దక్షిణాది నిర్మాతతో పెళ్లి.. ఆ సమస్య రాలేదన్న లాల్‌ సింగ్ చద్దా నటి! | Mona Singh Comments On Marrying South Indian Husband Shyam Rajagopalan, Deets Inside | Sakshi
Sakshi News home page

Mona Singh: అతన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం: మోనా సింగ్

Published Sun, Jul 21 2024 6:35 PM | Last Updated on Mon, Jul 22 2024 10:38 AM

Mona Singh On Marrying South Indian Husband Shyam Rajagopalan

లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి మోనా సింగ్.  జస్సీ జైస్సీ కోయి నహిన్ అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న భామ పలు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇటీవల ముంజియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మోనా సింగ్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.

బాలీవుడ్ సినిమాలతో అలరించిన మోనా సింగ్.. దక్షిణాదికి చెందిన ప్రముఖ చిత్రనిర్మాత, కోలీవుడ్‌కు చెందిన శ్యామ్ రాజగోపాలన్‌ను  వివాహం చేసుకుంది. వీరిద్దరు డిసెంబర్ 27, 2019న ముంబయిలో సాంప్రదాయ సిక్కు వేడుకతో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తాజా ఇంటర్వ్యూలో మీకు మీ భర్త భాష నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. 

దీనిపై ఆమె మాట్లాడుతూ..'నాకు తమిళం కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. నా భర్త శ్యామ్ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయనను పెళ్లి చేసుకున్నందుకు నా ఫ్రెండ్స్‌ చాలా సంతోషించారు. మీ ఇంట్లో సౌత్‌ఇండియా ఫుడ్‌ బాగా దొరుకుతుందని ఆనందపడేవారు. బహుశా నేను అతన్ని తప్ప మరో నటుడిని చేసుకుని ఉంటే భరించలేకపోయేదాన్ని. మేము  చాలా సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం ఓకే ఇండస్ట్రీ వాళ్లం కావడం నాకు చాలా నచ్చింది. అంతే కాకుండా ఆయన నిర్మాత, దర్శకత్వం మాత్రమే కాదు. థియేటర్‌ను కూడా నిర్వహిస్తాడు. నేను ఎక్కడైనా ఆగిపోతే నాకు అండగా నిలుస్తాడు.' అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల మోనా సింగ్‌ నటించిన ముంజియా చిత్రం సక్సెస్‌ వైపు దూసుకెళ్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement