Insiya
-
వారఫలాలు
17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి 2019 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త వ్యూహాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం కొంత సహకరించకపోయినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆశయాలు సాధనలో మిత్రులు చేయూతనిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సంస్థల ఏర్పాటులో నిమగ్నమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వాహనయోగం. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారాలు సమతూకంగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృధా ధనవ్యయం. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. ఆప్తులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. పనులు ముందుకు సాగక డీలా పడతారు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలలో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. గులాబీ, లేతఆకుపచ్చ, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విదేశీ విద్యావకాశాలు దక్కే సూచనలు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వ్యతిరేకులను కూడా మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు, నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు కలసివస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. çవాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మ«ధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. చర్చల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగిన మార్పులు కనిపించవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అయితే అవసరాలకు లోటు రాదు. ఆప్తులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు సైతం అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. భూములకు సంబంధించిన కొన్ని అగ్రిమెంట్లు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. సోదరులతో సఖ్యత. వ్యాపార లావాదేవీలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలయత్నాలు సఫలం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావుజ్యోతిష్య పండితులు టారో 17 ఫిబ్రవరి నుంచి 23 ఫిబ్రవరి 2019 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అనుకోని అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సకాలంలో సహాయం పొందుతారు. ధ్యానంతో ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలకు వెళతారు. లక్కీ: లేత పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: కెంపురంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. లక్కీ కలర్: ముదురు పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు. లక్కీ కలర్: తెలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: లేత గులాబి ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
9 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్ 2018 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులకు శ్రీకారం. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు, ఇంక్రిమెంట్లు. రాజకీయ,కళారంగాల వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి సాఫీగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి, కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన ముఖ్య పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, నేరేడురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పూర్వపు మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. అందర్నీ ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలించే సమయం. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు, విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న విజయాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి కాగలవు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహన,గృహయోగాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో విభేదాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. గులాబీ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) విఖ్యాంతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సా«ధిస్తారు. ఇంటిలో శుభకార్యాల సందడి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి, కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (9 డిసెంబర్ నుంచి 15 డిసెంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఊహాలోకంలో విహరిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవడంతో కొంత చిరాకు పడతారు. ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. కుటుంబ వ్యాపారాలకు బాసటగా నిలుస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ధైర్య సాహసాలతో అవరోధాలను అధిగమిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. కళారంగంలోని వారు సత్కారాలు పొందుతారు. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆనందభరితంగా ఉంటారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పని ఒత్తిడి నుంచి కొంత విరామం దొరుకుతుంది. కొత్త ఆలోచనలతో సొంత వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని భావిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సవాళ్లను అధిగమించాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొన్ని మార్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురు పసుపు మిథునం (మే 21 – జూన్ 20) ఆలోచనా సరళిని మార్చుకుంటారు. సానుకూల దృక్పథాన్ని మరింతగా పెంచుకుంటారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ప్రత్యర్థులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. చిరకాల స్వప్నాల్లో ఒకటి సాకారమవుతుంది. లక్కీ కలర్: మీగడ రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) దివ్యమైన కాలం. దివ్యత్వం మిమ్మల్ని ఆవరించుకుని ఉంటుంది. ఈ దివ్యత్వం మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతుంది. నిరాడంబరతతోనే జనాలను ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు కొంత మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి ప్రాధాన్యమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సుదూర విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. బంధం విడిపోకుండా ఉండాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: పసుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సృజనాత్మక కళారంగాల్లోని వారికి అద్భుతమైన కాలం. కళాకారులకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థిక ఫలితాలు దక్కే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి కొత్త అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు చదువుపై మరింతగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఏకాగ్రత కోసం ధ్యానాన్ని ఆశ్రయించడం వల్ల ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకుంటారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆర్థిక లాభాలాను మదింపు వేసుకుంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు తలపెడతారు. మనసైన వ్యక్తితో ప్రేమలో పడతారు. నిస్సహాయులైన వృద్ధులకు చేయూతనిస్తారు. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. వైఖరిలో సానుకూలతను పెంచుకుంటనే ఆశించిన విజయాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. సవాళ్లను స్వీకరిస్తారు. కీలకమైన సమస్యల పరిష్కారానికి సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధనపై దృష్టి సారిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడీ దొరికే సూచనలు ఉన్నాయి. బంధువులను ఆదుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వినోదభరితంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిరకాలంగా కలుసుకోని బాల్య మిత్రులను కలుసుకుంటారు. మధురమైన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. కొత్త పనులను ప్రారంభించే ముందు పెద్దల ఆశీస్సులు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. అసాధ్యమనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించి సహచరులను ఆశ్చర్యానికి లోను చేస్తారు. లక్కీ కలర్: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహనాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని సహచరులతో స్పర్థలకు, వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇబ్బందికరమైన వ్యక్తుల కారణంగా సహనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. పని ఒత్తిడి కారణంగా అలసటకు లోనవుతారు. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ముక్కుసూటి ధోరణి వల్ల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ధ్యానమార్గం ద్వారా సాంత్వన పొందగలరు. లక్కీ కలర్: వెండిరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కుటుంబంలో సంతోషపూరితమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు తలపెడతారు. మనసుకు నచ్చిన మిత్రుల సమక్షాన్ని ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. కొందరికి పదోన్నతులు దక్కవచ్చు. జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రేమించిన భాగస్వామితో పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు పెద్దల ఆమోదం లభిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వస్త్రాలంకరణ, కేశాలంకరణలపై దృష్టి పెంచుతారు. లక్కీ కలర్: గులాబి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ‘ధైర్యే సాహసే లక్ష్మి’ అనే నానుడి మీ ప్రస్తుత పరిస్థితికి చక్కగా వర్తిస్తుంది. లక్ష్య సాధన కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థులు రహస్యంగా మీపై కుతంత్రాలకు పాల్పడే సూచనలు ఉన్నాయి. దైవబలం అనుకూలంగా ఉన్నందున భయపడాల్సిన పని లేదు. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రియతముల వద్ద మనసులోని మాటను బయటపెడతారు. లక్కీ కలర్: బూడిద రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఏకాగ్రత లోపిస్తుంది. నిరాసక్తత ఆవరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటం క్షేమం. కీలకమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు, వాటిని మీ పై అధికారులకు పంపే ముందు ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవడం మంచిది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. కుటుంబ పరిస్థితులు కొంత అశాంతిని కలిగిస్తాయి. ఆత్మవిమర్శ చేసుకుంటారు. జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. లక్కీ కలర్: లేతనీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) పట్టింది బంగారమా అన్నట్లుగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపట్ల మరింత ఆప్యాయత చూపుతారు. గతం నుంచి వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఓర్పు, నేర్పుతో వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత లబ్ధి చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. కళారంగం వారి యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా మారతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ముఖ్య నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. విద్యార్థులు నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి ఉద్యోగాలలో అనుకోని మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాల యత్నాలలో ఆటంకాలు. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంటాబయటా వ్యతిరేకత పెరుగుతుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలించవు. వారం ప్రారంభంలో ఆస్తిలాభం. విందువినోదాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రావచ్చు. రాజకీయవర్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వార ం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాల కోసం అన్వేషణ. బంధువులతో విభేదాలు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో చికాకులు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో విందువినోదాలు. వస్తు, వస్త్రలాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. నిర్ణయాలలో కాస్త నిదానం పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇతరుల విషయాయలలో జోక్యం వద్దు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వేడుకల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనులలో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు అంగీకరించరు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ నిర్మాణాలలో ఆటంకాలు. విద్యార్థులకు ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, మార్పులు. కళారంగం వారికి ప్రయత్నాలు అనుకూలించవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు పడుతుంది. జీవిత భాగస్వామి నుంచి కొంత లాభం చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అవి కొంచెం మిమ్మల్ని చిరాకు పరుస్తుంటాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు టారో (26 ఆగస్టు నుంచి 1 సెప్టెంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ: ముదురు గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఇటుక రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురు ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. లక్కీ కలర్: ముదురు గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: పసుపు - ఇన్సియా ,టారో అనలిస్ట్ -
వెలుగులోకి రాని లైంగికదాడులు కోకొల్లలు
పటమట(విజయవాడ తూర్పు): చిన్నారులపై జరిగే దారుణాలు చాలావరకు వెలుగులోకి రావటంలేదని, ఇందుకు తల్లిదండ్రులకు అవాగహన లేమి కారణమని, అన్ని ప్రాంతాల్లో పోలీసులు చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులపై చైతన్యం కల్పించాలని ముంబయికి చెందిన హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థ చైర్పర్సన్ ఇన్సియా దరివాలా అన్నారు. వాసవ్య మహిళా మండలి, మహిళా మిత్ర, నగరపోలీసు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో మండలిలో మూడు రోజుల పాటు చిన్నారులపై లైంగికదాడులు అంశంపై జరుగుతున్న సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ చిన్నారులపై లైంగిక దాడులు ఎవరివల్ల జరుగుతున్నాయి, ఎంతమంది పోలీసు రిపోర్టు ఇస్తున్నారు, రిపోర్టు చేయకపోవటానికి కారణాలు, వేధింపులకు గురైనవారికి ఉన్న హక్కులు, చట్టాలు, వేధించినవారికి అమలయ్యే శిక్షలు, బాధితులకు అందే పథకాలు తదితర అంశాలను ఆమె వివరించారు. ఎక్కువగా బాలికపై జరిగే దాడులే వెలుగులోకి వస్తున్నాయని, బాలురపై కూడా 53 శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ వీవీ నాయుడు, వాస్యవ్య టెక్నికల్ సపోర్టర్ బి.కీర్తి. పలువురు పోలీసు అధికారులు, మహిళా మిత్రలు పాల్గొన్నారు -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబి, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. వివాదాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం మ«ధ్యలో ఆరోగ్యసమస్యలు. వివాదాలు. తెలుపు, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు టారో ( 1 జూలై నుంచి 7 జూలై, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ నెలంతా మీకు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటికీ నిలబడి పోరాడతారు. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. వృత్తి జీవితం బాగుంటుంది. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన సమయమిది. కలిసివచ్చే రంగు : గోధుమ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈ నెలంతా మీకు కొత్త కొత్తగా ఉంటుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలా బతకాలి అని రాసిపెట్టుకున్న కొన్ని కలలు నెరవేరతాయి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొన్ని చుట్టుముట్టినా త్వరలోనే వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరనుకున్న పని చెయ్యలేరని తెలుసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాల్సిన సమయం ఇది. వాతావరణ మార్పులతో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవిని అలంకరిస్తారు. జీవితాశయానికి దగ్గరవుతారు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారిని ఎప్పటికీ వదులుకోకండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారమంతా ఉత్సాహంగా గడుపుతారు. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఎప్పట్నుంచో కోరుకుంటున్న మీకిష్టమైన ప్రపంచం వైపు అడుగులు వేస్తారు. మీకిష్టమైన వ్యక్తి ఈ సమయంలో మీ పక్కనే ఉండటం గొప్ప సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని గొప్ప అవకాశాలు కాలంతో పోరాడినప్పుడే దక్కుతాయని నమ్మండి. పని ఒత్తిడి పెరిగినట్టు భావిస్తారు. ఇది మీలో విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచనను పెంచుతుంది. కలిసివచ్చే రంగు : బంగారం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈనెలంతా మీరొక కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళతారు. ఈ దారిలో మీకు ఎదురయ్యే అనుభవాలు మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి చూపిస్తాయి. చాలాకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. వాతావరణం మార్పులతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) చాలాసార్లు మనం చెయ్యాల్సిన పనులు వాయిదా వేసుకుంటూ వచ్చి విజయం దక్కడం లేదని బాధపడిపోతాం. ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుంటే సమస్య ఎక్కడుందో తెలిసిపోతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, భవిష్యత్ కోసం కష్టపడాలన్న ఆలోచన మీలో రావాలి. ఈ నెల్లోనే ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే చాలా బాగుంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఈవారం మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ఒక శుభవార్త వింటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయంలో ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనా విధానంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతానికి కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటేనే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ ప్రపంచంలో ఎవ్వర్నీ ఏ భయమూ అన్నిసార్లూ భయపెడుతూ ఉండలేదు. దానికి ఎదురెళ్లి నిలబడితే అదే పారిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడే భయాల్ని దూరం చేసుకోవాల్సిన సమయం ఇదే. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు ఈ సమయంలో అన్నివిధాలా అండగా నిలబడతారు. గొప్ప అవకాశాలు మనకి దక్కేముందు మన ఆలోచనలు వాటిని అందుకునేంత స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలని తెలుసుకోండి. ఈ నెలాఖర్లో మీ జీవితాశయం వైపుకు తొలి అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : బంగారం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆత్మవిశ్వాసంతో చేసే ఏ పనైనా ఫలితంతో సంబంధం లేకుండా గొప్ప ఆత్మసంతృప్తిని ఇస్తుంది. మీరు ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రతి పనినీ ఆత్మవిశ్వాసంతో చేస్తూ ముందుకెళ్లండి. ఈ నెల్లోనే మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న మీకిష్టమైన కోరికలను తీర్చుకుంటారు. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా ఊహించనంత ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి జీవితంలో రాబోయే రోజుల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ప్రపంచం వైపు మెల్లిగా అడుగులు వేస్తారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు గొప్ప అదృష్టాన్ని తీసుకొస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఎప్పుడూ ఏదో ఒక కలని కంటూనే ఉంటారు. మీరెంతో ఇష్టంగా కొన్నాళ్లుగా కంటున్న ఒక కల నెరవేరే సమయం దగ్గర్లోనే ఉంది. ఈ నెల్లోనే ఆ దిశగా అడుగులు వేస్తారు. కొన్ని గొప్ప విషయాలు గొప్ప విషయాలుగా మారకముందు అతి సాధారణంగానే కనిపిస్తాయని తెలుసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. జీవితం గురించి మిమ్మల్ని వేధించే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఒక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కలిసివచ్చే రంగు : గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితంలో ఒక్కోసారి చాలా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక్కోసారి మనమే వెతుక్కుంటూ వెళ్లినా ఒక్క అవకాశమూ దక్కదు. మీరిప్పుడు జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లైతే, అందుకు సరైన సమయం ఇదేనని తెలుసుకోండి. మీరిష్టపడే వ్యక్తి మీరు కొత్తగా మొదలుపెట్టే ఈ ప్రయాణానికి అన్నివిధాలా అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించకుండా, రావాల్సిన సమయానికి డబ్బులు అవే వస్తాయనుకొని నమ్మి కష్టపడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గులాబి - ఇన్సియా ,టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు అనుకూలించి లాభాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) కొన్ని ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. సోదరులు, బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు మీదపడతాయి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. గులాబి, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. గులాబి, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. పూర్వపు మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహపరిచినా క్రమేపీ అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబి, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనులు మొదట్లోకొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తీరతాయి. మిత్రులు, బంధువుల సలహాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తివ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ప్రతిభ వెలుగులోకి రాగలదు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. - సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు టారో (20 మే నుంచి 26 మే, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. నలుగురి మెప్పు పొందుతూ, అందరికీ మంచి జరగాలనే మీ మనస్తత్వమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారాంతంలో ఓ గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్లండి. కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. ప్రశాంతమైన జీవితాన్ని వెతుక్కుంటూ వెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త . ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) గతాన్ని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదన్న విషయం మీకు తెలియాలి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే కొంత గందరగోళంగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రేమ మాత్రమే మిమ్మల్ని సంతోషంగా ఉంచగలిగే గొప్ప విషయమని తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే చాలా బాగుంటుంది. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు బాగా నమ్మే వ్యక్తుల సహకారం తీసుకుంటారు. కలిసివచ్చే రంగు : పీచ్ మిథునం (మే 21 – జూన్ 20) గొప్ప జీవితాన్ని అందరూ కలగంటారు. అందుకు మీకుగా మీరేం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వారం చివర్లో ఊహించని అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. మీ ఆలోచనా విధానం మారాల్సిన అవసరం చాలా ఉంది. మారే ఈ ఆలోచనా విధానమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : వయొలెట్ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) జీవితం అందరికీ ఏదో ఒక సమయంలో ఒక గట్టి పరీక్ష పెడుతుంది. అందులో గెలిచామా లేదా అనేకన్నా, ఆ పరీక్షను తట్టుకొని నిలబడటమే జీవితం. కొన్ని గొప్ప అవకాశాలు వచ్చేముందు చాలాసార్లు ఎలాంటి సంకేతాలూ కనిపించవు. అలాంటి వాటికోసం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటూనే ఉండండి. ఈ వారమంతా ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఇది మీకు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ప్రశాంతతను తెచ్చిపెడుతుంది. వృత్తి జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితం ఇప్పుడిప్పుడే మీరు కోరుకున్న వైపుకు వెళుతోంది. ఏ పని జరిగాలన్నా ముందు మిమ్మల్ని మీరు బలంగా నమ్మాలన్నది తెలుసుకోండి. మీరు ఊహించని ఒక విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ఆ విజయాన్ని అందిపుచ్చుకోండి. వరుసగా కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వారం చివర్లో ఓ కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్యం కుదుటపడుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు దక్కవు. ఇక్కడితో నిరాశ పడిపోతే ముందుండే ఒక గొప్ప జీవితాన్ని ఆస్వాదించలేరు. ఏ పనిచేసినా విజయంపై ధీమాతో, చిత్తశుద్ధితో చేస్తూ వెళ్లండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. గతాన్ని గురించి ఆలోచించకుండా ఇప్పుడు మీరెలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి. అందుకు శ్రమించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఒక్కోసారి ప్రపంచం మిమ్మల్ని మీలా ఉండమని చెబుతూ ప్రతి సందర్భంలో కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని ముందుకు వెళ్లాల్సిన సమయమిది. చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి విజయానికైనా చేరువ కావొచ్చన్నది మీరు తెలుసుకోవాలి. ఈ వారంలోనే మీరెప్పట్నుంచో వినాలనుకుంటున్న ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిది. కలిసివచ్చే రంగు : బూడిద వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఇప్పుడు, ఈ సమయంలో ఏయే విషయాలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాయో ఆ విషయాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు పారిపోకుండా వాటికి ఎదురెళ్లి నిలబడే మీ స్వభావమే మీకొక గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని తట్టుకొని మీ ప్రేమను ప్రపంచానికి అందంగా పరిచయం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : బంగారం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. కొన్నిసార్లు గొప్ప విజయాలు ఎదురయ్యేముందు కాలం లెక్కలేనన్ని పరీక్షలు పెడుతుంది. వాటన్నింటికీ నిలబడే శక్తిని కూడగట్టుకుంటారు. వారం చివర్లో ఊహించని అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ జీవితంలో ఒక్కసారే కొత్త కొత్త మార్పులొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి మిమ్మల్ని మీకే కొత్తగా పరిచయం చేసే మార్పులు. ఎప్పట్నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలన్నీ మెల్లగా సద్దుమణుగుతాయి. ఆత్మవిశ్వాసంతో ఉండటమే సవాళ్లకు మీరు విసరగల సవాలు అని తెలుసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితంలో ఒక సమయం దాటిపోయాక మీరు ఎంత ప్రయత్నించినా జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యలేరు. అందుకు ఇది సరైన సమయమని తెలుసుకొని జీవితాశయం కోసం కష్టపడండి. మిమ్మల్ని నమ్మి మీకిష్టమైన వ్యక్తి ఓ గొప్ప అవకాశాన్ని ఇస్తారు. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ముందుకెళతారు. కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : కాషాయం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితంలో చాలా విషయాలు అనుభవంలోకి వచ్చాకే విలువైనవిగా కనిపిస్తాయి. ఈవారం మీకిష్టమైన వ్యక్తితో విలువైన సమయాన్ని గడుపుతారు. ఇది మీలో తిరుగులేని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, విజయం దిశగా వెళ్లేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. వృత్తి జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయి. అందరితో కలిసిపోయే మీ స్వభావమే మిమ్మల్ని అందర్లోకీ ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి - ఇన్సియా టారో అనలిస్ట్ -
టారో 30 ఏప్రిల్ నుంచి 6 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో సాగిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, వీపునొప్పి, కొద్దిపాటి మానసిక ఒత్తిడి బాధించవచ్చు. సంగీత చికిత్స లేదా ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. మీ కలలు నిజం అయే అవకాశం కలుగుతుంది.Sపలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం ప్రయోజనం చేకూరుతుంది. మీ ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి మంచి కబురు అందుతుంది. చదువుకు సంబంధించిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. విందు వినోదాలలో తీరుబడి లేకుండా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుని, వేగంగా పని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కలిసి వచ్చే రంగు: » ంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూత్న శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంగా పని చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశీయానం చేయవలసి రావచ్చు. ఒక స్త్రీ మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పెట్టిన పెట్టుబడల నుంచి లాభపడతారు. మార్నింగ్ వాక్, యోగ వంటివి కొనసాగించడం మంచిది. కలిసివచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు అందుతాయి. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. మీ కష్టసుఖాలను స్నేహితులకు చెప్పుకుని ఉపశమనం పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు చేసిన పనులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి ఓర్చుకోలేక మిమ్మల్ని చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. తెలివిగా తిప్పికొట్టడం అలవరచుకోండి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యం అవవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. Ðఅవకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 23 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పనిలో బాధ్యతాయుతంగా మెలిగి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉరవడిని కనిపెడతారు. లక్ష్యాలను నిర్ణయించుకుని పని చేస్తే మెరుగైన ఫలితాలను పొందగలమని గ్రహిస్తారు. ఈ వారం మీ స్నేహితుడి నుంచి ఒక శుభవార్తను అందుకుంటారు. ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండటం అవసరం అని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పనిప్రదేశంలో కొత్త సవాళ్లు, కొన్ని ప్రతిబంధకాలూ ఏర్పడవచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోక, సహోద్యోగుల సహకారంతో తగిన చర్యలు చేపట్టండి. ఎంతోకాలంగా ఒక వ్యాపారం ఆరంభించడానికి లేదా కొత్త ఆదాయ మార్గం కోసం ఎంతోకాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది తగిన సమయం. ప్రేమలో మీకున్న చిక్కులు తొలగుతాయి. కలిసొచ్చే రంగు: నీలాకాశం మిథునం (మే 21 – జూన్ 20) మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే విజయానికి చేరువ అవుతారని గ్రహించండి. పాత జ్ఞాపకాలు కొంత బాధపెట్టవచ్చు. అయితే గతంలోని చేదును మాత్రమే కాకుండా, తీపి అనుభవాలనూ నెమరు వేసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ విషయంలో కొద్దిపాటి చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: పచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది ముఖ్యమైనదో కాదో అవగాహన ఏర్పరచుకుని అందుకు తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరినీ కలుపుకుంటూ పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం మీరు మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. బద్ధకమనే మీ శత్రువును వదిలించుకుంటే మంచిది. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పాత బాకీలనుంచి, అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు. కలిసిచ్చే రంగు: దొండపండు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) చాలా కాలంగా మీరు అణగదొక్కి ఉంచిన సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. జాగ్రత్త. ఇది మీ ప్రస్తుత జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి పలుకుబడిని ఉపయోగించి, తిరిగి ఆ సమస్యలను అణిచేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్లద్దు. కలిసొచ్చే రంగు: కాఫీ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త విషయాలను నేర్చుకోవాలన్న మీ జిజ్ఞాసను ఈ వారంలో తీర్చుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ కళ అందరినీ అలరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. భావోద్వేగాలలో మునిగి తేలతారు. కలిసొచ్చే రంగు: తెలుపు -
టారో 16 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విజయం వరిస్తుంది. మీ కృషి, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంభాషణా చాతుర్యంతో సభలు, సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితానికీ, బిజినెస్కీ సమన్వయం ఉండేలా చూసుకోండి. కుటుంబం వల్ల ఆనందం కలుగుతుంది. లక్కీ కలర్: లేత గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చురుకుగా, అంకితభావంతో పని చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఉదారంగా, నిజాయితీగా ఉంటారు. మీ హాస్య చతురతే క్లిష్ట పరిస్థితులనుంచి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. మీ కుమారుడు లేదా ఆప్తుడు వృద్ధిలోకి వచ్చి మీకు చేయూతగా నిలుస్తారు. ధ్యానం ద్వారా మీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ నీతి నిజాయితీలు, పరోపకార గుణాలే మిమ్మల్ని వ్యాపారంలో లాభాలబాటలో నడిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారానికి పురిగొల్పుతాయి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. వారికి స్వాంతన చేకూరుస్తారు. పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: ముదురు గులాబీ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. లక్కీ కలర్: లేత బూడిద రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీ చుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తెలివిగా తిప్పికొడతారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ కలర్: బంగారు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పనిలో కొద్దిపాటి ఒత్తిడి తప్పదు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. లక్కీ కలర్: స్ట్రాబెర్రీ వంటి ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కలిసొచ్చే వారమిది. ఏదైనా విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకుంటే తటపటాయించవద్దు. లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. విదేశీయానం ఉండవచ్చు. శరీరాకృతిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: మావి చిగురు -
టారో : 9 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉత్సాహంతో పనులు చకచకా చే స్తారు. ముఖ్య విషయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అవమానం తప్పదు. మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు. కెరీర్లో లేదా మీ జీవితంలో భారీ మార్పు చేర్పులుండవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారం. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ కూచోవద్దు. అధికార యోగం లేదా పదవీయోగం తలుపు తడుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. వారసత్వపు ఆస్తులు కలిసి రావడం వల్ల సంపద పెరుగుతుంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కెరీర్‌పరంగా మార్పు చేర్పులుండవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బుర్రకు పదును పెట్టి, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతే అంతా శుభమే! ఒక విషయంలో సందిగ్ధత నెలకొనవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపడతారు లేదా కొత్తవారితో పనిచేయవలసి రావచ్చు. పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. అననుకూలతలనూ అధిగమిస్తారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడతాయి. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ కెరీర్ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో‡మార్పు చేర్పులు చేసుకుంటారు. తొందరపడి మాట ఇవ్వడం లేదా మొహమాటానికి పోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టి, మంచి. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మౌనంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొహమాటంతో మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకపోతే మునిగిపోతారు. కుటుంబ వ్యవహారాలలో పట్టీపట్టనట్టు ఉండే మీ ధోరణి మంచిది కాదు. కలిసొచ్చే రంగు: గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. విసుగువల్ల, తప్పదన్నట్లు పని చేసి, నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: నలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఉన్నతమైన హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టినకొద్దీ, మీకు మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కెరీర్‌పరమైన విషయాలలో మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయ వ్యయాలలో ప్రణాళిక ప్రకారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 2 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కల్యాణ ఘడియలు మోగవచ్చు సంసిద్ధంగా ఉండండి. సన్నిహితుల సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పగటికలలు మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. న్యాయపరమైన వివాదాలలో అనవసర జాప్యం మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు. గురువులు లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటారు. కుటుంబపరంగా సంతృప్తి. కలిసొచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విజయాల బాటలో నడుస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. జీవితంలో పెద్ద మలుపునకు దారితీయవచ్చు. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి. అంచనా వ్యాపారాలు, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్లవద్దు. అవకాశాలకోసం నిశిత పరిశీలన చేస్తారు. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి రావచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలకు, లక్ష్యాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) చాలా అవిశ్రాంతంగా గడుపుతారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిం^è ండి. సానుకూల భావనలతో ఉండండి. పెట్టుబడులలోఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జిమ్ లేదా యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా ఉల్లాసంగా పని చేస్తారు. అదే మిమ్మల్ని విజయాలబాటలో నడిపిస్తుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. పిల్లల విషయమై మంచి వార్తలు వింటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వ్యాపార విస్తరణకు మంచి అవకాశం లభిస్తుంది. మీ సహాయ సహకారాల కోసం టీమంతా ఎదురు చూస్తుంటుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అలసిపోయిన శరీరాన్నీ మనస్సునూ సేదతీర్చడానికి విందు వినోదాలలో గడుపుతారు. విహార యాత్రలు చేసేందుకు తగిన సంసిద్ధతలో ఉంటారు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. కలిసి వచ్చే రంగు: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) నిత్యం పనుల ఒత్తిడితో అలసిపోయిన మీరు సేదతీర్చుకోవడానికి ఇష్టమైన వారితో కలసి పిక్నిక్కు లేదా దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళదామని ఆలోచన చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ సన్నిహితులకు వచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపించి, వారి అభినందనలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: వెండి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదే కానీ, అలాగని కుటుంబ జీవితాన్ని త్యాగం చేయకూడదు కదా... ప్రణాళికాబద్ధంగా పని చేసి, ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. వెన్నుపోటు దారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అవసరం. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ద్వారా ఆశించినంత ఆదాయం లభించకపోవడం నిరాశకు గురి చేస్తుంది. రోజూ ఉదయమే లేలేత సూర్యకిరణాలలో స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మీ విజ్ఞానంతో, సృజనాత్మకతతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలను, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. గృహ సంబంధమైన కొత్తవస్తువులు లేదా బంగారం కొంటారు. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) శక్తిసామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ప్రజా సంబంధాలను మెరుగు పరచుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. మనసు చెప్పిన మాట వినండి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: నారింజ లేదా కాషాయం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంటారు. కలిసి వచ్చే రంగు: గోధుమరంగు -
టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు మీ వెంటే ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరెంతో ముందుచూపుతో, ఆశావహ, సానుకూల దృక్పథంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది. తిరస్కృతులు, హేళనలు ఎదురయినా పట్టించుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ మార్గంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుముళ్లన్నీ వీడిపోతాయి. మీరు మీ అంతరాత్మ మాట వినడం లేదు. మీ మంచి చెడులలో అనుక్షణం మిమ్మల్ని హెచ్చరిస్తూ, మేలు చేద్దామని చూస్తుంటే, తోసిపుచ్చడం తప్పు. వెంటనే మనసు మాట వినండి. చెడు స్నేహాల పట్ల జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) డబ్బుకు సంబంధించి కొన్ని భయాందోళనలు నెలకొనవచ్చు. ముఖ్యంగా డబ్బు భద్రతకు సంబంధించినవి. అలాగే ధన సంపాదన విషయంలో కూడా అంతే ఇబ్బంది. వృత్తిపరంగా మీరు మేటి. అలాగని మీ వ్యక్తిగత సంతోషాలు, జీవితాన్ని వదులుకోవద్దు. మీ ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని మీద దృష్టి పెట్టండి. మీరు సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనక గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త పడటం మంచిది. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అవసరం. సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టసుఖాలను శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. లాభదాయకమైన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి తగిన సమర్థులను అన్వేషించండి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. మీ విజయానికి వేడుకలు చేసుకుంటారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా మీరు మాట్లాడే ప్రతి మాటా నిజం అవుతుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. కెరీర్లో రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు -
టారో : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీకు ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనుక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠ, హోదాలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఒక విషయంలో ముఖ్యనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇతరులకు అది కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. అయితే మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొద్దిగా ఒడిదుడుకులతో కూడి ఉండవచ్చు. అంతమాత్రాన మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో... దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలుతీర్చేస్తారు. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీ పూజలు నిరాడంబరంగా ఉండాలి. హంగూ ఆర్భాటాలు అక్కరలేదు. ఆర్థికంగా కొద్దిపాటి మందకొడితనం నెలకొనవచ్చు కానీ, నిరుత్సాహ పడకండి. సానుకూలంగా తీసుకోండి. వృత్తిపరంగా, పనిపరంగా మిమ్మల్ని ఆవరించి ఉన్న కొన్ని భ్రమలు తొలగి, నిజాలు బయటపడతాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అన్ని విషయాల్లోనూ మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా! కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ -
టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
పనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపుకోసం మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సూచనలకు తగ్గట్టు మీ సిబ్బంది పని చేస్తారు. ఉద్యోగార్థుల ఎదురు చూపులు ఫలిస్తాయి. వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శక్తి సామర్థ్యాలను మెరుగు పరచుకుంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మనం చకచకా ముందుకెళ్లాలంటే ముందు మన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవాలని గ్రహించండి. మీ నిర్ణయాత్మక శక్తి ఇతరులు ప్రశ్నించేలా ఉండకూడదు. ఎదుటివాళ్ల బాహ్యవేషాలను బట్టి అంచనాలు వేసుకోకండి. మీకు అనుమానంగా ఉన్నవాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోండి. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ సన్నిహితులొకరు వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా, మీకు దూరంగా మెలగుతున్నట్లుగా అనిపించవచ్చు. వారిని ప్రశ్నించేముందు వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూడండి. ఆర్థికంగా బాగుంటుంది. నిద్రలేమి చికాకు పరచవచ్చు. చిన్న చిన్న రుగ్మతలకు గృహ చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈ వారం మీరు బోలెడన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. ఒక వ్యక్తితో అనుకోకుండా జరిగిన పరిచయం బలపడుతుంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సన్నిహితులొకరితో మీకు వివాదం ఏర్పడవచ్చు. అది ఒత్తిడి మూలంగా జరిగినదే కాని, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరంగా కుంగిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒకదారి మూసుకుపోతే వంద దారులు ఉంటాయని గుర్తు చేసుకోండి. చాలాకాలంగా ఉన్న ఒక బంధం బలహీన పడవచ్చు లేదా తెగిపోవచ్చు. అది మీరూహించిందేగా, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. గత పరిణామాల నుంచి పాఠాలను నేర్చుకోండి. ఆసక్తికరమైన ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు లేదా మీరు కొత్త ప్రదేశాలకు ఆహ్వానం అందుతుంది. వర్తమానంలో జీవించండి. కలిసొచ్చే రంగు: గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) సానుకూల భావనలు, ఉత్సాహకర వాతావరణం నడుమ ఉల్లాసంగా ఉంటారు. ప్రకృతి ఎన్నో అందాలను, వింతలు, విడ్డూరాలను ప్రసాదించింది కదా, హాయిగా అనుభవించండి, ఆనందించండి. మీ ఆధ్యాత్మిక మార్గం లేదా బోధలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. వివిధ రకాల రుగ్మతలకు మీకు మీరు చికిత్స చేసుకోవడమే గాక ఇతరులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపశమనం కలిగిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ మనస్సును, మెదడును పనికి సన్నద్ధం చేయండి. నిదానమే ప్రధానం అన్న సూక్తిని ప్రస్తుతానికి పక్కనపెట్టి ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని అనుసరించి పని చేయండి. మీ కుటుంబంతో, ముఖ్యంగా సహోద్యోగులతో పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల్లో అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. కలిసొచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మబ్బులు కమ్మిన ఆకాశంలోనే సూర్యోదయం కూడా జరుగుతుందని గుర్తు తెచ్చుకోండి. పాత వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రశాంతంగా, స్థిమితంగా, తేటపడిన మనస్సుతో ఉంటారు. పిల్లల మూలంగా ఆనందం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కాలానుగుణంగా జరుగుతున్న మార్పులను ఆమోదించక తప్పదని గుర్తించండి. మీ కోణంలో నుంచే కాదు, ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం మంచిది. బూజుపట్టుకుపోయిన పాత అలవాట్లను వదులుకోకపోతే ఇబ్బందులు తప్పదు. మీకొక అవకాశం వస్తుంది. అయితే అది కొద్దిపాటి రిస్క్‌తో కూడుకున్నందువల్ల ఎటూ తేల్చుకోలేకపోతారు. పనితో అలసిన మనస్సును, శరీరాన్ని సేదతీర్చడం అవసరం. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంటుందీ వారమంతా! పనులలో జాప్యం. శుష్కవాగ్దానాలకు బోల్తా పడవద్దు. మీలాగే అందరూ నిజాయితీపరులని అనుకోవద్దు. ముద్రణ, యంత్రాలతో పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పనిని సమీక్షించుకుని, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడం మంచిది. విందువినోదాలలో గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కష్టాలు వచ్చినప్పుడే మనకు కావలసిన వారెవరో తెలిసొస్తుంది. అంతేకాదు, మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు వెలికి వస్తాయని గుర్తించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పదు. పనిప్రదేశంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. పాతశత్రువుల పట్ల అప్రమత్తత, ఇరుగు పొరుగుతో సఖ్యత అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆశయాల సాధనకు తగిన కృషి, ప్రణాళికతో కార్యాచరణలోకి దిగండి. మీకేదైనా కొత్త ఆలోచన వచ్చినా, సృజనాత్మకత చూపించాలనుకున్నా, మీలోనే ఉంచుకోండి. బయటికి చెప్పవద్దు. వెంటనే అమలు చేసేయండి. ఒక బంధం విషయంలో నిజానిజాలు తెలుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఒక ఆకర్షణ బంధంగా మారేంతగా బలపడవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు -
టారో :19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉద్వేగభరితంగా, సాహసోపేతంగా సాగిపోతుందీవారమంతా! ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు క్రీడలలో పాల్గొనండి. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో కూడి ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. కలిసొచ్చే రంగు: పచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు: తెలుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. మీ హితులకు, సన్నిహితులకు ఏ సమస్య వచ్చినా, వారికి మీరే గుర్తుకొస్తారు. వారికి తగిన పరిష్కారం చూపించి, ఆత్మసంతృప్తి పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల విషయంలో భయం వదిలి సంగీత చికిత్స తీసుకోండి. కలిసివచ్చే రంగు: వంకాయ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికవనరులు సమకూరుతాయి. గత చేదుజ్ఞాపకాలను మరచిపోండి. వాటినుంచి అనుభవ పాఠాలను నేర్చుకోండి. ధనపరంగా త్వరలోనే ఒక శుభవార్త అందుకుంటారు. గతంలో మీ చేజారిపోయిందనుకున్న ఒక అవకాశం తిరిగి మీ తలుపు తడుతుంది. ఈసారి జారవిడుచుకోరు. మీ జీవితభాగస్వామి నుంచి మీకో అనూహ్య కానుక అందుతుంది. కలిసొచ్చే రంగు: సిరా నీలం -
టారో :12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవసరాలకు తగిన డబ్బు చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ప్రేమలో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో కొద్దిగా ముందడుగు వేస్తారు కూడా! పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఇతరుల సమస్యలను విని, మీకు చేతనైన సాయం చేస్తారు. అలా సాయం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీరు విద్యార్థులైతే మంచి మార్కులు సాధించి, అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లుగా సాగుతుంది. మీకు కావలసిన వారికోసం బాగా ధనం ఖర్చు చేస్తారు. గత జ్ఞాపకాలతో కుంగిపోకుండా, వాటినుంచి పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి కోసం అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ సన్నిహితులతో వీలయినంత నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం మంచిది. దానివల్ల లేనిపోని అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లేదా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతర వ్యాపకాలలో పడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) రకరకాల కారణాల వల్ల పని పేరుకుపోవడంతో అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఒకోసారి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. టెన్షన్ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దృఢంగా ఉంటారు. విందు, వినోదాలు, దూరపు ప్రయాణాలతో సేదతీరే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: తెలుపు, వంగపువ్వు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలం. కలిసి వచ్చే రంగు: వెండి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఎప్పుడూ గెలుపు మనదే అనుకోవడం పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం అవివేకం. ఎందుకంటే ఓడినప్పుడే కదా, మీ శక్తిసామర్థ్యాలు మీకు తెలిసేది. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటారు. మంచి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసి, ప్రశంసలు పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. వెన్నునొప్పి బాధించవచ్చు. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఆందోళన మాని, ప్రకృతి ఉత్పాదనల వాడకంతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. జీవితమంటే ఎప్పుడూ పని, పరుగులే కాదు, కాస్త విశ్రాంతి, ప్రేమ, ఉల్లాసం కూడా అవసరం అని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీది కాని కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఉత్పాదనలు, స్వచ్ఛమైన గాలి, నీరు వల్ల స్వాంతన పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను నెరపడంలో, వాటిని మరింత మెరుగు పరచుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆందోళన మాని వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. మనసు చెప్పినట్లు నడచుకోండి. చెవి లేదా గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికంగా చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంటారు. అలా ఎన్నోసార్లు. కానీ, చెడ్డ అలవాట్లు అలవడినంత తొందరగా వదలవని గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి ధోరణి మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఒకరికొకరు సర్దుకుపోయి. సామరస్యంగా జీవించడమే కదా జీవితం. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా -
టారో 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అవరోధాలనూ అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు.. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభాసామర్థ్యాలకి గుర్తింపు కోసం మరింత కష్టపడాలి. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు. కలిసొచ్చే రంగు: చాకొలేట్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం విందు వినోదాలలో గడుపుతారు. పనిలో విసుగు అనిపించినా, చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెలకువ లేకపోతే మాట పడక తప్పదు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకోకుండా కొత్తవారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే పనులు విజయవంతమవుతాయని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ -
టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని చూసి, మీ సహోద్యోగులు అసూయపడతారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. భయాందోళనలు వదిలేసి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కలిసి వచ్చే రంగు: పచ్చబంగారు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవిశ్రాంతంగా పని చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు, తెలివితేటలకు మరింత పదును పెట్టుకుని, మీ వాక్చాతుర్యంతో మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు చెప్పినట్లు నడచుకోండి. ఇతరులను మీరు గౌరవిస్తేనే, వారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) స్నేహితులతో, బంధుమిత్రులతో కలసి సరదాగా గడుపుతూ మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సంతోషంగా గడుపుతారు. కలిసివచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉద్యోగ భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజులు సాఫీగా గడవడం లేదనిపించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకంగా పనులు చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తిరుగుతుంది. కలిసి వచ్చే రంగు: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఏదో కలలో జరిగినట్లుగా నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో చకచకా పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. ప్రతిదానికీ కుటుంబసభ్యులమీద, కిందిస్థాయి ఉద్యోగుల మీద ఆధారపడకుండా మీపనులు మీరు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి. కలిసి వచ్చే రంగు: ముదురాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను లేదా పంటి నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీచుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటివి అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. ఏనాడో తెగిపోయిన ఒక బంధాన్ని మీ ప్రేమతో తిరిగి అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. బహుమతులు అందుతాయి. గతాన్ని తలచుకుని కుమిలిపోవద్దు. వర్తమానంలో ఏం చేయాలో ఆలోచించండి. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. హుందాగా ముందుకు సాగండి. దిగువస్థాయి వారితో కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. సహోద్యోగుల సహకార లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. పరోపకారగుణాన్ని అలవరచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మొహమాటానికి పోయి తలకు మించిన బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈ వారం మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు కోరుకున్న వారి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికతను అలవరచుకుంటారు. మీ నిక్కచ్చితనం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కలిసి వచ్చే రంగు: నీలం -
‘నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు’
ఆంస్టర్ డామ్: ప్రేమకథలన్నీ సుఖాంతం కావు. ఆంస్టర్ డామ్ కు చెందిన నదియా అనే మహిళకు ప్రేమ వివాహం పీడకలగా మారింది. తన విషాదగాధను హ్యుమన్స్ ఆఫ్ ఆంస్టర్ డామ్ పేజీలో ఆమె పంచుకుంది. భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు చివరకు తీరని వేదన మిగిలిందని తెలిపింది. పెళ్లైన తర్వాత వేధింపులు మొదలయ్యాయని, చివరకు తన రెండేళ్ల కూతుర్ని దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తె కోసం న్యాయపోరాటం చేస్తున్నానని వెల్లడించింది. ‘‘ఆంస్టర్ డామ్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల వేడుకలో మొదటిసారి అతడితో పరిచయం అయింది. అప్పటి నుంచి ఫోన్లో తరచుగా మెసేజ్ లు పంపేవాడు. 2010లో అతడు మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. అతడి గురించి పూర్తిగా తెలియదని చెప్పి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించాను. అక్కడితో అతడు వదల్లేదు. ఫోన్లో మెసేజ్ లు పంపుతూనే ఉండేవాడు. తరచుగా ఆంస్టర్ డామ్ వచ్చి నన్ను కలుసుకునే వాడు. మరోసారి ప్రపోజ్ చేయడం అతడితో ప్రేమలో పడ్డాను. 2011లో మా పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత జీవితం తలకిందులైంది. నా భర్త వేధించడం మొదలు పెట్టాడు. మా పాప ఇన్సియా పుట్టిన తర్వాత కూడా అతడి ప్రవర్తన మారలేదు. దీంతో విడాకుల కోసం దరఖాస్తు చేశాను. నన్ను చంపుతానని బెదిరించాడు. నేను భయపడకపోవడంతో సెప్టెంబర్ 29న మా పాపను కిడ్నాప్ చేసి ముంబై తీసుకెళ్లిపోయాడు. నా కూతురితో మాట్లాడేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా కుదరలేదు. విదేశాంగ శాఖ, డచ్ ప్రభుత్వం సహకారంతో ఇన్సియాను నా దగ్గరకు తెచ్చుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్నా’నని నదియా వెల్లడించింది. -
టారో: 18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పూర్తిగా అంకితభావంతో పని చేయమన్నది ఈ వారం వీరికి చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అధికారం కోసం మీరు పడుతున్న ఆరాటం ఫలించే అవకాశాలున్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఏమాత్రం తొందరలేకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కు వెళ్లడానికి అనుకూలమైన కాలం ఇది. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. లేదంటే మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు, కాస్త పట్టువిడుపు ధోరణిని అలవరచుకోండి. స్నేహితులు, మీ కింది స్థాయి వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీకు చాలా అనుకూలమైన వారమిది. పనిలో కొత్త పద్ధతులు నేర్చుకుని, వాటిని విజయవంతంగా అమలు చేసి, మంచి పేరు, ప్రశంసలు తెచ్చుకుంటారు. బృందంతో కలిసి మీరు చేసే పని విజయవంతమవుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం వస్తుంది. కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు చేస్తుంది. కలిసి వచ్చే రంగు: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఏదో అద్భుతం జరిగినట్లుగా మీ ప్రేమ ఫలిస్తుంది. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. భౌతిక శక్తులమీదనే కాదు, ఆధ్యాత్మికత మీద కూడా మనసు పెట్టి, నమ్మకంతో పని చేస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. కలిసి వచ్చేరంగు: పాలమీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీకు అన్నివిధాలుగా కలిసి వచ్చే కాలమిది. గొప్ప అవకాశాల కోసం, మంచి సమయం కోసం మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. ప్రేమ విషయంలో కొంత నైరాశ్యం, ఎదురుదెబ్బలూ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించ వలసిన సమయమిది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: వెండిరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కుటుంబపరంగా మీకు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. అంకితభావంతో కష్టపడి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి, దానిని ఆచరణలో పెట్టి ఘనవిజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేయడం సత్ఫలితాలనిస్తుంది. మీ విల్ పవర్ మీకు మంచి చేస్తుంది. రానున్న సంవత్సరంలో మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు. కలిసి వచ్చే రంగు: గచ్చకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) గులాబీ చెట్టుకు ఎన్ని ముళ్లున్నా, ఎంత గాలిఒత్తిడి ఎదురైనా తట్టుకుని అందమైన పూలనే ఇచ్చినట్లు మీరు కూడా అన్ని రకాల ఒత్తిళ్లనూ తట్టుకుని అందరికీ ఆనందాన్నే పంచుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అలసిన మనస్సును, శరీరాన్ని విహార యాత్రలతో సేదదీర్చేందుకు ఇది తగిన సమయం. ఈవారంలో మీ కెరీర్ మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: వంకాయరంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు త్యాగాలు చేయవలసిన సమయం. బాగా కష్టపడి పని చేయాల్సిన సమయం కూడా. ఒక్కోసారి మీ ప్రేమను కూడా త్యాగం చేయక తప్పదు. పనిపరంగా మీకు చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ పని అంటూ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఉద్యోగ భద్రత కోసం చిన్న చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది. దేనిలోనైనా ఉదాశీనత పనికి రాదు. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికంగా మీకు అనూహ్యమైన లాభాలు కళ్లజూస్తారు. ధనయోగం కలుగుతుంది. కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. భగవంతుడి మీద భారం వేసి, ధైర్యం చేసి మీరు వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని లక్ష్యసాధనకు, విజయానికి చేరువ చేస్తాయి. మీ సృజనాత్మకత మీకెంతో ఉపయోగపడుతుంది. ఎన్ని పనులున్నా, కుటుంబాన్ని, స్నేహితులను దూరం చేసుకోవద్దు. విద్యార్థులకు అనుకూల కాలమిది. కలిసి వచ్చే రంగు: లేత గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పనిపరంగా కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. అనూహ్యంగా విజయం సాధించి, ఎంతోకాలంగా మీరనుభవిస్తున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. కొత్తగా ఒక మంచి ఆదాయ మార్గాన్ని తెలుసుకుంటారు. అన్ని గాయాలనూ మాన్పగలిగే గొప్ప శక్తి కాలానికి ఉందని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: పొద్దుతిరుగుడు పువ్వు వన్నె కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) గతంలో మీరు చేసిన ఒక మంచి పని ప్రస్తుతం మీకెంతో మేలు చేస్తుంది. దానిమేలు భవిష్యత్తులో కూడా ఉంటుంది. బహుశ ఇది మీరు రాసిన వీలునామా లేదా మీ పూర్వుల ఆస్తిపాస్తులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక ముందుజాగ్రత్త కావచ్చు. లక్ష్యసాధనలో విజయాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. డబ్బు, విజయంతో ఆనందంగా తిరిగి వస్తారు. కలిసి వచ్చే రంగు: లేత నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ చిరకాల కోరిక తీరుతుంది. పనిపరంగా, కెరీర్‌పరంగా ఏది ముందో, ఏది వెనకో తేల్చుకోలేని గందరగోళంలో చిక్కుకుంటారు. ఒత్తిడి మూలంగా ఏకాగ్రత కోల్పోయి, లక్ష్యసాధనకు మీరు వేసుకున్న ప్రణాళికలో మార్పులు అనివార్యం అవుతాయి. గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా, శాంతంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: బంగారు -
టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది. విజయవంతంగా గడుస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు. భావోద్వేగాలపరంగా చాలా బలంగా ఉంటారు. కలిసొచ్చే రంగు: నారింజ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వారిని సంతోషపెడతారు. మీరు కూడా అందంగా, ఆనందంగా కనిపిస్తారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది కానీ, మరికొంచెం జాగ్రత్త అవసరం. మీ ప్రాధాన్యతాక్రమాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆకాశనీలం మిథునం (మే 21 - జూన్ 20) అదృష్టం, ఆర్థికభద్రత మీ వెన్నంటే ఉంటాయి. మీ స్వీయశక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన తరుణం ఇది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య తొలగిపోతుంది. పరిష్కృతమవుతుంది. దాంతో ఒకవిధమైన నిశ్చింతతో ఉంటారు. మీ చిక్కులను మీరే నేర్పుగా పరిష్కరించుకుంటారు. కలిసొచ్చే రంగు: గోధుమరంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీరు అసాధ్యాలుగా భావించినవన్నీ సుసాధ్యాలవుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరకొచ్చేసినట్లే! మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దు, ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. బంధుత్వమంటే మీకు ఎంత ఇష్టమైనప్పటికీ, మీకు ఇష్టమైన వారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మీకు మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. విందు వినోదాలలో, విహార యాత్రలలో సేదదీరడం వల్ల మీరు పునరుత్సాహం పొందుతారు. మనసు మాట వినండి. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోండి. మీ ప్రతిభ, సామర్థ్యాలు మీకు విలువని తెచ్చిపెట్టవచ్చు కానీ, సామాజిక సంబంధాలూ అవసరమే అని గ్రహించండి. పనిలో కొత్త ప్రయోగాలు మంచిది కాదు. కలిసొచ్చేరంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ సృజనాత్మకతే మీకు శ్రీరామ రక్ష. పెద్దవాళ్ల నుంచి మీకో మంచి వార్త అందుతుంది. అది మీ కెరీర్‌నే మలుపు తిప్పుతుంది. సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామికీ మీకూ అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్త అవసరం. సమస్యలు మిమ్మల్ని నీరు గార్చేందుకు కాదు, మీకు పాఠాలు చెప్పేందుకే అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కలిగిన ప్రతికోరికనూ తీర్చుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించండి. మీ జీవితాశయం నెరవేరేందుకు చాలా సమయం పడుతుందని నిరాశ పడవద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండాలి.. అవిశ్రాంతంగా పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త ఉద్యోగాలు, వృత్తి, వ్యాపకాలకు ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) మీరు కోరుకున్నవాటిని పొందడానికి, మీ మనసులోని కోరికలను, భావాలను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం. మీ బంధంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. అలాగే సంతోషం కూడా. మీ దైనందిన వ్యవహారాలతో తీరికలేకుండా గడుపుతారు. మీ వృత్తి, వ్యాపకాలలోకి బంధుమిత్రులు, స్నేహితులను తీసుకు వస్తారు లేదా వారి పనులలో మీరు పాలుపంచుకుంటారు. కలిసొచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సంసిద్ధంగా లేకపోవడం వల్ల అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మితిమీరకుండా చూసుకోవడం మంచిది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. మీ సానుకూల దృక్పథమే మీకు మేలు చేస్తుంది. చిన్ననాటి స్నేహితుల రాక ఊరట కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) నూత్న గృహం లేదా వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మనసు చెప్పిన మాట వినండి. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీరు గీసుకున్న గిరి నుంచి బయట పడటం మేలు చేస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరిగే కొన్ని సంఘటనలు జరగవచ్చు. సృజనాత్మకంగా పని చేసి, మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచన అవసరం. ప్రేమ వ్యవహారాలో కొంత నిరాశ కలగవచ్చు. అనుకోని తగాదాలు, వ్యవహారాలలో వేలు పెట్టవలసి రావడం ఇబ్బంది కలిగించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) జాగ్రత్త, మెలకువ అవసరం. కొత్త ఆలోచనలను సృజనాత్మకంగా అమలు చేసి, మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఉపకరిస్తుంది. భార్య లేదా భార్య తరఫు బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కలిసొచ్చే రంగు: కాఫీ పొడి రంగు -
టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఒత్తిళ్లు, చికాకులు, కోపాలు, ఇతరులతో వివాదాలు మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగే నేర్పరితనం అలవడుతుంది. కెరీర్ పరంగా కొత్తమార్గాలు ఆవిష్కృతమవుతాయి. తికమకలు, పరధ్యానాలను పక్కన పెట్టండి. ప్రశాంతంగా పని చేసుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మీరనుకున్న పనులన్నీ నెరవేరాయన్న సంతృప్తి కలుగుతుంది. అయితే మీలోని స్తబ్దతను, నిస్తేజాన్ని తొలగించుకోండి. సరైన సంబంధం కుదురుతుంది. ఒక ఇంటి వాళ్లవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గుర్తింపును పొందుతారు. అభద్రతాభావాన్ని విడనాడి, ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి. ఒక స్త్రీ మూలంగా అదృష్టం, ఆస్తి కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కీర్తిప్రతిష్ఠలు, విజయం వరిస్తాయి. ఆర్థికంగా కొంత అభద్రత, అస్థిరత ఉండవచ్చు. భయపడకండి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు వెంటాడవచ్చు. ఆధ్యాత్మికతను అలవరచుకోండి. ప్రశాంతత అదే వస్తుంది. పనిపరంగా అంతా సవ్యంగా సాగుతుంది. ఆఫీసులో అంతా మిమ్మల్ని మెచ్చుకునేలా పని చేస్తారు. ప్రయాణాలు, సాహసాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లండి. అన్నీ ఉన్నాయన్న సంతృప్తి కలుగుతుంది. పనిలో మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. అయితే మౌనంగా విధులను నిర్వహించడమే కాదు, మీ హక్కులను గురించి గుర్తు చేసుకోండి. ఆర్థికభద్రత కలుగుతుంది. సాహసాలు, ప్రయాణాలు చేస్తారు. పాతను వదిలి కొత్తదనాన్ని అలవరచుకుంటారు. కలిసొచ్చే రంగు: పగడం రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈవారమంతా మీకు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. భావసారూప్యత కలిగిన వారితో కలిసి ప్రయాణిస్తారు. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) పనులలో కొద్దిపాటి అడ్డంకులు, అవరోధాలు తప్పకపోవచ్చు. కష్టించి పని చేయండి. మేలు జరుగుతుంది. ఈ వారం మీ జీవితం మలుపు తిరిగే మంచి సంఘటనలు జరగవచ్చు. పనిలో కొత్తపంథాను అనుసరించి, సృజనాత్మకంగా పని చేయండి. భారీమొత్తాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇంకొంచె జాగ్రత్త తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: పాచిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఈవారం మీరు అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా, మెలకువగా ఉండటం అవసరం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న మీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, లౌక్యంగా మాట్లాడటం అవసరమని గ్రహించండి. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పగటికలలు కనడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, నిజాయితీతో పని చేయడం ఎంతో మేలు చేస్తుంది. కొత్త పని లేదా ప్రాజెక్టులో క్షణం తీరికలేకుండా గడుపుతారు. రకరకాల అవకాశాలు మీ తలుపు ఒకేసారి తడతాయి. మీకు నచ్చినది, మీరు చేయగలిగినది ఎంచుకుని కెరీర్‌ను మీరు అనుకున్నట్లుగా తీర్చిదిద్దుకోండి. మీ పుట్టినరోజు తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆర్థిక భద్రత, స్థిరత్వం కలుగుతాయి. అయితే అందుకు మరికొంత సమయం ఉంది. ఆందోళన చెందకండి. పని, ప్రయాణాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. మీరు ఉద్యోగులైతే వ్యాపారావకాశం మీ తలుపు తడుతుంది. వ్యాపారులైతే ఉద్యోగావకాశం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. అందుకు తగ్గట్టు పని చేయాలి కదా! సానుకూల భావనలు, సాను కూల ఆలోచనలు మీకెంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీ ప్రేమ ఫలించేందుకు, మీ విషయం పెద్దల వరకు వెళ్లేందుకు ఒకరి సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తగిన ప్రణాళిక లేకపోవటం, సిద్ధంగా ఉండకపోవడం వల్ల కొద్దిపాటి ఆందోళన, అనిశ్చితి, గందరగోళం తప్పకపోవచ్చు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. గతం గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, దానినుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అవసరమే కానీ, అతి వద్దు. ప్రేమవ్యవహారాలలో కొంచెం వేగిరపాటు ఉండచ్చు. మీ సానుకూల భావనలు మీకెంతో మేలు చేస్తాయి. కలిసొచ్చే రంగు: వెండిరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీపాటికి మీరు ప్రశాంతంగా గడుపుతారు. తెలియనివారికి మీరు కొంచెం అహంభావి అనిపింవచ్చుగాక.. అయినా, మీ గురించి తెలిసిన తర్వాత మీరెంత స్నేహశీలి అన్నదీ వారికే అర్థం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలు, బాధలు, భయాల నుంచి నెమ్మదిగా బయట పడతారు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీరుస్తారు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు -
టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈ వారం చాలా బిజీగా ఉంటారు. నీతి నిజాయితీలతో మీరు చేసే పనులు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అదనపు బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. మీ ముందొకమాట, వెనకొక మాటా మాట్లాడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఫలించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కొత్త అవకాశం తలుపు తడుతుంది. కలిసి వచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఆదాయానికి లోటుండదు. ఆనందానికి అవధి ఉండదు అన్నట్లు ఉంటుంది ఈ వారమంతా. చదువుమీద, మీరు చేసే పనిపట్ల జాగ్రత్తవహించండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చి, చిక్కులు తెచ్చుకోవద్దు. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక పరిశీలన అవసరం. అనుకోకుండా బహుమతులు అందుతాయి. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ మిథునం (మే 21 - జూన్ 20) కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీరు మనసులో ఊహించుకున్న దానికి, జరిగేవాటికి పొంతన కుదరదు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ధైర్యంగా ఉండండి. మంచే జరుగుతుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవడం కోసం మీరు మారనక్కరలేదు. వివాదాస్పదమైన వ్యక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల మీద కన్నేసి ఉంచండి. పనిమీద శ్రధ్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ మనసులో ఉన్నదానిని బయటకు చెప్పడం, దాని మీదనే గట్టిగా నిలబడటమే ధైర్యమంటే! అవతలివాళ్లు చెప్పినదానిని ఓపికగా వినడం కూడా ధైర్యమే! ఏమి జరుగుతోందో పరిశీలించండి, ధైర్యంగా వినండి. ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాల్లోనూ నిదానంగా వ్యవహరించడం అన్ని వేళల్లోనూ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండండి. కలిసి వచ్చే రంగు:సముద్రపు నాచు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వారమంతా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా గడుస్తుంది. పెట్టుబడులు సంతృప్తికరమైన ఫలితాన్నిస్తాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భారంగా పరిణమించవచ్చు. పనులలో చోటు చేసుకునే జాప్యానికి, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సృజనాత్మక నిర్ణయాలు, సృజనాత్మక వ్యాపార వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కలిసి వచ్చే రంగు:పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. సానుకూల భావనలను పెంపొందించుకోండి. కొత్త స్నేహితులు, కొత్తగా ఏర్పడ్డ బంధాల వల్ల మీ కోరికలను కొన్నింటిని వదులుకోవలసి రావచ్చు. అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పూర్తికాని వ్యాపార పనులను. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. ఆలోచనలకు తగ్గట్టు పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మీరు అనుకున్న చోట్లకి వెళ్లడానికి, కొత్తపనులు చేపట్టడానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలసి వారమంతా రిలాక్స్డ్గా గడుపుతారు. మీ ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఉత్సాహంగా పనిచేయండి. పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి. పనులలో కొత్త విధానాలకు వెళ్లకపోవడం మంచిది. జీవితంలో కొత్తదనాన్ని నింపుకోవడం మరచిపోవద్దు. కలిసి వచ్చే రంగు: బూడిదరంగు / వెండి వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శక్తియుక్తులు, తెలివితేటలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మంచిది. మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే మంచి లాభాలు పొందుతారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కారం దిక్కుగా పయనిస్తాయి. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయం సాధిస్తారు. మీరు ఇష్టపడే వారి మనసును గెలుచుకుంటారు. కష్టపడి పని చేసి, విజయపథంలో నడుస్తారు. కలిసి వచ్చే రంగు: చాకొలెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విందువినోదాలలో పాల్గొంటారు. గొప్పవారినుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీకూ, మీ స్నేహితుడికీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. అయితే నేర్పుగా వ్యవహరించి, ఎట్లాగో ఒడ్డెక్కుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చింత మాని వర్తమానంలో జీవించండి. ప్రతిక్షణాన్నీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ గడపండి. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. మొండిబకాయిలు వసూలు చేసుకోవడమంచిది. నూత్నవాహనాన్ని కొనుగోలు చేస్తారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసు మాట వినండి.ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. దైవంపట్ల సరైన అవగాహనను పెంచుకుంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. పనిపట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కలిసి వచ్చే రంగు: ముదురు పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా లాభాలను పొందుతారు. తెలివితేటలు, కష్టించే తత్వంతో ప్రమోషన్లు పొందుతారు. లౌక్యం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అవసరం. మీ ప్రతిభా సామర్థ్యాలతో సీనియర్లను ఆకట్టుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించలేకపోయానని బాధపడవద్దు. కొత్త అనుభవం ఎదురయినందుకు ఆనందించండి. కలిసి వచ్చే రంగు: లేత గులాబి -
టారో (13-11-2016 to 19-11-2016)
13 నవంబర్ నుంచి 19 నవంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తారు. మీ అంతశ్చేతన అద్దంలా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా సాగుతుంది. చిన్న చిన్న ఒడుదొడుకులుండవచ్చు కానీ, జీవితంలోని ఇతర ఆనందాలతో పోల్చుకుంటే అవెంత? మీ పని మీరు మనసు పెట్టి, ఆత్మవిశ్వాసంతో చేయండి. లక్కీ కలర్: లేతగులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరిస్తే భయాలు తొలగుతాయి. మిమ్మల్ని బాధిస్తున్న ముల్లును నేర్పుగా పెకలించి వేస్తే మీ అంత కచ్చితమైన వ్యక్తి మరొకరు లేరని మీకే అర్థం అవుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ఇంటి ఆధునీకరణ పనుల్లో పడతారు. మీ సత్తా నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా జరగనున్న కొన్ని ప్రధాన సంఘటనలు మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. మీరు చేస్తున్నదంతా బాధ్యతాయుతంగా చేస్తున్నదేనని మీరు గ్రహిస్తే జీవితంలో అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఎప్పుడో విడిచిపెట్టిన బంధువులు, బంధుత్వాలు, పాత సంబంధాలు తిరిగి కలుస్తాయి. ఛలోక్తులు విసిరేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్: మావిచిగురు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గురుబలం వల్ల మీకు ఈవారం బాగా కలిసి వస్తుంది. విజయం వరిస్తుంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి భూతభవిష్యత్ కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో సంపూర్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. అవిశ్రాంతంగా పని చేయడం అనారోగ్యకరం అని గ్రహించండి. మార్మిక కవితలు లేదా ప్రేమగీతాల రచనకు శ్రీకారం చుట్టండి. మీ అంతర్గత శక్తులను వెలికి తీయండి. లక్కీ కలర్: చాకొలేట్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త అవకాశంతోపాటే కొత్త సవాళ్లూ పొంచి ఉంటాయని తెలుసుకోండి.సమస్యలను ఎదుర్కొంటేనే అధిగమించగలం. ఆత్మవిశ్వాసంతో సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా, మీ సామర్థ్యం బయటపడేది. కొత్తదనం కోసం అన్వేషించండి. మనసు చెప్పే మాటను వినండి. మీ సృజనాత్మకత మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సమస్యలు, సవాళ్లు లేని జీవితం చప్పిడి పప్పు వంటిది. మీరు కోరినవన్నిటినీ పొందాలనుకుంటే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే కదా జీవితం చైతన్యంతో ప్రకాశించేది! ఈ వారంలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని, డబ్బును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామిని కానుకలతో సంతృప్తి పరచేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: వెండిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) వృత్తిపరంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. రేపటికోసం తపన పడుతూ ఉంటే ఈరోజు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుందని గ్రహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు తక్షణం మీకు తగిన అత్యుత్తమమైన మార్గం కనిపించకపోవచ్చు కానీ, మీ ముందున్న మార్గం కూడా ఉత్తమమైనదే. ఇతరుల అవసరాలను తీర్చేముందు మీవి మీకు ముఖ్యమే కదా! లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీకు మంచి వినోదభరితంగా, ఉల్లాసంగా... ఇంకా చెప్పాలంటే సరసంగా గడిచిపోతుంది. మీ ప్రేమకోసం పడిగాపులు పడుతున్న వారిని పనిగట్టుకుని మరీ పలకరించి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. ఛాందసమైన ఆలోచనలను విడిచిపెట్టి, కొత్తగా, వైవిధ్యంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీ చరిష్మా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికీ పోదు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీరనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు అనుకుంటున్న కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మంచి లాభాలను కళ్లజూస్తారు. గొప్ప ఆదాయాన్ని పొందుతారు. తమ శక్తి సామర్థ్యాలేమిటో తమకే తెలియని వారికి ప్రతివిషయంలోనూ భయమే! జ్ఞాని దేనికీ భయపడడు. ఈవారం ఓ గొప్ప సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. లక్కీ కలర్: దొండపండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితమంటేనే స్వేచ్ఛ. ఎవరూ ఎవరినీ కట్టడి చేయజాలరని అనుకుంటారు. మనం ప్రేమించే వారిని మనం కట్టడి చేస్తాం. మనల్ని ప్రేమించే వారు తమ ప్రేమతో మన ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. అహాన్ని అణ చిపెడితేనే ఆనందం. త్వరలోనే కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడనున్నాయి. ఆమోదించక తప్పదు. లక్కీ కలర్: బూడిదరంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితం అంటే ప్రశ్న కాదు.. సమస్య అసలే కాదు. జీవితమంటే జీవించడమే! ఎదురైనవాటన్నింటినీ ఆమోదిస్తూ, అనుభవిస్తూ వాలుకు కొట్టుకుపోవడమే జీవితం. బోర్డమ్ నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్తగా తయారవండి. స్నేహితులతో సరదాగా గడపండి. కుటుంబంతో కలసి లాంగ్‌టూర్‌కి వెళ్లండి. రొటీన్ నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండండి. లక్కీ కలర్: వంకాయరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తివ్యాపారాలలో ఊహలనుంచి బయటపడి, వాస్తవంగా ఆలోచించడం, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంటిలో లేదా ఆఫీసులో కొత్త మార్పు చోటు చేసుకోబోతోంది. సృజనాత్మక ఆలోచనతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అత్యుత్తమమైన వాటి గురించి ఆలోచన చేయండి. అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించండి. మీ అభిప్రాయాలలో కాస్త పట్టువిడుపు ధోరణి అవసరం. లక్కీ కలర్: లేత పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
టారో : 6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) కొత్త అవకాశాలు కలిసొస్తాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. విందు వినోదాల్లో గడుపుతారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. అద్భుతమైన ఆర్థిక విజయాలను అవలీలగా సొంతం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో విఫలమవుతారు. సన్నిహితుల తీరు పట్ల నిరాశ చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇంటా బయటా తీరిక లేనంతగా పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి వృథా శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చికిత్స కోసం వైద్యులను సంప్రదించాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహారాలు నిరాశ కలిగించే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి మరింత సమయం కేటాయించి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 - జూన్ 20) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. మిమ్మల్ని విజయపథంలో ముందుకు నడిపే భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. గొప్ప అవకాశాలు దొరుకుతాయి. తీరిక దొరకడమే గగనంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. లక్కీ కలర్: లేత నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అవరోధాలను అధిగమిస్తూ విజయపథంలో దూసుకుపోతారు. మీ దూకుడును ఏ శక్తీ కట్టడి చేయలేదు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. సంకల్పబలమే కాక, సానుకూలమైన గ్రహబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. లక్కీ కలర్: ముదురు నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ప్రేమానుబంధాలకు సంబంధించి తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అనుకోని అవరోధాలు ఎదురైనా, నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనికి అమిత ప్రాధాన్యమిస్తారు. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ చూపాల్సి వస్తుంది. కలలను సాకారం చేసుకునేందుకు అహరహం ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దుకుంటారు. అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు. చిరకాలంగా కొనసాగిస్తున్న పనులను అనుకున్న రీతిలో ముగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటి వరకు ఎదురవుతూ వచ్చిన చికాకులన్నీ తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో రాజీమార్గాన్ని అవలంబించి బంధాన్ని నిలబెట్టుకుంటారు. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: నేరేడు రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కాలమంతా హడావుడిగా గడిచిపోతుంది. పని ఒత్తిడి ఊపిరి సలపనివ్వదు. అనూహ్యమైన సమాచారం మిమ్మల్ని కలవరపెడుతుంది. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని గ్రహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కళా సాధన ద్వారా లేదా మనసుకు నచ్చిన పనిలో నిమగ్నం కావడం ద్వారా సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కొత్త పనులకు నాంది పలుకుతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లతో కూడిన బాధ్యతలను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు. పని పట్ల నిబద్ధతను చాటుకుంటారు. మందకొడిగా ఉన్న వ్యాపారాలను విజయవంతంగా లాభాల బాట పట్టిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నాయి. భావసారూప్యత గల వ్యక్తుల నుంచి కీలకమైన సాయం అందుతుంది. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) జీవితంలో అలముకున్న చీకట్లు తొలగిపోతాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంతవరకు వెన్నాడిన కష్టాలకు గల కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. మానసిక సై్థర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ప్రేమానుబంధాల బలోపేతానికి సమయం వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. తీర్థయాత్రలు చేస్తారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటారు. బంధాలను బలోపేతం చేసుకోవడానికి చిత్తశుద్ధితో మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పాత పద్ధతులను విడనాడి అన్ని అంశాల్లోనూ మార్పులకు నాంది పలుకుతారు. చిరకాలం నాటి ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆత్మీయుల నుంచి కానుకలను అందుకుంటారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు. తీరికగా, కాసింత బద్ధకంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చిన పనులతో సేదదీరుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను మరింత ఏకాగ్రతతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తేలికగా సమసిపోతాయి. లక్కీ కలర్: తెలుపు