టారో: 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు | taro | Sakshi
Sakshi News home page

టారో: 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

Published Sun, Oct 9 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

టారో: 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

టారో: 9 అక్టోబర్ నుంచి 15 అక్టోబర్ 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఉద్విగ్నంగా ఉంటారు. సాహస విన్యాసాల్లో పాల్గొంటారు. విజయసాధన కోసం కృతనిశ్చయంతో ముందుకు సాగుతారు. సంకల్పబలంతో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. భయాలను విడనాడి ధైర్యంగా అవరోధాలను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సానుకూల దృక్పథంతో అనుకోని చిక్కుల నుంచి సురక్షితంగా బయటపడతారు.
లక్కీ కలర్: సాగరనీలం
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
అకుంఠిత కార్యదీక్షకు తగిన గుర్తింపు లభిస్తుంది. సామాజికంగా పేరుప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇతరులు మీ సలహాలు కోరుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో స్పర్థలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్: నాచురంగు
 
మిథునం (మే 21 - జూన్ 20)
ఆరోగ్యంపై, అందచందాలపై శ్రద్ధపెడతారు. అలంకరణలపై ఆసక్తి చూపుతారు. బాహ్యాలంకరణలపై ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నా, మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. ప్రేమజంటలు పెళ్లితో ఒక్కటయ్యే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. పనిలో గందరగోళానికి గురవుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు సందిగ్ధంలో పడతారు.
లక్కీ కలర్: ముదురు ఎరుపు
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
దొరికిన కొద్దిపాటి తీరిక వేళల్లో ఆత్మశోధనలో గడుపుతారు. చిన్నారుల స్వచ్ఛత నుంచి స్ఫూర్తి పొందుతారు. స్థల కాలాలను మరచి ఆలోచనల్లో నిమగ్నమైపోతారు. వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదురైనా, ప్రతిభా పాటవాలతో నెట్టుకొస్తారు. చిరకాల ప్రేమానుబంధం పెళ్లికి దారితీసే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన జంట తారసపడే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: తెలుపు
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఇక ఎలాంటి మార్పునైనా స్వీకరించలేని స్థితిలో ఉంటారు. అంతరాత్మ ప్రబోధానుసారం నిర్ణయాలు తీసుకుంటారు. పారలౌకిక చింతనను పెంచుకుంటారు. సిద్ధపురుషుల ఆశీస్సులను అందుకుంటారు. డబ్బు లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. సన్నిహితులకు అండగా ఉంటారు.
లక్కీ కలర్: ఊదా
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఊపిరి సలపనివ్వనంతగా పని ఒత్తిడిలో కూరుకుపోతారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకర్షణీయమైన ప్రతిపాదన ఒకటి మీలో ఆశలు రేపుతుంది. అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మొండి వైఖరి వల్ల చిక్కులు కొనితెచ్చుకుంటారు. ప్రతికూలతల నుంచి బయటపడటానికి గట్టి పోరాటమే చేస్తారు.
లక్కీ కలర్: తుప్పు రంగు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
లక్ష్యాల పట్ల స్పష్టతను ఏర్పరచుకుంటారు. ధన కనక వస్తు వాహనాది లౌకిక లాభాలపై లోభాన్ని వదులుకుంటారు. కోపాన్ని, అహంకారాన్ని చాలా వరకు అదుపులో ఉంచుకోగలుగుతారు. ఉన్నత స్థానాలను అధిరోహించే లక్ష్యంతో బాధ్యతలను ఇతరులతో పంచుకుంటారు. గొప్ప ప్రతిభాసంపద గల వ్యక్తి ఒకరు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు.
లక్కీ కలర్: ఎరుపు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఇంతవరకు వేధిస్తూ వచ్చిన తెలియని భయాలన్నీ పటాపంచలైపోతాయి. జీవితంలో కోరుకున్న మార్పు అనాయాసంగా సంభవిస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. జ్ఞాన ధైర్యాలతో కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు ఎదురైనా, తేలికగా అధిగమిస్తారు. మీ సానుకూల దృక్పథమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను చాటుకుంటారు.
లక్కీ కలర్: వెండిరంగు
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సాదాసీదాగా సాగుతున్న జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. అనూహ్యమైన ఆకస్మిక లాభాలతో జీవన శైలిలో గణనీయమైన మార్పు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రేమికులతో ఉల్లాసభరితంగా గడుపుతారు.  
లక్కీ కలర్: నేరేడు
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
కష్టాల కడలిని విజయవంతంగా అధిగమించి, ఆనంద సాగరానికి చేరుకుంటారు. కష్టసాధ్యమైన విజయాలను అవలీలగా సాధించడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులు పొందుతారు.  ప్రేమానుబంధాల్లో పొరపొచ్చాలను సామరస్యంగా చక్కదిద్దుకుంటారు.
లక్కీ కలర్: బంగారురంగు
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
విలాసవంతంగా గడుపుతారు. సన్నిహితులకు ఖరీదైన కానుకలను బహూకరిస్తారు. నిర్విరామమైన పని ఒత్తిడికి దూరంగా కొంత విరామం తీసుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. కొత్త జీవితానికి నాంది పలుకుతారు. లౌకిక వ్యవహారాలపై దృక్పథాన్ని మార్చుకుంటారు. ఆహార విహారాల్లో చాపల్యాలను నియంత్రించుకోలేకపోతే ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్: మీగడ రంగు
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
మీ ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు తగిన అవకాశాలు అందివస్తాయి. సత్తా చాటుకోవడానికి వెనుకంజ వేయకుండా విజయాల బాటలో ముందుకు సాగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఎవరికీ తెలియని విషయాలను కనుగొనేందుకు పరిశోధనలు సాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆనంద డోలికల్లో మునిగి తేలుతారు. ప్రాధాన్యాలను ఎరిగి అద్భుత విజయాలను సాధిస్తారు.
లక్కీ కలర్: లేతనీలం
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement