మీరు వధువుగా ఎప్పుడు కనిపిస్తారు?.. శ్రద్ధాకపూర్ సమాధానం ఇదే! | Shraddha Kapoor To Marry Boyfriend Boyfriend Rahul Mody Soon | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: మీరు పెళ్లికూతురు ఎప్పుడవుతున్నారు?.. శ్రద్ధా అదిరిపోయే ఆన్సర్!

Jul 18 2024 6:30 PM | Updated on Jul 18 2024 7:19 PM

Shraddha Kapoor To Marry Boyfriend Boyfriend Rahul Mody Soon

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం స్త్రీ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2018లో వచ్చిన హిట్‌ మూవీ ‘స్త్రీ’కి సీక్వెల్‌గా ఈ మూవీని తీసుకొస్తున్నారు. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో తమన్నా ప్రత్యేక గీతంతో అలరించనున్నారు. తాజాగా ఈ  సినిమా ట్రైలర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి శ్రద్ధాకపూర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలీవుడ్‌ భామకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అని ఓ రిపోర్టర్ అడిగారు. దీనికి సమాధానంగా తనదైన శైలిలో స్పందించింది. ఒక స్త్రీ.. తనకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెళ్లి చేసుకుంటుందని నవ్వుతూ ఆన్సరిచ్చింది. కాగా.. గతంలో శ్రద్ధా కపూర్‌.. బాలీవుడ్ స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

దీంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. వీరిద్దరికి తూ ఝూతీ మైన్ మక్కార్ మూవీ సెట్స్‌లో పరిచయమైంది. గతంలో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్‌కు జంటగా హాజరై సందడి చేశారు. కాగా.. శ్రద్ధా కపూర్‌ నటించిన స్త్రీ-2 ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement