టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు | Taro, from 19 March to 25 March 2017 | Sakshi
Sakshi News home page

టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు

Published Sun, Mar 19 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు

టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు మీ వెంటే ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరెంతో ముందుచూపుతో, ఆశావహ, సానుకూల దృక్పథంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రమోషన్‌ వస్తుంది. తిరస్కృతులు, హేళనలు ఎదురయినా పట్టించుకోవద్దు.
కలిసొచ్చే రంగు: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ మార్గంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుముళ్లన్నీ వీడిపోతాయి. మీరు మీ అంతరాత్మ మాట వినడం లేదు. మీ మంచి చెడులలో అనుక్షణం మిమ్మల్ని హెచ్చరిస్తూ, మేలు చేద్దామని చూస్తుంటే, తోసిపుచ్చడం తప్పు. వెంటనే మనసు మాట వినండి. చెడు స్నేహాల పట్ల జాగ్రత్త అవసరం.  
కలిసొచ్చే రంగు: గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
డబ్బుకు సంబంధించి కొన్ని భయాందోళనలు నెలకొనవచ్చు. ముఖ్యంగా డబ్బు భద్రతకు సంబంధించినవి. అలాగే ధన సంపాదన విషయంలో కూడా అంతే ఇబ్బంది. వృత్తిపరంగా మీరు మేటి.  అలాగని మీ వ్యక్తిగత సంతోషాలు, జీవితాన్ని వదులుకోవద్దు. మీ ప్రేమ ఫలిస్తుంది.
కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పని మీద  దృష్టి పెట్టండి. మీరు సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనక గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త పడటం మంచిది.
కలిసొచ్చే రంగు: లేత నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది.
కలిసొచ్చే రంగు: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అవసరం. సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టసుఖాలను శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి.
కలిసొచ్చే రంగు: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది.
కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. లాభదాయకమైన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి తగిన సమర్థులను అన్వేషించండి.
కలిసొచ్చే రంగు: పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. మీ విజయానికి వేడుకలు చేసుకుంటారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా మీరు మాట్లాడే ప్రతి మాటా నిజం అవుతుంది.
కలిసొచ్చే రంగు: వెండి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. కెరీర్‌లో రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి.
కలిసొచ్చే రంగు: యాపిల్‌ గ్రీన్‌

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
కెరీర్‌ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు.
కలిసొచ్చే రంగు: గోధుమ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగించుకోవడం అవసరం.
కలిసొచ్చే రంగు: ముదురు పసుపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement