన్డేలోనూ అలాంటి ప్రదర్శనే కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. జైపూర్ వన్డేలో 360 పరుగులను శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి కేవలం 44 ఓవర్లలోనే ఛేదించడంతో ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగింది. ఓ రకంగా తమ ముందు ఎంత లక్ష్యముంచినా ప్రత్యర్థి ప్రశాంతంగా ఉండలేడని ఈ త్రయం నిరూపించింది. తొలి మ్యాచ్‌లో 300కు పైగా టార్గెట్‌ను అందుకోలేకపోయిన భారత జట్టు రెండో వన్డేలో మాత్రం తమ చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి అతి భారీ స్కోరును అందుకున్న తీరు అమోఘం. అటు ఆసీస్ పటిష్ట భారత్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తోంది. కచ్చితంగా ఈ వన్డేలో నెగ్గి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు పీసీఏ పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరోసారి అభిమానులకు పరుగుల విందు ఖాయం కానుంది. బ్యాటింగే బలం దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ భారత జట్టుకు పెట్టని కోటలా ఉంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ చెలరేగి శుభారంభాన్ని అందిస్తుండగా వన్‌డౌన్‌లో కోహ్లి సంచలన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆ తర్వాత రైనా, ఫామ్‌లో ఉన్న యువరాజ్, కెప్టెన్ ధోని, జడేజా తమ బ్యాట్లకు పని చెబితే ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగి పోవాల్సిందే. ఈ విషయం ఆసీస్ కెప్టెన్ బెయిలీకి కూడా బాగానే తెలుసు. అందుకే వన్డే ఫార్మాట్లో భారత్ టాప్-7 ఆటగాళ్లు అత్యద్భుతమని కితాబిచ్చాడు. ధావన్ తన తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టింది ఈ స్టేడియంలోనే కావడం అతడికి కలిసొచ్చే అంశం. యువరాజ్‌కు ఓరకంగా ఇది సొంత మైదానమే. రైనా, జడేజాలకు రెండో వన్డేలో అవకాశం రాకపోయినప్పటికీ భారీ స్కోర్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం జట్టును ఆందోళన పరిచే విషయం ఒక్క బౌలింగ్ విభాగంలోనే. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలు, ఓ టి20 కలుపుకుంటే మొత్తం 864 పరుగులను సమర్పించుకున్నారు. ఓవర్‌కు 7.20 చొప్పున పరుగులు ఇవ్వడం ఆందోళనపరిచే అంశం. ఒక్క భువనేశ్వర్ మినహా ఒక్కరు కూడా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టడం లేదు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండు వన్డేల్లో ఓవర్‌కు ఎనిమిది పరుగుల దాకా ఇచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ పూర్తిగా విఫలమవుతున్నాడు. దీంతో వినయ్, ఇషాంత్‌లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఒత్తిడిలో ఆసీస్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఊపులో రెండో వన్డే ఆడిన ఆసీస్‌కు భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఆతిథ్య జట్టును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. అయితే వీరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఓపెనర్లు ఫించ్, హ్యూస్ జట్టుకు శుభారంభాన్నిస్తున్నారు. బెయిలీ ఈ సిరీస్‌లో బాగా ఆడుతున్నాడు. అటు వాట్సన్ కూడా ఫామ్‌లోకొచ్చాడు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ పరంగానూ భారత్‌తో పోలిస్తే మెరుగనే చెప్పుకోవచ్చు. జాన్సన్, ఫాల్క్‌నర్, మెక్కే రూపంలో మంచి పేసర్లున్నారు. సమష్టిగా రాణించి ఈ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. జట్లు: (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, వినయ్, ఇషాంత్/ఉనాద్కట్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హాడిన్, జాన్సన్, మెక్కే, వోజెస్, డోహర్తి, ఫాల్క్‌నర్. వాతావరణం మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదు. పూర్తిగా ఎండ కాయనుంది. పిచ్ జైపూర్ పిచ్ తరహాలోనే ఇక్కడ కూడా బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మంచు కీలకం... ‘మొహాలీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఇక్కడే తొలి టెస్టు సెంచరీ సాధించాను. ఇక్కడ పేసర్లకు, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచు కూడా కీలకం కానుంది’ - శిఖర్ ధావన్ (భారత్ ఓపెనర్) ‘మా బౌలర్లపై నమ్మకముంది’ ‘రెండో వన్డేలో 360 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే మా బౌలర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారిపై నాకు నమ్మకం ఉంది. మూడో వన్డేలోనూ షేన్ వాట్సన్‌ను వన్‌డౌన్‌లోనే బరిలోకి దించుతాం.’ - జార్జి బెయిలీ (ఆసీస్ కెప్టెన్) 0 మొహాలీలో ఇప్పటిదాకా ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా సెంచరీ చేయలేదు 99 ఈ వేదికపై 2007లో సచిన్ చేసిన 99 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు 2 భారత్‌తో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో ఆసీస్ రెండు నెగ్గింది 5 ఈ మైదానంలో ఐదు సార్లు 300కు పైగా పరుగులు వచ్చాయి -
కోట్స్ = కొండంత ఆత్మ విశ్వాసం
‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతేమంది ఉన్నారు. హితబోధకు భిన్నంగా విజయపు విశ్వాసాన్ని ఇచ్చే నయా వేదాంతం పట్ల యువత ఎంతో ఆసక్తి కనపరుస్తోంది. ‘‘ఈ వాక్యం నా కోసమే చెప్పింది.. నా లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ అవుతోంది’’ అనుకుంటే చాలు టక్కున షేర్ చేసుకోవడమే! ‘‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. విజయపు విశ్వాసాన్ని కేవలం శ్రమ మాత్రమే ఇస్తుంది’’ అనే వివేకానందుడి స్ఫూర్తిని ఎంతమంది షేర్ చేస్తున్నారో... కాస్తంత సరదాగా... కొంచెం సీరియస్‌నెస్‌తో ఊరడింపునిచ్చే కోట్స్‌ను షేర్ చేసుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. ఫేస్బుక్లో నడుస్తున్న ఈ కోట్స్ ట్రెండ్ గురించి! ‘‘నేను అనేకసార్లు ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. నా స్నేహితుడు అన్నింటిలోనూ పాసయ్యాడు. అతడు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో ఒక ఉద్యోగి. నేను మైక్రోసాఫ్ట్ ఓనర్‌ను...’’ అతి విశ్వాసం ధ్వనిస్తోందా? లేక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందా? స్ఫూర్తిని పంచుతోందా? అంటే చెప్పలేం కానీ నేటి యువతకు బాగా నచ్చిన వాక్యమిది. ఫేస్బుక్లో బాగా షేర్ అవుతుండటమే ఇందుకు రుజువు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు ఆపాదించబడిన ఈ కామెంట్ ఎందరో యువకులకు స్ఫూర్తిని ఇస్తోంది. తమ జీవితంలో ఎదుర్కొన్న పెద్ద ఫెయిల్యూర్ల తర్వాతే గొప్పవాళ్లంతా అద్భుతమైన సక్సెస్‌లను సాధించారు అనే విషయాన్ని పై కామెంట్ చెప్పకనే చెబుతోంది. ‘‘అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉన్నవాళ్లే గొప్ప విజయాన్ని సాధించగలరు. గుర్తుంచుకోండి... ఫెయిల్యూర్ ఒక సంఘటన మాత్రమే. ఒక వ్యక్తి కాదు’’ రాబర్ట్ కెన్నడీ కోట్ ఇది. ఈ మాటలు... అపజయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నీ, గొప్పవిజయాన్ని సాధించవచ్చుననే విశ్వాసాన్నీ ఇస్తోంది. ‘‘నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది... పరాజయాన్ని ఆస్వాదించలేకపోతే, విజయానందాన్ని పొందలేరని. విమర్శలు ఎదుర్కొనకపోతే పొగడ్తలకు అర్హురాలివి కాదు’’ అని ఒక అవార్డ్ ఫంక్షన్లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి హాలీబెర్రీ చెప్పిన వాక్యమిది. హాలీబెర్రీని ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఆమె చెప్పిన ఈ మాటను కూడా అంతే ఇష్టపడుతున్నారు. అందులోని స్ఫూర్తిని గ్రహిస్తున్నారు. ‘‘ఎవరైనా ఫెయిల్ అయ్యారంటే వారిని నేను నమ్ముతాను. అభినందిస్తాను. అయితే తిరిగి ప్రయత్నించకపోవడాన్ని మాత్రం సమర్థించను’’ అంటున్నాడు ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్. ఇలా చెప్పు కుంటూపోతే ఎన్నో కోట్స్... కొండంత ధైర్యాన్ని ఇచ్చేవి! - జీవన్‌రెడ్డి.బి