LGBT community
-
తప్పయి పోయింది క్షమించండి.. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు. దయచేసి క్షమించండి.. రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము. ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు. యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు. On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI — Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023 ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి -
వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లోనూ నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రముఖి-2, ఎమర్జెన్సీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె స్వలింగ వివాహాలపై స్పందించారు. భారత్‌లో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల హరిద్వార్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ విషయంలో తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: క్షమాపణలు కోరిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్) కంగనా మాట్లాడుతూ 'పెళ్లి అనేది రెండు హృదయాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మనందరికీ తెలుసు. వారి హృదయాలు కలిసినప్పుడు.. వారి అభిప్రాయాల గురించి మనం ఏమి చెప్పగలం.' అని అన్నారు. అయితే కంగనా స్వలింగ వివాహాలకు మద్దతు పలకడంపై నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఇలా బహిరంగంగా మద్దతిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు రాస్తూ 'నేను ఆమెకు అభిమానిని కాదు.. అయినా ఆమెను గౌరవిస్తున్నా' ఇలాంటి విషయాల్లో మద్దతు పలికిన అతికొద్ది ప్రముఖుల్లో ఆమె ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సున్నితమైన అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. -
రెయిన్బో టర్బన్; చాలా బాగుంది!
తాను స్వలింగ సంపర్కుడినని ప్రకటించిన జీవన్‌దీప్ కోహ్లి అనే సిక్కు యువకుడిని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. ఈ మేరకు..‘ జీవన్‌దీప్ నువ్వు చాలా గర్వపడాలి. ఇలా చేయడం ద్వారా ఈ దేశంలోని సమానత్వ భావనను మరింత ఇనుమడింపజేశావు. నీ టర్బన్ చాలా బాగుంది. అందరికీ హ్యాపీ ప్రైడ్ మంత్’ అని ట్వీట్ చేశారు. ఇంతకీ విషయమేమిటంటే.. 1968, జూన్ 28 తెల్లవారుజామున గే హక్కుల కార్యకర్తలపై పోలీసులు రైడ్ చేశారు. సమానత్వం కోసం పోరాడుతున్న తమను ఇబ్బంది పెట్టడాన్ని ఖండిస్తూ వారంతా పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. స్టోన్వాల్ అల్లర్లుగా పిలువబడే ఈ ఉదంతం.. ఎల్జీబీటీ హక్కులను ప్రముఖంగా ప్రస్తావించిన ఉద్యమంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్రమంలో అప్పటి నుంచి ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రతీ ఏడాది జూన్‌ను ప్రైడ్మంత్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాండియాగోలో నివసించే జీవన్‌దీప్ కో్హ్లి..‘ నేను బైసెక్సువల్ అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతాను. ఈ విధంగా నా గుర్తింపును బయటపెట్టుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నాలాగే అందరికీ ఇలాంటి స్వేఛ్చ లభించేందుకు నా వంతు కృషి చేస్తా అని ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ఎల్జీబీటీ వర్గాన్ని ప్రతిబింబించే ఇంద్రధనుస్సు రంగులతో కూడిన టర్బన్ ధరించాడు. దీంతో కోహ్లి ధైర్యానికి ఫిదా అయిన ఒబామా అతడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. You've got a lot to be proud of, Jiwandeep. Thanks for everything you do to make this country a little more equal. Turban looks great, by the way. Happy Pride Month, everybody! https://t.co/SO7mgnOkgl — Barack Obama (@BarackObama) June 4, 2019 -
‘నా ముద్దుల కొడుక్కు చట్టబద్ధత వచ్చేసింది’
స్వలింగ సంపర్కం నేరం కాదని, గే సెక్స్‌కు చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మకతీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలకడంతో ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) వర్గానికి ఊరట లభించింది. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు సుప్రీం తీర్పును స్వాగతిస్తూ సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, స్వరా భాస్కర్, అర్జున్ కపూర్ తదితరులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేయగా.. తాజాగా సీనియర్ నటి కిరణ్ ఖేర్ కూడా ఈ జాబితాలో చేరారు. అభిషేక్ బచ్చన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన కిరణ్... ‘ నా ముద్దుల కొడుకుకు చట్టబద్ధత లభించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీకి శుభాకాంక్షలు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరదించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ స్పందించిన అభిషేక్... ‘అవును లెజండరీ తీర్పు’ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే కిరణ్ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు.. మీ సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే 2008లో విడుదలైన దోస్తానా సినిమాలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాంలు ‘గే’ లుగా నటించారు. ఈ సినిమాలో అభిషేక్ తల్లిగా నటించిన కిరణ్ ఖేర్.. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ ట్వీట్‌తో చమత్కరించారు. Ma ka laadla legal ho gaya 👍👍!! Congratulations to the LGBT community and the honourable SC for this much awaited judgement! @juniorbachchan pic.twitter.com/XW8EtyyRsN — Kirron Kher (@KirronKherBJP) September 6, 2018 -
స్వలింగ సంపర్కంపై సుప్రీం సంచలన తీర్పు
-
సెక్షన్ 377: సుప్రీం సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గే సెక్స్ నేరం కాదని స్పష్టం చేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. హోమో సెక్సువాలిటీ నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్‌ను రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్‌జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. చరిత్ర క్షమాపణ చెప్పాలి చరిత్ర వారికి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది.వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘ కాలంగా (సుమారు 157 ఏళ్లు) సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఖాన్విలకర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. స్వజాతి లైంగిక చర్య నేరం కాదని తాజా తీర్పు తేల్చి వేయడంతో ఎల్జీబీటీ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కొత్త శకానికి ఇది నాంది అని వ్యాఖ్యానించారు. సెక్షన్ 377 పరస్పర అంగీకారంతో జరిపే స్వలింగ సంపర్కంపై మనదేశంలో బ్రిటీష్‌కాలం నుంచే నిషేధం కొనసాగుతోంది. 1861 చట్టం ప్రకారం, స్వలింగ సంపర్కానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 1950 నుంచి ఇప్పటివరకు ఇండియన్ పీనల్ కోడ్‌లో అనేక సార్లు సవరణలు చేసినప్పటికీ సెక్షన్ 377లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే ఈ సెక్షన్‌లోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధమని 2009లో ఢిల్లీ హైకోర్టు తేల్చింది. గే హక్కుల కోసం దాదాపు ఒక దశాబ్దం పాటు పోరాడిన నాజ్ ఫౌండేషన్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377 రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా వర్ణించింది. ఈ తీర్పును 2013లో సుప్రీం కొట్టి వేసింది. ఆ అయిదుగురు సెక్షన్ 377కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఇటీవలి కాలంలో తీవ్ర రూపం దాల్చింది. తమ హక్కులను కాపాడాలంటూ ఎల్జీబీటీ కమ్యూనిటీ పిటిషన్ వేసింది. ముఖ్యంగా రెండేళ్ళ క్రితం భరతనాట్యం డ్యాన్సర్ నవతేజ్ ఎస్ జోహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, రితూ దాల్మియా, నిమ్రాణ హోటల్ కో ఫౌండర్ అమన్ నాథ్, మహిళా వ్యాపార వేత్త అయేషా కపూర్ సెక్షన్ 377నురద్దు చేయాలంటూ పిటీషన్ వేశారు. వీటితో పాటు ఆరు పిటీషన్లను విచారించిన దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సంబరాలు: సుప్రీం తీర్పుపై ఢిల్లీ, ముంబై, బెంగళైరు నగరాలు సహా దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఈ తీర్పు కొంచెం ముందువచ్చి వుంటే ఎంతోమంది తమ సన్నిహితులు ప్రాణాలతో ఉండేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. #WATCH People in Mumbai celebrate after Supreme Court decriminalises #Section377 and legalises homosexuality pic.twitter.com/ztI67QwfsT — ANI (@ANI) September 6, 2018 #WATCH Celebrations in Karnataka's Bengaluru after Supreme Court legalises homosexuality. pic.twitter.com/vQHms5C0Yd — ANI (@ANI) September 6, 2018 -
హీరోయిన్‌పై ట్రాన్స్‌జెండర్ మండిపాటు
న్యూయార్క్ : ట్రాన్స్జెండర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హాలివుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్‌పై ట్రాన్స్‌జెండర్, నటి అలెగ్జాండ్రియా బిల్లింగ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల మనోభావాలు కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడి క్షమాపణలు చెబితే సరిపోదని అన్నారు. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటిపై తరచూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసే ప్రముఖులు వారికి చేయూతనందించాలని మాత్రం చూడరని అన్నారు. అసలేం జరిగిందంటే.. ‘ట్రాన్స్పరెంట్’, ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిల్లింగ్స్‌కు ట్రాన్స్‌జెండర్ ‘జీన్ మారీ గిల్’ కథతో రూపొందుతున్న ‘రబ్ అండ్ టగ్’ సినిమాలో లీడ్ రోల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే కొందరు మారీ గిల్ పాత్రపై తీవ్ర విమర్శలు చేయడంతో బిల్లింగ్స్ ఈ సినిమా నుంచి జూలైలో తప్పుకుంది. కాగా, బిల్లింగ్స్ వదులుకున్న అవకాశాన్ని జాన్సన్ దక్కించుకున్నారు. నటి జాన్సన్‌పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన జాన్సన్.. సినిమాల్లో నడిస్తున్న కొందరు ట్రాన్స్జెండర్లు అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటిస్తే తప్పేంటని విమర్శలకు సమాధానిమిచ్చారు. ఈ వ్యాఖ్యలు బిల్లింగ్స్‌ను ఉద్దేశించి ఉండడంతో వివాదం మొదలైంది. 1980లలో మసాజ్ పార్లర్, వ్యభిచార వృత్తి చేసిన ట్రాన్స్‌జెండర్ జీన్ మారీ గిల్ బయటి ప్రపంచానికి పురుషునిగా మాత్రమే పరిచయముండడం విశేషం. -
సెక్షన్-377.. కేంద్రానికి ఎదురుదెబ్బ
న్యాయ చరిత్రలో మరో చారిత్రక అధ్యయం చోటుచేసుకుంది. ఐపీసీలోని వివాదాస్పద సెక్షన్-377పై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. స్వలింగ సంపర్కం నేరం కిందకే వస్తుందంటూ గతంలో(2013) అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సమీక్షించేందుకే మొగ్గు చూపింది. ఈ మేరకు విచారణను వాయిదా వేయాలన్న కేంద్రం వినతిని ధర్మాసనం సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో ఎల్జీబీటీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: సెక్షన్-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను విచారణను వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఆర్ఎఫ్ నారీమన్, వైవీ చంద్రచూడ్, ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి(మాజీ అటార్నీ జనరల్) వాదనలు వినిపించారు. లంచ్ విరామం అనంతరం తిరిగి విచారణ కొనసాగనుంది. ఐపీసీ సెక్షన్ 377... ఈ సెక్షన్ కింద ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్ కింద 'అసహజమైన నేరాల' (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు. 150 ఏళ్లకు పైగా.. 1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్ ‘నేరం కాదని’ తేల్చింది. రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది. అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది. దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు లేవనెత్తుతున్నారు. -
మళ్లీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం...
సాక్షి, న్యూఢిల్లీ: హోమో సెక్సువల్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ( లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిని గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే తదుపరి వాదనల తేదీ ఎప్పుడన్నది బెంచ్ స్పష్టం చేయలేదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై గతంలో చాలా వరకు పిటిషన్లపై తీర్పు పెండింగ్‌లో ఉన్నాయి కూడా. ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిదన్న ఓ అభిప్రాయం వ్యక్తమవుతుండగా.. మరోవైపు అసహజ శృంగారాన్ని ప్రోత్సహించే అంశం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ సెక్షన్ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం. 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయితే 2013, డిసెంబర్ 11న హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేదించింది. తన నిర్ణయాన్ని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్లను 2014, జనవరి 28న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సెక్షన్ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లు కాదంటూ సుప్రీం కోర్టు భాష్యం చెప్పింది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా.. సెక్షన్ 377 జోలికి మాత్రం పోలేదు. -
ఇక ట్రాన్స్‌జెండర్లకూ సమానహక్కులు!
రాజ్యసభ చరిత్రలోనే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా.. ఓ సభ్యుడి ప్రైవేటు బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ట్రాన్స్జెండర్లకు (లింగమార్పిడి చేయించుకున్నవారు) ఇతర పౌరులతో సమానహక్కుల కల్పించాలనే ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇలా ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అత్యంత అరుదైన విషయమని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్ వర్గీయుల కోసం కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. చిట్టచివరి సారిగా ఓ ప్రైవేటు బిల్లు 1970లో ఆమోదం పొందింది. ప్రభుత్వంలో భాగం కాని అంటే.. మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేటు బిల్లు అంటారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లును డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ ప్రవేశపెట్టారు. అందరికీ మానవహక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు కొంతమందిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. -
గే, లెస్బియన్ల సంస్కరణకు కేంద్రాలు!
గోవాలో ఉన్న గే, లెస్బియన్ తదితరులను సంస్కరించి, వారిని సాధారణ వ్యక్తులుగా మార్చేందుకు కొన్ని సంస్కరణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని గోవా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రమేష్ తవాద్కర్ తెలిపారు. అయితే.. ఆయన చెప్పిన ఈ విషయం పెను దుమారాన్ని సృష్టించింది. ఎల్జీబీటీ యువతకు శిక్షణ ఇస్తామని, వారికి చికిత్సలు చేయించి, మందులిచ్చి, వాళ్లను సాధారణ వ్యక్తులుగా మార్చే ప్రయత్నం చేస్తామని రమేష్ అన్నారు. రాష్ట్ర యువజన విధానాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాజా యువజన విధానంలో.. గేలు, లెస్బియన్లు తదితరులను బాల నేరస్థులు, డ్రగ్స్ బానిసల తరహాలో ఒక 'టార్గెట్ గ్రూప్'గా చేర్చారు. ఇది తీవ్ర వివాదానికి కారణమైంది. -
రాష్ట్రంలో 4,433 మంది 'ఇతర' ఓటర్లు!
ఓటర్లుగా నమోదు చేయించుకునేటప్పుడు మీరు పురుషులా.. స్త్రీలా అని అడుగుతారు. రెండూ కానివారు తమకూ ఓటుహక్కు కావాలని ఎన్నాళ్లనుంచో చేసిన పోరాటం ఫలించింది. ఈసారి 'ఇతరులు' అనే విభాగం కింద ఇలాంటి వారిని కూడా ఓటర్లుగా నమోదు చేశారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 4,433 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వారి పేర్లు తుది జాబితాలో కనిపించాయి. ప్రధాన ఎన్నికల అధికారి ప్రచురించిన జాబితాలో ఈ పేర్లున్నాయి. గత సంవత్సరం మార్చి కంటే ఈ సంఖ్య 2,987 ఎక్కువ కావడం గమనార్హం. అంటే, దాదాపు మూడు వేల మంది తాము పురుషులం గానీ, మహిళలం గానీ కాదని చెప్పుకొని తాజాగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నారన్నమాట. లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు తమను ఇతరుల విభాగంలో చేర్చాలని పట్టుబడుతున్నారు. అయితే.. మొత్తమ్మీద ఎల్జీబీటీ కమ్యూనిటీ లెక్కలు చూస్తే వారిలో ఓటర్లుగా నమోదు చేయించుకున్నవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ (ఏపీ శాక్స్) లెక్కల ప్రకారం చూస్తే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 20 వేల మంది లింగమార్పిడి చేయించుకున్నవాళ్లున్నారు. అదే రాష్ట్రం మొత్తమ్మీద అయితే 2.4 లక్షల మంది వరకు ఉన్నారు. జనాభాతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య కాస్త తక్కువే అయినా, గతంతో పోలిస్తే నమోదు గణనీయంగా పెరిగిందని నిపుణులు అంటున్నారు. ఈ వర్గంలో కూడా అవగాహన పెరగడం, తామూ ఓటు వేయాలన్న చైతన్యం రావడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. మగ, ఆడ కాకుండా ఇతరులు అనే విభాగాన్ని 2010లో ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. అప్పటినుంచి క్రమంగా మన రాష్ట్రంలో కూడా ఈ వర్గానికి చెందిన వారు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం పెరుగుతూ వచ్చింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 6,23,88,619 మంది ఓటర్లున్నారు. వారిలో 3,13,56,704 మంది పురుషులు, 3,10,27,482 మంది మహిళలు, 4,433 మంది ఇతరులు ఉన్నారు. వీళ్లంతా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అర్హులు. ఇన్నాళ్లుగా లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు బయటకు చెప్పుకొనేవారు కారని, కానీ ఇప్పుడు ఎల్జీబీటీ వర్గం మొత్తం తమకు ఓ గుర్తింపు కావాలని కోరుకుంటున్నట్లు వివిధ రకాల లైంగిక జీవన శైలులపై పరిశోధన చేస్తున్న చల్లా సుధారాణి తెలిపారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల ఓటర్ ఐడీ కార్డుల్లోనూ తమ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. -
గేల విషయంలో హైకోర్టు తీర్పునే సమర్థిస్తా: రాహుల్
స్వలింగ సంపర్కుల హక్కుల పరిరక్షణ విషయంలో సోనియా గాంధీ, కపిల్ సిబల్ తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత కూడా ముందుకొచ్చాడు. ఇలాంటి విషయాలను వ్యక్తుల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చెప్పాడు. 2009 నాటి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడంపై విలేకరులు ఆయన అభిప్రాయం కోరినప్పుడు ఇలా స్పందించారు. తాను హైకోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తానని, మన దేశంలో అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావల్సినంత ఉందని రాహుల్ అన్నారు. అందువల్ల ఇలాంటి విషయాలను వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవిగా భావించి వారికే వదిలేయాలన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి సెక్షన్ 377ను రద్దు చేయాలని గే హక్కుల కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
మేమూ మనుషులమే.. తేడాగా చూడకండి
-
మేమూ మనుషులమే.. తేడాగా చూడకండి: స్వలింగ సంపర్కులు
'మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తేడాగా ఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2009 జూలై నెలలో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అప్పటి వరకు ఉన్న ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వ వర్గాలతో పాటు అనేక వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సహా అనేక మంది సుప్రీం తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో శాసన వ్యవస్థ, అందునా పార్లమెంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, పరస్పర అంగీకారంతో సాగే స్వలింగ సంపర్కం సహా అన్ని రకాల సంబంధాలను చట్టబద్ధం చేయాలని, వాటికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. చట్టంలో ఎప్పుడూ మార్పులు ఉండాలని, తొలిసారి చట్టం చేసినప్పుడు అప్పటి ఆలోచనా విధానంతో చేస్తారని, ఇప్పుడు దాని ప్రభావం చాలామంది మీద పడుతుందని సిబల్ అన్నారు. సెక్షన్ 377 అనేది 21వ శతాబ్దానికి సరిపోయేది కాదన్నారు. సుప్రీంతీర్పు విషయంలో వెంటనే సరిగా స్పందించాలన్నారు. అటార్నీ జనరల్ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించారని తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఎల్జీబీటీ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు, నిరాశా నిస్పృహలు వెల్లడయ్యాయి. అనేక మంది కోర్టు వద్దే నిరసన వ్యక్తం చేయగా, మరి కొంతమంది దీన్ని మరోసారి కోర్టులో సవాలు చేస్తామన్నారు. ఇంకొందరు ఆ సమాచారాన్ని మిత్రులకు చేరవేసేటప్పుడు కళ్లనీళ్లు కక్కుకున్నారు. వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తేడాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. బాలీవుడ్లో మాత్రం దీన్ని కాస్త విభిన్నంగానే ట్రీట్ చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పు విషయంలో ఎటూ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అధినేత్రి కూడా స్పందించారు కాబట్టి మళ్లీ సెక్షన్ 377ను రద్దు చేయడమో, స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడమో చేస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది!! -
స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయి.. వాటిని కాపాడాలి: సోనియా
స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. వారి హక్కులపై ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఎల్జీబీటీల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు, పౌరుల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని సోనియా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్లమెంటు ఇప్పటికైనా స్పందించి, పౌరుల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో, గే హక్కుల మీద కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా స్పందించారు. ఆయన కూడా దాదాపు సోనియాగాంధీ వెల్లడించిన అభిప్రాయాలనే తెలిపారు. స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని నిర్ణయించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని సిబల్ అన్నారు. పరస్పర అంగీకారం ఉన్న అన్ని రకాల సంబంధాలనూ నేర రహితం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.