Gays
-
మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో ‘గే’లు ఉన్నారు.. అలాంటి అనుభవం ఎదురైంది: అనసూయ
యాంకర్ అనసూయ సోషల్ మీడియా ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై తనకు నచ్చిన విధంగా స్పందిస్తుంది. ట్రోల్ చేసినా పట్టించుకోదు. ఇంకా చెప్పాలి అంటే ‘మీరు ఎంత ట్రోల్ చేస్తే నేను అంత డేరింగ్‌గా మాట్లాడుతా’అన్నట్లుగా ఆమె సోషల్ మీడియా పోస్టింగ్స్ ఉంటాయి. తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట్ వైరల్‌గా మారాయి. తాజాగా అనసూయ అభిమానులతో ఆన్లైన్ చాటింగ్‌లో పాల్గొంది. ఈ క్రమంలో ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెట్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ‘మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో లెస్బియన్స్ ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు వారితో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్లైన్లో మాత్రం చాలా సార్లు అనుభవమైంది’అని ఓపెన్‌గా సమాధానం చెప్పింది. ఇదే చాట్‌లో అనసూయ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మరో నెటిజన్ మీరు మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ ఎప్పుడు చేస్తారు? అని అడగ్గా.. ‘టీఆర్పీ కోసం మేకర్స్ చేస్తే అవమానకర స్టంట్స్ పోతేకాని నేను రాను. నేను కూడా బుల్లితెరను మిస్ అవుతున్నాను’ అని అనసూయ చెప్పుకొచ్చింది. -
నేను ‘గే’ అని అమ్మ అన్నం పెట్టడంలేదు
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో తమను కూడా మనుషులుగా గుర్తించాలని తమ హక్కులను కూడా కాపాడాలని పలువురు స్వలింగ సంపర్కులు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది జూన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుంటారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు, గే లు, బై సెక్సువల్(ఎల్జీబీటీ) సమావేశమయ్యారు. ప్రైడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఎల్జీబీటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ హక్కులను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ కుటుంబంలోనే తమను వెలివేస్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. తాను ‘గే’ నని తెలుసుకొని తన తల్లి వారం రోజులు అన్నం పెట్టకుండా మాడ్చారని, ఓ రూమ్‌లో వేసి బంధించారని ఇదెక్కడి అన్యాయమని ఇంకో యువకుడు ఆందోళన చెందాడు. తనలో వచ్చిన మార్పులను గమనించి తన తండ్రి తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడని, ఏం పాపం చేశానని తాను ఇప్పుడు రోడ్డునపడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై గొంతు విప్పారు. తమకు కూడా గుర్తింపు కావాలని వీరంతా డిమాండ్ చేశారు. -
పాక్‌లో లింగమార్పిడి పెళ్లిళ్లకు అనుమతిస్తూ ఫత్వా
కరాచి: లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఆడ, మగైతే వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు ఇస్లాం అనుమితిస్తోందంటూ పాకిస్థాన్‌లోని ఓ మత గురువుల బృందం ఇటీవల ఓ ఫత్వా జారీ చేసింది. వారికి వారసత్వ హక్కు కూడా వర్తిస్తుందని, మరణానంతరం వారిని ముస్లిం శ్మశానంలో ఖననం చేసేందుకు అనుమతి కూడా ఉంటుందని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. అయితే పెళ్లి చేసుకోబోయే ఆడ, మగలు తమ శరీరాలపై తాము ఆడ, మగ అంటూ సూచించే గుర్తులు కలిగి ఉండాలని ఫత్వాలో షరతు విధించారు. లింగమార్పిడి చేసుకున్న ఆడ లేదా మగను సాధారణ స్త్రీ, పురుషులు కూడా పెళ్లి చేసుకోవచ్చని, అయితే శరీరాన్ని సూచించే లింగం గుర్తులు మాత్రం లింగమార్పిడి చేసుకున్న వారికి తప్పనిసరిగా ఉండాలని ఫత్వాలో పేర్కొన్నారు. సాధారణ పౌరులకు మాత్రం ఈ గుర్తులు అవసరం లేకపోవడమే కాకుండా, గుర్తులు ఉండడం కూడా ఇస్లాంకు వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. అసలు ఈ గుర్తులు ఎందుకు అవసరమనే విషయాన్ని మాత్రం ఫత్వాలో ఎక్కడా వివరించలేదు. లాహోర్‌లోని ‘టాంజీమ్ ఇత్తెహాద్ ఇ-ఉమ్మత్ పాకిస్తాన్’ అనే సంస్థకు చెందిన యాభై మంది మత గురువులు జారీ చేసిన ఈ ఫత్వా ప్రతిని తాజాగా మీడియా సేకరించింది. ఈ మత గురువుల సంస్థ చిన్నదే అయినప్పటికీ, దానికి చట్టబద్ధత లేకపోయినప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లను అనుమతిస్తూ ఫత్వా జారీ చేయడం ఓ ఇస్లామిక్ దేశంలో విశేషం. లింగమార్పిడి పౌరులకు సమాన హక్కులు కల్పిస్తూ 2012లోనే పాకిస్థాన్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వారికి వారసత్వ హక్కులను కూడా కల్పించింది. అయితే వారికి ఓటు హక్కు రావడానికి మాత్రం ఓ ఏడాది కాలం పట్టింది. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య పెళ్లిళ్లను మాత్రం కోర్టులుగానీ, షరియా చట్టాలుగానీ పాకిస్థాన్‌లో ఇప్పటికీ అనుమతించడం లేదు. దేశంలో 19 కోట్ల మంది స్వలింగ సంపర్కులు ఉన్నారు. వారిని అక్కడి సమాజం ఇప్పటికీ గుర్తించకపోవడం వల్ల వారు అడుక్కోవడం లేదా వ్యభిచారం చేయడం ద్వారా బతుకుతున్నారు. -
‘క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి’
రోమ్: క్రైస్తవులు, రోమన్ కేథలిక్ చర్చిలు గేలకు క్షమాపణ చెప్పాలని పోప్ ఫ్రానిన్స్ ఆదివారం పేర్కొన్నారు. గేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జర్మన్ కార్డినల్ రీన్హార్డ్ మార్క్ వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. జర్మనీ చర్చి గే లతో పాటు పేదలకు స్త్రీలకు, పిల్లలకు క్షమాపణ చెప్పాలన్నారారు. అమెరికాలో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయన నేపథ్యంలో రిన్హార్డ్ మార్క్ గేల పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పిన దిగ్గజం!
మనీలా: బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను గడగడలాడించడంలోనే కాదు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ తాను మేటి అనిపించుకున్నాడు బాక్సింగ్ మాజీ దిగ్గజం. ఎనిమిది సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచిన దిగ్గజం మానీ పాక్వియావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వలింగ సంపర్కులు జంతువుల కన్నా హీనమైన వారని వ్యాఖ్యానించాడు. ఫిలిప్పీన్స్ సెనేట్ లో స్థానం కోసం పోటీపడుతున్న తరుణంలో ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు రాజకీయంగా కూడా పెను దుమారం రేపాయి. ఈ మే నెలలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. భార్యతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. తాను ఎవరిని విమర్శించడం లేదని, బైబిల్ లో పేర్కొన్న విషయాలనే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నాడు. ఆయనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు తాను చేసిన పనిని తప్పు అని గ్రహించాడు. హోమో సెక్సువల్స్ ను దూషించినందుకు తనను క్షమించాలని కోరాడు. 'జంతువులు కూడా స్వలింగ సంపర్కం చేస్తాయి. అయినా అవే నయం. వాటికి ఆడా, మగా అనే తేడా అయినా ఉంది. పురుషులు- పురుషులతో, మహిళలు - మహిళలతో సెక్స్ లో పాల్గొనడం జంతువుల కంటే దారుణం' అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వైస్ గండా అనే ఓ గే ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. ట్విట్టర్లో ఆ బాక్సర్ పై విమర్శల వర్షం కురిపించాడు. పాక్వియావో తనకు తానుగా దేవుడు అని ఫీలవుతున్నాడు. కానీ, రాజకీయాలకు కావాలసింది నైపుణ్యం ఉన్నవాళ్లంటూ గండా మండిపడ్డాడు. ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని.. ఎందుకంటే పవిత్ర బైబిల్ లో స్వలింగ సంపర్కం తప్పు అని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించాడు. దేవుడు మిమ్మల్ని అందర్నీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని బాక్సర్ పాక్వియావో చెప్పుకొచ్చాడు. -
మమ్మల్ని చిన్నచూపు చూడొద్దు
దోమలగూడ: సమాజం తమ పట్ల వివక్ష చూపకుండా అవగాహన కలిగించేందుకు క్వేర్ క్యాంపస్ హైదరాబాదు ఆధ్వర్యంలో లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్స్ (ఎల్జీబీటీ) ఆదివారం సాయంత్రం ఇందిరాపార్కు వద్ద నృత్యప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లెస్బియన్లు, గే, ట్రాన్స్‌జెండర్స్ పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందని, ఇది సరికాదని అన్నారు. మేము కూడా సమాజంలో భాగమేనని, అందరిలాగే మాకూ సమాన హక్కులున్నాయని అన్నారు. సత్య, అభిషేక్, నవదీప్, మణికిరణ్, ఆదిత్య, రవికిరణ్, సుధారాణి తదితరులు పాల్గోన్నారు. -
మేం 'గే'లు కాదు...
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వి ఆర్ నాట్ గేస్' అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పశ్చిమ దేశాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. కొత్త హక్కులు అంటూ ఆ దేశాలు తెరపైకి తీసుకొస్తున్న నూతన విధానాలు మా ప్రజల విలువ, సంస్కృతి, నమ్మకాలపై ప్రభావం చూపిస్తాయని ముగాబే పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండంలో ఎల్జీబీటీ విధానాలు, హక్కులు అధికంగా ఉన్న దేశం జింబాబ్వే అన్న విషయం అందరికి విదితమే. తమ దేశస్థులను స్వలింగ సంపర్కం చేసే వారిగా ఇతర దేశాలు భావిస్తుండటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్వలింగ సంపర్కం చేసే వారు 'పందులు, మేకలు, ఇతర జంతువుల కన్నా హీనం' అంటూ 2013లోనూ ఆయన వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
కథలన్నీ మనువాదానికి చెందినవే..
ఎల్జీబీటీ హక్కుల నేత నవదీప్ హైదరాబాద్: ప్రస్తుతం ప్రచురితమయ్యే కథలన్నీ మనువాదానికి చెందినవే ఉన్నాయని ఎల్జీబీటీ(లెస్బియన్ గే బెసైక్సువల్ ట్రాన్స్‌జెండర్) రైట్స్ యాక్టివిస్ట్ నవదీప్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా ఉత్సవం-2015 జరిగింది. ఈ సందర్భంగా 2014లో వెలువడిన ఉత్తమ కథల సంకలనం ‘‘ప్రాతినిధ్య-2014’’ను నవదీప్ ఆవిష్కరించారు. నేటి సమాజంలో స్వలింగ సంపర్కులను అంటరానివాళ్లుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్కులను సినిమా, మీడియా వాళ్లు అణచివేత ధోరణితోనే చూస్తున్నారని, ఇది పోవాలంటే విస్తృతమైన చర్చ జరగాలన్నారు. ముఖ్యఅతిథి ప్రముఖకవి సతీష్ చందర్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో కూడిన రచనలు రావాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్స్‌లెన్సీ అవార్డు ఫర్ లిటరరీ క్రిటిసిజం సాహితీవేత్త సి.విజయభారతికి, సామాన్య కిరణ్ ఫౌండేషన్ ఎక్సెలెన్సీ అవార్డ్ ఫర్ స్టోరీ రైటింగ్‌ను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత మునిపల్లె రాజుకు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సీఐడీ ఐజీపీ పి.వి.సునీల్ కుమార్, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మి నారాయణ, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొన్నారు. -
కార్తీక్ weds సందీప్!
కాలిఫోర్నియాలో పెళ్లాడిన భారతీయ అమెరికన్ గేలు బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా వేడుక సీన్ అర్థమైపోయింది కదా. ఇద్దరు అబ్బాయిల వింత పెళ్లి. వరూవరుళ్లు సందీప్, కార్తీక్. భారతీయ అమెరికన్లయిన వీరు స్వలింగ సంపర్కులు. అమెరికాలో గే పెళ్లిళ్లు కొత్తేం కాదుకదా అని తీసిపారేయకండి. వీరిది ఆషామాషీ పెళ్లికాదు. బోలెడంత ప్రత్యేకత ఉంది. తిరువనంతపురంలో పుట్టి అమెరికాలో సెటిలై న సందీప్‌కు అమెరికాలో పుట్టిన కార్తీక్‌తో 2012లో ఓ డేటింగ్ వెబ్సైట్లో పరిచయమైంది. ప్రేమపక్షులు ఒకరికొకరు తెగ నచ్చేశారు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. పెళ్లిబంధంతో ఒకటి కావాలనుకున్నారు. 2013లో తమ తల్లిదండ్రులకు సంగతి చెప్పి అనుమతి కోరారు. తల్లిదండ్రులు తొలుత షాక్ తిన్నా తర్వాత విశాల హృదయంతో ఒప్పేసుకున్నారు. ఇంకేం అబ్బాయిలు ఎగిరి గంతేశారు. పెళ్లిని అంగరంగవైభోగంగా, అగ్నిసాక్షిగా పక్కా మలయాళీ సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలనుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలెట్టారు. సిగ్గుపడకుండా బంధుమిత్రుల ఇళ్లకెళ్లి ‘మా పెళ్లికి సకుటుంబసమేతంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి’ అంటూ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ ఏడాది జనవరి 18న శుభముహూర్తంలో కాలిఫోర్నియాలో పెళ్లిపీటలెక్కారు. పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తుండగా, బంధుమిత్రులు అక్షింతలు చల్లుతుండగా కార్తీక్.. సందీప్ మెడలో తాళి కట్టాడు. తర్వాత అగ్నిగుండం చుట్టూ ఏడడుగులు నడిచారు. వరుడు తన అర్ధాంగుడి చేయిపట్టుకుని అరుంధతీ నక్షత్రం చూపించాడు. ఆహూతులు కొత్తజంటకు కానుకలు సమర్పించి ఎవరికి తోచినట్లు వారు ఆశీర్వదించారు. కొబ్బరి దండిగా చేర్చి వండిన కమ్మని కేరళ వంటకాలతో ఆహూతులు భోంచేశారు. వీరి పెళ్లి సంగతి ఇటీవల సోషల్ మీడియాలో బయటకొచ్చి, గేలకు నూతనోత్తేజం ఇస్తోంది. -
గే, లెస్బియన్ల సంస్కరణకు కేంద్రాలు!
గోవాలో ఉన్న గే, లెస్బియన్ తదితరులను సంస్కరించి, వారిని సాధారణ వ్యక్తులుగా మార్చేందుకు కొన్ని సంస్కరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని గోవా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రమేష్ తవాద్కర్ తెలిపారు. అయితే.. ఆయన చెప్పిన ఈ విషయం పెను దుమారాన్ని సృష్టించింది. ఎల్జీబీటీ యువతకు శిక్షణ ఇస్తామని, వారికి చికిత్సలు చేయించి, మందులిచ్చి, వాళ్లను సాధారణ వ్యక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తామని రమేష్ అన్నారు. రాష్ట్ర యువజన విధానాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా యువజన విధానంలో.. గేలు, లెస్బియన్లు తదితరులను బాల నేరస్థులు, డ్రగ్స్ బానిసల తరహాలో ఒక 'టార్గెట్ గ్రూప్'గా చేర్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. -
స్వలింగ భాగస్వామిని కాల్చిచంపిన యువకుడు
ఇద్దరు స్వలింగ భాగస్వాముల మధ్య జరిగిన ఘర్షణలో 18 ఏళ్ల యువకుడు తన భాగస్వామిని కాల్చి చంపాడు. వాళ్లిద్దరి మధ్య సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారని.. సదరు యువకుడి తల్లిపై ఆ రెండో భాగస్వామి దాడి చేయడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. నిందితుడి తల్లికి, చనిపోయిన వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, దాంతో అతడు ఆమెను చంపబోతుండగా ఈ యువకుడు అతడిని కాల్చి చంపాడని పోలీసు ఇన్స్పెక్టర్ పి.డి. పర్మార్ చెప్పారు. అహ్మదబాద్ బాపునగర్ ప్రాంతంలోని చున్వల్ నగర్ మురికివాడలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు ముందు హతుడు చేతిలో రివాల్వర్ పట్టుకుని నిందితుడి తల్లిని బెదిరించాడని, అతడు చంపుతాడన్న భయంతో ఈ యువకుడు అతడి చేతుల్లోంచి నాటు తుపాకిని లాక్కుని మూడు రౌండ్ల కాల్పులు జరిపాడని, దాంతో అతడు అక్కడికక్కడే మరణించడని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య ఏడాది కాలంగా సంబంధం ఉంది. నిందితుడి తల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడైన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆప్ మేనిఫెస్టో విడుదల
ముంబై: మహిళలపై వేధింపుల నివారణ, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సంబంధించిన ఐపీసీ 377 సెక్షన్‌ను రద్దుచేయడం వంటి హామీలను ఆమ్ఆద్మీ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు ఈశాన్య ముంబై స్థానం నుంచి పోటీచేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ తెలిపారు. ముంబైలోని ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న పార్టీ అభ్యర్థులందరూ కలిసి గురువారం పార్టీ సంకల్ప్ పత్రను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ తమకు అధికారమిస్తే 377 సెక్షన్ రద్దుకు కృషిచేస్తామన్నారు. మహారాష్ట్రలో జన్‌లోక్‌పాల్ బిల్లును అమలుచేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులను నిరోధించేం దుకు మరింతమంది మహిళా పోలీస్ అధికారులను నియమిస్తామని మేనిఫెస్టోలో వివరించారు. -
‘స్వలింగ సంపర్కం’పై రగడ
పదేళ్లకు పైగా సాగిన న్యాయ వివాదంలో స్వలింగ సంపర్కులకు ఈ ఏడాది ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే దాన్ని నేరాల జాబితా నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సహజవిరుద్ధ శృంగారం, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష వేయొచ్చనని చెబుతున్న ఐపీసీ సెక్షన్ 377ను సుప్రీం కోర్టు సమర్థించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009లో ఇచ్చిన తీర్పును డిసెంబర్ 11న తోసిపుచ్చింది. అయితే కోర్టు తీర్పు తమ జీవించే హక్కును కాలరాసిందంటూ స్వలింగ సంపర్కులు నిరసనకు దిగారు. -
సెక్షన్ 377ను మార్చాలి: స్వలింగ సంపర్కుల డిమాండ్
స్వలింగ సంపర్కం నేరపూరితం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంపై స్వలింగ సంపర్కులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు తమ జీవించే హక్కును కాలరాసిందని మండిపడ్డారు. ఇది తమకు బ్లాక్ డే అని అభివర్ణించారు. తీర్పు వెలువడిన వెంటనే కోర్టు వెలుపల ఉన్న పలువురు స్వలింగ సంపర్కులు కన్నీటి పర్యంతమయ్యారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ 377 సెక్షన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా ఈ తీర్పు సరికాదని, దీనిపై రివ్యూ పిటిషన్ వేస్తామని నాజ్ ఫౌండేషన్ తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. తిరోగమన తీర్పు: జైరామ్ రమేశ్ సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ తప్పుబట్టారు. దీన్ని తిరోగమన తీర్పుగా అభివర్ణించారు. ఆధునిక ఉదారవాద దేశంలో ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కంలో నేరం ఏముందన్నారు. తీర్పుపై కేంద్రం శాసన బాట! సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై శాసన బాట పట్టనున్నట్లు కేంద్రం సంకేతమిచ్చింది. ఒక చట్టం రాజ్యాంగబద్ధతను పరీక్షించే విచక్షణాధికారం సుప్రీంకోర్టుకు ఉందని...సుప్రీం జడ్జీలు వారి విచక్షణాధికారాలను ఉపయోగించారని...చట్టాలు చేసే అధికారాలున్న తాము కూడా విచక్షణాధికారాలను ఉపయోగిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ ప్రముఖుల అసంతృప్తి సుప్రీం తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు మానవ హక్కులను ఉల్లంఘించేదిగా ఉందని...ఇది సిగ్గుచేటని బాలీవుడ్ నటులు ఆమిర్‌ఖాన్, జాన్ అబ్రహాం పేర్కొనగా సుప్రీంకోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందని నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ విమర్శించారు. ఈ తీర్పుపై దక్షిణాసియా గే హక్కుల సంస్థ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.