టారో : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు | Taro | Sakshi
Sakshi News home page

టారో : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

Published Sun, Oct 16 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

టారో : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

టారో : 16 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ 2016 వరకు

 మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
 ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇదివరకటి ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సాగిస్తున్న వారు ఆర్థిక వైఫల్యాల నుంచి తేరుకుని లాభాలబాట పడతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. నాయకత్వం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు.
 లక్కీ కలర్: నీలం
 
 వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
 గొప్ప అవకాశాలు ఊరిస్తుంటే, వాటిని అందిపుచ్చుకోకుండా సందిగ్ధావస్థలో కాలయాపన చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిరకాల స్వప్నం ఒకటి నెరవేరే సూచనలు దగ్గర్లోనే ఉన్నాయి.
 లక్కీ కలర్: బూడిదరంగు
 
 మిథునం (మే 21 - జూన్ 20)
 ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు.  చిత్తశుద్ధితో, ఆత్మబలంతో పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మార్పుల ఫలితంగా కొత్త అవకాశాలు కలసి వస్తాయి. పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం ధ్యానంపై దృష్టి సారిస్తారు.
 లక్కీ కలర్: ముదురాకుపచ్చ
 
 కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
 మీ పురోగతిలో ఒక దశ ముగిసి, మరో దశ ప్రారంభమవుతుంది. ఇదివరకటి ప్రయత్నా లకు, శ్రమకు తగిన ఫలితాలు క్రమంగా అందివస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో తిరుగులేని కార్యదక్షతను నిరూపించుకుని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో వేగం పుంజుకుంటాయి. నచ్చిన వ్యక్తి మీతో ప్రేమలో పడతారు.
 లక్కీ కలర్: వెండిరంగు

 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
 కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటి నవీకరణ వంటి పనులు తలపెడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి సత్తాను చాటుకునే అవకాశాలు అందివస్తాయి. పని ఒత్తిడి పెరిగి సహనం కోల్పోయే సందర్భాలు ఎదురవుతాయి. పనులు శరవేగంగా పూర్తి కావాలని కోరుకుంటారు. అయితే, నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని గుర్తెరిగి మసలుకుంటే మంచిది. పెట్టుబడులు కలసివస్తాయి.
 లక్కీ కలర్: నీలం
 
 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
 ఇంటా బయటా మార్పులు చోటు చేసుకుం టాయి. చేసిన పనులకు బాధ్యత వహిస్తారు. మనో స్థైర్యంతో సమస్యల నుంచి సునాయా సంగా బయటపడతారు. భావసారూప్యత గల వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలపెట్టిన కార్యక్రమాలపై స్పష్టతను ఏర్పరచుకుంటారు. భావి విజయాలకు పునాదులను పదిలం చేసుకుంటారు.
 లక్కీ కలర్: ఆకుపచ్చ
 
 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
 ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందుతారు. అంతరాత్మ ప్రబోధం మేరకు నడుచుకుని ప్రేమను పండించుకుంటారు. వృత్తి జీవితంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. పాత బకాయిలను చెల్లిస్తారు. చిరకాలంగా నానుతున్న కోర్టు వ్యవహారాలను సానుకూలంగా పరిష్కరించుకో గలుగుతారు. ఉద్యోగ జీవితంలో ఒడిదుడుకు లకు లోనవుతారు. సహోద్యోగులతో స్పర్థలు.
 లక్కీ కలర్: నేరేడు
 
 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
 సవాళ్లతో కూడుకున్న అవకాశాలను సర్వ సన్నద్ధతతో అందిపుచ్చుకుంటారు. పోరాట స్ఫూర్తితో విజయపథంలో దూసుకుపోతారు. అత్యుత్సాహాన్ని అదుపు చేసుకుని సంయమనం పాటిస్తే మరింతగా సత్ఫలితాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రతికూల శక్తుల నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు. వాగ్వాదాలు, ఘర్షణలు అనివార్యం కావచ్చు.
 లక్కీ కలర్: మట్టి రంగు

 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
 అడగనిదే అమ్మయినా పెట్టదనే వాస్తవాన్ని గ్రహించి మసలుకుంటారు. కోరుకున్న ఫలితాలను అడిగి మరీ సాధించుకుంటారు. ఒత్తిడి లేని జీవితం ఈ వారంలో దాదాపు దుస్సాధ్యంగానే ఉంటుంది. పని ఒత్తిడితో అలసట చెందుతారు. మనశ్శాంతి కోసం తీవ్రంగా ఆరాటపడతారు. ధ్యానం ద్వారా కొంత ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.
 లక్కీ కలర్: వెండి రంగు
 
 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
 వృత్తి ఉద్యోగాల్లో అవకాశాలు ఊరిస్తాయి. భవిష్యత్తుపై లేనిపోని ఆశలు పెంచుకుంటారు. ఆశలన్నీ భ్రమలుగా తేలిపోతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అనివార్య మయ్యే సూచనలు ఉన్నాయి. సమస్యలు సతమతం చేస్తున్నా, హాస్యస్ఫూర్తిని కోల్పో కుండా ఉంటారు. పనికి కొద్దిపాటి విరామం ఇచ్చి విశ్రాంతి కోసం దూరప్రయాణాలకు వెళతారు.
 లక్కీ కలర్: పసుపు
 
 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
 కొత్తగా ప్రేమలో పడతారు. ప్రేమ మాధుర్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తారు. ప్రేమలో ఉన్నవారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. సమ్మోహన శక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రులు మీ సమక్షాన్ని కోరుకుంటారు. కొత్త ప్రాజెక్టులు తలపెడతారు. ఉద్యోగ జీవితంలో కార్యసాధకులుగా మన్ననలు పొందుతారు. రచనా రంగంలో ఉన్న వారికి చివరి నిమిషంలో ఒత్తిడి తప్పకపోవచ్చు.
 లక్కీ కలర్: నారింజ
 
 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
 వ్యాపారరంగంలో ఘన విజయాలను సాధిస్తారు. ఈ వారం మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా సాగుతుంది. డబ్బు పుష్కలంగా అందుతుంది. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారు గొప్ప తపనతో కొత్త పనులు తలపెడతారు. ఒడిదుడుకుల్లో పడిన ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి.
 లక్కీ కలర్: ముదురు నారింజ
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement