టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
Published Sat, Nov 26 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఈ వారం చాలా బిజీగా ఉంటారు. నీతి నిజాయితీలతో మీరు చేసే పనులు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అదనపు బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. మీ ముందొకమాట, వెనకొక మాటా మాట్లాడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఫలించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కొత్త అవకాశం తలుపు తడుతుంది.
కలిసి వచ్చే రంగు: గులాబీ
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఆదాయానికి లోటుండదు. ఆనందానికి అవధి ఉండదు అన్నట్లు ఉంటుంది ఈ వారమంతా. చదువుమీద, మీరు చేసే పనిపట్ల జాగ్రత్తవహించండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చి, చిక్కులు తెచ్చుకోవద్దు. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక పరిశీలన అవసరం. అనుకోకుండా బహుమతులు అందుతాయి.
కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ
మిథునం (మే 21 - జూన్ 20)
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీరు మనసులో ఊహించుకున్న దానికి, జరిగేవాటికి పొంతన కుదరదు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ధైర్యంగా ఉండండి. మంచే జరుగుతుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవడం కోసం మీరు మారనక్కరలేదు. వివాదాస్పదమైన వ్యక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల మీద కన్నేసి ఉంచండి. పనిమీద శ్రధ్ధ పెట్టండి.
కలిసి వచ్చే రంగు: నారింజ
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
మీ మనసులో ఉన్నదానిని బయటకు చెప్పడం, దాని మీదనే గట్టిగా నిలబడటమే ధైర్యమంటే! అవతలివాళ్లు చెప్పినదానిని ఓపికగా వినడం కూడా ధైర్యమే! ఏమి జరుగుతోందో పరిశీలించండి, ధైర్యంగా వినండి. ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాల్లోనూ నిదానంగా వ్యవహరించడం అన్ని వేళల్లోనూ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండండి.
కలిసి వచ్చే రంగు:సముద్రపు నాచు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
వారమంతా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా గడుస్తుంది. పెట్టుబడులు సంతృప్తికరమైన ఫలితాన్నిస్తాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భారంగా పరిణమించవచ్చు. పనులలో చోటు చేసుకునే జాప్యానికి, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సృజనాత్మక నిర్ణయాలు, సృజనాత్మక వ్యాపార వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి.
కలిసి వచ్చే రంగు:పసుప్పచ్చ
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. సానుకూల భావనలను పెంపొందించుకోండి. కొత్త స్నేహితులు, కొత్తగా ఏర్పడ్డ బంధాల వల్ల మీ కోరికలను కొన్నింటిని వదులుకోవలసి రావచ్చు. అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పూర్తికాని వ్యాపార పనులను. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. ఆలోచనలకు తగ్గట్టు పని చేయండి.
కలిసి వచ్చే రంగు: నారింజ
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
మీరు అనుకున్న చోట్లకి వెళ్లడానికి, కొత్తపనులు చేపట్టడానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలసి వారమంతా రిలాక్స్‌డ్‌గా గడుపుతారు. మీ ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఉత్సాహంగా పనిచేయండి. పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి. పనులలో కొత్త విధానాలకు వెళ్లకపోవడం మంచిది. జీవితంలో కొత్తదనాన్ని నింపుకోవడం మరచిపోవద్దు.
కలిసి వచ్చే రంగు: బూడిదరంగు / వెండి
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఈవారం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శక్తియుక్తులు, తెలివితేటలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మంచిది. మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే మంచి లాభాలు పొందుతారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కారం దిక్కుగా పయనిస్తాయి.
కలిసి వచ్చే రంగు: గోధుమ
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయం సాధిస్తారు. మీరు ఇష్టపడే వారి మనసును గెలుచుకుంటారు. కష్టపడి పని చేసి, విజయపథంలో నడుస్తారు.
కలిసి వచ్చే రంగు: చాకొలెట్
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
విందువినోదాలలో పాల్గొంటారు. గొప్పవారినుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీకూ, మీ స్నేహితుడికీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. అయితే నేర్పుగా వ్యవహరించి, ఎట్లాగో ఒడ్డెక్కుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చింత మాని వర్తమానంలో జీవించండి. ప్రతిక్షణాన్నీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ గడపండి.
కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. మొండిబకాయిలు వసూలు చేసుకోవడమంచిది. నూత్నవాహనాన్ని కొనుగోలు చేస్తారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసు మాట వినండి.ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. దైవంపట్ల సరైన అవగాహనను పెంచుకుంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. పనిపట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం.
కలిసి వచ్చే రంగు: ముదురు పసుపు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా లాభాలను పొందుతారు. తెలివితేటలు, కష్టించే తత్వంతో ప్రమోషన్లు పొందుతారు. లౌక్యం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అవసరం. మీ ప్రతిభా సామర్థ్యాలతో సీనియర్లను ఆకట్టుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించలేకపోయానని బాధపడవద్దు. కొత్త అనుభవం ఎదురయినందుకు ఆనందించండి.
కలిసి వచ్చే రంగు: లేత గులాబి
Advertisement
Advertisement