టారో : 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్, 2016 వరకు | Taro | Sakshi
Sakshi News home page

టారో : 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్, 2016 వరకు

Published Sun, Sep 4 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

టారో : 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్, 2016 వరకు

టారో : 4 సెప్టెంబర్ నుండి 10 సెప్టెంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
జీవిత భాగస్వామితో సామరస్యంగా మెలగడం మంచిది. అనవసరమైన ఆందోళనలకు గురవుతారు. వాదోపవాదలలో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. త్వరలోనే ఆశ్చర్యకరమైన శుభవార్త వింటారు. జీవితంలో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు, విడిపోయే పరిస్థితులు తప్పకపోవచ్చు. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి.
లక్కీ కలర్: గోధుమరంగు
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
సాహసోపేతమైన కార్యక్రమాలను చేపడతారు. కొత్త భాగస్వాములతో కలసి కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు. నూతన భాగస్వామ్యంతో వ్యాపారాలు లాభాల బాటలో పరుగులు తీస్తాయి. పొదుపు చేయడానికి అనుకూలమైన కాలం. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం మంచిది. పార్టీలకు దూరంగా ఉండటం, ఆహారంపై శ్రద్ధ వహించడం క్షేమం.
లక్కీ కలర్: ఆకుపచ్చ
 
మిథునం (మే 21 - జూన్ 20)
గత కర్మల ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. కోర్టు తీర్పులు, అధికారుల నిర్ణయాలకు అనుకూలంగా వస్తాయి. జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. విజయపథంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే రిస్కు తీసుకోక తప్పదని గ్రహిస్తారు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
లక్కీ కలర్: పసుపు

కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
అలుపెరుగకుండా కఠోరంగా పరిశ్రమించినందుకు మిమ్మల్ని మీరే అభినందించుకుంటారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో సమాధానం దొరకని చాలా ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తారు. ధైర్యంగా మీ పనిని మీరు కొనసాగిస్తారు. కొన్ని చిన్న చిన్న విషయాల్లో జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: బంగారురంగు
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఆర్థికంగా అన్ని విధాలా కలిసొచ్చే కాలం ఇది. మీ పురోగతి ఇతరులకు అసూయ కలిగిస్తుంది. ఇదివరకే చేపట్టిన పనులకు సంబంధించిన ఫలితాల కోసం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో నిరీక్షిస్తారు. తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ చూపాల్సి వస్తుంది. పని ఒత్తిడికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఇప్పటి వరకు శ్రమించిన కొనసాగిస్తున్న పని మీద ఆసక్తి కోల్పోతారు. నిర్లిప్తతకు లోనవకుండా, పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడం మంచిది. ప్రేమానుబంధాల పట్ల ఓపికగా వ్యవహరిస్తూ వస్తున్న మీరు, ఇప్పుడొక స్పష్టతకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితులను ఆచి తూచి అదుపు చేయాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: నాచు రంగు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
సృజనాత్మక ఆలోచనలతో ముందంజ వేస్తారు. ఇతరుల పట్ల మీ దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా చిరకాల లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ప్రస్తుత ఒడిదుడుకులన్నీ ఒక దశ మాత్రమే. నెమ్మదిగా పరిస్థితి చక్కబడి, భవిష్యత్తు ఉజ్వలంగా వెలుగొందుతుంది. అలాగని రాత్రికి రాత్రే ధనవంతులైపోతామనే భ్రమలు పెట్టుకోకండి. చేపట్టిన పనులను శ్రద్ధగా పూర్తి చేయండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి.
లక్కీ కలర్: నేరేడు రంగు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
అభద్రతాభావంతో ఆందోళన చెంది కుంగిపోతారు. భద్రతగా అనిపించని చోట్ల పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే క్షేమం. వృత్తి, ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోను మార్పులు అనివార్యం అవుతాయి. విద్యార్థులు కొత్త కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆడుతూ పాడుతూ ఉంటేనే అలసట లేకుండా పనులు పూర్తిచేయగలమని తెలుసుకుంటారు. విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి.
లక్కీ కలర్: బంగారు రంగు
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు. ఆత్మవిశ్వాసంతో కార్యసాధనలో సఫలీకృతులవుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. బంధువుల కారణంగా అనవసర భారం నెత్తిన పడే అవకాశాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి.
లక్కీ కలర్: ఊదా
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఆర్థికపరంగా అద్భుతంగా కలిసొస్తుంది. పని ప్రదేశంలో పునర్నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని ఒక మహిళ కారణంగా అదృష్టం కలిసొస్తుంది. గతంలోని చేదు అనుభవాలను మరచిపొండి. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. విజయపథంలో దూసుకుపోతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్: పసుపు
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు, సంపద మీకెన్నడూ సమస్య కానే కాదు. ప్రతి రోజునూ కొత్తగా మొదలుపెడతారు. విందు వినోదాల్లో, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చాలాకాలం తర్వాత పాత మిత్రులను కలుసుకుంటారు. పని ఒత్తిడి పెరిగి దాని ప్రభావం ఆరోగ్యం మీద పడే అవకాశాలు లేకపోలేదు. గతానుభవాల నేపథ్యంలో ఆత్మవిమర్శ చేసుకుంటారు.
లక్కీ కలర్: నేరేడు రంగు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
పరస్పర విరుద్ధమైన అంశాలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఇంటా బయటా తీరిక దొరకడం దుర్లభంగా ఉంటుంది. వృత్తిపరమైన నైపుణ్యాలతో అనితరసాధ్యమైన వ్యాపార విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే పోటీలో ముందంజలో ఉంటారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: గులాబి
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement