
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్‌లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.
అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్‌కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్‌పేపర్‌గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది.