ప్రముఖ బాలీవుడ్ నటుడు అడార్ జైన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్న నాటి స్నేహితురాలు అలేఖ అద్వానీని ఆయన పెళ్లాడారు. గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు సందడి చేశారు. వారం రోజు క్రితమే వీరి పెళ్లి వేడుక జరగగా.. తాజాగా నటుడు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా.. అడార్ జైన్ ప్రముఖ సీనియర్ నటుడు రాజ్ కపూర్ మనవడు. రాజ్ కపూర్ కుమార్తె రీమా కపూర్ కుమారుడు. వీరంతా బాలీవుడ్ సినీ తారలైన రణ్ బీర్ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లకు బంధువులే. అయితే వీళ్లెవరూ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ గత సంవత్సరం ముంబయిలోని ఆదర్ నివాసంలో జరిగిన రోకా వేడుకలో మాత్రం పాల్గొన్నారు. రోకా వేడుకకు అలియా భట్, నీతు కపూర్ కూడా హాజరయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆదర్ జైన్- అలేఖా అద్వానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కొత్త ఏడాదిలో మూడుముళ్లబంధంలోకి అడుగుపెట్టారు.
తారా సుతారియాలో డేటింగ్..
అంతతముందు అడార్ జైన్ కొన్నేళ్ల పాటు బాలీవుడ్ భామ తారా సుతారియాతో డేటింగ్‌లో ఉన్నారు. కొన్నేళ్ల పాటు వీరిద్దరు పలు ఈవెంట్లతో సందడి చేశారు. 2020లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత 2023లో ఈ జంట విడిపోయారు. కాగా.. 2017లో ఖైదీ బ్యాండ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అడార్ జైన్.. చివరిసారిగా హలో చార్లీ చిత్రంలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment