housing
-
గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలు
గృహ రుణాలు 2024 సెప్టెంబర్ నాటికి రూ.33.53 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) ప్రకటించింది. ఏడాది కాలంలో 14 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. ఇందులో మధ్యాదాయ వర్గాలు (ఎంఐజీ) తీసుకున్నవే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో హౌసింగ్ రంగంలో ధోరణులు, పురోగతిపై ఎన్‌హెచ్‌బీ ఒక నివేదిక విడుదల చేసింది. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలు ఉన్నట్లు తెలిపింది.‘2024 సెప్టెంబర్ నాటికి వ్యవస్థ వ్యాప్తంగా బాకీ ఉన్న వ్యక్తిగత గృహ రుణాల విలువలో తక్కువ ఆదాయ విభాగానికి (ఎల్ఐజీ) సంబంధించి 39 శాతం ఉంటే, ఎంఐజీ విభాగానికి 44 శాతంగా ఉన్నాయి. మరో 17 శాతం అధిక ఆదాయ వర్గాలు (హెచ్ఐజీ) చెల్లించాల్సినవి’ అని ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.9.07 లక్షల కోట్ల వ్యక్తిగత గృహ రుణాలు మంజూరు కాగా, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో రూ.4.10 లక్షల కోట్లు జారీ అయినట్టు పేర్కొంది. బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన 2.0పై చేసిన ప్రకటన, పట్టణీకరణ, డిజిటైజేషన్‌తో గృహ రంగానికి భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. హెచ్ఎఫ్సీలు కీలక పాత్రగృహ కొనుగోలుదారుల విస్తృతమైన అవసరాలను తీర్చడంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) కీలక పాత్ర పోషించినట్టు ఎన్‌హెచ్‌బీ తెలిపింది. అర్హతల ప్రమాణాల్లో వెసులుబాట్లు, బలమైన కస్టమర్ సేవలు, మెరుగైన డాక్యుమెంటేషన్, తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం వంటివి హెచ్‌ఎఫ్‌సీలను మెరుగైన స్థానంలో నిలబెట్టాయని పేర్కొంది. సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకూ గృహ రుణాలను విస్తరించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయంటూ.. బ్యాంక్‌లు–హెచ్ఎఫ్సీల కోలెండింగ్ ఈ దిశగా తీసుకున్న చర్యగా ప్రస్తావించింది.ఇదీ చదవండి: స్టార్‌లింక్‌కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్ప్రాంతీయ అసమానతలుహౌసింగ్ రంగం బలమైన వృద్ధిని చూపించినప్పటికీ.. రుణాల మంజూరులో ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాలు హెచ్ఎఫ్సీలకు పెద్ద సవాలుగా ఎన్‌హెచ్‌బీ పేర్కొంది. ‘దక్షిణాది, పశ్చిమాది, ఉత్తరాది రాష్ట్రాల్లోనే అధిక శాతం గృహ రుణాలు మంజూరవుతున్నాయి. అదే సమయంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుణాల జారీ తక్కువగా ఉంటోంది’ అని నివేదిక వివరించింది. ఈశాన్య ప్రాంతంలో హెచ్ఎఫ్సీల శాఖల విస్తరణ తక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ తారతమ్యాల తగ్గింపునకు చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. -
జనానికి తాగునీరే లేదు.. సైకిల్ ట్రాక్‌లు కావాలా!
న్యూఢిల్లీ: ప్రజలందరికీ గృహ వసతి, తాగునీటి వసతి కల్పించడానికి సరిపడా నిధుల్లేక రాష్ట్రాలు ఓ వైపు ఇబ్బందులు పడుతుంటే సైకిల్ ట్రాక్‌లంటూ కొందరు పగటి కలలు కంటున్నారంటూ సుప్రీంకోర్టు మండిపడింది. దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. సోమవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకాల ధర్మాసనం పిల్‌పై విచారణ చేపట్టింది. ‘మురికి వాడలకు వెళ్లండి అక్కడ జనం ఏ పరిస్థితిలో ఉంటున్నారో చూడండి. వారికి సరైన గృహ వసతి కల్పించేందుకు రాష్ట్రాల వద్ద నిధుల్లేవు. ప్రజలకు కనీసం వసతులు కల్పించాలి. మనమేమో ఇక్కడ సైకిల్ ట్రాక్‌లు ఉండాల్సిందేనంటూ పగటి కలలు కంటున్నాం’అని వ్యాఖ్యానించింది. ‘మనవి తప్పుడు ప్రాధాన్యతలు. మన ప్రాధాన్యతలను సరి చేసుకోవాల్సి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అమలు విషయం మనం ఆలోచించాలి. ప్రజలకు తాగేందుకు మంచి నీరు లేదు. ప్రభుత్వ బడులు మూతబడుతున్నాయి. మీరేమో సైకిల్ ట్రాక్‌లు కావాలంటున్నారు’అని పేర్కొంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సైకిల్ ట్రాక్‌లున్నాయని, దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయాలంటూ సైక్లింగ్ ప్రోత్సాహకుడు దేవీందర్ సింగ్ నేగి తన పిటిషన్లో కోరారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. 2024లో 12 శాతం అధికంగా 36,974 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 2024లో 7 శాతం మేర ఇళ్ల విక్రయాలు పెరిగాయి. మొత్తం 3,50,613 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 12 ఏళ్ల గరిష్ట స్థాయి. హైదరాబాద్‌తోపాటు పుణెలో ఆల్‌టైమ్ గరిష్టాలకు విక్రయాలు చేరగా, ముంబైలో 13 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. ‘‘ప్రీమియం ఇళ్లకు డిమాండ్ నెలకొంది. రూ.2–5 కోట్ల విభాగంలోని ఇళ్ల విక్రయాల్లో 85 శాతం వృద్ధి నమోదైంది.మరోవైపు రూ.50 లక్షల్లోపు ధరలో, రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ధరల విభాగాల్లోనూ వృద్ధి లేకపోవడం లేదా బలహీనపడడం కనిపించింది’’అని తెలిపింది. రూ.2–5 కోట్ల ధరల ఇళ్లకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. 2020 నుంచి నివాస గృహాల మార్కెట్ అద్భుతమైన ర్యాలీని చూసిందని, 2024 విక్రయాలు 12 ఏళ్ల గరిష్టానికి చేరాయని చెప్పారు. ‘‘ప్రీమియమైజేషన్ ధోరణి పెరిగిపోయింది. ఇళ్ల మార్కెట్లో క్రమంగా అధిక ధరల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. మెరుగైన జీవన అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు’’అని వివరించారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వడ్డీ రేట్లు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. పట్టణాల వారీ విక్రయాలు.. ⇒ 2024లో ముంబైలో ఇళ్ల అమ్మకాలు అంతక్రితం ఏడాదితో పోలి్చతే 11 శాతం పెరిగి 96,187 యూనిట్లుగా ఉన్నాయి. ⇒ బెంగళూరులో 2 శాతం అధికంగా 55,362 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ పుణెలో 6 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 52,346 యూనిట్లకు చేరాయి. ⇒ అహ్మదాబాద్‌లో 15 శాతం వృద్ధి కనిపించింది. 18,462 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ⇒ కోల్‌కతాలోనూ 16 శాతం పెరిగి 17,389 యూనిట్లు అమ్ముడయ్యాయి. ⇒ చెన్నైలో అమ్మకాలు 9 శాతం మేర పెరిగి.. 16,238 యూనిట్లకు చేరాయి. ⇒ ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 4 శాతం క్షీణించి 57,654 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. అందుబాటు ధరల ఇళ్ల విభాగం మెరుగుపడుతుంది.. ‘‘ఇళ్ల మార్కెట్లో సెంటిమెంట్ బలంగా ఉంది. ధరలతోపాటు అమ్మకాల్లోనూ స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. రూ.కోటిలోపు ఇళ్ల అమ్మకాలు బలహీనపడడం పట్ల ఆందోళనలు నెలకొన్నాయి. కానీ, అందుబాటు ధరల ఇళ్లకు ప్రభుత్వం నుంచి మద్దతు, ప్రైవేటు రంగం ఆసక్తి చూపిస్తుండడంతో ఈ విభాగంలో అమ్మకాలు స్థిరపడతాయి’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్ సీనియర్ ఈడీ గులామ్ జియా వివరించారు. -
జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిందని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హౌసింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సీఎం పాల్లొని లబ్దిదారులకు భూమి స్వాధీన పత్రాల అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘ జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు. వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం. తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నా. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో 71 కిలలో బరువు తగ్గిన సీఈవో! ఎలా తగ్గారంటే..!
కొందరూ మనకళ్ల ముందే అధిక బరువుతో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడినవాళ్లు అద్భుతం చేసినట్లు స్లిమ్‌గా అయ్యిపోతారు. వాళ్లను చూడగానే భలే బరువు తగ్గారనిపిస్తుంది. అచ్చం అలానే హౌసింగ్ డాట్ కమ్ సీఈవో జస్ట్ రెండేళ్లలోనే చాలా బరువు తగ్గి తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన వెయిట్ లాస్ జర్నీ ఎలా మొదలయ్యిందంటే.. హౌసింగ్ డాట్ కామ్ సీఈవో ధ్రవ్ అగర్వాలా 2021 నుంచి గుండోపోటు, గుండెల్లో మంట వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇబ్బందులకు గురిచేసిన ఆ అనారోగ్య సమస్యలే అతడిని బరువు తగ్గేందుకు ప్రేరేపించాయి. ఆ గుండె జబ్బు కారణంగా ఆయన ఫేస్ చేసిన సమస్యలే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేలా చేశాయి. అప్పుడు ఆయన దాదాపు 151 కిలోలు బరువు ఉన్నాడు. ఆ టైంలో ప్రీ డయాబెటిక్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. వీటితోపాటు స్లీప్ ఆప్నీయా కూడా వచ్చింది. దీంతో ధ్రువ్ ఎలాగైన బరువు తగ్గాల్సిందే అని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాడు. అందుకని మంచి ఫిట్నెస్ర్ని నియమించుకున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఆస్పత్రులకు లేదంటే బెడ్లకే పరిమితమవ్వడం తనను బాగా బాధించిందని అంటాడు ధ్రువ్. ఇక ఫిట్నెస్ నిపుణుడు సమక్షంలో రోజుకు రెండుసార్లు వ్యాయామ కసరత్తులు చేసేలా దృష్టి పెట్టారు. కిలోమీటర్లు చొప్పున నడక, కేలరీలు తక్కువుగా ఉన్నా ఆహారం తీసుకోవడం వంటివి చేశారు. ముఖ్యంగా రోజువారి దాదాపు 17 వందల కేలరీలను తగ్గించాడు. నోటిని కంట్రోల్ చేసుకునేలా ఏదైనా వర్కౌట్లలో బిజీగా ఉండేవాడు. వాటి తోపాటు ఆల్కహాల్, ప్రాసెస్ చేసి, వేయించిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉన్నాడు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వండిన కూరగాయాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు. రాత్రిపూట కాల్చిన చికెన్ లేదా చేపలతో సెలెరీ లేదా ఆస్పరాగస్ సూప్ వంటివి తీసుకునేవాడు. అలాగే చక్కటి గుమ్మడి గింజలు, అవిసె గింజలు, దోసకాయలు, క్యారెట్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకునేవాడు. దీంతో ధ్రువ్ అనూహ్యంగా తన బరువులో సగానికి పైగా తగ్గిపోయాడు. పైగా తనకు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అంటే ఇష్టమని, ఆయనంత బరువే ఉండాలని గట్టిగా కోరుకోవడంతోనే ఇది సాధ్యమయ్యిందని ఆనందగా చెబుతున్నారు ధ్రువ్. తాను మరింతగా బరువు తగ్గేలా స్విమ్మింగ్, రన్నింగ్ వంటి వాటిపై కూడా దృష్టిపెట్టానని చెప్పాడు. తన వార్డ్‌బోర్డ్‌లో దుస్తులను మార్చి ఇష్టమైన ఫ్యాషన్ దుస్తులను ధరించడం చాలా అద్భుతంగా అనిపించని అన్నాడు ధ్రువ్. నిజానికి ధ్రువ్ చిన్నతనంలో కోల్‌కతాలో పెరిగారు. ఆయన బాల్యంలో ఎక్కువగా క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడేవారు. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శరీరానికి తగిన వ్యాయామం వంటివి చేయకపోవడంతో ఆయన విపరీతంగా బరువు పెరిగిపోవడం జరిగింది. ఏదీఏమైతేనేం అనారోగ్యం సమస్య ఆరోగ్యంపపై స్ప్రుహ కలిగించి, స్లిమ్‌గా అయ్యేలా చేసింది. అధిక బరువు కాదు సమస్య తగ్గాలనే స్పిరిట్ ఉండాలి. అది ఉంటే ఈజీగా తగ్గిపోవచ్చని ధ్రువ్ చేసి చూపించారు. (చదవండి: సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!) -
సంక్షేమ వెలుగులు ధగధగ
సాక్షి, అమరావతి: సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది. పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది. ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద మనస్సుతో పేదలకు భరోసా ♦ వైఎస్సార్ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు ♦ అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు ♦ ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు ♦ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు ♦ జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు ♦ వైఎస్సార్ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు ♦ వైఎస్సార్ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి ♦ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు ♦ ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు ♦ అగ్రిగోల్డ్ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం 2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ సహకారం. ♦ వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి. ♦ 2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. ♦ 2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం. ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర ప్రీమియర్ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్–యూత్ ఎక్సే్ఛంజ్’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ ♦ రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. ♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది. ♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది. ♦ వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది. ♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. -
అక్కచెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వగలిగాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలావడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియింబర్స్ కింద రూ.46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈకార్యక్రమం జరుగుతుంది. గతంలో సుమారు ఐదు లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు రూ.50 కోట్ల పైబడి ఇచ్చాం. రూ.35వేల రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 22లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో రూ.1 లక్ష ఖర్చు అవుతోంది. ఇళ్ల నిర్మాణంకోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సిమెంటు, స్టీల్, మెటల్ ఫ్రేంలు తదితర ఇంటి సామగ్రి మీద కనీసంగా రూ.40వేలు మంచి జరిగేలా చూస్తున్నాం. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి రూ.2.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. అన్ని కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.5 -20 లక్షల వరకూ ఒక ఆస్తిని అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కేవలం పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు ఇప్పిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం’’ అని సీఎం జగన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతోపాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రీయింబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని రీయింబర్స్మెంట్ చేశారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 71,811.50 ఎకరాల విస్తీర్ణంలో 31లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ఇవ్వడమే కాకుండా, ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి కల్పింస్తున్నారు. పావలా వడ్డీకే రూ.35వేలు చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.70 లక్షలు చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో రూ.లక్షకు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు 12.77 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4,500.19 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కచెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఇలా సంవత్సరంలో రెండు పర్యాయాలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇదీ చదవండి: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు -
గృహాలపై సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: సొంత అవసరాలకు విద్యుదుత్పత్తి చేసుకునే విధంగా గృహాలు, కమర్షియల్ భవనాలపై సౌరవి ద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకునేవారి కోసం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పా దక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో)పై సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీతో కలిసి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్‌లో విద్యుత్ కొరత రాకుండా ఉండటానికి సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. 1–3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.18 వేలు, 3–10 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కిలోవాట్‌కు రూ.9 వేలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. సమీక్షలో టీఎస్ రెడ్కో ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
వృద్ధి బాటలో గృహం హౌసింగ్
ముంబై: దేశీ అనుబంధ సంస్థ గృహమ్ హౌసింగ్ వృద్ధి బాటలో సాగుతున్నట్లు ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ దిగ్గజం టీపీజీ క్యాపిటల్ తాజాగా పేర్కొంది. పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ మార్చికల్లా రూ. 8,200 కోట్ల నిర్వహణ ఆస్తులను(ఏయూఎం) చేరుకోనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే సంస్థ ఏయూఎం రూ. 7,500 కోట్లను అధిగమించినట్లు వెల్లడించింది. గత ఆరేళ్లలో సంస్థ యాజమాన్యం మూడుసార్లు చేతులు మారింది. తొలుత మ్యాగ్మా ఫిన్‌కార్ప్ నుంచి పూనావాలా హౌసింగ్‌కు, ఆపై టీపీజీ క్యాపిటల్ చేతికి యాజమాన్య వాటా బదిలీ అయ్యింది. అందుబాటు ధరల హౌసింగ్‌పై దృష్టిపెట్టిన కంపెనీ పూనావాలా హౌసింగ్ ఫైనాన్స్‌లో 99 శాతానికిపైగా వాటాను 2022 జులైలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 3,900 కోట్లు వెచి్చంచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మరో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ జైస్వాల్ వెల్లడించారు. కంపెనీ పేరును గృహమ్ ఫైనాన్స్‌గా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
పేదల గూడు.. ఇదిగో చూడు
కర్నూలు: పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో రూ.1.80 లక్షలను ఇస్తోంది. డబ్బులు లేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా రూ. 35 వేలు రుణం ఇప్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను రాయితీపై అందజేస్తోంది. అంతే కాకుండా కాలనీల్లో విద్యుత్, రోడ్లు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కలి్పస్తోంది. దీంతో లబి్ధదారులు రెట్టింపు ఉత్సాహంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని పేదల ఇళ్లు ఇవీ.. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్‌లోనూ ఎఫ్‌వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్‌హెచ్‌బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్‌హెచ్‌బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్‌హెచ్‌బీ నివేదిక వెల్లడించింది. -
పేదరికం పై పైకి!
యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది. – గారెత్ ఓవెన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్ (కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు? పేదరికం పెంచిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది. ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం కోవిడ్ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్యయనం తేల్చింది. అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ ప్రకారం యూకేలో కోవిడ్ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది. కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్ సెన్సస్ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం. యూరప్ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్ కమిషన్ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్ యూరప్ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా లెక్క అలా.. మనది ఇలా రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు. ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది. 2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి. 16.3 కోట్ల దిగువ మధ్యతరగతి? రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. పేదరికంపై నడ్జ్ ఫౌండేషన్ పోరు ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం. వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్ ఫౌండేషన్ -
ఇక ముందూ ఇళ్లకు డిమాండ్.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి
కోల్‌కతా: ఇళ్ల కోసం డిమాండ్ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డైరెక్టర్ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్ చాలా తక్కువని చెప్పారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు. గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్డీఎఫ్సీ ఇటీవలే హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్పీఏలతో భారత బ్యాంకింగ్ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్గేజ్ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్ ఎప్పటికీ ఉంటుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్ గవర్నెన్స్ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు. వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు తోడు ఈఎస్జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్ వృద్ధి అంచనాలను మించింది. భారత్ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు. -
హౌసింగ్, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం సంస్కరణలు అవశ్యం
న్యూఢిల్లీ: గృహనిర్మాణ రంగం, బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి పరిశ్రమల సంస్థ– పీహెచ్‌డీసీసీఐ కీలక సిఫారసులు చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఒక నివేదికను సమరి్పంచింది. గవర్నర్‌ను కలిసిన బృందానికి పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాలి్మయా నేతృత్వం వహించారు. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక సవాళ్లు, కొనసాగుతున్న మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గృహనిర్మాణ రంగ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. తక్కువ వడ్డీరేట్లు రేట్లు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. వినియోగాన్ని పెంచుతాయి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు చేయూతను అందిస్తాయి. ► ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో, తగిన లిక్విడిటీని నిర్వహించడంలో (ద్రవ్య లభ్యత) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను మేము అర్థం చేసుకున్నాము. అభినందిస్తున్నాము. అయితే ఇదే సమయంలో వడ్డీ రేట్ల తగ్గింపూ చాలా అవసరం. మా పరిశ్రమకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని ఇది అందిస్తుందని మేము నమ్ముతున్నాము. ► ఎగుమతి రియలైజేషన్ ప్రయోజన కోడ్ల సరిదిద్దడం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఇన్పుట్ ప్రయోజనాల రక్షణ సహా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కరించాల్సి ఉంది. ► విదేశీ సంస్థల కొనుగోళ్ల మాదిరిగానే రూపాయి రుణాలను ఉపయోగించి భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనిట్లు/కంపెనీలను కొనుగోలు చేయడానికి అనుమతించాలి. ప్రస్తుతం, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఏ యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి భారతీయ రూపాయిలో బ్యాంక్ రుణం వీలు కల్పించడంలేదు. అయితే భారతదేశం వెలుపల ఏదైనా యూనిట్/కంపెనీని కొనుగోలు చేయడానికి మాత్రం ఇది అందుబాటులో ఉంది. ► విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే... ఎగుమతి ఆదాయం నుండి విదేశీ బ్యాంకు చార్జీలను రికవరీ చేయడం, విదేశీ కరెన్సీలో ప్రీ–షిప్మెంట్ క్రెడిట్‌ను సరళీకరించడం (పీసీఎఫ్సీ) వంటివి ఉన్నాయి. ► లఘు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) బకాయిల వర్గీకరణకు సంబంధించి 90 రోజుల పరిమితిని 180 రోజులకు పెంచాలి. తద్వారా ఆయా కంపెనీలు వాటి వర్కింగ్ క్యాపిటల్‌ను వ్యాపార కార్యకలాపాలకు తగిన విధంగా> వినియోగించి సమస్యల నుంచి బయటపడే వీలుంటింది. రుణ వాయి దాల చెల్లింపులకు వర్కింగ్ క్యాపిటల్‌ను వినియోగించుకోవాల్సిన దుస్థితి తొలగిపోతుంది. -
హౌసింగ్‌లో సంస్థాగత పెట్టుబడులు ఐదు రెట్లు
న్యూఢిల్లీ: హౌసింగ్ (ఇళ్ల నిర్మాణం)లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. జనవరి–జూన్ మధ్య 433 మిలియన్ డాలర్లు (రూ.3,526 కోట్లు) వచ్చాయి. ఈ వివరాలను కొలియర్స్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో హౌసింగ్‌లో పెట్టుబడులు 89.4 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్ హౌసింగ్ ఆస్తుల్లోకి 95 శాతం అధికంగా 350 మిలియన్ డాలర్ల (రూ.2870 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్‌లోకి వచి్చన పెట్టుబడులు 179.8 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆఫీస్‌లు, విదేశీ కార్పొరేట్ సంస్థలు, విదేశీ బ్యాంక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ ఫండ్ సంస్థలు, విదేశీ ఎన్బీఎఫ్సీ, సావరీన్ వెల్త్ ఫండ్స్ (సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం) ఈ పెట్టుబడులు సమకూర్చాయి. నివాస గృహాల విభాగంలో పెట్టుబడులు మొదటి ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగాయి. ప్రధానంగా దేశీయ పెట్టుబడులు ఈ వృద్ధికి మద్దతుగా ఉన్నాయి. పెరుగుతున్న వినియోగంతో స్థిరమైన వృద్ధికి అవకాశాలు ఉండడంతో పారిశ్రామిక ఆస్తుల విభాగం రెండున్నర రెట్లు అధికంగా పెట్టుబడులను ఆకర్షించింది. తయారీ రంగం నుంచి డిమాండ్ ‘‘తయారీ రంగం వేగంగా వృద్ధిని చూస్తోంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థలు, తయారీ రంగంలో బలమైన వృద్ధితో ఈ రంగం ఇక ముందూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’అని నివేదిక వెల్లడించింది. డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్ హాలీడ్ హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ తదితర ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగంలో పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 60 శాతం క్షీణించి 158 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన పెట్టుబడులు 399 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. భారత రియల్ ఎస్టేట్ విభాగంలోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 43 శాతం పెరిగి 3.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.57 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు. ఈ 3.7 బిలియన్ డాలర్లలో, అత్యధికంగా కార్యాలయ ఆస్తుల విభాగం 2.7 బిలియన్ డాలర్లు ఆకర్షించింది. మిశ్రమ వినియోగ ప్రాజెక్టుల్లోకి సంస్థాగత పెట్టుబడులు 95 శాతం తగ్గి 15.1 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక రిటైల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల విభాగం గతేడాది తొలి ఆరు నెలల్లో 492 మిలియన్ డాలర్లు రాబట్టగా, ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో ఎలాంటి పెట్టుబడులు రాలేదు. రియల్ ఎస్టేట్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో 5.7 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2019లో 6.3 బిలియన్ డాలర్లు, 2020లో 4.8 బిలియన్ డాలర్లు, 2021లో 4 బిలియన్ డాలర్లు, 2022లో 4.9 బిలియన్ డాలర్ల చొప్పున వచ్చాయి. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. జీవో 45పై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చని అర్థం అని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కొంతమంది అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదు? మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే సవరించామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉంది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. -
పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్‌లో రికార్డు స్థాయి..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6–10 శాతం పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 10 శాతం పెరిగి చదరపు అడుగు రూ.4,980గా ఉంది. ఏడు పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు 36 శాతం అధికంగా 1,15,100 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 84,940 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్ మార్కెట్‌పై పడలేదు. 2023 ద్వితీయ ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్ బలంగానే ఉంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వెల్లడించారు. హైదరాబాద్‌లో అమ్మకాలు 13,570 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 11,190 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. జూన్ త్రైమాసికంలో పుణె పట్టణంలో ఇళ్ల అమ్మకాలు 65 శాతం పెరిగి 20,680 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,500 యూనిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు కేవలం 7 శాతం పెరిగాయి. ఒకే అంకె అమ్మకాల వృద్ధిని చూసిన పట్టణం ఇదొక్కటే. ఇక్కడ 16,450 యూనిట్లు విక్రయమయ్యాయి. కోల్‌కతా మార్కెట్లో 20 శాతం వృద్ధితో అమ్మకాలు 5,780 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 48 శాతం అధికంగా 38,090 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో 15,050 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 44 శాతం పెరిగాయి. 5,490 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడు పట్టణాల్లో నూతన ఇళ్ల నిర్మాణం వార్షికంగా 25 శాతం పెరిగి 1,02,620 యూనిట్లుగా ఉంది. అమ్మకాలు బలంగా ఉండడంతో ఏడు పట్టణాల్లో ఇళ్ల నిల్వలు 2 శాతం తగ్గి 6.14 లక్షల యూనిట్లుగా జూన్ చివరికి ఉన్నాయి. -
AP: త్వరలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం: కొమ్మినేని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని సీఆర్ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ల ముసుగులో కొత్త పెత్తందార్ల అవతారం ఎత్తినట్లు కనిపిస్తోందని, ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి సదస్సులు పెట్టడం ద్వారా వారి అసలు ఎజెండాను బయటపెట్టుకున్నట్లయిందని ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం జరిగిందని, ఉదాహరణకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వంటివి ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో ఏవైనా ఇబ్బందులు ఉంటే సమాచారశాఖ కమిషనర్‌ను సంప్రదించవచ్చని అన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా జగన్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని, తద్వారా జర్నలిస్టులకు శుభవార్త తెలపవచ్చని ఆశిస్తున్నానని కొమ్మినేని చెప్పారు. ఇప్పటికే 98.5 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా, 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం కొద్దివేల మంది జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వకుండా ఉండదని, కాని దీనికి సంబంధించి విధి, విధానాలపై ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజానికి ఇప్పటికే పలు చోట్ల ప్రభుత్వ స్కీములలో ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు కూడా ఉన్నారన్న సంగతి తన పర్యటనలలో తెలిసిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం చేసే ఏ పనిపైన అయినా విషం చిమ్ముతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.జర్నలిస్టుల కోసం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ దుష్టశక్తులే అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు జర్నలిజంలో కూడా పెత్తందారులుగా మారి తమ జులుం ప్రదర్శించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కొన్ని పత్రికలు, టీవీ చానళ్లు అడ్డగోలుగా వార్తలు ఇస్తున్నా, ప్రభుత్వంపై నీచమైన స్థాయిలో అసత్యాలతో సంపాదకీయాలు రాస్తున్నా జర్నలిస్టు సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మీడియా యజమానులు జర్నలిజం విలువలకు పాతర వేస్తూ నగ్నంగా తిరుగుతుంటే ఈ యూనియన్ల నేతలు, జర్నలిస్టులలో పెత్తందారులుగా తయారైనవారు కనీసం నోరెత్తలేకపోతున్నారని కొమ్మినేని మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించిన ఒక బూర్జువా విప్లవవీరుడు ఏపీకి వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని సుద్దులు చెబుతున్నారని, తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరు జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం ఖండించలేని ఈ విప్లవకారుడు ఏపీలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సుప్రింకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా హౌసింగ్ సొసైటీకి అక్కడి ప్రభుత్వం తగు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి ఉందని, మరి దాని గురించి ఈయన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని కొమ్మినేని అడిగారు. ఏపీలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉన్నాయి కనుకే కొన్ని పత్రికలు, టీవీలు, యథేచ్ఛగా నోటికి వచ్చిన దుష్టభాషతో వార్తా కథనాలు, సంపాదకీయాలు ఇవ్వగలుగుతున్నాయని, ప్రజల మనసులలో విషం నింపాలని చూస్తున్నాయన్న సంగతి గుర్తించాలని ఆయన అన్నారు. తమ మీడియా సంస్థలలో జీతాలు ఇవ్వకపోయినా, ఉద్యోగులను ఇష్టారీతిన తొలగించినా కనీసం నోరు విప్పని కొందరు జర్నలిస్టు నేతలు ప్రతిదానికి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మాత్రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చివరికి తమ సంస్థ యాజమాన్యాలు చేయవలసిన పనులు కూడా ప్రభుత్వమే చేయాలని వీరు కోరుకోవడంలోనే పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. చిన్న పత్రికలకైనా, పెద్ద పత్రికలకైనా కొన్ని నిబంధనలు పెట్టకపోతే ప్రభుత్వ రాయితీలు ఎలా దుర్వినియోగం అవుతాయో అందరికి తెలుసునని అన్నారు. చదవండి: చంద్రబాబు.. సీఎం జగన్‌కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా? కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టించడం ద్వారా ఈ సంఘాలు జర్నలిజం ముసుగులో టీడీపీ ఎజెండా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు పాలనకు సర్టిఫికెట్ ఇచ్చిన ఆ బూర్జువా విప్లవకారుడు ఆ రోజుల్లో కొందరు జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టినా ఖండించలేదని, కొన్ని టీవీ చానళ్లను చంద్రబాబు ప్రభుత్వం నిషేధించినా నోరెత్తలేదని, పైగా ఇప్పుడు అదే బాగుందని అంటున్నారని, ఇందులో ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని అంతా అర్ధం చేసుకోవాలని కొమ్మినేని అన్నారు. జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పడం తప్పుకాదని, అదే సమయంలో సంయమనంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.. అలాకాకుండా ఏవో కొన్ని రాజకీయ పక్షాల ప్రయోజనం కోసం జర్నలిస్టు సంఘాలు ప్రయత్నిస్తే అది జర్నలిజానికి మరింత మచ్చ తెస్తుందని కొమ్మినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
టీడీపీ హయాంలో కాళ్ళరిగేలా తిరిగినా ఇవ్వని ఇళ్ళు
-
బిల్డర్లకు రేటింగ్! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు. చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
రూ.270కి మూడు ఇళ్లు
రోమ్: ఇటలీలో నాలుగైదేళ్ల కిందటి వరకు కొన్ని గ్రామాలకు వెళితే కారు చౌకగా ఇళ్లు లభించేవి. ఒక డాలర్ ఇస్తే చాలు ఇక ఇల్లు వారి పేరు మీద రిజిస్టర్ అయిపోయేది. సిసిలీలో ఒక మారుమూల విసిరేసినట్టున్న ఇల్లు కొనడానికి ఒక డాలర్ ఖర్చు పెడితే చాలు. దీనికి కారణం ఆ ప్రాంతం నుంచి ప్రజల వలసలే. కాలిఫోర్నియాకు చెందిన రుబియా డేనియల్స్ అనే మహిళ 2019లో కేవలం 3.30 డాలర్లకి (రూ.270) మూడు ఇళ్లను కొనుగోలు చేసింది. ఈ నాలుగేళ్లలో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రజలు మళ్లీ గ్రామాల బాటపడుతున్నారు. దీంతో ఆమె కొనుగోలు చేసిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆ ఇళ్లను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. ఒక ఇంట్లో తానుంటానని, మరొకటి ఆర్ట్ గ్యాలరీగా మార్చి, ఇంకొకటి అద్దెకిస్తానని చెబుతున్నారు. -
జగనన్న లేఔట్లు : ఇవీ ఆధారాలు, నమ్మకండి అవాస్తవాలు
కంకిపాడు (పెనమలూరు): జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సకల హంగులు సమకూరుతుండటంతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలతో లే అవుట్లు కాస్తా ఊళ్లను తలపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన లే అవుట్లు కార్పొరేట్ సంస్థలు నిర్మించే లే అవుట్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు నిధులు కేటాయింపులు, పరిపాలనా ఆమోదం లభించాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 670 లే అవుట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 93,245 గృహాలు మంజూరు చేయగా, 91,250 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది నాటికి 13వేల గృహాలు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 14,023 గృహాలు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయటంతో జిల్లా ప్రథమస్థానం దక్కటం తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 362.15 కోట్ల సొమ్మును లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం చెల్లింపులు చేశారు. వేగంగా వసతుల కల్పన.. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా జగనన్న లే అవుట్లు (జగనన్న కాలనీలు)లో వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయా లే అవుట్ల మెరక పనులు, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ పనులకు ఇప్పటికే రూ. 82.66 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో కాలనీలకు విద్యుత్ వసతి, రహదారి వసతి సమకూరింది. మెరక పనులతో ముంపు సమస్య నుంచి లబ్ధిదారులకు ఊరట లభించింది. తాగునీటి వసతుల కల్పనకు గానూ రూ. 64.88 కోట్లు నిధులు వెచ్చించి వసతులు కల్పించారు. దీంతో నివేశనస్థలం కేటాయించిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో పాటుగా డ్వాక్రా మహిళలకు రూ. 35 వేలు, సీఐఎఫ్ కింద రూ. 35 వేలు, ఉన్నతి పథకం కింద రూ. 50 వేలు రుణాలను బ్యాంకుల నుంచి అందిస్తుండటంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా జగనన్న లే అవుట్లు వసతులతో కూడిన ఊళ్లను తలపిస్తున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా.. పేదలకు కేటాయించిన జగనన్న లే అవుట్లలో వసతుల కల్పనతో పాటుగా కార్పొరేట్‌కు దీటుగా కాలనీలను తయారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆయా కాలనీలకు ఆకర్షణీయంగా కార్పొరేట్ సంస్థలు నిర్మించే రియల్ వెంచర్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో తొలి విడత 63 లే అవుట్లలో స్వాగత ద్వారాల ఏర్పాటుకు రూ. 2.90 కోట్లు నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించటంతో గృహనిర్మాణ సంస్థ ఆర్చ్‌ల నిర్మాణ పనులపై దృష్టి సారించింది. వారంలో పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అయ్యింది. సకల వసతులు కల్పిస్తున్నాం.. జగనన్న లే అవుట్లను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే 15వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. వసతుల కల్పనలో రాజీ పడకుండా సమర్థంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నాం. స్వాగత ద్వారాల పనులు వారంలో ప్రారంభమవుతాయి. – జి.వి.సూర్యనారాయణ, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ, కృష్ణాజిల్లా -
అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్నారా? నిబంధనలు వింటే అవాక్ అవ్వాల్సిందే!
సాధారణంగా సొసైటీలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఏ)లు నివసించే వారి సౌకర్యం కోసం నిబంధనలు విధిస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిల్లో కొన్ని విచిత్రమైన రూల్స్ నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. బెంగళూరులోని కుందనపల్లి గేట్ ఏరియా ప్రాంతానికి చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టిన కండీషన్స్ ఇలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు ఫ్లాట్లలోకి వచ్చేందుకు అనుమతి లేదు ►గెస్ట్‌లు ఎవరైనా రావాలంటే రాత్రి 10 గంటల తర్వాతే రావాలి ►ఒకవేళ వస్తే కారణాన్ని వివరిస్తూ ఓనర్, మేనేజర్, అసోసియేషన్ ఆఫీస్‌కు ఐడీ ఫ్రూప్‌తో పాటు అతిధులు ఎన్నిగంటలకు వస్తున్నారు. ఎంత సమయం ఉంటారో మెయిల్ పెట్టి అనుమతి తీసుకోవాలి. ►బ్యాచిలర్స్, పెళ్లికాని వాళ్లు తప్పని సరిగా అసోసియేషన్ విధించిన కండీషన్లకు కట్టుబడి ఉండాలి. లేదంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ►రాత్రి 10 గంటల తర్వాత పెద్దగా మ్యూజిక్ సౌండ్ వినిపించకూడదు. లేట్ నైట్ పార్టీలు చేసుకోకూడదు. కారిడార్లు, బాల్కనీలల్లో ఫోన్ మాట్లాడకూడదనే కండీషన్లు పెట్టారంటూ బాధితులు వాపోతున్నారు. ఆ కండీషన్ల గురించి రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Marathalli సొసైటీలో అబ్బాయిలు, అమ్మాయిల ఫ్లాట్లలోకి వెళుతున్నారా? లేదా అని బ్యాచిలర్స్ ఫ్లాట్లను పర్యవేక్షిస్తారు. అతిథులు వెళ్లిపోయారా లేదా అని చూడటానికి సెక్యూరిటీ గార్డ్లు బ్యాచిలర్స్ ఫ్లాట్లను చెక్ చేస్తున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘ఇది హాస్టళ్ల కంటే దారుణం. మీరు ఫ్లాట్లలో ఉండేందుకు రెంట్ చెల్లిస్తున్నారు.రెంటల్ అగ్రిమెంట్ల ప్రకారం అద్దెకు తీసుకున్న కాలానికి ఇది మీ ఫ్లాట్. మీ ఫ్లాట్‌కి ఎవరు వస్తారు? బాల్కనీలో ఏం చేస్తారు? అనేది మీ ఇష్టం ఈ రోజుల్లో సొసైటీ నియమాలు అసహ్యంగా మారుతున్నాయి’ ఓ యూజర్ కామెంట్ చేస్తున్నారు. ‘బ్యాచిలర్స్‌కు విధించిన నిబంధనలు మరింత జుగుప్సాకరంగా ఉన్నాయి. అందుకే నేను సొసైటీలలో ఉండడాన్ని ద్వేషిస్తున్నాను! మరొక యూజర్ అన్నాడు. -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్‌ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్‌ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్‌ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్‌గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్‌లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
పెద్ద పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 11 శాతం పెరిగినట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏడు పట్టణాల్లో 149 మిలియన్ చదరపు అడుగులు (ఎంఎస్ఎఫ్) అమ్ముడుపోయినట్టు వెల్లడించింది. గత పదేళ్లలో ఒక త్రైమాసికం వారీ అత్యధిక విక్రయాలు ఇవేనని పేర్కొంది. డిమాండ్ మెరుగ్గా ఉండడమే వృద్ధికి మద్దతునిచ్చినట్టు తెలిపింది. 2022–23 మొదటి తొమ్మిది నెలల్లో (2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఈ ఏడు ప్రధాన పట్టణాల్లో 412 ఎంఎస్ఎఫ్ అడుగుల ఇళ్లను విక్రయించినట్టు ఇక్రా తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో విక్రయాలు 307 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే 30 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కరోనా మహమ్మారి తర్వాత కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు వచ్చిందంటూ.. లగ్జరీ, మధ్య స్థాయి ధరల ఇళ్ల వాటా పెరిగినట్టు వివరించింది. 2019–20లో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతం, మధ్యస్థాయి ధరల ఇళ్ల వాటా 36 శాతం చొప్పున ఉంటే.. 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలానికి లగ్జరీ ఇళ్ల అమ్మకాల వాటా 16 శాతానికి పెరిగితే, మధ్యస్థాయి ఇళ్ల విక్రయాల వాటా 42 శాతానికి చేరింది. హైదరాబాద్‌తోపాటు, చెన్నై బెంగళూరు, కోల్‌కతా, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె పట్టణాలకు సంబంధించి ఇక్రా గణాంకాలు విడుదల చేసింది. 2023–24లో 16 శాతం.. ‘‘రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు విలువ పరంగా 2022–23లో 8–12 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2023–24లో 14–16 శాతం మధ్య పెరగొచ్చు’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, కో గ్రూప్ హెడ్ అనుపమ రెడ్డి తెలిపారు. టాప్–12 డెవలపర్ల ప్రాథమిక గణాంకాల ఆధారంగా వేసిన అంచనాలుగా ఇక్రా పేర్కొంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెరుగుదల గృహ కొనుగోళ్లపై లేదని తెలిపింది. ‘‘కరోనా ముందున్న నాటి రేట్ల కంటే ఇప్పటికీ గృహ రుణాలపై రేట్లు తక్కువే ఉన్నాయి. కనుక కొనుగోలు శక్తి ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. తక్కువ నిల్వలు, డెవలపర్లు తమకు అనుకూలంగా ప్రాజెక్టులు ప్రారంభించడం, ఉద్యోగ మార్కెట్లో మందగమనం, వడ్డీ రేట్లు మరింత పెరుగుదల కొనుగోలు శక్తిపై చూపించే అంశాలు’’అని పేర్కొంది. 2022 డిసెంబర్ నాటికి అమ్ముడుపోని ఇళ్ల పరిమాణం 839 ఎంఎస్ఎఫ్గా ఉందని ఇక్రా తెలిపింది. 2021 డిసెంబర్లో విక్రయం కాని ఇళ్లు 923 ఎంఎస్ఎఫ్తో పోలిస్తే తక్కువేనని గుర్తు చేసింది. వార్షికంగా చూస్తే 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు 10 శాతం పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన నిర్మాణ వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలిపింది. -
చిత్రపురి కాలనీలో గృహ ప్రవేశ మహోత్సవంలో చిరంజీవి (ఫొటోలు)
-
హెచ్‌డీఎఫ్‌సీకి ఐఎఫ్‌సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్‌కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్‌సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్‌సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్‌లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహ విక్రయాలతో పాటు వాటి విలువలు కూడా పెరుగు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొదటి ఏడు నగరాల్లో విక్రయించిన రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్లు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆసక్తికరంగా, ఈ కాలంలో హైదరాబాద్ మొత్తం గృహాల విక్రయ విలువలలో 130 శాతం జంప్ చేశాయి. ఈ ఆర్ధిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో రూ.15,958 కోట్ల విలువ చేసే 22,840 ఇళ్లు అమ్ముడుపోయాయి. అదే 2022 ఫైనాన్షియల్ ఇయర్ హెచ్1లో రూ.6,926 కోట్ల విలువైన 9,980 యూనిట్లు విక్రయమయ్యాయి. ఏడాదిలో 130 శాతం వృద్ధి రేటు నమోదైందని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2023 హెచ్1లో రూ.1.56 లక్షల కోట్ల విలువ చేసే 1,73,155 యూనిట్లు సేలయ్యాయి. 2022 హెచ్1లో 87,375 యూనిట్లు సేలయ్యాయి. వీటి విలువ రూ.71,295 కోట్లు. అంటే ఏడాదిలో 119 శాతం వృద్ధి రేటు. ఇదీ చదవండి: యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు! అత్యధికంగా ముంబైలో రూ.74,835 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఎన్సీఆర్లో రూ.24,374 కోట్లు, బెంగళూరులో రూ.17,651 కోట్లు విలువ చేసే గృహాలు విక్రయమయ్యాయి. గృహ విలువల వృద్ధి అత్యధికంగా ఎన్సీఆర్లో నమోదయింది. 2022 ఆర్ధిక సంవత్సరం హెచ్1లో ఎన్సీఆర్లో రూ.8,896 కోట్లు విలువ చేసే ఇళ్లు విక్రయం కాగా.. 2023 హెచ్1 నాటికి 175 శాతం వృద్ధి రేటుతో రూ.24,374 కోట్లకు చేరింది -
ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ నేటికీ కొనసాగుతుండటంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకిళ్ల మధ్యన ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పట్నా, మొహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్ (ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాలలో గృహ కొనుగోళ్లకు కొనుగోలుదారులకు ఆసక్తిని కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది. మారిన ప్రాధామ్యాలు. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, అపై పడక గదుల గృహాలలో అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకం కానున్నాయని అంచనా వేసింది. -
హౌసింగ్ ప్రాజెక్టులకు రూ. 350 కోట్లు: ఎల్డెకో, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్‌తో చేతులు కలిపినట్లు రియల్టీ సంస్థ ఎల్డెకో గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో హౌసింగ్ ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 350 కోట్లతో నిధి(ఫండ్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వెరసి అందుబాటు ధరల రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా హెచ్-కేర్3 పేరుతో రియల్టీ ఫండ్‌కు తెరతీసినట్లు ఎల్డెకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ తెలియజేసింది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రస్తుతం ఎల్డెకో గ్రూప్ ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో నాలుగు హౌసింగ్ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిపై రూ. 175 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. ఇంతక్రితం కూడా హెచ్డీఎఫ్సీ క్యాపిటల్‌తో భాగస్వామ్యంలో ఎల్డెకో గ్రూప్ హెచ్-కేర్1 పేరుతో రూ. 150 కోట్ల రియల్టీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా తక్కువ ఎత్తులో, ప్లాటెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. తొలిగా ఈ ఏడాది మార్చిలో ఎల్డెకో ప్యారడైజో పేరుతో పానిపట్‌లో 35 ఎకరాల ప్లాటెడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. (క్లిక్: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) -
జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీపికబురు.. మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను పరిష్కరించినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం పాత్రికేయ మిత్రులకు తమ వాగ్ధానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. చదవండి: జర్నలిస్టులకు గుడ్‌న్యూస్.. ఇళ్ల స్థలాల కేటాయింపుకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుకి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల కోసం.. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసును పరిష్కరించినందుకుగాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ద్వారా అందిన తీపి కబురు అని అల్లం నారాయణ అన్నారు. అలాగే, జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో కృషి చేసి, చొరవ తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. I would like to extend my gratitude to the Hon’ble Supreme Court & CJI Garu for clearing the long-standing demand of Telangana journalist society on house site allotments This will help Telangana Govt deliver on our promise to our Journalist friends 👍 — KTR (@KTRTRS) August 25, 2022 -
పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సవాళ్లు
న్యూఢిల్లీ: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సమీప కాలంలో సవాళ్లు నెలకొన్నాయని డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. అయినా పరిశ్రమపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలకు డిమాండ్ పరంగా గడిచిన రెండేళ్లలో నిర్మాణాత్మక రికవరీ కనిపిస్తోందని.. పరిశ్రమలో స్థిరీకరణ కారణంగా నమ్మకమైన సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్టు తెలిపారు. కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లకు ఉన్న డిమాండ్, దేశ ఆర్థిక వ్యవస్థ బలం ఈ రంగానికి మద్దతునిస్తాయన్నారు. ఆర్బీఐ గడిచిన మూడు నెలల్లో మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం వెంటనే రుణ రేట్లను పెంచేశాయి. 6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త ఉత్పత్తులను అందిస్తున్నట్టు రాజీవ్‌సింగ్ చెప్పారు. దీంతో కొత్త ఇళ్ల బుకింగ్‌లలో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని తెలిపారు. డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు 2021-22లో రూ.7,273 కోట్లకు పెరగ్గా.. అంతకు ముందు సంవత్సరంలో ఇవి రూ.3,084 కోట్లుగానే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బుకింగ్‌లు రెట్టింపై రూ.2,040 కోట్లుగా నమోదయ్యాయి. -
గుడ్‌న్యూస్: 2024 డిసెంబర్ 31 దాకా ‘పీఎంఏవై–అర్బన్’
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)–అర్బన్ పథకాన్ని 2024 డిసెంబర్ 31వ తేదీ వరకూ కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 2022 మార్చి నాటికి దేశంలో అర్హులైన వారందరికీ పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని 2015 జూన్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మంజూరు చేసిన 122.69 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థన మేరకు పథకాన్ని 2024 డిసెంబర్ 31 కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్.. తీవ్ర విమర్శలు) -
హైదరాబాద్‌లో అటువైపే ఇళ్లు ఎక్కువగా కొంటున్నారు
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి మార్కెట్ పరుగులు తీస్తోంది. వరుసగా రెండేళ్ల పాటు మధ్యలో కోవిడ్ ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ పుంజుకుంది. నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపుతో మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు సరికొత్త పోకడలతో విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్థిరాస్తి రంగం జోరు కొనసాగుతోంది. లక్షన్నరకుపైనే దస్తావేజులు ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2022– 23 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో సుమారు లక్షన్నరకు పైగా దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం శివారు ప్రాంతాల్లోనే 1.20 లక్షల లావాదేవీలు జరగడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే సుమారు 46 శాతం పైగా లావాదేవీల సంఖ్య పెరిగినట్లయింది. గతేడాది ఏప్రిల్, జూన్‌లో దస్తావేజులు నమోదు సంఖ్య భాగా పెరిగినా.. కోవిడ్ వైరస్ వ్యాప్తితో మే నెలలో మాత్రం కేవలం 25 శాతానికి పరిమితమైనట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ► ప్రస్తుతం శివారు పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దినసరి రిజిస్ట్రేషన్ల సంఖ్య మూడు అంకేలు దాటుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఫరూక్నగర్, మహేశ్వరం, గచ్చిబౌలి, చంపాపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, మేడ్చల్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, బంజారాహిల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, గండిపేట పరిధుల్లో స్థిరాస్తి లావాదేవీలు అత్యధికంగా జరుగుతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. భవిష్యత్‌పై భరోసాతో.. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టి భవిష్యత్తుపై భరోసా కనిపిస్తుండటంతో క్రయ విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. హైదరాబాద్ చుట్టూ భారీ కొత్త ప్రాజెక్టు వస్తుండటంతో కొనుగోలుదారులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. భూములు, ఇళ్ల ధరలు పెరుగుతుండటమే తప్ప తగ్గే అవకాశం లేదనే అంచనాలతో స్థిరాస్తి రంగం మరింత వేగం పుంజుకునట్లయింది. సామాన్యులతోపాటు ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనడమే కాదు.. పెట్టుబడులు సైతం వెనుకాడటం లేదు. గృ హ అద్దెలతో పోలిస్తే అద్దెల రాబడి అధికంగా ఉంటుందని స్థిరాస్తి రంగం వైపు మొగ్గు చూపడం అధికమైంది. మెట్రోతో... మెట్రో రవాణా అందుబాటులోకి రావడం కూడా స్థిరాస్తి రంగానికి కలిసి వచ్చినట్లయింది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి పెరిగింది. వరంగల్ రహదారి మార్గంలో ఘట్కేసర్ వరకు వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. పశ్చిమంలోని ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో ఉద్యోగులు ఇటువైపు ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి మీదున్న ఎల్బీనగర్ వరకు మెట్రో రవాణా సదుపాయం ఉండటంతో నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది. శివారుపై ఆసక్తి నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలో మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండిపెండెంట్ గృహాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి మరింత ఊపొచ్చినట్లయింది. బాహ్యవలయ రహదారి బయట టౌన్‌షిప్‌లు, వందల ఎకరాల్లో వెంచర్లు. పెద్ద సంస్థల కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు మరింత జీవం పోస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఓఆర్ఆర్ బయట భారీ ప్రాజెక్ట్‌లను ప్రకటించాయి. గతంలో స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కార్యాలయానికి, ప్రధాన వాణిజ్య కేంద్రానికి ఎంత దూరమని ఆలోచన ఉండేది. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తరలి వస్తున్న పరిశ్రమలు ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు పలు కంపెనీలు తరలివచ్చాయి. వాటి సమీప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాల హోరు కొనసాగుతోంది. కొండాపూర్, కోకాపేట్, రాయదుర్గం, మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ , ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. (క్లిక్: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి) -
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు!
ప్రపంచ దేశాల్లో ఆయా రంగాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించడంతో ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో హౌసింగ్ మార్కెట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ (ఎన్‌బీఈఆర్) ప్రకారం.. 2019 నుంచి నవంబర్ 2021 వరకు సేకరించిన డేటాలో 42.8శాతం మంది అమెరికన్ ఉద్యోగులు పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ నుంచే పనిచేస్తున్నారు. అదే సమయంలో శాస్వతంగా ఇంటి వద్ద నుంచి పనిచేయడం కనిపిస్తోంది. అయితే అదే (2019-2021) సమయంలో అమెరికాలో రికార్డ్ స్థాయిలో ఇళ్ల రేట్లు పెరిగాయి. వేగంగా ఇళ్ల రేట్లు 23.8శాతం పెరగడంతో ఇళ్లకు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ తో ఇళ్ల ధరలు, ఇళ్ల రెంట్లు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. రెడ్ ఫిన్ ఏం చెబుతుంది రెడ్ ఫిన్ డేటా సైతం అమెరికా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిభ్రవరిలో ఆన్లైన్లో 32.3శాతం మంది తాము ఉంటున్న ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కు మారేందుకు కొత్త ఇళ్లకోసం వెతికారని నివేదించింది. వారి సంఖ్య 2019లో 26శాతం ఉండగా 2021 తొలి క్యూ1లో వారి సంఖ్య 31.5శాతానికి పెరిగింది. ఇక ఇళ్లు షిప్ట్ అయ్యే వారిలో అమెరికాలో మియామి,ఫియోనిక్స్ తో పాటు పలు ప్రాంతాల ప్రజలు రీలొకేట్ అయినట్లు రెడ్‌ఫిన్ తన నివేదికలో ప్రస్తావించింది. -
కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న ఇళ్ల ధరలు!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. వచ్చే 6 నెలల్లో గృహల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ నివేదిక తెలిపింది. అధిక ఇన్పుట్ ఖర్చుల వల్ల వచ్చే ఆరు నెలల్లో హౌసింగ్ ధరలు పెరుగుతాయని ప్రముఖ హౌసింగ్ పోర్టల్ Housingcom, రియల్ ఎస్టేట్ సంస్థ NAREDCO కలిసి నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 క్యాలెండర్ సంవత్సరం మొదటి అర్ధభాగంలో వినియోగదారుల మనోభావాలను అంచనా వేయడానికి 3,000 మందికి పైగా ప్రజల నుంచి అభిప్రాయలను సేకరించినట్లు ఈ సర్వే పేర్కొంది. 'రెసిడెన్షియల్ రియల్టీ కన్స్యూమర్ సెంటిమెంట్ అవుట్‌లుక్(జనవరి-జూలై 2022)' నివేదిక పేర్కొన్న వివరాల ప్రకారం.. 100 మందిలో 47% మంది వినియోగదారులు రియల్ ఎస్టేట్'లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని ఈ సర్వే హైలైట్ చేసింది. స్టాక్, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వంటి వాటిలో పెట్టె పెట్టుబడితో పోలిస్తే ఇది అత్యధికం. 2020 ద్వితీయార్ధంలో నిర్వహించిన సర్వేలో కేవలం 35 శాతం మంది మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. "కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గుతుండటంతో ప్రజలు గృహాల కొనుగోలుకు సిద్దం అవుతున్నారు. గత ఏడాది 2021లో డిమాండ్ పెరగడంతో ఇళ్ల అమ్మకాలు 13 శాతం పెరిగాయని మా డేటా చూపించింది. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్ కంటే ముందు స్థాయి అమ్మకాలను దాటుతాయని మేము బలంగా నమ్ముతున్నాము" అని Housingcom గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ అన్నారు. ఈ సర్వే ప్రకారం.. కొత్త ఇళ్లు కొనాలని చూస్తున్న వారిలో సగానికి పైగా (51 శాతం) రాబోయే ఆరు నెలల్లో గృహ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం నిర్మాణ వ్యయం పెరగడం. అదే సమయంలో 73 శాతం మంది ప్రజలు ఇంటి కొనుగోలుకి ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా తగ్గింపు ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలను ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మినహాయింపును పెంచాలి, నిర్మాణ సామగ్రిపై వస్తు సేవల పన్ను(జిఎస్టి) ను తగ్గించాలని, చిన్న డెవలపర్లకు రుణ లభ్యతను విస్తరించాలని, గృహ కొనుగోళ్ల డిమాండ్ పెంచడానికి స్టాంప్ డ్యూటీని అన్నీ రాష్ట్రాలు తగ్గించాలని ఈ నివేదిక సూచించింది. (చదవండి: లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!) -
ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్! అంతకు మించి!
న్యూఢిల్లీ: చౌక గృహ రుణ మార్కెట్లో మరింత పురోగమించడానికి బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ముందడుగు వేసింది. ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లతో సహ–రుణ ఒప్పందాలను (కో–లెండింగ్) కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. గృహ రుణాల విషయంలో ఎటువంటి సేవలకూ నోచుకోని, పొందలేని అసంఘటిత, అల్పాదాయ వర్గాలే ఈ ఒప్పందాల లక్ష్యమని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విభాగాల్లో రుణ మంజూరీలకు కృషి చేస్తామని తెలిపింది. ప్రాధాన్యతా రంగానికి రుణాల కోసం బ్యాంకులు, హెచ్ఎఫ్సీ, ఎన్బీఎఫ్సీలు సహ రుణ పథకాలు రూపొందించడానికి ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యలో ఎస్బీఐ తాజా అవగాహనలు కుదుర్చుకుంది. ఆర్థిక వ్యవస్థలోని అట్టడుగు, అసంఘటిత రంగాల్లో తక్కువ వడ్డీకి రుణ లభ్యత ఉండాలన్నది ఆర్బీఐ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. ఐదు సంస్థలూ ఇవీ... ఎస్బీఐ ఒప్పందం చేసుకున్న ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్‌లు ఉన్నాయి. ఎస్బీఐ ప్రకటన అంశాలను విశ్లేషిస్తే... ►చౌక గృహాల కొరత భారతదేశానికి, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్), సమాజంలోని అట్టడుగు, అసంఘటిత వర్గాలకు ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఈ సవాళ్లు తగ్గించడానికి ఎస్బీఐ తన వంతు కృషి చేస్తుంది. ► ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహకారం బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ రుణ పంపిణీ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుంది, ► 2024 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ దార్శినికత దిశలో పురోగతికి ఈ ఒప్పందాలు దోహదపడతాయి. రుణ విస్తరణ లక్ష్యం... అసంఘటిత, బలహీన వర్గాలకు గృహ రుణ విస్తరణ జరగాలన్నది మా అవగాహనల లక్ష్యం. భారతదేశంలోని చిన్న గృహ కొనుగోలుదారులకు సమర్థ వంతమైన, సరసమైన వడ్డీలకు రుణాలను వేగవంతం చేరాలన్న బ్యాంక్ లక్ష్యాన్ని చేరుకోడానికి ఇటువంటి భాగస్వామ్యాలు దోహదపడతాయి. – దినేష్ ఖారా,ఎస్బీఐ చైర్మన్ 20:80 విధానంలో... ఆర్బీఐ 20:80 సహ–లెండింగ్ నమూనా ప్రకారం సంయుక్తంగా కస్టమర్లకు సేవలు అందిస్తాము. చౌక విభాగంలో హౌసింగ్ డిమాండ్ విపరీతంగా ఉంది. కో–లెండింగ్ మోడల్ ద్వారా మేము మా పూచీకత్తు సామర్థ్యాల మెరుగుదలనూ కోరుకుంటున్నాము. – రవి సుబ్రమణియన్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ విస్తరణకు మార్గం ఎస్బీఐతో వ్యూహాత్మక భాగస్వామ్యం మా రిటైల్ హోమ్ లోన్ సెగ్మెంట్ సేవల విస్తరణలో ఒక కీలకమైన ఘట్టం. భారత్‌లోని శ్రామిక, అసంఘటిత, అట్టడుగు వర్గాలకు హౌసింగ్ రుణాల విషయంలో మెరుగైన సేవలందించేందుకు దీనివల్ల మాకు వీలు కలుగుతుంది. – హరదయాళ్ ప్రసాద్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ అండ్ సీఈఓ లాభాలను పెంచుతుంది.. ఒప్పందం రెండు సంస్థల లాభదాయకతను పెంచడానికి, హోమ్ లోన్ పోర్ట్‌ఫోలియోలను విస్తరించడానికి సహాయపడుతుంది. విలువైన ప్రతి రుణగ్రహీతకు మరింత ఫైనాన్స్ అవకాశాలను సృష్టిస్తుంది. సామాన్యుని సొంత ఇంటి కల నెరవేర్చడంలో ఈ భాగస్వామ్యం కీలకమవుతుంది. – రాజేష్ శర్మ ,కాప్రి గ్లోబల్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ ఆకర్షణీయమైన రేట్లకే... ఈ ఒప్పందం కింద.. రుణ గ్రహీతను గుర్తించడం, రుణాన్ని మంజూరు చేయడం, వసూలు వంటి కార్యకలాపాలు నిర్వహిస్తాం. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో మరింత విస్తరించేందుకు అలాగే రుణ గ్రహీతలకు ఆకర్షణీయమైన రేట్లకే రుణాలు అందించడానికి ఒప్పందం దోహదపడుతుంది. – మోను రాత్రా,ఐఐఎఫ్ఎల్ హెచ్ఎఫ్ఎల్ చీఫ్ -
దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!
2021లో మొత్తం గృహ అమ్మకాలలో రూ.45 లక్షల వరకు ధర గల చౌక గృహాలకు డిమాండ్ 48 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది. అయితే, ఇందుకు విరుద్దంగా రూ.75 లక్షలకు పైగా విలువ గల గృహా అమ్మకాల వాటా 25 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ తెలిపింది. 'రియల్ ఇన్ సైట్ రెసిడెన్షియల్ - వార్షిక రౌండ్-అప్ 2021' పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రాప్ టైగర్ ఎనిమిది ప్రైమ్ హౌసింగ్ మార్కెట్లలో గృహ అమ్మకాలు 2021లో 13 శాతం పెరిగి 1,82,639 యూనిట్ల నుంచి 2,05,936 యూనిట్లకు పెరిగాయి. ప్రాప్ టైగర్ డేటా ప్రకారం, భారతదేశంలోని ఎనిమిది ప్రముఖ హౌసింగ్ మార్కెట్లలో మొత్తం హౌసింగ్ అమ్మకాల్లో 43 శాతం వాటా గల రూ.45 లక్షల విలువ చేసే గృహాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది రూ.45 లక్షలు-రూ.75 లక్షలు ధర గల గృహాల అమ్మకాల వాటా 2020లో ఉన్న 26 శాతం నుంచి 2021లో 27 శాతానికి పెరగగా, రూ.75 లక్షల నుంచి రూ.కోటి పరిధిలో ఉన్న అపార్ట్ మెంట్ల వాటా 9 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. కోటి రూపాయలకు పైగా ఖరీదు గల గృహ వాటా 16 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. దేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్'కతా, ఢిల్లీ-ఎన్సీఆర్(గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ మరియు ఫరీదాబాద్), ఎమ్ఎమ్ఆర్(ముంబై, నవీ ముంబై & థానే), పూణే వంటి 8 నగరాలలో గృహాలకు అధిక డిమాండ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2021లో దేశంలో సరసమైన గృహాల ఆకర్షణకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు వల్ల గృహాలకు డిమాండ్ ఏర్పడుతున్నట్లు ప్రాప్ టైగర్ అన్నారు. ఆదాయపు పన్ను చట్టం- 1960 సెక్షన్ 80ఈఈఏ కింద రూ.45 లక్షల వరకు విలువ గల గృహాలకు రూ.1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును అందిస్తుంది. అటువంటి రుణగ్రహీత ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎమ్ఎవై) కింద సబ్సిడీని కూడా క్లెయిం చేసుకోవచ్చు. (చదవండి: భారత్ ఇంధన అవసరాలను తీర్చనున్న ఇరాన్..!) -
ఇళ్ల స్థలాల పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
-
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
సొంతిల్లు భారమే.. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
ధరలు పైపైకి... హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది. ..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు. సొంతంగా కట్టుకుందామన్నా.. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా? బ్రాండ్ హైదరాబాద్‌గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి. ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు. అపార్ట్మెంట్లపై ప్రభావం ఇదీ.. ► హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్‌మెంట్‌కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్‌లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు. ► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి. ► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. ► జనగామలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి. ► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్‌వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ► కరీంనగర్‌లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది. ► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు. ► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది. -
దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్
సామాన్యుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రముఖ ప్రాపర్టీ సంస్థ అనరాక్ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం గతేడాది మనదేశానికి చెందిన 7 ప్రధాన నగరాల్లో 71 శాతం ఇళ్ల అమ్మకాలు జరగ్గా..మొత్తం 2,36,530 యూనిట్ల ఇళ్ల సేల్స్ జరిగాయని తెలిపింది. 2019లో 2,61,358 యూనిట్లు, 2020లో 1,38,350 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు అనరాక్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. పండగ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది అనరాక్ డేటా ప్రకారం..ఫెస్టివల్ సీజన్, పలు బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీరేట్లు తగ్గిస్తూ భారీ ఆఫర్లు ప్రకటించాయి. అప్పటికే సొంతింటి కోసం దాచుకున్న డబ్బులు, బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించడంతో.. ఔత్సాహికులు భారీ ఎత్తున ఇళ్లను కొనుగోలు చేశారు. దీంతో నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 2020 కంటే 2021లో 39శాతం ఇళ్లు భారీ ఎత్తున అమ్ముడయ్యాయి. అనరాక్ వార్షిక డేటా ►అనరాక్ వార్షిక డేటా ప్రకారం..ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 2021లో 72 శాతం పెరిగి 76,400 యూనిట్లకు చేరాయి,అంతకుముందు సంవత్సరంలో 44,320 యూనిట్లు ఉన్నాయి. ►హైదరాబాద్‌లో విక్రయాలు 2020లో 8,560 యూనిట్ల నుంచి దాదాపు 3రెట్లు పెరిగి 25,410 యూనిట్లకు చేరుకున్నాయి. ►ఢిల్లీ-ఎన్సీఆర్లో అమ్మకాలు 2020లో 23,210 యూనిట్ల నుండి 2021లో 73శాతం పెరిగి 40,050 యూనిట్లకు చేరుకున్నాయి. ►పుణేలో ఇళ్ల అమ్మకాలు 2020లో 23,460 యూనిట్ల నుండి 2021లో 53శాతం పెరిగి 35,980 యూనిట్లకు పెరిగాయి. ►బెంగళూరులో 2020లో 24,910 యూనిట్ల నుండి 2021లో 33,080 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. ►చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 2020లో 6,740 యూనిట్ల నుంచి 2021లో 86శాతం పెరిగి 12,530 యూనిట్లకు చేరుకున్నాయి. ►కోల్‌కతాలో 2020లో 7,150 యూనిట్ల నుంచి 2021లో 13,080 యూనిట్లకు పెరిగాయి. ఈ సందర్భంగా అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ..2022లో ఇళ్ల అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్,సప్లై చైన్ సమస్యలు ప్రాపర్టీ ధరలు 5-8 శాతం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: హాట్ కేకుల్లా..! హైదరాబాద్‌లో ఎక్కువగా ఇళ్లు అమ్ముడవుతున్న ప్రాంతాలివే! -
ధరల్లో తగ్గేదేలే..! హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు, వరల్డ్ వైడ్‌గా..
కోవిడ్ కారణంగా సామాన్యుల్లో సొంతిల్లు కొనుగోలు చేయాలని కోరిక పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో గృహాల కొనుగోళ్లు, అదే సమయంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ మూడో త్రైమాసికానికి సంబంధించి ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో సైతం ఇదే విషయం వెల్లడైంది. అంతేకాదు గృహాల ధరల పెరుగుదలలో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 128వ స్థానంలో ఉంది. భారతీయ నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది. ఏడాదిలో భాగ్యనగరిలో ఇళ్ల ధరలు 2.5 శాతం అధికం అయ్యాయి. నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. చెన్నై 131, కోల్‌కత 135, అహ్మదాబాద్ 139వ స్థానంలో ఉంది. ఈ మూడు నగరాల్లో ఇళ్ల ధరలు 0.4–2.2 శాతం పెరిగాయి. బెంగళూరు 140, ఢిల్లీ 142, పుణే 144, ముంబై 146 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఈ నగరాల్లో ధరలు 0.2–1.8% తగ్గాయి. జాబితాలో టర్కీలోని ఇజ్మీర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కొత్త ఇల్లు కొనే ముందు.. ఈ 3/20/30/40 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోండి? -
ఎక్కడికి పోవాలి? 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం
పరవాడ: కూలి పనులు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొస్తూ పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న తమ కుటుంబాలను ఉన్నట్టుండీ ఖాళీ చేసి పొమ్మంటే తమ గతేమిటని దేశపాత్రునిపాలెం సమీపంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్థలంలో తలదాచుకొంటున్న వలస కూలీలు వాపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు 20 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంటు, పరిసర ప్రాంతాల్లో దొరికే కూలి పనుల కోసం వచ్చాయి. సాయినగర్ కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలన్నీ భార్యాభర్తలు కష్టించి పనిచేస్తే తప్ప పొట్ట గడవడం కష్టం. కొందరు స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనులు చేస్తుండగా మరికొందరు భవన నిర్మాణం పనులు, మట్టి పనులకు వెళుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న వలస కూలీలను ఖాళీ చేసి వెళ్లి పొమ్మని కొంత కాలం నుంచి పవర్ గ్రిడ్ అధికారులు ఆదేశిస్తుండడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పవర్ గ్రిడ్ యాజమాన్యం తమకు పునరావాసం కల్పించి గుడిసెల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే చొరవ: వసల కూలీల సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఇటీవల పవర్ గ్రిడ్ అధికారులతో మాట్లాడారు. అప్పటినుంచి అధికారులు వత్తిడిచేయడం లేదని తెలిసింది. న్యాయం చేయాలి నేను, నా భర్త 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గరివిడి గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకొని స్టీల్‌ప్లాంటులో కూలి పనులకు వచ్చాం. తన భర్త కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. దేశపాత్రునిపాలెం సమీపంలో ఖాళీ స్థలంలో చిన్న పూరిగుడిసె నిర్మించుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. ఇంతలో పవర్ గ్రిడ్ అధికారులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి. – బోర రమణమ్మ, వలస కూలి పునరావాసం కల్పించాలి విజయనగరం జిల్లా గంట్యాడ మండల లక్కిడాం నుంచి 21 ఏళ్ల క్రితం కూలి పనులకు వచ్చి చిన్న పూరి గుడెసె నిర్మించుకొని కుటుంబంతో తలదాచుకుంటున్నాం. పునరావాసం కల్పిస్తే తప్ప గుడిసెలు ఖాళీ చేసేదిలేదు. – బండారు రమణమ్మ, వలస కూలి ప్రభుత్వమే ఆదుకోవాలి పాతికేళ్ల క్రితం గాజువాక నుంచి చిరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని పొట్టపొషించుకొంటున్నాం. ఇళ్ల పట్టాలిప్పిస్తామని కొందరు పవర్ గ్రిడ్ హోం గార్డులు తమ వద్ద ఆధార్ కార్డులు, నగదు తీసున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రçభుత్వమే ఆదుకోవాలి. – నడిపిల్లి అరుణ, చిరు వ్యాపారి -
మధ్యతరగతి ‘మేలు’పర్వతం.. రూ.480 కోట్ల విలువ చేసే కొండ ప్రాంతం
తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. మధ్యతరగతి ప్రజల సొంతిల్లు సాకారం దిశగా అడుగులు వేస్తోంది. జగనన్న స్మార్ట్ సిటీల ఏర్పాటులో భాగంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ స్థలాలను కేటాయించాలంటూ సర్కారు ఆదేశించడంతో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్(ఎంటీఎంసీ) పరిధిలోని మధ్యతరగతి ప్రజల కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానిక అధికారులతో కలసి స్థలాన్వేషణ చేపట్టారు. అనేక చర్చోపచర్చల అనంతరం కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే ఉన్న కొండను ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 33.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండను తొలచి బహుళ అంతస్తులు నిర్మించి మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను కేటాయించనున్నారు. ఈ నివాసాల్లో డబుల్, త్రిబుల్ బెడ్రూమ్లు నిర్మించేందకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. రూ.వందల కోట్ల విలువ ఈ కొండ ప్రాంతం జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎకరం భూమి విలువ రూ.15 కోట్లు పలుకుతోంది. మొత్తం 33.8 ఎకరాల విలువ రూ.480 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. బైపాస్‌రోడ్‌లో ఒక సెంటు స్థలం కొనాలంటే రూ.20 లక్షలపైన ఉంది. డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే రూ.50లక్షలపై మాటే. త్రిబుల్ బెడ్రూమ్ కొనాలంటే రూ.60లక్షలు పైనే ఉంటుంది. అదే పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు వేసే వెంచర్లలో అయితే త్రిబుల్ బెడ్ రూమ్ రూ.1.25 కోట్లు ఉంటుంది. అదే నాణ్యతతో అతి తక్కువ ధరలకు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ఇళ్లను అందజేయనుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడకు ఐదు నిమిషాల ప్రయాణ దూరంలో.. ఈ కొండకు ఆనుకుని ఒక పక్క జాతీయ రహదారి మరో పక్క ఎయిమ్స్ రహదారి ఉన్నాయి. కేవలం జాతీయ రహదారికి 500 మీటర్లు, ఎయిమ్స్ రహదారికి 25 మీటర్లు దూరం మాత్రమే ఉంది. విజయవాడకు వెళ్లాలంటే కేవలం 5 నిమిషాలు. గుంటూరు వెళ్లాలంటే 25 నిమిషాల సమయం పడుతుంది. ఇలాంటి విలువైన స్థలం కార్పొరేట్ సంస్థలకు ఇస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ.. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం కేటాయించడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిమ్స్ రోడ్ సీఆర్డీఏకు అప్పగింత.... ఇప్పటికే తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి కొండ ప్రాంతాన్ని సర్వే చేసి 33.8 ఎకరాల భూమిని సీఆర్డీడీఏకు అప్పగించారు. సీఆర్డీఏ అధికారులు అతి త్వరలోనే ఆ కొండను ఆధునిక పద్ధతుల్లో తొలచి భవనాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆరునెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని ఏపీఎంఆర్డీ అధికారులు స్పష్టంచేశారు. సర్వే పూర్తయింది జగనన్న స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన కొండ ప్రాంతం సర్వే పూర్తయింది. ఇప్పటికే స్థలం చుట్టూ బౌండరీ రాళ్లను ఏర్పాటు చేసి ఏపీఎంఆర్డీ అధికారులకు అప్పగించాం. త్వరలో వారు అక్కడ పనులను చేపట్టి ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. – శ్రీనివాసులురెడ్డి, తాడేపల్లి తహసీల్దార్ ఉద్యోగులకు ఉపయోగం మా నాన్నగారు ఉద్యోగి కావడంతో మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి కలగలేదు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల మాకు మేలు చేస్తుంది. జగనన్న స్మార్ట్ సిటీ అమల్లోకి వస్తే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని మధ్యతరగతి కుటుంబీకులకు అద్దెల బాధలు తొలగిపోతాయి. ఇక్కడ ఏ ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా రూ.6 వేల నుంచి రూ.15 వేలు చెల్లించాల్సి వస్తోంది. సంపాదించిన జీతం ఇంటి అద్దెకే కట్టాలి. ఆ ఇళ్లు వస్తే ఇక ఆ బాధ ఉండదు. – మధు, ఉండవల్లి సెంటర్ మాట నిలబెట్టుకున్న జగనన్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి బంగారు కొండ. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మధ్య తరగతి ప్రజల కోసం తాడేపల్లి కొలనుకొండలో ఇంత విలువైన స్థలం కేటాయిస్తారని కలలోనైనా ఊహించలేదు. గత ప్రభుత్వంలో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. కానీ జగనన్న అలా చేయకుండా ఎకరం రూ.15 కోట్లు ఉన్న స్థలాన్ని మధ్యతరగతి ప్రజలకు కేటాయించడం హర్షణీయం. – కత్తిక రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ, దుర్గగుడి బోర్డ్ మెంబర్ -
అందుబాటు ధరల ఇళ్లు.. రూ.45లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్ల మార్కెట్ రూ.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కనీస ప్రమాణాలకు దిగువన ఉంటున్న వారి కోసం 3.5 కోట్ల నాణ్యమైన ఇళ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో తెలిపింది. 2021 నాటికి 790 కోట్ల ప్రపంచ జనాభాలో 57 శాతం మంది (450 కోట్లు) పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ప్రస్తావించింది. దులో 29 శాతం పట్టణ జనాభా కనీస ప్రమాణాలకు నోచుకోని ఇళ్లలో ఉంటున్నట్టు నైట్‌ఫ్రాంక్ పేర్కొంది. దీంతో పట్టణాల్లో 32.5 కోట్ల ఇళ్ల అవసరం ఉందని తెలిపింది. భారత్‌లో 35 శాతం మేర పట్టణ జనాభాకు (3.5 కోట్లు) ఇళ్ల అవసరం ఉందని పేర్కొంది. 3.5 కోట్ల ఇళ్లలో 2 కోట్ల వరకు ఆర్థికంగా బలహీన వర్గాల కోసం అవసరమవుతాయని.. 1.4 కోట్ల ఇళ్లు తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం, 10 లక్షల ఇళ్లు దిగువ మధ్యతరగతి వారి కోసం అవసరమని అంచనా వేసింది. 3.5 కోట్ల ఇళ్ల నిర్మాణానికి 1,658 కోట్ల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం మొత్తం రూ.34.56 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని, భూమి, ఇతర ఆమోదాలకు మరో రూ.10.36 లక్షల కోట్లు కావాల్సి వస్తుం§దని నైట్‌ఫ్రాంక్ తన నివేదికలో వివరించింది. -
‘వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి’
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దొరబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. లక్షలాదిమంది పేదల మేలు కోసమే వన్‌టైం సెటిల్మెంట్ స్కీం తీసుకువచ్చామని తెలిపారు. వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా 67లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. పథకం అమలులో సాదకబాధకాలను కూలంకషంగా పరిశీలించాలని తెలిపారు. 1980-2011 వరకు ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాలు విడిపించుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లపై వారికే పూర్తి హక్కు వస్తుందని పేర్కొన్నారు. తమ తమ ఆస్తులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్(రిజిస్ట్రేషన్స్&ఎక్సైజ్) రజత్ భార్గవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(హౌసింగ్) అజయ్ జైన్, ప్రిన్సిపల్ సెక్రటరీ(ల్యాండ్,ఎండోమెంట్స్ &డీఎం- రెవెన్యూ) వి.ఉషారాణి, ప్రిన్సిపల్ పీఆర్&ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి (హౌసింగ్) నారాయణ్ భరత్ గుప్తా, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్ కమిషనర్ శేషగిరిరావు తదితరులు హాజరయ్యారు. -
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
-
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు ఇక్రా తెలిపింది. 68.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు విక్రయమయ్యాయి. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోని విక్రయాలతో పోలిస్తే 19 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి)లో 84.7 మిలియన్ చదరపు అడుగుల ఇళ్లు అమ్ముడుపోయాయని.. 2011–12 సంవత్సరం నుంచి చూస్తే రెండో అత్యధిక త్రైమాసికం అమ్మకాలుగా ఇక్రా తన నివేదికలో తెలిపింది. ఈ అధిక బేస్ కారణంగా.. జూన్ త్రైమాసికంలో విక్రయాల క్షీణత కనిపిస్తోందని వివరించింది. నివాస గృహాల విక్రయాలు 2020 జూన్ త్రైమాసికంలో 33.7 మిలియన్ చదరపు అడుగుల మేరే అమ్ముడుపోవడం గమనార్హం. ఆ విధంగా చూస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మంచి డిమాండ్ దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుండడం, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడం వల్ల స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి ఇళ్ల విక్రయాలు ఇంకా పుంజుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్గతంగా డిమాండ్ ఈ పరిశ్రమలో నెలకొని ఉన్నట్టు తెలిపింది. కనిష్టాల్లో రుణాల రేట్లు, కార్యాలయంతోపాటు ఇంటి నుంచి కూడా పనిచేసుకోగలిగిన వాతావరణం వల్ల ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంది. చదవండి: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు -
ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ఇళ్లలో ఉంటున్న మిల్లు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమానులు తమ మాడా ఇళ్లను ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి అనుమతినిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఈ ఇళ్లను పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ, మిల్లు కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సడలించడానికి అంగీకరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మిల్లు కార్మికులు, వారి వారసులు, కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సుమారు 56 వస్త్ర మిల్లులు ఉండేవి. రెండు దశాబ్దాల కిందటి వరకు మిల్లు కార్మికులతో ముంబై నగరం కళకళలాడేది. అయితే, 2000-2005 సంవత్సరాల మధ్య కాలంలో దశలవారీగా వస్త్ర మిల్లులన్నీ మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ తరువాత మూతపడిన మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి, చౌక ధరకే అందజేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అనేక ఆందోళనలు జరిగాయి. మిల్లు కార్మికుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. కార్మికుల డిమాండ్లకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన ప్రక్రియ పూర్తిచేసింది. లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి చౌక ధరకే వారికి ఇళ్లను అందజేసింది. అయితే, పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించరాదని, అద్దెకు కూడా ఇవ్వరాదని నిబంధనలు విధించింది. దీంతో కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అయ్యాయి. ఇక్కడ ఎక్కువ ధరకు అద్దెకిచ్చి మరోచోట తక్కువ అద్దెకు ఉందామనుకున్న అనేక పేద కుటుంబాల ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అశనిపాతంగా మారాయి. దీంతో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇళ్లను అద్దెకు ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, ఇళ్లు వచ్చిన కార్మికుల్లో కొందరు చనిపోగా, వారి కుటుంబ సభ్యులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యారు. ఉన్న ఇంటిని అమ్ముకొనైనా అప్పులు తీరుద్దామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడదామని అనుకున్న వారి ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించడానికి వీలు లేకపోవడంతో గత్యంతరం లేని అనేక మంది గుట్టుచప్పుడు కాకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ తగిన రుజువులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంతేగాక, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనికి కూడా గండి పడుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తరువాత అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినివ్వడంతో దళారుల బెడద తప్పనుంది. అధికారికంగా క్రయ, విక్రయాలు జరగడం వల్ల రిజిస్ట్రేషన్, స్టాంపు ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా ఆదాయం కూడా రానుంది. -
Aspire Spaces: మియాపూర్‌లో అమేయా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అస్పైర్ స్పేసెస్ మియాపూర్‌లో 10.18 ఎకరాల విస్తీర్ణంలో అమేయా పేరిట లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. 16.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,066 ఫ్లాట్లుంటాయి. 9 బ్లాక్‌లలో స్టిల్ట్+13 అంతస్తులలో నిర్మాణం ఉంటుంది. 1,210 చ.అ. నుంచి 1,940 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. హెచ్ఎండీఏ, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.4,849. డిసెంబర్ 2024 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని అస్పైర్ స్పేసెస్ ఎండీ టీవీ నర్సింహా రెడ్డి చెప్పారు. అమేయా ప్రాజెక్ట్‌కు ఆర్టి్కటెక్ట్గా జెన్సెస్ కంపెనీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ నిర్వహిస్తుంది. ల్యాండ్‌స్కేపింగ్‌ను టెర్రా ఫర్మా చేస్తుంది. 30కి పైగా ఆధునిక వసతులు.. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 50 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్‌తో పాటు 30కి పైగా ఆధునిక వసతులుంటాయి. పిల్లల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ కోసం డే కేర్ అండ్ ఎన్రిచ్మెంట్ సెంటర్లు ఉంటాయి. యోగా, మెడిటేషన్ చేసుకోవటం కోసం ఆక్సిజన్ డిసిగ్నేటెడ్ స్పేసెస్, బిల్డింగ్ పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సెంటల్ కోర్ట్ యార్డ్ ల్యాండ్‌స్కేపింగ్, ఇండోర్ మరియు ఔట్‌డోర్ జిమ్ ఏర్పాట్లుంటాయి. మల్టీపర్పస్ బాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, మినీ థియేటర్, కల్చరల్ సెంటర్, స్పా, సెలూన్ పార్లర్, కాఫీ షాప్, గ్రాసరీ స్టోర్ ఉంటుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్వా్కష్ కోర్ట్ వంటివి ఉంటాయి. జాగింగ్ ట్రాక్, రెఫ్లెక్సాలజీ పాత్ ఉంటుంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన వర్క్ స్టేషన్స్ ఉంటాయి. 24 గంటలు వైఫై అందుబాటులో ఉంటుంది. కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ రూమ్స్ ఉంటాయి. లొకేషన్ హైలైట్స్.. మియాపూర్ మెట్రో స్టేషన్‌కి 5 నిమిషాలు దూరంలో అమేయా ప్రాజెక్ట్ ఉంటుంది. హైటెక్‌సిటీ 10 కి.మీ., ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు చేరువలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, సెనీటా గ్లోబల్ స్కూల్, కెన్నిడీ గ్లోబల్ స్కూల్, సాన్ఫోర్డ్ గ్లోబల్ స్కూల్, సిల్వర్ ఓక్స్ వంటి పాఠశాలలున్నాయి. ఎస్ఎల్జీ హాస్పిటల్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్, ల్యాండ్‌మార్క్ ఆసుపత్రి, అంకురా హాస్పిటల్, రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రులు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్నాయి. జీఎస్ ఎం మాల్, మంజీరామాల్, ఫోరం మాల్, శరత్ క్యాపిటల్ మాల్, ఐకియా వంటివి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి. -
కోలుకునేది రెండేళ్ల తర్వాతే
సాక్షి, హైదరాబాద్: దేశీయ నివాస విభాగం 2023లో తారా స్థాయికి చేరుకుంటుంది. 3.17 లక్షల గృహాల విక్రయాలు, 2.62 లక్షల లాంచింగ్స్ జరుగుతాయి. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 1.8 లక్షలకు చేరుతాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటం, స్టాక్ మార్కెట్ వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలు వంటివి ఈ వృద్ధికి కారణాలని తెలిపింది. కొనుగోలుదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, సాంకేతికత, డిజిటల్ మార్కెటింగ్, వినూత్న వ్యాపార పద్ధతులు దేశీయ నివాస రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో గతేడాది 1,38,344 యూనిట్లు విక్రయమయ్యాయని.. ఈ ఏడాది 1,79,527లకు పెరుగుతాయి. డిమాండ్ మాత్రం కరోనా పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. 2019లో అమ్మకాలు 2,61,358 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 2,64,625 యూనిట్లు, 2023లో 3,17,550 గృహాలు విక్రయం అవుతాయని అంచనా వేసింది. 2017 నుంచి వృద్ధి.. నివాస విభాగం 2017 నుంచి ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2019 నాటికి తారా స్థాయికి చేరింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020లో డీలా పడింది. గతేడాది రెండో అర్ధ భాగం నుంచి కాస్త మెరుగైన ప్రతిభను కనబర్చినప్పటికీ ఆశించిన స్థాయికి చేరలేదు. 2020లో గృహాల విక్రయాలు 1.38 లక్షలు, లాంచింగ్స్ 1.28 లక్షలకు తగ్గాయి. ఈ ఏడాది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గృహాల సప్లయ్ 35 శాతం, విక్రయాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. 2019తో పోలిస్తే మాత్రం సప్లయ్ 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సప్లయ్ కంటే సేల్స్ ఎక్కువ.. వ్యాక్సినేషన్ వేగవంతం కావటంతో 2023 నాటికి రియల్టీ మార్కెట్ పీక్ దశకు చేరుతుంది. 2019తో పోలిస్తే విక్రయాలలో 22 శాతం, సప్లయ్‌లో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2014–16లో గృహాల సప్లయ్ 11,85,000 ఉండగా.. విక్రయాలు 8,90,500లుగా ఉన్నాయి. సేల్స్/సప్లయ్ నిష్పత్తి 0.75 శాతంగా ఉంది. అదే 2017–19 నాటికి సప్లయ్ 5,78,,700 ఉండగా.. అమ్మకాలు 7,20,800లకు పెరిగాయి. నిష్పత్తి 1.25 శాతానికి వృద్ధి చెందింది. నగరంలో సేల్స్ 6 శాతం.. 2023లో జరిగే సేల్స్, లాంచింగ్స్ రెండింట్లోనూ ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో ఉంటాయి. ముంబై సేల్స్‌లో 28 శాతం, లాంచింగ్స్‌లో 30 శాతం వాటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు అమ్మకాలలో 20 శాతం, ప్రారంభాలలో 17 శాతం, ఎన్సీఆర్ వరుసగా 18 శాతం, 15 శాతం, పుణే 15 శాతం, 18 శాతం, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ నగరాలు విక్రయాలలో 6 శాతం, లాంచింగ్స్‌లో 8 శాతం వాటాలను సొంతం చేసుకుంటాయి. -
డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి ఆశావహంగా లేవని పేర్కొంది. ఢిల్లీలో అత్యధికం .. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి. -
లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రతి 20 ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఓ మండల స్థాయి అధికారిని నియమించామన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనమండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు మొదటి వారం నుంచి నియోజకవర్గాలవారీగా పర్యటించి.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో డ్రెయినేజీలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు, రోడ్లతో పాటు ఉపాధి కల్పన యూనిట్లు స్థాపించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణాæత్మకమైన సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
డిమాండ్ తగ్గింది, దేశంలో 76% పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని వదలట్లేదు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ2)లో గృహ విక్రయాలు 76 శాతం క్షీణించాయి. జనవరి–మార్చి (క్యూ1)లో 66,176 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 15,968 యూనిట్లకు తగ్గాయని హౌసింగ్ బ్రోకరేజ్ కంపెనీ ప్రాప్‌టైగర్ ‘రియల్ ఇన్సైట్’ రిపోర్ట్ తెలిపింది. గతేడాది క్యూ2తో పోలిస్తే 16 శాతం తగ్గుదల కనిపించిందని పేర్కొంది. త్రైమాసికం ప్రాతిపదికన దేశంలోని అన్ని ప్రధాన నగరాలల్లో హౌసింగ్ సేల్స్ తగ్గగా.. వార్షిక లెక్కన మాత్రం కొన్ని నగరాలల్లో వృద్ధి నమోదయిందని ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఈఓ ధ్రవ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్‌లో 2021 క్యూ1లో 7,721 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ2 నాటికి 2,429 యూనిట్లకు, అలాగే అహ్మదాబాద్‌లో 4,687 నుంచి 1,282లకు, బెంగళూరులో 7,431 నుంచి 1,591లకు , ఢిల్లీ–ఎన్సీఆర్లో 6,188 నుంచి 2,828లకు, చెన్నైలో 4,468 నుంచి 709లకు, కోల్‌కతాలో 3,382 నుంచి 1,253లకు, ముంబైలో 18,574 నుంచి 3,381లకు, పుణేలో 13,725 నుంచి 2,495 యూనిట్లకు పడిపోయాయి. ఈ ఏడాది క్యూ2లో చాలా వరకు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడం, ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో గృహాల సరఫరా, డిమాండ్ రెండింట్లోనూ ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో జూన్ ప్రారంభం నుంచి విక్రయాలలో కదలిక మొదలైందని ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
మనం నివసించేలా పేదల ఇళ్లు : సీఎం జగన్
పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. ప్రతి పనిలో పారదర్శకతను, నాణ్యతను దృష్టిలో ఉంచుకోండి. నాణ్యత విషయంలో రాజీ పడితే, ఇబ్బందులు వస్తాయి. ఈ కాలనీల్లో వాణిజ్య కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలి. సమర్థవంతమైన ప్రణాళికతో ముందుకుసాగాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతాం. పనిలో డూప్లికేషన్ ఉండకూడదు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మనం ఆ ఇళ్లలో ఉండాలనుకుంటే ఎలా ఉండాలనుకుంటామో అలా ఆలోచించి, పేదల ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇళ్ల స్థలాలు, నిర్మాణం, మౌలిక సదుపాయాల రూపేణ సుమారు రూ.86 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఒక్క మౌలిక సదుపాయాలకే సుమారు రూ.34 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు 13 జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జాయింట్ కలెక్టర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల ఇళ్ల నిర్మాణాల్లో తీసుకోవాల్సిన చర్యలపై వారికి మార్గ నిర్దేశం చేశారు. మీరంతా యువత, మంచి ప్రతిభ ఉన్న వారని.. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం కింద పేదలకు మేలు జరిగేలా వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ‘మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో గతంలో ఎప్పుడూ ఇళ్లు కట్టలేదు. దేశం మొత్తం ఇప్పుడు మనవైపు చూస్తోంది. 28.30 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.17 వేలకు పైగా లే అవుట్లలో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం. కొన్ని లే అవుట్లు.. మునిసిపాల్టీల సైజులో ఉన్నాయి. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. అధికారులంతా ఈ పథకం అమలు కోసం విశేషంగా పని చేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో సామాజిక తనిఖీ చేసి, అర్హులైన వారందరికీ శాచ్యురేషన్ పద్ధతిలో స్థలాలు ఇవ్వగలుగుతున్నాం. పెన్షన్లు, ఇంటి పట్టాలు, రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ.. రెగ్యులర్‌గా సామాన్య జనంతో లింకైన అంశాలు. అందువల్ల అర్హులైన పేదలందరికీ ఇవి అందేలా మనం చొరవ చూపాలి’ అని అన్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి అర్హులైన వారికి కచ్చితంగా అనుకున్న సమయంలోగా పట్టా ఇవ్వాలి. అవినీతి, పక్షపాతం లేకుండా, వివక్షకు తావులేకుండా ఇంటి పట్టాలు అందాలి. అర్హులు 100 మంది ఉంటే.. 10 మందికి ఇచ్చే పరిస్థితి ఎప్పుడూ ఉండకూడదు. నిర్ణీత సమయంలోగా వీటికి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించి ప్రయోజనం కల్పించాలి. ఎవరైనా మిగిలిపోతే.. వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందాలి. వారి పేరు మీద కనీసం ఇంటి స్థలం రిజిస్టర్ చేసినట్లవుతుంది. ఇలా ఇళ్లపట్టాలు అందుకున్న వారికి ప్రతి ఏటా ఇళ్లు కూడా ఇవ్వాలి. ఇంటి స్ధలం, ఇళ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా కనీసం రూ.5 లక్షల రూపాయల ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతున్నాం. అది కూడా మహిళల పేరుమీద ఇస్తున్నాం. లబ్ధిదారులకు ఇప్పటికే స్థలం కేటాయింపు పూర్తైంది. నిర్ణీత సమయంలోగా ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో ఇది ఆగే ప్రక్రియ కాదు. మిగిలిన 12.70 లక్షల ఇళ్లు కూడా పూర్తి కావాలి. మురికి వాడలుగా మారకూడదు ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పాటవుతున్న కాలనీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మురికి వాడలుగా మారకూడదు. అక్కడ మంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి. వివిధ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ముత్యాలరాజు, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా హాజరయ్యారు. చదవండి: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు ఖాయం ఏపీకి మరో 9 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు రాక -
రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ఉపాధి కల్పనలో 11 శాతం వాటాతో ఎకానమీలో రియల్ ఎస్టేట్ కీలకమైన రంగంగా ఉంటోందని ఆయన వివరించారు. ‘2019–20లో జీడీపీలో రియల్టీ రంగం వాటా దాదాపు 7 శాతం. సుమారు 200 బిలియన్ డాలర్ల మేర వృద్ధికి దోహదపడింది. 2030 నాటికి ఎకానమీ 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో సుమారు 10 శాతం వాటా రియల్ ఎస్టేట్ నుంచి రానుంది. అంటే.. 2030 నాటికి ఈ రంగం 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని దాటేయవచ్చని అంచనాలు ఉన్నాయి‘ అని మిశ్రా వివరించారు. ఉపాధి కల్పన విషయంలోనూ రియల్టీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. 50 కోట్ల ఉద్యోగాల్లో దాదాపు 5.5 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. రియల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్‌కామ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), పరిశ్రమ సమాఖ్య నారెడ్కో కలిసి రూపొందించిన ఇళ్ల ధరల సూచీని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మిశ్రా ఈ విషయాలు వివరించారు. గత ఏడేళ్లుగా రియల్టీ రంగం గణనీయ మార్పులకు లోనైందని రెరా చట్టం ఇందులో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమలవుతోందన్నారు. హైదరాబాద్ సహా 8 నగరాల్లో.. హౌసింగ్‌డాట్‌కామ్, ఐఎస్బీలోని శ్రీని రాజు సెంటర్ ఫర్ ఐటీ అండ్ నెట్వర్క్డ్ ఎకానమీ (ఎస్ఆర్ఐటీఎన్ఈ) రూపొందించిన సూచీ (హెచ్పీఐ).. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడగలదని మిశ్రా తెలిపారు. దీన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ తరుణంలో కొనుక్కోవచ్చన్న విషయంలో కొనుగోలుదారులు, ఎప్పుడు విక్రయించుకుంటే శ్రేయస్కరమో అటు విక్రేతలు తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. ఆయా నగరాల్లో అమ్ముడైన యూనిట్లు, ధరలకు సంబంధించిన నెలవారీ నివేదికలు ఇందులో ఉంటాయి. రియల్టీ రంగంలో ధోరణులను విధానకర్తలు, ఆర్థికవేత్తలు తెలుసుకునేందుకు కూడా ఈ సూచీ ఉపయోగపడనుంది. హౌసింగ్‌డాట్‌కామ్ అనుబంధ సంస్థ ప్రాప్‌టైగర్ ఇప్పటికే డిమాండ్,సరఫరా, ధరలు, అమ్ముడు కాకుండా ఉన్న ఇళ్ల డేటాను మూణ్నెల్లకోసారి అందిస్తోంది. -
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్‌లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
ఇళ్ల నిర్మాణంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : జూన్ 1 నుంచి జగనన్న కాలనీల్లో పనులు ప్రారంభించాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం చేయకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, కార్మికులకు పని దొరుకుతుందని చెప్పారు. స్టీల్, సిమెంట్..ఇతర మెటీరియల్ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయన్నారు. బుధవారం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు ఆగకూడదు: జగనన్న కాలనీలలో జూన్ 1న పనులు ప్రారంభించాలి. ఆ మేరకు ఈనెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆ పనులేవీ ఆగకూడదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు. ఇళ్ల నిర్మాణానికి నీరు, విద్యుత్ అవసరం కాబట్టి, వెంటనే ఆ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి లేఅవుట్లో మోడల్ హౌజ్ తప్పని సరి : ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక మోడల్ హౌజ్ నిర్మించాలి. ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదిక కూడా తెప్పించుకోవాలి. ఎక్కడైనా నిర్మాణ వ్యయం అంచనాను మించి పోయిందా? ఇంకా ఎక్కడైనా వ్యయాన్ని నియంత్రించవచ్చా? ఇంకా బాగా ఇంటి నిర్మాణం ఎలా చేయొచ్చు.. వంటి అంశాలను ఆ నివేదిక ఆధారంగా సమీక్షించాలి. స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ వినియోగం తగ్గుతుంది. దాని వల్ల రేట్లలో తేడా వచ్చే వీలుంది. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీలు తమ ఉత్పత్తిలో భాగంగానే, ఆక్సీజన్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఉత్పత్తి ఆగదు. మనకు 7.50 లక్షల టన్నుల స్టీల్ కావాలి. కాబట్టి స్టీల్ కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఎవరైనా సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే అస్సలు కాదనవద్దు. వారికి కావాల్సిన మెటీరియల్ తప్పనిసరిగా అందించాలి. అన్ని వసతులు ఉండాలి : కేవలం ఇళ్లు నిర్మించడమే కాదు, అక్కడ తగిన మౌలిక వసతులు కల్పించాలి. అలాగే లేఅవుట్ కూడా పక్కాగా ఉండాలి. సీసీ రోడ్డు, భూగర్భ సీసీ డ్రెయిన్లు, నీటి సరఫరా (జెజెఎం), విద్యుద్దీకరణ, ఇంటర్నెట్.. మౌలిక వసతుల్లో ముఖ్య కాంపోనెంట్స్. కరెంటు, నీటి సరఫరాతో పాటు, రోడ్లు కూడా నిర్మించాలి. అవి లేకపోతే ఆ ఇళ్లలోకి ఎవరూ రారు. ఆర్థిక వృద్ధి కాబట్టి..: కోవిడ్ సమయంలో ఈ ఇళ్ల నిర్మాణం ఆర్థిక వృద్ధికి దోహదం చేయనుంది. ఎందుకంటే కార్మికులకు పని దొరుకుతుంది. అలాగే స్టీల్, సిమెంట్, ఇతర మెటేరియల్ కొనుగోలు వల్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. కాబట్టి దీనికి చాలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్ అన్నది చాలా ముఖ్యం. దాదాపు 1.95 లక్షల ప్లాట్లకు ఈ సమస్య ఉంది. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థదే : భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్ వ్యవస్థదే. ఒక్కసారి వేసిన తర్వాత పెద్దగా సమస్యలు కూడా ఉండవు. నీటి పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్లు, ఇతర కేబుళ్లు కూడా భవిష్యత్తులో పూర్తిగా భూగర్భంలోనే వేయబోతున్నారు. అయితే ఆ పనులు చేసేటప్పుడు లోతు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కేబుళ్ల మధ్య దూరం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. అన్ని పనులు ఒకే ఏజెన్సీకి: జగనన్న కాలనీ లేఅవుట్లలో సీసీ రోడ్లు, నీటి సరఫరా, విద్యుద్దీకరణ, భూగర్భ ఇంటర్నెట్, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పనులు. అయితే ఇవన్నీ వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఒకే ఏజెన్సీకి అన్ని పనులు అప్పగించాలి. ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించండి. పనుల్లో డూప్లికేషన్ ఉండకూడదు, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించండి అదనపు ఫండింగ్ కోసం..: ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి, కేంద్రం నుంచి అదనంగా నిధులు కోరుదాం. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఎలాగూ వాటా ఇస్తోంది. ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇళ్లు నిర్మిస్తుంది కాబట్టి, అదనపు నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేద్దాం. ఇంకా, టిడ్కో ఇళ్లపై పెయింటింగ్స్ తప్పనిసరిగా వేయాలి. వాటిని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. -
Hyderabad Real Estate: ఎవరు రియల్ డెవలపర్
ఒకవైపు రోజువారీ నిత్యావసర ఖర్చులు మోస్తూనే.. మరోవైపు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, ఆదాయ పన్నులను భరించి ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవటం కొనుగోలుదారులకు కష్టమే. ఆకాశాన్నంటిన భూముల ధరలు, నిర్మాణ అనుమతులు, బ్యాంక్ వడ్డీలు, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు, రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక నాయకుల ఒత్తిళ్లు.. వీటన్నింటినీ దాటుకొని ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం డెవలపర్‌కు సవాలే... ఇలా నిజమైన కొనుగోలుదారులు, డెవలపర్లకు మధ్యలో రాత్రికి రాత్రే ప్రాజెక్ట్‌లను ప్రారంభించేసి.. అడ్డదారిలో విక్రయాలు చేస్తూ రియల్టీ మార్కెట్లో కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తున్నారు కొందరు తాత్కాలిక బిల్డర్లు. సాక్షి, హైదరాబాద్: బూమ్ ఉందంటే చాలు ఇన్వెస్టర్లే కాదు డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు, బ్యూరోక్రాట్స్, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ పెట్టుబడులు పెట్టి మార్కెట్లో డిమాండ్‌ను సృష్టిస్తుంటారు. ప్రతి ఏటా 15–20 శాతం ధరలు పెరగడం ఆరోగ్యకరమైన వృద్ధి. అలాకాకుండా అబ్నార్మల్గా పెరిగితే మాత్రం అది బూమ్. ఇది ప్రభుత్వ అభివృద్ధి ప్రకటనలు, భవిష్యత్తు ప్రాజెక్ట్‌లను, ప్రాంతాలను బట్టి పెరుగుతుంటుంది. రియల్టీ బూమ్ ఇన్వెస్టర్లు ఉన్నంత కాలమే ఉంటుంది.. ఒక్కసారి ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోగానే బద్దలైపోతుంది. ఇదేమీ కొత్తకాదు. 2008లో వచ్చిన రియల్టీ బూమ్ ఇలాంటిదే. 2015–16 వరకు కోలుకోలేదు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ హైదరాబాద్ డెవలపర్లు ధైర్యంగా, బలంగా నిలబడటానికి కారణం నిజమైన కొనుగోలుదారులు తోడుగా నిలవటమే. ప్రతి సంవత్సరం నగరంలో 25 వేల గృహాలు విక్రయం అవుతుంటాయి. ఇదే స్థాయిలో లాంచింగ్స్ కూడా ఉంటాయి. కొనేవాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో.. గృహాల సప్లయి కూడా అదే స్థాయిలో ఉంటుంది. పొలిప్రెన్యూర్ అయితేనే.. పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నలాజికల్, ఎన్విరాన్మెంటల్, లీగల్... ఈ వ్యాపారం చేయాలన్నా ఉండాల్సిన ప్రధాన అంశాలివే. ఆయా అంశాలలో తెలంగాణ బలంగా ఉండటం వల్లే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌లా కాకుండా పొలిప్రెన్యూర్‌గా ఉంటేనే రాణించగలమని కిస్మత్‌పూర్‌కు చెందిన ఓ డెవలపర్ తెలిపారు. పొలిటికల్ కనెక్షన్స్ బాగా ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌ను పొలిప్రెన్యూర్స్ అంటారు. సాధారణ డెవలపర్లు చెప్పులు అరిగేలా తిరిగినా పరిష్కారంకాని సమస్యలన్నీ పొలిప్రెన్యూర్స్కు మాత్రం కూర్చున్న చోటే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. భూమి అగ్రిమెంట్ చేసుకున్న రోజు నుంచి ప్రాజెక్ట్‌ను మార్కెట్లోకి తెచ్చే వరకు సుమారు మూడేళ్ల సమయం పడుతుంది. ఈ కాలంలో వడ్డీ భారం డెవలపర్లదే. తీరా లాంచింగ్ చేశాక మార్కెట్ ప్రతికూలంలో ఉంటే మరింత భారమే. డెవలపర్లలో పోటీ భయం నెలకొంది.. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ఇప్పుడు కొనకపోతే ముందుముందు కొనలేమనే భయం ఎలాగైతే కొనుగోలుదారుల్లో ఉందో.. అలాగే కొత్త డెవలపర్లే పెద్ద ప్రాజెక్ట్‌లు చేసి మార్కెట్‌ను క్యాష్ చేసుకుంటుంటే మనం వదలుకుంటున్నామనే భయం సీనియర్ డెవలపర్లలో నెలకొంది. ప్రీలాంచ్లో విక్రయాలు, యూడీఎస్ బుకింగ్స్ చేస్తూ అడ్డదారులలో కొందరు డెవలపర్లు మార్కెట్‌ను పాడు చేస్తుంటే.. న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తూ, కొనుగోలుదారులు సొంతిల్లు కలను నిజం చేస్తున్న డెవలపర్లకు సమస్యలు వస్తున్నాయి. దీంతో డెవలపర్లు మానసికంగా నలిగిపోతున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కొనేముందు ఇవి చూడాలి.. ► ఎంపిక చేసిన ప్రాజెక్ట్ గురించి న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. ► ఎన్ని బ్యాంక్‌ల నుంచి ప్రాజెక్ట్లోన్ తీసుకున్నారు. ► హెచ్ఎండీఏ, లోకల్ బాడీ, ఫైర్, ఎన్విరాన్మెంటల్, ఎయిర్పోర్ట్ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులున్నాయా? లేవా? రెరాలో నమోదు చేశారా లేదా చూసుకోవాలి. ► ప్రాజెక్ట్‌ను కట్టే ఆర్థిక స్తోమత నిర్మాణ సంస్థకు ఉందా? లేదా? ► బిల్డర్‌కు నిర్మాణ రంగంలో సాంకేతిక అనుభవం ఉందా లేదా చూసుకోవాలి. ► నిర్మాణ సంస్థ విలువలు, డెవలపర్ గత చరిత్ర గురించి ఆరా తీయాలి. ► ప్రాజెక్ట్ నాణ్యత, గడువులోగా పూర్తవుతుందా లేదా పరిశీలించాలి. ► ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? సోషల్ ఇన్ఫ్రా ఎలా ఉందో గమనించాలి. -
రూ.5 లక్షల కోట్లు దాటిన ఎస్బీఐ గృహ రుణ వ్యాపారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లను దాటింది. రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం గడచిన పదేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగిందని బ్యాంక్ బుధవారం తెలిపింది. 2011లో ఈ విభాగానికి సంబంధించి ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించిందని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. 2012లో రూ. లక్ష కోట్ల పోర్ట్‌ఫోలియోతో ఒక ప్రత్యేక ఆర్‌ఈహెచ్‌బీయూ విభాగం ప్రారంభమైంది. అచంచల విశ్వాసానికి నిదర్శనం బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసం అచంచలంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనమని బ్యాంక్ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు వినియోగిస్తున్న సాంకేతికత, అలాగే వ్యక్తిగత సేవలు కారణమని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యాధునిక సమ్మిళిత వేదిక– రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటని తెలిపారు. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇదని పేర్కొన్నారు. -
బౌన్స్ బ్యాక్.. దక్షిణాది నగరాలే టాప్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది. దక్షిణాది నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు ఈ రంగం రికవరీలో బ్యాక్‌బోన్‌గా నిలబడుతున్నాయని మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్స్ సర్వీసెస్ సర్వే తెలిపింది. ఈ నగరాల్లోని గృహ యజమానులు సీరియస్ విక్రయదారులుగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ► గృహాల విక్రయాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చెన్నై, పుణే, ముంబై నగరాలు ఉన్నాయి. సులభమైన రవాణా, మెట్రో కనెక్టివిటీ మెరుగ్గా ఉండటమే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాపరీ్టల విక్రయాల పెరుగుదలకు ప్రధాన కారణాలని తెలిపింది. సరసమైన గృహాలతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపర్టీల మీదే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ► 500ల కంటే ఎక్కువ నగరాల్లో ఓనర్ సర్వీసెస్ సేవలను వినియోగించుకుంటున్నారు. జనాభా పరంగా చూస్తే.. మ్యాజిక్‌బ్రిక్స్ ఓనర్ సర్వీస్ వినియోగదారుల్లో 80 శాతం పురుషులు, 20 శాతం మహిళలు కస్టమర్లుగా ఉన్నారు. 50 శాతం మంది కస్టమర్లు 40–45 ఏళ్ల పైబడిన వాళ్లే ఉన్నారు. 60 శాతం మంది యూజర్లు వేతనజీవులు కాగా.. 30 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నవాళ్లని రిపోర్ట్ తెలిపింది. 55 శాతం ఓనర్ సరీ్వసెస్ వినియోగదారులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల వాళ్లేనట. ► తక్కువ ధరలు, రాష్ట్ర ప్రభుత్వాలు, డెవలపర్ల వివిధ పథకాల ప్రయోజనాలతో కొనుగోలుదారులు తమ చిన్న ఇళ్లను విక్రయించేసి.. వాటి స్థానంలో పెద్ద సైజు గృహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా కస్టమర్లకు కలిసొచ్చే అంశం. విక్రయదారులు అధిక లిక్విడిటీ కోసం ప్రాపర్టీలను దీర్ఘకాలం పాటు హోల్డింగ్‌లో పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కరోనా మహమ్మారితో చాలా మంది గృహ యజమానులు తమ ప్రాపరీ్టల విక్రయానికి డిజిటల్ రూపంలో విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ► గృహ యజమానులకు తమ ప్రాపర్టీల కోసం అద్దెదారులను వెతకటంతో పాటు ఆయా ప్రాపరీ్టలను విక్రయించే సేవలను కూడా అందిస్తుంది. గృహ యజమానులకు సులభంగా ప్రాపరీ్టలను విక్రయించేందుకు ఓనర్ సరీ్వసెస్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రొఫెషనల్ ఫొటో షూట్, ప్రాపర్టీ కంటెంట్ వివరణ, ఆన్లైన్ జాబితాలు, కస్టమర్ల ఆకర్షణ, రిలేషన్షిప్ మేనేజర్స్‌తో డీల్స్‌ను క్లోజ్ చేయడం వంటి ఎండ్ టు ఎండ్ సేవలను అందిస్తుంది. ఆయా సేవల ప్యాకేజీల ధరలు రూ.2,599–5,999 మధ్య ఉన్నాయి. చదవండి: అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ -
అందుబాటు గృహాలపై ఎన్నారైల ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్టీ మార్కెట్లో ప్రవాస భారతీయులు చాలా ముఖ్యమైనవాళ్లు. వాణిజ్య, నివాస సముదాయాల వృద్ధిలో ఎన్నారైలే కీలకం. మరీ ప్రత్యేకించి అఫర్డబుల్ గృహాల విభాగంలో పెట్టుబడులకు ఎన్నారైలు విపరీతమైన ఆసక్తిలో ఉన్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ‘బడా నిర్మాణ సంస్థలు, బ్రాండ్ డెవలపర్లు అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను చేపడుతుండటం ఎన్నారైల విశ్వసనీయ పెట్టుబడులకు హామీలను అందిస్తున్నాయి. మరోవైపు లగ్జరీ, ఇతరత్రా గృహాల అద్దెల కంటే అఫర్డబుల్ ఇళ్ల రెంట్స్ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండటం ఎన్నారైలకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయని’ ఆయన వివరించారు. అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లకు ఏడాది పాటు ట్యాక్స్ హాలిడే పొడిగింపుతో ఎన్నారైలతో పాటు దేశీయ కొనుగోలుదారులకు సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌ల ధరలు కూడా అదుపులో ఉంటాయి. ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కొత్త గృహాల సప్లయిలో 35 శాతం అఫర్డబుల్ హౌసింగ్సే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఎన్నారైల రియల్టీ పెట్టుబడులు చాలావరకు క్షీణించాయి. చాలా దేశాల్లో పరిస్థితులు క్రమంగా మెరుగవుతుండటం అఫర్డబుల్ రియలీ్టకి కలిసొచ్చే అంశం. చదవండి: సొంతిల్లు కొనేందుకు వయసూ ముఖ్యమే! బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ -
బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్ట్లీ
సాక్షి, హైదరాబాద్: గృహాల ధరల్లో బెంగళూరు కంటే హైదరాబాదే చాలా కాస్లీ. పదేళ్లలో రెండు నగరాల మధ్య నివాస ధరల్లో తేడాలొచ్చేశాయి. 2010లో బెంగళూరులో 48 శాతంగా ఉన్న అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్.. 2020 నాటికి 28 శాతానికి తగ్గింది. అదే హైదరాబాద్‌లో దశాబ్ద క్రితం 47 శాతంగా ఉండగా.. ఇప్పుడది 31 శాతానికి తగ్గింది. ఇక దేశంలోనే అత్యంత సరసమైన గృహా నిర్మాణ మార్కెట్‌గా అహ్మదాబాద్ నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని అఫర్డబులిటీ హౌసింగ్ ఇండెక్స్–2020ని విడుదల చేసింది. అఫర్డబులిటీ ఇండెక్స్ అనేది సగటు గృహానికి సమానమైన నెలవారీ వాయిదాలు (ఈఎంఐ), ఆదాయ నిష్పత్తిని సూచిస్తుంది. దీన్ని నగరాల్లోని గృహాల ధరలు, వడ్డీ రేట్లు, ఆదాయంలో వృద్ధి, కొనుగోలుదారుని సామర్థ్యం వంటి విభాగాల్లో కదలికలను బట్టి అంచనా వేశారు. గృహాల ధరలలో క్షీణత, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా హౌసింగ్ అఫర్డబులిటీ మెరుగవ్వటానికి ప్రధాన కారణాలని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. అఫర్డబులిటీ నిష్పత్తి 50 శాతానికి మించితే.. బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి గృహ రుణాలు పొందటం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఇతర నగరాల్లో.. ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ అఫర్డబులిటీ ఇండెక్స్ 61 శాతంగా ఉంది. పదేళ్ల క్రితం ఇక్కడ రేషియో 93 శాతంగా ఉంది. ఎన్సీఆర్లో 53 శాతం నుంచి 38 శాతానికి, పుణేలో 39 శాతం నుంచి 26 శాతానికి, చెన్నైలో 51 శాతం నుంచి 39 శాతానికి, కోల్‌కతాలో 45 శాతం నుంచి 30 శాతానికి అఫర్డబులిటీ హౌసింగ్ రేషియో తగ్గాయి. చదవండి: బంగారం కొనే వారికి గుడ్‌న్యూస్ ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త! -
పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే!
న్యూఢిల్లీ: దేశీయ గృహాల విక్రయాలు మళ్లీ జోరందుకున్నాయి. గతేడాది అక్టోబర్–డిసెంబర్ నాల్గో త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 25 శాతం పెరిగి 1,10,811 యూనిట్లకు చేరాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో అమ్మకాలు 88,976 యూనిట్లుగా ఉన్నాయని ప్రాప్‌ఈక్విటీ డేటా అనలిటిక్ట్ సంస్థ తెలిపింది. 2020 క్యూ3తో పోలిస్తే క్యూ4లో హౌసింగ్ సేల్స్ 78 శాతం వృద్ధి చెంది.. 62,197 యూనిట్లుగా ఉన్నాయి. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవటంతో కొనుగోలుదారుల్లో నూతనోత్సాహం నెలకొందని, అలాగే పండుగ సీజన్స్, డెవలపర్ల ఆఫర్లు ఇతరత్రా కారణాలు కొనుగోళ్ల వృద్ధికి కారణాలని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్ అండ్ ఎండీ సమీర్ జాసుజా తెలిపారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, త్వరలోనే పూర్తి కానున్న గృహాలకు మాత్రమే కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. నిర్మాణంలో నాణ్యత, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో గణనీయమైన విక్రయాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. నగరాల వారీగా చూస్తే.. 2020 మొత్తం ఏడాది అమ్మకాల్లో మాత్రం 16 శాతం క్షీణత నమోదైంది. 2019లో 3,41,466 ఇళ్లు అమ్ముడుపోగా.. గతేడాది 2,86,951 యూనిట్లు విక్రయమయ్యాయి. ఒక్క ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో మినహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గతేడాది గృహాల విక్రయాలు క్షీణించాయి. 2019లో ఎంఎంఆర్‌లో 1,07,562 గృహాలు అమ్ముడుపోగా.. గతేడాది 3 శాతం వృద్ధి రేటుతో 1,11,256 యూనిట్లు విక్రయం అయ్యాయి. హైదరాబాద్‌లో 2019లో 31,038 యూనిట్లు సేల్ కాగా.. గతేడాది 14 శాతం తగ్గి 26,716 యూనిట్లకు పరిమితమయ్యాయి. కోల్‌కత్తాలో 19,272 నుంచి 12,026 యూనిట్లకు (–38 శాతం), ఢిల్లీ–ఎన్సీఆర్లో 44,894 నుంచి 29,640 యూనిట్లకు (–34), పుణేలో 74,791 యూనిట్ల నుంచి 62,043 యూనిట్లకు (–17 శాతం), బెంగళూరులో 46,969 యూనిట్ల నుంచి 33,363 యూనిట్లకు (–29 శాతం), చెన్నైలో 16,940 నుంచి 11,907 యూనిట్లు (–30%) విక్రయమయ్యాయి. చదవండి: మేలిమి బంగారం కొనాలనుకుంటున్నారా? పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త -
బాగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై-సెప్టెంబర్ కాలంలో 35 శాతం తగ్గినట్టు రియల్ ఎస్టేట్ రంగ సమాచార విశ్లేషణా సంస్థ ‘ప్రాప్‌ఈక్విటీ’ తెలిపింది. ఈ కాలంలో 50,983 యూనిట్లు (ఇల్లు/ఫ్లాట్) అమ్ముడు పోయినట్టు ఈ సంస్థ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. కానీ అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్ల సంఖ్య 78,472గా ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణెలో మార్కెట్లలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో నమోదైన విక్రయాలు 24,936 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో రెట్టింపయ్యాయని ఈ సంస్థ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు వార్షికంగా చూస్తే 46% తగ్గి 29,520 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గత వారం ఓ నివేదికను విడుదల చేసిన విషయం గమనార్హం. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొంత మేర కోలుకుంటోంది. సెప్టెంబర్ త్రైమాసికంతో చాలా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పలు పథకాలు, ఆఫర్ల మద్దతుతో డెవలపర్లు తమ నిల్వలను గణనీయంగా తగ్గించుకోగలరు. పండుగల సీజన్లోకి ప్రవేశించాము. ఆఫర్లు, తగ్గింపులు, ఆకర్షణీయమైన చెల్లింపుల పథకాల మద్దతుతో ఈ రికవరీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నాము’’ అని ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ సమీర్ జసూజా తెలిపారు. (చదవండి: ఇంటి నుంచి పనిచేసినా పన్ను పడుద్ది!) -
67 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 67 తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ అనే సంస్థ తెలిపింది. ఈ కాలంలో 21,294 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 64,378 యూనిట్లు (ఇళ్లు/ఫ్లాట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘నోయిడాను మినహాయిస్తే మిగిలిన ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అమ్మకాలు పడిపోయాయి. గురుగ్రామ్‌లో అత్యధికంగా 79 శాతం క్షీణత నెలకొంది. కేవలం 361 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 74 శాతం తగ్గి 996 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, చెన్నైలోనూ ఇంతే స్థాయిలో అమ్మకాలు తగ్గాయి. బెంగళూరులో 73 శాతం, కోల్‌కతాలో 75 శాతం చొప్పున అమ్మకాలు క్షీణించాయి. ముంబైలో 63 శాతం తగ్గి కేవలం 2,818 యూనిట్లకే విక్రయాలు పరిమితమైనట్టు’’ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. నోయిడాలో మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 5 శాతం పెరిగి 1,177 యూనిట్లుగా నమోదైనట్టు పేర్కొంది. -
నెల్లూరు: పచ్చడ్రామా గుట్టు రట్టు
సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వ నేతలు ఆడిన హౌసింగ్ డ్రామా ఇప్పుడు బట్టబయలైంది. ఎన్నికలకు ముందు పక్కాగృహాల పందేరానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఉచితం అని చెబుతూనే లబ్ధిదారులపై 20 నుంచి 30 ఏళ్ల పాటు రుణ భారం పెట్టేలా అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు సమీపించడంతో నిర్మాణం పూర్తి కాకుండానే ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు చేపట్టింది. అయితే రుణభారాన్ని గ్రహించిన లబ్ధిదారులు ప్లాట్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పంపిణీ ఆగిపోయింది. కావలి: పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ టీడీపీ నేతలు ఆడిన డ్రామాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కావలి పట్టణంలోని పేదలకు గూడు కల్పించేందుకు మద్దూరుపాడు ప్రాంతంలో గత ప్రభుత్వం అపార్ట్మెంట్ తరహాలో 2,112 ఫ్లాట్లు నిర్మించింది. వీటిలో అర్హులైన వారి కంటే అనర్హులకే కట్టబెట్టేందుకు టీడీపీ నాయకులు లబి్ధ దారులను ఎంపిక చేశారు. స్థానికేతరులు, బీపీఎల్‌కు ఎగువ ఉండే వారితో జాబితాలను సిద్ధం చేశారు. వీరి నుంచి 300 చ.అ. ఫ్లాట్‌కు రూ.500, 360 చ.అ. ప్లాట్‌కు రూ.12,500, 430 చ.అ. ఫ్లాట్‌కు రూ.25,000 వంతున డిపాజిట్లు కట్టించుకున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయం పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేయిస్తామని, ఈ అప్పును 360 నెలలపాటు ప్రతి నెలా వడ్డీతో సహా చెల్లించాలని తిరకాసు పెట్టారు. ఎన్నికలు సమీపించడంతో.. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హడావుడిగా చేసింది. ఫ్లాట్ల కేటాయింపు అంటూ తాళాలు ఇచ్చినట్లుగా అప్పట్లో టీడీపీ మంత్రులు, నాయకులు హంగామా సృష్టించారు. అయితే తీసుకున్న ప్లాట్లకు 20 నుంచి 30 ఏళ్లపాటు అసలు వడ్డీతో కలిపి బ్యాంక్‌లకు చెల్లించాలనే షరతు పెట్టడడంతో ఈ ప్లాట్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇల్లు లేని మహిళల పేరుతోనే.. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో మూడు కేటగిరీల్లోనూ ఇల్లు లేని మహిళల పేర్లతో ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ధిష్టమైన నిబంధనలు పొందుపరిచింది. దీంతో జాబితాలో భర్తల పేర్ల స్థానంలో భార్యల పేర్లు చేర్చడానికి, కుటుంబంలో భార్య లేదా భర్తకు ఇప్పటివరకు ఇల్లు లేదనే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ నేతల మోసంపై మండిపాటు తొలుత ఉచితంగా ఇళ్లు ఇస్తామని డిపాజిట్లు కట్టించుకుని, ఆ తర్వాత బ్యాంక్ రుణాలంటూ మోసం చేశారని దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది లబి్ధదారులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇళ్ల స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించేందుకు ఉప్రకమించింది. గత ప్రభుత్వ హయాంలో మద్దూరుపాడులో నిర్మించిన 2,112 ఫ్లాట్లను లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకుండా ఇవ్వాలని భావించింది. ►ఇందులో రూ.500 చెల్లించిన లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ►ఈ కేటగిరీలో 704 మంది ఉన్నారు. వీరి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు తదితర వాటిని సేకరించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ►కావలి మున్సిపల్ కమిషనర్ బి.శివారెడ్డి లబ్ధిదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ►మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి దశయ్య సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ►రూ.12,500 చెల్లించిన వారికి 360 చ.అ., రూ.25,000 చెల్లించిన వారికి 430 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ►మిగిలిన వారు రూ.3.65 లక్షలు, రూ.4.65 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అవసరమైన బ్యాంక్ రుణాలు మంజూరు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ►ఈ మూడు రకాల విస్తీర్ణంలోని అపార్ట్మెంట్ ఫ్లాట్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలంటే, వ్యక్తిగతంగా వారు అంగీకార పత్రంపై సంతకాలు చేయాల్సి ఉంది. ►సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఫ్లాట్ల కోసం నగదు చెల్లించిన వారి చిరునామాలకు వెళ్లి సంప్రదిస్తుంటే, తమకెందుకు బ్యాంక్ రుణాలు, టీడీపీ నాయకులు ఉచితంగా ప్లాట్లు ఇస్తామంటే కట్టామని, వారు మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ►అయితే డిపాజిట్లు చెల్లించిన వారి చిరునామాలకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు వెళ్తే అసలు ఆ పేర్లు కలిగిన వ్యక్తులు కావలి పట్టణాన్ని వదిలి ఏళ్లు అయిందని ఇరుగుపొరుగువారు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. ►ఇచ్చిన ఫోన్ నంబర్లో సంప్రదిస్తే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కోసం తాము దరఖాస్తు పెట్టలేదని, కావలి విడిచి ఏళ్లు అవుతుందని చెబుతున్నారు. -
అమరావతిలో పేదల హౌసింగ్ జోన్
సాక్షి, అమరావతి: అమరావతిలో ఈడబ్లూఎస్, అఫర్డ్‌బుల్ హౌసింగ్ జోన్ ఏర్పాటుకు సీఆర్డీయే మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, వెంకటపాలెం గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాల్లో ఈ హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో నివాసయోగ్యంగా పేర్కొన్న ప్రాంతంలోనే ఈ కొత్త హౌసింగ్ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌పై ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లో సీఆర్డీయే కమిషనర్‌ను ఉద్దేశించి లిఖిత పూర్వకంగా తెలపాలని చెప్పింది. గడువు ముగిసిన తర్వాత వచ్చే వాటిని పరిశీలించేది లేదని స్పష్టం చేసింది. -
రాజధానికి చేరిన హౌసింగ్ అవినీతి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: హౌసింగ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని, కాకినాడలో జరుగుతున్న మోసాలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లేందుకు నగరానికి చెందిన ముంత నళినికుమారి అనే మహిళ యత్నించింది. ఇల్లు మంజూరైందని చెప్పి రెండు విడతలుగా రూ.లక్ష కట్టించుకుని తీరా ఇల్లు లేదంటూ చేతులేత్తేశారని చెప్పుకునేందుకు సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆమెకు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా అడ్డు తగులుతుండటం, ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా కరుణించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవడమే కాకుండా అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కాకినాడ నగరంలో చోటుచేసుకున్న హౌసింగ్ అక్రమాలు రాజధానివేదికగా బట్టబయిలైనట్టయింది.ఒక్క నళినీయే కాదు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఇటువంటి బాధితులు వేలల్లో ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను తొలి నుంచీ ‘సాక్షి’ చెప్పుకొస్తూనే ఉంది. ఇల్లు మంజూరు చేస్తామని ముడుపులు తీసుకొని, మంజూరైందని చెప్పి రూ.లక్షల్లో కట్టించుకుని, తీరా మంజూరు కొచ్చేసరికి మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో సొంతింటికల నెరవేరుతుందన్న ఆశతో ఏళ్ల తరబడి ఎదురుతెన్నులు చూస్తున్న పేదలకు నిరాశ ఎదురవ్వడమే కాకుండా ముడుపులు ముట్టజెప్పి మోసపోయిన పరిస్థితి ఏర్పడింది. ‘హౌస్‌ఫర్ ఆల్’ పథకం కింద జిల్లా కేంద్రం కాకినాడకు సుమారు 4,600 ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఎంతో కాలంగా సొంతింటికోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు సొంత గూడు వస్తుందని ఆశ పడ్డారు. అయితే, అధికార పార్టీ నేతలు వచ్చిన అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని కాకినాడకు కేటాయించిన ఇళ్లను వాటాలు వేసేసుకున్నారు. ఒక్కొక్కరికీ 50 నుంచి 100 అని చెప్పి జన్మభూమి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు తలో కొన్ని పంచేసుకున్నారు. పంపకాలు జరగడమే తరువాయి తమ కోటా కింద వచ్చిన ఇళ్లను అమ్మకాలకు పెట్టారు. అప్పటికే ఇళ్లు లేదని దరఖాస్తులు చేసుకున్న వారితో బేరసారాలు సాగించారు. ఒక్కో ఇంటికి రూ.25వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుని ఇళ్లు మంజూరు చేస్తామని మభ్య పెట్టారు. అంతటితో ఆగకుండా లబ్ధిదారుల నుంచి రూ. 25 వేలు చొప్పున తొలి విడతగా, రూ.75 వేలు చొప్పున రెండో విడతగా కట్టించుకున్నారు. అయితే, కాకినాడ కార్పొరేషన్‌కు తొలి విడతగా 1105 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువ...మంజూరైనవి తక్కువ కావడంతో పోటీని చూపించి మళ్లీ ముడుపులకు డిమాండ్ చేశారు. సొంతింటి కల నెరవేరుతుందని నేతలు చెప్పినట్టుగా అడిగినంతా ముట్టజెప్పారు. ఎమ్మెల్యే ఇంటిని అడ్డాగా చేసుకుని రూ.25 వేల నుంచి రూ.50 వేలు వరకూ ముడుపులు తీసుకొని ఇల్లు మంజూరు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో లబ్ధిదారులు లబోదిబోమన్నారు. పోనీ ముడుపులు తీసుకున్నా అందరికీ ఇళ్లు మంజూరు చేయలేదు. చాలా మంది లక్షలాది రూపాయలు ముట్టజెప్పినా ఇల్లు దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పులు చేసి కట్టిన నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవకపోయినా సొంతింటి కోసం అక్కడా ఇక్కడా అప్పులు చేశామని, తీరా ఇళ్లు రాలేదని వారంతా ఆవేదన చెందడమే కాకుండా రోడ్డెక్కుతున్నారు. అప్పులు భరించలేక ఏదో ఒకటి చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరు కాకినాడ డెయిరీ ఫారమ్‌కు చెందిన ముంత నళినికుమారి. రాజీవ్ గృహ కల్పలో 175ఎఫ్4లో అద్దెకుంటున్నారు. ఆమె భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నిరుపేదైన నళిని కుమారికి ఎముకలకు సంబంధించిన వ్యాధితోపాటు నరాల బలహీనతతో కుడి చేతి వేళ్లు వంకరపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈమె ప్రభుత్వం ఇస్తుందనుకున్న సొంతింటి కోసం రూ.25 వేలు ఒకసారి, రూ.75 వేలు మరోసారి డీడీ కట్టారు. సీ10/55 సెకండ్ ఫ్లోర్లో ఇల్లు వచ్చిందని కూడా అటు మున్సిపల్ ఆఫీసులోనూ, ఇటు ఎమ్మెల్యే ఆఫీసులోనూ చెప్పారు. కానీ ఇప్పుడు తనకే నెంబర్ ఇల్లు రాలేదని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడు రూపాయల వడ్డీకి తెచ్చి కడితే ఇప్పుడు ఇల్లు రాలేదని చెప్పడంతో ఆందోళనకు లోనయ్యారు. అటు ఎమ్మెల్యే కార్యాలయం, ఇటు మున్సిపల్ అధికారులు ఎంత బతిమిలాడినా స్పందించకపోవడంతో ఏకంగా అమరావతికి వెళ్లి సీఎంను కలిసి తన గోడు చెప్పుకుందామని భావించారు. ఆమేరకు గత మూడు రోజులుగా సీఎం కార్యాలయానికి వెళ్తుండగా అక్కడి అధికారులు అవకాశం ఇవ్వలేదు. శుక్రవారం కూడా ఉదయం 6 గంటల నుంచి సీఎం కార్యాలయం వద్ద నిరీక్షించగా ఏ ఒక్కరూ స్పందించలేదు సరికదా లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఈమె ఎండలో నిరీక్షించి స్పృహ తప్పి పడిపోయారు. స్థానికుల సాయంతో అసుపత్రికి తరలించారు. దీని ప్రకారం కాకినాడ కార్పొరేషన్లో హౌసింగ్ గోల్మాల్ ఏ స్థాయిలో జరిగిందో స్పష్టమవుతోంది. నేటికీ కొలిక్కిరాని డీడీల కుంభకోణం... సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో అప్పులు చేసి పుస్తెలమ్మి రూ.25వేలు చొప్పున కార్పొరేషన్‌కు ఇచ్చిన డీడీలు గల్లంతైన వ్యవహారం నేటికీ కొలిక్కి రాలేదు. కొంతమంది కార్పొరేషన్ అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో టీడీపీ జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర నేతలు కుమ్మక్కై డీడీలను స్వాహా చేసేశారు. ఈ విషయంపై వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లతో నిజనిర్ధారణ కమిటీ వేసినప్పటికీ అధికారులు సహకరించలేదు. డీడీలు గల్లంతైనట్టు తేలినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా బుట్టదాఖలు చేశారు. డీడీల తీగ బయటికిలాగితే పచ్చనేతల బాగోతం మరింత బయటపడనుంది. -
టీడీపీ పాలనలో.. అన్నింటా అవినీతే
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి కాసులు కురిపించాలి..పింఛన్ మంజూరు కావాలంటే అధికారపార్టీ నేతల చేయి తడపాలి. ఇళ్లు, మరుగుదొడ్ల బిల్లుల్లో వాటాలు ఇవ్వాలి.. రోడ్లు, కాలువ పనులు తదితర అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు చెల్లించాలి.. చివరకు పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ అవినీతే.. ప్రజాధనంతో అమలుచేసే ప్రతీ పథకం, చేసిన ప్రతీ పనిలోనూ పర్సంటేజీలు వసూలు చేస్తున్నారంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. తాజాగా హౌస్ ఫర్ ఆల్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ సామాజిక తనిఖీ అధికారులు బట్టబయలు చేశారు. అనర్హుల పేర్లుతో సహా వెల్లడించడంతో టీడీపీ పాలనలో సాగుతున్న అవినీతి తంతును చూసి జిల్లా వాసులు విస్తుపోతున్నారు. విజయనగరం మున్సిపాలిటీ: ఇందుగలడందు లేడని సందేహం వలదు.. ఎందెందు వెతికినా.. అందందే తమ అవినీతి గలదన్న చందంగా మారింది ప్రస్తుత టీడీపీ పాలన. ఏ పనిచేయాలన్నా, ఏ పథకం మంజూరు కావాలన్నా చేయి తడపాల్సిందేనన్నది జనం నుంచి వినిపిస్తున్న మాట. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాలకులు... సంక్షేమ పథకాల మంజూరులో చేస్తోన్న అవినీతి పరకాష్టకు చేరుకుంది. దీనికి పట్టణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేసేందుకు అమలు చేస్తోన్న హౌస్‌ఫర్ ఆల్ పథకం వేదికగా నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తోన్న హౌస్‌ఫర్ ఆల్ పథకం అక్రమాలకు నిలయంగా మారింది. నిబంధనలకు పాతరేసి స్థానికేతరులకు ఇళ్లు కేటాయింపులు చేశారంటూ సామాజిక తనిఖీల్లో వెలుగుచేసింది. బృంద సభ్యులు బహిరంగంగానే అనర్హుల పేర్లుతో సహా వెల్ల ్లడించడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 279 ప్రకారం విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల నియామకంలోనూ ఒక్కో కౌన్సిలర్ నూతన నియామకానికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్టు సమాచారం. 2014 అనంతరంటీడీపీ పాలకవర్గం మున్సిపల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కౌన్సిల్ ఆమోదించిన సుమారు 450 అభివృద్ధి పనుల్లో ప్రతీ పనికి పర్సెంటీజీల చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నార్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి అవినీతి మయమే... హౌస్‌ఫర్ ఆల్ పథకం కింద స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునేందుకు విజయనగరం మున్సిపాలిటీలో 3,090 యూనిట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకోగా... స్థానిక పాలకవర్గాలు లబ్ధిదారులకు ఇళ్లు కేటాయింపులు ప్రక్రియను చేపట్టేశారు. ఇదిలా ఉండగా ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.3.50 లక్షలు మంజూ రు చేయనుండగా.. అందులో రూ.2.50 లక్షలు సబ్సీడీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన రూ.లక్షలో రూ.75 వేలు బ్యాంకులోను ద్వారా చెల్లించాల్సి ఉండగా.. మరో రూ.25 వేలు మొత్తం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సబ్సీడీకింద వచ్చే రూ.2.50 లక్షల మొత్తం మంజూరు చేసేందుకు పర్సంటేజీల పేరిట వేధింపులు వస్తున్నాయి. రూ.లక్ష మొత్తం మంజూరుకు రూ.15 వేలు, రూ.2.50 లక్షల మంజూరుకు రూ.37 వేల వరకు వసూలు చేస్తున్నారంటూ లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నా రు. ఇదే పథకంలో పూర్తిగా ఇళ్లులేని వారి కోసం సారిపల్లి ప్రాంతంలో 2,880 ఇళ్లు నిర్మించి ఇచ్చేం దుకు నిర్ణయించగా.. అందుకు అవసరమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ ఏడాది ఆగస్టుతో పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ, సహకారాలతో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుడు వాటా కింద కొంత మొత్తాన్ని ముందుగా డీడీల రూపంలో చెల్లించాలని సూచించారు. ఈ మేరకు 300 స్వే్కర్ఫీట్, 365 స్క్వేర్ ఫీట్, 430 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో చేపడుతున్న యూనిట్ల నిర్మాణానికి ముందుగా రూ.500, రూ.10వేలు, రూ.25వేలు చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే, ఇలా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి వద్ద నుంచి స్థానిక కౌన్సిలర్లు ఒక్కోయూనిట్‌కు రూ.30వేలు నుంచి రూ.50వేలు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇదంతా మున్సిపల్ పాలకులే నిర్వహించారన్నది బహిరంగ సత్యం. తాజా గా ఈ పథకం అమలులో పారదర్శకతపై సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీల్లో అదే విషయం బట్టబయలు కావడం గమనార్హం. అన్నింటా రాజకీయ హస్తం.. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున నిరుపేదలకు ఈ పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసేందుకు 2015 సంవత్సరంలో నిర్ణయించగా... మూడేళ్ల అనంతరం ఇళ్ల కేటాయింపులు పూర్తి చేసిన ప్రక్రియపై అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం వేదికగా నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ బృందం ప్రస్తావించిం ది. వారం రోజుల పాటు విజయనగరం మున్సి పాలిటీలో నిశిత తనిఖీలు నిర్వహించిన వారు జరిగిన అక్రమాలపై పక్కా నివేదికను రూపొం దించారు. ఎక్కడా పారదర్శకత లేకుండా కేటా యింపులు చేయటాన్ని వారు పేర్లతో సహా బయటపెట్టారు. ఇదే సామాజిక తనిఖీ ప్రొగ్రాం మేనేజర్ వి.వరలక్ష్మి సవివివరంగా నివేదికలో పొందుపరిచారు. విజయనగరంలో చేసిన ఇళ్ల కేటాయిం పుల్లో పక్క జిల్లాలకు చెందిన వారిని, ఇతర మండలాల వారికి ప్రాధాన్యం ఇచ్చినట్టు గుర్తిం చారు. స్థానికేతరులకు ఇళ్లు కేటాయించడం, అర్హులు కాని వారిని లబ్ధిదారులుగా పేర్కొన్నట్లు తనిఖీల్లో తేల్చారు. రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ ద్వారా వచ్చిన నిబంధనల మేరకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. 15,620 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా... ఇప్పటి వరకు 2,730 మందికి ఇళ్లు కేటాయిం చారని, ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇవ్వాల్సిన ఇళ్లకు మహిళలే అర్హులని, ఆ విధంగా 74 శాతం మంది మహిళలు మాత్రమే వారి పేరును దరఖాస్తు చేసుకోగా... మిగిలిన 26 శాతం కూడా పురుషులు దరఖాస్తులు చేసుకోవ డం వెనుక నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పథకం అమల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత మేర జోక్యం చేసుకున్నారో చెప్పనక్కర్లేదు. సారిపల్లిలో ఇప్పటి వరకు జనరల్‌లో 1614 మందికి, బీసీలకు 351 మందికి, ఎస్సీలు 15 మందికి, ఎస్టీ ఒకరికి కేటాయించగా... మిగిలిన 1159 మందికి కులంతో సంబంధం లేకుండా కేటాయించినట్లు గుర్తించారు. మరోవైపు ఆన్లైన్ ద్వారా చేసుకో వాల్సిన దరఖాస్తులను ఆఫ్‌లైన్ ద్వారా చేశారని, ఇక్కడ ప్రజాప్రతినిధుల హస్తం స్పష్టంగా కనిపిం చడంలో అసలు బండారం బట్టబయలైంది. కౌన్సిలర్ల ద్వారా ఈ దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో పంపించి ఇళ్ల కేటాయింపులకు పాల్పడినట్లు బృంద సభ్యులే వెల్లడించడం గమనార్హం. ఇచ్చిన ఇళ్లలో కూడా ఒక్కోరేషన్ కార్డుకు రెండేసి ఇళ్లను కేటాయించగా, గజపతినగరం ప్రాంతంలో నివసిస్తున్న వారికి విజయనగరం పట్టణంలో ఇంటిని మంజూరు చేయడం కొసమెరుపు. ఇదే విషయాన్ని సామాజిక తనిఖీ బృంద సభ్యులు ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలుస్తోంది. హౌస్ ఫర్ సే(ఆ)ల్... అవినీతిని సహించం.. అక్రమార్కులను వదిలిపె ట్టేది లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసే టీడీపీ ప్రజాప్రతినిధులు అవినీతి ఊబిలో చిక్కుకున్నారు. ఇదే విషయం హౌస్‌ఫర్ ఆల్ పథకంలో బట్టబయలు కావడంతో విజయనగరం మున్సి పాలిటీలో సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమానికి కేవలం మున్సిపల్ కౌన్సిలర్లు పం పించిన లబ్ధిదారులు హాజరుకాగా... ఈ సమావేశంలో వారందరిలో ఏ ఒక్కరు అవినీతిపై పెదవి విప్పకపోగా... తనిఖీకి వచ్చిన బృంద సభ్యులు వెల్లడించిన వాస్తవాలతో వారుసైతం అవాక్కవడం గమనార్హం. ఆధారాలు ఉన్న వారికే ఇళ్లు కేటాయించాం అన్ని ఆధారాలతో దరఖాస్తులు చేసుకున్న వారికే హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇళ్లు కేటాయించాం. స్థానికేతరులకు ఇళ్లు కేటా యింపులు జరగలేదు. కొంతమంది వలసలు వచ్చి విజయనగరంలో జీవిస్తుండంతో వారికి రేషన్‌కార్డు స్థానికంగా ఉండడంతోనే స్థానికత ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేశాం. మరో 52 కేసుల్లో పిన్‌కోడ్ సమస్య తలెత్తడంతో వాటిని కూడా సరిచేశాం. అన్నింటా పారదర్శకత పాటిస్తూ వచ్చాం. – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ -
‘గూడు’ కల చెదిరింది!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ గృహ వసతి కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ సర్కారు తుంగలోకి తొక్కింది. ఇళ్లు నిర్మించి ఇవ్వడం మాట దేవుడెరుగు కనీసం జానెడు ఇంటి స్థలమైనా ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గూడులేని పేదల అర్జీలను రకరకాల కొర్రీలతో తిరస్కరించి పక్కన పడేస్తోంది. నివాస స్థలాలు మంజూరు చేయాలంటూ 19.82 లక్షల అర్జీలు రాగా రెండొంతులకుపైగా చెత్తబుట్ట పాలయ్యాయి. దాదాపు 13.67 లక్షల అర్జీలను తిరస్కరించిన సర్కారు 6.15 లక్షల మంది మాత్రమే ఇళ్ల పట్టాల మంజూరుకు అర్హులని తేల్చింది. అయితే వీరికి కూడా పట్టాలు ఇవ్వడానికి సర్కారుకు చేతులు రావడం లేదు. సర్వే సాకుతో తిరస్కరణ.. ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 9.91 లక్షల అర్జీలు ఒకే కారణంతో తిరస్కరణకు గురి కావడం గమనార్హం. ప్రజాసాధికార సర్వే ప్రకారం వీరికి ఇళ్లు ఉన్నందున దరఖాస్తులను తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. లక్షల మంది వివరాలు ఈ సర్వేలో లేవు. అలాంటప్పుడు ఈ సర్వేను ప్రామాణికంగా చేసుకుని దాదాపు పది లక్షల దరఖాస్తులను తిరస్కరించడం అన్యాయమని వాపోతున్నారు. సర్వే సమయంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నా తరువాత కొందరికి వివాహాలు కావటంతో ఇతర చోట్ల ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండని వారి అర్జీలను తిరస్కరించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాల్లో చాలామంది కూలి పనులు చేసుకుంటూ కాళ్లు చాపేందుకు కూడా చాలని ఇరుకు గుడిసెల్లో జీవిస్తున్నారు. ఇలాంటి వారి వివరాలు సాధికార సర్వేలో లేవు. కరువు సమయంలో వలస వెళ్లిన కూలీల పేర్లు కూడా సర్వేలో నమోదు కాలేదు. ఇలాంటి దరఖాస్తులన్నీ తిరస్కరణ జాబితాలో చేరిపోయాయి. కాళ్లరిగేలా తిరుగుతున్న పేదలు ఇళ్ల స్థలాల కోసం నిరుపేదలు రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మీకోసం’ గణాంకాల ప్రకారం కృష్ణా జిల్లాలో అత్యధికంగా 3.29 లక్షల మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2.94 లక్షలు, కర్నూలు జిల్లాలో 2.44 లక్షలు అర్జీలు వచ్చాయి. ఇళ్ల స్థలాల కోసం ప్రవాస భారతీయులు 1,555 మంది అర్జీలు పెట్టుకోగా తిరస్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 17,394 మంది ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 1,28,248 అర్జీలు రాగా కేవలం 6,013 మంది మాత్రమే అర్హులని ప్రభుత్వం తేల్చింది. సిఫార్సులు ఉన్న వారి వినతులను మాత్రమే ఆమోదిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకిలా? సింహభాగం భూములు అధికార పార్టీ నాయకుల పరం కావడం, ప్రజావసరాల కోసం నిర్దేశించిన విలువైన భూములను రకరకాల మార్గాల్లో ధారాదత్తం చేయడంతో పేదలకు కనీసం ఇంటి స్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉత్పన్నమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ‘టీడీపీ నాయకులు గ్రామకంఠాలను కూడా కైవసం చేసుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. గత నాలుగేళ్లలో జరిగిన భూ కుంభకోణాలు ఈ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రైవేట్ భూములే శరణ్యం.. ప్రభుత్వం అర్హులుగా నిర్ధారించిన 6.15 లక్షల మందికి ఇళ్ల జాగాల కోసం రూ.7,052.98 కోట్లు అవసరమని కలెక్టర్లు గుర్తించారు. ఇళ్ల జాగాలు ఇవ్వడానికి 14927.06 ఎకరాల భూమి అవసరమని రెవెన్యూ శాఖ తేల్చింది. అయితే 4494.26 ఎకరాల ప్రభుత్వ భూమి మాత్రమే ఇళ్ల పట్టాల మంజూరుకు అందుబాటులో ఉంది. ఇది 174464 మందికి పట్టాలు ఇవ్వడానికి సరిపోతుంది. మిగిలిన 440318 మందికి ఇంటి స్థలాల కోసం 11468.77 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించాల్సి ఉందని రెవెన్యూ శాఖ ఆర్నెళ్ల క్రితమే నివేదిక ఇచ్చినా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నాన్చడంతో పట్టాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి. -
అందుబాటు గృహాలపై రెరా భారం
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన చట్టం. కానీ, దీంతో అందుబాటు గృహాలకు కష్టకాలం వచ్చింది. ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి 7 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా ఉంటే.. ఇందులో రూ.40 లక్షలు లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు 2.37 లక్షలు ఉన్నాయి. మౌలిక వసతుల లేమి, నాసిరకమైన నిర్మాణాలు, లీగల్ సమస్యలే ఇందుకు కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రెండో త్రైమాసికం నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కతా, హైదరాబాద్‌ల్లో 2.37 లక్షల అందుబాటు గృహాలు ఖాళీగా (వేకెంట్)గా ఉన్నాయి. ఈ గృహాలు కూడా సంఘటిత రంగంలోని ప్రైవేట్ డెవలపర్లకు చెందినవే. ప్రభుత్వ గృహ పథకాలు, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్ల గృహాలను కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రధాన నగరాల్లో సంఘటిత రంగంలోని డెవలపర్లు నిర్మించిన అందుబాటు ప్రాజెక్ట్‌లు, స్థానిక ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన బడ్జెట్ గృహాలు విక్రయమయ్యాయి. కానీ, అసంఘటిత రంగంలోని చిన్న డెవలపర్లు చేపట్టిన నిర్మాణాలు, అసంఖ్యాకమైన చిన్న అపార్ట్మెంట్లు, సుదూర ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు మాత్రం అమ్ముడుపోకుండా ఉన్నాయి. ఎందుకు అమ్ముడుపోలేదంటే? రెరా కంటే ముందు లోప భూయిష్టమైన ప్రాజెక్ట్‌లను గుర్తించడంతో కొనుగోలుదారులు వెనకపడ్డారు. కానీ, రెరా అమల్లోకి వచ్చాక కస్టమర్లు గుర్తించలేకపోయినా సరే రెరా అథారిటీ, బ్యాంక్‌లు గుర్తిస్తాయి. దీంతో రెరా అమలయ్యాక గృహాల ఇన్వెంటరీ పెరిగింది. ఇందుకు ప్రధాన కారణాలివే.. మౌలిక వసతులు: అందుబాటు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు డెవలపర్లు స్థానిక ప్రజల అవసరాలు, గృహ విస్తీర్ణాలపై అధ్యయనం చేయలేదు. కేవలం భూమి తక్కువ ధరకు దొరుకుతుందని, అభివృద్ధి నిబంధనలఖర్చు తగ్గుతుందనే కారణాలతో సుదూర ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లను నిర్మించారు. పని ప్రదేశాలకు, మౌలిక వసతులు, రవాణా సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో గృహాలను నిర్మించారు. నాసిరకం నిర్మాణాలు: చాలా వరకు అందుబాటు గృహాల డిజైన్, నాణ్యత అంశాల్లో నాసిరకం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. పాత కాలం నాటి డిజైన్లతో నిర్మాణాలుండటం కూడా అమ్మకాలకు అడ్డంకే. నిర్మాణంలో నాణ్యత లేకపోతే అందుబాటు గృహాలైనా, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నా సరే ఏళ్లపాటు అమ్ముడుపోకుండా ఉంటాయి. లీగల్ సమస్యలు: చాలా వరకు అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని ప్రాజెక్ట్‌ల్లో అయితే అనుమతి ఉన్న ఫ్లోర్స్ కంటే ఎక్కువ అంతస్తు నిర్మాణాలున్నాయి. దీంతో అందుబాటు గృహాలు విక్రయానికి నోచుకోవట్లేదు. అమ్ముడుపోవాలంటే? కేంద్రం నిజంగా 2022 నాటికి అంద రికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ఉంటే గనక ముం దుగా ఖాళీగా ఉన్న అందుబాటు గృహాలను ఆక్రమించేయాలి. అంటే ఇన్వెంటరీగా ఉన్న గృహాలను తగ్గించడం తప్ప ఇతర మార్గం లేదు. ♦ నీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు వంటి మెరుగైన మౌలిక వసతులున్న చోటే గృహాలు అమ్ముడుపోతాయి. అందుకే ఎక్కడైతే విక్రయించబడకుండా ఉన్న గృహాలు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో వెంటనే మౌలిక వసతులను కల్పించాలి. దీంతో వెంటనే ఆయా ప్రాంతా ల్లో గృహాలు అమ్ముడుకాకపోయినా మెల్లగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాల్లో క్రయవిక్రయాలకు మొగ్గుచూపే అవకాశముంది. ♦ చిన్న చిన్న అతిక్రమణలు జరిగిన అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లను క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఒకవేళ అందుబాటు గృహాలు నో డెవలప్మెంట్ జోన్ (ఎన్‌డీజెడ్) లేదా పర్యావరణ సున్నితమైన ప్రాంతాల్లో నిర్మించినట్ల యితే స్థానిక మున్సిపల్ నిబంధనల్లో మార్పు చేసి ప్రత్యేక స్కీమ్‌లను తీసుకురావాలి. దీంతో ఆయా ప్రాంతాలు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు గతంలో ముంబైలో సాల్ట్ ప్లాన్ ల్యాండ్స్‌లో నిర్మాణాలకు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వటంతో పెద్ద ఎత్తున అందుబాటు గృహ ప్రాజెక్ట్‌లు వచ్చాయి. -
బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారయ్యా!
చీరాల టౌన్ : ‘వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ అప్పులు చేసి మరీ సొంత గృహాన్ని నిర్మించుకున్నా. ఇంటికి మరుగుదొడ్డి లేకపోవడంతో ఇటీవల వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నా. కానీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు’ అని నాగులపాడు తూర్పువారివీధికి చెందిన మంగనూరు తులశమ్మ వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రైతులను ఆదుకోండి సార్.. చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు సకాలంలో సాగునీరు అందడంలేదని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వెంకటాపురానికి చెందిన భీమనాథం సుబ్బారెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. తాను 12 ఎకరాలు పొగాకు సాగుచేస్తే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్నానని వాపోయారు. -
21 రోజుల్లో గృహ నిర్మాణాల అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావిర్భావం తర్వాత ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన ఆశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు పోతున్నామని పురపాలక మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పురపాలక శాఖలో ఏకీకృత సర్వీస్ నిబంధనలు తెచ్చామని, ప్రజలకు సత్వర సేవలందించడానికి డీపీఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మంత్రి కేటీఆర్ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతుల జారీ గడువును ఇటీవ 30 రోజుల నుంచి 21 రోజులకు కుదించామని, ఈ మేరకు సత్వరంగా అనుమతులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. గడువులోగా అనుమతులు జారీ చేయకపోతే బాధ్యులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారం రోజుల లోపు అందులో ఉన్న లోపాలను దరఖాస్తుదారులకు రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అనుమతుల ప్రక్రియలో అనవసర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులనుసత్వరమే పరిష్కరించండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. డీపీఎంఎస్ విధానం పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలని, సంపూర్ణ పరిజ్జానంతో పనిచేయాలని కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం అవుతామని మంత్రి తెలిపారు. క్రమబద్ధమైన పురపాలనలో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నూతనంగా ఎర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాల నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లే అవుట్లలోని ఖాళీ ప్రదేశాలు (ఓపెన్ ప్లాట్లు)ను కాపాడటంలో మున్సిపల్ కమిషనర్లతో కలసి పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానికంగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించాలని పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవిని, డీటీసీపీ విద్యాధర్రావును ఆదేశించారు. -
గృహాలు కిందికి.. ఆఫీసులు పైకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో నూతన ప్రాజెక్ట్‌ల విషయంలో గణనీయమైన తగ్గుదల ఉందని, కార్యాలయాల మార్కెట్ మాత్రం కాసింత మెరుగ్గా ఉందని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. హెచ్1తో పోలిస్తే నగరంలో జూలై–డిసెంబర్ (హెచ్2) మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 84 శాతం క్షీణత, ఆఫీసు లావాదేవీల్లో మాత్రం 5 శాతం వృద్ధిని నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పాటూ హైదరాబాద్‌లోని నివాస, కార్యాలయాల విభాగం పరిస్థితులపై క్షేత్రస్థాయిలోని వివరాలను నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థూర్ బుధవారమిక్కడ విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోని రియల్టీ మార్కెట్‌పై ప్రభావం చూపించింది. హైదరాబాద్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇక్కడ హెచ్1లో 2,571 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్2లో 84 శాతం తగ్గుదలతో 940 యూనిట్లకే పరిమితమయ్యాయి. అమ్మకాలూ డౌన్.. హెచ్2లో నగరంలో గృహాల అమ్మకాల్లోనూ 13 శాతం తగ్గుదల కనిపించింది. హెచ్1లో 7,901 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్2లో 6,342 యూనిట్లకు చేరాయి. నగరంలో ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016తో పోలిస్తే 28,088 నుంచి 17,356 యూనిట్లకు తగ్గింది. అమ్మకాలు ఆశాజనకంగా ఉండటంతో రూ.50 లక్షల లోపు ఉండే అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌ల వైపు నిర్మాణ సంస్థలు దృష్టిసారించాయి. దీంతో ఈ విభాగంలో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాలు 40 శాతం పెరిగాయి. ఆఫీస్‌లో 5 శాతం వృద్ధి.. జూలై–డిసెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్ ఆఫీసు రియల్టీ మార్కెట్ రికార్డుల మోత మోగించింది. ఈ 6 నెలల కాలంలో 3.34 మిలియన్ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి. హెచ్1లో ఇది 2.33 మిలియన్ చ.అ.లుగా ఉంది. అంటే 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయితే 2016 ఏడాదితో పోలిస్తే మాత్రం 2017లో ఆఫీసు విభాగ లావాదేవీలు 4 శాతం తగ్గాయి. దేశంలోనూ సేమ్ సీన్! 2017 హెచ్2లో దేశంలోని 8 ప్రధాన మార్కెట్లలో గృహ రంగంలో క్షీణత, ఆఫీసు విభాగంలో వృద్ధిని నమోదు చేసింది. హెచ్1లో 62,738 యూనిట్లు ప్రారంభం కాగా.. హెచ్2లో 41 శాతం తగ్గుదలతో 40,832 యూనిట్లకు పరిమితమయ్యాయి. అమ్మకాల్లోనూ అంతే! హెచ్1లో 1,20,756 యూనిట్లు అమ్ముడుపోగా.. హెచ్2లో 2 శాతం క్షీణతతో 1,07,316కు చేరాయి. అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 2016లో 6,52,996 యూనిట్లు ఉండగా. 2017లో ఇవి 5,28,494 యూనిట్లకు తగ్గాయి. 9 శాతం అప్.. హెచ్2లో ఆఫీస్ విభాగంలో 22.5 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. హెచ్1లో 19.2 మిలియన్ చ.అలుగా ఉంది. 9 శాతం వృద్ధిని కనబర్చింది. విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఐటీ, ఐటీఈఎస్ విభాగం 37 శాతం, బీఎఫ్ఎస్ఐ 14 శాతం, తయారీ రంగం 14 శాతం ఆఫీసు స్థలాన్ని ఆక్రమించాయి. -
18శాతం ఢమాలన్న గృహ విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త నిబంధనలతో రూపొందించిన చట్టం రెరా కారణంగా గృహాల విక్రయాలు భారీగా పడిపోయాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ వరుసగా మందగిస్తోందనీ, సెప్టెంబర్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ ఇది 18శాతం క్షీణించిందని రిపోర్ట్‌లో తేలింది. హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో ఈ ప్రభావం కనిపించింది. రియల్టీ పోర్టల్ ప్రాప్ టైగర్ . కాం నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడయ్యాయి. డీమానిటైజేషన్, రియల్ ఎస్టేట్ కొత్త చట్టం రెరా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్లో దాదాపు 53 శాతం క్షీణించి, 22, 115 యూనిట్లకు పడిపోయిందని పేర్కొంది. ముఖ్యంగా పుణే, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, అహ్మదాబాద్‌లో గృహ అమ్మకాలు, అలాగే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ భారీగా పడిపోయిందని నివేదించింది. కేవలం ముంబై, గుర్గావ్లో మాత్రం డిమాండ్ అండ్ సప్లయ్‌లో పురోగతి కనిపించిందని వ్యాఖ్యానించింది. నోట్ల రద్దు, కొత్త రెరా, జీఎస్టీ కారణంగా 2018 ఆర్థిక సంవతసరంలో రెండవ త్రైమాసికంలో లాంచింగ్, అలాగే అమ్మకాలు ప్రభావితం చేశాయని ప్రాప్ టైగర్ . కాం చీఫ్ ఇన్వెస్ట్మెంటట్ ఆఫీసర్ అంకుర్ ధావన్ చెప్పారు. అయితే జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే, ఫెస్టివ్ పీజన్లో అమ్మకాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ క్వార్టర్లో అహ్మదాబాద్‌లో 46 శాతం భారీ క్షీణతను నమోదుచేసి 2,222 యూనిట్లు విక్రయించింది. బెంగళూరులో 27 శాతం తగ్గి, 6,976 యూనిట్లు, చెన్నై 23 శాతం నీరసపడి 2,945 యూనిట్లు, కోల్ కతాతా 21 శాతం అమ్మకాలు క్షీణించి 2,993 యూనిట్లు, హైదరాబాద్ 18 శాతం తగ్గి 3,356 యూనిట్లను విక్రయాలు జరిగినట్టు తెలిపింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో అమ్మకాలు గుర్గావ్ లో 60 శాతం వృద్ధితో 3,342 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబైలో 6 శాతం పెరిగి 12,101 యూనిట్లకు చేరుకున్నాయి. -
‘గూటి’ చుట్టూ గజిబిజే..
-‘అందరికీ ఇళ్లు’ పథకంలో తొలగని అయోమయం -స్పష్టత లేమితో వాయిదాల చెల్లింపులో లబ్ధిదారుల నిర్లిప్తత -గడువు రెండుసార్లు పెంచినా అంతంత మాత్రపు స్పందన -ఫ్లాటు రేటుపై విమర్శలతో మెట్టు దిగిన సర్కారు -టెండర్లు పూర్తయిన తర్వాత ధరల్లో మార్పులు మండపేట : ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు..’ అన్న నానుడే.. ఆ రెండు కార్యాలూ ఎంత బరువుబాధ్యతలతో కూడినవో చెపుతుంది. అలాంటప్పుడు.. సర్కారు ‘ఇల్లు కట్టి ఇస్తాం’ అంటే సామాన్యులు, మధ్యతరగతి వారు ఎగిరి గంతేయాలి. అయితే ‘అందరికీ ఇళ్లు’ పథకం’ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ పథకం ఆదిలోనే అనేక సందేహాలకు నిలయంగా మారింది. ‘సరికొత్త టెక్నాలజీ’ అంటూ.. రియల్టర్ల బాటలో.. ఇంకా చెప్పాలంటే వారి కన్నా ఎక్కువగా ఫ్లాట్ రేటు ధర నిర్ణయించిన సర్కారు తొలి నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సర్కారే భారీ దోపీడీకి రంగం సిద్ధం చేస్తుండటంపై ‘సాక్షి’ దినపత్రికలో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. నెలవారీ బ్యాంకు వాయిదాలపై స్పష్టత లేకపోవడం, షీర్వాల్ టెక్నాలజీపై ఆందోళన, మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపడం మొదలైన కారణాలతో తొలి విడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో అభాసు పాలవుతున్న సర్కారు బ్యాంకు రుణం విషయంలో దిగి వస్తోంది. గత ప్రభుత్వాలు సెంటున్నర స్థలంలో ఇంటి కోసం రూ.60 వేల నుంచి రూ. లక్ష వరకు గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తే, సొంతంగా కొంత మొత్తాన్ని వేసుకుని పేద వర్గాల వారు రెండు బెడ్రూంలు, హాలు, కిచెన్లతో ఇళ్లు నిర్మించుకునేవారు. ఆ ప్రకారం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు కలిపి ఇచ్చే రూ.3 లక్షల సబ్సిడీతో ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. అయితే సరికొత్త టెక్నాలజీ అంటూ సామాన్యుల దోపిడీకి రంగం సిద్ధం చేసింది చంద్రబాబు సర్కారు. చదరపు అడుగుల పేరిట ఫ్లాట్లను మూడు కేటగిరీలుగా విభజించి, వసతుల భారాన్ని పేదలపైనే మోపజూసింది. అందుకోసం లబ్ధిదారుని వాటాతో పాటు బ్యాంకు రుణాల్లోనూ వారిని భాగస్వాములను చేస్తోంది. కేటగిరీ-1లో 300 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్రూం ఫ్లాటు, 430 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాటుగా విభజించింది. జి ప్లస్-3 కింద జిల్లాలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. తొలి విడతగా రూ.1,457.62 కోట్లతో 19,242 ఫ్లాట్లు మంజూరు చేసింది. కాకినాడ నగర పరిధిలో 4,608 ఫ్లాట్లు, రాజమహేంద్రవరంలో 4,200, పెద్దాపురంలో 1,724, సామర్లకోటలో 1,048, రామచంద్రపురంలో 1,088, మండపేటలో 4,064, పిఠాపురంలో 874, అమలాపురంలో 1,636 ఫ్లాట్లు మంజూరయ్యాయి. ఇంతవరకూ వాయిదాలు కట్టింది 11,346 మందే.. అయితే ఆ కేటగిరీల్లోని ఫ్లాట్లకు ఎంత వరకూ బ్యాంకు రుణం చెల్లించాలనే విషయమై ప్రభుత్వం ఇప్పటి వరకూ లబ్ధిదారులకు స్పష్టతను ఇవ్వడం లేదు. వసతుల భారాన్ని తమపైనే మోపడంపై లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తొలివిడత వాయిదాల చెల్లింపునకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కేటగిరీ-1లో లబ్ధిదారుని వాటా రూ.500 ఒకే వాయిదాగా, రెండవ కేటగిరీలో లబ్ధిదారుని వాటా రూ.50 వేలకు రూ.12,500లు చొప్పున నాలుగు విడతలుగా, కేటగిరీ-3లో లబ్ధిదారుని వాటా రూ.లక్షకు రూ.25 వేల చొప్పున నాలుగు విడతలుగా చెల్లించాలి. జూలై 20లోగా తొలి విడత వాయిదాలు చెల్లించాలని ప్రకటించిన ప్రభుత్వం లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో గడువు జూలై 31 వరకు పొడిగించింది. అప్పటికి ఫలితం లేకపోవడంతో తాజాగా ఈ నెల 14 వరకు మరోమారు గడువిచ్చింది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 11,346 మంది లబ్ధిదారులు మాత్రమే తొలి విడత వాయిదాలు చెల్లించారు. వీరిలో కేటగిరీ-1కు 3,413 మంది డీడీలు చెల్లించగా, కేటగిరీ-2కి 1,346 మంది, కేటగిరీ-3కి 6,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకు రుణభారం తగ్గింపు.. సాధారణంగా టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ధర తగ్గించడం జరగదు. అయితే అధిక ధరలు నిర్ణయించిందన్న విమర్శలను ఎదుర్కొంటున్న సర్కారు దిగిరాక తప్పలేదు. ఆయా కేటగిరీల్లో లబ్ధిదారుని వాటా మాత్రం యథావిధిగా ఉంచింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన 40 రోజుల వ్యవధిలో రెండుసార్లు బ్యాంకు నుంచి తీసుకునే రుణ భారాన్ని తగ్గించింది. వసతుల కల్పనకు ఫ్లాటుకు రూ.1.5 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కాగా స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ఇటుకలతో ఇల్లు నిర్మిస్తే చదరపు అడుగు రూ.వెయ్యి వరకు మాత్రమే అవుతుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకు వాయిదాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. -
గాలి మేడలు
- మూడేళ్లలో మంజూరు చేసిన ఇళ్లు కేవలం 40,167 - పూర్తిచేసినవి 7,784 - పేదలను మభ్యపెట్టేందుకు సరికొత్త ఎత్తుగడ - పల్స్ సర్వేలోని ఇళ్లకు అర్హుల ఎంపిక పేరిట గ్రామ సభలు - నాడు జిల్లాకు 4.85 లక్షల గృహాలు అవసరంగా గుర్తింపు - 15వ తేదీ వరకు గ్రామసభల నిర్వహణకు సర్కారు ఆదేశాలు - స్వల్ప వ్యవధిలో అర్హుల నిర్ధారణపై పెదవి విరుస్తున్న అధికారులు - తొలిరోజు ఫించన్ల కోసం వచ్చిన లబ్ధిదారులతోనే సభల నిర్వహణ మండపేట : ఆది నుంచి గృహ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా పేదలను మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడ వేసింది. 2016 స్మార్ట్ పల్స్ సర్వేలో అవసరంగా గుర్తించిన 4.85 లక్షల ఇళ్లకుగాను తాజాగా మరోమారు అర్హుల ఎంపిక పేరిట గ్రామసభల నిర్వహణకు ఆదేశాలిచ్చింది. అందుకోసం ఈ నెల 15వ తేదీ వరకు గడువిచ్చింది. కేవలం 15 రోజుల వ్యవధిలో మండలంలో అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తొలిరోజు చాలాచోట్ల సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో తంతు నడిపించేశారు. కేవలం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ‘మమ’ అనిపించుకునేందుకే ప్రభుత్వం ఈ గ్రామసభలు నిర్వహిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హామీ ఏది బాబూ... అధికారంలోకి వస్తే మూడు సెంట్లు స్థలంలో రూ.1.5 లక్షలతో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మిస్తాం. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఎన్నికలు సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ తుంగలోకి చంద్రబాబు తొక్కారన్న విమర్శలున్నాయి. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ హౌసింగ్ పేరిట రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా 2016 ఏప్రిల్ 14న పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇంకేముంది పేదల పక్కా ఇళ్ల నిర్మాణం జోరందుకుంటుందని అంతా భావించగా గాలి మేడలేనని ఆన్లైన్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మూడు ఆర్ధిక సంవత్సరాలకుగాను జిల్లాకు మొత్తం 40,167 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో కేవలం 7,784 మాత్రమే పూర్తికావడం గమనార్హం. తొలి విడతగా 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 23,765 ఇళ్లను మంజూరు చేయగా వాటిలో పూర్తయ్యాయి. 2017–18లో 13,494 ఇళ్లు, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2,908 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికి ఒక ఇల్లు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన అందరికీ ఇళ్ల పథకం ఇప్పటికే అభాసుపాలవుతోంది. మౌలిక వసతుల భారాన్ని పేదలపైనే మోపుతూ ప్రైవేటు ప్లాట్లలో కూడా లేని విధంగా చదరపు అడుగుకు రూ. 1,953 ధర నిర్ణయించి విమర్శలు ఎదుర్కొంటోంది. లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపకపోతుండటంతో తొలివిడత వాయిదాల కోసం ఇప్పటికే రెండుసార్లు గడువును కూడా పొడిగించింది. మభ్యపెట్టే ఎత్తుగడ... పేదల ఇళ్ల నిర్మాణంలో ఆది నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు తాజాగా వారిని మభ్యపెట్టే ఎత్తుగడ వేసింది. స్మార్ట్ పల్స్ సర్వే పేరిట 2016 సంవత్సరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించిన విషయం విదితమే. అందులో జిల్లాలో సుమారు 14 లక్షల కుటుంబాలకుగాను 4.85 లక్షల మంది పేదవర్గాలకు చెందిన కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 4.85 లక్షల మందిలో ఎంత మంది అర్హులనే విషయాన్ని గ్రామసభల ద్వారా ఈనెల 15వ తేదీలోగా గుర్తించి నివేదికను అందజేయాలని ఆదేశాలిచ్చింది. కొన్ని మండలాల్లో 10 నుంచి 15 వేలు వరకు అర్హులు ఉన్నట్టుగా అప్పట్లో గుర్తించారు. అధిక శాతం మండలాల్లో 20కు పైగా పంచాయతీలు ఉండటం, ఎంపిక చేసిన వారు వేలల్లో ఉండటంతో 15 రోజుల వ్యవధిలో వారిలో పారదర్శకంగా అర్హుల గుర్తింపు ఎలా సాధ్యమని పలువురు అధికారులు అంటున్నారు. రెండు వారాల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయాల్సి ఉండటంతో చాలాచోట్ల గ్రామసభలు తూతూమంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1వ తేదీ కావడంతో పంచాయతీల వద్దకు సామాజిక పింఛన్లు తీసుకునేందుకు వచ్చిన వారితో చాలాచోట్ల పంచాయతీ కార్యాలయాల వద్ద వారితోనే అధికారులు తొలిరోజు గ్రామసభలు తంతు నడిపించారు. ఎంపిక చేసిన పేరుల్లో అనర్హులు ఉంటే చెప్పాలని అడుగుతుండగా తెల్లమొహం వేసి చూడటం సామాజిక పింఛన్ల లబ్ధిదారుల వంతయింది. పల్స్ సర్వేలో గుర్తించిన వారిలో అర్హులెవరనేది నిర్ధారించాల్సి ఉందని, అయితే వారికి ప్రభుత్వం గృహనిర్మాణ రుణాల మంజూరు చేసే విషయమై స్పష్టత లేదని హౌసింగ్ అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు కోరే అవకాశం ఉందని భావిస్తున్నామంటున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణనికి 2011 సెక్‌డేటా ఆధారంగా కేంద్రం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పల్స్‌సర్వే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులను కేంద్రం ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటుందనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామ సభలు నేపథ్యంలో త్వరలోనే తమ సొంతింటి కల సాకారమవుతుందని పేదవర్గాల ఆశాభావం వ్యక్తచేస్తున్నారు. కేంద్రం ఆమోదం తెలపకుంటే మూడేళ్లలో కేవలం40 వేల ఇళ్లు మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు రానున్న రెండేళ్లలో దాదాపు 4.5 లక్షలు ఇళ్లు ఎలా మంజూరు చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం పేదవర్గాల వారిని మభ్యపెట్టేందుకు ఇగో ఎత్తుగడని విమర్శిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికే మంజూరు చేసిన ఇళ్లకు నిధులు విడుదల చేసి పూర్తిచేయడంతోపాటు ఎన్నికల వాగ్ధానాలను చంద్రబాబు అమలు చేయాలని కోరుతున్నారు. -
ఏళ్లు గడిచినా దక్కని గూళ్లు
- సొమ్ములు కట్టినా ఎదురుచూపులే.. - పీఎంఏవైలోనూ అర్హులకు మొండిచెయ్యి - సిఫారసులకు, పచ్చచొక్కాలకే గృహయోగం కాకినాడ : ‘అర్హత’కు ప్రాతిపదిక ఏమిటి? పేదరికమా? అధికార పార్టీ జెండా పట్టుకోవడమా? ప్రభుత్వం మారిపోతే అర్హులు ‘అనర్హులు’గా మారిపోతారా? జిల్లా కేంద్రం కాకినాడలో అర్హత కలిగిన గృహనిర్మాణ లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇల్లు మంజూరు చేస్తామంటే సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వేలాది రూపాయలు అప్పులు చేసి, ప్రభుత్వానికి చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏడెనిమిదేళ్లుగా ఇల్లు మంజూరవుతుందని వెయ్యి కళ్లతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఐహెచ్ఎస్డీపీ పథకంలో ఇళ్లు నిర్మిస్తామని గత ప్రభుత్వ హయాంలో ప్రకటించారు. దీనికి దాదాపు 1,750 మంది లబ్ధిదారులు తమ వాటా సొమ్ములు కూడా చెల్లించారు. వీరిలో తొలివిడతగా అప్పట్లో 816 మందికి ఏటిమొగ, పర్లోపేట ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేశారు. మిగిలిన 934 మందీ ఒక్కొక్కరు రూ.5 వేల నుంచి రూ.86 వేల వరకు డీడీలు తీసి అప్పట్లోనే గృహనిర్మాణ శాఖకు అందజేశారు. అలా వీరంతా చెల్లించిన రూ.3 కోట్ల వరకు సొమ్ము గృహనిర్మాణ శాఖలో మూలుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణం కుంటుపడడం.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతో ఇక సొంతింటి ‘కలే’నని లబ్ధిదారులు డీలా పడుతూ వచ్చారు. ఇళ్లు ఎప్పుడు మంజూరైనా సొమ్ములు కూడా చెల్లించిన తమకే ప్రాధాన్య క్రమంలో ముందుగా అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎంఏవైలో మొండిచెయ్యి ‘అందరికీ ఇళ్లు’ పేరుతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఏడేళ్ల క్రితమే వేలాది రూపాయలు అప్పులు చేసి మరీ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే గత లబ్ధిదారులను పక్కన పెట్టి పచ్చచొక్కాలతో కూడిన జాబితా బయటకు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొత్తగా 4,600 ఇళ్లు మంజూరైనా పాత జాబితాలో ఉన్న చాలామందికి చోటు దక్కకకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. పారదర్శకత ఏదీ? పీఎంఏవై లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పూర్తిగా కొరవడింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేదరికమే అర్హతగా తీసుకుని రాజకీయాలకు దూరంగా అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలను కూడా సమన్వయం చేసుకుని అర్హులకు ఇళ్లు దక్కేలా కృషి చేశారు. ప్రస్తుతం అలాంటి విధానానికి భిన్నంగా జన్మభూమి కమిటీ సభ్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆయన బంధువులు చక్రం తిప్పి సొంత పార్టీ కార్యకర్తలకు, సొమ్ములు ఇచ్చినవారికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పిందే వేదంగా చేసుకుపోవడంతో అర్హులకు మొండిచెయ్యే మిగిలింది. గ్రీవెన్స్‌సెల్ ఎందుకూ? కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌కు నిత్యం ఎంతోమంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. వారి అర్హతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికార పార్టీ నేతల సిఫారసులకే పెద్దపీట వేస్తే ఇక గ్రీవెన్స్‌సెల్ వల్ల ప్రయోజనం ఏమిటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఏడెనిమిదేళ్ల క్రితం దరఖాస్తులు చేసుకుని డబ్బులు కూడా కట్టినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ న్యాయం చేయాలి ఏడేళ్ల క్రితం ఇంటికోసం దరఖాస్తు చేశా. రూ.26 వేలు డీడీ కూడా తీసి ఇచ్చా. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు వస్తుందని ఎంతో ఎదురు చూసినా న్యాయం జరగలేదు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలి. - టి.సత్యనారాయణ, లబ్ధిదారు నచ్చినవారికి ఇస్తున్నారు గృహనిర్మాణాల్లో అర్హత కలిగిన పాత లబ్ధిదారులను పరిగణనలోకి తీసుకోవాలి. వేలకు వేలు అప్పులు చేసి సొమ్ములు కట్టాం. తీరా ఇళ్లు వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టి నచ్చినవారికి ప్రాధాన్యం ఇనిస్తున్నారు. - బి.వెంకటలక్ష్మి, లబ్ధిదారు వడ్డీలు కట్టలేకపోతున్నాం ఇల్లు వస్తుందని మూడు విడతలుగా రూ.83 వేలు ప్రభుత్వానికి చెల్లించాను. అప్పులు చేసి కట్టడంతో టైలరింగ్ వృత్తిపై ఆధారపడుతున్న నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చేసిన అప్పుకు వడ్డీలు పెరిగి, ఇళ్లు మంజూరు కాని పరిస్థితి కనిపిస్తోంది. మాకు న్యాయం చేయాలి. - వాయివాడ రమణ, లబ్ధిదారు -
ఇళ్ల ముసుగులో.. దోపిడీ
- డబ్బులిచ్చుకో... ఇల్లు పుచ్చుకో...! - కాకినాడలో ఓ నేత కనుసన్నల్లో అడ్డగోలు బాగోతం - లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షం - ప్రహసనంగా మారిన ప్రధాని ఆవాజ్ యోజన పథకం కాకినాడ: ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం ప్రహసనంగా మారింది. పేదలకు దక్కాల్సిన ఇళ్లు అధికార పార్టీల నేతల సిఫార్సుల మేరకు వారి అనుచరులకే దక్కుతుండడంతో అర్హత కలిగిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఏక పక్షంగా ఎంపిక చేసి రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కాకినాడలో కీలక నేత కనుసన్నల్లో అవినీతి బాగోతమంతా నడుస్తోంది. జిల్లాల వ్యాప్తంగా 19,240 ఇళ్లు... ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో జిల్లాకు 19 వేల240 ఇళ్లను మంజూరు చేశారు. కాకినాడ నగర పాలక సంస్థలో 4,608, రాజమహేంద్రవరంలో 4200, మండపేటలో 4,064, పెద్దాపురంలో 1724, అమలాపురంలో 1636, పిఠాపురంలో 874, సామర్లకోటలో 1048, రామచంద్రపురం 1068 లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300,365,403 ఎస్ఎఫ్టీ కేటగిరీల్లో ప్లాట్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అర్బన్ ప్రాంతాలైన జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్ తరహాలో నిర్మాణం చేపట్టేందుకు గడచిన ఆరు నెలలుగా భూసేకరణ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అంతవరకూ బాగానే ఉన్నా అర్హత కలిగిన పేద వర్గాలకు దక్కాల్సిన ఇళ్లు మాత్రం దళారుల చేతుల్లోకి వెళ్లి పోతుండడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా సొంతింటి కోసం కంటున్న కలలు నెరవేరుతాయనుకునే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు నచ్చిన వారిని ఎంపిక చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి కొన్నిచోట్ల రూ.10 వేలు, మరికొన్ని చోట్ల రూ.20 వేల వరకు ముడుపులు కూడా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడలో అవినీతి దందా... కాకినాడలో అవినీతిపరుల దందా ఎక్కువైంది. ఇప్పటికే భూముల కబ్జా, ఇతరత్రా వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్గదర్శకాలు పక్కన పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వాస్తవానికైతే, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులను పీఎంఏవై వెబ్సైట్లో నమోదు చేస్తూ వచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీ, ప్రాధాన్యతా క్రమంలో అర్హత కలిగిన పేద వర్గాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం హౌసింగ్, నగరపాలక సంస్థకు చెందిన సిబ్బందితో సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే జిల్లా కేంద్రం కాకినాడలో అకస్మాతుగా కీలక ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఇళ్లు మంజూరైనట్టుగా కొంతమందికి మెసెజ్ రూపంలో సమాచారం పంపించారు. అసలు ఎవరు ఎంపిక చేశారు.? ఎప్పుడు సర్వే చేశారు? లబ్ధిదారుల జాబితాను ఎవరు, ఎక్కడ ప్రకటించారు? అన్నది వివరాలు వెల్లడించకుండానే సదరు ప్రజాప్రతినిధి నుంచి మెసెజ్‌లు వెళ్లాయి. అందులో క్లారిటీ లేకపోవడంతో మెసెజ్ అందుకున్న లబ్ధిదారులంతా సదరు నేత ఇంటికి క్యూ కట్టారు. అక్కడ స్పష్టత ఇచ్చాక మంజూరైన ఇళ్లకు సంబంధించిన డీడీలు పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి ఎగబడ్డారు. తమ్ముళ్ల చేతివాటం ... ఇళ్ల మంజూరులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇంటికి రూ.20 వేలు చొప్పున వసూళ్లు చేసినట్టు కొందరు లబ్ధిదారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ముడుపులిచ్చాకే ఇళ్లు అన్నట్టుగా సంకేతాలివ్వడంతో తప్పని పరిస్థితుల్లో చెల్లించుకుంటున్న పరిస్థితి నెలకుంది. మిగతా మున్సిపాల్టీల్లో కూడా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడలో కొందరి తమ్ముళ్ల తిరుగుబాటు కాకినాడలో తెలుగు తమ్ముళ్లందర్నీ సదరు నేత సంతృప్తి పరచలేదు. కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగతా కొందర్ని విస్మరించారు. దీంతో లబ్ధి చేకూరని తెలుగు తమ్ముళ్లంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వీరంతా శనివారం ఆందోళనకు దిగేందుకు సన్నద్ధమవ్వగా విషయం తెలిసి సదరు కీలక నేత హుటాహుటిన వారందర్నీ బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. వారిని సంతృప్తి పరిచేందుకు జాబితాలో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అడ్డగోలుగా లబ్ధిదారుల ఎంపిక ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని ఏ శాఖ పర్యవేక్షిస్తుందనే అంశంపై కూడా స్పష్టత లేకపోయింది. గతంలో ఇళ్ల కోసం అర్హులైన వారినుంచి డీడీలు తీసుకున్నారు. వారి జాబితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న వారికి మొదట ప్రాధాన్యం కల్పించి, మిగతా వారిని ఎంపిక చేయాలి. ఒక్క కాకినాడ విషయానికొస్తే గతంలో వచ్చిన వాటిలో 1200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సుమారు 39 వేల దరఖాస్తులొచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి ప్రాధాన్యతనిచ్చి, తాజాగా వచ్చిన వాటిలో ప్రాధాన్యత మేరకు ఎంపిక చేయాలి. అదికూడా గృహ నిర్మాణశాఖ ఆధీనంలో ఎంపిక జరగాల్సి ఉండగా ప్రస్తుతం నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. లబ్ధిదారుల ఎంపికపై గృహనిర్మాణ సంస్థ అధికారులను వివరణ కోరితే అంతా కార్పొరేషన్ చూసుకుంటుందని చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులను అడిగితే కేవలం దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ మాత్రమే చేస్తున్నామని, ఉన్నతాధికారుల సూచన మేరకు డీడీలు మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరి లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. దరఖాస్తులు ఆన్లైన్ మాత్రమే చేశాం... గృహ నిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేశాం. ఎంపికైన లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకున్నాం. ఎంపిక ప్రక్రియపై టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధం లేదు. – కాలేషా, సిటీప్లానర్, కాకినాడ -
రైతులకు మరిన్ని ప్రాంతీయ కేంద్రాలు
♦ వారికి వాహన, గృహ, విద్యా, పర్సనల్ లోన్లూ ఇవ్వాలి ♦ ఇవన్నీ వేగవంతం చేసేందుకు మరో 21 రీజినల్ సెంటర్లు ♦ ఏడాదిలో కొత్తగా 70 శాఖలు, 5 ఇన్టచ్ సెంటర్లు ♦ ‘సాక్షి’తో ఎస్బీఐ తెలంగాణ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతులకు పంట రుణాలివ్వటంతోనే బ్యాంకుల పని అయిపోయినట్లు కాదు. కారు, టూవీలర్, ఇల్లు, విద్య, పర్సనల్ లోన్ వంటి ఇతరత్రా అవసరాలకూ ముందుండాలి. మరోవంక ఇతర రుణ గ్రహీతలతో కలిపి వీరిని ఒకే గాటన కట్టకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ సర్కిల్ సీజీఎం హర్దయాల్ ప్రసాద్ చెప్పారు. ఈ ఉద్దేశంతోనే తాము తెలంగాణలో ప్రత్యేకంగా రిటైల్ క్రెడిట్ ప్రాసెసింగ్ సెంటర్లను (ఆర్‌సీపీసీ) ఏర్పాటు చేశామని, ఇవి రైతులకు పంట రుణాలే కాక వారికి అవసరమైన ఇతర రుణాలనూ అందిస్తాయని చెప్పారు. బుధవారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన పలు అంశాలు మాట్లాడారు. అవి... తెలంగాణలో ఐదు ఆర్సీపీసీలు రైతులు పంట రుణాలు మినహా ఇతరత్రా రుణాలకోసం రుణదాతలు, బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలతో నష్టపోతున్నారు. ఆర్‌సీపీసీ సెంటర్ల ఏర్పాటుతో వారికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఆర్‌సీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఒక్కో సెంటర్ 20 శాఖలను కవర్ చేస్తుంది. తెలంగాణలో 700 బ్రాంచులు అగ్రికల్చరల్ లోన్లపై పనిచేస్తాయి. వీటిని కవర్ చేయడానికి కొత్తగా మరో 26 ఆర్సీపీసీలను ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లోనే రుణాలు మంజూరు చేస్తాం. వాహన రుణాలకైతే ఇంకా తక్కువ సమయం పడుతుంది. ఆగస్టుకల్లా 70 బ్రాంచీల విలీనం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం జరిగింది. మేలో డేటా, ఖాతాల బదిలీ కూడా పూర్తయింది కూడా. ఆయా అనుబంధ బ్యాంకుల వ్యాపారం రూ.13 వేల కోట్లు ఎస్బీఐలో విలీనమైంది. ప్రస్తుతం వాటి బ్రాంచీల విలీన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆగస్టు నాటికి 70 శాఖల విలీనం పూర్తవుతుంది. విలీనంలో భాగంగా సేవింగ్స్ ఖాతాలు, ఉత్పత్తులు, రుణాల మంజూరు పద్ధతి, సంస్కృతి వంటి వాటిపై అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. రోజుకు 200 మందికి బృంద శిక్షణలిస్తున్నాం. కొత్తగా 64 శాఖల ఏర్పాటు.. ప్రస్తుతం తెలంగాణలో ఎస్బీఐకి 1,300 బ్రాంచులు, 2,800 ఏటీఎంలున్నాయి. వచ్చే 3 నెలల్లో కొత్తగా 300 ఏటీఎంలు, ఏడాదిలో 64 శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యించాం. తెలంగాణలో 10 ఇన్ టచ్ ఎస్బీఐ శాఖలున్నాయి. ఇందులో 9 హైదరాబాద్‌లో, 1 వరంగల్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 5 శాఖలను ఏర్పాటు చేస్తాం. ఇవి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో వస్తాయి. ఎస్‌హెచ్‌జీలకు రూ.2 వేల కోట్ల రుణాలు.. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జీ) గతేడాది రూ.2,300 కోట్ల రుణాలిచ్చాం. ఈ ఏడాది రూ.2 వేల కోట్లు లక్ష్యించాం. రాష్ట్రంలో 1.60 లక్షల ఎస్‌హెచ్‌జీ బృందాలుండగా.. 65 శాతం ఒక్క హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 99 శాతం రైతులకు రూపే కార్డులను పంపిణీ చేశాం. ఇందులో 60 శాతం మంది వినియోగిస్తున్నారు. ఎస్బీఐ మొత్తం లావాదేవీల్లో 42 శాతం డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి. -
‘అందరికీ’ అయోమయం
- అందరికి ఇళ్ల పథకంలో కొరవడిన స్పష్టత - చదరపు అడుగు ధరల్లో వ్యత్యాసాలు - తాత్కాలికమంటూ చదరపు అడుగు రూ. 2,150 నుంచి రూ.1,925లకు తగ్గింపు - మున్ముందు పెంచేందుకే ‘తాత్కాలికమని’ అనుమానాలు - షీర్వాల్ టెక్నాలజీ పేరుతో సదుపాయాల కల్పన పేదలపైనే - ఒక్కొక్కరిపై రూ.1.4 లక్షలు అదనపు భారం - జిల్లాలోని తొలివిడత లబ్ధిదారులపై రూ.269.39 కోట్ల భారం - విశాఖలో ప్రైవేటు సంస్థ ప్లాటు చదరపు అడుగు ధర రూ.1,050లే. మండపేట : అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు ఎండీగా ఉన్న కనస్ట్రక్షన్ సంస్థ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్లాటులో చదరపు అడుగు ధర (స్థలం కాకుండా) రూ.1,050. ఈ మేరకు పేదవర్గాల వారికి ప్రభుత్వం నిర్మించే ప్లాట్లలో చదరపు అడుగు ధర ఇంతకన్నా తక్కువ ఉండాలి. అయితే అందరికీ ఇళ్ల పథకంలో ప్రభుత్వం చదరపు అడుగుకు నిర్ణయించిన ధర రూ. 1,925లు. షీర్వాల్ టెక్నాలజీ అంటూ స్థానిక స్థితిగతులకు తగని విధానంలో ప్లాట్ల నిర్మాణం చేయడంతోపాటు సదుపాయాల కల్పన భారాన్ని పేదలపై మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లోని పేదవర్గాల వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘అందరికి ఇళ్ల పథకం’లో ధరల వ్యత్యాసం లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో నిర్ణయించిన చదరపు అడుగు ధరను ‘తాత్కాలికం’ పేరిట స్వల్పంగా తగ్గించి లబ్ధిదారులతో అంగీకార పత్రాలను తీసుకుంటోంది. సదుపాయాల కల్పన భారాన్ని ప్రజలపైనే మోపుతోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారునిపై రూ.1.4 లక్షలు చొప్పున జిల్లాలోని తొలివిడతలో నిర్మించనున్న 19,242 మందిపై దాదాపు రూ. 269.39 కోట్లు భారాన్ని మోపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల వారి ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు 24,332 మంజూరు చేసింది. కాకినాడ నగర పాలక సంస్థకు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200 ప్లాట్లు మంజూరు చేయగా, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్లు నిర్మాణానికి రూ.1,457.62 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ధరలు తాత్కాలికమేనా ? అందరికి ఇళ్ల పథకంలో ప్లాటు ధరలపై విమర్శలు వస్తున్న నేపధ్యంలో ‘తాత్కాలికం’ పేరిట మూడు కేటగిరీల్లో చదరపు అడుగుకు రూ. 80లు నుంచి 100లు వరకు తగ్గించింది. ఈ మేరకు గతంలో రూ. 2,150 ఉన్న చదరపు అడుగు ప్రస్తుతం 1,925లకు తగ్గింది. గతంలో రూ. 6.46 లక్షల వ్యయంతో 300 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్రూం ప్లాటు, రూ. 7.8 లక్షలతో 365 చదరపు అడుగుల వైశాల్యంలో సింగిల్ బెడ్ రూం ప్లాట్, రూ.9.14 లక్షలతో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూం ప్లాటు చొప్పున మూడు విభాగాలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. ఆయా విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల రూపంలో లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం 300 అడుగుల ప్లాటును రూ. 5.77 లక్షలకు, 365 చదరపు అడుగుల ప్లాటు రూ. 6.94 లక్షలు, 430 అడుగుల ప్లాటుకు రూ. 8.14లుగా ధర నిర్ణయించింది. సబ్సిడీలు షరామామూలే. ఇది తాత్కాలికమేనని లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్న అంగీకార పత్రంలో పేర్కొనడం గమనార్హం. మండపేట పట్టణంలో 4,064 ప్లాట్లు నిర్మాణానికిగాను ఇటీవల గొల్లపుంతకాలనీలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు భూమిపూజ చేశారు. ప్రస్తుత ధర తాత్కాలిక ధరగా అంగీకార పత్రంలో ఉండటంతో భవిష్యత్తులో ఈ ధర పెరిగే అవకాశముందని లబ్ధిదారుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల్లో స్పష్టత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రూ. 269.39 కోట్లు భారం... ప్రస్తుతం ప్లాట్ల నిర్మాణ పనులకుగాను జిల్లాలోని ఆయా ఏరియాలను బట్టి చదరపు అడుగుకు రూ.1600లు వరకు ధర నిర్ణయించి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ మేరకు చదరపు అడుగులోని మిగిలిన మొత్తం మౌలిక వసతుల కల్పన కోసం లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తోంది. డబుల్ బెడ్రూం తీసుకున్న లబ్ధిదారునిపై వసతుల కల్పన రూపంలో రూ.1.4 లక్షలు భారాన్ని మోపుతోంది. జిల్లాలో 90 శాతం మందికి పైగా డబుల్ బెడ్ రూం ప్లాటు కోరుకోగా తొలివిడతలో నిర్మిస్తున్న 19,242 మంది లబ్ధిదారులపై దాదాపు రూ. 269.39 కోట్లు భారం పడుతుందని అంచనా. తాత్కాలిక ధర పెరిగితే ఈ భారం మరింత పెరగనుంది. -
పేదలపై జులుం తగదు
లక్షల్లో ఇళ్లు అమ్ముకున్న వారిపై చర్యలు శూన్యం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ద్వజం ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) : హౌసింగ్ అధికారులు అర్హులుగా గుర్తించి రూ.60,800 అప్పులు చేసి మరీ ప్రభుత్వానికి చెల్లిస్తే ఎండోమెంట్కాలనీలో ఫ్లాట్లను కేటాయించారని ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు లక్షల్లో ఆ ఇళ్లను అమ్ముకోవడం వల్లే పేదవారిని అన్యాయంగా ఖాళీ చేయించారని రాజమహేంద్రవరం అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ప్రకటించిన 181 మంది ఎందుకు అనర్హులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులు చెప్పాలి ఉండగా, అలా కాదని అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆజ్ఞతో ఏకపక్షంగా కొత్తవారికి కేటాయించడం దారుణమన్నారు. అధికారులు, పోలీసులు ఇల్లు ఖాళీచేయించే విధానం కూడా లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. తలుపులు పగలుగొట్టి, బయటకు ఈడ్చడం వంటి చర్యలు దారుణమన్నారు. కొత్తగా ఇచ్చిన 181మంది లబ్ధిదారుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులు ఉంటే తొలగించినా ఇబ్బంది లేదని అర్హులకు మాత్రం అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళతామని, బాధితులకు న్యాయం జరగని పక్షంలో కార్యాచరణ ఉద్యమాన్ని త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణం : రౌతు అధికారపార్టీ నాయకులు లక్షల్లో సొమ్ములు వసూలు చేసి అర్హులైన పేదవాడి ఎంగిలి మెతుకులు కోసం ఆశపడడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నగర కో ఆర్డినేటర్ రౌతుసూర్యప్రకాశరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపేదవాడికి గూడు ఉండాలన్న ఉద్ధేశ్యంతో దేవదాయశాఖ భూమిలో గృహాలను నిర్మించారన్నారు. లబ్ధిదారులను అధికారులు సర్వే చేసిన తరువాతే వారి వద్ద సొమ్ములు కట్టించుకుని ఇళ్లు కేటాయించారన్నారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన వాంబే గృహాలలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనర్హులు ఉన్నారని తన దృష్టికి వచ్చినా పేదవాడికి అన్యాయం జరగకూడదని భావించి ఎవరినీ తొలగించలేదని స్పష్టంచేశారు. లబ్ధిదారుల కోసం పోరాడుతున్న మజ్జి అప్పారావును పోలీసులు అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. క్రిమినల్ కేసులు పెట్టాలి : సీపీఎం నేత అరుణ్ లబ్ధిదారులను అర్హులుగా ప్రకటించిన అప్పటి కలెక్టర్ నుంచి కింద తహసీల్దార్, హౌసింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ తరువాత వీరిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత టి.అరుణ్ డిమాండ్ చేశారు. అప్పటి అధికారులు సర్వేలు నిర్వహించి అర్హులుగా ప్రకటించిన తరువాతే సొమ్ములు కడితేనే ఇళ్లు కేటాయించారన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుల పెత్తనమా? కందుల ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను కాదని రాజ్యాంగ విరుద్ధమైన జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో పచ్చ చొక్కాలకు ఇళ్లను కేటాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులుగా ప్రకటించిన 181మంది ఎందుకు అర్హులు కారో వివరంగా శ్వేతపత్రంను విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అప్పటి ఎమ్మెల్యే రౌతు ఎంతో కృషి చేసి లబ్ధిదారులకు ఇళ్ల నిర్మించి ఇచ్చారన్నారు. సీపీఐ నగర అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ 181 మంది లబ్ధిదారుల తొలగింపుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి కలిస్తే అందరితో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పోలీసులు, అధికారులతో బలవంతంగా ఖాళీచేయించడం దారుణమన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు మాట్లాడుతూ లబ్ధిదారులలో దళితులు అని చూడకుండా దారుణంగా తలుపులు పగలగొట్టి ఖాళీ చేయించడంపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని హెచ్చరించారు. తండ్రి ముఖ్యమంత్రి, కుమారుడు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రీ కొడుకులుకు ఇళ్లు ఉండకూడదా అని ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్‌లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన లబ్ధిదారుణి పెద్దిరెడ్డి రాజేశ్వరిదేవిని అనర్హురాలుగా ప్రకటించి ఖాళీ చేయించడం దారుణమన్నారు. ఉద్యమ నేత మజ్జి అప్పారావు మాట్లాడుతూ అధికారులు, పోలీసులు తీరు దారుణమని, 54 మందికి హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిందని, పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును సీడీల రూపంలో త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అఖిలపక్ష నాయకులు మార్తి నాగేశ్వరరావు, పోలిన వెంకటేశ్వరరావు, గోలి రవి, మార్గాని రామకృష్ణగౌడ్, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాల్లో వేగం పెరగాలి
– మంత్రి కాల్వ శ్రీనివాసులు కర్నూలు(అర్బన్): గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్లోని సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 లక్షల మంది గృహ వసతి లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 40 శాతం గృహ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదని, ఈ నెలాఖరు నాటికి కేటాయించిన లక్ష్యాల్లో 60 శాతం పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లా 13వ స్థానంలో ఉందని, వచ్చే రెండేళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో నాగులదిన్నె, వేముగోడు రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కలెక్టర్‌ను కోరారు. జోహరాపురం కాలనీలో నిర్మించిన గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, హౌసింగ్ పీడీ హుసేన్‌సాహెబ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
టారో 30 ఏప్రిల్ నుంచి 6 మే 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో సాగిపోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ఫలితమూ దక్కుతుంది. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, వీపునొప్పి, కొద్దిపాటి మానసిక ఒత్తిడి బాధించవచ్చు. సంగీత చికిత్స లేదా ప్రకృతి వైద్యం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది. మీ కలలు నిజం అయే అవకాశం కలుగుతుంది.Sపలుకుబడిగల వ్యక్తుల సహకారం లభిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ వారం ప్రయోజనం చేకూరుతుంది. మీ ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి మంచి కబురు అందుతుంది. చదువుకు సంబంధించిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. విందు వినోదాలలో తీరుబడి లేకుండా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలకు పదును పెట్టుకుని, వేగంగా పని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కలిసి వచ్చే రంగు: » ంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. నూత్న శక్తి సామర్థ్యాలతో ఉత్సాహంగా పని చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా విదేశీయానం చేయవలసి రావచ్చు. ఒక స్త్రీ మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పెట్టిన పెట్టుబడల నుంచి లాభపడతారు. మార్నింగ్ వాక్, యోగ వంటివి కొనసాగించడం మంచిది. కలిసివచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్డర్లు అందుతాయి. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకుంటారు. మీ కష్టసుఖాలను స్నేహితులకు చెప్పుకుని ఉపశమనం పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు చేసిన పనులకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి ఓర్చుకోలేక మిమ్మల్ని చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. తెలివిగా తిప్పికొట్టడం అలవరచుకోండి. నూతన గృహ లేదా వాహన యోగం ఉంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే అనివార్య కారణాల వల్ల పనులు ఆలస్యం అవవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. Ðఅవకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 23 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పనిలో బాధ్యతాయుతంగా మెలిగి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. కొత్త ఉరవడిని కనిపెడతారు. లక్ష్యాలను నిర్ణయించుకుని పని చేస్తే మెరుగైన ఫలితాలను పొందగలమని గ్రహిస్తారు. ఈ వారం మీ స్నేహితుడి నుంచి ఒక శుభవార్తను అందుకుంటారు. ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారో, కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యతాయుతంగా ఉండటం అవసరం అని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పనిప్రదేశంలో కొత్త సవాళ్లు, కొన్ని ప్రతిబంధకాలూ ఏర్పడవచ్చు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోక, సహోద్యోగుల సహకారంతో తగిన చర్యలు చేపట్టండి. ఎంతోకాలంగా ఒక వ్యాపారం ఆరంభించడానికి లేదా కొత్త ఆదాయ మార్గం కోసం ఎంతోకాలంగా మీరు చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేయడానికి ఇది తగిన సమయం. ప్రేమలో మీకున్న చిక్కులు తొలగుతాయి. కలిసొచ్చే రంగు: నీలాకాశం మిథునం (మే 21 – జూన్ 20) మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే విజయానికి చేరువ అవుతారని గ్రహించండి. పాత జ్ఞాపకాలు కొంత బాధపెట్టవచ్చు. అయితే గతంలోని చేదును మాత్రమే కాకుండా, తీపి అనుభవాలనూ నెమరు వేసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ప్రేమ విషయంలో కొద్దిపాటి చొరవ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: పచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ కృషి ఫలిస్తుంది. వృత్తిపరమైన చిక్కులు, చికాకులు తొలగి మీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో, ఏది ముఖ్యమైనదో కాదో అవగాహన ఏర్పరచుకుని అందుకు తగ్గట్టు మెలగకపోతే మీరు ఎదగడం కష్టం. ఆర్థికంగా బాగానే ఉంటుంది. మనసును సానుకూల భావనలతో నింపుకోండి మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఊహాలోకంలో విహరించడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలు పెడతారు. అదే మీకు అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తుంది. మీ ప్రతిభకు సామాజిక మాధ్యమాలలో మంచి ప్రచారం లభిస్తుంది. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. తెలివితేటలతో నడుచుకోవడం వల్ల ఆదాయం కూడా బాగానే ఉంటుంది. విందు వినోదాలలో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఐకమత్యమే బలం అన్నట్లుగా అందరినీ కలుపుకుంటూ పోవడం వల్ల మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా మీరు కంటున్న కలలు కార్యరూపం దాలుస్తాయి. పనిలో మాత్రం మీరు మరింత చురుకుగా, మరింత అంకిత భావంతో ఉంటేనే మీ లక్ష్యాలను చేరుకోగలరని తెలుసుకుంటారు. బద్ధకమనే మీ శత్రువును వదిలించుకుంటే మంచిది. మెడ లేదా తల నొప్పి బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితం మీద కొత్త ఆశలు చిగురిస్తాయి. పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మీ ఆదాయ వనరులకీ, మీ కోర్కెలకీ మధ్య సమన్వయం సాధిస్తే కానీ మీ బడ్జెట్ లోటు పూడదని గ్రహిస్తారు. అనవసర వివాదాలు తలెత్తే ప్రమాదం ఉన్నందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా నేర్పుగా తప్పుకోవడం మంచిది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భూమి కొనుగోలు చే స్తారు లేదా భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. జీవితంలో కొత్త మార్గాన్ని, గమ్యాన్నీ ఎంచుకుంటారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు భావోద్వేగంతో ఉంటారు. మీ ప్రేమ సఫలం కాలేదనో, పెళ్లి సంబంధం చేజారిపోయిందనో దిగులు పడవద్దు. మరో మంచి వ్యక్తి మీకోసం వేచి ఉన్నారని అర్థం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఎదుగుదలకు మీ కోరికలే అడ్డుపడుతున్నాయని గ్రహించి, వాటి మీద నియంత్రణ సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. మీ పిల్లలకు, కుటుంబానికి ఆనందం కలిగిస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం కాదు. ఎంతోకాలంగా దూరంగా ఉన్న ఒక ఆత్మీయుడిని లేదా స్నేహితుని కలుస్తారు. డిప్రెషన్ నుంచి బయపడే ప్రయత్నం చేస్తారు. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పాత బాకీలనుంచి, అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు. మీ ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. బృందంతో కలసి పని చేసి మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సన్నిహితులకు కూడా మీరు ఏమి చేయాలనుకుంటున్నదీ చెప్పకండి. ఒక పెద్దమనిషి సహకారంతో త్వరలోనే మీ కోరికలన్నీ తీరతాయి. అందరితోనూ సామరస్యంగా మెలగడం వల్ల మనశ్శాంతి అని తెలుసుకుంటారు. కలిసిచ్చే రంగు: దొండపండు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) చాలా కాలంగా మీరు అణగదొక్కి ఉంచిన సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. జాగ్రత్త. ఇది మీ ప్రస్తుత జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి పలుకుబడిని ఉపయోగించి, తిరిగి ఆ సమస్యలను అణిచేసే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్స తీసుకుంటారు. అనవసర వివాదాల జోలికి వెళ్లద్దు. కలిసొచ్చే రంగు: కాఫీ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త విషయాలను నేర్చుకోవాలన్న మీ జిజ్ఞాసను ఈ వారంలో తీర్చుకుంటారు. మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ ఆలోచనలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ కళ అందరినీ అలరిస్తుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. భావోద్వేగాలలో మునిగి తేలతారు. కలిసొచ్చే రంగు: తెలుపు -
‘బాబు’కు ఇంధ్రభవనం పేదలకు ‘చంద్ర’గ్రహణం
- మూడేళ్లుగా ఇళ్ల కోసం లక్ష దరఖాస్తులు - ఇందులో 60 వేలు ఆన్లైన్లో - విమర్శలు వెల్లువెత్తగా జిల్లాకు 23 వేల ఇళ్లు మంజూరు - మొదలు పెట్టిన ఇళ్లకు అరకొర చెల్లింపులు - వై.ఎస్.హయాంలో ప్రతి ఏటా ఇళ్ల మంజూరే - తరువాత వచ్చిన సీఎంల హయాంలో మంజైరైన వాటికీ గతి లేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేద, మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటి కల ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసిన చంద్రబాబు ఎన్నికలయ్యాక గాలికొదిలేశారు. సీఎం గద్దెనెక్కి మూడేళ్ల కాలంలో ముచ్చటగా మూడు ఇళ్లు కూడా నిర్మించిన దాఖలాలు జిల్లాలో లేవు. సొంత ఇంటి కల సాకారం చేసుకునేందుకు వేలాది మంది దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క ఇల్లు నిర్మించిన పాపాన పోలేదు. పేదల గోడు మాట దేవుడెరుగు సీఎం మాత్రం ఇంద్రభవనం లాంటి భవంతిలో ఇటీవలనే గృహ ప్రవేశం కూడా చేశారు. ఎదురు చూపులు ... ఎండమావులు సొంత ఇల్లు నిర్మించుకోవాలని మూడేళ్లుగా జిల్లాలో సుమారు లక్ష మంది దరఖాస్తు చేసుకుని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఇది అధికారికంగా గృహనిర్మాణ సంస్థకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే. ఈ లక్ష దరఖాస్తుల్లో సుమారు 60 వేల దరఖాస్తులను గృహనిర్మాణ సంస్థ ఆన్లైన్లో నమోదు చేసింది. గ్రామాల్లో పర్యటనలకు వెళుతున్న సందర్భంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారి నుంచి నిరసన ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు మొత్తుకోగా ప్రభుత్వం ఆరు నెలలు క్రితం జిల్లాకు 23 వేల 348 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో 17 వేల 390 ఇళ్ల నిర్మాణాలను గత అక్టోబరు నెలలో లబ్థిదారులు ప్రారంభించారు. నెల రోజుల తరువాత నవంబరు నెలలో ఇళ్లు మొదలుపెట్టిన వారికి మాత్రం మొదటి విడత ఆన్లైన్లో అరకొర చెల్లింపులతో సరిపెట్టేశారు. మొదటి విడతగా ఒక్కో ఇంటికి 50 నుంచి 100 బస్తాలు సిమెంట్, రూ.6000లు నగదు చెల్లించారు. అంటే ఇళ్లు మొదలుపెట్టాక మొక్కుబడిగా ఒక నెల బిల్లులంటూ ఆర్భాటం చేసి ఆ తరువాత లబ్థిదారులను గాలికొదిలేశారు. 2016 డిసెంబర్ నుంచి నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించడం లేదు. ఆ రకంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3.40 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా డిసెంబరు నెల నుంచి ఇంతవరకు అంటే ఐదు నెలలుగా ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న లబ్థిదారులకు చంద్రబాబు సర్కార్ చిల్లిగవ్వ విడుదల చేసిన దాఖలాలు లేవు. గడచిన మూడేళ్లుగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టకుండా ఆర్భాటపు ప్రచారాల్లో ప్రభుత్వం మునిగితేలుతుందన్న విమర్శలున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా నేతలు పట్టించుకోవడం లేదు. ఆ రోజులే వేరు... చంద్రబాబు సర్కార్ మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించని పరిస్థితి ఇలా ఉంటే మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 నుంచి ప్రతి ఏటా దరఖాస్తు చేసుకొన్న ప్రతి లబ్ధిదారునికీ ఇల్లు మంజూరు చేశారు. వైఎస్ సీఎంగా ఉన్నంత కాలం జిల్లాకు ప్రతి ఏటా 60 వేలకు పైనే ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. మంజూరు చేయడమే కాకుండా ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తూ వచ్చారు. వై.ఎస్. హఠాన్మరణం తరువాత కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉండగా నిర్మించిన సుమారు 18 వేల ఇళ్లు ఇప్పటికీ పలు దశల్లో నిలిచిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నాయి. ఈ ఇళ్ల లబ్థిదారులకు సుమారు రూ.12 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ బకాయిల ఊసే ఎత్తడం లేదు. సరికదా కొత్తగా మంజూరుచేసి నిర్మాణం చేపట్టిన ఇళ్లకు కూడా పైసలు ఇవ్వడం లేదు. ఫలితంగా లబ్థిదారులు లబోదిబోమంటున్నారు. ఇళ్లు మంజూరయ్యాయి నిర్మాణాలు చేపట్టాలని హడావిడి చేశారు. తీరా ఇళ్లు మొదలుపెట్టాక బిల్లులు విడుదల చేయకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక లబ్థిదారుల పరిస్థితి అయోమయంగా తయారైంది. -
టారో 16 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. విజయం వరిస్తుంది. మీ కృషి, నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. సంభాషణా చాతుర్యంతో సభలు, సమావేశాలలో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యక్తిగత జీవితానికీ, బిజినెస్కీ సమన్వయం ఉండేలా చూసుకోండి. కుటుంబం వల్ల ఆనందం కలుగుతుంది. లక్కీ కలర్: లేత గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చురుకుగా, అంకితభావంతో పని చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఉదారంగా, నిజాయితీగా ఉంటారు. మీ హాస్య చతురతే క్లిష్ట పరిస్థితులనుంచి మిమ్మల్ని ఒడ్డెక్కిస్తుంది. మీ కుమారుడు లేదా ఆప్తుడు వృద్ధిలోకి వచ్చి మీకు చేయూతగా నిలుస్తారు. ధ్యానం ద్వారా మీలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు మిథునం (మే 21 – జూన్ 20) మీ నీతి నిజాయితీలు, పరోపకార గుణాలే మిమ్మల్ని వ్యాపారంలో లాభాలబాటలో నడిపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారానికి పురిగొల్పుతాయి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టి, వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాల నుంచి, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. లక్కీ కలర్: ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. వారికి స్వాంతన చేకూరుస్తారు. పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ఉత్సాహంగా కొత్త ప్రాజెక్టులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: ముదురు గులాబీ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. లక్కీ కలర్: లేత బూడిద రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీ చుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తెలివిగా తిప్పికొడతారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. లక్కీ కలర్: బంగారు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పనిలో కొద్దిపాటి ఒత్తిడి తప్పదు. కొత్త ఆదాయ వనరులను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయండి. లక్కీ కలర్: ముదురు నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు రావాలంటే మాత్రం మీరు మరింత కష్టపడక తప్పదు. లక్కీ కలర్: ముదురు ఎరుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. మన్ననలందుకోండి. లక్కీ కలర్: స్ట్రాబెర్రీ వంటి ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కలిసొచ్చే వారమిది. ఏదైనా విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకుంటే తటపటాయించవద్దు. లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. విదేశీయానం ఉండవచ్చు. శరీరాకృతిని మెరుగుపరచుకునే ప్రయత్నం చేయండి. లక్కీ కలర్: మావి చిగురు -
టారో : 9 ఏప్రిల్ నుంచి 15 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉత్సాహంతో పనులు చకచకా చే స్తారు. ముఖ్య విషయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే అవమానం తప్పదు. మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తారు. కెరీర్లో లేదా మీ జీవితంలో భారీ మార్పు చేర్పులుండవచ్చు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. ప్రాక్టికల్‌గా ఉండటం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వారం. అనవసరంగా గతాన్ని తవ్వుకుంటూ కూచోవద్దు. అధికార యోగం లేదా పదవీయోగం తలుపు తడుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. వారసత్వపు ఆస్తులు కలిసి రావడం వల్ల సంపద పెరుగుతుంది. పలుకుబడిగల కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కెరీర్‌పరంగా మార్పు చేర్పులుండవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) బుర్రకు పదును పెట్టి, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతే అంతా శుభమే! ఒక విషయంలో సందిగ్ధత నెలకొనవచ్చు. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపడతారు లేదా కొత్తవారితో పనిచేయవలసి రావచ్చు. పనులు విజయవంతమవుతాయి. మీ వెనకాల గోతులు తవ్వేవారి విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. అననుకూలతలనూ అధిగమిస్తారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ తలుపు తడతాయి. మీ ప్రతిభకు, సామర్థ్యానికి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, దూరప్రాంతాలకు విహారానికి వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ కెరీర్ లేదా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో‡మార్పు చేర్పులు చేసుకుంటారు. తొందరపడి మాట ఇవ్వడం లేదా మొహమాటానికి పోయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టి, మంచి. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మౌనంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పు వస్తుంది. ఈ సంతోష సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మొహమాటంతో మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోకపోతే మునిగిపోతారు. కుటుంబ వ్యవహారాలలో పట్టీపట్టనట్టు ఉండే మీ ధోరణి మంచిది కాదు. కలిసొచ్చే రంగు: గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం వినోదాత్మకంగా గడుస్తుంది. ప్రత్యేకమైన విందుకు ఆహ్వానం అందుతుంది. విసుగువల్ల, తప్పదన్నట్లు పని చేసి, నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యంలో అప్రమత్తత అవసరం. కలిసొచ్చే రంగు: నలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఉన్నతమైన హోదా కావాలనుకున్నప్పుడు కటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. కొత్త కొలువులో చేరాలన్న ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద మీరు దృష్టిపెట్టినకొద్దీ, మీకు మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కెరీర్‌పరమైన విషయాలలో మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన ఒక వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆదాయ వ్యయాలలో ప్రణాళిక ప్రకారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ -
టారో : 2 ఏప్రిల్ నుంచి 8 ఏప్రిల్ 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకోవడం ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకుంటారు. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పెట్టుబడులు ఫలప్రదం అవుతాయి. మీ శక్తిసామర్థ్యాలు వెలుగు చూస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. కల్యాణ ఘడియలు మోగవచ్చు సంసిద్ధంగా ఉండండి. సన్నిహితుల సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) పగటికలలు మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. న్యాయపరమైన వివాదాలలో అనవసర జాప్యం మిమ్మల్ని కుంగదీస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. మంచి వక్తగా గుర్తింపు పొందుతారు. గురువులు లేదా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకుంటారు. కుటుంబపరంగా సంతృప్తి. కలిసొచ్చే రంగు: నారింజ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విజయాల బాటలో నడుస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో పలుకుబడి గల వ్యక్తులు పరిచయం అవుతారు. జీవితంలో పెద్ద మలుపునకు దారితీయవచ్చు. పనికి, కుటుంబానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కుటుంబ పరమైన ఖర్చులు పెరుగుతాయి. అంచనా వ్యాపారాలు, జూదం వంటి వ్యసనాల జోలికి వెళ్లవద్దు. అవకాశాలకోసం నిశిత పరిశీలన చేస్తారు. ఒక కీలక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. దూరప్రయాణం చేయవలసి రావచ్చు. మీ మనసులో ఉన్న ఆలోచనలకు, లక్ష్యాలకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి. కలిసొచ్చే రంగు: గులాబీ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) చాలా అవిశ్రాంతంగా గడుపుతారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటివారి వైపు నుంచి కూడా ఆలోచిం^è ండి. సానుకూల భావనలతో ఉండండి. పెట్టుబడులలోఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. జిమ్ లేదా యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా ఉల్లాసంగా పని చేస్తారు. అదే మిమ్మల్ని విజయాలబాటలో నడిపిస్తుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. పిల్లల విషయమై మంచి వార్తలు వింటారు. కలిసొచ్చే రంగు: వంకాయరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వ్యాపార విస్తరణకు మంచి అవకాశం లభిస్తుంది. మీ సహాయ సహకారాల కోసం టీమంతా ఎదురు చూస్తుంటుంది. మీ ప్రేమ ఫలిస్తుంది. అలసిపోయిన శరీరాన్నీ మనస్సునూ సేదతీర్చడానికి విందు వినోదాలలో గడుపుతారు. విహార యాత్రలు చేసేందుకు తగిన సంసిద్ధతలో ఉంటారు. ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. కలిసి వచ్చే రంగు: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) నిత్యం పనుల ఒత్తిడితో అలసిపోయిన మీరు సేదతీర్చుకోవడానికి ఇష్టమైన వారితో కలసి పిక్నిక్కు లేదా దూరప్రాంతాలకు విహారయాత్రలకు వెళదామని ఆలోచన చేస్తారు. పాతబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. మీ సన్నిహితులకు వచ్చిన సమస్యలకు తగిన పరిష్కారం చూపించి, వారి అభినందనలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: వెండి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదే కానీ, అలాగని కుటుంబ జీవితాన్ని త్యాగం చేయకూడదు కదా... ప్రణాళికాబద్ధంగా పని చేసి, ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. వెన్నుపోటు దారుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అవసరం. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టుల ద్వారా ఆశించినంత ఆదాయం లభించకపోవడం నిరాశకు గురి చేస్తుంది. రోజూ ఉదయమే లేలేత సూర్యకిరణాలలో స్నానం చేయడం మంచి ఆరోగ్యాన్నిస్తుంది. మీ విజ్ఞానంతో, సృజనాత్మకతతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలను, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. గృహ సంబంధమైన కొత్తవస్తువులు లేదా బంగారం కొంటారు. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) శక్తిసామర్థ్యాలతో పనులు పూర్తి చేస్తారు. మీ వాక్చాతుర్యంతో ప్రజా సంబంధాలను మెరుగు పరచుకుంటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. మనసు చెప్పిన మాట వినండి. కొత్త ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: నారింజ లేదా కాషాయం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించండి. అనవసరమైన ఆందోళనలను పక్కన పెట్టి, ఆత్మవిశ్వాసంతో పని చేయండి. కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంటారు. కలిసి వచ్చే రంగు: గోధుమరంగు -
టారో :19 మార్చి నుంచి 25 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త ఉద్యోగావకాశాలు, ఆదాయ మార్గాలు మీ వెంటే ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరెంతో ముందుచూపుతో, ఆశావహ, సానుకూల దృక్పథంతో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఫలిస్తాయి. ప్రమోషన్ వస్తుంది. తిరస్కృతులు, హేళనలు ఎదురయినా పట్టించుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ మార్గంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. చిక్కుముళ్లన్నీ వీడిపోతాయి. మీరు మీ అంతరాత్మ మాట వినడం లేదు. మీ మంచి చెడులలో అనుక్షణం మిమ్మల్ని హెచ్చరిస్తూ, మేలు చేద్దామని చూస్తుంటే, తోసిపుచ్చడం తప్పు. వెంటనే మనసు మాట వినండి. చెడు స్నేహాల పట్ల జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) డబ్బుకు సంబంధించి కొన్ని భయాందోళనలు నెలకొనవచ్చు. ముఖ్యంగా డబ్బు భద్రతకు సంబంధించినవి. అలాగే ధన సంపాదన విషయంలో కూడా అంతే ఇబ్బంది. వృత్తిపరంగా మీరు మేటి. అలాగని మీ వ్యక్తిగత సంతోషాలు, జీవితాన్ని వదులుకోవద్దు. మీ ప్రేమ ఫలిస్తుంది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని మీద దృష్టి పెట్టండి. మీరు సరిగా అమలు చేసినప్పుడే మీ పథకాలు విజయవంతం అవుతాయని గ్రహించండి. పాత ఆలోచనలనే అమలు చేస్తారు. కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగ వచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ వెనక గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త పడటం మంచిది. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అయితే అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అన్ని అవరోధాలనూ అధిగమించగలుగుతారు. అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత శ్రద్ధగా చేయడం అవసరం. సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ కష్టసుఖాలను శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆశలను నెరవేర్చుకోవడానికి, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. లాభదాయకమైన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి తగిన సమర్థులను అన్వేషించండి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. మీ విజయానికి వేడుకలు చేసుకుంటారు. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అందరూ ఆశ్చర్యపోయేలా మీరు మాట్లాడే ప్రతి మాటా నిజం అవుతుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. కెరీర్లో రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ప్రారంభించిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు తొలగించుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: ముదురు పసుపు -
వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం
-
వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధం: వైఎస్ జగన్
హైదరాబాద్ : గృహ నిర్మాణంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సభ పది నిమిషాలు వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే గృహ నిర్మాణాలపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా 35 వేల ఇళ్లు కట్టామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. రూరల్‌లో 44,895, అర్బన్‌లో 2,687 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేశారన్నారు. ప్రభుత్వం లక్షా 35వేల ఇళ్ల కట్టామని చెబుతోందని, ఒక్కో ఇల్లుకు లక్షన్నర వేసుకున్నా రూ.6వేల కోట్లు కావాలని వైఎస్ జగన్ అన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా హౌసింగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మృణాళిని మాట్లాడుతూ పది లక్షల ఇళ్లు పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగిందని, దానిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో అవినీతిని అరికట్టేందుకు జియో ట్యాగింగ్ ను అమలు చేస్తున్నామన్నారు. -
టారో : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీకు ఏ పని చేయడానికీ, ఎక్కడికైనా వెళ్లడానికీ మనస్కరించదు. ఒక విధమైన దిగులు, ఆందోళన, నిస్తేజం అలముకుని ఉంటుంది. అందువల్ల మీకు మీరే పని కల్పించుకుని చురుగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయడం మంచిది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. బహుళజాతి సంస్థలలో పని చేసేవారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) లక్ష్యసాధనకోసం మీ వ్యక్తిగత ఆనందాలను త్యాగం చేయవలసి రావచ్చు. అయితే ముఖ్యమైన, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి కూడా ఇది అనుకూల కాలం. నిజంగా మీరు గనుక మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది ఈ వారంలోనే కలగవచ్చు. అయితే, పనికీ, ప్రేమకూ మధ్య సమతుల్యాన్ని సాధించక తప్పదు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) వెలుగులోకి రావడానికి, సమాజంలో మీకంటూ ఒక పేరు, ప్రతిష్ఠ, హోదాలను పొందడానికి మీరు ఇంతకాలంగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. ఒక విషయంలో ముఖ్యనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఇతరులకు అది కష్టమైనదే కావచ్చు కానీ, మీకు మాత్రం అది సులువే. వృత్తిపరమైన ప్రావీణ్యాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితం కోసమూ కొంత సమయం కేటాయించుకోండి. కలిసొచ్చే రంగు: దొండపండు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనుకున్నదానిని సాధించేందుకు సర్వశక్తులూ సమీకరించుకుంటారు. మొదటినుంచి అదే మీ బలం, బలహీనత. అయితే మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం లేదా సమతూకం సాధించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరతాయి. ఒక వ్యాపారంలో లేదా చేపట్టిన ప్రాజెక్టులో మంచి లాభాలు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనవసర భయాలను, ఆందోళనలను వదిలించుకుని, ప్రాక్టికల్‌గా ఉండండి. అభద్రతాభావాన్ని విడిచిపెట్టండి. అప్పుడే మీకు ఆనందానికి అర్థం తెలుస్తుంది, ఆనందించడం తెలుస్తుంది. నిజానికి మీరెంతో అదృష్టవంతులు. మీ శక్తిసామర్థ్యాలను వెలికితీసి, వాటిని వినియోగంలోకి పెడితే మీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆనందం, విజయం మీ వెంటే ఉంటాయీ వారం. చాలా కాలంగా మీరు చేపట్టి ఉన్న ప్రాజెక్టు ఒకటి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతనెలలో మిమ్మల్ని బాధించిన సమస్యలనుంచి బయటపడతారు. జీవితమనే పడవలో అపరిచిత బాటసారిలా ప్రయాణించండి. పడవ ఎటు తీసుకెళితే అటు వెళ్లండి. మీ ప్రేమ ఫలిస్తుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ, ఆనందం, ఆత్రుతల న డుమ ఈ వారం గడుస్తుంది. సాహసాలు చేస్తారు. జీవితంలో ఒకసారి పడ్డవారే తిరిగి నిలదొక్కుకుని, మరిన్ని విజయాలు సాధిస్తారని గుర్తు తెచ్చుకోండి. నిరాశపడకండి. ఒకదాని వెనుక ఒకటి అవకాశాలు వెల్లువెత్తుతాయి. మంచి గ్రంథాలు అందుకు చదవండి. పదేపదే గతంలోకి తొంగి చూసుకుంటూ, మానుతున్న పాతగాయాలను రేపుకోవద్దు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భవిష్యత్తు కోసం మీరు గతంలో బాగా శ్రమించారు. ఇప్పుడు ఆ ఫలాలను అందుకోబోతున్నారు. సానుకూల భావనలతో ఉండటం వల్లే జీవితప్రయాణం సానుకూలమవుతుందని గ్రహించండి. పాజిటివ్ ఆలోచనలను నింపుకునే వారే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనగలరు కూడా. కొత్త ప్రాజెక్టులు, కెరీర్ అవకాశాలు, కొత్త బాధ్యతలు వెదుక్కుంటూ వస్తాయి మీ ధోరణిని బట్టి, మీ పనితీరును బట్టి. కలిసొచ్చే రంగు: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకోవడానికి, ఆశయాలను సాధించడానికి మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, ఈ ప్రయాణ ం కొద్దిగా ఒడిదుడుకులతో కూడి ఉండవచ్చు. అంతమాత్రాన మీ ప్రయాణం ఆపేశారనుకోండి, గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ తెలివితేటలను ధనార్జనకు ఉపయోగించండి, అదీ సక్రమ మార్గంలో... దీర్ఘకాల సమస్య ఒక కొలిక్కి వస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భాగస్వామ్య వ్యవహారాలకు ఇది అనుకూల కాలం. పనిని సులభతరం చేయడానికి మీరు కనుగొన్న కొత్త మార్గాలు, పథకాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. పాతవాటి గురించి మరచిపోండి. ఒక అపురూపమైన బహుమతి అందుకుంటారు. పాత బాకీలుతీర్చేస్తారు. ఆరోగ్యం కోసం ఏదైనా జిమ్‌లో చేరండి లేదా వ్యాపకాన్ని అలవరచుకోండి. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ధ్యానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించండి. మీ పూజలు నిరాడంబరంగా ఉండాలి. హంగూ ఆర్భాటాలు అక్కరలేదు. ఆర్థికంగా కొద్దిపాటి మందకొడితనం నెలకొనవచ్చు కానీ, నిరుత్సాహ పడకండి. సానుకూలంగా తీసుకోండి. వృత్తిపరంగా, పనిపరంగా మిమ్మల్ని ఆవరించి ఉన్న కొన్ని భ్రమలు తొలగి, నిజాలు బయటపడతాయి. కల్యాణ ఘడియలు సమీపిస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అన్ని విషయాల్లోనూ మరింత జాగ్రత్తను, శ్రద్ధను కనబరచవలసిన సమయమిది. మీ పరిధిలో మీరుండండి. త్వరలోనే అపరిచితుల నుంచి కొత్త తరహా సవాలును ఎదుర్కొనవలసి రావచ్చు. సిద్ధంగా ఉండండి. పని మీద దృష్టి, శ్రద్ధ పెట్టండి. కోరికలకు లొంగిపోవద్దు. దూరప్రయాణాలు ఉండవచ్చు. వాటిని ఎంజాయ్ చేస్తారు కూడా! కలిసొచ్చే రంగు: మెరుస్తున్న పసుప్పచ్చ -
టారో : మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
పనికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. గుర్తింపుకోసం మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సూచనలకు తగ్గట్టు మీ సిబ్బంది పని చేస్తారు. ఉద్యోగార్థుల ఎదురు చూపులు ఫలిస్తాయి. వ్యాపారులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో శక్తి సామర్థ్యాలను మెరుగు పరచుకుంటారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసొచ్చే రంగు: తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మనం చకచకా ముందుకెళ్లాలంటే ముందు మన మార్గంలోని అవరోధాలను తొలగించుకోవాలని గ్రహించండి. మీ నిర్ణయాత్మక శక్తి ఇతరులు ప్రశ్నించేలా ఉండకూడదు. ఎదుటివాళ్ల బాహ్యవేషాలను బట్టి అంచనాలు వేసుకోకండి. మీకు అనుమానంగా ఉన్నవాటిని ఒకటికి రెండుసార్లు పరీక్షించి చూసుకోండి. పెండింగ్‌లో ఉన్న కేసుకు సంబంధించి వచ్చిన తీర్పు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ప్రాక్టికల్‌గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. మీ సన్నిహితులొకరు వారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా, మీకు దూరంగా మెలగుతున్నట్లుగా అనిపించవచ్చు. వారిని ప్రశ్నించేముందు వారి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఊహించుకుని చూడండి. ఆర్థికంగా బాగుంటుంది. నిద్రలేమి చికాకు పరచవచ్చు. చిన్న చిన్న రుగ్మతలకు గృహ చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈ వారం మీరు బోలెడన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రణాళికలు ఫలప్రదమవుతాయి. ఒక వ్యక్తితో అనుకోకుండా జరిగిన పరిచయం బలపడుతుంది. అది మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. మీ సన్నిహితులొకరితో మీకు వివాదం ఏర్పడవచ్చు. అది ఒత్తిడి మూలంగా జరిగినదే కాని, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అనవసరంగా కుంగిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒకదారి మూసుకుపోతే వంద దారులు ఉంటాయని గుర్తు చేసుకోండి. చాలాకాలంగా ఉన్న ఒక బంధం బలహీన పడవచ్చు లేదా తెగిపోవచ్చు. అది మీరూహించిందేగా, దాని పర్యవసానాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. గత పరిణామాల నుంచి పాఠాలను నేర్చుకోండి. ఆసక్తికరమైన ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు లేదా మీరు కొత్త ప్రదేశాలకు ఆహ్వానం అందుతుంది. వర్తమానంలో జీవించండి. కలిసొచ్చే రంగు: గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) సానుకూల భావనలు, ఉత్సాహకర వాతావరణం నడుమ ఉల్లాసంగా ఉంటారు. ప్రకృతి ఎన్నో అందాలను, వింతలు, విడ్డూరాలను ప్రసాదించింది కదా, హాయిగా అనుభవించండి, ఆనందించండి. మీ ఆధ్యాత్మిక మార్గం లేదా బోధలు మీకు మంచి ఫలితాన్నిస్తాయి. వివిధ రకాల రుగ్మతలకు మీకు మీరు చికిత్స చేసుకోవడమే గాక ఇతరులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపశమనం కలిగిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ మనస్సును, మెదడును పనికి సన్నద్ధం చేయండి. నిదానమే ప్రధానం అన్న సూక్తిని ప్రస్తుతానికి పక్కనపెట్టి ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని అనుసరించి పని చేయండి. మీ కుటుంబంతో, ముఖ్యంగా సహోద్యోగులతో పొరపొచ్చాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఖర్చుల్లో అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త. కలిసొచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మబ్బులు కమ్మిన ఆకాశంలోనే సూర్యోదయం కూడా జరుగుతుందని గుర్తు తెచ్చుకోండి. పాత వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రశాంతంగా, స్థిమితంగా, తేటపడిన మనస్సుతో ఉంటారు. పిల్లల మూలంగా ఆనందం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కాలానుగుణంగా జరుగుతున్న మార్పులను ఆమోదించక తప్పదని గుర్తించండి. మీ కోణంలో నుంచే కాదు, ఇతరుల వైపు నుంచి కూడా ఆలోచించడం మంచిది. బూజుపట్టుకుపోయిన పాత అలవాట్లను వదులుకోకపోతే ఇబ్బందులు తప్పదు. మీకొక అవకాశం వస్తుంది. అయితే అది కొద్దిపాటి రిస్క్‌తో కూడుకున్నందువల్ల ఎటూ తేల్చుకోలేకపోతారు. పనితో అలసిన మనస్సును, శరీరాన్ని సేదతీర్చడం అవసరం. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ సహనాన్ని పరీక్షిస్తున్నట్లుంటుందీ వారమంతా! పనులలో జాప్యం. శుష్కవాగ్దానాలకు బోల్తా పడవద్దు. మీలాగే అందరూ నిజాయితీపరులని అనుకోవద్దు. ముద్రణ, యంత్రాలతో పని చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పనిని సమీక్షించుకుని, అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడం మంచిది. విందువినోదాలలో గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కష్టాలు వచ్చినప్పుడే మనకు కావలసిన వారెవరో తెలిసొస్తుంది. అంతేకాదు, మీలోని అంతర్గత శక్తిసామర్థ్యాలు వెలికి వస్తాయని గుర్తించండి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పదు. పనిప్రదేశంలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. పాతశత్రువుల పట్ల అప్రమత్తత, ఇరుగు పొరుగుతో సఖ్యత అవసరం. కలిసొచ్చే రంగు: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ ఆశయాల సాధనకు తగిన కృషి, ప్రణాళికతో కార్యాచరణలోకి దిగండి. మీకేదైనా కొత్త ఆలోచన వచ్చినా, సృజనాత్మకత చూపించాలనుకున్నా, మీలోనే ఉంచుకోండి. బయటికి చెప్పవద్దు. వెంటనే అమలు చేసేయండి. ఒక బంధం విషయంలో నిజానిజాలు తెలుస్తాయి. మీ కలలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఒక ఆకర్షణ బంధంగా మారేంతగా బలపడవచ్చు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు -
టారో :19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఉద్వేగభరితంగా, సాహసోపేతంగా సాగిపోతుందీవారమంతా! ఒత్తిళ్లు, బాధలు తొలగిపోతాయి. సాధించి తీరాలి అన్న పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఉండండి, తప్పకుండా సాధిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. సానుకూల భావనలతోనే ఉండండి. మానసిక, శారీరక ఒత్తిళ్లను తొలగించుకునేందుకు క్రీడలలో పాల్గొనండి. కలిసొచ్చే రంగు: సముద్రపు నాచురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వారమంతా విజయవంతంగా, నూతనోత్తేజంతో కూడి ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది, ఫలితమూ దక్కుతుంది. పని ఒత్తిళ్లనుంచి బయటపడేందుకు మీకు కొంత విశ్రాంతి అవసరం. మీ విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితోనూ, కుటుంబ సభ్యులతోనూ సంయమనంతో వ్యవహరించండి. వారి మాట వినండి. కలిసొచ్చే రంగు: పచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు: తెలుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పాతబంధాలు బలపడతాయి. మీ స్నేహితులు, బంధుమిత్రుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. మీ హితులకు, సన్నిహితులకు ఏ సమస్య వచ్చినా, వారికి మీరే గుర్తుకొస్తారు. వారికి తగిన పరిష్కారం చూపించి, ఆత్మసంతృప్తి పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల విషయంలో భయం వదిలి సంగీత చికిత్స తీసుకోండి. కలిసివచ్చే రంగు: వంకాయ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉద్యోగ భద్రతకు, కెరీర్‌కి ప్రాధాన్యత ఇస్తారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి, మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. గత జ్ఞాపకాలనుంచి, అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కలిసివచ్చే రంగు: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సద్గ్రంథ పారాయణం ద్వారా మీకు స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకుంటారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్తమిత్రులు పరిచయం అవుతారు. ఆఫీసులో పనులు వేగంగా ముందుకు జరుగుతాయి. ఆందోళనలను వదిలి ఏకాగ్రతతో పని చేయండి. సహోద్యోగులతో ప్రేమగా మెలగండి. మనసు చెప్పిన మాట వినండి. కలిసి వచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన ఆందోళనలను, అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: బంగారు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: తెల్లటి తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికవనరులు సమకూరుతాయి. గత చేదుజ్ఞాపకాలను మరచిపోండి. వాటినుంచి అనుభవ పాఠాలను నేర్చుకోండి. ధనపరంగా త్వరలోనే ఒక శుభవార్త అందుకుంటారు. గతంలో మీ చేజారిపోయిందనుకున్న ఒక అవకాశం తిరిగి మీ తలుపు తడుతుంది. ఈసారి జారవిడుచుకోరు. మీ జీవితభాగస్వామి నుంచి మీకో అనూహ్య కానుక అందుతుంది. కలిసొచ్చే రంగు: సిరా నీలం -
‘ఇంటి’గుట్టు రట్టు!
తాడేపల్లిగూడెం రూరల్ : ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇప్పిస్తామంటూ పలువురు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముంటున్న పలువురు పేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి ఇంటి స్థలం ఉంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ యడల సత్యనారాయణరాజుతో పాటు డైరెక్టర్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్‌లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వంగా సంజీవ వరప్రసాద్, ప్రైవేట్ సర్వేయర్ షేక్ రామ్కఫిర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులు పేదల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా వ్యాపించి చివరకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెవిన పడటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ బీహెచ్ సంగీతరావు, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘరానా మోసగాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎంత మంది మోసపోయారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసి ఉంది. కాగా, నిందితులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. కల్లబొల్లి మాటలు నమొ్మద్దు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమొ్మద్దని మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ సూచించారు. బాధితులు ఎంత మంది ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. చీటింగ్ కేసు నమోదు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ యడాల సత్యనారాయణరాజు, వంగా సంజీవ వరప్రసాద్, షేక్ రామ్ కఫీర్ సాహెబ్, భరణికాపుల నాగరాజులపై బాధితుడు పైడికొండల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఉసూరుమనిపించారు ఇంటి నిర్మాణానికి రుణం కోసం దరఖాస్తు చేశా. రుణం మంజూరైంది బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, స్థలం పట్టా, రూ.వెయ్యి తీసుకుని రమ్మన్నారు. తీరా అన్ని తీసుకుని వచ్చే సరికి ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది. రుణం మంజూ రైందని ఎంతో సంతోషించా...అంతలోనే ఆనందం ఆవిరైపోయింది. – కొండే వెంకాయమ్మ -
టారో :12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవసరాలకు తగిన డబ్బు చేతికందుతుంది. సంతోషంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించాలన్న ఉత్సాహంతో ఉంటారు. పెట్టుబడులకు ఇది తగిన సమయం. ప్రేమికులకు ఆశాభంగం తప్పదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయండి, కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితం అనే నౌక పూర్తిగా మన చేతుల్లో ఉండదు. ఒకోసారి గాలివాలును బట్టి దిశను మార్చుకోవచ్చు. కలిసొచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ప్రేమలో కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. జీవిత లక్ష్యాలను సాధించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ ప్రయత్నంలో కొద్దిగా ముందడుగు వేస్తారు కూడా! పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఇతరుల సమస్యలను విని, మీకు చేతనైన సాయం చేస్తారు. అలా సాయం చేయడం వల్ల ఆనందాన్ని పొందుతారు. మీరు విద్యార్థులైతే మంచి మార్కులు సాధించి, అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలన్నట్లుగా సాగుతుంది. మీకు కావలసిన వారికోసం బాగా ధనం ఖర్చు చేస్తారు. గత జ్ఞాపకాలతో కుంగిపోకుండా, వాటినుంచి పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేయడం మంచిది. మీ సమస్యలకు పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తారు. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం అవసరం. జీవిత భాగస్వామి కోసం అన్వేషించే ప్రయత్నాలు ఫలిస్తాయి. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ సన్నిహితులతో వీలయినంత నిజాయితీగా, నిర్మొహమాటంగా వ్యవహరించడం మంచిది. దానివల్ల లేనిపోని అపార్థాలు తలెత్తకుండా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లేదా వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇతర వ్యాపకాలలో పడి వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) రకరకాల కారణాల వల్ల పని పేరుకుపోవడంతో అవిశ్రాంతంగా శ్రమించవలసి వస్తుంది. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఒకోసారి సమస్యలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. టెన్షన్ పడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల భవిష్యత్తులో దృఢంగా ఉంటారు. విందు, వినోదాలు, దూరపు ప్రయాణాలతో సేదతీరే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: తెలుపు, వంగపువ్వు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వారమంతా క్షణం తీరుబడి లేకుండా గడుపుతారు. అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆనందించడానికి ఆరోగ్యం అనుకూలం. కలిసి వచ్చే రంగు: వెండి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఎప్పుడూ గెలుపు మనదే అనుకోవడం పొరపాటు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవడం అవివేకం. ఎందుకంటే ఓడినప్పుడే కదా, మీ శక్తిసామర్థ్యాలు మీకు తెలిసేది. వృత్తినైపుణ్యాన్ని పెంచుకుంటారు. మంచి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటారు. పద్ధతి ప్రకారం పనులు పూర్తి చేసి, ప్రశంసలు పొందుతారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. వెన్నునొప్పి బాధించవచ్చు. అయితే అలాంటి ఆరోగ్య సమస్యలకు అనవసరమైన ఆందోళన మాని, ప్రకృతి ఉత్పాదనల వాడకంతో మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. జీవితమంటే ఎప్పుడూ పని, పరుగులే కాదు, కాస్త విశ్రాంతి, ప్రేమ, ఉల్లాసం కూడా అవసరం అని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీది కాని కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఉత్పాదనలు, స్వచ్ఛమైన గాలి, నీరు వల్ల స్వాంతన పొందుతారు. కలిసి వచ్చే రంగు: వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను నెరపడంలో, వాటిని మరింత మెరుగు పరచుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఆందోళన మాని వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. మనసు చెప్పినట్లు నడచుకోండి. చెవి లేదా గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఆర్థికంగా చాలా బాగుంటుంది. చెడు అలవాట్లకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంటారు. అలా ఎన్నోసార్లు. కానీ, చెడ్డ అలవాట్లు అలవడినంత తొందరగా వదలవని గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి ధోరణి మీకు నచ్చకపోవచ్చు. మీ వైఖరి వారికి ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఒకరికొకరు సర్దుకుపోయి. సామరస్యంగా జీవించడమే కదా జీవితం. అదృష్టం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: ఊదా -
టారో 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చిచ్చే వారమిది. పనిప్రదేశంలో కొంచెం అసౌకర్యం కలగవచ్చు. అందరూ మీకు అనుకూలంగా ఉండటం వల్ల అవరోధాలనూ అధిగమిస్తారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిం^è డం మంచిది. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. కలిసొచ్చే రంగు: మావిచిగురు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్తబంధాలు, బంధుత్వాలు కలుస్తాయి. భావోద్వేగాలు చుట్టుముడతాయి. మీ తెలివితేటలను ఉపయోగించి, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. చేసే పనిని మరింత లోతుగా, శ్రద్ధగా చేయడం అవసరం. మీ సంభాషణా చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ కష్టసుఖాలను జీవిత భాగస్వామితో చెప్పుకోవడం వల్ల మేలు కలుగుతుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈ నెల మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అధికార యోగం లేదా పదవీయోగం కలుగుతుంది. అందుకు సంబంధించిన వార్తలు వింటారు. ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనులకు గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఉన్నతిని చూసి ఓర్వలేక చాటుగా విమర్శించేవారు ఎక్కువ అవుతారు. ధైర్యంగా ఎదుర్కొనడం మంచిది. వాహన యోగం ఉంది. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కలిసొచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీరు మాట్లాడే ప్రతిమాటా నిజం అవుతుంది. పనులు ఆలస్యం అవవచ్చు. పాత ఆలోచనలనే అమలు చేస్తారు.. కీలకమైన ఒక ప్రాజెక్టును చేపట్టడం లేదా కొత్తవారితో పనిచేయవలసి రావడం జరగవచ్చు. సృజనాత్మకంగా చేసే పనులు విజయవంతమవుతాయి. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే, వెనకాల గోతులు తవ్వేవారు ఉండవచ్చు. జాగ్రత్త. కలిసొచ్చే రంగు: బూడిదరంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ ఆశలను, ఆశయాలను సాధించడానికి కొత్తప్రదేశాలకు వెళ్లవలసి వస్తుంది. దూరప్రయణాలు చేస్తారు. లాభదాయకమైన వ్యాపారాన్ని చేపడతారు. వ్యాపారావకాశం వచ్చినప్పుడు దానిని అందుకోవడానికి వెనుకంజ వేయవద్దు. మీ బాధ్యతలను స్వీకరించడానికి సరైన వ్యక్తులను అన్వేషించవలసి వస్తుంది. కాలం అన్ని గాయాలనూ మాన్పుతుంది. మీ భాగస్వామి సహకారం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆఫీస్‌లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని అననుకూలతలనూ అధిగమిస్తారు. ఎప్పుడో సాధించిన విజయానికి ఇప్పుడు విందుకు ఆహ్వానం అందడమో లేదా మీరు ఇవ్వడమో జరుగుతుంది. స్నేహితునికి అండగా నిలబడవలసి వస్తుంది. మీ త్యాగానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ప్రతిభాసామర్థ్యాలకి గుర్తింపు కోసం మరింత కష్టపడాలి. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడానికి, విహారానికి లేదా పిక్నిక్కు వెళ్లడానికి ఇది తగిన సమయం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీరు పర్యటనకు వెళ్లడానికి ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకుని ఉండటం మంచిది. అనవసరమైన ఆందోళనలు, ఆత్మన్యూనతలు పక్కనబెట్టి హాయిగా గడపండి. మీ ఆలోచనలకు, సృజనాత్మకతకు మెరుగులు దిద్ది, మీరేమిటో నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ ఆలోచనలేమిటో మీరు అన్నది ఈ వారం మీ విషయంలో అక్షరాలా వర్తిస్తుంది. మీ పని విషయంలో సలహా లేదా సహాయం కావాలనుకోండి, తటపటాయించకుండా మీ మార్గదర్శిని కలిసి సలహా తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడతారు. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. ఆదాయాన్ని కళ్లచూస్తారు. మీ సహోద్యోగులు కూడా మీ బాటలోనే నడుస్తారు. కలిసొచ్చే రంగు: లేత నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఉద్యోగంలో, పనిలో లేదా వృత్తిలో ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు వస్తుంది లేదా మీరు ఆశించిన మార్పును ఆమోదించడానికిది తగిన సమయం. ఈ మార్పు కాలంలో స్నేహితులతో సరదాగా కాసింత సేదతీరడం అవసరం. మొహమాటానికి పోయి మీ బంధుమిత్రులలో ఒకరికోసం ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చుచేశారు. ఇప్పటికైనా తెలుసుకోకపోతే మునిగిపోతారు. కలిసొచ్చే రంగు: చాకొలేట్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈ వారం విందు వినోదాలలో గడుపుతారు. పనిలో విసుగు అనిపించినా, చేయవలసి రావడంతో నాణ్యత లేక నష్టపోతారు. వ్యాపారులకు లాభాలు కొంచెం నెమ్మదిగా అందుతాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పనిలో మెలకువ లేకపోతే మాట పడక తప్పదు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి కెరీర్, ఉన్నతమైన ఉద్యోగం లేదా హోదా కావాలనుకున్నప్పుడు కుటుంబం గురించిన ఆలోచనలు పక్కన పెట్టాలి. అప్పుడే మీరు జీవితంలో గెలుపొందే అవకాశాలు దక్కుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల మీద దృష్టిపెట్టండి, మేలు జరుగుతుంది. పనిమీద మరికాస్త శ్రద్ధ అవసరం. మీ చిరకాల కోరిక ఒకటి ఈ వారాంతంలో తీరనుంది. కలిసొచ్చే రంగు: ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనుకోకుండా కొత్తవారిని కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా మీకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే సంఘటనలు ఎదురవుతుంటాయి. కెరీర్ కొత్తమలుపు తిరుగుతుంది, విద్యార్థులకు యోగించే కాలమిది. యాంత్రికంగా కాక, శ్రద్ధాసక్తులతో చేస్తేనే పనులు విజయవంతమవుతాయని గ్రహించండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కలిసొచ్చే రంగు: తెలుపు, లేత గులాబీ -
గృహ రంగానికి గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : ఇక గృహ రుణాలు చౌకగా లభ్యం కానున్నాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది. వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది. దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్‌ను కల్పించారు. -
టారో 22 జనవరి నుంచి 28 జనవరి, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని చూసి, మీ సహోద్యోగులు అసూయపడతారు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు కూడా చేరతాయి. భయాందోళనలు వదిలేసి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కలిసి వచ్చే రంగు: పచ్చబంగారు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవిశ్రాంతంగా పని చేసి, ప్రాజెక్టును పూర్తి చేస్తారు. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు, తెలివితేటలకు మరింత పదును పెట్టుకుని, మీ వాక్చాతుర్యంతో మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. మీ ప్రేమ ఫలిస్తుంది. విహార యాత్రలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు చెప్పినట్లు నడచుకోండి. ఇతరులను మీరు గౌరవిస్తేనే, వారు మిమ్మల్ని గౌరవిస్తారని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) స్నేహితులతో, బంధుమిత్రులతో కలసి సరదాగా గడుపుతూ మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. సంతోషంగా గడుపుతారు. కలిసివచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉద్యోగ భద్రతకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. రోజులు సాఫీగా గడవడం లేదనిపించవచ్చు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించడం, సృజనాత్మకంగా పనులు చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తిరుగుతుంది. కలిసి వచ్చే రంగు: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఏదో కలలో జరిగినట్లుగా నూత్నశక్తిసామర్థ్యాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో చకచకా పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. ప్రతిదానికీ కుటుంబసభ్యులమీద, కిందిస్థాయి ఉద్యోగుల మీద ఆధారపడకుండా మీపనులు మీరు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద దృష్టిపెట్టండి. కలిసి వచ్చే రంగు: ముదురాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్‌పరంగా మంచి మార్పులు జరుగుతాయి. ఇతరత్రా ఆదాయమార్గాల ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో చురుకైన పాత్ర పోషిస్తారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సహజసిద్ధమైన మీ వాక్చాతుర్యంతో చకచకా పనులు చక్కబెట్టేసుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను లేదా పంటి నొప్పి బాధించవచ్చు. ప్రాజెక్టులో విజయం దిశగా పయనిస్తారు. మీపై పడిన అపనిందలను, మీచుట్టూ వ్యాపించిన పుకార్లను ఆత్మవిశ్వాసంతో, తెలివిగా తిప్పికొడతారు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో తలెత్తిన అవరోధాలను నేర్పుగా అధిగమిస్తారు. కష్టించే మీ తత్త్వం, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటివి అభ్యసిస్తారు. పనిలో మంచి ఉత్పాదకతను సాధిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు పెట్టేటప్పుడు అప్రమత్తత అవసరం. కలిసి వచ్చే రంగు: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. ఏనాడో తెగిపోయిన ఒక బంధాన్ని మీ ప్రేమతో తిరిగి అతికే ప్రయత్నం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు. బహుమతులు అందుతాయి. గతాన్ని తలచుకుని కుమిలిపోవద్దు. వర్తమానంలో ఏం చేయాలో ఆలోచించండి. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. హుందాగా ముందుకు సాగండి. దిగువస్థాయి వారితో కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దు. కలిసి వచ్చే రంగు: ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. సహోద్యోగుల సహకార లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. పరోపకారగుణాన్ని అలవరచుకుంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మొహమాటానికి పోయి తలకు మించిన బాధ్యతలను నెత్తికెత్తుకోవడం వల్ల ఇబ్బందులు పడవలసి వస్తుంది. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈ వారం మిమ్మల్ని విజయాలు వరిస్తాయి. శుభవార్తలను అందుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీరు కోరుకున్న వారి ప్రేమను పొందుతారు. ఆధ్యాత్మికతను అలవరచుకుంటారు. మీ నిక్కచ్చితనం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కలిసి వచ్చే రంగు: నీలం -
పదేళ్లయినా పూర్తి కాలేదు
నత్తనడకన పునరావాసం పనులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్రక్రియ పదేళ్లైనా ఇంకా సాగుతూనే ఉంది. ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా గుర్తించిన మిడ్‌మానేరు, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఇందిరమ్మ వరద కాల్వ వంటి ప్రాజెక్టుల కింద సహాయ, పునరావాస ప్యాకేజీలను పూర్తి చేసి ఆయకట్టుకు నీరందించాలని కృత నిశ్చయంతో ఉన్నా ప్రక్రియ మాత్రం నత్తనడకను తలపిస్తోంది. మొత్తంగా 12 ప్రాజెక్టుల కింద ముంపునకు గురయ్యే 85 గ్రామాలను ఖాళీ చేయించి నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమం పూర్తిచేసి వచ్చే జూన్ కల్లా ఆయకట్టుకు నీరందిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం నిధుల కేటాయింపే కాకుండా నిర్వాసితులకు పట్టాల పంపిణీ మొదలుకొని గృహ వసతి కల్పన వరకు చేపట్టాల్సిన పనులను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయకుంటే ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం కష్టతరమే. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస పనుల్లో వేగానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎప్పటిలోగా పూర్తవుతుంది? 2004లో చేపట్టిన ఎస్ఎల్బీసీ, ఎస్సారెస్పీ స్టేజ్2, దేవాదుల, వరద కాల్వ, ఎల్లంపల్లి, సుద్దవాగు, కుమ్రంభీమ్, గొల్లవాగు, నీల్వాయి, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద 67 గ్రామాలు పూర్తిగా, 18 పాక్షికంగా .. మొత్తంగా 85 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాలకు చెందిన 44,094 మంది నిర్వాసితులు అవుతున్నారు. పునరావాస చట్టాల మేరకు వీరందరికీ గృహాలను నిర్మించి, రోడ్లు, నీరు, కరెంట్ కనెక్షన్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఇప్పటివరకు 85 ముంపు గ్రామాలకు గానూ 72 గ్రామాల్లోనే సామాజిక ఆర్థిక సర్వే(ఎస్ఈఎస్) పూర్తయింది. 75 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటివరకు ప్రతిపాదనలు చేయగా, ఇందులో 73 గ్రామాల కోసం భూమిని సేకరించారు. మొత్తం 44వేల మందిలో కేవలం 17,137 మందిని మాత్రమే ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరికోసం 12,117 నివాస గృహాలను పూర్తి చేశారు. మరో 21,796 గృహాలను పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం మరో రూ.400 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఎప్పటిలోగా పునరావాసం పూర్తవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ ఇదే సమస్య.. జూన్ నాటికి పనులు పూర్తి చేసి సాగుకు నీటిని అందించాలని భావిస్తున్న ప్రాజెక్టుల్లో భీమా ఒకటి. ఈ ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు కింద 8 ముంపు గ్రామాలుండగా, 6,156 మందిని నిర్వాసితులుగా గుర్తించిన ప్రభుత్వం ఇందులో ఇప్పటివరకు 2,861 మందికి మాత్రమే పట్టాలు పంపిణీ పూర్తిచేసింది. మౌలిక వసతుల కల్పన పనులు ఇంకా మధ్యలోనే ఉన్నాయి. కనాయిపల్లి, శ్రీరంగాపూర్, నేరేడ్‌గావ్, భూత్పూర్, ఉజ్జెల్లి గ్రామాలలో ఇంతవరకు నిర్వాసితులకు పట్టాల పంపిణీ జరగనే లేదు. సహాయ, పునరావాసానికి మొత్తంగా రూ.92.34 కోట్ల మేర నిధులు అవసరం ఉండగా ఇప్పటివరకు రూ.48.33 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారు. ఇక మరో ప్రాధాన్య ప్రాజెక్టుగా ఉన్న నెట్టెంపాడు కింద మూడు ముంపు గ్రామాలు ఉండగా 2,640 మంది నిర్వాసితులకు గానూ 1,824 మందికి మాత్రమే పట్టాల పంపిణీ పూర్తయింది. ముంపునకు గురయ్యే చిన్నానిపల్లి, ఆలూర్, రేతామ్‌పాడ్ గ్రామాల నిర్వాసితులకు పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఈ ఏడాది చివరికి లెవలింగ్, రోడ్, వాటర్, విద్యుత్ సదుపాయాలు సమకూర్చాల్సి ఉంది. ఇక్కడ సహాయ, పునరావాసానికి ఇంతవరకు రూ.68.31 కోట్ల మేర అవసరం ఉండగా రూ.19.33 కోట్ల మేర ఖర్చు చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులకు గత ప్రభుత్వాలు అంత ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 18 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 11,123 మంది నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో ఆర్ఆర్ కింద ఇప్పటివరకు కేవలం 5,800 మందికి మాత్రమే పట్టాలను అందించింది. మరో 6వేల మందికి ఈ ఏడాది చివరిలోగా పట్టాలు అందించి, వారికి కొత్తగా గృహ సముదాయాల ఏర్పాటుకు తగినన్ని నిధులు వెచ్చించాల్సి ఉంది. పట్టాలు, గృహ నిర్మాణాల అవసరాలకు మొత్తంగా రూ.325కోట్ల వరకు అవసరం అవుతుందని లెక్కలు కట్టగా ఇప్పటివరకు రూ.200కోట్లు ఖర్చు చేశారు. ఇలా మిగతా ప్రాజెక్టుల్లో కలిపి చూసుకుంటే మరో రూ.400కోట్ల వరకు వెచ్చిస్తేనే పునరావాస ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్వాసితుల కొత్త కాలనీల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పిస్తే పునరావాస కార్యక్రమం వేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
టారో: 18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పూర్తిగా అంకితభావంతో పని చేయమన్నది ఈ వారం వీరికి చెప్పదగ్గ సూచన. అలాగే ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. అధికారం కోసం మీరు పడుతున్న ఆరాటం ఫలించే అవకాశాలున్నాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఏమాత్రం తొందరలేకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్కు వెళ్లడానికి అనుకూలమైన కాలం ఇది. పని విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదు. లేదంటే మంచి అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ముక్కుసూటి మనస్తత్వం అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు, కాస్త పట్టువిడుపు ధోరణిని అలవరచుకోండి. స్నేహితులు, మీ కింది స్థాయి వారితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీకు చాలా అనుకూలమైన వారమిది. పనిలో కొత్త పద్ధతులు నేర్చుకుని, వాటిని విజయవంతంగా అమలు చేసి, మంచి పేరు, ప్రశంసలు తెచ్చుకుంటారు. బృందంతో కలిసి మీరు చేసే పని విజయవంతమవుతుంది. మీకు నచ్చిన ప్రదేశానికి విహార యాత్రకు వెళ్లే అవకాశం వస్తుంది. కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉంది. అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం మేలు చేస్తుంది. కలిసి వచ్చే రంగు: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఏదో అద్భుతం జరిగినట్లుగా మీ ప్రేమ ఫలిస్తుంది. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. భౌతిక శక్తులమీదనే కాదు, ఆధ్యాత్మికత మీద కూడా మనసు పెట్టి, నమ్మకంతో పని చేస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. సంతానానికి సంబంధించిన మంచి వార్తలు వింటారు. ఆదాయానికి లోటుండదు. కలిసి వచ్చేరంగు: పాలమీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీకు అన్నివిధాలుగా కలిసి వచ్చే కాలమిది. గొప్ప అవకాశాల కోసం, మంచి సమయం కోసం మీ నిరీక్షణ ఫలిస్తుంది. ఇల్లు లేదా ఆఫీసు మారతారు. ప్రేమ విషయంలో కొంత నైరాశ్యం, ఎదురుదెబ్బలూ తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల శ్రద్ధ వహించ వలసిన సమయమిది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. కలిసి వచ్చే రంగు: వెండిరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కుటుంబపరంగా మీకు ఈ వారం చాలా ఆనందంగా ఉంటుంది. అంకితభావంతో కష్టపడి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని గుర్తించి, దానిని ఆచరణలో పెట్టి ఘనవిజయాన్ని సాధిస్తారు. ఆఫీసులో పెండింగ్ పనులు పూర్తి చేయడం సత్ఫలితాలనిస్తుంది. మీ విల్ పవర్ మీకు మంచి చేస్తుంది. రానున్న సంవత్సరంలో మీ లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన ప్రణాళిక వేసుకుంటారు. కలిసి వచ్చే రంగు: గచ్చకాయ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) గులాబీ చెట్టుకు ఎన్ని ముళ్లున్నా, ఎంత గాలిఒత్తిడి ఎదురైనా తట్టుకుని అందమైన పూలనే ఇచ్చినట్లు మీరు కూడా అన్ని రకాల ఒత్తిళ్లనూ తట్టుకుని అందరికీ ఆనందాన్నే పంచుతారు. అదృష్టం వరిస్తుంది. ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అలసిన మనస్సును, శరీరాన్ని విహార యాత్రలతో సేదదీర్చేందుకు ఇది తగిన సమయం. ఈవారంలో మీ కెరీర్ మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు: వంకాయరంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు త్యాగాలు చేయవలసిన సమయం. బాగా కష్టపడి పని చేయాల్సిన సమయం కూడా. ఒక్కోసారి మీ ప్రేమను కూడా త్యాగం చేయక తప్పదు. పనిపరంగా మీకు చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడూ పని అంటూ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. ఉద్యోగ భద్రత కోసం చిన్న చిన్న పోరాటాలు చేయాల్సి వస్తుంది. దేనిలోనైనా ఉదాశీనత పనికి రాదు. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థికంగా మీకు అనూహ్యమైన లాభాలు కళ్లజూస్తారు. ధనయోగం కలుగుతుంది. కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది. భగవంతుడి మీద భారం వేసి, ధైర్యం చేసి మీరు వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని లక్ష్యసాధనకు, విజయానికి చేరువ చేస్తాయి. మీ సృజనాత్మకత మీకెంతో ఉపయోగపడుతుంది. ఎన్ని పనులున్నా, కుటుంబాన్ని, స్నేహితులను దూరం చేసుకోవద్దు. విద్యార్థులకు అనుకూల కాలమిది. కలిసి వచ్చే రంగు: లేత గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) పనిపరంగా కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. అనూహ్యంగా విజయం సాధించి, ఎంతోకాలంగా మీరనుభవిస్తున్న మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకుంటారు. కొత్తగా ఒక మంచి ఆదాయ మార్గాన్ని తెలుసుకుంటారు. అన్ని గాయాలనూ మాన్పగలిగే గొప్ప శక్తి కాలానికి ఉందని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: పొద్దుతిరుగుడు పువ్వు వన్నె కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) గతంలో మీరు చేసిన ఒక మంచి పని ప్రస్తుతం మీకెంతో మేలు చేస్తుంది. దానిమేలు భవిష్యత్తులో కూడా ఉంటుంది. బహుశ ఇది మీరు రాసిన వీలునామా లేదా మీ పూర్వుల ఆస్తిపాస్తులకు సంబంధించి మీరు తీసుకున్న ఒక ముందుజాగ్రత్త కావచ్చు. లక్ష్యసాధనలో విజయాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. డబ్బు, విజయంతో ఆనందంగా తిరిగి వస్తారు. కలిసి వచ్చే రంగు: లేత నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ చిరకాల కోరిక తీరుతుంది. పనిపరంగా, కెరీర్‌పరంగా ఏది ముందో, ఏది వెనకో తేల్చుకోలేని గందరగోళంలో చిక్కుకుంటారు. ఒత్తిడి మూలంగా ఏకాగ్రత కోల్పోయి, లక్ష్యసాధనకు మీరు వేసుకున్న ప్రణాళికలో మార్పులు అనివార్యం అవుతాయి. గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాలు ఆందోళన కలిగిస్తాయి. స్థిమితంగా, శాంతంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయని గ్రహించండి. కలిసి వచ్చే రంగు: బంగారు -
టారో : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా సానుకూలంగా ఉంటుంది. విజయవంతంగా గడుస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు. భావోద్వేగాలపరంగా చాలా బలంగా ఉంటారు. కలిసొచ్చే రంగు: నారింజ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈవారం మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోసం కొత్త దుస్తులు కొనుగోలు చేసి, వారిని సంతోషపెడతారు. మీరు కూడా అందంగా, ఆనందంగా కనిపిస్తారు. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది కానీ, మరికొంచెం జాగ్రత్త అవసరం. మీ ప్రాధాన్యతాక్రమాలను మార్చుకోవాల్సి ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆకాశనీలం మిథునం (మే 21 - జూన్ 20) అదృష్టం, ఆర్థికభద్రత మీ వెన్నంటే ఉంటాయి. మీ స్వీయశక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకోవలసిన తరుణం ఇది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతే ఇబ్బందులు పడక తప్పదు. చాలాకాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్య తొలగిపోతుంది. పరిష్కృతమవుతుంది. దాంతో ఒకవిధమైన నిశ్చింతతో ఉంటారు. మీ చిక్కులను మీరే నేర్పుగా పరిష్కరించుకుంటారు. కలిసొచ్చే రంగు: గోధుమరంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీరు అసాధ్యాలుగా భావించినవన్నీ సుసాధ్యాలవుతాయి. మీ లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరకొచ్చేసినట్లే! మీ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్పగించవద్దు, ఇతరుల వ్యవహారాలలో మీరు జోక్యం చేసుకోవద్దు. బంధుత్వమంటే మీకు ఎంత ఇష్టమైనప్పటికీ, మీకు ఇష్టమైన వారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. ఆందోళన వద్దు. మీకు మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. విందు వినోదాలలో, విహార యాత్రలలో సేదదీరడం వల్ల మీరు పునరుత్సాహం పొందుతారు. మనసు మాట వినండి. ఆధ్యాత్మిక అవగాహన పెంచుకోండి. మీ ప్రతిభ, సామర్థ్యాలు మీకు విలువని తెచ్చిపెట్టవచ్చు కానీ, సామాజిక సంబంధాలూ అవసరమే అని గ్రహించండి. పనిలో కొత్త ప్రయోగాలు మంచిది కాదు. కలిసొచ్చేరంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ సృజనాత్మకతే మీకు శ్రీరామ రక్ష. పెద్దవాళ్ల నుంచి మీకో మంచి వార్త అందుతుంది. అది మీ కెరీర్‌నే మలుపు తిప్పుతుంది. సామాజిక కార్యకలాపాలలో విరివిగా పాల్గొంటారు. అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామికీ మీకూ అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్త అవసరం. సమస్యలు మిమ్మల్ని నీరు గార్చేందుకు కాదు, మీకు పాఠాలు చెప్పేందుకే అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కలిగిన ప్రతికోరికనూ తీర్చుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించండి. మీ జీవితాశయం నెరవేరేందుకు చాలా సమయం పడుతుందని నిరాశ పడవద్దు. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తూ ఉండాలి.. అవిశ్రాంతంగా పని చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త ఉద్యోగాలు, వృత్తి, వ్యాపకాలకు ఇది తగిన సమయం. కలిసొచ్చే రంగు: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) మీరు కోరుకున్నవాటిని పొందడానికి, మీ మనసులోని కోరికలను, భావాలను వ్యక్తం చేయడానికి ఇది తగిన సమయం. మీ బంధంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. అలాగే సంతోషం కూడా. మీ దైనందిన వ్యవహారాలతో తీరికలేకుండా గడుపుతారు. మీ వృత్తి, వ్యాపకాలలోకి బంధుమిత్రులు, స్నేహితులను తీసుకు వస్తారు లేదా వారి పనులలో మీరు పాలుపంచుకుంటారు. కలిసొచ్చే రంగు: లేత వంగపువ్వు రంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సంసిద్ధంగా లేకపోవడం వల్ల అరుదైన అవకాశాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. జరిగిన దాని గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని మితిమీరకుండా చూసుకోవడం మంచిది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. మీ సానుకూల దృక్పథమే మీకు మేలు చేస్తుంది. చిన్ననాటి స్నేహితుల రాక ఊరట కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) నూత్న గృహం లేదా వాహనం కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతాయి. పెట్టుబడుల విషయంలో మనసు చెప్పిన మాట వినండి. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీరు గీసుకున్న గిరి నుంచి బయట పడటం మేలు చేస్తుంది. మీ జీవితం మంచి మలుపు తిరిగే కొన్ని సంఘటనలు జరగవచ్చు. సృజనాత్మకంగా పని చేసి, మంచి ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత ఆలోచన అవసరం. ప్రేమ వ్యవహారాలో కొంత నిరాశ కలగవచ్చు. అనుకోని తగాదాలు, వ్యవహారాలలో వేలు పెట్టవలసి రావడం ఇబ్బంది కలిగించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) జాగ్రత్త, మెలకువ అవసరం. కొత్త ఆలోచనలను సృజనాత్మకంగా అమలు చేసి, మంచి ఫలితాలు, ప్రశంసలు పొందుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకోవడానికి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం ఉపకరిస్తుంది. భార్య లేదా భార్య తరఫు బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. కలిసొచ్చే రంగు: కాఫీ పొడి రంగు -
టారో : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఒత్తిళ్లు, చికాకులు, కోపాలు, ఇతరులతో వివాదాలు మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేయవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోగలిగే నేర్పరితనం అలవడుతుంది. కెరీర్ పరంగా కొత్తమార్గాలు ఆవిష్కృతమవుతాయి. తికమకలు, పరధ్యానాలను పక్కన పెట్టండి. ప్రశాంతంగా పని చేసుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మీరనుకున్న పనులన్నీ నెరవేరాయన్న సంతృప్తి కలుగుతుంది. అయితే మీలోని స్తబ్దతను, నిస్తేజాన్ని తొలగించుకోండి. సరైన సంబంధం కుదురుతుంది. ఒక ఇంటి వాళ్లవుతారు. మీ శ్రమకు తగిన ఫలితాన్ని, గుర్తింపును పొందుతారు. అభద్రతాభావాన్ని విడనాడి, ధైర్యంగా, నిశ్చింతగా ఉండండి. ఒక స్త్రీ మూలంగా అదృష్టం, ఆస్తి కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కీర్తిప్రతిష్ఠలు, విజయం వరిస్తాయి. ఆర్థికంగా కొంత అభద్రత, అస్థిరత ఉండవచ్చు. భయపడకండి. ఆదాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఒంటరితనం, ఏదో కోల్పోయిన భావనలు వెంటాడవచ్చు. ఆధ్యాత్మికతను అలవరచుకోండి. ప్రశాంతత అదే వస్తుంది. పనిపరంగా అంతా సవ్యంగా సాగుతుంది. ఆఫీసులో అంతా మిమ్మల్ని మెచ్చుకునేలా పని చేస్తారు. ప్రయాణాలు, సాహసాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: లేత గులాబీ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఒంటరితనం, ఏదో కోల్పోయానన్న భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లండి. అన్నీ ఉన్నాయన్న సంతృప్తి కలుగుతుంది. పనిలో మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష. అయితే మౌనంగా విధులను నిర్వహించడమే కాదు, మీ హక్కులను గురించి గుర్తు చేసుకోండి. ఆర్థికభద్రత కలుగుతుంది. సాహసాలు, ప్రయాణాలు చేస్తారు. పాతను వదిలి కొత్తదనాన్ని అలవరచుకుంటారు. కలిసొచ్చే రంగు: పగడం రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈవారమంతా మీకు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. భావసారూప్యత కలిగిన వారితో కలిసి ప్రయాణిస్తారు. పాతబంధాల నుంచి బయటపడతారు. పనిలో లేదా పని ప్రదేశంలో మార్పు ఉండే అవకాశం ఉంది. అహాన్ని వదిలిపెట్టి అందరితో కలసి మెలసి ఉండటం ఆనందాన్నిస్తుందని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ప్రయాణాలు చేస్తారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) పనులలో కొద్దిపాటి అడ్డంకులు, అవరోధాలు తప్పకపోవచ్చు. కష్టించి పని చేయండి. మేలు జరుగుతుంది. ఈ వారం మీ జీవితం మలుపు తిరిగే మంచి సంఘటనలు జరగవచ్చు. పనిలో కొత్తపంథాను అనుసరించి, సృజనాత్మకంగా పని చేయండి. భారీమొత్తాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇంకొంచె జాగ్రత్త తీసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: పాచిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఈవారం మీరు అన్ని విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా, మెలకువగా ఉండటం అవసరం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న మీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, లౌక్యంగా మాట్లాడటం అవసరమని గ్రహించండి. పనిలో కొత్తశక్తి, ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటారు. మానసిక ఒత్తిడిని తొలగించుకుంటేనే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పగటికలలు కనడం మాని, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, నిజాయితీతో పని చేయడం ఎంతో మేలు చేస్తుంది. కొత్త పని లేదా ప్రాజెక్టులో క్షణం తీరికలేకుండా గడుపుతారు. రకరకాల అవకాశాలు మీ తలుపు ఒకేసారి తడతాయి. మీకు నచ్చినది, మీరు చేయగలిగినది ఎంచుకుని కెరీర్‌ను మీరు అనుకున్నట్లుగా తీర్చిదిద్దుకోండి. మీ పుట్టినరోజు తర్వాత నుంచి మీకు మనశ్శాంతి, ఊరట లభిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కళ్యాణ ఘడియలు సమీపించాయి. ఆర్థిక భద్రత, స్థిరత్వం కలుగుతాయి. అయితే అందుకు మరికొంత సమయం ఉంది. ఆందోళన చెందకండి. పని, ప్రయాణాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. మీరు ఉద్యోగులైతే వ్యాపారావకాశం మీ తలుపు తడుతుంది. వ్యాపారులైతే ఉద్యోగావకాశం వరిస్తుంది. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తింపు, కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. అందుకు తగ్గట్టు పని చేయాలి కదా! సానుకూల భావనలు, సాను కూల ఆలోచనలు మీకెంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా, ఆత్మవిశ్వాసంతో చేయండి. మీ ప్రేమ ఫలించేందుకు, మీ విషయం పెద్దల వరకు వెళ్లేందుకు ఒకరి సాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తగిన ప్రణాళిక లేకపోవటం, సిద్ధంగా ఉండకపోవడం వల్ల కొద్దిపాటి ఆందోళన, అనిశ్చితి, గందరగోళం తప్పకపోవచ్చు. ఇవన్నీ మీ స్వయంకృతాపరాధాలే. గతం గురించి పశ్చాత్తాపం చెందడంతో సరిపోదు, దానినుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం అవసరమే కానీ, అతి వద్దు. ప్రేమవ్యవహారాలలో కొంచెం వేగిరపాటు ఉండచ్చు. మీ సానుకూల భావనలు మీకెంతో మేలు చేస్తాయి. కలిసొచ్చే రంగు: వెండిరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీపాటికి మీరు ప్రశాంతంగా గడుపుతారు. తెలియనివారికి మీరు కొంచెం అహంభావి అనిపింవచ్చుగాక.. అయినా, మీ గురించి తెలిసిన తర్వాత మీరెంత స్నేహశీలి అన్నదీ వారికే అర్థం అవుతుంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తారు. గతంలోని చేదు జ్ఞాపకాలు, బాధలు, భయాల నుంచి నెమ్మదిగా బయట పడతారు. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకుని వారి కోరికను తీరుస్తారు. కలిసొచ్చే రంగు: బూడిదరంగు -
టారో : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈ వారం చాలా బిజీగా ఉంటారు. నీతి నిజాయితీలతో మీరు చేసే పనులు అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి. ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అదనపు బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. మీ ముందొకమాట, వెనకొక మాటా మాట్లాడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఫలించడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కొత్త అవకాశం తలుపు తడుతుంది. కలిసి వచ్చే రంగు: గులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఆదాయానికి లోటుండదు. ఆనందానికి అవధి ఉండదు అన్నట్లు ఉంటుంది ఈ వారమంతా. చదువుమీద, మీరు చేసే పనిపట్ల జాగ్రత్తవహించండి. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చి, చిక్కులు తెచ్చుకోవద్దు. పెట్టుబడుల విషయంలో ప్రాథమిక పరిశీలన అవసరం. అనుకోకుండా బహుమతులు అందుతాయి. కలిసి వచ్చే రంగు: ముదురు గోధుమ మిథునం (మే 21 - జూన్ 20) కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మీరు మనసులో ఊహించుకున్న దానికి, జరిగేవాటికి పొంతన కుదరదు. కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ధైర్యంగా ఉండండి. మంచే జరుగుతుంది. అయితే ఇతరులను ఆకట్టుకోవడం కోసం మీరు మారనక్కరలేదు. వివాదాస్పదమైన వ్యక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల మీద కన్నేసి ఉంచండి. పనిమీద శ్రధ్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) మీ మనసులో ఉన్నదానిని బయటకు చెప్పడం, దాని మీదనే గట్టిగా నిలబడటమే ధైర్యమంటే! అవతలివాళ్లు చెప్పినదానిని ఓపికగా వినడం కూడా ధైర్యమే! ఏమి జరుగుతోందో పరిశీలించండి, ధైర్యంగా వినండి. ప్రశాంతంగా, స్థిరచిత్తంతో ఉండటం వల్ల సత్ఫలితాలు వస్తాయి. అయితే అన్ని విషయాల్లోనూ నిదానంగా వ్యవహరించడం అన్ని వేళల్లోనూ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండండి. కలిసి వచ్చే రంగు:సముద్రపు నాచు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వారమంతా చాలా ప్రశాంతంగా, ఉల్లాసంగా గడుస్తుంది. పెట్టుబడులు సంతృప్తికరమైన ఫలితాన్నిస్తాయి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భారంగా పరిణమించవచ్చు. పనులలో చోటు చేసుకునే జాప్యానికి, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. సృజనాత్మక నిర్ణయాలు, సృజనాత్మక వ్యాపార వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. కలిసి వచ్చే రంగు:పసుప్పచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వ్యవహారాలలో కొంచెం నిదానం అవసరం. సానుకూల భావనలను పెంపొందించుకోండి. కొత్త స్నేహితులు, కొత్తగా ఏర్పడ్డ బంధాల వల్ల మీ కోరికలను కొన్నింటిని వదులుకోవలసి రావచ్చు. అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకా పూర్తికాని వ్యాపార పనులను. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయండి. ఆలోచనలకు తగ్గట్టు పని చేయండి. కలిసి వచ్చే రంగు: నారింజ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మీరు అనుకున్న చోట్లకి వెళ్లడానికి, కొత్తపనులు చేపట్టడానికి ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కుటుంబంతో లేదా బంధుమిత్రులతో కలసి వారమంతా రిలాక్స్డ్గా గడుపుతారు. మీ ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టు ఉత్సాహంగా పనిచేయండి. పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయి. పనులలో కొత్త విధానాలకు వెళ్లకపోవడం మంచిది. జీవితంలో కొత్తదనాన్ని నింపుకోవడం మరచిపోవద్దు. కలిసి వచ్చే రంగు: బూడిదరంగు / వెండి వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. సామర్థ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ శక్తియుక్తులు, తెలివితేటలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం మంచిది. మీ మనసు చెప్పినట్లు నడుచుకుంటే మంచి లాభాలు పొందుతారు. అపరిష్కృతమైన మీ సమస్యలు పరిష్కారం దిక్కుగా పయనిస్తాయి. కలిసి వచ్చే రంగు: గోధుమ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధాలు బలహీనపడే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ మధ్య సమన్వయం సాధిస్తారు. మీరు ఇష్టపడే వారి మనసును గెలుచుకుంటారు. కష్టపడి పని చేసి, విజయపథంలో నడుస్తారు. కలిసి వచ్చే రంగు: చాకొలెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) విందువినోదాలలో పాల్గొంటారు. గొప్పవారినుంచి ప్రత్యేకమైన ఆహ్వానాలు అందుకుంటారు. మీకూ, మీ స్నేహితుడికీ ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. అయితే నేర్పుగా వ్యవహరించి, ఎట్లాగో ఒడ్డెక్కుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చింత మాని వర్తమానంలో జీవించండి. ప్రతిక్షణాన్నీ ఉత్సాహంగా, ఉల్లాసంగా అనుభవిస్తూ గడపండి. కలిసి వచ్చే రంగు: పసుప్పచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులూ ఉంటాయి. మొండిబకాయిలు వసూలు చేసుకోవడమంచిది. నూత్నవాహనాన్ని కొనుగోలు చేస్తారు. భారీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మనసు మాట వినండి.ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. దైవంపట్ల సరైన అవగాహనను పెంచుకుంటారు. ఓ సంతోషకరమైన వార్తను వింటారు. పనిపట్ల మరింత శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. కలిసి వచ్చే రంగు: ముదురు పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తిపరంగా లాభాలను పొందుతారు. తెలివితేటలు, కష్టించే తత్వంతో ప్రమోషన్లు పొందుతారు. లౌక్యం వల్ల మేలు జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అవసరం. మీ ప్రతిభా సామర్థ్యాలతో సీనియర్లను ఆకట్టుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించలేకపోయానని బాధపడవద్దు. కొత్త అనుభవం ఎదురయినందుకు ఆనందించండి. కలిసి వచ్చే రంగు: లేత గులాబి -
టారో (13-11-2016 to 19-11-2016)
13 నవంబర్ నుంచి 19 నవంబర్, 2016 వరకు మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తారు. మీ అంతశ్చేతన అద్దంలా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా సాగుతుంది. చిన్న చిన్న ఒడుదొడుకులుండవచ్చు కానీ, జీవితంలోని ఇతర ఆనందాలతో పోల్చుకుంటే అవెంత? మీ పని మీరు మనసు పెట్టి, ఆత్మవిశ్వాసంతో చేయండి. లక్కీ కలర్: లేతగులాబీ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరిస్తే భయాలు తొలగుతాయి. మిమ్మల్ని బాధిస్తున్న ముల్లును నేర్పుగా పెకలించి వేస్తే మీ అంత కచ్చితమైన వ్యక్తి మరొకరు లేరని మీకే అర్థం అవుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ఇంటి ఆధునీకరణ పనుల్లో పడతారు. మీ సత్తా నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇంటా బయటా జరగనున్న కొన్ని ప్రధాన సంఘటనలు మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. మీరు చేస్తున్నదంతా బాధ్యతాయుతంగా చేస్తున్నదేనని మీరు గ్రహిస్తే జీవితంలో అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఎప్పుడో విడిచిపెట్టిన బంధువులు, బంధుత్వాలు, పాత సంబంధాలు తిరిగి కలుస్తాయి. ఛలోక్తులు విసిరేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. లక్కీ కలర్: మావిచిగురు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గురుబలం వల్ల మీకు ఈవారం బాగా కలిసి వస్తుంది. విజయం వరిస్తుంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి భూతభవిష్యత్ కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో సంపూర్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. అవిశ్రాంతంగా పని చేయడం అనారోగ్యకరం అని గ్రహించండి. మార్మిక కవితలు లేదా ప్రేమగీతాల రచనకు శ్రీకారం చుట్టండి. మీ అంతర్గత శక్తులను వెలికి తీయండి. లక్కీ కలర్: చాకొలేట్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త అవకాశంతోపాటే కొత్త సవాళ్లూ పొంచి ఉంటాయని తెలుసుకోండి.సమస్యలను ఎదుర్కొంటేనే అధిగమించగలం. ఆత్మవిశ్వాసంతో సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా, మీ సామర్థ్యం బయటపడేది. కొత్తదనం కోసం అన్వేషించండి. మనసు చెప్పే మాటను వినండి. మీ సృజనాత్మకత మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సమస్యలు, సవాళ్లు లేని జీవితం చప్పిడి పప్పు వంటిది. మీరు కోరినవన్నిటినీ పొందాలనుకుంటే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే కదా జీవితం చైతన్యంతో ప్రకాశించేది! ఈ వారంలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని, డబ్బును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామిని కానుకలతో సంతృప్తి పరచేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: వెండిరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) వృత్తిపరంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. రేపటికోసం తపన పడుతూ ఉంటే ఈరోజు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుందని గ్రహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు తక్షణం మీకు తగిన అత్యుత్తమమైన మార్గం కనిపించకపోవచ్చు కానీ, మీ ముందున్న మార్గం కూడా ఉత్తమమైనదే. ఇతరుల అవసరాలను తీర్చేముందు మీవి మీకు ముఖ్యమే కదా! లక్కీ కలర్: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈవారం మీకు మంచి వినోదభరితంగా, ఉల్లాసంగా... ఇంకా చెప్పాలంటే సరసంగా గడిచిపోతుంది. మీ ప్రేమకోసం పడిగాపులు పడుతున్న వారిని పనిగట్టుకుని మరీ పలకరించి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. ఛాందసమైన ఆలోచనలను విడిచిపెట్టి, కొత్తగా, వైవిధ్యంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీ చరిష్మా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికీ పోదు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీరనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు అనుకుంటున్న కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మంచి లాభాలను కళ్లజూస్తారు. గొప్ప ఆదాయాన్ని పొందుతారు. తమ శక్తి సామర్థ్యాలేమిటో తమకే తెలియని వారికి ప్రతివిషయంలోనూ భయమే! జ్ఞాని దేనికీ భయపడడు. ఈవారం ఓ గొప్ప సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది. లక్కీ కలర్: దొండపండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితమంటేనే స్వేచ్ఛ. ఎవరూ ఎవరినీ కట్టడి చేయజాలరని అనుకుంటారు. మనం ప్రేమించే వారిని మనం కట్టడి చేస్తాం. మనల్ని ప్రేమించే వారు తమ ప్రేమతో మన ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. అహాన్ని అణ చిపెడితేనే ఆనందం. త్వరలోనే కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడనున్నాయి. ఆమోదించక తప్పదు. లక్కీ కలర్: బూడిదరంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) జీవితం అంటే ప్రశ్న కాదు.. సమస్య అసలే కాదు. జీవితమంటే జీవించడమే! ఎదురైనవాటన్నింటినీ ఆమోదిస్తూ, అనుభవిస్తూ వాలుకు కొట్టుకుపోవడమే జీవితం. బోర్డమ్ నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్తగా తయారవండి. స్నేహితులతో సరదాగా గడపండి. కుటుంబంతో కలసి లాంగ్‌టూర్‌కి వెళ్లండి. రొటీన్ నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండండి. లక్కీ కలర్: వంకాయరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వృత్తివ్యాపారాలలో ఊహలనుంచి బయటపడి, వాస్తవంగా ఆలోచించడం, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంటిలో లేదా ఆఫీసులో కొత్త మార్పు చోటు చేసుకోబోతోంది. సృజనాత్మక ఆలోచనతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అత్యుత్తమమైన వాటి గురించి ఆలోచన చేయండి. అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించండి. మీ అభిప్రాయాలలో కాస్త పట్టువిడుపు ధోరణి అవసరం. లక్కీ కలర్: లేత పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
'జియో'మంతర్ 'ఖాళీ'!
- సొంతింటి కలకు 'జియో ట్యాగింగ్' గ్రహణం – సమన్వయంతో సాగని డ్వామా, హౌసింగ్ అధికారులు – గృహనిర్మాణ సంస్థకు అనుమతులు మంజూరు – ఉపాధి కోటా కింద అనుమతులే రాని వైనం – జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్లతో 'బిల్లులు' కష్టం అనంతపురం టౌన్ : పేదల సొంతింటి కలకు 'జియో' గ్రహణం పట్టుకుంది. గృహ నిర్మాణ సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు సమన్వయంతో వెళ్లాల్సి ఉన్నా.. ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన సాగుతున్నారు. ఇప్పటికే ఇళ్లు మంజూరయ్యాయి..గ్రౌండింగ్‌కు వెళ్లి ఖాళీ స్థలాలకు జియోట్యాగింగ్ ప్రారంభిస్తామని హౌసింగ్ అధికారులు చెబుతుంటే.. మా ఫైల్ ఇంకా పెండింగ్‌లోనే ఉందంటూ డ్వామా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. వేర్వేరుగా అనుమతులు రావాల్సిందే! ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి రూ.1.50 లక్షలతో 200 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.95 వేలు, ఉపాధి నిధులు రూ.55 వేలు చెల్లిస్తారు. ఈ మొత్తమంతా సబ్సిడీనే. ఉపాధి నిధులకు సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయ్యేలోపు 90 రోజుల పనిదినాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు రూ.194 వేతనం చొప్పున కూలికి రూ.17,460, ఇటుకల కోసం రూ.25,540, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలను ఉపాధి నిధుల నుంచి కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో డ్వామా, హౌసింగ్లకు వేర్వేరుగా అనుమతులు రావాల్సి ఉంటుంది. అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల్లో 350 ఇళ్లు చొప్పున, మిగిలిన 12 నియోజకవర్గాలకు 900 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థకు ఇచ్చే రూ.95 వేల సబ్సిడీ(ఒక్కో యూనిట్)కి సంబంధించి సుమారు 7,600 ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి కింద వచ్చే రూ.55 వేలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనుమతులు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్వామా తరఫున 5,822 ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలను కలెక్టర్‌కు పంపారు. వీటికి అనుమతులు వచ్చాకే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. అంటే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీంకు సంబంధించి గృహ నిర్మాణ సంస్థకు ఎన్ని ఇళ్లు మంజూరు చేసినా ఫలితం లేదు. అంతిమంగా డ్వామా అధికారులకు మంజూరయ్యేవే లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. జియోట్యాగింగ్‌తో గుబులు ఇళ్ల నిర్మాణాలకు ప్రస్తుతం జియోట్యాగింగ్ గుబులు పట్టుకుంది. లబ్ధిదారులకు బిల్లులను బేస్మెంట్, రూఫ్ లెవల్ (ఆర్ఎల్), రూఫ్ క్యాస్ట్ (ఆర్సీ), కంప్లీషన్ అయ్యాక నాలుగు దశల్లో ఇవ్వనున్నారు. బిల్లులు మంజూరు చేసే ప్రతిదశలోనూ జియోట్యాగింగ్ తప్పనిసరి. ప్రస్తుతానికి ఖాళీ స్థలాన్ని రెండు శాఖల అధికారులు ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ హౌసింగ్ అధికారులు చేసేశారని భావించి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించేస్తే బేస్మెంట్ బిల్లు రానిపరిస్థితి ఉంటుంది. బేస్మెంట్ కోసం 28 రోజుల పనికి సంబంధించి ఉపాధి నిధులు మంజూరవుతాయి. డ్వామా అధికారులకు అనుమతులు రాకపోవడంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లలేకపోతున్నారు. హౌసింగ్ అధికారులు మాత్రం గ్రౌండింగ్‌కు పరుగులు పెడుతున్నారు. జన్‌ధన్ ఖాతాతో ఇక్కట్లే ఇంటి నిర్మాణం ప్రారంభించాక బిల్లును లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా వేయనున్నారు. ప్రస్తుతం ఎంపికైన వారిలో కొందరు ఆధార్ లింక్‌తో జన్‌ధన్ యోజన కింద బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి బిల్లుల కష్టాలు తప్పవు. పేమెంట్స్ అన్నీ ఆన్లైన్లో జరగనున్న నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాలకు మనీ ట్రాన్స్ఫర్ విషయంలో పరిమితులు ఉంటాయి. కొన్ని ఖాతాలు రూ.20 వేలు, మరికొన్ని రూ.50 వేల వరకు మాత్రమే ఆన్లైన్ లావాదేవీలకు అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో సేవింగ్స్ ఖాతాలు ఉంటేనే బిల్లులు సకాలంలో అందే అవకాశం ఉంది. ఈ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. మొత్తానికి రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో 'ఇంటి'బెంగ తప్పేలా లేదు. -
ప్రగతే లేదు
– గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి – దృష్టి సారించాలని ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రగతి లేదంటూ కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో దష్టి సారించాలని ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది పట్టణ ప్రాంతాల్లో 10,600 గృహ నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన కలెక్టర్ దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 11లోగా ప్రతిపాదనలు పంపాలని హౌసింగ్ పీడీ, ఈఈలను ఆదేశించారు. మంజూరైన గృహాల నిర్మాణం కోసం ఈ నెల 15 నుంచి లబ్ధిదారుల స్థలాల్లో మార్కింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన యోజన కింద 7107 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని, వీరిలో అర్హులను గుర్తించి ప్రతిపాదనలు ఇస్తామని హౌసింగ్ పీడీ రాజశేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద దెబ్బతిన్న గృహాలల మరమ్మతులకు రూ.10వేల ప్రకారం మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన గృహాలను వారంలోగా గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌస్ పార్ ఆల్ గృహ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ అధికారులతో ఈ నెల 14న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై ఈ నెల 23న సమీక్షిస్తామని ప్రకటించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, ఈఈలు సుధాకర్‌రెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు -
డిసెంబర్ లోపు గృహ నిర్మాణాలు పూర్తిచేయండి
మేయర్ కోనేరు శ్రీధర్ విజయవాడ సెంట్రల్ : అజిత్‌సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద నిర్మాణం చేస్తున్న జెఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ హౌసింగ్ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణాలను పరిశీలించారు. రీ టెండర్లు పిలిచి రెండుప్యాకేజీల కింద 24 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఎనిమిది బ్లాక్‌లు అక్టోబర్ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. మేయర్ మాట్లాడుతూ డిసెంబర్‌తో జెఎన్ఎన్యూఆర్ఎం గడువు ముగుస్తోందన్నారు. నిర్ణీతగడువులోపు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఇందులో తేడా వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్ ఈఈ బి.శ్రీనివాసరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
ఇతర శాఖల్లో సర్దుబాటు చేయండి
తొలగించిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రిలేదీక్షలు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం ముకరంపుర : రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేశ్ సంఘీభావం తెలిపారు. తొలగించిన ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్ర గహనిర్మాణ సంస్థలో 2006 నుంచి పదేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ విభాగాల్లో అరకొర వేతనాలతో విధులు నిర్వహించామని తెలిపారు. బడ్జెట్ కేటాయించలేదనే సాకుతో విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశిస్తే..రోడ్డుపైకి వచ్చామన్నారు. ఇప్పటికే 50 మందికిపైగా ఇతర శాఖల్లో భర్తీ చేశారని, మిగతా వారిని సైతం సర్దుబాటు చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సీహెచ్.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్.శ్రీదేవి, సీహెచ్.రమాదేవి, ఎస్.బాబురావు పాల్గొన్నారు. -
పేదలందరికీ రెండు పడకల ఇళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా 1.24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఆమదాలవలస: రాష్ట్రంలోని పేదలందరికీ రెండు పడకల ఇళ్ల మంజూరుకు ప్రణాళిక సిద్ధం చేశామని గృహ నిర్మాణశాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ప్రభుత్వవిప్ కూన రవికుమార్ అధ్యక్షతన ఆమదాలవలస పట్టణ పరిధి తిమ్మాపురం గ్రామంవద్ద హుద్‌హుద్ తుపాను నిధులు 24.85 కోట్ల వ్యయంతో 512 గృహాల నిర్మాణానికి ఆమె గురువారం శంకుస్థాపన చేశారు. ముందుగా పట్టణ శివార్లలో ఉన్న ఎన్.టీ.ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. తరువాత మండలంలోని ఈసర్లపేట వద్ద ఉన్న అక్కుల పేట ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేశారు. తిమ్మాపురం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. హుద్‌హుద్ నిధులతో రాష్ట్రంలోని 2500 మంది పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. 2004 సంవత్సరానికి ముందర నిర్మించిన ఇళ్లకు మరమ్మతుల కోసం రూ.10వేలు మంజూరు చేస్తామన్నారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.3.50 లక్షలు, బీసీలకు 2.25 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. బీసీలకు 1.24 లక్షల ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 74వేల ఇళ్లు మంజూరు లక్ష్యమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ప్రభుత్వ విప్ కూనరవికుమార్, ఆమదాలవలస మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత, వైస్ చైర్పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, ఎంపీపీ తమ్మినేని భారతమ్మ, కలెక్టర్ లక్ష్మీ నృసింహం, జేసీ వివేక్‌యాదవ్, డీఆర్డీఏ పీడీ తనూజరాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భాస్కరరావు, వైస్ చైర్మన్ అన్నెపు భాస్కరరావు, మున్సిపల్ కమిషనర్ బి.రాము తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కనెక్షన్లు ఏవమ్మా? అక్కులపేట ఎత్తిపోతల పథకం ప్రారంభానికి వెళ్లిన మంత్రి మృణాళిని, విప్ రవికుమార్‌కు ఈసర్లపేట తదితర గ్రామాల ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. రోడ్లు నిర్మించలేదని, గ్యాస్ కనెక్షన్లు కోసం టీడీపీ కార్యకర్తలు డబ్బులు వసూలు చేసి ఇంతవరకూ మంజూరు చేయలేదని గోడు వినిపించారు. అయితే, మహిళలకు సమాధానం చెప్పకుండా మంత్రి పర్యటన కొనసాగించారు. ఎత్తిపోతల పథకం ప్రారంభంలో అపశృతి జరిగింది. అక్కడ స్విచ్ ఆన్ చేయగానే రెండు మోటార్లలో ఒక మోటారు నుంచి మంటలు వచ్చి కాలిపోయింది. పట్టాలిస్తామని చెప్పి... ఇళ్ల పట్టాలు ఇస్తామని టీడీపీ నేతలు గ్రామాల్లో ప్రచారం చేశారు. దీంతో పట్టణంలోని పేదలందరూ ఉదయం 9.30 గంటలకే తిమ్మాపురం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తీరా మంత్రి వచ్చే సరికి 12గంటలు కావడం, మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమావేశం కొనసాగించడంతో మహిళలు అవస్థలు పడ్డారు. తాగునీరు కూడా అందక నరకయాతన ఎదుర్కొన్నారు. తీరా సమావేశంలో ఒక్కరి పేరు కూడా చదవకపోవడం, పట్టాలు అందజేయకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. సభ వద్ద తతంగాన్ని చూసిన కొందరు పేదల గృహాలు కూడా టీడీపీ నాయకులే కాజేసేలా ఉన్నారని నిట్టూర్చారు. -
గృహ నిర్మాణాల పరిశీలన
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కంపోస్టు కాలనీలో నిర్మిస్తున్న గహ నిర్మాణాలను ఆదివారం కలెక్టర్ పి.లక్ష్మీనసింహం పరిశీలించారు. హుదూద్ తుపాను వల్ల ఇళ్లు కోల్పోయిన 192 మంది లబ్ధిదారులకు కంపోస్టు కాలనీ వద్ద ఎన్టీఆర్ కాలనీ గహాలను ప్రభుత్వం గహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిందని కలెక్టర్ తెలిపారు. ఒక్కొక్క బ్లాకులో 16 గహాలు చొప్పున నిర్మించామన్నారు. ప్రతి గహంలోను ఒక వంటిల్లు, ఒక పడక గది, ఒక హాలు, టాయ్లెట్ల సదుపాయం కల్పించామని తెలిపారు. 100 కిలో లీటర్ల సామర్థ్యంతో పెద్ద మంచినీటి సంప్‌ను నిర్మించామని, మున్సిపల్ ట్యాంకు నుంచి సంప్‌లో నీరు నింపి, ఇంటింటికీ రెండు పూటలా నీటి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఆయనతోపాటు గహ నిర్మాణ సంస్థ పీడీ పీఆర్ నరసింగరావు, ఈఈ పి.శ్రీనివాసరావు, డీఈఈ డి.శ్రీనివాసరావు, ఏఈ డి.సత్యనారాయణ, తదితరులు ఉన్నారు. -
పీఎన్బీ గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు లేదు
♦ డాక్యుమెంటేషన్ ఫీజు కూడా రద్దు ♦ సెప్టెంబర్ 30 వరకూ ఆఫర్ న్యూఢిల్లీ: కొత్త గృహ, కార్ల రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలను ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రద్దు చేసింది. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ చార్జీలు ఉండని ఈ ‘మాన్సూన్ బొనాంజా’ ఆఫర్ సెప్టెం బర్ 30 వరకూ ఉంటుందని పీఎన్బీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ రుణాలు ముఖ్యంగా గృహ, కారు, విద్యా రుణాలపైననే దృష్టి పెడతామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించిన తొలి బ్యాంక్ తమదేనని తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఈ బ్యాంక్ ఇటీవల 0.25 శాతం వరకూ తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్‌కు రూ.5,367 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఈ స్థాయి త్రైమాసిక నష్టాలు వచ్చిన ఏకైక ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇదే. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ బ్యాంక్ రూ.307 కోట్ల నికర లాభాలు ఆర్జించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,281 కోట్లుగా ఉన్న బ్యాంక్ మొండిబకాయిల కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మూడు రెట్లకు పైగా పెరిగి రూ.11,380 కోట్లకు ఎగిశాయి. స్థూల మొండిబకాయిలు 6.55% నుంచి 12.9 శాతానికి, నికర మొండి బకాయిలు 4.06% నుంచి 8.61 శాతానికి పెరిగాయి. -
పైన పటారం...
‘బెస్ట్ కాలనీ’ సరిహద్దులో వరెస్ట్ వినయ్‌నగర్ కాలనీ బస్టాండ్‌లో డ్రైనేజ్ సమస్య 40 ఏళ్ల నాటి వ్యవస్థతో పదేళ్లుగా ఇబ్బందులు 250 మీటర్లు మార్చేందుకు జలమండలి కక్కుర్తి సిటీబ్యూరో: అది సైదాబాద్‌లోని ఐఎస్ సదన్ చౌరస్తాను ఆనుకుని ఉన్న వినయ్‌నగర్ కాలనీ... గతేడాది బెస్ట్ కాలనీగా ఎంపికై బల్దియా నుంచి రూ.10 లక్షల నజరానా అందుకుంది. అయితే కాలనీ లోపల హుందాగానే ఉన్నా సరిహద్దులో మాత్రం డ్రైనేజ్ వ్యవస్థ దుర్భరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల నాటి పైప్‌లైన్‌ను కేవలం 250 మీటర్ల మేర మర్చడంలో ప్రభుత్వ విభాగాల కక్కుర్తితో 10 ఏళ్లగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కాలనీ సంఘం ఆరోపిస్తోంది. ఐఎస్ సదన్ చౌరస్తాలోని మసీదు/దేవాలయం నుంచి దాదాపు 250 మీటర్ల మేర ఏళ్ల నాటి డ్రైనేజ్ పైప్ లైనే ఉంది. ఈ ప్రాంతంలో పదేళ్లుగా వాణిజ్య, నివాస సముదాయాలతో పాటు వసతిగృహాలు పెరగడంతో వాటి నుంచి బయటకు వచ్చే మురుగునీరు ఎన్నో రెట్లు పెరిగింది. చౌరస్తా నుంచి చంపాపేట్ వెళ్లే సాగర్ హైవే. వినయ్‌నగర్ కాలనీ సరిహద్దుల్లోనే ఇబ్రహీంపట్నం/దేవరకొండకు వెళ్లే బస్సులు నిలిపే బస్టాప్ సైతం ఉంది. ప్రధానంగా రద్దీ వేళల్లోనే పాత పైప్‌లైన్ కారణంగా మ్యాన్‌హోల్స్ పొంగి బస్టాండ్‌తో పాటు రహదారిని ముంచెత్తుతోంది. దీంతో ప్రయాణికులు అవస్థలుఎదుర్కొంటున్నారు. ఐఎస్ సదన్ చౌరస్తా వెంబడి జీవనం సాగించే చిరువ్యాపారులు, ఆటో స్టాండ్‌కు ఆటో ఎక్కేందుకు వచ్చే స్థానికులు మురుగు నీటిలోంచే వెళ్లాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని ‘ఏడేళ్లుగా ఈదీబజార్లోని జలమండలి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు అధికారులు కనీసం ఎస్టిమేట్స్ కూడా తయారు చేయలేదు. సోమవారం చంద్రాయణగుట్టలోని జలమండలి జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్‌ను కలిశాం. గరిష్టంగా మూడు రోజుల్లోపు అంచనాలు తీయారు చేయాల్సిందిగా ఈదిబజార్ అధికారుల్ని ఆదేశించారు. కేవలం 250 మీటర్ల మేర పైప్‌లైన్ మార్చడానికి ఇన్నాళ్లు కాలయాపన చేస్తూ స్థానికుల్ని, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని వినయ్నగర్కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి అవినాష్ కె.రౌత్ అన్నారు. -
ఈపీఎఫ్ ఉపసంహరణలపై మరో మెలిక
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్ (భవిష్య నిధి) విత్ డ్రాయల్స్‌పై ప్రతిపాదించిన పన్నుపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఉపసంహరణలపై మరో మెలిక పెట్టింది. సోమవారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారం ఉపసంహరణకు సంబంధించిన పరిమితులను సడలిస్తూ కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకముందు కొన్ని ప్రత్యేక కారణాలతో ఈపీఎఫ్ ఖాతాలోని పూర్తి సొమ్ము ఉపసంహరణకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తాజా మార్పుల ప్రకారం ఇకముందు ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణకు ఖాతాదారుడు ఇల్లు కట్టుకోవడం, లేదా కొనడం, (హౌసింగ్) స్వీయ లేదా కుటుంబ సభ్యులు, పిల్లలకు దంత వైద్యం సహా ఇతర వైద్య ఖర్చులు నిమిత్తం, ఇంజనీరింగ్ విద్యకు లాంటి కారణాలపై మాత్రమే అనుమతిని మంజూరు చేసింది. దీంతోపాటుగా చందాదారుని పెళ్లి సమయంలో కూడా ఈ సొమ్ము విత్ డ్రా కు అనుమతి వుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చందాదారులు (అతడు లేక ఆమె) పూర్తి సంతృప్తికర సమాచారాన్ని అందించిన తరువాత, అప్పటివరకు ఖాతాలో ఉన్న సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని మంత్రిత్వ వర్గాలు ప్రకటించాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సభ్యులకు, సహాయక ప్రావిడెంట్ ఫండ్ లేదా వృద్ధాప్య పెన్షన్ల సభ్యులకు ఇది విస్తరించబడిందనీ, ఈ ఆగస్టు నుంచి ఈ నిబంధనలను అమలులోకి వస్తాయని తెలిపింది. కార్మిక సంఘాల ప్రాతినిధులతో, కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చేసిన విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో మంత్రి అరుణ్ జైట్టీ పేర్కొన్నారు. దీనిపై దేశంలోని ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రతిపాదను విరమించుకున్న సంగతి తెలిసిందే. -
సంక్షేమ హాస్టళ్లకు కోత
పేద విద్యార్థులకు వాత హాస్టళ్లను మూసివేసే దిశగా ప్రభుత్వ చర్యలు మండలానికో గురుకులం ఏర్పాటుకు కసరత్తు భవితవ్యంపై పేద విద్యార్థుల బెంగ పేద విద్యార్థుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది. ఒకవైపు పాఠశాలల రేషనలైజేషన్ పాట పాడుతూ.. మరోవైపు సంక్షేమ వసతి గృహాలను తగ్గించే పనిలో పడింది. దీంతో చదువుకుందామని ఆశపడిన విద్యార్థులు భవితవ్యాన్ని తలుచుకుని దిగులుచెందుతున్నారు. మచిలీపట్నం : పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ఆసరాగా ఉన్న సంక్షేమ వసతి గృహాలను తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వసతిగృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రానున్న మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సంఖ్యను గణనీయంగా తగ్గించే దిశగా ఈ ప్రయత్నాలు జరుగుతుండడం గమనార్హం. మండలానికో గురుకులాన్ని ఏర్పాటుచేసి వసతి గృహాలను మూసివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆసరా కోల్పోతారా జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 119 వసతి గృహాలున్నాయి. వీటిలో బాలురకు 65, బాలికలకు 54 ఉన్నాయి. 8548 మంది విద్యార్థులున్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న వసతిగృహాలు 32 ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 45, బాలికల వసతి గృహాలు 17 ఉన్నాయి. వీటిలో 4758 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో 11 వసతి గృహాలున్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాలు 11, బాలికల వసతి గృహాలు 7 చొప్పున మొత్తం 18 ఉన్నాయి. వీటిలో 1008 మంది విద్యార్థులు ఉన్నారు. అద్దె భవనాల్లో, తక్కువ విద్యార్థులు ఉన్న వసతి గృహాలను ఎంపిక చేసి వాటిని మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. తక్కువ మంది విద్యార్థులున్న వసతిగృహాలను గుర్తించి అన్ని సౌకర్యాలు ఉన్న సమీకృత వసతిగృహాల్లోకి ఈ విద్యార్థులను పంపనున్నారు. 50 మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ఖర్చు తగ్గించుకోవడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు అక్కడ చేరేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వసతి గృహాలను మూసివేస్తూనే వాటి స్థానంలో గురుకులాలను ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. గురుకులాల్లోనైనా వసతులు కల్పిస్తారో.. లేక గాలికొదిలేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న వసతిగృహాలు, అద్దె భవనాల్లో నడుస్తున్న వసతి గృహాలు.. వాటికి ఎంతెంత ఖర్చు అవుతుంది... తదితర వివరాలను ఆయా సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వసతిగృహాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం పలు సూచనలు చేసిందని, ఆ మేరకు వివరాలు సేకరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. -
బాత్రూం సైజు ఇళ్లలో వేలమంది నివాసం!
తీవ్రవాద చర్యలకు భయపడి పారిపోతున్న శరణార్థులు... సహాయ శిబిరాల్లోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న బాత్రూం పరిమాణంలో ఉన్న ఇళ్లలో వేలమంది నివసిస్తున్నారు. తాజాగా బయటపడ్డ కొన్ని ఫొటోలు అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయినవారంతా మఫ్ రాక్ నగరానికి దగ్గరలోని అల్ జతారి క్యాంప్‌లో తలదాచుకుంటున్నారు. జోర్డాన్‌లోని ఆ శిబిరాలే ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తున్నాయి. తీవ్రవాదానికి దూరంగా.. మెరుగైన జీవితం గడపడం కోసం సిరియా, ఇరాక్ దేశాల నుంచి పారిపోయి వచ్చిన శరణార్థులు సుమారు ఆరు లక్షల మంది జోర్డాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. లక్షల మంది ఈ అగ్గిపెట్టెల్లాంటి శిబిరాల్లో తల దాచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి అందుబాటులో కాఫీ, పిజ్జా, బార్బర్ షాప్‌లు కూడా వెలిశాయి. ఇప్పుడీ ప్రాంతం.. వారి సొంత నగరంగానే మారిపోయినా, సమస్యలు మాత్రం రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజుకు శరణార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ నివపిస్తున్నట్లు గుర్తింపు పొందిన మొత్తం 6 లక్షల మంది శరణార్థులకే కాక, లెక్కల్లో లేని సుమారు మరో 10 లక్షల మంది సిరియన్లకు కూడా సహాయం అందించాలని కోరుతున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా మాత్రం తమ విద్యావ్యవస్థ, ఆరోగ్య విషయాల్లో శరణార్థులకు హాని ఏమీ లేదని అంటున్నారు. అంతర్జాతీయ సమాజాన్ని నిర్మించడంలో తాము సహకరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ప్రతిరోజూ 15.5 టన్నుల బ్రెడ్‌ను శిబిరానికి పంపిణీ చేస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కాలంలో శరణార్థ శిబిరాల్లో రద్దీ తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావాలని భావించినా.. సిరియాలో సంక్షోభం వల్ల అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా శరణార్థుల సమస్య తీరి.. యూరోపియన్ దేశాల్లో ప్రశాంత వాతావరణం ఏర్పడాలని అంతా కోరుకుంటున్నారు. -
కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి
ఈతకు వెళ్లిన ఆ యువకుడు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. విజయవాడ నగరంలో సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత రాజీవ్‌నగర్‌కు చెందిన జవ్వాది దుర్గారావు(16) తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళ్తుంటాడు. సోమవారం స్నేహితులతో కలసి అంబాజీపురం వద్ద కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఒడ్డుకు చేరిన తర్వాత కాలువలో చెప్పులు పడిపోవటంతో వాటిని తీసుకునేందుకు పక్కనే ఉన్న కరెంటు స్తంభం జీవైర్‌ను పట్టుకున్నాడు. అయితే, అది సర్వీసు వైరును తాకి ఉండటంతో విద్యుత్ ప్రసారం జరిగి అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. -
సంక్షేమ హాస్టళ్ల మూసివేత
50 మంది విద్యార్థుల లోపున్న హాస్టళ్లను సమీప వసతిగృహంలో విలీనం ఎస్సీ, బీసీ, ఎస్టీ శాఖల పరిధిలో 29 హాస్టళ్లకు పొంచిఉన్న ముప్పు దుబారా వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఆధార్ కార్డు లింకుతో నిగ్గుతేలిన ఎస్సీ విద్యార్థుల సంఖ్య ఎస్టీ, బీసీ హాస్టళ్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలను ప్రక్షాళన చే సే దిశగా చర్యలు ఆరంభమయ్యాయి. మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య కంటే వసతి గృహాల్లో ప్రవేశాలు సగానికి పడిపోయాయి. అయినా గానీ పలు చోట్ల విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపెట్టి వార్డెన్లు నిధుల దుర్వినియోగానికి పాల్పపడుతున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బోగస్ హాజరును అరికట్టేందుకు ఎస్సీ సం క్షేమ హాస్టళ్లలో ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఈ విధానం ఇంకా అమల్లోకి రాలే దు. దీంతో హాస్టళ్లలో నిర్దేశించిన దాని కంటే విద్యార్థులు తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం అనవసర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. మరోవైపు బోగస్ హాజరు నమోదుతో ప్రతి నెలా లక్షల రూపాయల నిధులు దుర్వినియో గం అవుతున్నాయి. హాస్టల్స్‌లో చోటుచేసుకుం టున్న అక్రమాలు నిరోధించి.. వ్యయం దుబా రా కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 మంది విద్యార్థులోపు ఉన్న హాస్టళ్లను మూసేసి వాటిన్నింటినీ సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే జిల్లా యం త్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం మేర కు జిల్లా వ్యాప్తంగా 50 మంది విద్యార్థులోపు ఉన్నహాస్టళ్లు 29 ఉన్నాయి. ఈ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో చేర్పించడం ద్వారా హాస్టళ్ల నిర్వహణ పేరిట ఖర్చువుతున్న లక్షల రూపాయలు ప్రభుత్వానికి మిగులు బడ్జెట్‌గా మారుతుంది. నిగ్గుతేలిన నిజాలు.. ఎస్సీ హాస్టళ్లలో ప్రవేశపెట్టిన బయెమెట్రిక్ విధానం సత్ఫలితాలు సాధించిందని చెప్పొ చ్చు. బయెమెట్రిక్ విధానం ప్రవేశపెట్టే క్రమంలోనే 50 మంది విద్యార్థులలోపు ఉన్న హాస్టళ్లు కాకుండా మిగిలిన హాస్టళ్లలో అమలు చేస్తున్నారు. బయెమెట్రిక్ హాజరుకు విద్యార్థి ఆధార్ కార్డు వివరాలే కీలకం. దీంతో ఆధార్ కార్డులో విద్యార్థుల స్థానికతకు సంబంధించిన వివరాలు బహిర్గతమవుతున్నాయి. నిబంధనల ప్రకారం గ్రామానికి 5 కి.మీ దాటిన విద్యార్థులకు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశం కల్పిస్తారు. అయితే ఆధార్ లేనప్పుడు ఇవేమీ పట్టించుకోకుండా విద్యార్థులను చేర్పించుకున్నారు. గతంలో ఏదేని ప్రభుత్వ అధికారి ధ్రువీకరించిన కుల, ఆదాయ సర్టిఫికెట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం దొరికేది. కానీ ప్రస్తుతం తహసీల్దార్ ధ్రువీకరణ, మీ సేవ కేంద్రాల ద్వారా పొందిన సర్టిఫికెట్లు మాత్రమే హాస్టళ్లలో ప్రవేశానికి అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు వల్ల విద్యార్థుల స్థానికత తెలుస్తోంది. దీం తో ఆధార్ కార్డు వివరాలను బయెమెట్రిక్ అనుసంధానం చేసినప్పుడు ఆటోమెటిక్‌గా విద్యార్థుల అడ్మిషన్‌ను తీసుకోవడమా..? తిరస్కరించడం..? జరుగుతుంది. దీంతో హాస్టల్స్ లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గిపోయాయి. హాస్టళ్లలో 30నుంచి 40 మందిమాత్రమే.. తుంగతుర్తి మండల కేంద్రంలోనే 9 వసతి గృహాలు ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నాయి. ఎస్సీ బాలుర హాస్టల్స్, ఎస్సీ బాలికల హాస్టల్, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బాలుర రెసిడెన్షియల్ స్కూల్ (జనరల్), గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, ఎస్టీ బాలుర హాస్టల్, బీసీ బాలుర హాస్టల్, కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయం, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటే హాస్టళ్లలో 30 నుంచి 40 మందికి మించి విద్యార్థులు చేరడం లేదు. నిన్న మొన్నటి వరకు ఇక్కడ బీసీ కాలేజీ విద్యార్థులకు హాస్టల్‌ను కొనసాగించారు. ఈ ఏడాది విద్యార్థులు ఎవరూ చేరకపోవడంతో ఇటీవల దానిని మూసేశారు. రూ. లక్షల్లో దుబారా ఒక్కో హాస్టల్లో పనిచేసే వార్డెన్, కుక్, కామాటి, వాచ్‌మన్, పార్టీ టైం వర్కర్ల వేతనాలు, అద్దె భవనాలకు చెల్లిస్తున్న వాటితో కలిపి నెలకు సుమారు రూ. రెండు లక్షల వరకు ఖర్చు అవుతోంది. 50 మంది విద్యార్థులోపుఉన్న హాస్టల్‌కు ఎంతైతే ఖర్చువుతుందో అంతే వ్యయం వంద మంది విద్యార్థులు ఉన్న హాస్టల్‌కు వెచ్చించాల్సి వస్తోంది. అనవసరంగా భరించే ఆర్థిక భారం నుంచి తప్పుకునేందుకే ప్రభుత్వం ‘విలీన’ అస్త్రాన్ని ప్రయోగించింది. శాఖల వారీగా ఇదీ పరిస్థితి.... ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 121 వసతి గృహాలు ఉన్నాయి. ఈ హాస్టళ్లకు మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య మొత్తం 12,100. కాగా విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోవడంతో గతంలోనే ఐదు హాస్టళ్లను మూసేశారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన 116 హాస్టళ్లలో 9,739 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. దీంట్లో 50 మంది విద్యార్థుల్లోపు ఉన్న హాస్టళ్లు 26 ఉన్నాయి. భువనగిరి ఏఎస్డబ్ల్యూఓ పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఉదాహరణకు అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి, తుంగతుర్తి హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య 40 నుంచి 54 లోపు ఉన్నారు. ఎస్టీ సంక్షేమ శాఖలో 36 హాస్టళ్లు ఉంటే కేవలం నెమ్మికల్ హాస్టల్లో మాత్రమే 50 లోపు విద్యార్థులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం హాస్టళ్లలో మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 14,810 కాగా.. ఇప్పటి వరకు 13,810 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలో బోగస్ విద్యార్థుల హాజరు ఎక్కువగా ఎస్టీ సంక్షేమ శాఖలోనే నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఏసీబీ అధికారులు సైతం ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ల పైనే మెరుపు దాడులు చేయడం ఇందుకు నిదర్శనం. బీసీ సంక్షేమ శాఖలో 68 హాస్టళ్లకు గాను మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య 7,715. దీంట్లో ఈ విద్యాసంవత్సరానికి ప్రవేశం పొందిన విద్యార్థులు 7,200 మంది ఉన్నారు. 50లోపు విద్యార్థులు ఉన్న హాస్టళ్లలో కోదాడ మండలం దొండపాడు, అడవిదేవులపల్లి హాస్టళ్లు ఉన్నాయి. దొండపాడు హాస్టల్‌ను కోదాడకు, అడవిదేవులపల్లి హాస్టల్‌ను దామరచర్లకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలాఉంటే బీసీ, ఎస్టీ హాస్టళ్లను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి.. నియోజకవర్గంలో సంక్షేమ వసతిగృహాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి. హాస్టళ్లకు అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఆమోదంతోనే విలీనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు ఏవిధంగా వ్యవహారిస్తారన్నది వేచిచూడాలి. -
‘మీ ఇంటికి ఇసుక’ ఇదో మస్కా
సీఎం ప్రకటన బోర్డులకే పరిమితం బడా కంపెనీలకు తరలిపోతున్న వేలాది క్యూబిక్ మీటర్లు వెలుగు సిబ్బంది మాయాజాలం చోడవరం: సొంతింటి కల నెరవేరాలంటే డబ్బులు సమకూర్చుకోవాల్సిన ఆతృతపోయి..ఇసుక కోసం తంటాలు పడాల్సిన దుస్థితి దాపురించింది.‘మీ ఇంటిముందుకే ఇసుక’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక పాలసీ సామాన్యులకు శాపంగా మారింది. ఊరు పక్కనే నదుల్లో ఇసుక ఉన్నా.. కొనుగోలుకు వీలులేని పరిస్థితి. దీంతో పేద, మధ్యతరగతి గ్రామీణులు ఇల్లు క ట్టుకోవాలనే ఆలోచననే విరమించుకుంటున్నారు. గృహనిర్మాణాలే కాదు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు ఇసుక సమస్య ఎదురవుతోంది. ఐదు నెలలుగా గ్రామీణ జిల్లాలో కేవలం 10 శాతమే నిర్మాణాలు జరిగాయంటే ఈ రంగంపై ఇసుక ప్రభావం ఏమేరకు ఉంటున్నదీ అర్థమవుతోంది. గతంలో ఇసుక, ధర అందరికీ అందుబాటులో ఉండేది. నిర్మాణాలు జోరుగాసాగేవి. ఇందువల్లే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంది రమ్మ ఇళ్ల పథకం విజయవంతమైంది. నిరుపేద కూడా సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఇసుక పాలసీ, అధికార పార్టీ నాయకులకు, వెలుగు అధికారులకు వరంగా మారింది. డీఆర్డీఏ అధీనంలోని ‘వెలుగు’ పర్యవేక్షణలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యి. నిబంధనల ప్రకారం డ్రాక్వా సంఘాలకు ఇచ్చామని చెబుతున్నా...అం తా డీఆర్డీఏ, వె లుగు అధికారులే నిర్వహిస్తున్నారు. ‘మీ ఇంటిముందుకే ఇసుక’ నినాదంలో ఎవరికి ఇసుక కావాలంటే వారు నేరుగా సమీపంలో ఉన్న మీ-సేవా కేంద్రంలో డబ్బులు చెల్లించి ఆ రసీదుతో ఇసుక పొందవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటనకు కిందస్థాయిలో పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మీ-సేవా కేంద్రానికి వెళితే ఆ వెబ్సైట్ ఓపెన్ కావడంలేదు. మరి జిల్లాలో నడుస్తున్న ఇసుక రీచ్‌ల నుంచి తవ్వుతున్న రూ.కోట్లు విలువైన లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక ఎక్కడికి పోతుందనేది శేష ప్రశ్నగా ఉంటోంది. డీఆర్డీఏ, వెలుగు అధికారులతో కుమ్మక్కయి కొందరు బడా బిల్డర్లు వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించుకుపోతున్నారు. జిల్లా కేంద్రంలో స్టాక్ పాయింట్ పేరున రీచ్‌లో సగం తరలిస్తున్నారు. ఇలా సామాన్య ప్రజలకు ఇసుక దొరకడం లేదు. ఇందంతా డీఆర్డీఏ, వెలుగు అధికారుల మాయాజాలంగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, తాండవ, రావణాపల్లి వంటి పెద్దనదుల్లో ఇప్పటి వరకు సుమారు 100కుపైగా రీచ్‌లలో లక్షలాది క్యూబిక్‌మీటర్ల ఇసుకను తవ్వినా గ్రామాల్లో సామాన్యలకు దొరకడంలేదు. రీచ్‌ల వద్ద అంతా వెలుగు సిబ్బంది ఇష్టారాజ్యంగానే సాగుతుంది. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పెద్దేరు, తాచేరు, శారదా నదుల్లో ఇసుక రీచ్‌లు నడుస్తున్నా ఇక్కడ ప్రజలకు ఇసుక దొరకడంలేదు. తాజాగా జుత్తాడ రీచ్‌లో 17500 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతున్నారు. ఇప్పటికే 11వేల క్యూబిక్ మీటర్ల ఇసుక బుకింగ్ అయిపోయింది. ఇందులో 5వేల క్యూబిక్‌మీటర్లు అధికారిక స్టాక్‌పాయింట్‌కు కాగా మిగతా 6వేల క్యూబిక్ మీటర్లు బడా బిల్టర్లు, కనస్ట్రక్షన్ కంపెనీలు బుక్చేసుకున్నాయి. అన్ని రీచ్‌లలోను ఇదే దందా నడుస్తోంది. ఇందంతా మీసేవలో జరగలేదు. నేరుగా డీఆర్డీఏ కార్యాలయంలోనే జరిగిపోయింది. ఇప్పుడు ఎవరికి ఇసుక కావాలన్నా డీఆర్డీఏ, వెలుగు అధికారుల చుట్టూ చక్కెర్లు కొట్టాల్సిన పరిస్థితి. అసలు మండల కార్యాలయాలే తెలియని గ్రామీణ ప్రజలకు ఇసుక కోసం విశాఖపట్నంలో ఉన్న డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు సలామ్ కొట్టి, బతిమాలుకోవడం ఎలా తెలుసుంది. గ్రామం పక్కనే ఉన్న ఇసుక కొనుక్కోవాలంటే ఇన్ని పాట్లు పడాల్సి రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
సర్దుబాటు!
అర్ధంతరంగా నిలిచిపోయిన ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పైకప్పు వరకు పూర్తయిన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పది రోజుల్లో వివరాల సేకరణ పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు. తాజా ప్రక్రియ ద్వారా జిల్లాలో సగంలో ఆగిపోయిన 2,775 ఇళ్లకు మోక్షం లభించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ ఐఏవై లక్ష్యాన్ని ‘ఇందిరమ్మ’ ఇళ్లతో భర్తీ చేయాలని యంత్రాంగం భావిస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయింది. ఈ పథకం కింద ఇప్పటికే మంజూరైన పలు ఇళ్లకు బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. ఈ పథకంలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభియోగాలుండడంతో పూర్తిస్థాయి విచారణకు సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణపర్వం పూర్తయితే తప్ప పథకం ముందుకుసాగే అవకాశం లేదు. మరోవైపు ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) కింద గత ఏడాది నిర్దేశించిన లక్ష్యాలు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఐఏవై లక్ష్యాన్ని భర్తీ చేసేందుకు యంత్రాంగం సరికొత్త ప్రక్రియకు తెరలేపింది. ఐఏవైలో మిగిలిపోయిన లక్ష్యాన్ని ఇందిరమ్మ ఇళ్లతో భర్తీ చేయాలని భావిస్తోంది. దీంతో కొందరికైనా లబ్ధి చేకూరుతుందని భావించిన అధికారులు.. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాధాన్యతాక్రమంలో లబ్ధిదారులను తేల్చనున్నారు. పది రోజుల్లో ఫైనల్.. 2014-15 వార్షిక సంత్సరంలో ఇందిరా ఆవాస్‌యోజన పథకం కింద జిల్లాకు 3,430 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారికి మంజూరు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పటివరకు 655 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో 2,775 ఇళ్లు మిగిలిపోయాయి. ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లలో 1,829 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పైకప్పు పడిన వాటికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని భావించిన అధికారులు.. తాజాగా మరోమారు క్షేత్రపరిశీలనకు దిగారు. ఐఏవై లబ్ధిదారులే కాకుండా ఇందిరమ్మ పథకంలోని లబ్ధిదారులను కూడా పరిగణించి మొత్తంగా 2,775 మందిని చేర్చి ప్రయోజన ం చేకూర్చాలని నిర్ణయించారు. పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిచేసి జాబితాను ప్రభుత్వానికి పంపించాలని యంత్రాంగం నిర్ణయించింది. దీంతో తుదిజాబితాకు ప్రభుత్వం అనుమతిస్తే గత ఏడాది ఐఏవై లక్ష్యం నెరవేరే అవకాశముంది. ఐఏవైలో సర్దుబాటుతో కొత్తగా వచ్చే ఇళ్లు (నియోజకవర్గాల వారీగా) నియోజకవర్గం= ఇళ్లు చేవెళ్ల= 363 పరిగి= 667 రాజేంద్రనగర్= 46 ఇబ్రహీంపట్నం= 348 మహేశ్వరం= 480 మేడ్చల్= 163 తాండూరు= 394 వికారాబాద్= 314 -
హౌసింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 36 గ్రామాల్లో హౌసింగ్ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వం సీబీసీఐడీని ఆదేశించిన విషయం విధితమే. దీంతో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారులు కొద్ది నెలలుగా విచారణ చేశారు. సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులు మండల కేంద్రంలోని తిమ్మాపూర్‌లో ఇంటింటా తిరుగుతూ 1,340 ఇళ్లను సోదా చేశారు. తమవిచారణలో 199 ఇళ్లలో పలు విధాలుగా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ప్రకటించారు. కాగా సంబంధిత నివాసదారులకు బుధవారం నోటీసులు అందజేసి గురువారం జరిగే విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు గురువారం హాజరై న వారిలో నుంచి మొదటి రోజు 80 మందిని విచారించినట్లు సీబీసీఐడీ అదికారులు తెలిపారు. కాగా, తమ విచారణలో బాధితులు పలు వివరాలు తెలియజేసినట్లు సమాచారం. కాగా రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, వీవో గ్రూపులు, హౌసింగ్ అధికారులు, సిబ్బంది కొందరి పేర్ల పై బిల్లులు కాజేసినట్లు బాధితులు తెలిపారని సమాచా రం. విచారణ పూర్తి కాగానే విచారణ, విషయాలతో పా టు దోషుల వివరాలను వెల్లడిస్తామని అధికారులు పే ర్కొంటున్నారు. సీబీసీఐడీ సీఐలు రఘుపతి, చేరాలు, ఎస్సైలు రాఘవులు, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇళ్లకోసం బడ్జెట్ ఎక్కడిది?
వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు బెడ్రూములతో ఇళ్లకోసం 7300 కోట్లు అవసరమైతాయని, బడ్జెట్లో కేటాయింపుల్లేకుండా వాటిని ఎక్కడి నుంచి తెస్తారని శాసనమండలిలో ప్రతిపక్షనాయకులు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. అసెంబ్లీలోని శాసనసభ పక్షకార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో కేటాయింపుల్లేకుండానే ఇళ్లు కట్టిస్తామంటే పేదలను మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు. స్వచ్ఛ హైదరాబాద్‌కోసం గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్‌కు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పచ్చి అబద్దమని విమర్శించారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా ఖర్చు చేస్తారో చర్చించడానికి శాసనసభను సమావేశపర్చాలని, సవరణ బడ్జెట్‌ను ప్రతిపాదించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా చేస్తామని, పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్నాయనే భయంతో ప్రజలను మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు. డల్లాస్‌లో కేవలం 12 లక్షల జనాభా ఉందని, విస్తీర్ణం కూడా చాలా ఎక్కువన్నారు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉందని, విస్తీర్ణం తక్కువన్నారు. హైదరాబాద్‌లను డల్లాస్‌లాగా చేయడం పూర్తిగా అసాధ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నదానిలో చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీని సమావేశపరిచి, సమగ్రంగా చర్చించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
ముందుంది కరెంట్ కోతల కాలం
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థికలోటు భర్తీపై సర్కారు కోత వేసిన ఫలితం.. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పొదుపు లక్ష్యంగా ఇంధనశాఖ భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించిన నేపథ్యంలో అంతర్గత సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఒకవైపు విద్యుత్ పొదుపునకు చర్యలు చేపట్టడంతోపాటు.. మరోవైపు పలు రంగాలకిస్తున్నవిద్యుత్లో కోతలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గృహాలు, వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సబ్సిడీ ఇచ్చే గృహ, వ్యవసాయ విద్యుత్ పంపిణీలో దుర్వినియోగాన్ని అరికట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంధనశాఖ కార్యదర్శి ఇటీవల జిల్లా డీఈలు, ఏఈలతో చర్చించారు కూడా. అంతర్గత సంస్కరణలకు సమాయత్తం.. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించడంతో అంతర్గత సంస్కరణలపైనే విద్యుత్ సంస్థలు ఆశలు పెట్టుకున్నాయి. రూ.6,455 కోట్లు సబ్సిడీ కావాలని కోరితే, కేవలం రూ. 4,360 కోట్లు మాత్రమే అందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో మిగిలిన మొత్తాన్ని పూడ్చుకునేందుకు అంతర్గత సంస్కరణలు చేపట్టడం తప్ప వాటికి మరోమార్గం కన్పించడం లేదు. దీంతో కొనుగోలు విద్యుత్‌ను కూడా కొంతమేరకు తగ్గించుకునేందుకు ఇంధనశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. లభ్యత మాత్రం 54,884 మిలియన్ యూనిట్లే. ఫలితంగా 3,307 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ లోటు ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఈ ఏడాది 11,087 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడ్డారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్ల భారం పడే వీలుంది. ఈ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవాలనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌తోపాటు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడాలని ఇంధనశాఖ నిర్ణయించింది. అదే సమయంలో విద్యుత్ పొదుపు చర్యలతోపాటు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. రంగాలవారీగా కఠిన నిర్ణయాలు ఇలా.. వ్యవసాయం ఈ రంగంలో రోజుకు 30 మిలియన్ యూనిట్లున్న సగటు వాడకాన్ని 22 నుంచి 25 మిలియన్ యూనిట్లకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. అధికారికంగా ఉన్న 2 లక్షల వ్యవసాయ కనెక్షన్లను కుదించడంతోపాటు ఐఎస్ఐ పంపుసెట్లు వాడాలనే నిబంధనను విధించే యోచనలో ఉన్నారు. పదివేల సోలార్ పంపుసెట్లను అందించడం మరో మార్గం. ఫీడర్లవారీగా టార్గెట్లు పెట్టడం, ఆశించిన ఫలితాలు రాని ప్రాంతాలపై కేంద్ర కార్యాలయం నుంచే ప్రత్యేక బృందాలను పంపే ఆలోచనలో ఉన్నారు. గృహాలు గృహ విద్యుత్ వినియోగంలో 20 శాతం పొదుపును లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీలు అమర్చడం ఒక మార్గమైతే.. 12 శాతం పంపిణీ నష్టాలున్న ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యాన్ని నివారించడం మరోమార్గం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల మీటర్లలో రీడింగ్ తక్కువగా వస్తోందనే విషయం ఉన్నతాధికారుల దృష్టికొచ్చింది. ఇక మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, గ్రామపంచాయతీల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం పొదుపులో భాగం. ఇప్పటికే వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు అమరుస్తున్నారు. దీనికితోడు తెల్లవారాక కూడా వీధి దీపాలు ఆపకుండా విద్యుత్‌ను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకునేందుకు వీలుగా టైమర్‌తో కూడిన స్విచ్‌లను అమర్చి, వాటంతటవే ఆగిపోయే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమలు మొత్తం విద్యుత్‌లో పారిశ్రామిక వాడకం 30 శాతంగా ఉంది. ఈ రంగంలో పెద్దఎత్తున విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టు అనుమానాలున్నాయి. ఇందులో కిందిస్థాయి సిబ్బంది అవినీతి ఒక కారణంగా భావిస్తున్నారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని సిమ్‌కార్డుల ద్వారా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఫీడర్లవారీగా వచ్చే రీడింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇందుకోసం ఏ ఫీడర్ నుంచి ఏయే పరిశ్రమలకు విద్యుత్ వెళుతుంది? ఎంత వినియోగం జరుగుతోంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే విద్యుత్‌తోనూ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనేది అంతర్గత నివేదికల సారాంశం. -
సొంతిల్లు..కలేనా?
ఒక్క ఇల్లూ మంజూరు చేయని నూతన ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్‌లోనే జియో ట్యాగింగ్ పేరుతో జాప్యం నూతన గృహాల మంజూరు ఎప్పటికో మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క గృహాన్నీ మంజూరు చేయకపోగా గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లుల మంజూరు కూడా నిలిపివేయటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా గృహనిర్మాణంపై దృష్టిసారించకపోవటంతో పేదలు గుడిసెల్లోనే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న సాకును బూచిగా చూపి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సగం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం నెలలతరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. గతంలో నిర్మించిన గృహాలు వాస్తవంగా నిర్మించారా, లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో 75 శాతం మేర జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే పని పూర్తయిందని, మరో 25 శాతం ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణ శాఖ పీడీ సీహెచ్ ప్రతాపరావు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లానే జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే ప్రక్రియలో మొదటి స్థానంలో ఉందన్నారు. పెండింగ్‌లో రూ.12.44 కోట్ల బిల్లులు.. జిల్లాలో 5,765 గృహాలకు రూ.12.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014 మే నెల నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీటిని చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నూతన గృహ నిర్మాణం చేసే సమయంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అసలు గృహనిర్మాణమే ప్రారంభం కాకపోవటంతో మరుగుదొడ్ల నిర్మాణం కూడా నిలిచిపోయింది. నగదు పెంచుతామన్నారు.. జీవో జారీ చేయలేదు ప్రస్తుతం పేదలకు నిర్మించే ఒక్కొక్క గృహానికి రూ.70 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే లక్ష రూపాయలు చొప్పున నగదు అందజేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.70 వేలు చొప్పున ఇస్తున్నవారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల స్థానంలో లక్షా 50 వేల రూపాయలకు పెంచి ఇస్తామని పాలకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తేనే పెంచిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. జియో ట్యాగింగ్ 75 శాతమే పూర్తి.. 2004 నుంచి నిర్మాణంలో ఉండి వివిధ దశల్లో ఉన్న గృహాలను జియో ట్యాగింగ్ పద్ధతిలో ఫొటోలు తీసి కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీని అమలు కోసం అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందజేశారు. ప్రతి గృహాన్నీ రెండు ఫొటోలు తీసి శాటిలైట్‌కు అప్లోడ్ చేయాల్సి ఉంది. గతంలో ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు 50 గృహాల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని చెప్పగా ప్రస్తుతం ఈ సంఖ్యను 100కు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. 2 లక్షల 16 వేల 108 గృహాలను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఆన్లైన్లో ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 75 శాతం మాత్రమే పూర్తయింది. 2015 జనవరి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాతే పెండింగ్‌లో ఉన్న బకాయిలను లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటివరకు తాము గుడిసెల్లోనే నివసిస్తూ ఇబ్బందులు పడాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 14,020 గృహాలను పూర్తిచేసి రూ.118.78 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అర్హత లేని లబ్ధిదారులకు గృహాలు నిర్మించటం జరిగిందనే సందేహాలతో గత మూడేళ్లుగా నిలిచిన గృహాలను తనిఖీ చేసేందుకు మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలు తయారుచేస్తేనే వాటిని ఆన్లైన్లో ఉంచుతామనే నిబంధన విధించారు. అర్హత లేనివారు గృహాలు నిర్మిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చిన నగదును వారి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంజూరు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన గృహాల మంజూరు ఇంతవరకు ప్రారంభం కాలేదు. వివిధ దశల్లో ఉన్న గృహాలకు బిల్లుల చెల్లింపులూ చేయలేదు. పాత బకాయిలు రాక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతన గృహాలు మంజూరు చేయిస్తామంటూ లబ్ధిదారులకు ఆశ చూపుతున్నారు. గ్రామ, వార్డు, మండల కమిటీల్లో ఉన్న సభ్యులు సూచించినవారికే నూతనంగా గృహాలు మంజూరవుతాయనే ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్క గృహానికి రూ.4 నుంచి రూ. 5 వేలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నూతన గృహాలకు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతుండగా ముందస్తుగానే అధికార పక్షానికి చెందిన కొందరు వసూళ్లకు దిగారు. -
ప్లాట్లుకొనిపాట్లు
మంగళగిరి : నెలనెలా కొంతమొత్తంతో కొనుగోలు చేసుకుని ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని ఆశించిన సగటు జీవికి అన్యాయం జరుగుతోంది. ఆకర్షణీయమైన బ్రోచర్లతో తమను నమ్మించి.. తమతో ప్లాట్లు బుక్ చేరుుంచుకుని నెలనెలా వారుుదాలు వసూలు చేసుకున్నాక... ఆ భూమి కాస్తా ల్యాండ్‌పూలింగ్‌లో పోతే తమకు ఇక బూడిదే మిగిలిందని వినియోగదారులు వాపోతున్నారు. మండలంలోని యర్రబాలెం గ్రామంలో జిల్లాలోని అధికారపార్టీ శాసనసభ్యునికి చెందిన అభినందన హౌసింగ్ సంస్థ 33 ఎకరాలను కొనుగోలు చేసి ప్లాట్లుగా వేయకుండానే డమ్మీ ప్లాన్‌తో 2009-10 సంవత్సరంలో వాయిదాల పద్ధతిలో సుమారు రెండువేల మందికి విక్రయించారు. మూడు సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తిగా నగదు చెల్లించే నిబంధనతో గజం రూ. రెండువేల చొప్పున 120, 160, 200, 240 చదరపు గజాలుగా విభజించి రెండు వేలకుపైగా ప్లాట్లను విక్రరుుంచారు. అధికారంలో ఉన్నాం గాబట్టి అనుమతులు వస్తాయని నమ్మించి ఆరేళ్లరుునా పొలాన్ని ప్లాట్లుగా విభజించకపోగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న రాజధానికోసం ఆ 33 ఎకరాలూ వెళ్లడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కంపెనీలో సిబ్బందిని వారు ప్రశ్నిస్తే రెండు వందల గజాలకు నాలుగు లక్షలు మూడు సంవత్సరాల క్రితం చెల్లిస్తే ఇప్పుడు కంపెనీ ఖర్చులంటూ కత్తిరించి రెండు లక్షలు ఇస్తామంటూ తప్పుకుంటున్నారు. చేసేది లేక కొందరు తిరిగి తీసుకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే వడ్డీలు వేసి చెల్లిస్తుండగా అమాయకులను మాత్రం బెదిరించి సగానికి సగం తగ్గించేస్తున్నారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కంపెనీ తమను మోసం చేసిందని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేయకుండా కంపెనీ ప్రతినిధులను పిలిచి రాజీ కుదర్చి పంపించారని తెలిసింది. మిగిలినవారి పరిస్థితి ఏమిటన్నది ఇంకా సందేహంగానే మిగిలింది. వారంతా రోడ్డున పడాల్సిందేనా..? నెల రోజుల క్రితం వరకు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఒక్క సెంటు స్థలం వుంటే తాము మహారాజులమని భావించిన సామాన్యులు ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థలం ఎందుకు కొన్నామా.. అని మదనపడుతున్నారు. రాష్ట్రం విభజన సమయం నుంచే కొత్త రాష్ర్ట రాజధానిగా మంగళరిగి ప్రాంతం ప్రచారం కావడంతో అన్ని జిల్లాల వారు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. లేఅవుట్లకు అనుమతులున్నాయా..లేవా అనేది చూడకుండా కష్టపడి కూడబె ట్టిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేశారు. వారంతా ప్రభుత్వ చర్యలతో నేడు వీధినపడబోతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో గ్రామకంఠాలు, అధికార లేఅవుట్లు మినహా మిగిలిన అన్ని భూములు, ప్లాట్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు సీఆర్డీఏ అధికారుల ఆదేశాలతో రెండు రోజులుగా కృష్ణాయపాలెం, కాజ, చినకాకాని గ్రామాల్లో అనధికార లేఅవుట్లను తొలగిస్తున్నారు. దీనిపై సీఆర్డీఏ అధికారుల వివరణ కోరగా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో తమకు సంబంధం లేదని అనధికార నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
మొండి గోడలే...
నగరంలో అటకెక్కిన గృహనిర్మాణం దాదాపు 19,353 పేద కుటుంబాలకు ఇంటికార్డుల జారీ డబ్బులు చెల్లించి ఆరేళ్లుగా ఎదురు చూపులు పట్టించుకోని ప్రభుత్వం రూ.144 కోట్ల నిధులు నిరుపయోగం తిరుపతి : ప్రభుత్వం పేదోళ్ల గూడుపై శీతకన్ను వేసింది. దీంతో గృహనిర్మాణాల పథకాలు పూర్తిగా అటకెక్కాయి. ముఖ్యంగా తిరుపతి నగరంలో 2008 జూన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో వివిధ పథకాల కింద 19,353 గృహాలను మంజూరు చేశారు. తెల్లరేషన్‌కార్డు కలిగి ఇండ్లులేని నిరుపేద కుటుంబాలకు సంబంధించి మహిళల పేరుతో ఇంటి కార్డులను జారీచేశారు. కరకంబాడి, దామినేడు, అవిలాల, బ్రాహ్మణపట్టు (పాడిపేట) ప్రాంతాల్లో గృనిర్మాణాలు చేపట్టారు. అయితే ఇందులో కేవలం 2,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో ఆగిపోయాయి. నిర్మాణాల కోసం వెచ్చించిన 144 కోట్ల రూపాయలు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం అక్కడ మొండిగోడలే దర్శన మిస్తున్నాయి. ఇంటి కోసం డబ్బులు చెల్లించిన నిరుపేద కుటుంబాలు కార్యాలయాల చుట్టూ తిరిగి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాయి. అయినా ఏ ఒక్కరూ ఆలకించడంలేదు. కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యా రు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని పేద ప్రజలు వాపోతున్నారు. గృహాల మంజూరు ఇలా.. ఐహెచ్ఎస్డీపీ (ఇంటిగ్రేటేడ్ హౌసింగ్ స్కీం డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద 4056, ఆర్జీకే (రాజీవ్ గృహకల్ప) ద్వారా 416, ఇందిరమ్మ పథకం కింద 5,665, జేఎన్ఎన్యూఆర్ఎం (జవహర్‌లాల్‌నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) ద్వారా జీ ప్లస్‌టూ బ్లాక్‌లు 5,100 ఇండ్లను మంజూరి చేసి పేద మహిళలకు కేటాయించారు. ఇంకా దాదాపు 2,000 గృహాలు కేటాయింపు దశలోనే ఆగిపోయాయి. కేవలం 2,000 గృహాలు మాత్రమే పూర్తయ్యాయి. ఒక్కో గృహాన్ని లక్ష రూపాయలతో నిర్మించేలా అప్పట్లో అంచనాలు రూపొందించారు. లబ్ధిదారుల నుంచి వాయిదాల పద్ధతిలో *40,000లు వసూలు చేసేలా ప్రణాళిక రచించారు. ఇంటి నిర్మాణాల కోసం డబ్బు చెల్లించిన పేదలు ఆరేళ్లుగా ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతోనే.. గృహ నిర్మాణాల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు దాపురించాయని స్పష్టంగా తెలుస్తోంది. దీనికితోడు అనుమతుల మంజూరులో జాప్యం, సాంకేతిక సిబ్బంది కొరత, హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్ మధ్య కొరవడిన సమన్వయం దీనికి తోడు నిర్మాణాల్లో జాప్యంతో భారీగా అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో గృహా నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుతం మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. అప్పట్లో ఒక్కో గృహానికి లక్ష రూపాయల అంచనాకాగా, ప్రస్తుతం దాని అంచనా ఏకంగా *2.70 లక్షలకు చేరడం గమనార్హం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు కేటాయించి పనులు జరిగేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
బలహీనవర్గాల ఇళ్లకు రూ. 3.5 లక్షలు
బలహీనవర్గాల గృహనిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వీళ్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించడానికి ఒక్కొక్కరికి 3.5 లక్షల రూపాయల చొప్పున కేటాయిస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతామని, ఆయా ప్రాంతాల్లో ఉండేవారికి కూడా ఈ పథకం కింద గృహనిర్మాణం చేపడతామని ఆయన అన్నారు. -
పగబట్టిన పైశాచకత్వం!
అంగారకుడిపై కాలుమోపుతున్నాం. చంద్రమండంలంపై నీటి జాడ కనుగొంటాం అంటున్నాం..! అయినా మనిషి మారలేదు.. మూఢత్వం ముసుగు తీయలేదు. కర్మభూమిలో నీతి జాడ విడిచాడు. ఆధునిక ప్రపంచంలో.. అనాగరిక సమాజం ముగ్గురి మహిళలను వెంటాడింది.. వేధించింది. విజ్ఞానం ఆకాశవీధిలో దూసుకెళ్తుంటే.. అజ్ఞానం నడివీధిలో అబలలను వివస్త్రులను చేసింది. పాశవికంగా దాడులు చేసింది. వికృత చేష్టలతో బెదిరించి అమాయకులను ఊరు దాటించింది. చేతబడి అని ముద్ర వేసి వారి జీవితాలను చేష్టలుడిగేలా చేసింది. -సాక్షి ప్రతినిధి, అనంతపురం అనంతపురం శివారులోని ప్రజాశక్తినగర్.. జూలై 28.. సమయం తెల్లవారుజామున 5.30 గంటలు.. ఊరు, వాడా ఇంకా నిద్దురలోనే ఉంది. ఓ వీధిలో లలిత, హేమావతి, పార్వతి అనే మహిళల ఇళ్లముందు పందిమాంసం, నువ్వులు, పసుపు, కుంకుమ కన్పించాయి. వీటిని ఎవరు మా ఇంటి ముందు పడేశారని వీధిలోని వారిని అడగటమే ఆ ముగ్గురు చేసిన తప్పయింది. దారిన పోయే కంప వీళ్లకు చుట్టుకుంది. ఆ ముగ్గురే వాటిని వీధిలో వేసి చేతబడి చేస్తున్నారని కొందరు కాలనీవాసులు ఆరోపించారు. వాగ్వాదానికి దిగారు.. ఈ గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానయింది. కాలనీవాసులు ఓ స్వామీజీని పిలిపించారు. జరిగిన విషయం అతనికి చెప్పారు. కళ్లు మూసుకుని ఆ ముగ్గురు మహిళలు చేతబడికి పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశాడు. సమయం.. రాత్రి 9.30 గంటలు. ఊరంతా చీకటి.. ఆ కాలనీవాసులు కూడా కటిక చీకటిలోకి వెళ్లిపోయారు. మానవత్వం మచ్చుకైనా కనిపించకుండా పోయింది. కన్నూమిన్నూ కానని మనుషులు.. ఆ ముగ్గురు మహిళలపై పగతీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ ఆడపడుచులను వీధిలోకి లాక్కొచ్చారు. పూర్తిగా వివస్త్రలను చేశారు. అడ్డొచ్చిన పార్వతి భర్త పోతులయ్యను చితకబాదారు. ఒంటిపై వస్త్రం లేక.. సిగ్గుతో చితికిపోతున్న మహిళలపై భౌతికంగా దాడిచేశారు. శాపనార్థాలు పెడుతూ బూతుపురాణం అందుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న కాలనీ కాపురుషులు చివరి నిమిషంలో ఆ ఆడబిడ్డలకు దుస్తులు ఇచ్చేశారు. పోలీసులు కాలనీ వాసులను చెదరగొట్టారు. బాధితుల ఫిర్యాదుతో అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బతుకు బరువు.. జరిగిన అవమానాన్ని మరవలేక.. వేదనతోనే బతుకీడుస్తున్నారు ఆ మహిళలు. ఈ ముగ్గురు ఆడపడుచులదీ మూడు గాథలు. లలిత ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త వదిలేయడంతో.. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. హేమావతి భర్త చనిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తూ బతుకీడుస్తోంది. ఇక పార్వతి తన భర్తతో కలసి కూలి పని చేసుకుంటుంది. కాయకష్టాన్ని నమ్ముకుని ఆ దంపతులు జీవిస్తున్నారు. సీరియల్ ఎటాక్స్.. కొన్ని రోజులు గడిచాయి.. సెప్టెంబర్ 10.. హేమావతి ఆస్పత్రికి వెళ్లింది. గతంలో వికృత చేష్టలతో కలకలం సృష్టించిన దుండగులు మళ్లీ రెచ్చిపోయారు. హేమావతి ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. మరో ఆరు రోజులు గడిచాయి. సెప్టెంబర్ 16 అర్ధరాత్రి.. ఆ దుర్మార్గుల కన్ను పార్వతి ఇంటిపై పడింది. మూకుమ్మడిగా దాడి చేసి ఆమె ఇంటిని తగులబెట్టారు. అర్ధరాత్రి పిల్లలను తీసుకుని ఆ తల్లి.. భర్త, ఇద్దరు పిల్లలతో సహా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊరు దాటింది. ఈ సంఘటనతో పోతులయ్య.. పార్వతి, పిల్లలను వదిలి సొంతూరుకు వెళ్లిపోయాడు. వరుస దాడులతో బెంబేలెత్తిన లలిత ఆ అద్దె ఇంటిని వదిలేసి నగరంలోని ఓ కాలనీకి చేరుకుని బతుకు జీవుడా అనుకుంది. సెప్టెంబర్ 29.. ఈసారి హేమావతి ఇంటిని కాల్చేసి చేతులు పైశాచికానందం పొందారు వాళ్లు.. ఉన్న ఇల్లు కాస్తా బూడిదపాలు అవ్వడంతో.. హేమావతి గుండెలవిసేలా రోదించింది. పోలీసుల విచారణలో ‘చేతబడి’ ఉత్తదే!: ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేశారు. మహిళలు కాలనీవాసులపై చేతబడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తేల్చారు. లేనిపోని అనుమానాలతో ముగ్గురిని వేధించిన కాలనీ వాసులను మందలించారు. మూఢనమ్మకాలను నమ్మొద్దని వివరించారు. సంఘటన జరిగిన రోజు నుంచి ఇద్దరి పోలీసులను ‘డే అండ్ నైట్’అక్కడే కాపాల ఉంచారు. జనవిజ్ఞాన వేదిక ద్వారా అవగాహన: విషయం తెలుసుకున్న జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ప్రజాశక్తినగర్‌కు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. చేతబడి అనేది అపోహ మాత్రమే అని, చేతబడి పేరుతో ఎవ్వరూ ఎవ్వరినీ ఏమీ చేయలేరని వివరించారు. అలాంటి అపోహలతో సాటి మనుషులపై అలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. చేతబడి కాక ఇంకేదైనా కారణముందా?: ముగ్గురిపై జరిగిన వేధింపులు, దాడులు పరిశీలిస్తే.. వారిని కాలనీ నుంచి వెళ్లగొట్టాలని పథకం ప్రకారం దాడులు చేసినట్టు అనిపిస్తోంది. పార్వతి, హేమావతికి 1.5 సెంట్లలో ఇళ్లు ఉన్నాయి. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికే ఈ కుట్రలకు పాల ్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సొంతిల్లు కలేనా!
అంచనాలు పెంచారు.. నిర్మాణం మరిచారు హౌసింగ్ బోర్డు అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం 32 మంది నుంచి రూ.2.50 కోట్లకు పైగా వసూలు అయినా మచిలీపట్నంలో ముందుకు సాగని గృహ నిర్మాణం ఇసుక కొరత పేరుతో జాప్యం మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు(ఏపీహెచ్‌బీ) అధికారుల నిర్లక్ష్యం వల్ల లబ్ధిదారులకు సొంత ఇల్లు కలగానే మిగిలింది. డబ్బులు చెల్లించినా రోజుకో కారణం చెబుతూ జాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఏపీహెచ్‌బీ ద్వారా మచిలీపట్నంలో న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ఫేజ్-2లో 32 గృహాలు నిర్మించేందుకు 2010 నవంబరులో అంచనాలు రూపొందించారు. 266 గజాల విస్తీర్ణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని, ఇందుకోసం రూ.14 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. దీంతో 32 మంది ముందుకొచ్చారు. వారితో 2014నవంబరు లోపు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణ కాంట్రాక్టును హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. పనులు ప్రారంభించాలంటే లబ్ధిదారులు 10శాతం నగదును ముందుగా చెల్లించాలని చెప్పారు. ఈ మేరకు లబ్ధిదారులు తొలి విడతగా రూ.1.40లక్షలు చెల్లించారు. ఆ తర్వాత విడతల వారీగా లబ్ధిదారులు రూ.9లక్షల వరకు చెల్లించారు. మొత్తం రూ.2.50కోట్లకు పైగా చెల్లించినా నాలుగేళ్లుగా గృహ నిర్మాణ పనులు పునాదుల దశను దాటలేదు. కాంట్రాక్టర్ హైదరాబాదులో ఉండటం, ఏపీహెచ్‌బీ ఈఈ కార్యాలయం విజయవాడలో ఉండటం, ఇక్కడున్న ఏఈ పనులను పట్టించుకోకపోవటంతో తమ ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయో అర్థం కావడంలేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2013లో అంచనా వ్యయం పెంపు తొలుత 2010లో ఉన్న ధరల ప్రకారం అంచనాలు తయారు చేశామని, 2013 నాటికి సిమెంటు, ఇనుము, భవన నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ ధరలు పెరిగాయని రూ.14 లక్షలకు గృహాలు నిర్మించి ఇవ్వలేమని ఏపీహెచ్‌బీ అధికారులు కొత్త ప్రతిపాదన చేశారు. పూర్తిస్థాయిలో గృహనిర్మాణం చేయాలంటే గతంలో నిర్ణయించిన రూ.14 లక్షలతోపాటు అదనంగా రూ.2,61,900 చెల్లించాలని విజయవాడ ఏపీహెచ్‌బీ ఈఈ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించారు. ఈ వ్యవహారం మొత్తం 2013 నవంబరు నెలలో జరిగింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని, అయినప్పటికీ తాము పెంచిన నగదును చెల్లిస్తామని త్వరితగతిన గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులు కోరారు. పెంచిన నగదు ప్రకారం లబ్ధిదారుల నుంచి నగదు కట్టించుకున్నారు. ఏపీహెచ్‌బీ ద్వారా నిర్మించే గృహాలకు నగదు కట్టిన వారిలో అధికంగా ఉద్యోగులే ఉన్నారు. వీరు వివిధ బ్యాంకుల ద్వారా గృహ నిర్మాణానికి సంబంధించి రుణాలకు దరఖాస్తు చేసుకుని వారు ఇచ్చిన పార్ట్ పేమెంట్లను ఏపీహెచ్‌బీకి చెల్లించారు. అడుగడుగునా జాప్యం కాంట్రాక్టర్ నాలుగేళ్లలో మూడుసార్లు మాత్రమే మచిలీపట్నం వచ్చారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించేలా కాంట్రాక్టర్‌పై ఏపీహెచ్‌బీ అధికారులు ఒత్తిడి చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కొంతకాలం సిమెంటు అందుబాటులో లేదని, మరోసారి ఇనుము ధరలు పెరిగాయని, ప్రస్తుతం ఇసుక కొరతని చెబుతూ కాంట్రాక్టర్ కాలయాపన చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. చివరిసారిగా ఈ ఏడాది జూలైలో కాంట్రాక్టర్‌తో విజయవాడలో సమావేశం జరిగిందని, నవంబరు నాటికి గృహనిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తానని చెప్పిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని వివరించారు. నాలుగేళ్ల క్రితం నిర్మించిన పునాదుల దశలోనే పనులు నిలిచిపోయాయని, అసలు నిర్మిస్తారా.. లేదా.. అని లబ్ధిదారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై ఏపీహెచ్‌బీ ఏఈ రామ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా, ఇసుక కొరత వల్ల గృహ నిర్మాణాలు నిలిచిపోయాయని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. -
బలపడిన ద్వైపాక్షిక బంధం
పలు నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చలు ప్రజారవాణా, గృహనిర్మాణం, స్మార్ట్ సిటీస్‌పై చర్చ పరస్పర సహకారానికి అంగీకారం వివరాలు వెల్లడించిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న సాక్షి, సిటీబ్యూరో: మెరుగైన ప్రజారవాణా, గృహ నిర్మాణం, స్మార్ట్‌సిటీల నిర్మాణం తదితర అంశాల్లో పలు నగరాలతో ద్వైపాక్షిక చర్చలు ఫలించాయి. హెచ్ఐసీసీలో మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం పలు నగరాల మేయర్లతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్ చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రద్యుమ్న విలేకరులకు వెల్లడించారు. ఆయా నగరాల మేయర్లతో మంత్రి కేటీఆర్ చర్చించిన వివరాలు ఇలా.. మెట్రోపొలిస్ మేయర్ జీన్పాల్హచాన్తో.. తీరైన పట్టణాభివృద్ధి, స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాంతంలో ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెట్రొపోలిస్ సదస్సులో ఆయా అంశాలపై జరిగిన చర్చలను వేర్వేరుగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను జీన్‌పాల్ హచాన్ ప్యారీస్‌కు ఆహ్వానించారు. త్వరలో వాతావరణ మార్పులపై ప్యారీస్‌లో నిర్వహించనున్న సదస్సులో పాల్గొనాలని కోరారు. బెర్లిన్ డిప్యూటీ మేయర్ బర్భరా బెర్నింగర్‌తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం,పేదలకు తక్కువ ఖర్చుతో నిర్మించనున్న గృహాలు, వికలాంగులకు చేయూతనిచ్చే విషయంలో బెర్లిన్ నగరం నుంచి సాంకేతిక సహకారం అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. జర్మన్ కంపెనీలు గ్రేటర్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఐటీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వచ్చే ఏప్రిల్‌లో బెర్లిన్‌లో జరగనున్న మెట్రోపాలిటన్ సొల్యూషన్స్ సదస్సులో పాల్గొనాలని ఆమె కేటీఆర్‌ను ఆహ్వానించారు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వానికి పరస్పర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె హామీ ఇచ్చారు. మాషాద్ మేయర్ సోలాట్ మోర్తాజావితో.. సంస్కృతి, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారంతోపాటు పట్టణాభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై మంత్రి కేటీఆర్ చర్చించారు. ఇరాన్, హైదరాబాద్ నగరాలకు మధ్యనున్న చారిత్రక బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మషాద్ నగరం ఏటా 24 మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇరాన్‌కు తమ నగరం ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతోందన్నారు. హైదరాబాద్ నుంచి మషాద్‌కు నేరుగా విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పలు ఐటీ కంపెనీలు మషాద్ నగరంలోనూ తమ కార్యాలయాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి ఆయనకు తెలిపారు. జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టవ్తో.. నగరాల్లో సురక్షిత భద్రతా ఏర్పాట్లు చేసే అంశంపై మంత్రి కేటీఆర్ చర్చించారు. విశ్వవిద్యాలయాల సౌజన్యంతో సైన్స్పార్క్ల ఏర్పాటుపై అభిప్రాయాలను పంచుకున్నారు. జోహెన్స్‌బర్గ్ నవనిర్మాణానికి అక్కడ చేపట్టిన సంస్కరణలు, సాధించిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌సిటీల నిర్మాణంపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను వివరించారు. జోహెన్స్‌బర్గ్ సహకారంతో హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. జోహెన్స్‌బర్గ్ నగరానికి ఐటీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. హరిత భవనాల నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను ఇచ్చిపుచ్చుకునేందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఐటీ, ఆర్థిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. సావోపోలో మేయర్ రోవేనాతో.. దక్షిణ అమెరికాలోని సాపోలో నగరంలో 11 మిలియన్ల మంది నివసిస్తున్నారని రోవేనా మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. నిర్మాణరంగం,పట్టణాల్లో మౌలికవసతుల కల్పన, ఆరోగ్యం, గృహనిర్మాణం, వ్యాక్సీన్ల అభివృద్ధి విషయంలో పర స్పరం సహకరించుకోవాలనే ఆలోచనకు వచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో గృహనిర్మాణం, పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్, సావోపోలో నగరాల్లో ఉన్న అవకాశాలను చర్చించారు. బార్సిలోనా మేయర్ క్సేవియర్ ట్రయాస్తో.. స్మార్ట్‌సిటీల నిర్మాణం, ఇంధన భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రజోపయోగ కార్యక్రమాలు, స్థలాలు, మేనేజ్మెంట్ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పలు అంశాల్లో బార్సిలోనా సాధించిన విజయాలను ఆయన కేటీఆర్‌కు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. -
మధ్యతరగతికి సొంత ఇల్లు
ముంబై: రాష్ట్రంలోని నగరాల్లో నివసించే మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం ఆయన మంత్రాలయ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముంబై సహా ఇతర మహా నగరాల్లో నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు కలగానే మిగిలిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. త్వరలోనే దీనికోసం కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో మహారాష్ట్రను ‘ఆన్లైన్’ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చవాన్ చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తమకు కావాల్సిన సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చునన్నారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయగలుగుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పారదర్శక, స్ఫూర్తిదాయక పాలన అందుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పల్లెలకు సైతం ఈ పథకం అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ ప్రభుత్వం మరాఠాలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల వల్ల మైనారిటీ వర్గాలైన ముస్లింలు, మరాఠాలు ఉద్యోగ,విద్యా రంగాల్లో తగిన అవకాశాలు పొందగలుగుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ జీవన్‌దాయి ఆరోగ్య యోజన పథకం ద్వారా లబ్ధిదారులు పైసా ఖర్చు లేకుండానే తగిన వైద్య సేవలు పొందగలుగుతున్నారన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.62 లక్షల మంది లబ్ధిపొందగా, ప్రభుత్వం వీరి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.712 కోట్లు ఖర్చు పెట్టిందని వివరించారు. ఇదిలా ఉండగా, నాగపూర్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి నితిన్ రావుత్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధాని అయిన నాగపూర్‌ను దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆలోచనలకు రూపంగా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు డీఎఫ్ సర్కార్ కృషిచేస్తోందని అన్నారు. నగరానికి పశ్చిమంలో 1800 ఎకరాల్లో గోరెవాడా జూను అభివృద్ధిచేసేందుకు కార్యాచరణ రూపొంది స్తున్నామన్నారు. పుణ్యక్షేత్రమైన సుఫీ సెయింట్ బాబా తాజుద్దీన్ సమాధి వద్ద రూ.132.49 కోట్ల అంచనా వ్యయంతో సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే ఆహార భద్రత చట్టం కింద సుమారు 7.17 కోట్ల మందికి ఆహార దినుసులను అందజేస్తున్నామని, దీనికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.900 కోట్లు ఖర్చుపెడుతోందని రావుత్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కృష్ణ, పోలీస్ కమిషనర్ కె.కె.పాఠక్, డివిజనల్ కమిషనర్ అనూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, గడ్చిరోలీ జిల్లాలో రాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ‘మాఝీ ముంబై- నిర్మల్ ముంబై’ డ్రైవ్ ప్రారంభం ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ‘మాఝీ ముంబై-నిర్మల్ ముంబై’ అనే కార్యక్రమాన్ని ధారవిలో ప్రారంభించారు. నగరంలో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రతరమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబైలో చెత్త సమస్య చాలా ఎక్కువగా ఉంద న్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నట్లు చవాన్ వివరించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు. -
హౌసింగ్ ప్రత్యేకాధికారి విచారణ
రామచంద్రపురం :బిల్లుల చెల్లింపులో కక్ష సాధింపులకు గురిచేస్తున్నారనే దళితుల ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ మూడు జిల్లాల ప్రత్యేకాధికారి కుమార స్వామి స్థానిక హౌసింగ్ ఈఈ కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా తమకు హౌసింగ్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామచంద్రపురం మండలం కందులపాలేనికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, కోలమూరి నాగరాజు, కోలమూరి ముసలయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దాంతో కమిషన్ ఆదేశాల మేర కు బాధితులతో విచారణ నిర్వహించి, రికార్డులను పరిశీలించేందుకు తాను వచ్చినట్టు కుమారస్వామి తెలిపారు. ఇదే విషయాన్ని జిల్లాలోని గ్రీవెన్స్‌సెల్‌లో హౌసింగ్ ఏఈ, డీఈ, ఈఈలకు తెలిపినప్పటికీ పట్టించుకోలేదని కందులపాలేనికి చెందిన పది దళిత కుటుంబాలవారు పేర్కొన్నారు. దాంతో తాము లోకాయుక్తను ఆశ్రయించామన్నారు. అప్పుడు బేస్మెంట్ బిల్లులు చెల్లించిన అధికారులు ఆ తర్వాత తమకు బిల్లులు రాకుండా చేశారన్నారు. మొదటి బిల్లులు చెల్లించి ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు చెల్లించలేదని బాధితులు దుర్గాప్రసాద్, నాగరాజు, ముసలయ్య వాపోయారు. తాము ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించడంతో హౌసింగ్ అధికారులు ఇప్పటికీ తమను బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని విచారణాధికారికి విన్నవించుకున్నట్టు వారు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి శేషగిరి, పెంకే వీరబాబు బాధితులతో కలసి విచారణలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అంతులేని అవినీతి
దోమకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో హౌసింగ్‌లో అంతులేని అవినీతి జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం మండలంలో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 593 గ్రామాల్లో హౌసిం గ్ బిల్లుల విషయంలో అధికారులు సర్వే చేయగా *235 కోట్లు అవినీతి జరిగినట్లు తేలిందన్నారు. దీనిపై సీఎం సీరియస్‌గా ఉన్నారని రాష్ట్రమంతా సర్వే నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నా రు. వేల కోట్లలో అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో 39 లక్షల మంది రైతులు *లక్షలోపు రుణం తీసుకున్నావారు ఉన్నారని, వాటిని మాఫీ చేయడానికి మం త్రి మండలి నిర్ణయించిందన్నారు. దీంతో ప్రభుత్వం పై *20 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఈనెల 7న సీఎం జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. వచ్చే వి ద్యాసంవత్సం నుంచి మండలానికి ఒక గురుకుల పాఠశాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇం దుకోసం 15 ఎకరాలలో పాఠశాల నిర్మాంచి, వెయ్యి మంది బాల బాలికలకు చదువుకోవడానికి సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో బోగస్ కార్డులను తొల గిస్తామన్నారు. 19న ఇళ్లలోనే ఉండండి ఈనెల 19వ తేదీన జరగనున్న సర్వే కోసం కుటుం బసభ్యులంతా ఇళ్లల్లోనే ఉండాలన్నారు. సర్వేలో ప్రతి విషయాన్ని పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో మొత్తం 6లక్షల 96వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. మండలానికి 600 మంది అధికారులు విధులు నిర్వహిస్తారని, ఒక్కో అధికారి 30 కుటుంబాలను సర్వే చేస్తారని తెలిపారు. బిందుసేద్యానికి * 370 కోట్లు నిధులు... రాష్ట్రంలో బిందు సేద్యానికి *370 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో లక్షా 25 వేల ఎకరాల్లో బిందు సేద్యం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన జిల్లాకు *45 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. జిల్లాలో 11 వేల 250 ఎకరాల్లో బిం దు సేద్యం చేయాలని నిర్ణయించామన్నారు. తుం పర్లు, బిందు సేద్యం వల్ల రైతులకు ప్రయోజనం ఉం టుందని కూరగాయలు సాగు చేయాలని రైతులను కో రారు. దీని కోసం రైతులకు * లక్షవరకు సబ్సిడీపై రు ణం అందజేస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు గేదెల కొనుగోలుకు వడ్డీలేని రుణాన్ని అందిస్తామని తె లిపారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా మార్చిన ట్లు చెప్పారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్, డీసీఏంఏస్ చైర్మన్ ముజీబుద్దీన్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జేడీఏ నర్సింహ పాల్గొన్నారు. -
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తాం: మృణాళిని
హైదరాబాద్: కొత్త పెన్షన్ విధానాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మృణాళిని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతనంగా అమలు చేసే విధానం వల్ల 43 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి మృణాళిని తెలిపారు. కొత్త పెన్షన్ విధానాన్ని ఆధార్‌ను లింక్ చేస్తున్నామని ఆమె అన్నారు. ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. ఆగస్టు 30 లోగా పెన్షన్‌దారులకు ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ల కోసం 3788 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, 9 లక్షల పెన్షన్లను కేంద్రం మంజూరు చేస్తుందని మంత్రి మృణాళిని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి 7640 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని, రిజిస్టర్ అయన ప్రతి డ్వాక్రా గ్రూప్‌కు లక్ష రూపాయల మాఫీ వర్తిస్తుందన్నారు. డిఫాల్టర్ల గ్రూప్‌లకు కూడా రుణమాఫీ వర్తింపు చేస్తామని మరో ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. -
నీరసంతో తల తిరుగుతుంటే...
గృహవైద్యం వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి తరచుగా కానీ అప్పుడప్పుడూ కానీ, తల తిరుగుతుంటుంది. ఇందుకు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆహారాన్ని తక్కువసార్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలా చేసినప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు రోజంతా శక్తి విడుదల అవుతుంటుంది. పుల్లని పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరిగినట్లుండే వాళ్లు రోజుకు రెండు బత్తాయి లేదా కమలాపండ్లను తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను దగ్గర ఉంచుకుని వాసన పీలుస్తుంటే తల తిరగడం, వాంతి వస్తున్న భావన కలగవు. ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించడానికి ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు తీసుకోవాలి. అయినప్పటికీ ఐరన్‌లోపంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు తీసుకోవాలి. దేహంలో ‘సి’ విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న ఐరన్ దేహానికి పట్టదు. కాబట్టి ఐరన్ లోపాన్ని పరిష్కరించుకోవడానికి పుల్లటి పండ్లను తినాలి. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆహారాన్ని వేళ తప్పించరాదు. ఒకవేళ భోజనం చేయాల్సిన సమయానికి భోం చేయడం కుదరకపోతే ఒక పండు లేదా బలవర్ధకమైన చిరుతిండి అయినా తినాలి. -
ట్రైబల్ టైలర్లు కావలెను..!
* ఎస్టీ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు దర్జీల కొరత * సంక్షేమ హాస్టళ్లలో పక్కన పడేసిన క్లాత్ * ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టని వైనం * మధ్యవర్తుల పైరవీలతో అధికారుల ఇబ్బందులు నీలగిరి: జిల్లాలో ట్రైబల్ టైలర్లు (గిరిజన దర్జీలు) కరువయ్యారు. దీంతో ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు దుస్తులు కుట్టే నాథుడే లేకుండాపోయాడు. దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపి వేల మీటర్ల క్లాత్‌ను పక్కన పడేశారు. జిల్లా మొత్తంగా 39 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు, 11 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. విద్యాసంవత్సర ప్రారంభంలోనే జిల్లాకు 1,6,226 మీటర్ల క్లాత్ చేరింది. ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు కుట్టించి ఇవ్వాలి. గతంలో క్లాత్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం, విద్యార్థులకు ఒకటిరెండు జతలు ఇవ్వడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం గత ఏడాది నుంచే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. గిరిజన టైలర్లకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులు కుట్టే బాధ్యతను వారికే అప్పగించాలని పేర్కొంది. వసతి గృహాల వద్దనే కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు దుస్తులు కుట్టించాలనే నిబంధన విధించింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా 16 హాస్టళ్లను దుస్తులు కుట్టించే కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల వద్దనే మిగిలిన 34 హాస్టళ్లకు చెందిన దుస్తులు కుట్టించాలి. దీంతో ఒక్కో హాస్టల్‌కు ఎంతలేదన్నా పది నుంచి 20 కుట్టుమిషన్లు అవసరం. ఈ స్థాయిలో కుట్టుమిషన్లు ఏర్పాటు చేసేంత శక్తిసామర్థ్యాలు కలిగిన గిరిజన టైలర్లు తమకు దొరకడం లేదని వార్డెన్లు రాతపూర్వకంగా జిల్లా అధికారులకు లేఖ రాశారు. వసతి గృహాల వద్ద దుస్తుల కుట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, క్లాత్ ఇస్తే, బయట కుట్టి హాస్టళ్లకు పంపిస్తామని కొందరు గిరిజన టైలర్లు సంప్రదించినట్లుగా వార్డెన్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు దుస్తులు కుట్టే వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో వసతి గృహాలకు చేరిన క్లాత్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఆగస్టు 15వ తేదీ నాటికి విద్యార్థులకు కొత్త దుస్తులు అందించాలి. కానీ ఇప్పటి వరకూ అధికారులు ఆ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు. గతేడాది కూడా గిరిజన దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపిన వార్డెన్లు దుస్తులు కుట్టే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో పలుచోట్ల క్లాత్ దుర్వినియోగం కావడంతోపాటు శాఖాపరంగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడు పక్కదారి పట్టకుండా ఉండేందుకు, గిరిజన దర్జీలకు ఉపాధి కల్పించాలన్న పట్టుదలతో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. దళారుల ప్రమేయంతోనే ఇబ్బందులు : వి.సర్వేశ్వరరెడ్డి, మాడా పీఓ దుస్తులు కుట్టేందుకు గిరిజన దర్జీలను రానివ్వకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. పలుచోట్ల బెదిరింపులకు పాల్పపడుతున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. గతంలో కూడా ఈ విధమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దుస్తులు కుట్టినందుకుగాను టైలర్లకు ఒక్కో జతకు రూ.40 చొప్పున చెల్లిస్తాం. దీంట్లో కమీషన్లు రాబట్టుకునేందుకు దళారులు ప్రవేశించి గిరిజన టైలర్లను రానివ్వడం లేదు. ఇద్దరు, ముగ్గు రు దర్జీలు ఒక గ్రూపుగా ఏర్పడి దుస్తులు కుట్టేందుకు ముందుకొచ్చారు. ఇదే విషయమై కలెక్టర్‌కు ఫైల్కూడా పెట్టాం. కానీ వ్యక్తిగతంగా ముందుకొచ్చి హాస్టళ్ల వద్ద దుస్తులు కుట్టేవారికే మాత్రమే ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. దీంతో దర్జీలను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. త్వరలో దుస్తులు కుట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వే
భోగాపురం : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయూ లేదా అన్న అంశంపై కేంద్ర మానిటరింగ్ కమిటీ (జాతీయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు) సభ్యులు శనివారం ముంజేరు గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఉపాధి పనులను పరిశీలించి, వేతనదారులకు రో జుకు ఎంత వేతనం వస్తున్నది అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తున్నారా లేదా అన్న విషయూన్ని కూడా ఆరా తీశా రు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్యం, ఐఎస్ఎల్ మరుగుదొడ్లు వినియోగంపై పరిశీలించి, పంచాయతీ కార్యాల యంలో హౌసింగ్, ఉపాధి, ఐకేపీ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో వృద్ధాప్య, వికలాంగ, విం తంతు పింఛన్లు అందుకుంటున్న వారితో మాట్లాడారు. వారు ఎన్ని ఏళ్ల నుంచి పింఛన్లు అందుకుంటున్నారో అడిగి రికార్డులు పరిశీలించారు. అయితే చాలామంది వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో అన్ని మండలాల్లో నాలుగు పంచాయతీల చొప్పున పరిశీలన చేస్తున్నామన్నారు. భోగాపురం మండలంలో ద ల్లిపేట, కవులవా డ, లింగాలవలసతో పాటు ముంజేరులో నాలుగు రోజు లుగా సర్వే నిర్వహించినట్టు తెలిపారు.మండలంలో ప్ర జలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వారికి అదనంగా అందించాల్సిన సంక్షేమ పథకాలు వంటి వాటిపై నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ ప్రాజెక్టు అధికారి ఎస్. అప్పలనాయుడు, డీఆర్డీఏ ఏపీడీ వి.డి.ఆర్ ప్రసాద్, భోగాపురం క్లస్టర్ ఏపీడీ సత్యనారాయణ, డిప్యూటీ ఎస్ఓ కె.వి రామారా వు, ఇన్చార్జి ఎంఈఓ ఎన్.సుజాత, ఉపాధి ఏపీఓ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో గృహ నిర్మాణ శాఖ రద్దు!
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సామాన్యుడికి తోడ్పడే గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ.. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణలో మంత్రిత్వ శాఖలు 17కే పరిమితంకానున్న నేపథ్యంలో ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. కొత్త ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలను మాత్రమే కొనసాగించి, మిగతా వాటిని విలీనం కానీ, రద్దు కానీ చేయాల్సి ఉంటుంది. దీంతో గృహ నిర్మాణ శాఖను రద్దు చేసి దాని పరిధిలోని సంస్థలను ఇతర శాఖలకు అప్పగించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన గృహ నిర్మాణ సంస్థ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థ(హౌసింగ్ కార్పొరేషన్), గృహ నిర్మాణ మండలి(హౌసింగ్ బోర్డు), రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లతో గృహ నిర్మాణ శాఖ కొనసాగుతోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ బాధ్యతను పురపాలక శాఖకు అప్పగిస్తూ గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలిని రద్దు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దివాలా తీసి అప్పులు తీర్చేందుకు భూములు అమ్మే పనిలో బిజీగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌ను కూడా పురపాలక శాఖలో విలీనం చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రతిపాదనలను దాని ముందుంచాలని అధికారులు నిర్ణయించారు. కాగా, గృహ నిర్మాణ సంస్థను విభజించేందుకు మంగళవారం గృహ నిర్మాణ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో జూన్ 2 తర్వాత తెలంగాణలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు వీలుగా ఆ సంస్థ పేరును రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అయితేరాష్ట్ర హౌసింగ్ బోర్డు విభజన మాత్రం ఇప్పట్లో ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని సంస్థలు రాష్ట్ర విభజన తర్వాత సంవత్సరం వరకు ఉమ్మడిగా ఉండే వెసులుబాటు రాష్ట్ర విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్లో కల్పించినందున హౌసింగ్ బోర్డుపై తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇక గృహ నిర్మాణ శాఖలో ప్రస్తుతం ఓ ప్రత్యేక విభాగంగా ఉన్న ‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(దిల్)’ను హౌసింగ్‌బోర్డులో విలీనం చేయాలని నిర్ణయించారు. -
ఆప్ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహిళలపై వేధింపుల నివారణ, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సంబంధించిన ఐపీసీ 377 సెక్షన్‌ను రద్దుచేయడం వంటి హామీలను ఆమ్ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ఈశాన్య ముంబై స్థానం నుంచి పోటీచేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ తెలిపారు. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులందరూ కలిసి గురువారం పార్టీ సంకల్ప్ పత్రను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ తమకు అధికారమిస్తే 377 సెక్షన్ రద్దుకు కృషిచేస్తామన్నారు. మహారాష్ట్రలో జన్‌లోక్‌పాల్ బిల్లును అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులను నిరోధించేం దుకు మరింతమంది మహిళా పోలీస్ అధికారులను నియమిస్తామని మేనిఫెస్టోలో వివరించారు. -
గృహయజ్ఞం సఫలం చేస్తారా?
పేదలకు సొంతిల్లు ఒక కల! గూడు... మనిషి కనీసావసరాల్లో ఒకటి!! కానీ ఇప్పటికీ రాష్ట్రంలో పేదోడికి సొంతిల్లు ఒక కరిగిన కలే! వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో పేదోడి సొంతింటి కలను సాకారం చేసే బృహత్ ప్రయత్నం జరిగింది. దేశం మొత్తం మీద 40 లక్షల ఇళ్లు కడితే, ఒక్క వైఎస్ ఆర్ ప్రభుత్వమే 48 లక్షల ఇళ్లు నిర్మించింది. గ్రామ గ్రామాన ఉన్న ఇళ్లే అందుకు సాక్ష్యం. వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ పేదలకు తమ ప్రభుత్వం ఏర్పడితే యాభై లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. ఈ గృహయజ్ఞం విజయవంతం కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విధివిధానాలు ఎలా ఉండాలి? మరింత తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం చేయడానికి ప్రత్యామ్నాయాలున్నాయా? ఈ అంశాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకొండి. ఒక్క మౌస్ క్లిక్కుతో రాష్ట్రంలో గుడిసె లేకుండా, పక్కా ఇళ్లుండేలా చేయండి. -
కన్నెర్రజేస్తాం..ఖబడ్దార్!
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రిలో రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన గృహ నిర్మాణ సముదాయంలో ఫ్లాట్ల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహించబోగా.. ఆటంకపరిచిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఇతర తెలుగుదేశం నాయకులకు ఎదురైన చేదు అనుభవమే అందుకు ఉదాహరణ. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామం నేతలకు వణుకు పుట్టించగా.. జనంలో వచ్చిన కొత్త చైత న్యాన్ని చాటి చెప్పింది.పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా రాజమండ్రిలో లాలాచెరువు, తాడితోట రామకృష్ణ థియేటర్ వెనుక, పేపరుమిల్లు వద్ద ధవళేశ్వరంలలో సుమారు 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరేళ్ల క్రితం నిర్మాణం మొదలైంది. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఈ నిర్మాణాలు పూర్తి చేయడంలో తీవ్రజాప్యం చేసింది. అధికార పార్టీ ప్రతినిధులు తమ అనుయాయులకు ఇళ్లు కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు చెలరేగిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఆ ఇళ్లు అందలేదు. బినామీలు, అనర్హులు ఇళ్లు సంపాదించగా అధికారులతో పోరాడలేక అర్హులైన వారు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లాలాచెరువు వద్ద ఇళ్ల కేటాయింపులు చేపట్టిన అధికారులకు లబ్ధిదారులు నిరసనల సెగ చూపించారు. తాజాగా గురువారం రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన 2256 గృహాల సముదాయానికి సంబంధించి లబ్ధిదారులకు లాటరీ ద్వారా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఏ నేతకూ ఈ గతి పట్టలేదు..! ఆరేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఇన్నాళ్లకు కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు సొంతం కానుందని సంతోషిస్తుంటే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు లాటరీ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతును పిలిచి తమ పార్టీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌ను పిలవలేదంటూ మాజీ మంత్రి గోరట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో అడ్డుపడ్డారు. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ డ్రా తీసే స్లిప్పులను చించేశారు. దీంతో లబ్ధిదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోరంట్లతో సహా టీడీపీ వారిని రాళ్ళతో కొట్టారు, రోడ్డు మీది దుమ్మెత్తి పోశారు. ఈ పరిణామాన్ని ఊహించని గోరంట్ల మ్లానవదనంతో, అవమానభారంతో అక్కడి నుంచి ఉడాయించాల్సి వచ్చింది. బహుశా.. ఇలాంటి దుస్థితి గతంలో జిల్లాలో ఏ నేతకూ ఎదురై ఉండదని అంటున్నారు. కొనసాగుతున్న రాజకీయ రచ్చ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోజుకో జాబితా తయారు చేసి తమ వాళ్లకు పెద్ద పీట వేశారని, కార్పొరేటర్లకు పంపకాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో గృహ నిర్మాణానికి చాలాకాలం గ్రహణం పట్టింది. వేలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి డీడీలు కట్టిన వారు జాబితాల్లో పేర్లు కనిపించక ఆవేదన చెందారు. చివరికి వివాదాలు సద్దుమణిగి ఇళ్లు కేటాయించే సమయంలో ఆ కార్యక్రమాన్ని కాస్తా రాజకీయరచ్చగా మార్చడం పట్ల పేదలు నిప్పులు కక్కుతున్నారు. ఉవ్వెతున్న ఎగసిన లబ్ధిదారుల ఆగ్రహాన్ని చూశాక కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారి వారి రాజకీయ ఎత్తుగడలు కొనసాగించారు. గృహాల కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు తాడితోట సెంటర్ వద్ద ధర్నా చేసయగా ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తన అనుచరులతో మద్దతు పలికారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన రౌతు ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇళ్ల కేటాయింపులు చేసి తీరుతామన్నారు. ప్రస్తుతం ఇళ్లు నిర్మించిన స్థలాన్ని గతంలో గోరంట్ల అమ్ముకోజూశారని ఆరోపించారు. కాగా అంతకు ముందు గోరంట్ల తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఇళ్లను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిని ఎండగడతామన్నారు. కాగా తమ దాడికి కాంగ్రెస్ నాయకులే కారణమంటూ టీడీపీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీరేం నేతలు సార్..! వడ్డీలకు తెచ్చి రూ.45 వేలు కట్టాను. ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. ఇన్నాళ్లకు మా ఆశలు నెరవేరుతున్నాయంటే ఈ నాయకులు రాజకీయాలు చేసి ఇళ్లు రానీకుండా చేస్తున్నారు. వీళ్లు పెట్టరు.. పెట్టనివ్వరు. వీరేం నేతలు సార్! - ధవళేశు లక్ష్మి, రాజమండ్రి పండుగ చేసుకోవాలనుకున్నాం.. కొత్త సంవత్సరం ఇళ్లు వస్తాయని ఆశపడ్డాము. మా అబ్బాయితో కలిసి ఇక్కడికి వచ్చాను. మా కాలనీలో పండుగ చేసుకోవాలని అనుకున్నాము. కానీ ఇళ్లు ఇచ్చే సమయానికి నాయకులు అడ్డుకున్నారు. వీరేం పెద్దమనుషులు? - సత్యవతి (లబ్ధిదారుడైన వికలాంగుడు రమణ తల్లి) రాజమండ్రి -
హౌసింగ్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
ఒంగోలు, న్యూస్‌లైన్ : గృహ నిర్మాణశాఖ పొదిలి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చేబ్రోలు రామాంజనేయులు అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. మొత్తం ఆరుచోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆయన పనిచేసే పొదిలి గృహనిర్మాణశాఖ కార్యాలయం, ఒంగోలులోని ఆయన నివాసగృహం, ఆయన స్వగ్రామం రావినూతల, ఒంగోలులోని ఆయన బంధువుల నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ భాస్కరరావు, ఒంగోలు సీఐ టీవీ శ్రీనివాసరావులు ఇతర జిల్లాల్లో పనిచేసే తమ సిబ్బంది సహకారంతో ఈ దాడులు కొనసాగించారు. గురువారం రాత్రి వరకు కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అనేక కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని బృందావనంలో రెండంతస్తుల మేడ ఒకటి, గుండ్లాపల్లిలో మూతపడిన నాగభైరవ జూనియర్ కాలేజీ స్థలాన్ని రామాంజనేయులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతే కాకుండా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల స్థలాలను కొనుగోలు చేసినట్లు ధ్రువపరిచే పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో బ్యాలెన్స్ వివరాలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. శుక్రవారం ఈ లాకర్లను తెరిపించి అందులో ఉన్న వాటి వివరాలను కూడా సేకరించనున్నారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ భాస్కరరావు మీడియాతో మాట్లాడుతూ పొదిలి, ఒంగోలు, రావినూతలలో మొత్తం ఆరు టీములు తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. తమకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం కోటి రూపాయలకుపైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇటీవల రామాంజనేయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చే స్తుండటంతో ఏసీబీకి ఫిర్యాదులు అండిన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. హౌసింగ్ కార్యాలయంలో సోదాలు పొదిలి, న్యూస్‌లైన్ : స్థానిక గృహ నిర్మాణశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఈ రామాంజనేయులుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివిధ ఆధారాలు సేకరించారు. నెల్లూరు ఏసీబీ ఇన్ప్పెక్టర్ ఎం.కృపానందం ఆధ్వర్యంలో కార్యాలయంలోకి వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. డీఈ బీరువా, టేబుల్ సొరుగులలో ఉన్న రికార్డులను పరిశీలించారు. డీఈ బంధువుల ఇళ్లలో దాడులు మేదరమెట్ల, న్యూస్‌లైన్ : పొదిలి హౌసింగ్ డీఈ చేబ్రోలు పెద్ద రామాంజనేయులు గృహంతో పాటు, అతని బంధువుల గృహాల్లో గురువారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని రావినూతల గ్రామంలో ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. సోదాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు కొనసాగాయి. రామాంజనేయులు తల్లి సుబ్బాయమ్మ, అత్త మోపర్తి జయమ్మకు చెందిన ఇళ్లలో క్షుణ్ణంగా గాలించారు. పొలం, స్థలాల తాలూకా డాక్యుమెంట్లు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు సీహెచ్ చంద్రమౌళి, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
మహిళలకు 33 శాతం ఇళ్లు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) నిర్మిస్తున్న ఇళ్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఇక మీదట మాడా నిర్వహించే లాటరీ ప్రక్రియ ద్వారా మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం ఇళ్లు లభించనున్నాయి. దీన్ని అన్ని వర్గాల మహిళలకూ అమలు చేయాలని యోచిస్తున్నారు. సుధారణ సమితి చేసిన ఈ సిఫార్సుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే సొంతగూటి కోసం మహిళలు కంటున్న కలలు సాకారం కానున్నాయి. ఇదివరకే మాడా ముంబైతోపాటు పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో అనేక ఇళ్లు నిర్మించింది. వాటిని పేదలకు చౌక ధరలకే అందజేయాలని నిర్ణయించింది. అర్హుల నుంచి బ్యాంక్ లేదా అన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇందులో ఉన్నత, మధ్య తరగతి, పేదలు ఇలా వివిధ వర్గాల కోసం ఇళ్లు కేటాయిస్తారు. లాటరీలో ఇళ్లు వచ్చిన వారికి తదనంతరం అందజేస్తారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా కోటా లేకపోవడంతో వీరికి అన్యాయం జరుగుతోందనే విమర్శలున్నాయి.దీంతో 33 శాతం రిజర్వేషన్ అమలుచేస్తే అన్ని వర్గాల మహిళలకు సొంతిళ్లు లభిస్తాయని మాడా అభిప్రాయపడుతోంది. దీనిపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదన అమలుకు మాడా నియమావళిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. న్యాయనిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తరువాత ఒక నిర్ణయానికి వస్తామని మాడా ఉపాధ్యక్షుడు సతీష్ గవయి తెలిపారు. ఇదిలాఉండగా యుద్ధాల్లో గాయాలైన, అమరులైన సైనికుల కుటుంబాలు, విధినిర్వహణలో మరణించిన పోలీసులు, అంధులు, వికలాంగులు, మానసిక వికలాంగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, పంచాయతీ సమితుల్లో పనిచేసేవారికి కూడా రిజర్వేషన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు గవయి వెల్లడించారు.అయితే ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ కాబట్టి చర్చోపచర్చల తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తరువాత రూపొందించే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. -
పార్లమెంట్ సమావేశాల్తో ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు