టారో : 11 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్, 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో : 11 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్, 2016 వరకు

Published Sun, Sep 11 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

టారో : 11 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్, 2016 వరకు

టారో : 11 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
కోరుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు.  అధికారం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో తలమునకలుగా ఓలలాడుతారు. వ్యాపార లావాదేవీల్లో భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటారు. సంప్రదాయాలకు విలువ నిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను అందుకుంటారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
సరైన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు.   విజయపథంలో ముందుకు సాగుతారు. బంధు మిత్రులతో పాత వివాదాలను పరిష్కారం చేసుకుంటారు. యోగ్యత గల వ్యక్తికి మనసిస్తారు. ఏది ప్రాప్తమో అదే దక్కుతుందని తెలుసుకుంటారు. మీకు చెందని వాటి కోసం వెంపర్లాడటం మానుకుంటారు. ఆరోగ్య పరిస్థితిలో పురోగతి సాధిస్తారు.
లక్కీ కలర్: నేరేడు రంగు
 
మిథునం (మే 21 - జూన్ 20)
పూర్తిగా కలిసొచ్చే కాలం ఇది. కెరీర్, ప్రేమ వ్యవహారాల్లోను పరిస్థితులు పూర్తి సంతృప్తి కరంగా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన అంశాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం అనివార్యంగా మారుతుంది. ద్వైదీభావాన్ని విడనాడితే పురోగతి సాధించగలరు. విశిష్టమైన మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కళా సాహితీ రంగాల్లో మీ పేరు ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాయి.
లక్కీ కలర్: ముదురు పసుపు
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
జీవితంలో కీలకమైన ముందంజ వేసేందుకు అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఇతరుల్లోనూ గుర్తింపు లభిస్తుంది. ఎదుట ఉన్న అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. అది మీ కెరీర్‌ను మలుపు తిప్పి, మిమ్మల్ని విజయ పథంలోకి చేరుస్తుంది. ఆశించిన ఆర్థిక లాభాలు దక్కుతాయి. శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే క్షేమం.
లక్కీ కలర్: మీగడ రంగు
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. సృజనాత్మక ఆలోచనల ద్వారా ఆర్థిక లబ్ధి పొందుతారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం మంచిది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి సమర్థంగా బయటపడతారు. ఆశించిన లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.
లక్కీ కలర్: నారింజ
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ కారణంగా మీ సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు ఆర్థిక లబ్ధి పొందుతారు. సృజనాత్మకమైన మీ ఆలోచనలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం అనివార్యంగా మారుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు బాధపెట్టే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేత గోధుమ రంగు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
తలపెట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. పలుకుబడి గల వ్యక్తి ఒకరు మీకు అండగా నిలుస్తారు. కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తలమునకలుగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతారు. సంయమనం కోల్పోకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తేలికగా బయటపడగలుగుతారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్: లేత నీలం
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
పోరాట పటిమను చాటుకుంటారు. విజేతగా నిలుస్తారు. సంఘర్షణలకు దూరంగా ఉంటారు. ఇతరులకు సాయం చేయడంలో సంతృప్తి పొందుతారు. క్రమశిక్షణను మరింత పెంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లుతారు. ప్రేమానుబంధాలపై పునరాలోచనలో పడతారు. కొత్త వ్యూహాలతో కొత్త పనులు తలపెడతారు. అనూహ్యమైన సంఘటనలు ఆనందం కలిగిస్తాయి.
లక్కీ కలర్: నారింజ
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. పని ఒత్తిడికి దూరంగా దూర ప్రయాణాలు చేస్తారు. ప్రేమానుబంధాలను మరింత బలోపేతం చేసుకుంటారు. జీవితంలో ప్రశాంతతను ఆస్వాదిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. పిల్లల పురోగతికి గర్వంతో ఉప్పొంగిపోతారు.
లక్కీ కలర్: తెలుపు
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఆర్థిక లాభాలు పొందుతారు. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. అవరోధాలను అధిగమించి కెరీర్‌లో ఎదుగుదల సాధిస్తారు. అప్రమత్తతను కోల్పోకుండా, నిదానమే ప్రధానం అన్న రీతిలో సాగుతూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ప్రేమానుబంధాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. సౌందర్య పోషణ వ్యాపారాలు కలిసొస్తాయి.
లక్కీ కలర్: లేత గులాబి
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
అనిశ్చితిలో ఊగిసలాడతారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రేమ జంటలకు పెళ్లిళ్లయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యంగా నెట్టుకురావడం మంచిది. విపరీతమైన పని ఒత్తిడికి దూరంగా కాసింత విరామం తీసుకోవాలని బలంగా కోరుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
లక్కీ కలర్: గోధుమ రంగు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
భయ సంకోచాలను విడిచిపెట్టి, మరింత ఆచరణాత్మకంగా ముందంజ వేస్తారు. విద్యారంగంలో పెట్టుబడులు పెడతారు.  ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండటం మంచిది. మిమ్మల్ని పొగిడే వ్యక్తులే మీ గురించి దుష్ర్పచారం సాగించే అవకాశాలు చాలా ఉన్నాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధ్యానంపై దృష్టి సారిస్తారు.
లక్కీ కలర్: నాచు రంగు
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement