గే, లెస్బియన్ల సంస్కరణకు కేంద్రాలు!
గోవాలో ఉన్న గే, లెస్బియన్ తదితరులను సంస్కరించి, వారిని సాధారణ వ్యక్తులుగా మార్చేందుకు కొన్ని సంస్కరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని గోవా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రమేష్ తవాద్కర్ తెలిపారు. అయితే.. ఆయన చెప్పిన ఈ విషయం పెను దుమారాన్ని సృష్టించింది.
ఎల్జీబీటీ యువతకు శిక్షణ ఇస్తామని, వారికి చికిత్సలు చేయించి, మందులిచ్చి, వాళ్లను సాధారణ వ్యక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తామని రమేష్ అన్నారు. రాష్ట్ర యువజన విధానాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా యువజన విధానంలో.. గేలు, లెస్బియన్లు తదితరులను బాల నేరస్థులు, డ్రగ్స్ బానిసల తరహాలో ఒక 'టార్గెట్ గ్రూప్'గా చేర్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది.