Capacity
-
కాంట్రాక్టర్లకు వరం ఖజానాకు సున్నం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక, అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచి పెట్టి కమీషన్లు దండుకొనే పద్ధతులు వచ్చేశాయి. ఇందులో భాగంగా తాము కోరుకొనే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు. కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈనెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్ విధానంలో బిడ్ కెపాసిటీని మార్చుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 4) జారీ చేశారు.విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్), జల్‌జీవన్ మిషన్ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే..అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణం రూ.15 వేల కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్ 1 నాటికి ఒప్పంద విలువలో 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు – మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది.అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, అందులో 8 శాతాన్ని కమీషన్‌గా రాబట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3 ఏఎన్–బీగా మార్చారు. ఈ నిబంధనలో ‘ఏ’ అంటే గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి, పురోగతిలో ఉన్న పనుల విలువ. ‘ఎన్’ అంటే టెండర్ నోటిఫికేషన్లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. ‘బీ’ అంటే ఆ కాంట్రాక్టర్ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ.ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్ పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా రూ.1000 కోట్ల విలువైన పనులు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్ పిలిచిన పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అప్పుడు 3 ఏఎన్–బీ కింద ఆ కాంట్రాక్టర్‌కు రూ.5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2 ఏఎన్–బీ కింద అయితే ఆ కాంట్రాక్టర్‌కు రూ.3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది.పనుల్లో జాప్యం.. ఖజానాపై తీవ్ర భారం సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతోపాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడంలేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్ తదితర ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీని వల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధన వల్ల రూ.వంద కోట్ల విలువైన పనులను రెండేళ్లలో పూర్తి చేయలేక చతికిలబడిన కాంట్రాక్టర్‌కే కొత్తగా రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు దక్కుతాయి.వీటినీ రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం నిబంధనను సడలించింది. రూ.100 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక, ఏళ్ల కొద్దీ జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. అంతకంటే పదింతల పనిని ఎలా చేయగలుగుతారని ఇంజినీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 45 ఏళ్లలో కొండలా పూడిక కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు👉 క్యాచ్మెంట్ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు👉 గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
కడెంకు సీడబ్ల్యూసీ బృందం రాక
కడెం: కడెం ప్రాజెక్టు రక్షణపై సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) దృష్టి సారించింది. గతేడాది, ఈఏడాది ఎగువ నుంచి వరదనీరు వస్తున్న సమయంలో ప్రాజెక్టు గేట్లు తరచు మొరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు, సీడబ్ల్యూసీ బృందం ఈనెల 27, 28, 29 తేదీ ల్లో వస్తున్నట్టు సమాచారం. కడెం ప్రాజెక్టు నిర్మాణం 65 ఏళ్ల క్రితం జరిగింది. ప్రస్తుతం డ్యాం సేఫ్టీ, వరద గేట్ల పనితీరు, ప్రాజెక్ట్ నీటినిల్వ సామర్థ్యం, ఔట్‌ఫ్లో కెపాసిటీ, ప్రాజెక్ట్ నిర్వహణ తదితరాలను బృందం పరిశీలిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సీడబ్ల్యూసీ బృందం వస్తుందన్న సమాచార నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రాజెక్టు వరద గేట్లు, ఇతర మరమ్మతులు చకచకా చేస్తున్నారు. అదనపు గేట్ల ఏర్పాటుపై... కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువకు 3 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ రూపొందించారు. అయితే గతేడాది 6 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో రాగా, గేట్ల పైనుంచి వరద వెళ్లింది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం పెంచేలా కడెం ప్రాజెక్టు మొదటి గేటు పక్క నుంచి పాత జనరేటర్ గదివైపు ఐదు అదనపు గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. అదనపు గేట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సీడబ్ల్యూసీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్‌లు, కార్‌మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్‌లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
స్టీల్ తయారీలో నంబర్ 1 కావాలి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉక్కు లేదా 'మేడ్ ఇన్ ఇండియా' ఉక్కును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు, ప్రస్తుతం చైనా తర్వాత ముడి స్టీల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎన్ఎండీసీ, ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత్ స్టీల్ విషయంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా అవతరించినట్టు చెప్పారు. తలసరి స్టీల్ వినియోగం 2013-14లో 57.8 కిలోలు ఉంటే, అది ఇప్పుడు 78 కిలోలకు పెరిగిందన్నారు. ఉక్కు రంగంలో అధిక కర్బన ఉద్గారాల విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన సింధియా, 2030 నాటికి ఈ స్థాయిలను 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
‘థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుందని నిర్మాతల మండలి పేర్కొంది. సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం: ప్రభాస్ కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరింది. ఇందుకు లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. -
కెపాసిటీ మించింది..విషాదం మిగిల్చింది.
సాక్షి, ఎమ్మిగనూరురూరల్/పెద్దకడుబూరు: కొన్ని నిమిషాల్లో క్షేమంగా ఎమ్మిగనూరుకు చేరుకుంటాం అనుకుంటుండగానే మలుపు రూపంలో మృత్యువు ఆ చిన్నారులను పొట్టన పెట్టుకుంది. ఎమ్మిగనూరు సమీపంలో గురువారం మధ్నాహ్నం జరిగిన ఆటో ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన మాల నరసింహులు, ఈరమ్మలకు అశ్విని(10), నందిని, ఉష, పవిత్ర(1) నలుగురు ఆడపిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈరమ్మ తన పుట్టినిల్లు కర్ణాటకలోని సిరుగుప్పకు 12 రోజుల కిత్రం వెళ్లారు. గురువారం తన మెట్టినిల్లు కందనాతికి బయలుదేరారు. ఆదోనిలో బస్సు కోసం వేచి ఉండగా టాటా ఏసీ ఆటో ఎమ్మిగనూరుకు వెళ్తుండటంతో అందులో ఎక్కారు. వేగంగా వస్తున్న ఆటో.. నలందా బీఈడీ కాలేజీ మలుపు వద్ద అదుపు తప్పి డోర్ దగ్గర ఉన్న ఆశ్విని(10) కిందపడబోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కుమార్తెను కిందపడకుండా పట్టుకోవటానికి ప్రయత్నించేలోపు మరో చిన్నారి పవిత్ర(1) కింద పడిపోయింది. క్షణాల్లో ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అందులో ఉన్న వారిని కింద దింపి, గాయపడ్డ వారిని అటుగా వస్తున్న ఆటోలో ఎక్కించి, ఆదోని వైపు పరారయ్యాడు. ప్రమాదం హడావుడిలో ఉండటంతో చూసి తప్పించుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆటోలో కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటమే కాకుండా.. పిల్లలకు డబ్బులు ఇవ్వరు అని సీట్లో కూర్చున్న వారిని నిల్చోపెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే ప్రమాదంలో తల్లి ఈరమ్మకు ఎడమ చెయ్యి విరిగిపోయింది. క్షణాల్లో కళ్లముందే తమ పిల్లలు దుర్మరణం చెందటంతో తల్లిదండ్రులు దుఃఖసారగంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పెద్దకడుబూరు ఎస్ఐ అశోక్ ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును చిన్నారుల తండ్రి నరసింహులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని, ఆటో డ్రైవర్‌ను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
తడిచెత్తతో కొత్త ఇంధనం...
భూతాపోన్నతి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం కొత్త కొత్త ఇంధనాల వేటలో పడింది. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఏ ముడిసరుకు నుంచైనా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ఆహారపు వ్యర్థాలతోపాటు తడిచెత్త (పంది వ్యర్థం తదితరాలు)లతో డీజిల్ లాంటి ఇంధనం తయారు చేయడంలో విజయం సాధించారు. సాధారణ డీజిల్‌కు ఈ కొత్త ఇంధనాన్ని కలుపుకుంటే సామర్థ్యం పెరగడంతోపాటు కాలుష్యమూ తగ్గుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న బ్రజేంద్ర శర్మ అనే శాస్త్రవేత్త తెలిపారు. అమెరికాలో ఏటా దాదాపు 8 కోట్ల టన్నుల తడిచెత్త వృథా అవుతుంటుందని ఇందులో ఏ కొంచెం ఇంధనంగా మారినా ఎంతో ప్రయోజనం ఉంటుందని బ్రజేంద్ర వివరించారు. పది నుంచి 20 శాతం ఇంధనాన్ని డీజిల్‌లో కలిపితే చాలు శక్తి ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం తాము ఓ నమూనా యంత్రాన్ని తయారు చేశామని, ఒక టన్ను తడిచెత్తతో 30 గ్యాలన్ల బయోక్రూడ్ ఆయిల్ తయారు చేయవచ్చునని, వాహానలపై కూడా బిగించుకోగల మోడల్ ప్లాంట్ తయారీ కూడా సాధ్యమని వివరించారు. -
ఏడాదిలో 10 ఐస్ప్రౌట్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ వర్క్‌స్పేసెస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ఐస్ప్రౌట్... కొత్త నగరాలకు విస్తరిస్తోంది. 2019 మార్చిలో చెన్నైలో 210 సీట్ల సామర్థ్యం ఉన్న కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. పుణే, బెంగళూరు, గుర్గావ్లోనూ ఆరు నెలల్లో బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ కో–ఫౌండర్ సుందరి పాటిబండ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. ఇటీవలే విజయవాడలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 సీట్ల సామర్థ్యం గల కార్యాలయాన్ని ప్రారంభించామని, 2019 డిసెంబరుకల్లా 10 సెంటర్లతో మొత్తం 7,000 సీట్ల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యమని వెల్లడించారు. ‘హైదరాబాద్‌లో ఐస్ప్రౌట్కు 1.3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 2,400 సీట్ల సామర్థ్యం గల బిజినెస్ సెంటర్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ సామర్థ్యం పరంగా భారీ, ప్రీమియం బిజినెస్ సెంటర్ ఇది. ఇప్పటి వరకు రూ.25 కోట్లు వెచ్చించాం. భవిష్యత్ విస్తరణలో భాగంగా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలన్నది మా ఆలోచన’ అని ఆమె వివరించారు. -
సిలికోసిస అంటే ఏమిటి?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. – కె. పద్మనాభరావు, విజయవాడ మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వాట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్ : సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్ : కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. ఇంత చిన్న పిల్లాడికి ఎప్పుడూ పొడిదగ్గు... పరిష్కారం చెప్పండి మా అబ్బాయి వయసు 11 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. విశ్వేశ్వరరావు, అనకాపల్లి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
పెద్ద లక్ష్యం
లక్ష్యం ఏమిటో నిర్థారించుకున్నాక దాని కోసం చేయవలసిన కష్టమంతా చేయాల్సిందే. అతనిదొక ఎగువ మధ్యతరగతి కుటుంబం. తన వాటాగా తండ్రి ఇచ్చిన డబ్బుకు మరికాస్త అప్పు చేసి ఆ వచ్చిన డబ్బుతో కాస్త పెద్ద హోటల్ పెట్టాలనుకున్నాడు. లక్ష్యం నిర్ణయించుకున్నాడు కాబట్టి దానిని నెరవేర్చుకోవడం కోసం ముందు ఏదయినా హోటల్లో పనిచేసి కొంత అనుభవం గడించాలనుకున్నాడు. ఓ హోటల్‌కు వెళ్లి లెక్కలు రాసే పని అడిగాడు. తన దగ్గర పనేమీ లేదు పొమ్మని చెప్పి లోపల ఏదో పని చూసుకుని కొద్దిసేపటి తర్వాత వచ్చాడు యజమాని. ఆ యువకుడు అక్కడే ఉండటం చూసి ఇంకా ఎందుకున్నావని అడిగాడు. ‘‘సార్, నాకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. బజారుకు వెళ్లి హోటల్‌కి కావలసిన సరుకులు తీసుకు వస్తాను, వచ్చిన కష్టమర్లను రిసీవ్ చేసుకుని వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటాను. మీరు జీతం ఎంత ఇచ్చినా ఫరవాలేదు’’ అని ప్రాధేయపడ్డాడు. ఆ యజమానికి జాలేసి, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఈ యువకుడు హోటల్లోకి అవసరమైన సరుకులు, కూరగాయలు మధ్యవర్తులతో పని లేకుండా స్వయంగా తనే వెళ్లి కొనడం దగ్గర నుంచి çహోటల్‌ను శుభ్రంగా ఉంచడం, వచ్చిన వారికి మర్యాద చేయడం వంటి పనులతో హోటల్‌కు ఖర్చులు తగ్గించి, రాబడి పెంచాడు. తన మంచితనంతో, సామర్థ్యంతో తొందరలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా, ఆ తర్వాత మేనేజర్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. కొద్దికాలానికి ఆ పెద్దాయన పొరుగు దేశంలో స్థిరపడదలచి ఈ యువకుడికి నామమాత్రపు ధరకే ఆ హోటల్‌ను విక్రయించాడు. ఆ యువకుడు తాను పని చేసే హోటల్‌కు యజమాని అయ్యాడు. అలా మొదలైన ఆ యువకుడి ప్రస్థానం అంతటితో ఆగలేదు. ఎన్నో హోటల్స్‌ను స్థాపించాడు. ఎందరో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రేరణ అయ్యాడు. ఆనాటి ఆ యువకుడే మోహన్ సింగ్ ఒబెరాయ్. స్టార్ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసిన ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అయ్యాడు. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోగానే సరిపోదు, అది స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉండాలి. దానిని ఎలాగైనా నెరవేర్చుకునే తపన, వచ్చిన చిన్న అవకాశాలని కూడా అందిపుచ్చుకునే ఓర్పూ నేర్పూ ఉండాలి. – డి.వి.ఆర్. -
గందరగోళానికి గురవుతుంటారా?
ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయాన్ని మార్చుకోవటం... తిరిగి ‘‘అరె మొదట అనుకున్నట్లయితేనే బాగుండేదే!’’ అని కన్ఫ్యూజ్ అవ్వటం. ఆలోచనలో పరిణతి, నమ్మకం లేకపోవటం. ఇలాంటి ప్రవర్తననే గందరగోళం అంటాం. దార్శనికత, కోరిక, సామర్థ్యం, అర్థం చేసుకోగలగటం, స్ఫూర్తి ఇవన్నీ కలిస్తేనే మీ ఆలోచనలో స్పష్టత ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే లక్ష్యాలను చేరటం కష్టమేమీ కాదు. చదువు, వృత్తి, సాధారణ జీవితం ఇలా ఏ కోణంలోనైనా గందరగోళానికి తావివ్వకూడదు. 1. మీ ఇష్టాలు, సామర్థ్యాలను ఒక పట్టికలో, మీ బలహీనతలను మరొక పట్టికలో రాసుకుంటారు. దీనివల్ల వేటిలో మీరు మెరుగ్గా ఉన్నారో, ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారోనన్న విషయాన్ని గ్రహిస్తారు. ఎ. అవును బి. కాదు 2. ఒకే ర కంగా కాకుండా, వివిధ రకాలుగా ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీలోని క్వాలిటీస్‌ను గుర్తిస్తారు. అవకాశాలను వదులుకోరు. ఉత్సాహాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోరు. నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉంటారు. భగవంతునిపై విశ్వాసం ఉంటే, మీ నమ్మకానికి భక్తిని జోడిస్తారు. ఎ. అవును బి. కాదు 5. గుడ్డిగా దేనినీ నమ్మరు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవో? కాదో? అని భయపడరు. మీపై మీకు నమ్మకం ఉంటుంది. ఎ. అవును బి. కాదు 6. ఒక సమయంలో ఒకదానిమీదే దృష్టిసారిస్తారు. దానిమీదే మీ నైపుణ్యాన్ని చూపిస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుంటారు. మాటలకే పరిమితం కాకుండా మీరు చేయాల్సిన పనిని చేస్తూనే ఉంటారు. ఎ. అవును బి. కాదు 8. స్థిరత్వంతో ఉంటారు. ఏ పనికైనా సగం బలం దీని ద్వారానే లభిస్తుందని మీకు తెలుసు. నిలకడ మనస్తత్వం ద్వారానే మానసిక బలాన్ని పొందవచ్చని నమ్ముతారు. ఎ. అవును బి. కాదు 9. మీరు నేర్చుకోవాలనుకుంటున్న అంశాలను ఆయా నిపుణుల దగ్గర ప్రస్తావిస్తారు. మీ సందేహాలను పుస్తకాలు, ఇతర మార్గాల ద్వారా నివృత్తి చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 10. ఏదైనా పని చేసేటప్పుడు గందరగోళానికి గురవుతుంటే ఆ పనికి కాసేపు విరామం ఇస్తారు. ఆలోచనలు కుదుటపడ్డాక ఆ పనిని ప్రారంభిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో గందరగోళానికి తావుండదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారు. ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచించే సామర్థ్యం మీలో ఉంటుంది. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ ఆలోచనల్లో స్పష్టత ఉండదు. నిలకడలేని మనస్తత్వం వల్ల తరచుగా ఆందోళనకు గురవుతారు. ‘ఎ’ లను సూచనలుగా భావించి ఆలోచనల్లో నిలకడను ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి. -
మందేస్తే.. లాంగ్వేజ్ సూపర్!
లండన్: పరిమిత స్థాయిలో మద్యం సేవించేవారిలో విదేశీ భాషలో మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెదర్లాండ్‌లోని మాస్ట్రిచ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూర్, లండన్‌లోని కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల డచ్ నేర్చుకున్న 50 మంది జర్మన్లను ఎంపిక చేశారు. ఒక్కొక్కరి శరీర బరువును బట్టి మద్యం డోస్‌ను నిర్ధారించారు. ఈ అభ్యర్థుల భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఇద్దరు డచ్ పౌరుల్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా తమ భాషా నైపుణ్యానికి మార్కులు ఇచ్చుకోవాల్సిందిగా అభ్యర్థులకు పరిశోధకులు సూచించారు. అయితే ఈ వ్యక్తులు మద్యం సేవించిన విషయాన్ని మాత్రం ఇద్దరు డచ్ పరిశీలకులకు తెలియజేయలేదు. పరిమిత స్థాయిలో మద్యం సేవించిన వ్యక్తులు మద్యం తాగని వారితో పోల్చుకుంటే డచ్ భాషను మాట్లాటడంలో ఎంతో మెరుగ్గా వ్యవహరించారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
మీరే పరిష్కరించుకుంటున్నారా?
సెల్ఫ్ చెక్ ‘‘మా అమ్మాయి ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలదు. అవి ఆఫీస్‌కు సంబంధించినవైనా సరే... జీవితానికి సంబంధించినవైనా సరే’’ ఇలాంటి ఈక్వేషన్ మీకూ వర్తిస్తుందా? మనసమస్యలను మనమే పరిష్కరించుకోగలిగే సామర్థ్యం అవసరం. చిన్నచిన్న విషయాలకు పక్కవారిపై ఆధార పడటం అనవసరమే. ఎంత పెద్ద సమస్యలైనా ఓర్పుతో, సమన్వయంతో పరిష్కరించుకోవచ్చు. మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యం ఉందో లేదో చెక్ చేసుకోండి. 1. సవుస్య దేనివల్ల కలుగుతుంది? ఎవరివల్ల? ఎప్పటినుంచి? అని గుర్తించగలరు. ఎ. అవును బి. కాదు 2. సమస్యలను వాటి పరిష్కారాలను ఒక పేపర్‌పై రాసుకొనే అలవాటు మీకుంది. ఎ. అవును బి. కాదు 3. గుర్తించిన సవుస్యల్లో వుుఖ్యమైనది, ఎక్కువగా ఇబ్బంది పెట్టేదాన్ని ముందుగా పరిష్కరించటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 4. మీలో ఆశావహదృక్పథం ఎక్కువ, ప్రతి సవుస్యకు వూర్గం ఉందని నవు్ముతారు. ఎ. అవును బి. కాదు 5. ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ప్రత్యామ్నాయ వూర్గాలను ఎన్నుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. విజయసాధనలో పొరపాట్లు, అపజయాలు సాధారణమని మీకు తెలుసు. స్ఫూర్తినిచ్చే పుస్తకాలను చదువుతారు. ఎ. అవును బి. కాదు 7. చుట్టూ సమస్యలు ఉన్నా మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు చేస్తూ నవ్వుతూ రోజు గడిపేస్తారు. ఎ. అవును బి. కాదు 8. మీరు ఫాలో అయిన పరిష్కారమార్గం, ఫలితాన్ని ఒక సారి విశ్లేషించుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 6 దాటితే మీలో సమస్యపరిష్కార సామర్థ్యం పూర్తిస్థాయిలో ఉన్నట్లు. కష్టాల్లో, సమస్యల్లో దిగులు పడకుండా విజయాలే లక్ష్యంగా ముందుకు వెళతారు. ‘బి’ సమాధానాలు ఎక్కువైతే మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ లేనట్లే. సమస్యలను చూసి దూరంగా వెళ్లే మనస్తత్వం ఉండవచ్చు. దీనివల్ల సమస్యలొచ్చినప్పుడు చికాకుగా, ఆందోళనగా అందరిపై కోపంతో ఉంటారు. సమస్యా పరిష్కార పద్ధతి అంత సులువైంది కాక పోయినా చిన్నగా దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. ‘ఎ’ సమాధానాలను సూచనలుగా భావించి ఆ పద్ధతులు ఫాలో అవ్వటానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్... -
ఇతరుల సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీలో ఉందా?
సెల్ఫ్ చెక్ ‘ఎవరు ఏమైతే నాకేంటి? నేను బాగుంటే చాలు... లేనిపోని విషయాల గురించి నాకెందుకు?... నేను ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం అందితేచాలు’... ఈ విధంగా తమ గురించే ఆలోచించుకొనేవారు తమకు లాభం చేకూర్చని విషయాల గురించి ఆలోచించటానికి ససేమిరా అంటారు. కొందరైతే ఎదురుగా జరుగుతున్న సమస్యలపై స్పందిస్తారు. సహాయం చేయటానికి ముందుంటారు. గొడవ పడుతున్నవారికి మధ్య పెద్దమనిషిలా జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తారు. మీలో ఆ సామర్థ్యం ఉందా? 1. ఏదైనా శుభకార్యాలకు పెద్దగా మిమ్మల్ని పిలవటానికి చుట్టుపక్కల వారు ఉత్సాహాన్ని చూపుతారు. ఎ. అవును బి. కాదు 2. క్లిష్ట పరిస్థితుల్లో దిగాలు చెందరు. ఎ. అవును బి. కాదు 3. అందరికీ ఇబ్బందికలిగించే సంఘటనలు మీముందు జరుగుతుంటే నిమ్మళంగా ఉండరు, ప్రశ్నిస్తారు. ఎ. అవును బి. కాదు 4. చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. మీ గురించి కామెంట్ చేసే అవకాశం ఇతరులకు ఇవ్వరు. ఎ. అవును బి. కాదు 5. వెంటనే స్పందించే తత్వం మీది. పనిలోనూ అలసత్వాన్ని ప్రదర్శించరు. ఎ. అవును బి. కాదు 6. వాక్చాతుర్యంతో ఎలాంటి విషయాన్నైనా సులభంగా డీల్ చేయగలరు. ఎ. అవును బి. కాదు 7. మధ్యవర్తిత్వం నడిపేటప్పుడు ఇద్దరి వాదనలూ వింటారు. ఏకపక్షంగా ప్రవర్తించరు. ఎ. అవును బి. కాదు 8. పదిమంది కూడినచోట గొడవ అవుతుంటే, మీ మాటల ద్వారా అక్కడ వాతావరణాన్ని చక్కదిద్దగలరు. ఎ. అవును బి. కాదు 9. మీ మాటల్లో పరిణతి, గాంభీర్యం ఉంటుంది. అర్థంలేని మాటలుండవు. ఎ. అవును బి. కాదు 10. ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు మీకు తోచిన సహాయం చేయకుండా ఉండరు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీలో సహాయంచేసే లక్షణం బాగా ఉంటుంది. దీనివల్లే ఇతరుల విషయాలను పరిష్కరించటానికి చొరవ తీసుకుంటారు. ఇతరులకు సలహాలు ఇచ్చేముందు మీ ప్రవర్తన బాగుండేలా చూసుకుంటారు. ‘బి’ లు ‘ఎ’ ల కంటే ఎక్కువగా వస్తే మీరు మీ గురించే ఆలోచిస్తారు. నాయకత్వ లక్షణాలు తక్కువ. -
టారో 30 ఏప్రిల్ నుంచి 6 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో సాగిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, వీపునొప్పి, కొద్దిపాటి మానసిక ఒత్తిడి బాధించవచ్చు. సంగీత చికిత్స లేదా ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. మీ కలలు నిజం అయే అవకాశం కలుగుతుంది.Sపలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం ప్రయోజనం చేకూరుతుంది. మీ ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి మంచి కబురు అందుతుంది. చదువుకు సంబంధించిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. విందు వినోదాలలో తీరుబడి లేకుండా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుని, వేగంగా పని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కలిసి వచ్చే రంగు: » ంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూత్న శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంగా పని చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశీయానం చేయవలసి రావచ్చు. ఒక స్త్రీ మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పెట్టిన పెట్టుబడల నుంచి లాభపడతారు. మార్నింగ్ వాక్, యోగ వంటివి కొనసాగించడం మంచిది. కలిసివచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు అందుతాయి. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. మీ కష్టసుఖాలను స్నేహితులకు చెప్పుకుని ఉపశమనం పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు చేసిన పనులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి ఓర్చుకోలేక మిమ్మల్ని చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. తెలివిగా తిప్పికొట్టడం అలవరచుకోండి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యం అవవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. Ðఅవకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 23 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పనిలో బాధ్యతాయుతంగా మెలిగి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉరవడిని కనిపెడతారు. లక్ష్యాలను నిర్ణయించుకుని పని చేస్తే మెరుగైన ఫలితాలను పొందగలమని గ్రహిస్తారు. ఈ వారం మీ స్నేహితుడి నుంచి ఒక శుభవార్తను అందుకుంటారు. ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండటం అవసరం అని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పనిప్రదేశంలో కొత్త సవాళ్లు, కొన్ని ప్రతిబంధకాలూ ఏర్పడవచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోక, సహోద్యోగుల సహకారంతో తగిన చర్యలు చేపట్టండి. ఎంతోకాలంగా ఒక వ్యాపారం ఆరంభించడానికి లేదా కొత్త ఆదాయ మార్గం కోసం ఎంతోకాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది తగిన సమయం. ప్రేమలో మీకున్న చిక్కులు తొలగుతాయి. కలిసొచ్చే రంగు: నీలాకాశం మిథునం (మే 21 – జూన్ 20) మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే విజయానికి చేరువ అవుతారని గ్రహించండి. పాత జ్ఞాపకాలు కొంత బాధపెట్టవచ్చు. అయితే గతంలోని చేదును మాత్రమే కాకుండా, తీపి అనుభవాలనూ నెమరు వేసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ విషయంలో కొద్దిపాటి చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: పచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది ముఖ్యమైనదో కాదో అవగాహన ఏర్పరచుకుని అందుకు తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరినీ కలుపుకుంటూ పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం మీరు మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. బద్ధకమనే మీ శత్రువును వదిలించుకుంటే మంచిది. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పాత బాకీలనుంచి, అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు. కలిసిచ్చే రంగు: దొండపండు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) చాలా కాలంగా మీరు అణగదొక్కి ఉంచిన సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. జాగ్రత్త. ఇది మీ ప్రస్తుత జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి పలుకుబడిని ఉపయోగించి, తిరిగి ఆ సమస్యలను అణిచేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్లద్దు. కలిసొచ్చే రంగు: కాఫీ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త విషయాలను నేర్చుకోవాలన్న మీ జిజ్ఞాసను ఈ వారంలో తీర్చుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ కళ అందరినీ అలరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. భావోద్వేగాలలో మునిగి తేలతారు. కలిసొచ్చే రంగు: తెలుపు -
టారో 16 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విజయం వరిస్తుంది. మీ కృషి, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంభాషణా చాతుర్యంతో సభలు, సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితానికీ, బిజినెస్కీ సమన్వయం ఉండేలా చూసుకోండి. కుటుంబం వల్ల ఆనందం కలుగుతుంది. లక్కీ కలర్: లేత గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చురుకుగా, అంకితభావంతో పని చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఉదారంగా, నిజాయితీగా ఉంటారు. మీ హాస్య చతురతే క్లిష్ట పరిస్థితులనుంచి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. మీ కుమారుడు లేదా ఆప్తుడు వృద్ధిలోకి వచ్చి మీకు చేయూతగా నిలుస్తారు. ధ్యానం ద్వారా మీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ నీతి నిజాయితీలు, పరోపకార గుణాలే మిమ్మల్ని వ్యాపారంలో లాభాలబాటలో నడిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారానికి పురిగొల్పుతాయి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. వారికి స్వాంతన చేకూరుస్తారు. పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: ముదురు గులాబీ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. లక్కీ కలర్: లేత బూడిద రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీ చుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తెలివిగా తిప్పికొడతారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ కలర్: బంగారు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పనిలో కొద్దిపాటి ఒత్తిడి తప్పదు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. లక్కీ కలర్: స్ట్రాబెర్రీ వంటి ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కలిసొచ్చే వారమిది. ఏదైనా విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకుంటే తటపటాయించవద్దు. లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. విదేశీయానం ఉండవచ్చు. శరీరాకృతిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: మావి చిగురు -
టారో : 9 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉత్సాహంతో పనులు చకచకా చే స్తారు. ముఖ్య విషయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అవమానం తప్పదు. మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు. కెరీర్లో లేదా మీ జీవితంలో భారీ మార్పు చేర్పులుండవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారం. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ కూచోవద్దు. అధికార యోగం లేదా పదవీయోగం తలుపు తడుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. వారసత్వపు ఆస్తులు కలిసి రావడం వల్ల సంపద పెరుగుతుంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కెరీర్‌పరంగా మార్పు చేర్పులుండవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బుర్రకు పదును పెట్టి, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతే అంతా శుభమే! ఒక విషయంలో సందిగ్ధత నెలకొనవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపడతారు లేదా కొత్తవారితో పనిచేయవలసి రావచ్చు. పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. అననుకూలతలనూ అధిగమిస్తారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడతాయి. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ కెరీర్ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో‡మార్పు చేర్పులు చేసుకుంటారు. తొందరపడి మాట ఇవ్వడం లేదా మొహమాటానికి పోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టి, మంచి. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మౌనంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొహమాటంతో మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకపోతే మునిగిపోతారు. కుటుంబ వ్యవహారాలలో పట్టీపట్టనట్టు ఉండే మీ ధోరణి మంచిది కాదు. కలిసొచ్చే రంగు: గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. విసుగువల్ల, తప్పదన్నట్లు పని చేసి, నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: నలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఉన్నతమైన హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టినకొద్దీ, మీకు మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కెరీర్‌పరమైన విషయాలలో మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయ వ్యయాలలో ప్రణాళిక ప్రకారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 2 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కల్యాణ ఘడియలు మోగవచ్చు సంసిద్ధంగా ఉండండి. సన్నిహితుల సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పగటికలలు మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. న్యాయపరమైన వివాదాలలో అనవసర జాప్యం మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు. గురువులు లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటారు. కుటుంబపరంగా సంతృప్తి. కలిసొచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విజయాల బాటలో నడుస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. జీవితంలో పెద్ద మలుపునకు దారితీయవచ్చు. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి. అంచనా వ్యాపారాలు, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్లవద్దు. అవకాశాలకోసం నిశిత పరిశీలన చేస్తారు. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి రావచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలకు, లక్ష్యాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) చాలా అవిశ్రాంతంగా గడుపుతారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిం^è ండి. సానుకూల భావనలతో ఉండండి. పెట్టుబడులలోఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జిమ్ లేదా యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా ఉల్లాసంగా పని చేస్తారు. అదే మిమ్మల్ని విజయాలబాటలో నడిపిస్తుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. పిల్లల విషయమై మంచి వార్తలు వింటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వ్యాపార విస్తరణకు మంచి అవకాశం లభిస్తుంది. మీ సహాయ సహకారాల కోసం టీమంతా ఎదురు చూస్తుంటుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అలసిపోయిన శరీరాన్నీ మనస్సునూ సేదతీర్చడానికి విందు వినోదాలలో గడుపుతారు. విహార యాత్రలు చేసేందుకు తగిన సంసిద్ధతలో ఉంటారు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. కలిసి వచ్చే రంగు: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) నిత్యం పనుల ఒత్తిడితో అలసిపోయిన మీరు సేదతీర్చుకోవడానికి ఇష్టమైన వారితో కలసి పిక్నిక్కు లేదా దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళదామని ఆలోచన చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ సన్నిహితులకు వచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపించి, వారి అభినందనలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: వెండి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదే కానీ, అలాగని కుటుంబ జీవితాన్ని త్యాగం చేయకూడదు కదా... ప్రణాళికాబద్ధంగా పని చేసి, ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. వెన్నుపోటు దారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అవసరం. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ద్వారా ఆశించినంత ఆదాయం లభించకపోవడం నిరాశకు గురి చేస్తుంది. రోజూ ఉదయమే లేలేత సూర్యకిరణాలలో స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మీ విజ్ఞానంతో, సృజనాత్మకతతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలను, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. గృహ సంబంధమైన కొత్తవస్తువులు లేదా బంగారం కొంటారు. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) శక్తిసామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ప్రజా సంబంధాలను మెరుగు పరచుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. మనసు చెప్పిన మాట వినండి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: నారింజ లేదా కాషాయం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంటారు. కలిసి వచ్చే రంగు: గోధుమరంగు -
టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు మీ వెంటే ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరెంతో ముందుచూపుతో, ఆశావహ, సానుకూల దృక్పథంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది. తిరస్కృతులు, హేళనలు ఎదురయినా పట్టించుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ మార్గంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుముళ్లన్నీ వీడిపోతాయి. మీరు మీ అంతరాత్మ మాట వినడం లేదు. మీ మంచి చెడులలో అనుక్షణం మిమ్మల్ని హెచ్చరిస్తూ, మేలు చేద్దామని చూస్తుంటే, తోసిపుచ్చడం తప్పు. వెంటనే మనసు మాట వినండి. చెడు స్నేహాల పట్ల జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) డబ్బుకు సంబంధించి కొన్ని భయాందోళనలు నెలకొనవచ్చు. ముఖ్యంగా డబ్బు భద్రతకు సంబంధించినవి. అలాగే ధన సంపాదన విషయంలో కూడా అంతే ఇబ్బంది. వృత్తిపరంగా మీరు మేటి. అలాగని మీ వ్యక్తిగత సంతోషాలు, జీవితాన్ని వదులుకోవద్దు. మీ ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని మీద దృష్టి పెట్టండి. మీరు సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనక గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త పడటం మంచిది. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అవసరం. సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టసుఖాలను శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. లాభదాయకమైన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి తగిన సమర్థులను అన్వేషించండి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. మీ విజయానికి వేడుకలు చేసుకుంటారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా మీరు మాట్లాడే ప్రతి మాటా నిజం అవుతుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. కెరీర్లో రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు -
అలజడి
జీవితం అనే సాగరంలో మన ప్రయాణం కాగితపు పడవలోనే. అలలో జడి లేకున్నా... మనలో అలజడి ఉన్నా ప్రయాణం కష్టం. ఇతరుల కన్నా ముందే ఉండాలన్న అలజడి ఎన్నో జీవితాలను ముంచేస్తోంది. ముందుండాల్సింది ఇతరుల కన్నా కాదు... పోరాడాల్సింది సాటివాళ్లతో కాదు... మీ సామర్థ్యంతో మీరే ప్రతిరోజూ తలపడండి. పోరాడండి. అప్పుడు మీ ప్రతి అడుగూ ఒక ముందడుగు అవుతుంది. కాగితపు పడవలో కూడా సుదూర ప్రయాణం చేస్తారు. కాలింగ్‌బెల్ మోగింది. డైనింగ్ టేబుల్ మీదే తలపెట్టి నిద్రపోతున్న కీర్తి లేచి టైమ్ చూసింది. అర్థరాత్రి దాటింది. డోర్ తీసింది. ఎదురుగా భర్త వంశీ. గుమ్మంలోనే ప్రశ్నించింది కీర్తి. ‘‘కనీసం ఈ ఒక్కరోజైనా ఇంటికి త్వరగా రావచ్చు కదా. ఎప్పుడూ పని పని.. అంటారు. ఈ రోజు దినేష్ బర్త్ డే అనైనా గుర్తుందా. వాడు ఇంత సేపు చూసి చూసి కేక్ కట్ చేయకుండా అలాగే నిద్రపోయాడు..’’ బాధగా అంది కీర్తి.‘‘ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసినా ఇంకా వెనకపడిపోతాం. కష్టపడితేనే కదా విజయం సాధించేది. నీకిది చెప్పినా అర్థం కాదు. కేక్ కట్ చేయడమేగా. చేసేయాల్సింది..’’ సింపుల్‌గా అంటూ వెళ్లి పడుకున్నాడు వంశీ. నీళ్లు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. టేబుల్ మీద అలాగే వదిలేసిన కేక్ తీసి ఫ్రిజ్‌లో పెట్టింది. పోటీలో వెనకపడిపోతే... ఆఫీస్ లిఫ్ట్‌డోర్ తెరిచీ తెరుచుకోకముందే లోపలికి పరిగెత్తాడు వంశీ. అంతే వేగంగా తన క్యాబిన్‌కి వెళ్లి సీట్లో కూర్చుని, సిస్టమ్ ఆన్ చేశాడు. ఆయాసంతో గుండె పట్టేసినట్టయింది. రొప్పుతున్నాడు. ఇక కుర్చీలో కూర్చోలేననిపించింది. తప్పనిసరై హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్ పల్స్ చెక్ చేసి ‘‘ఎందుకంత అలజడి పడుతున్నారు. హైబీపి ఉంది. రోజుకి ఎన్నిగంటల పనిచేస్తారు’’ అన్నాడు. ‘‘కనీసం 18 నుంచి 20 గంటలు. ఎందుకలా అడిగారు?’’ అన్నాడు వంశీ ‘‘అలా మిషన్లా పనిచేస్తే ఆరోగ్యం ఇలాగే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోండి’’ అంటున్న డాక్టర్ని వారిస్తూ.. ‘‘అలా అయితే ఈ పోటీ ప్రపంచంలో బతగ్గలమంటారా?’’అంటూనే లేచి వెళ్లడానికి నాలుగడుగులు వేసి, కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఫైళ్లతోనే కుస్తీ ఫోన్లో సమాచారం తెలియగానే కీర్తి అన్నయ్య రఘు వచ్చాడు. అన్నను చూడగానే ఏడుపు ఆగలేదు కీర్తికి. ‘‘ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏమైంది?’’ అని అడిగాడు చెల్లెలిని. ‘‘ఇరవై నాల్గంటలూ పని పని అంటూ ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ఫైళ్లతోనే ఉంటాడు. నన్నూ, దినేష్‌ను పూర్తిగా మర్చిపోయాడు. తన తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ మనిషికి ఆందోళనే. అదేమని అడిగితే ‘పనిలో ఉంటున్నాను కదా. పోటీకి తగ్గ స్పీడ్ లేకపోతే ఎలా?’ అంటున్నాడు. చెబితే కోపం, చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం. ఎలా చక్కదిద్దాలో అర్థంకావడంలేదన్నయ్యా!’’ ఏడుస్తూనే తమ పరిస్థితి అంతా వివరించింది కీర్తి. శ్రమలోనే కాలమంతా! కౌన్సెలర్ ముందున్నాడు వంశీ. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రిగ్రెషన్ థెరపీ ఒక గైడెన్స్‌లా ఉపయోగపడుతుందని నచ్చజెప్పి వంశీని రిగ్రెషన్ థెరపీకి తీసుకొచ్చాడు రఘు. కళ్లు మూసుకొని మౌనంగా ధ్యానముద్రలో ఉన్న వంశీకి కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సూచనలతో మెల్లగా తన జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు వంశీ. కంపెనీలో తను. తన అవసరానికి మించి పనిచేస్తున్నాడు. కింది ఉద్యోగులను బాగా పనిచేయాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని గైడ్ చేస్తున్నాడు. అటు నుంచి గతంలో చేసిన ఉద్యోగాల జాబితా పరిశీలించాడు. అంతటా తన తోటివారందరిలోనూ ముందుండాలని ఎక్కువ శ్రమిస్తున్నాడు. అయినా, తనకన్నా తక్కువ గంటలు పనిచేసేవారే ముందుంటున్నారు. కాలేజ్, స్కూల్ రోజుల్లో తను అందరికన్నా ముందుం డాలని అనిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకు? అన్వేషణ మొదలైంది. ఆ శోధనలో బాల్యదశలో ఒక చోట ఆగిపోయాడు వంశీ. కాసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను మూడు, అన్నయ్య ఐదవ తరగతి చదువుతున్నాం. మేమిద్దరం నాన్న ముందు నిల్చుని ఉన్నాం. నాన్నకు మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాం. నాన్న అన్నయ్యను మెచ్చుకుంటున్నాడు. తన జేబులో ఉన్న పెన్ను తీసి అన్నయ్య జేబులో పెట్టి, ‘నా పేరు నిలబెట్టేది నువ్వేరా’ అని ముద్దులు పెడుతున్నాడు. ‘మరి నాకు పెన్ను’ అన్నాను. ‘అన్నయ్యకన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూద్దాం’ అని వెళ్లిపోయాడు నాన్న. కష్టపడి చదవాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అన్నానికి పిలిచినా వెళ్లకుండా చదువుతున్నాను. రాత్రిళ్లు కరెంట్ పోయినా దీపం పెట్టుకొని చదువుతున్నాను. నెక్ట్స్ క్లాస్‌కి స్కూళ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అన్నయ్యకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతున్నాను’’ అంటూ ఆగిపోయాడు వంశీ. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అమితంగా బాధించిన సంఘటన ఏదున్నా చెప్పండి’’ అన్నారు కౌన్సెలర్. వంశీ ప్రయాణం ఇంకా వెనక్కి తిరిగింది. వంశీ చెబుతున్నాడు ‘‘నేను, అమ్మ గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్న ‘వీడేంటి ఇంత నల్లగా పుట్టాడు. పెద్దోడిది మంచి రంగు’ అంటున్నాడు. ఆయన చూపులు నన్ను అసహ్యించుకున్నట్టు ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే ముందంజనా! ‘‘వంశీ, మీరు ఇప్పుడు అమ్మ గర్భంలో నుంచి మీ గత జన్మలోకి ప్రయాణిస్తున్నారు. ఆ గతం తాలూకు అవశేషం ఎక్కడుందో చూడండి’’ అన్నారు కౌన్సెలర్. తల్లి గర్భంలో.. అటు నుంచి గతజన్మలోకి వంశీ ప్రయాణం సాగింది. ఆ అవశేషం గురించి వంశీ చెబుతూ ‘‘నేను అంధుడిని. రోడ్డుదాటలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను రోడ్డు దాటిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందరూ పరిగెడుతున్నారు. కనీసం నేను రోడ్డు కూడా దాటలేకపోతున్నాను. దేవుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు. అన్నీ సక్రమంగా ఉంటే అందరి కన్నా ముందుండేవాడిని. జీవితమంతా ఆ బాధతోనే గడిపాను. అలాగే మరణించాను’’ చెబుతున్న వంశీ గుండె నీరైంది. పోటీ మీద అవగాహన ‘‘వంశీ ఈ జన్మకు రండి. ప్రస్తుత పరిస్థితికి గత సంఘటనలకు బేరీజు వేసుకొని చూడండి’’ అంటూ కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘వంశీ, మీ జీవనప్రయాణంలోని స్పష్టత మీద దృష్టి పెట్టండి. మొదటిది: ‘అన్నయ్య కన్నా నేను తక్కువ’ అనే భావన మీలో ఎనిమిదేళ్ల వయసులో పడిపోయింది. దీంతో మెప్పు కోసం పోటీ పడాలని నిర్ణయించుకొని కష్టపడటం మొదలుపెట్టారు. మీ కష్టంలో ‘నాలో సామర్థ్యం తక్కువ’ అనే ఆలోచన బలంగా పడిపోయింది. సామర్థ్యాన్ని మెరుగుపెట్టుకుంటే మీ అన్నకన్నా నాలుగు మార్కులు సంపాదించడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నపని కూడా సామర్థ్యంతో కాకుండా కష్టంతో లాక్కొస్తున్నారు. రెండవది: నల్లగా పుట్టానని, అందంగా ఉన్నవారితో పోటీపడలేననే భయాన్ని పెంచుకున్నారు. నల్లగా ఉన్న వారెంతో మంది సాధించిన విజయాలు ఇన్నేళ్లలో మీకు కనిపిం^è లేదా! అవగాహనకు రండి. శ్రీకృష్ణుడు నల్లగానే పుట్టి, అవతారపురుషుడయ్యాడనీ మీకూ తెలుసు కదా. మూడవది: అంధుడిగా గత జన్మ అంతా బాధపడ్డారు. బాగుంటే అందరితో పోటీ పడి, వేగంగా పరిగెత్తేవాడిని అనుకున్నారు. అంధులుగా ఉన్నవారు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించండి. ‘నేను ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే’ అనుకోకుండా ‘మేధస్సుతో సాధించగలను’ అని నిర్ణయం తీసుకోండి. అందరితో కాకుండా మీతో మీరు పోటీ పడండి. కష్టంగా కాదు, ఇష్టంగా జీవించండి’’ కౌన్సెలర్ మాటలతో ప్రశాంతంగా మేలుకొన్నాడు వంశీ! ఇప్పుడు అతడికి హాయిగా ఉంది. తుఫాను తీరిన సముద్రంలా ఉన్నాడతను. జీవితం సమతూకం.. కాలింగ్‌బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీసింది కీర్తి. ఎదురుగా వంశీ! నమ్మబుద్ధికాక గడియారం కేసి చూసింది, సాయంత్రం ఆరు. హోమ్‌వర్క్ చేసుకుంటున్న దినేష్ తండ్రి చూసి ఆనందంగా ‘డాడీ..’ అంటూ పరిగెత్తుకువచ్చి తండ్రిని చుట్టేశాడు. ‘పని ఎప్పుడూ ఉండేదే. ఇవాళ సినిమాకెళ్దామా’ అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది కీర్తి. ‘‘ఇలాగే ఉంటే ఎలా సినిమాకు లేట్ అయిపోతుంది పద పద..’’ అని తొందరపెడుతున్న వంశీని చూసి తమ జీవితాల్లోకి వసంతం వచ్చేసిందని సంబరపడిపోయింది కీర్తి. మన వాస్తవ పరిస్థితులకు మనమే సృష్టికర్తలం ‘యద్భావం తద్భవతి’ అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. తమ వాస్తవ పరిస్థితులకు తామే సృష్టికర్తలం అని గ్రహిస్తే సమస్యలుగా అనిపించినవన్నీ పరిష్కారమవుతాయి. అన్నింటా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలను నమ్మకాలవైపు పయనింపజేయాలి. అదెలాగంటే, చిత్రకారుడు తెల్లని కాన్వాస్‌పై అద్భుతమైన చిత్రం వేయడానికి ఎంతటి బాధ్యత తీసుకుంటాడో ఎవరికి వారు తమ జీవితాన్ని మలచుకోవడంలో అలా స్వీయ బాధ్యత తీసుకోవాలి. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ సామర్థ్యాల పెంపుకు కృషి అవసరం చెడు ఆలోచనలకు బలం ఇస్తే అలాంటి వాస్తవమే మనం చూస్తాం. దీంతో మన చుట్టూ అలాంటి వాతావరణమే ఉందనుకుంటాం. వంశీ ఆలోచనలో ఎప్పుడూ ‘అందరికన్నా ముందుండాలి’ అనుకునే వాడు. అయితే, ఆ పోటీని సామర్థ్యంతో కాకుండా, సమయంతో లెక్కించాడు. దీంతో జీవితంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మన ఆలోచనలను గమనించి, సరైనదారిలో సామర్థ్యాలను పెంచుకున్నప్పుడే విజయం. – డాక్టర్ లక్ష్మి, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అపనమ్మకాలను నమ్మకాలవైపుగా మళ్లించాలంటే... ఏదైనా చెడు ఆలోచన, అపనమ్మకం వంటివి కలిగినప్పుడు దానికి పూర్తి వ్యతిరేక ఆలోచనను పేపర్‌మీద రాయండి. ఇది మీలో ఒక శక్తివంతమైన ఆలోచనవుతుంది.మీకు అనుకూలమైన నిర్ణయాలను రాస్తూ ఉండండి. ఉదాహరణకు: నేను చాలా బాగున్నాను. నేను చేయగలను. నేను సాధించగలను.. ఇలాంటివి స్వీయ ఆనందం, ఆరోగ్యం, చుట్టూ అనుబంధాలు ఏవిధంగా ఉంటున్నాయో గుర్తించివీటి పట్ల ఉంటున్న అపనమ్మకాలను నమ్మకం వైపుగా మల్లించాలి.సినిమా దృశ్యం మాదిరి జీవితాన్ని కళ్లతో అత్యద్భుతంగా ఉన్నట్టు దర్శించాలి. అనుకూలంగా లేని సంఘటనలను చిత్రాలుగా ఊహించుకొని అవన్నీ చాలా బాగవుతున్నట్టు ఊహించాలి.రోజూ 30–40 నిమిషాలు ధ్యానం చేయాలి. దీని వల్ల చెడు ఆలోచనలు మంచివైపుగా ప్రయాణిస్తాయి.విశ్రాంతి లేకపోవడం, ఆందోళనలు, భయాలు అన్నీ ధ్యానంలో కరిగిపోతాయి. పాజిటివ్ ఆలోచనలకు దారి తీసి, ఆత్మవిశ్వాసాన్ని, వికాసాన్ని ధ్యానం పెంపొందింపజేస్తుంది. – నిర్మల రెడ్డి చిల్కమర్రి -
టారో : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీకు ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనుక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠ, హోదాలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఒక విషయంలో ముఖ్యనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇతరులకు అది కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. అయితే మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొద్దిగా ఒడిదుడుకులతో కూడి ఉండవచ్చు. అంతమాత్రాన మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో... దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలుతీర్చేస్తారు. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీ పూజలు నిరాడంబరంగా ఉండాలి. హంగూ ఆర్భాటాలు అక్కరలేదు. ఆర్థికంగా కొద్దిపాటి మందకొడితనం నెలకొనవచ్చు కానీ, నిరుత్సాహ పడకండి. సానుకూలంగా తీసుకోండి. వృత్తిపరంగా, పనిపరంగా మిమ్మల్ని ఆవరించి ఉన్న కొన్ని భ్రమలు తొలగి, నిజాలు బయటపడతాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అన్ని విషయాల్లోనూ మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా! కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ -
టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
పనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపుకోసం మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సూచనలకు తగ్గట్టు మీ సిబ్బంది పని చేస్తారు. ఉద్యోగార్థుల ఎదురు చూపులు ఫలిస్తాయి. వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శక్తి సామర్థ్యాలను మెరుగు పరచుకుంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మనం చకచకా ముందుకెళ్లాలంటే ముందు మన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవాలని గ్రహించండి. మీ నిర్ణయాత్మక శక్తి ఇతరులు ప్రశ్నించేలా ఉండకూడదు. ఎదుటివాళ్ల బాహ్యవేషాలను బట్టి అంచనాలు వేసుకోకండి. మీకు అనుమానంగా ఉన్నవాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోండి. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ సన్నిహితులొకరు వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా, మీకు దూరంగా మెలగుతున్నట్లుగా అనిపించవచ్చు. వారిని ప్రశ్నించేముందు వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూడండి. ఆర్థికంగా బాగుంటుంది. నిద్రలేమి చికాకు పరచవచ్చు. చిన్న చిన్న రుగ్మతలకు గృహ చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈ వారం మీరు బోలెడన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. ఒక వ్యక్తితో అనుకోకుండా జరిగిన పరిచయం బలపడుతుంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సన్నిహితులొకరితో మీకు వివాదం ఏర్పడవచ్చు. అది ఒత్తిడి మూలంగా జరిగినదే కాని, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరంగా కుంగిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒకదారి మూసుకుపోతే వంద దారులు ఉంటాయని గుర్తు చేసుకోండి. చాలాకాలంగా ఉన్న ఒక బంధం బలహీన పడవచ్చు లేదా తెగిపోవచ్చు. అది మీరూహించిందేగా, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. గత పరిణామాల నుంచి పాఠాలను నేర్చుకోండి. ఆసక్తికరమైన ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు లేదా మీరు కొత్త ప్రదేశాలకు ఆహ్వానం అందుతుంది. వర్తమానంలో జీవించండి. కలిసొచ్చే రంగు: గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) సానుకూల భావనలు, ఉత్సాహకర వాతావరణం నడుమ ఉల్లాసంగా ఉంటారు. ప్రకృతి ఎన్నో అందాలను, వింతలు, విడ్డూరాలను ప్రసాదించింది కదా, హాయిగా అనుభవించండి, ఆనందించండి. మీ ఆధ్యాత్మిక మార్గం లేదా బోధలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. వివిధ రకాల రుగ్మతలకు మీకు మీరు చికిత్స చేసుకోవడమే గాక ఇతరులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపశమనం కలిగిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ మనస్సును, మెదడును పనికి సన్నద్ధం చేయండి. నిదానమే ప్రధానం అన్న సూక్తిని ప్రస్తుతానికి పక్కనపెట్టి ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని అనుసరించి పని చేయండి. మీ కుటుంబంతో, ముఖ్యంగా సహోద్యోగులతో పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల్లో అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. కలిసొచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మబ్బులు కమ్మిన ఆకాశంలోనే సూర్యోదయం కూడా జరుగుతుందని గుర్తు తెచ్చుకోండి. పాత వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రశాంతంగా, స్థిమితంగా, తేటపడిన మనస్సుతో ఉంటారు. పిల్లల మూలంగా ఆనందం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కాలానుగుణంగా జరుగుతున్న మార్పులను ఆమోదించక తప్పదని గుర్తించండి. మీ కోణంలో నుంచే కాదు, ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం మంచిది. బూజుపట్టుకుపోయిన పాత అలవాట్లను వదులుకోకపోతే ఇబ్బందులు తప్పదు. మీకొక అవకాశం వస్తుంది. అయితే అది కొద్దిపాటి రిస్క్‌తో కూడుకున్నందువల్ల ఎటూ తేల్చుకోలేకపోతారు. పనితో అలసిన మనస్సును, శరీరాన్ని సేదతీర్చడం అవసరం. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంటుందీ వారమంతా! పనులలో జాప్యం. శుష్కవాగ్దానాలకు బోల్తా పడవద్దు. మీలాగే అందరూ నిజాయితీపరులని అనుకోవద్దు. ముద్రణ, యంత్రాలతో పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పనిని సమీక్షించుకుని, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడం మంచిది. విందువినోదాలలో గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కష్టాలు వచ్చినప్పుడే మనకు కావలసిన వారెవరో తెలిసొస్తుంది. అంతేకాదు, మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు వెలికి వస్తాయని గుర్తించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పదు. పనిప్రదేశంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. పాతశత్రువుల పట్ల అప్రమత్తత, ఇరుగు పొరుగుతో సఖ్యత అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆశయాల సాధనకు తగిన కృషి, ప్రణాళికతో కార్యాచరణలోకి దిగండి. మీకేదైనా కొత్త ఆలోచన వచ్చినా, సృజనాత్మకత చూపించాలనుకున్నా, మీలోనే ఉంచుకోండి. బయటికి చెప్పవద్దు. వెంటనే అమలు చేసేయండి. ఒక బంధం విషయంలో నిజానిజాలు తెలుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఒక ఆకర్షణ బంధంగా మారేంతగా బలపడవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు -
టారో :19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉద్వేగభరితంగా, సాహసోపేతంగా సాగిపోతుందీవారమంతా! ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు క్రీడలలో పాల్గొనండి. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో కూడి ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. కలిసొచ్చే రంగు: పచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు: తెలుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. మీ హితులకు, సన్నిహితులకు ఏ సమస్య వచ్చినా, వారికి మీరే గుర్తుకొస్తారు. వారికి తగిన పరిష్కారం చూపించి, ఆత్మసంతృప్తి పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల విషయంలో భయం వదిలి సంగీత చికిత్స తీసుకోండి. కలిసివచ్చే రంగు: వంకాయ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికవనరులు సమకూరుతాయి. గత చేదుజ్ఞాపకాలను మరచిపోండి. వాటినుంచి అనుభవ పాఠాలను నేర్చుకోండి. ధనపరంగా త్వరలోనే ఒక శుభవార్త అందుకుంటారు. గతంలో మీ చేజారిపోయిందనుకున్న ఒక అవకాశం తిరిగి మీ తలుపు తడుతుంది. ఈసారి జారవిడుచుకోరు. మీ జీవితభాగస్వామి నుంచి మీకో అనూహ్య కానుక అందుతుంది. కలిసొచ్చే రంగు: సిరా నీలం -
టారో :12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవసరాలకు తగిన డబ్బు చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ప్రేమలో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో కొద్దిగా ముందడుగు వేస్తారు కూడా! పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఇతరుల సమస్యలను విని, మీకు చేతనైన సాయం చేస్తారు. అలా సాయం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీరు విద్యార్థులైతే మంచి మార్కులు సాధించి, అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లుగా సాగుతుంది. మీకు కావలసిన వారికోసం బాగా ధనం ఖర్చు చేస్తారు. గత జ్ఞాపకాలతో కుంగిపోకుండా, వాటినుంచి పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి కోసం అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ సన్నిహితులతో వీలయినంత నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం మంచిది. దానివల్ల లేనిపోని అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లేదా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతర వ్యాపకాలలో పడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) రకరకాల కారణాల వల్ల పని పేరుకుపోవడంతో అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఒకోసారి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. టెన్షన్ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దృఢంగా ఉంటారు. విందు, వినోదాలు, దూరపు ప్రయాణాలతో సేదతీరే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: తెలుపు, వంగపువ్వు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలం. కలిసి వచ్చే రంగు: వెండి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఎప్పుడూ గెలుపు మనదే అనుకోవడం పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం అవివేకం. ఎందుకంటే ఓడినప్పుడే కదా, మీ శక్తిసామర్థ్యాలు మీకు తెలిసేది. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటారు. మంచి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసి, ప్రశంసలు పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. వెన్నునొప్పి బాధించవచ్చు. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఆందోళన మాని, ప్రకృతి ఉత్పాదనల వాడకంతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. జీవితమంటే ఎప్పుడూ పని, పరుగులే కాదు, కాస్త విశ్రాంతి, ప్రేమ, ఉల్లాసం కూడా అవసరం అని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీది కాని కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఉత్పాదనలు, స్వచ్ఛమైన గాలి, నీరు వల్ల స్వాంతన పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను నెరపడంలో, వాటిని మరింత మెరుగు పరచుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆందోళన మాని వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. మనసు చెప్పినట్లు నడచుకోండి. చెవి లేదా గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికంగా చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంటారు. అలా ఎన్నోసార్లు. కానీ, చెడ్డ అలవాట్లు అలవడినంత తొందరగా వదలవని గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి ధోరణి మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఒకరికొకరు సర్దుకుపోయి. సామరస్యంగా జీవించడమే కదా జీవితం. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా -
టారో 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అవరోధాలనూ అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు.. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభాసామర్థ్యాలకి గుర్తింపు కోసం మరింత కష్టపడాలి. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు. కలిసొచ్చే రంగు: చాకొలేట్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం విందు వినోదాలలో గడుపుతారు. పనిలో విసుగు అనిపించినా, చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెలకువ లేకపోతే మాట పడక తప్పదు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకోకుండా కొత్తవారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే పనులు విజయవంతమవుతాయని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ -
టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని చూసి, మీ సహోద్యోగులు అసూయపడతారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. భయాందోళనలు వదిలేసి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కలిసి వచ్చే రంగు: పచ్చబంగారు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవిశ్రాంతంగా పని చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు, తెలివితేటలకు మరింత పదును పెట్టుకుని, మీ వాక్చాతుర్యంతో మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు చెప్పినట్లు నడచుకోండి. ఇతరులను మీరు గౌరవిస్తేనే, వారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) స్నేహితులతో, బంధుమిత్రులతో కలసి సరదాగా గడుపుతూ మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సంతోషంగా గడుపుతారు. కలిసివచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉద్యోగ భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజులు సాఫీగా గడవడం లేదనిపించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకంగా పనులు చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తిరుగుతుంది. కలిసి వచ్చే రంగు: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఏదో కలలో జరిగినట్లుగా నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో చకచకా పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. ప్రతిదానికీ కుటుంబసభ్యులమీద, కిందిస్థాయి ఉద్యోగుల మీద ఆధారపడకుండా మీపనులు మీరు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి. కలిసి వచ్చే రంగు: ముదురాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను లేదా పంటి నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీచుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటివి అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. ఏనాడో తెగిపోయిన ఒక బంధాన్ని మీ ప్రేమతో తిరిగి అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. బహుమతులు అందుతాయి. గతాన్ని తలచుకుని కుమిలిపోవద్దు. వర్తమానంలో ఏం చేయాలో ఆలోచించండి. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. హుందాగా ముందుకు సాగండి. దిగువస్థాయి వారితో కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. సహోద్యోగుల సహకార లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. పరోపకారగుణాన్ని అలవరచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మొహమాటానికి పోయి తలకు మించిన బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈ వారం మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు కోరుకున్న వారి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికతను అలవరచుకుంటారు. మీ నిక్కచ్చితనం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కలిసి వచ్చే రంగు: నీలం -
టారో: 18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పూర్తిగా అంకితభావంతో పని చేయమన్నది ఈ వారం వీరికి చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అధికారం కోసం మీరు పడుతున్న ఆరాటం ఫలించే అవకాశాలున్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఏమాత్రం తొందరలేకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కు వెళ్లడానికి అనుకూలమైన కాలం ఇది. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. లేదంటే మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు, కాస్త పట్టువిడుపు ధోరణిని అలవరచుకోండి. స్నేహితులు, మీ కింది స్థాయి వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీకు చాలా అనుకూలమైన వారమిది. పనిలో కొత్త పద్ధతులు నేర్చుకుని, వాటిని విజయవంతంగా అమలు చేసి, మంచి పేరు, ప్రశంసలు తెచ్చుకుంటారు. బృందంతో కలిసి మీరు చేసే పని విజయవంతమవుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం వస్తుంది. కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు చేస్తుంది. కలిసి వచ్చే రంగు: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఏదో అద్భుతం జరిగినట్లుగా మీ ప్రేమ ఫలిస్తుంది. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. భౌతిక శక్తులమీదనే కాదు, ఆధ్యాత్మికత మీద కూడా మనసు పెట్టి, నమ్మకంతో పని చేస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. కలిసి వచ్చేరంగు: పాలమీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీకు అన్నివిధాలుగా కలిసి వచ్చే కాలమిది. గొప్ప అవకాశాల కోసం, మంచి సమయం కోసం మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. ప్రేమ విషయంలో కొంత నైరాశ్యం, ఎదురుదెబ్బలూ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించ వలసిన సమయమిది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: వెండిరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కుటుంబపరంగా మీకు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. అంకితభావంతో కష్టపడి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి, దానిని ఆచరణలో పెట్టి ఘనవిజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేయడం సత్ఫలితాలనిస్తుంది. మీ విల్ పవర్ మీకు మంచి చేస్తుంది. రానున్న సంవత్సరంలో మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు. కలిసి వచ్చే రంగు: గచ్చకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) గులాబీ చెట్టుకు ఎన్ని ముళ్లున్నా, ఎంత గాలిఒత్తిడి ఎదురైనా తట్టుకుని అందమైన పూలనే ఇచ్చినట్లు మీరు కూడా అన్ని రకాల ఒత్తిళ్లనూ తట్టుకుని అందరికీ ఆనందాన్నే పంచుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అలసిన మనస్సును, శరీరాన్ని విహార యాత్రలతో సేదదీర్చేందుకు ఇది తగిన సమయం. ఈవారంలో మీ కెరీర్ మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: వంకాయరంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు త్యాగాలు చేయవలసిన సమయం. బాగా కష్టపడి పని చేయాల్సిన సమయం కూడా. ఒక్కోసారి మీ ప్రేమను కూడా త్యాగం చేయక తప్పదు. పనిపరంగా మీకు చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ పని అంటూ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఉద్యోగ భద్రత కోసం చిన్న చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది. దేనిలోనైనా ఉదాశీనత పనికి రాదు. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికంగా మీకు అనూహ్యమైన లాభాలు కళ్లజూస్తారు. ధనయోగం కలుగుతుంది. కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. భగవంతుడి మీద భారం వేసి, ధైర్యం చేసి మీరు వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని లక్ష్యసాధనకు, విజయానికి చేరువ చేస్తాయి. మీ సృజనాత్మకత మీకెంతో ఉపయోగపడుతుంది. ఎన్ని పనులున్నా, కుటుంబాన్ని, స్నేహితులను దూరం చేసుకోవద్దు. విద్యార్థులకు అనుకూల కాలమిది. కలిసి వచ్చే రంగు: లేత గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పనిపరంగా కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. అనూహ్యంగా విజయం సాధించి, ఎంతోకాలంగా మీరనుభవిస్తున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. కొత్తగా ఒక మంచి ఆదాయ మార్గాన్ని తెలుసుకుంటారు. అన్ని గాయాలనూ మాన్పగలిగే గొప్ప శక్తి కాలానికి ఉందని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: పొద్దుతిరుగుడు పువ్వు వన్నె కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) గతంలో మీరు చేసిన ఒక మంచి పని ప్రస్తుతం మీకెంతో మేలు చేస్తుంది. దానిమేలు భవిష్యత్తులో కూడా ఉంటుంది. బహుశ ఇది మీరు రాసిన వీలునామా లేదా మీ పూర్వుల ఆస్తిపాస్తులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక ముందుజాగ్రత్త కావచ్చు. లక్ష్యసాధనలో విజయాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. డబ్బు, విజయంతో ఆనందంగా తిరిగి వస్తారు. కలిసి వచ్చే రంగు: లేత నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ చిరకాల కోరిక తీరుతుంది. పనిపరంగా, కెరీర్‌పరంగా ఏది ముందో, ఏది వెనకో తేల్చుకోలేని గందరగోళంలో చిక్కుకుంటారు. ఒత్తిడి మూలంగా ఏకాగ్రత కోల్పోయి, లక్ష్యసాధనకు మీరు వేసుకున్న ప్రణాళికలో మార్పులు అనివార్యం అవుతాయి. గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా, శాంతంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: బంగారు -
టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది. విజయవంతంగా గడుస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు. భావోద్వేగాలపరంగా చాలా బలంగా ఉంటారు. కలిసొచ్చే రంగు: నారింజ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వారిని సంతోషపెడతారు. మీరు కూడా అందంగా, ఆనందంగా కనిపిస్తారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది కానీ, మరికొంచెం జాగ్రత్త అవసరం. మీ ప్రాధాన్యతాక్రమాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆకాశనీలం మిథునం (మే 21 - జూన్ 20) అదృష్టం, ఆర్థికభద్రత మీ వెన్నంటే ఉంటాయి. మీ స్వీయశక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన తరుణం ఇది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య తొలగిపోతుంది. పరిష్కృతమవుతుంది. దాంతో ఒకవిధమైన నిశ్చింతతో ఉంటారు. మీ చిక్కులను మీరే నేర్పుగా పరిష్కరించుకుంటారు. కలిసొచ్చే రంగు: గోధుమరంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీరు అసాధ్యాలుగా భావించినవన్నీ సుసాధ్యాలవుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరకొచ్చేసినట్లే! మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దు, ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. బంధుత్వమంటే మీకు ఎంత ఇష్టమైనప్పటికీ, మీకు ఇష్టమైన వారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మీకు మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. విందు వినోదాలలో, విహార యాత్రలలో సేదదీరడం వల్ల మీరు పునరుత్సాహం పొందుతారు. మనసు మాట వినండి. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోండి. మీ ప్రతిభ, సామర్థ్యాలు మీకు విలువని తెచ్చిపెట్టవచ్చు కానీ, సామాజిక సంబంధాలూ అవసరమే అని గ్రహించండి. పనిలో కొత్త ప్రయోగాలు మంచిది కాదు. కలిసొచ్చేరంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ సృజనాత్మకతే మీకు శ్రీరామ రక్ష. పెద్దవాళ్ల నుంచి మీకో మంచి వార్త అందుతుంది. అది మీ కెరీర్‌నే మలుపు తిప్పుతుంది. సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామికీ మీకూ అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్త అవసరం. సమస్యలు మిమ్మల్ని నీరు గార్చేందుకు కాదు, మీకు పాఠాలు చెప్పేందుకే అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కలిగిన ప్రతికోరికనూ తీర్చుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించండి. మీ జీవితాశయం నెరవేరేందుకు చాలా సమయం పడుతుందని నిరాశ పడవద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండాలి.. అవిశ్రాంతంగా పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త ఉద్యోగాలు, వృత్తి, వ్యాపకాలకు ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) మీరు కోరుకున్నవాటిని పొందడానికి, మీ మనసులోని కోరికలను, భావాలను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం. మీ బంధంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. అలాగే సంతోషం కూడా. మీ దైనందిన వ్యవహారాలతో తీరికలేకుండా గడుపుతారు. మీ వృత్తి, వ్యాపకాలలోకి బంధుమిత్రులు, స్నేహితులను తీసుకు వస్తారు లేదా వారి పనులలో మీరు పాలుపంచుకుంటారు. కలిసొచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సంసిద్ధంగా లేకపోవడం వల్ల అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మితిమీరకుండా చూసుకోవడం మంచిది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. మీ సానుకూల దృక్పథమే మీకు మేలు చేస్తుంది. చిన్ననాటి స్నేహితుల రాక ఊరట కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) నూత్న గృహం లేదా వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మనసు చెప్పిన మాట వినండి. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీరు గీసుకున్న గిరి నుంచి బయట పడటం మేలు చేస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరిగే కొన్ని సంఘటనలు జరగవచ్చు. సృజనాత్మకంగా పని చేసి, మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచన అవసరం. ప్రేమ వ్యవహారాలో కొంత నిరాశ కలగవచ్చు. అనుకోని తగాదాలు, వ్యవహారాలలో వేలు పెట్టవలసి రావడం ఇబ్బంది కలిగించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) జాగ్రత్త, మెలకువ అవసరం. కొత్త ఆలోచనలను సృజనాత్మకంగా అమలు చేసి, మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఉపకరిస్తుంది. భార్య లేదా భార్య తరఫు బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కలిసొచ్చే రంగు: కాఫీ పొడి రంగు -
పక్కాగా సామర్థ్యం గుర్తింపు పరీక్షలు
జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రాథమిక స్థాయి విద్యార్థుల ప్రతిభా, అభ్యాస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ నెల 14, 15 తేదీల్లో 2–5 తరగతుల విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు పక్కాగా ఉండాలని డీఈఓ శామ్యూల్ స్పష్టం చేశారు. స్థానిక సైన్స్ సెంటర్లో గురువారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 4, 5 తరగతుల విద్యార్థులకు స్టేట్ లెవల్ అచీవ్మెంట్ సర్వే (స్లాస్) పరీక్ష . 2 నుంచి 5 తరగతుల పిల్లలకు 3ఆర్ (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్) పరీక్షలు ఉంటాయన్నారు. ఫలితాలను జనవరిలో వెల్లడవుతాయన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 80 పాఠశాలల్లో నమూనా అధ్యయనం పరీక్షలు ఉంటాయన్నారు. డీఎడ్ విద్యార్థులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. తక్కిన పాఠశాలల్లో ఆయా యాజమాన్యాల పర్యవేక్షణలో ఇతర సబ్జెక్టుల టీచర్లు నిర్వహించాలన్నారు. నిర్వహణలో సందేహాలు, సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్‌రెడ్డి, పెనుకొండ డెప్యూటీ డీఈఓ సుబ్బారావు, ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డీసీఈబీ కార్యదర్శి నాగభూషణం, ఎస్ఎస్ఏ ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఒత్తిళ్లు, చికాకులు, కోపాలు, ఇతరులతో వివాదాలు మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగే నేర్పరితనం అలవడుతుంది. కెరీర్ పరంగా కొత్తమార్గాలు ఆవిష్కృతమవుతాయి. తికమకలు, పరధ్యానాలను పక్కన పెట్టండి. ప్రశాంతంగా పని చేసుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మీరనుకున్న పనులన్నీ నెరవేరాయన్న సంతృప్తి కలుగుతుంది. అయితే మీలోని స్తబ్దతను, నిస్తేజాన్ని తొలగించుకోండి. సరైన సంబంధం కుదురుతుంది. ఒక ఇంటి వాళ్లవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గుర్తింపును పొందుతారు. అభద్రతాభావాన్ని విడనాడి, ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి. ఒక స్త్రీ మూలంగా అదృష్టం, ఆస్తి కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కీర్తిప్రతిష్ఠలు, విజయం వరిస్తాయి. ఆర్థికంగా కొంత అభద్రత, అస్థిరత ఉండవచ్చు. భయపడకండి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు వెంటాడవచ్చు. ఆధ్యాత్మికతను అలవరచుకోండి. ప్రశాంతత అదే వస్తుంది. పనిపరంగా అంతా సవ్యంగా సాగుతుంది. ఆఫీసులో అంతా మిమ్మల్ని మెచ్చుకునేలా పని చేస్తారు. ప్రయాణాలు, సాహసాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లండి. అన్నీ ఉన్నాయన్న సంతృప్తి కలుగుతుంది. పనిలో మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. అయితే మౌనంగా విధులను నిర్వహించడమే కాదు, మీ హక్కులను గురించి గుర్తు చేసుకోండి. ఆర్థికభద్రత కలుగుతుంది. సాహసాలు, ప్రయాణాలు చేస్తారు. పాతను వదిలి కొత్తదనాన్ని అలవరచుకుంటారు. కలిసొచ్చే రంగు: పగడం రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈవారమంతా మీకు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. భావసారూప్యత కలిగిన వారితో కలిసి ప్రయాణిస్తారు. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) పనులలో కొద్దిపాటి అడ్డంకులు, అవరోధాలు తప్పకపోవచ్చు. కష్టించి పని చేయండి. మేలు జరుగుతుంది. ఈ వారం మీ జీవితం మలుపు తిరిగే మంచి సంఘటనలు జరగవచ్చు. పనిలో కొత్తపంథాను అనుసరించి, సృజనాత్మకంగా పని చేయండి. భారీమొత్తాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇంకొంచె జాగ్రత్త తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: పాచిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఈవారం మీరు అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా, మెలకువగా ఉండటం అవసరం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న మీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, లౌక్యంగా మాట్లాడటం అవసరమని గ్రహించండి. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పగటికలలు కనడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, నిజాయితీతో పని చేయడం ఎంతో మేలు చేస్తుంది. కొత్త పని లేదా ప్రాజెక్టులో క్షణం తీరికలేకుండా గడుపుతారు. రకరకాల అవకాశాలు మీ తలుపు ఒకేసారి తడతాయి. మీకు నచ్చినది, మీరు చేయగలిగినది ఎంచుకుని కెరీర్‌ను మీరు అనుకున్నట్లుగా తీర్చిదిద్దుకోండి. మీ పుట్టినరోజు తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆర్థిక భద్రత, స్థిరత్వం కలుగుతాయి. అయితే అందుకు మరికొంత సమయం ఉంది. ఆందోళన చెందకండి. పని, ప్రయాణాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. మీరు ఉద్యోగులైతే వ్యాపారావకాశం మీ తలుపు తడుతుంది. వ్యాపారులైతే ఉద్యోగావకాశం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. అందుకు తగ్గట్టు పని చేయాలి కదా! సానుకూల భావనలు, సాను కూల ఆలోచనలు మీకెంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీ ప్రేమ ఫలించేందుకు, మీ విషయం పెద్దల వరకు వెళ్లేందుకు ఒకరి సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తగిన ప్రణాళిక లేకపోవటం, సిద్ధంగా ఉండకపోవడం వల్ల కొద్దిపాటి ఆందోళన, అనిశ్చితి, గందరగోళం తప్పకపోవచ్చు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. గతం గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, దానినుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అవసరమే కానీ, అతి వద్దు. ప్రేమవ్యవహారాలలో కొంచెం వేగిరపాటు ఉండచ్చు. మీ సానుకూల భావనలు మీకెంతో మేలు చేస్తాయి. కలిసొచ్చే రంగు: వెండిరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీపాటికి మీరు ప్రశాంతంగా గడుపుతారు. తెలియనివారికి మీరు కొంచెం అహంభావి అనిపింవచ్చుగాక.. అయినా, మీ గురించి తెలిసిన తర్వాత మీరెంత స్నేహశీలి అన్నదీ వారికే అర్థం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలు, బాధలు, భయాల నుంచి నెమ్మదిగా బయట పడతారు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీరుస్తారు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు -
టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈ వారం చాలా బిజీగా ఉంటారు. నీతి నిజాయితీలతో మీరు చేసే పనులు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అదనపు బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. మీ ముందొకమాట, వెనకొక మాటా మాట్లాడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఫలించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కొత్త అవకాశం తలుపు తడుతుంది. కలిసి వచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఆదాయానికి లోటుండదు. ఆనందానికి అవధి ఉండదు అన్నట్లు ఉంటుంది ఈ వారమంతా. చదువుమీద, మీరు చేసే పనిపట్ల జాగ్రత్తవహించండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చి, చిక్కులు తెచ్చుకోవద్దు. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక పరిశీలన అవసరం. అనుకోకుండా బహుమతులు అందుతాయి. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ మిథునం (మే 21 - జూన్ 20) కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీరు మనసులో ఊహించుకున్న దానికి, జరిగేవాటికి పొంతన కుదరదు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ధైర్యంగా ఉండండి. మంచే జరుగుతుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవడం కోసం మీరు మారనక్కరలేదు. వివాదాస్పదమైన వ్యక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల మీద కన్నేసి ఉంచండి. పనిమీద శ్రధ్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ మనసులో ఉన్నదానిని బయటకు చెప్పడం, దాని మీదనే గట్టిగా నిలబడటమే ధైర్యమంటే! అవతలివాళ్లు చెప్పినదానిని ఓపికగా వినడం కూడా ధైర్యమే! ఏమి జరుగుతోందో పరిశీలించండి, ధైర్యంగా వినండి. ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాల్లోనూ నిదానంగా వ్యవహరించడం అన్ని వేళల్లోనూ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండండి. కలిసి వచ్చే రంగు:సముద్రపు నాచు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వారమంతా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా గడుస్తుంది. పెట్టుబడులు సంతృప్తికరమైన ఫలితాన్నిస్తాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భారంగా పరిణమించవచ్చు. పనులలో చోటు చేసుకునే జాప్యానికి, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సృజనాత్మక నిర్ణయాలు, సృజనాత్మక వ్యాపార వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కలిసి వచ్చే రంగు:పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. సానుకూల భావనలను పెంపొందించుకోండి. కొత్త స్నేహితులు, కొత్తగా ఏర్పడ్డ బంధాల వల్ల మీ కోరికలను కొన్నింటిని వదులుకోవలసి రావచ్చు. అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పూర్తికాని వ్యాపార పనులను. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. ఆలోచనలకు తగ్గట్టు పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మీరు అనుకున్న చోట్లకి వెళ్లడానికి, కొత్తపనులు చేపట్టడానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలసి వారమంతా రిలాక్స్డ్గా గడుపుతారు. మీ ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఉత్సాహంగా పనిచేయండి. పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి. పనులలో కొత్త విధానాలకు వెళ్లకపోవడం మంచిది. జీవితంలో కొత్తదనాన్ని నింపుకోవడం మరచిపోవద్దు. కలిసి వచ్చే రంగు: బూడిదరంగు / వెండి వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శక్తియుక్తులు, తెలివితేటలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మంచిది. మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే మంచి లాభాలు పొందుతారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కారం దిక్కుగా పయనిస్తాయి. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయం సాధిస్తారు. మీరు ఇష్టపడే వారి మనసును గెలుచుకుంటారు. కష్టపడి పని చేసి, విజయపథంలో నడుస్తారు. కలిసి వచ్చే రంగు: చాకొలెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విందువినోదాలలో పాల్గొంటారు. గొప్పవారినుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీకూ, మీ స్నేహితుడికీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. అయితే నేర్పుగా వ్యవహరించి, ఎట్లాగో ఒడ్డెక్కుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చింత మాని వర్తమానంలో జీవించండి. ప్రతిక్షణాన్నీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ గడపండి. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. మొండిబకాయిలు వసూలు చేసుకోవడమంచిది. నూత్నవాహనాన్ని కొనుగోలు చేస్తారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసు మాట వినండి.ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. దైవంపట్ల సరైన అవగాహనను పెంచుకుంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. పనిపట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కలిసి వచ్చే రంగు: ముదురు పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా లాభాలను పొందుతారు. తెలివితేటలు, కష్టించే తత్వంతో ప్రమోషన్లు పొందుతారు. లౌక్యం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అవసరం. మీ ప్రతిభా సామర్థ్యాలతో సీనియర్లను ఆకట్టుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించలేకపోయానని బాధపడవద్దు. కొత్త అనుభవం ఎదురయినందుకు ఆనందించండి. కలిసి వచ్చే రంగు: లేత గులాబి -
టారో (13-11-2016 to 19-11-2016)
13 నవంబర్ నుంచి 19 నవంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తారు. మీ అంతశ్చేతన అద్దంలా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా సాగుతుంది. చిన్న చిన్న ఒడుదొడుకులుండవచ్చు కానీ, జీవితంలోని ఇతర ఆనందాలతో పోల్చుకుంటే అవెంత? మీ పని మీరు మనసు పెట్టి, ఆత్మవిశ్వాసంతో చేయండి. లక్కీ కలర్: లేతగులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరిస్తే భయాలు తొలగుతాయి. మిమ్మల్ని బాధిస్తున్న ముల్లును నేర్పుగా పెకలించి వేస్తే మీ అంత కచ్చితమైన వ్యక్తి మరొకరు లేరని మీకే అర్థం అవుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ఇంటి ఆధునీకరణ పనుల్లో పడతారు. మీ సత్తా నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా జరగనున్న కొన్ని ప్రధాన సంఘటనలు మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. మీరు చేస్తున్నదంతా బాధ్యతాయుతంగా చేస్తున్నదేనని మీరు గ్రహిస్తే జీవితంలో అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఎప్పుడో విడిచిపెట్టిన బంధువులు, బంధుత్వాలు, పాత సంబంధాలు తిరిగి కలుస్తాయి. ఛలోక్తులు విసిరేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్: మావిచిగురు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గురుబలం వల్ల మీకు ఈవారం బాగా కలిసి వస్తుంది. విజయం వరిస్తుంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి భూతభవిష్యత్ కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో సంపూర్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. అవిశ్రాంతంగా పని చేయడం అనారోగ్యకరం అని గ్రహించండి. మార్మిక కవితలు లేదా ప్రేమగీతాల రచనకు శ్రీకారం చుట్టండి. మీ అంతర్గత శక్తులను వెలికి తీయండి. లక్కీ కలర్: చాకొలేట్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త అవకాశంతోపాటే కొత్త సవాళ్లూ పొంచి ఉంటాయని తెలుసుకోండి.సమస్యలను ఎదుర్కొంటేనే అధిగమించగలం. ఆత్మవిశ్వాసంతో సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా, మీ సామర్థ్యం బయటపడేది. కొత్తదనం కోసం అన్వేషించండి. మనసు చెప్పే మాటను వినండి. మీ సృజనాత్మకత మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సమస్యలు, సవాళ్లు లేని జీవితం చప్పిడి పప్పు వంటిది. మీరు కోరినవన్నిటినీ పొందాలనుకుంటే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే కదా జీవితం చైతన్యంతో ప్రకాశించేది! ఈ వారంలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని, డబ్బును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామిని కానుకలతో సంతృప్తి పరచేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: వెండిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) వృత్తిపరంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. రేపటికోసం తపన పడుతూ ఉంటే ఈరోజు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుందని గ్రహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు తక్షణం మీకు తగిన అత్యుత్తమమైన మార్గం కనిపించకపోవచ్చు కానీ, మీ ముందున్న మార్గం కూడా ఉత్తమమైనదే. ఇతరుల అవసరాలను తీర్చేముందు మీవి మీకు ముఖ్యమే కదా! లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీకు మంచి వినోదభరితంగా, ఉల్లాసంగా... ఇంకా చెప్పాలంటే సరసంగా గడిచిపోతుంది. మీ ప్రేమకోసం పడిగాపులు పడుతున్న వారిని పనిగట్టుకుని మరీ పలకరించి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. ఛాందసమైన ఆలోచనలను విడిచిపెట్టి, కొత్తగా, వైవిధ్యంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీ చరిష్మా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికీ పోదు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీరనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు అనుకుంటున్న కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మంచి లాభాలను కళ్లజూస్తారు. గొప్ప ఆదాయాన్ని పొందుతారు. తమ శక్తి సామర్థ్యాలేమిటో తమకే తెలియని వారికి ప్రతివిషయంలోనూ భయమే! జ్ఞాని దేనికీ భయపడడు. ఈవారం ఓ గొప్ప సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. లక్కీ కలర్: దొండపండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితమంటేనే స్వేచ్ఛ. ఎవరూ ఎవరినీ కట్టడి చేయజాలరని అనుకుంటారు. మనం ప్రేమించే వారిని మనం కట్టడి చేస్తాం. మనల్ని ప్రేమించే వారు తమ ప్రేమతో మన ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. అహాన్ని అణ చిపెడితేనే ఆనందం. త్వరలోనే కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడనున్నాయి. ఆమోదించక తప్పదు. లక్కీ కలర్: బూడిదరంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితం అంటే ప్రశ్న కాదు.. సమస్య అసలే కాదు. జీవితమంటే జీవించడమే! ఎదురైనవాటన్నింటినీ ఆమోదిస్తూ, అనుభవిస్తూ వాలుకు కొట్టుకుపోవడమే జీవితం. బోర్డమ్ నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్తగా తయారవండి. స్నేహితులతో సరదాగా గడపండి. కుటుంబంతో కలసి లాంగ్‌టూర్‌కి వెళ్లండి. రొటీన్ నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండండి. లక్కీ కలర్: వంకాయరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తివ్యాపారాలలో ఊహలనుంచి బయటపడి, వాస్తవంగా ఆలోచించడం, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంటిలో లేదా ఆఫీసులో కొత్త మార్పు చోటు చేసుకోబోతోంది. సృజనాత్మక ఆలోచనతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అత్యుత్తమమైన వాటి గురించి ఆలోచన చేయండి. అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించండి. మీ అభిప్రాయాలలో కాస్త పట్టువిడుపు ధోరణి అవసరం. లక్కీ కలర్: లేత పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
విద్యుత్ మోటార్లు కాలిపోతున్నా.. పట్టించుకోరా ?
కేసముద్రం : ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి మించి విద్యుత్ మోటార్లు ఉండటం వల్ల తరచూ తమ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు రాస్తారోకో నిర్వహించిన సంఘటన మండలంలోని కల్వల గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అందించే ట్రాన్స్ఫార్మర్ 100కేవీ (ఎస్ఎస్7) కింద 30 విద్యుత్ మోటార్లకు గాను 50కి పైగా ఉన్నాయన్నారు. దీనివల్ల లోఓల్టేజీ ఏర్పడి ఇప్పటికే పలుమార్లు మోటార్లు కాలిపోయాయని వాపోయారు. పలుమార్లు సంబంధిత అధికారులకు చెప్పినా కెపాసిటీ ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని బాధిత రైతులు కోరారు. కార్యక్రమంలో రైతులు సంజీవరెడ్డి, మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, వీరభద్రం, వాసు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మిషన్ కాకతీయ ఫలాలు
బాల్కొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలాలు త్వరలోనే రైతులకు అందుతాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యసాగర్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం నీటి మట్టం, ప్రాజెక్ట్ ఆయకట్టు వివరాలను తెలుసుకున్నారు. రెండేళ్లపాటు సరైన వర్షాలు కురియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక తీయడం వల్ల వాటి నీటినిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందాలని ఆకాంక్షించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను ప్రజలు కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ నాయకుడు చింత వెంకటేశ్వర్లు ఉన్నారు. -
వీరు మారరా...
బండిఆత్మకూరు : పరిమితి మించి ప్రయాణికులను చేరవేయడం ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇలా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు కోకొల్లలు. ఈ విషయం తెలిసినా కొందరు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. బండిఆత్మకూరు నుంచి ఓంకారం వైపు సుమారు 20 మంది పైగా ప్రయాణికులు కింద పైన కూర్చొని వెళ్తున్నారు. ఆటో ఏ మాత్రం అదుపుతప్పినా ఇక అంతే సంగతులు. -
తాగితేనే మార్కులేస్తా..!
బీజింగ్: మీరు ఎంత మద్యం సేవించగలరు? నేను మీకు రేటింగ్ ఇస్తాను.. అంటూ విద్యార్ధులు అధికంగా మద్యం సేవించే విధంగా ప్రేరేపించిన ఓ చైనా ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గు జోయూ ప్రావిన్సులో గు జోయూ ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ చైనీ మందుల కోర్సులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నగుజోయూ అన్షున్.. విద్యార్ధులు మద్యం సేవించే విధంగా ప్రొత్సహించినందుకు బాధ్యతల నుంచి తప్పించారు. ఓ విద్యార్థి ఆన్లైన్ లో ఉంచిన వివరాల ప్రకారం.. ఎవరైతే ఒక పూర్తి గ్లాసు మద్యాన్ని సేవిస్తారో వారికి 10 మార్కులు, సగం తాగిన వారికి 90 మార్కులు, ఒకసారి రుచి చూసిన వారికి 60 మార్కులు, అసలు ముట్టుకోకపోతే ఫెయిల్ చేస్తానని టీచర్ తెలిపినట్లు పోస్ట్ చేశారు. గూ అలా చెప్పడం జోక్ కావచ్చని సంస్థ డైరక్టర్ గుయ్షెంగ్ అన్నారు. ఈ విషయం ఆన్లైన్లో టీచర్‌పై మండిపడిన వారు కొందరైతే, ఈ టీచరైన విద్యార్థులపై కరుణ చూపించాడని మరికొందరు పోస్ట్‌లు చేశారు. -
ఇద్దరూ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు?
కాలం - పని 1. అ, ఆల పని సామర్థ్యాల నిష్పత్తి 4:5. అ ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే అదే పనిని ఆ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 1) 40 రోజులు 2) 48 రోజులు 3) 32 రోజులు 4) ఏదీకాదు అ, ఆల పనిసామర్థ్యం నిష్పత్తి = 4:5 వారికి ఒక పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 5:4. అ ఒక్కడు ఆ పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఆ ఒక్కడు ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే సమయం = రోజులు సమాధానం: 3 2. అ పని సామర్థ్యం, ఆ పని సామర్థ్యంతో మూడింతలు ఉంటుంది. ఒక పనిని అ.. ఆ కంటే 80 రోజులు తక్కువలో పూర్తి చేయగలడు. అయితే వారు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1) 16 రోజులు 2) 24 రోజులు 3) 28 రోజులు 4) 30 రోజులు ౌ: అ, ఆ ల పని సామర్థ్యాల నిష్పత్తి = 3:1 పని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 1:3 అ.. ఆ కంటే 80 రోజులు తక్కువలో ఆ పని పూర్తి చేస్తాడు. అ ఒక్కడు ఆ పని పూర్తి చేసేందుకు పట్టే సమయం రోజులు ఆ ఒక్కడు ఆ పని పూర్తి చేసేందుకు పట్టే సమయం రోజులు అ, ఆలు ఇద్దరూ కలిసి ఆ పనిలో ఒక రోజులో పూర్తి చేసేభాగం వారు ఇద్దరూ కలిసి ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే సమయం = 30 రోజులు సమాధానం: 4 3. అ పని సామర్థ్యం ఆ పని సామర్థ్యం కంటే రెండింతలు. వారు ఇద్దరూ కలిసి ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం ఎంత? 1) 21 రోజులు 2) రోజులు 3) రోజులు 4) 42 రోజులు ౌ: అ, ఆల పని సామర్థ్యాల నిష్పత్తి = 2:1 వారికి పని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 1:2 అంటే ్ఠ, 2్ఠ రోజులు అనుకొంటే ్ఠ = 21 అ పనిని పూర్తి చేసేందుకు పట్టేకాలం 21 రోజులు. సమాధానం: 1 4. అ పనిసామర్థ్యం ఆ పని సామర్థ్యం కంటే రెండింతలు, ఆ పని సామర్థ్యం ఇ పని సామర్థ్యం కంటే మూడింతలు. వారు ముగ్గురూ కలిసి ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం? 1) 25 రోజులు 2) 30 రోజులు 4) 35 రోజులు 4) 50 రోజులు ౌ: అ, ఆ, ఇల పని సామర్థ్యాల నిష్పత్తి= 6:3:1 వారికి పని పూర్తి చేసేందుకు పట్టే కాలాల నిష్పత్తి = 2:4:12 = 1:2:6 = ్ఠ, 2్ఠ, 6్ఠ ముగ్గురూ కలిసి ఆ పనిని పూర్తిచేసేందుకు పట్టిన కాలం = 15 రోజులు 25 = ్ఠ అ ఒక్కడే ఆ పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 25 రోజులు. సమాధానం: 1 5. అ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు ఆ పనిని ప్రారంభించి 3 రోజుల తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఆ ఒక్కడే 16 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పని పూర్తి చేసేందుకు ఆకు ఎన్ని రోజులు పడుతుంది? 1) 24 రోజులు 2) 20 రోజులు 3) 30 రోజులు 4) ఏదీకాదు ౌ: అ ఒక రోజు పనిలో పూర్తి చేసే భాగం అ మూడు రోజుల్లో పనిలో పూర్తి చేసే భాగం = మిగిలిన పని మిగిలిన వంతు పనిని ఆ పూర్తి చేసేందుకు పట్టిన కాలం = 16 రోజులు అయినా మొత్తం పనిని ఆ పూర్తిచేసేందుకు పట్టే కాలం = 20 రోజులు సమాధానం: 2 6. ్క ఒక పనిని 80 రోజుల్లో పూర్తి చేయగలడు. అతడు ఆ పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఖ ఒక్కడే 42 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1) 30 రోజులు 2) 24 రోజులు 3) 48 రోజులు 4) ఏదీకాదు ౌ: ్క 10 రోజుల్లో పనిలో పూర్తి చేసే భాగం మిగిలిన పని మిగిలిన వంతు పనిని పూర్తి చేసేందుకు ఖ కు పట్టిన కాలం = 42 రోజులు అయితే మొత్తం పనిని పూర్తి చేసేందుకు ఖ నకు పట్టేకాలం రోజులు ఇద్దరూ కలిసి ఆ పనిలో ఒక రోజులో పూర్తి చేసే భాగం \u3149?ట్చఛఙ మొత్తం పని పూర్తయ్యేందుకు 30 రోజులు పడుతుంది. సమాధానం: 1 7. అ, ఆలు ఒక పనిని 10 రోజులు, 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ముందుగా ఆ పనిని అ ఒక్కడే ప్రారంభించి ఐదు రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పని ని ఆ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం? 1) 10 రోజులు 2) రోజులు 3) రోజులు 4) ఏదీకాదు ౌ: ’అ’ 5 రోజుల్లో పనిలో పూర్తిచేసే భాగం మిగిలిన పని మొత్తం పనిని ఆ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం = 15 రోజులు అయితే మిగిలిన వంతు పని ఆ పూర్తి చేసేందుకు పట్టే కాలం రోజులు. సమాధానం: 3 8. ్క, ఖలు ఒక పనిని పూర్తి చేసేందుకు 30 రోజులు, 20 రోజులు వరుసగా పడుతుంది. ముందుగా ఆ పనిని ఇద్దరూ కలిసి ప్రారంభించిన 3 రోజుల తర్వాత ్క వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఖ ఒక్కడే పూర్తి చేశాడు. అయితే మొత్తం పని పూర్తయ్యేందుకు ఎన్నిరోజులు పట్టింది? 1) 18 రోజులు 2) 15 రోజులు 3) 12 రోజులు 4) ఏదీకాదు ౌ: ్క, ఖలు ఇద్దరూ కలిసి 3 రోజుల్లో పనిలో పూర్తి చేసే భాగం మిగిలిన పని మొత్తం పనిని ఖ ఒక్కడే పూర్తి చేసేందుకు పట్టే కాలం = 20 రోజులు మిగిలిన వంతు పని పూర్తిచేసేందుకు ఖకు పట్టే సమయం రోజులు అయితే మొత్తం పనిని పూర్తి చేసేందుకు పట్టే కాలం = 3+15 = 18 రోజులు సమాధానం: 1 9. అ, ఆలు ఒక పనిని వరుసగా 14 రోజులు, 21 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ఇద్దరూ కలిసి పని ప్రారంభించారు. పని పూర్తయ్యేందుకు మూడు రోజుల ముందు అ మానేశాడు. అయితే మొత్తం పని పూర్తయ్యేందుకు పట్టే కాలం? 1) రోజులు 2) రోజులు 3) రోజులు 4) రోజులు ౌ: మొత్తం పని పూర్తి అయ్యేందుకు పట్టే కాలం ’్ఠ’ అనుకొంటే అ పనిచేసిన రోజులు = ్ఠ ృ 3 ఆ పనిచేసిన రోజులు = ్ఠ 3్ఠ ృ 9 + 2్ఠ = 42 5్ఠ = 51 రోజులు సమాధానం: 3 10. అ, ఆలు ఒక పనిని వరుసగా 45, 40 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత అ మానుకోగా, మిగతా పనిని 23 రోజుల్లో ఆ పూర్తి చేశాడు. అయితే అ ఎన్ని రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు? 1) 6 2) 8 3) 9 4) 12 సమాధానం: 3 11. అ, ఆలు ఇద్దరూ కలిసి ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ముందుగా ఆ పని అ ఒక్కడే ప్రారంభించి 15 రోజులు చేసిన తర్వాత వదిలి వెళ్లాడు. మిగిలిన పనిని ఆ ఒక్కడే 21 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే మొత్తం పనిని ఆ ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? 1) 30 2) 24 3) 36 4) ఏదీకాదు సమాధానం: 2 12. అ, ఆలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు ఇద్దరూ కలిసి ఆ పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఇ సహాయంతో వారు మిగిలిన పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే మొత్తం పనిని పూర్తిచేసేందుకు ఇ ఒక్కడికి ఎన్నిరోజులు పడుతుంది? 1) 6 2) 12 3) 18 4) 36 సమాధానం: 4 13. అ, ఆ, ఇలు కలిసి రోజుకు రూ. 300 సంపాదిస్తారు. అ, ఇలు కలిసి రూ. 188, ఆ, ఇలు కలిసి రూ. 152 సంపాదిస్తారు. అయితే ఇ ఒక రోజు సంపాదన ఎంత? 1) రూ. 40 2) రూ. 68 3) రూ. 112 4) రూ. 150 సమాధానం: 1 -
ఆహ్లాదం... ఆధ్యాత్మికం... ఆనందం!
మనదగ్గరే - శామీర్‌పేట్ చెరువు పచ్చని పరిసరాలతో చూపరులను ఇట్టే ఆక ర్షిస్తోంది శామీర్‌పేట్ పెద్ద చెరువు. 956 ఎకరాలలో విస్తరించి 33 అడుగుల లోతు నీటి నిల్వ సామర్థ్యం కల్గి ఉన్న వర్షాధారిత చెరువు ఇది. హైదరాబాద్ నగరానికి 24 కిలోమీటర్ల దూరంలో రాజీవ్హ్రదారికి ఆనుకుని మంచి ఆహ్లాదకరమైన, విశాలమైన స్థలంలో శామీర్‌పేట్ పెద్ద చెరువు ఉంది. రంగారెడ్డి జిలాల్లో ఉన్న ఈ సువిశాలమైన చెరువు అందాలను చూసేందుకు వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చి విడది చేసి వెళ్తుంటారు. పెద్ద చెరువుకు మరింత వైభవం... వరదనీరు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండాలంటే భారీ స్థాయిలో వ ర్షాలు పడాలి. ఒకసారి పూర్తి స్థాయిలో చెరువులో నీటి మట్టం చేరితే శామీర్‌పేట్ మండలంలోని సుమారు 2600ఎకరాల భూ సాగుకు అనువుగా ఉంటుంది. మెదక్, నల్గొండ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో వేల ఎకరాలకు సేద్యపు నీరు ప్రత్యక్షంగా, భూగర్భజలాల ద్వారా బోరు బావులకు చేరేందుకు పరోక్షంగా ఉపయోగపడుతుంది. మది దోచే జింకలపార్క్... ఈ చెరువుకు సమీపంలో బిట్స్‌పిలానీ క్యాంపస్, రాజీవ్ రహదారికి చేరువలో నల్సార్ లా యూనివర్శిటీ ఉన్నాయి. సమీపంలో జవహర్ జింకలపార్క్ 26 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ పార్క్‌లో చుక్కల జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, రకరకాల పక్షులు కనువిందుచేస్తుంటాయి. ఈ ప్రాంతానికి బర్డ్ వాచ్ స్పాట్‌గా కూడా పేరుంది. ఈ పార్క్ పక్కనే టూరిజమ్ వారి హరితా భవన్ ఉంది. రమ్యంగా రత్నాలయం... శామీర్‌పేట నుండి 3 కి.మీ దూరంలో ఉన్న రత్నాలయం ఉంది. వెంకటేశ్వరస్వామి కొలువుండే ఈ ఆలయం బిర్లా, టెంపుల్ని తలపిస్తుంటుంది. ఓమ్, విష్ణుచక్రాలతో ఉద్యాన, వాటర్ ఫౌంటెయిన్ మధ్యలో భూదేవి, శ్రీదేవిలతో కొలువున్న వెంకటేశ్వర , కాళిందిపై నర్తించే కృష్ణ విగ్రహాలు.. ప్రధాన ఆకర్షణ. సమీపంలో పేరొందిన అలంకృత, లియోనియా రిసార్టులున్నాయి. ఇలా చేరుకోవాలి.. సికింద్రాబాద్ నుంచి 24 కి.మీ దూరంలో ఉన్న ఈ లేక్‌కు సొంత వాహనాలలో చేరుకోవచ్చు. - అభిమన్యు -
చూపులన్ని ‘చిన్నస్వామి’ వైపే
నేడు కోల్కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల ఫైనల్ సాక్షి, బెంగళూరు : దేశంలోని క్రికెట్ అభిమానుల కళ్లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వైపే చూస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఐపీఎల్-7 సిరీస్ తుది పోరును ఆస్వాదించడానికి చిన్నాపెద్ద తేడా లేకుండా ఎదురు చూస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఫైనల్ నేడు (ఆదివారం) మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. స్థానిక ఆటగాడు, ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రాబిన్ ఊతప్ప కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టులో ఉండటంతో ఈ మ్యాచ్‌ను చూడటానికి కర్ణాటక క్రికెట్ క్రీడాభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ఇంతేకాకుండా గత మ్యాచ్‌తో తన మునుపటి సత్తా చూపిన వీరేంద్రసెహ్వాగ్ బ్యాటింగ్‌ను చూడటాలని నగర వాసులు ఆశతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 43 వేల సీటింగ్ కెపాసిటీ గల చిన్నస్వామి స్టేడియంలో టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయి. ఐపీఎల్-7లో నేడు జరగబోయేది తుది పోరుకాబట్టి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి కన్నడ, తెలుగు, హిందీ సినీరంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా స్టేడియంకు రానున్నారు. దీంతో అటు క్రికెట్ స్టార్లను, ఇటు సినీస్టార్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం వీక్షకులకు కలగనుంది. ఇక మ్యాచ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా, నిఘా వ్యవస్థను పెంచారు. స్టేడియం చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్యాయ ఏర్పాట్లను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. -
‘కెపాసిటీ’ కావాల్సిందే..
‘కెపాసిటీ’ కావాల్సిందే.. మంచాల : అసలే కరువుతో అల్లాడుతున్న రైతన్నకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అటు తరచూ ప్రకృతి ప్రకోపం.. ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి వ్యవసాయానికి గడ్డు కాలం ఎదురవుతోంది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లున్నా అరకొర విద్యుత్ సరఫరాతో పంటచేలకు నీరందని పరస్థితి. కెపాసిటర్లు బిగిస్తేనే బోర్లు నడుస్తాయంటూ విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. దీంతో భూమినే నమ్ముకున్న అన్నదాత ‘బోరు’మంటున్నాడు. కెపాసిటర్ల కోసం దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నాడు. మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆరుట్ల, బోడకొండ సబ్స్టేషన్ల పరిధిలో 4వేల వరకు బోరు బావుల కనెక్షన్లు, మరో 9వేల దాకా గృహుపయోగ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్ నుంచిట్రాన్స్ఫార్మర్కు 440 వోల్ట్స్ విద్యుత్ సరఫరా అవుతుంది. వాటి నుంచి బోరు మోటారుకు 360 వోల్ట్స్ విద్యుత్ సరఫరా కావాలి. కానీ మండల పరిధిలో చాలా వరకూ 180 నుంచి 200 వోల్ట్స్ మాత్రమే సరఫరా అవుతోంది. 100కేవీ ట్రాన్స్ఫార్మర్కు 20 కనెక్షన్లు, 63 కేవీ ట్రాన్స్ఫార్మర్కు 12, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్కు 4 నుంచి 5 కనెక్షన్లు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఉండాల్సిన వాటి కన్నా అధికంగా కనె క్షన్లు ఉన్నాయి. దీంతో లో ఓల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. కరెంట్ ఉన్నా లో ఓల్టేజీ కారణంగా బోరు మోటార్లు పని చేయడం లేదు. అధిక భారంతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు, బోరుమోటార్లు కాలిపోతున్నాయి. లో ఓల్టేజీ సమస్య తీవ్రం... తాజాగా అదివారం విద్యుత్ శాఖ సిబ్బంది జాపాలలో త్రీఫేజ్ కరెంట్ ఎలా సరఫరా అవుతోందని పరీక్షించారు. ట్రాన్స్ఫార్మర్ నుంచి బోరు వరకు 200 నుంచి 213 వోల్ట్స్ మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని తేలింది. లో ఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని నిర్ధారణకు వచ్చారు. బోరు మోటార్లు పని చే యాలంటే తక్షణమే కెపాసిటర్లు బిగించుకోవాలని చెబుతున్నారు. గత్యంతరం లేక బిగించుకుంటున్న రైతులు.. రూ. వేలల్లో అప్పు చేసి పంట సాగు చేసిన రైతులు విద్యుత్ సమస్యతో బోర్లు పనిచేయక పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న పంటలు కాస్తోకూస్తో చేతికి రావాలంటే కెపాసిటర్లు తప్పవని గత్యంతరం లేక వాటిని కోనుగోలు చేసి బిగించుకుంటున్నారు. 2కేవీఏఆర్ కెపాసిటర్‌కు కంపెనీని బట్టి రూ.1000 నుంచి రూ.1,200, 3కేవీఏఆర్ కెపాసిటర్ రూ.1,600కు మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల వాటిని బిగించినా బోర్లు పని చేయకపోవడంతో రూ. రెండు మూడు వేలు ఖర్చుచేసి మరింత పెద్ద కెపాసిటర్లను బిగిస్తున్నారు. వీటికోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యపై విద్యుత్ శాఖ ఏఈఈ శంకర్‌ను వివరణ కోరగా పంటకు సక్రమంగా నీరందించాలంటే ప్రతిరై తు తప్పనిసరిగా కెపాసిటర్‌ను బిగించుకోవాలని, దీంతోలో ఓల్టేజీ సమస్య తీరడమే కాకుం డా బోరు మోటార్లపై భారం పడదన్నారు. -
అనుకున్నవన్నీ జరగకపోవటమూ అదృష్టమే!
మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే! మనం అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. అదంతా మన ఘనత అని విర్రవీగుతాం. జరగకపోతే బాధపడుతూ ఉంటాం. అదేదో దేవుడి తప్పు, ద్రోహం చేశాడని నెపం దేవుడి మీద వేస్తూ ఉంటాం. కాని ఎన్నో సందర్భాలలో ‘అలా జరగకపోవటం వలన మంచే జరిగింది’ అని కొంతకాలం పోయిన తరువాత అర్థం అవుతుంది. ఎన్నోసార్లు కోపంతోనో, అనాలోచితంగానో ఏవేవో అనుకుంటూ ఉంటాం. అవన్నీ నిజమైతే..? ఉదాహరణకి తమకి నచ్చనిది చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా చూడలేక లేదా వినలేక చచ్చిపోతున్నాం అనటం చాలామందికి అలవాటు, అది నిజమైతే..? ప్రతివారు ఏదో ఒక సందర్భంలో ఈ బతుకు బతికే కన్నా చావటం నయం అనుకుంటారు. అటువంటప్పుడు అనుకున్నది సిద్ధిస్తే..? ‘ఎందుకు రాలేదు?’ అని అడిగితే, చాలామంది ఒంట్లో బాగుండలేదు, తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది.... ఇటువంటి వెయ్యి కారణాలుంటాయి చెప్పటానికి. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా మనిషి తట్టుకోగలడా? మనిషిలో ఉన్న మనో చాంచల్యం నాలుకని అదుపులో పెట్టుకోలేకపోవటం, తెలివితక్కువతనం, దూరాలోచన లేకపోవటం, ఉద్రేకపూరిత స్వభావం మొదలైన గుణాలు తెలిసిన భగవంతుడు... మానవులు ఏది అనుకుంటే అది నిజం కాకుండా వరం ఇచ్చాడు. ఎండవేడిమికి తట్టుకోలేక అలసిపోయిన బాటసారి ఒకడు, దారిపక్కన ఉన్న చెట్టుకింద నిలబడ్డాడు. అది కల్పవృక్షమని అతడికి తెలియదు. ఆవేదనపడుతూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఇక్కడ కాసిన్ని మంచినీళ్లు దొరికితే బాగుండును... అనుకున్నాడు. దాహం తీరటంతో ఆకలి గుర్తుకు వచ్చింది. వెంటనే కావలసిన ఆహారం ప్రత్యక్షమయ్యింది. కడుపునిండి కళ్లు మూత లు పడుతున్నాయి. కాసేపు విశ్రాంతిగా పడుకుంటే బలం పుంజుకుని తరువాత ప్రయాణం తేలికగా చేయవచ్చుననుకున్నాడు. హంసతూలికా తల్పం కంటి ముందు కనపడింది. ఈ అడవిలో ఒక్కణ్ణీ ఉండే కన్నా ఎవరైనా తోడుగా ఉంటే బాగుండుననుకున్నాడు. వెంటనే అప్సరసలాగ ఉన్న సుందరి పక్కన కూర్చుని మధురంగా నవ్వుతూ పలకరించింది. అవసరాలు తీరటంతో ఆలోచన వచ్చింది. ‘నా మనసులో అనుకున్నవన్నీ ఈ అడవిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఏ దెయ్యమో నన్ను తినేయటానికి ఇదంతా చేయటం లేదు కదా’ అనుకున్నాడు. ఆలోచన రావటమేమిటి? అనుకున్నంతా క్షణాల్లో జరిగిపోయింది. అంటే సదాలోచనలు, సద్భావాలు లేనప్పుడు విచక్షణాశక్తి, మనోనిగ్రహం లోపించినప్పుడు ఇటువంటి శక్తి ఉంటే ప్రమాదకారకమే అవుతుంది. కనుక అనుకున్నవన్నీ జరగకపోవటమే మంచిది. ఈ సందర్భంలో అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి కారణం బాహ్యమైనది. అటువంటిది ఆ శక్తి మనిషికి ఉంటే..? ప్రతిక్షణం తన మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే వచ్చేటట్టు మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. లేకపోతే అది అతడికే ప్రమాదకారి అవుతుంది. సద్వినియోగం చెయ్యగలిగినవారి వద్ద మాత్రమే ఏ శక్తి అయినా, ఏ సిద్ధి అయినా ఉంటే ప్రయోజనం. దాని విలువ, వినియోగం రెండూ తెలియని వారి దగ్గర ఉంటే, ప్రమాదం- ఇతరులకే కాదు తమకు కూడా. మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యం ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే. అందుకే మనం అనుకున్నవన్నీ జరగవు. జరగకూడదు. నిజానికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితంలో థ్రిల్ ఉండదు. అయినా మనిషి తెలివి, సామర్థ్యం ఏ పాటివి? అందుకే అనుకున్నవన్నీ జరగకపోవటం అదృష్టం కదూ! - డా.ఎన్. అనంతలక్ష్మి -
తుంగభద్రకు పోటెత్తిన వరద
హొస్పేట, న్యూస్‌లైన్ : తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, చిక్కమగళూరు, శృంగేరి, తీర్థహళ్లి తదితర మలెనాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో సోమవారం డ్యాంలోని మొత్తం 33 క్రష్ట్ గేట్లలో 25 క్రష్ట్ గేట్లను నాలుగు అడుగులు మేర, మిగత 8 క్రస్ట్ గేట్లను ఒక్క అడుగు మేర పైకి ఎత్తి దిగువకు 1,60,000 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి ఇంకా రెండు రోజులు కొనసాగవచ్చని, లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1631.86 అడుగులు, కెపాసిటీ 96.491 టీఎంసీలు, ఇన్‌ఫ్లో 1,74,860 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,60,000 క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. తుంగభద్ర లోతట్టు ప్రాంతాలు జలమయం..: తుంగభద్ర ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతమైన హంపిలోని పురంధరదాసు మండపంతోపాటు ఇతర అనేక స్మారకాలు పూర్తిగా నీట మునిగాయి. అదే విధంగా హంపిలో ఉన్న రామలక్ష్మణ ఆలయంలోకి వరద నీరు పోటెత్తింది. ఆలయం ముందున్న ధ్వజ స్థంభం సగానికి పైగా నీట మునిగింది. ఆలయం పక్కనున్న హోటళ్లోకి కూడా వరద నీరు భారీగా చేరింది. కాగా హంపికి వచ్చిన విదేశీ పర్యాటకులు తుంగభద్రమ్మ వరద ఉధృతిని వీక్షించి ఆనందిస్తున్నారు.