Kangana Ranaut Finally Getting Married?, Wedding Invites Video Viral - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: పెళ్లికి ఆహ్వానించినా కంగనా రనౌత్.. వీడియో వైరల్!

Published Tue, Jun 13 2023 7:51 PM | Last Updated on Tue, Jun 13 2023 8:06 PM

Kangana Ranaut Finally Getting Married Wedding Invites Video Viral - Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోన్న బాలీవుడ్ భామ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసే కంగనా బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఆ వీడియో చూస్తే కంగనా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!)

కారులో వచ్చిన కంగనాను మీడియా ప్రతినిధులంతా చుట్టుముట్టి ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు. దీంతో వెంటనే స్పందించిన కంగనా వెడ్డింగ్ కార్డు చూపిస్తూ వారికి శుభవార్త చెప్పింది. మీరందరూ కూడా పెళ్లికి హాజరు కావాలని వారిని ఆహ్వానించింది. అయితే వెడ్డింగ్ కార్డులో ఆమె పేరు లేకపోవడంతో వారంతా షాక్‌ తిన్నారు. దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

అయితే ఇదంతా కంగనా నిర్మిస్తున్నా చిత్రం 'టిక్కు అండ్ షేరు' మూవీ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. తొలిసారిగా కంగనా ప్రొడక్షన్ సంస్థ  మణికర్ణిక ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి కబీర్‌ శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ ఈనెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

( ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్‌.. మెగా ఫ్యామిలీ గ్రీన్‌ సిగ్నల్‌!)


    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement