మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అవరోధాలనూ అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది.
కలిసొచ్చే రంగు: మావిచిగురు
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ
మిథునం (మే 21 – జూన్ 20)
ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు.
కలిసొచ్చే రంగు: నీలం
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు.. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త.
కలిసొచ్చే రంగు: బూడిదరంగు
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది.
కలిసొచ్చే రంగు: వెండి
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభాసామర్థ్యాలకి గుర్తింపు కోసం మరింత కష్టపడాలి.
కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
విశ్రాంతిగా గడపడానికి, విహారానికి లేదా పిక్‌నిక్‌కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి.
కలిసొచ్చే రంగు: నారింజ
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు.
కలిసొచ్చే రంగు: లేత నారింజ
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు.
కలిసొచ్చే రంగు: చాకొలేట్
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
ఈ వారం విందు వినోదాలలో గడుపుతారు. పనిలో విసుగు అనిపించినా, చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెలకువ లేకపోతే మాట పడక తప్పదు.
కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది.
కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనుకోకుండా కొత్తవారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే పనులు విజయవంతమవుతాయని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ
టారో 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
Published Sat, Feb 4 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
Advertisement
Advertisement