ముంబై: మహిళలపై వేధింపుల నివారణ, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సంబంధించిన ఐపీసీ 377 సెక్షన్‌ను రద్దుచేయడం వంటి హామీలను ఆమ్‌ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ఈశాన్య ముంబై స్థానం నుంచి పోటీచేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ తెలిపారు. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులందరూ కలిసి గురువారం పార్టీ సంకల్ప్ పత్రను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ తమకు అధికారమిస్తే 377 సెక్షన్ రద్దుకు కృషిచేస్తామన్నారు. మహారాష్ట్రలో జన్‌లోక్‌పాల్ బిల్లును అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులను నిరోధించేం దుకు మరింతమంది మహిళా పోలీస్ అధికారులను నియమిస్తామని మేనిఫెస్టోలో వివరించారు.
ఆప్ మేనిఫెస్టో విడుదల
Published Thu, Apr 10 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement