టారో : 25 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్, 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో : 25 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్, 2016 వరకు

Published Sun, Sep 25 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

టారో : 25 సెప్టెంబర్ నుంచి  1 అక్టోబర్, 2016 వరకు

టారో : 25 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
త్వరలోనే స్థిరాస్తులపై పెట్టుబడులు పెడతారు. అనూహ్యమైన సంఘటనలు ఎదురవుతాయి. చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. కెరీర్‌లో ముందడుగు వేయాలనుకున్న వారికి పోటాపోటీగా అవకాశాలు వస్తాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతారు. దూర ప్రయాణాలకు వెళతారు. కుటుంబ సభ్యులతో అపార్థాలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్: గోధుమరంగు
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
కొత్త పని లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో సీటు దొరికే అవకాశాలు ఉన్నాయి. తీరిక దొరకనంత పని చేతినిండా ఉంటుంది. పని ఒత్తిడి పెరగడంతో అలసట చెందుతారు. సహోద్యోగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. అనూహ్యమైన సందేశాన్ని అందుకుంటారు.
లక్కీ కలర్: ముదురు నారింజ
 
మిథునం (మే 21 - జూన్ 20)
ప్రశాంతత కోరుకుంటారు. అయినవారితో విభేదాలు కలవరానికి గురిచేస్తాయి. త్వరలోనే ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. గత పరిచయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఇప్పటి వరకు మీరు పడిన శ్రమ వృథా కాదు. దానికి తగిన ఫలితాలు లభించడం మొదలవుతుంది. గడ్డు కాలం నుంచి గట్టెక్కుతారు. నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. సునాయాసంగా సమస్యలను అధిగమిస్తారు.
లక్కీ కలర్: నీలం
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న అప్పులు తీర్చేస్తారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి నుంచి విరామం కోరుకుంటారు. ధ్యానం ద్వారా శక్తి పుంజుకుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: ముదురాకుపచ్చ
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
కలల సాకారానికి మీరు సాగిస్తున్న కృషి సరిపోదని గుర్తిస్తారు. చేపట్టిన బృహత్తర కార్యాన్ని పూర్తి చేయడం సాధ్యమేనా అని సంశయిస్తారు. అయితే, దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కుటుంబ సభ్యులకు మరింత సమయాన్ని కేటాయిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి.
లక్కీ కలర్: నారింజ
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఆర్థిక లాభాలు కలిసొస్తాయి. విందు వినోదాల్లో గడుపుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చేతిలో ఉన్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలు తొలగుతాయి. దురదృష్టవంతుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే సూచనలున్నాయి.
లక్కీ కలర్: పసుపు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
అనిశ్చితిని వదులుకుంటేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. తాత్సారం చేయకుండా తగిన వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా ఘన విజయాలు సాధించగలరు. అనూహ్యమైన సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆనందంలో ఓలలాడిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. సామాజికంగా పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు ఉదారంగా విరాళాలు ఇస్తారు. విద్యార్థులు అమోఘమైన ఫలితాలను సాధిస్తారు.
లక్కీ కలర్: గులాబి
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
అద్భుతమైన అవకాశాలను అందుకుంటారు. ఉద్విగ్నభరితమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటా బయటా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఆచితూచి అంతిమ నిర్ణయం తీసుకుంటారు. వివాహితులకు జీవిత భాగస్వామితో పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దుకుంటారు.
లక్కీ కలర్: ముదురు నారింజ
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. వైద్య సహాయం తీసుకోవడం అనివార్యమయ్యే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులతో పరిస్థితి చక్కబడుతుంది. అనవసరమైన వాదులాటల వల్ల మనశ్శాంతికి దూరమవుతారు. పాతబాకీలను పూర్తిగా చెల్లిస్తారు. కఠిన నిర్ణయాలతో జీవిత భాగస్వామికి మనస్తాపం కలిగించే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: తెలుపు
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
విద్యార్థులకు పూర్తిగా సానుకూలమైన కాలం. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు తెలివితేటలతో రాణిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. నాయకత్వ పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అనూహ్యంగా ఒక ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తెలుసుకుంటారు.  శ్వాసకోశ వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ కలర్: పసుపు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
పని ఒత్తిడికి దూరంగా గడపాలనుకుంటారు. బద్ధకంతో పనులను వాయిదా వేస్తారు. మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ జీవిత భాగస్వామి నుంచి గొప్ప సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారాంతంలో బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు.
లక్కీ కలర్: వెండిరంగు
- ఇన్సియా, టారో అనలిస్ట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement