ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తనయుడి పెళ్లి ముంబయిలో గ్రాండ్‌గా జరిగింది. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీతారలు హాజరై సందడి చేశారు. నగరంలోని జియో వరల్డ్ కన్వెన్ష్‌న్ సెంటర్‌లో అత్యంత వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, మహేశ్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.
అయితే కొందరు సినీతారలు ఈ పెళ్లి దూరంగా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ఒకరు. తాజా ఇంటర్వ్యూలో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. వివాహానికి ఎందుకు హాజరు కాలేదో కారణాలను వెల్లడించింది. తనకు అంబానీ కుటుంబంతో ఎలాంటి రిలేషన్ లేదని తాప్సీ తెలిపింది. ఎవరి పెళ్లికైనా అతిథులతో కమ్యూనికేషన్ ఉంటేనే వెళ్లేందుకు ఇష్టపడతానని ఆమె పేర్కొంది. నాకు వ్యక్తిగతంగా వారితో ఎలాంటి పరిచయం లేదన్నారు. పెళ్లి అనేది పూర్తిగా వారి వ్యక్తిగతమని తాప్సీ వెల్లడించింది. కాగా.. తాప్సీతో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి సెలబ్రిటీలు అంబానీ పెళ్లికి హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment