టారో : 6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో : 6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు

Published Sat, Nov 5 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

టారో :  6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు

టారో : 6 నవంబర్ నుంచి 12 నవంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 కొత్త అవకాశాలు కలిసొస్తాయి. ఆస్తులను సమకూర్చుకుంటారు. విందు వినోదాల్లో గడుపుతారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. అద్భుతమైన ఆర్థిక విజయాలను అవలీలగా సొంతం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంలో విఫలమవుతారు. సన్నిహితుల తీరు పట్ల నిరాశ చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
 లక్కీ కలర్: ఎరుపు
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 ఇంటా బయటా తీరిక లేనంతగా పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి వృథా శ్రమ తప్పకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చికిత్స కోసం వైద్యులను సంప్రదించాల్సి రావచ్చు. ప్రేమ వ్యవహారాలు నిరాశ కలిగించే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి మరింత సమయం కేటాయించి పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు.
 లక్కీ కలర్: గోధుమ రంగు
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. మిమ్మల్ని విజయపథంలో ముందుకు నడిపే భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. గొప్ప అవకాశాలు దొరుకుతాయి. తీరిక దొరకడమే గగనంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.
 లక్కీ కలర్: లేత నారింజ
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 అవరోధాలను అధిగమిస్తూ విజయపథంలో దూసుకుపోతారు. మీ దూకుడును ఏ శక్తీ కట్టడి చేయలేదు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. సంకల్పబలమే కాక, సానుకూలమైన గ్రహబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. కొత్త ఆలోచనలతో కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
 లక్కీ కలర్: ముదురు నారింజ

 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 ప్రేమానుబంధాలకు సంబంధించి తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. అనుకోని అవరోధాలు ఎదురైనా, నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనికి అమిత ప్రాధాన్యమిస్తారు. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ చూపాల్సి వస్తుంది. కలలను సాకారం చేసుకునేందుకు అహరహం ప్రయత్నిస్తారు.
 లక్కీ కలర్: తెలుపు
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
 ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దుకుంటారు. అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు. చిరకాలంగా కొనసాగిస్తున్న పనులను అనుకున్న రీతిలో ముగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఇప్పటి వరకు ఎదురవుతూ వచ్చిన చికాకులన్నీ తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో రాజీమార్గాన్ని అవలంబించి బంధాన్ని నిలబెట్టుకుంటారు. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు.
 లక్కీ కలర్: నేరేడు రంగు
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 కాలమంతా హడావుడిగా గడిచిపోతుంది. పని ఒత్తిడి ఊపిరి సలపనివ్వదు. అనూహ్యమైన సమాచారం మిమ్మల్ని కలవరపెడుతుంది. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుందని గ్రహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కళా సాధన ద్వారా లేదా మనసుకు నచ్చిన పనిలో నిమగ్నం కావడం ద్వారా సాంత్వన పొందడానికి ప్రయత్నిస్తారు.
 లక్కీ కలర్: ఆకుపచ్చ
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 కొత్త పనులకు నాంది పలుకుతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లతో కూడిన బాధ్యతలను ఆత్మవిశ్వాసంతో స్వీకరిస్తారు. పని పట్ల నిబద్ధతను చాటుకుంటారు. మందకొడిగా ఉన్న వ్యాపారాలను విజయవంతంగా లాభాల బాట పట్టిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు జరిగే సూచనలు ఉన్నాయి. భావసారూప్యత గల వ్యక్తుల నుంచి కీలకమైన సాయం అందుతుంది.
 లక్కీ కలర్: పసుపు

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 జీవితంలో అలముకున్న చీకట్లు తొలగిపోతాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంతవరకు వెన్నాడిన కష్టాలకు గల కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. మానసిక సై్థర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ప్రేమానుబంధాల బలోపేతానికి సమయం వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. తీర్థయాత్రలు చేస్తారు.
 లక్కీ కలర్: వెండి రంగు
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటారు. బంధాలను బలోపేతం చేసుకోవడానికి చిత్తశుద్ధితో మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పాత పద్ధతులను విడనాడి అన్ని అంశాల్లోనూ మార్పులకు నాంది పలుకుతారు. చిరకాలం నాటి ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఆత్మీయుల నుంచి కానుకలను అందుకుంటారు.
 లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 పని ఒత్తిడి నుంచి విరామం తీసుకుంటారు. తీరికగా, కాసింత బద్ధకంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చిన పనులతో సేదదీరుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.
 లక్కీ కలర్: ఇటుక రంగు
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. చేపట్టిన పనులను మరింత ఏకాగ్రతతో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తేలికగా సమసిపోతాయి.
 లక్కీ కలర్: తెలుపు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement