టారో : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్, 2016 వరకు | Taro | Sakshi
Sakshi News home page

టారో : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్, 2016 వరకు

Published Sun, Sep 18 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

టారో : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్, 2016 వరకు

టారో : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
విదేశాల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఆశించిన ఫలితాలను సాధించడానికి అప్రమత్తతతో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ఆశలు ఫలిస్తాయి. అసంపూర్ణంగా వదిలేసిన పనులను పూర్తి చేయాల్సి వస్తుంది. మీరు సాధించిన విజయాలను చూసి కొందరు అసూయ చెందుతారు. దీనివల్ల కొంత మనశ్శాంతి దెబ్బతింటుంది.
లక్కీ కలర్: నలుపు
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఒకేసారి చాలా అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి. ఎంపిక విషయంలో డోలాయమానంలో పడతారు. లక్ష్య సాధన కోసం ధైర్యసాహసాల తో ముందడుగు వేయాల్సి ఉంటుంది. పిరికితనాన్ని, మొహ మాటాన్ని విడిచిపెడితేనే ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి.
లక్కీ కలర్: మీగడ రంగు
 
మిథునం (మే 21 - జూన్ 20)
గ్రహానుకూలత బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవిశ్వాసంతో రాణిస్తారు. క్లిష్టమైన పనులను సైతం పూర్తిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.  విజయపథంలో ముందుకు సాగుతారు. ప్రేమానుబంధాలలో పొరపొచ్చాలు చిరాకు కలిగించవచ్చు. ఇబ్బందికరమైన సంబంధాల నుంచి తప్పుకుంటేనే మేలు.
లక్కీ కలర్: బంగారు రంగు
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఇంట్లో భారీ మార్పులు చేపడతారు. జీవన శైలిలో, ఆరోగ్య జాగ్రత్తల్లో కూడా మార్పులు అనివార్యంగా మారుతాయి. ఏవో తెలియని భయాలు వెన్నాడుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది. ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. అయితే, రుణాల జోలికి పోకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడమే క్షేమం. మానసిక కుంగుబాటును అధిగమిస్తారు.
లక్కీ కలర్: వెండి రంగు
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
కొత్తగా ప్రేమలో పడతారు. ప్రేమ వ్యవహారాల్లోకి దిగడం మీ జీవిత లక్ష్యంగా ఎన్నడూ అనుకుని ఉండరు కాని, నచ్చిన వ్యక్తి తారసపడటంతో పిచ్చిగా ప్రేమలో మునిగిపోతారు. కెరీర్‌లో మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులను అనివార్యతతో కాకుండా, అంతులేని తపనతో ఇష్టంగా పూర్తి చేస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.
లక్కీ కలర్: ముదురు నారింజరంగు
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
అరుదైన గొప్ప అవకాశం అందివస్తుంది. ఇల్లు, వాహనం కొనడం వంటి చిరకాల కోరికలు నెరవేరుతాయి. విలాస వస్తువులను పొందగల ఆర్థికబలాన్ని సంతరించుకుంటారు. దుర్వ్యసనాలను అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమవుతుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్: ముదురు ఎరుపు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
కెరీర్‌లో గొప్ప ఉన్నతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో దూసుకుపోతారు. మీ పురోగతిలోని వేగం ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది. మీ క్రమశిక్షణ, అంకితభావాలే మీ అభివృద్ధికి సోపానాలవు తాయి. బంధుమిత్రులతో పొరపొచ్చాలు రావచ్చు. విభేదాలకు, వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది.
లక్కీ కలర్: నేరేడురంగు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)

కలలను సాకారం చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. కొత్త జీవితానికి నాంది పలకాలనుకుంటారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఒక మహిళ ద్వారా మీకు అదృష్టం కలిసొస్తుంది. కొత్తగా మీరు ప్రారంభించబోయే వ్యాపారాల్లో మహిళను భాగస్వామిగా చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
లక్కీ కలర్: లేత ఊదా
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో కుదుపులు ఎదురవుతాయి. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా మీరు సునాయాసంగా పరిస్థితులను అధిగమిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. రిస్కు తీసుకోవడానికి తటపటాయించకుండా ముందుకు సాగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు వెళతారు. వ్యాపార విస్తరణకు సంబంధించి జ్యోతిషులను సంప్రదిస్తారు.
లక్కీ కలర్: ముదురు ఊదా
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఉద్యోగులకు మంచి పదోన్నతులు, వేతన పెంపు ఉంటాయి. వ్యాపారరంగంలో అవకాశాలు కొంత వరకు తగ్గుతాయి.  త్వరలోనే భారీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ధ్రువతారలా వెలుగొందు తారు. చేపట్టిన పనులను విజయ వంతంగా పూర్తి చేస్తారు. మరొకరితో కొత్తగా ప్రేమలో పడతారు.
లక్కీ కలర్: ముదురు ఎరుపు
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధీమాగా ఎదుర్కొంటారు.  త్వరలోనే ఆర్థిక లాభాలు కూడా అందివస్తాయి. ఈలోగా దాచుకున్న సొమ్మును ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి అనూహ్యంగా కొన్ని ప్రతిపాదనలు రావచ్చు. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మేలు.
లక్కీ కలర్: ముదురు నారింజరంగు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. చాకచక్యంగా వ్యవహరించి, సమస్యల నుంచి బయట పడతారు. దేనినైనా ‘కాదు’ అనకుండా అన్నింటికీ సంసిద్ధంగా ఉండటాన్ని అలవరచు కోవడం మంచిది. ఇలాంటి సర్వసన్నద్ధతే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. ప్రేమానుబంధాల పట్ల సంతోషంగా ఉంటారు.
లక్కీ కలర్: నీలం
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement