టారో : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్, 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్, 2016 వరకు

Published Sun, Oct 30 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

టారో :  30 అక్టోబర్ నుంచి 5 నవంబర్, 2016 వరకు

టారో : 30 అక్టోబర్ నుంచి 5 నవంబర్, 2016 వరకు

 మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 ఆనందభరితంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. యోగ్యతకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఒంటరిగా ఉన్నవారికి తగిన జోడీ లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో అనిశ్చితిని విడనాడితే పురోగతి సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఉన్నా, ఆశించిన ఫలితాలను సాధిస్తారు.
 లక్కీ కలర్: ఆకుపచ్చ
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 వృత్తి ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు తమ స్థితిగతులపై పునరాలోచనలో పడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. మార్పు అనివార్యమయ్యే సూచనలు ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతిభా పాటవాలతో రాణిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా పుంజుకుంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
 లక్కీ కలర్: పసుపు
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 ఇప్పటికే మీలో పాతుకుపోయిన అపోహలను వదులుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులపై మీ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ముందు గొయ్యి వెనుక నుయ్యి వంటి పరిస్థితులను తెలివిగా తప్పించుకుంటారు. సృజనాత్మక ఆలోచనలతో సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. విహార యాత్రలతో ఉల్లాసంగా గడుపుతారు.
 లక్కీ కలర్: నారింజ
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 కొత్త పనులకు సంబంధించిన ప్రణాళికలను కార్యాచరణలో పెడతారు. ఇంతవరకు కొనసాగిస్తూ వచ్చిన శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. విజయపథంలో ముందుకు సాగుతారు. పరిస్థితుల్లో సానుకూల మార్పులను చవిచూస్తారు. మీ అభివృద్ధి పట్ల ఇతరులు అసూయ చెందుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది.
 లక్కీ కలర్: నీలం

 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 పోరాట పటిమను ప్రదర్శిస్తారు. అదే సమయంలో ప్రశాంతతను కోల్పోకుండా ఉంటారు. పరస్పర విరుద్ధమైన అంశాల మధ్య సమతుల్యత కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు. ఆస్తులు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఇతరుల్లో స్ఫూర్తి నింపుతారు.
 లక్కీ కలర్: ముదురు బూడిద రంగు
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
 కొత్త ఆశలు చిగురిస్తాయి. పరిపూర్ణత కోసం తపిస్తారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చేపట్టిన పనుల్లో పరిపూర్ణత సాధిస్తారు. వ్యాపారంలో కొత్తగా ఒక భాగస్వామిని చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. విజయాలు సాధించినా వినయంగా ఉండే మీ సహజ లక్షణమే మీకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇంట్లో జరిగే కుటుంబ వేడుకలు సంతోషాన్నిస్తాయి.
 లక్కీ కలర్: ఇటుక రంగు
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 అదృష్టం అన్ని విధాలా కలిసొస్తుంది. పూర్వీకుల ఆస్తి దక్కే సూచనలు ఉన్నాయి. సుస్థిరమైన ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. అమోఘమైన తెలివితేటలతో, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ప్రణాళికలు రచిస్తారు.
 లక్కీ కలర్: తెలుపు
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 విందు వినోదాల్లో మునిగి తేలుతారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళతారు. మీ సమక్షాన్ని కోరుకునే బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త మిత్రులు తారసపడతారు. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఇదివరకటి పెట్టుబడుల ద్వారా అనూహ్యమైన ఆర్థిక లాభాలను అందుకుంటారు.
 లక్కీ కలర్: ఊదా

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 తాత్విక చింతనలో పడతారు. జ్ఞానతృష్ణను తీర్చుకునేందుకు నిర్విరామంగా అధ్యయనం కొనసాగిస్తారు. ఆర్థిక పురోగతిలో వేగం పుంజుకుంటుంది. ధనార్జన కోసం విదేశ యాత్రలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. మరింతగా ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా కొత్త ఆలోచనలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. శ్రమాధిక్యత తప్పకపోవచ్చు.
 లక్కీ కలర్: లేత గోధుమరంగు
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 జీవితంలోని అన్ని అంశాల్లోనూ సరైన మార్గంలో ప్రయాణిస్తారు. నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారు. వాగ్దానాలను నిలుపుకొంటారు. పరపతి గల ఒక మహిళ మీకు ఆసరాగా నిలుస్తారు. నిబద్ధతను నిరూపించుకోవడం ద్వారా ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. పని ఒత్తిడి మితిమీరి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
 లక్కీ కలర్: నారింజ
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 త్వరలోనే సంపద కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. ధైర్య సాహసాలతో పరిస్థితులకు ఎదురు నిలుస్తారు. జీవితాన్ని ధీమాగా గడుపుతారు. పనితీరుతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఇతరుల అసూయ కారణంగా ఇబ్బందులు ఎదురైనా వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. కొత్తగా తారసపడిన వ్యక్తితో అనూహ్యంగా ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి.
 లక్కీ కలర్: ఆకుపచ్చ
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 బహుముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి.  అయితే, ధారాళంగా ఖర్చు చేయాలనే ఉబలాటాన్ని కాస్త అదుపు చేసుకుంటేనే మంచిది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు సత్ఫలితాలను పొందడానికి కాస్త ఓర్పు చూపాల్సి ఉంటుంది.
 లక్కీ కలర్: ముదురాకుపచ్చ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement