Kangana Ranaut Supports Same-Sex Marriage in India - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: అది వారి హృదయాలకు సంబంధించిన అంశం : కంగనా

Published Mon, May 1 2023 3:37 PM | Last Updated on Mon, May 1 2023 4:18 PM

Kangana Ranaut supports same-sex marriage in India - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్‌లోనూ నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ సరసన ఏక్‌ నిరంజన్‌ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రముఖి-2, ఎమర్జెన్సీ చిత్రాల్లో నటిస్తోంది.

అయితే తాజాగా ఆమె స్వలింగ వివాహాలపై స్పందించారు. భారత్‌లో ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించే విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల హరిద్వార్‌లో ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ విషయంలో తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు. 

(ఇది చదవండి: క్షమాపణలు కోరిన బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌)

కంగనా మాట్లాడుతూ 'పెళ్లి అనేది రెండు హృదయాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మనందరికీ తెలుసు. వారి హృదయాలు కలిసినప్పుడు.. వారి అభిప్రాయాల గురించి మనం ఏమి చెప్పగలం.' అని అన్నారు. అయితే కంగనా స్వలింగ వివాహాలకు మద్దతు పలకడంపై నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

(ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్‌ తల్లి)

బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే ఇలా బహిరంగంగా మద్దతిస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు రాస్తూ 'నేను ఆమెకు అభిమానిని కాదు.. అయినా ఆమెను గౌరవిస్తున్నా' ఇలాంటి విషయాల్లో మద్దతు పలికిన అతికొద్ది ప్రముఖుల్లో ఆమె ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ సున్నితమైన అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement