mona singh
-
దక్షిణాది నిర్మాతతో పెళ్లి.. ఆ సమస్య రాలేదన్న లాల్ సింగ్ చద్దా నటి!
లాల్ సింగ్ చద్దా, అమావాస్, 3 ఇడియట్స్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి మోనా సింగ్. జస్సీ జైస్సీ కోయి నహిన్ అనే సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న భామ పలు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ఇటీవల ముంజియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మోనా సింగ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.బాలీవుడ్ సినిమాలతో అలరించిన మోనా సింగ్.. దక్షిణాదికి చెందిన ప్రముఖ చిత్రనిర్మాత, కోలీవుడ్‌కు చెందిన శ్యామ్ రాజగోపాలన్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరు డిసెంబర్ 27, 2019న ముంబయిలో సాంప్రదాయ సిక్కు వేడుకతో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. తాజా ఇంటర్వ్యూలో మీకు మీ భర్త భాష నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ..'నాకు తమిళం కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. నా భర్త శ్యామ్ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయనను పెళ్లి చేసుకున్నందుకు నా ఫ్రెండ్స్ చాలా సంతోషించారు. మీ ఇంట్లో సౌత్ఇండియా ఫుడ్ బాగా దొరుకుతుందని ఆనందపడేవారు. బహుశా నేను అతన్ని తప్ప మరో నటుడిని చేసుకుని ఉంటే భరించలేకపోయేదాన్ని. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేమిద్దరం ఓకే ఇండస్ట్రీ వాళ్లం కావడం నాకు చాలా నచ్చింది. అంతే కాకుండా ఆయన నిర్మాత, దర్శకత్వం మాత్రమే కాదు. థియేటర్‌ను కూడా నిర్వహిస్తాడు. నేను ఎక్కడైనా ఆగిపోతే నాకు అండగా నిలుస్తాడు.' అంటూ తన భర్తపై ప్రశంసలు కురిపించింది. ఇటీవల మోనా సింగ్ నటించిన ముంజియా చిత్రం సక్సెస్ వైపు దూసుకెళ్తోంది. -
అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్.. ఎందుకంటే?: నటుడు
ఒకప్పుడు మోనా సింగ్, కరణ్ ఒబెరాయ్ ప్రేమికులు. కల్మషం లేని నవ్వు చూసి కరణ్ ఫిదా అయ్యాడు. దేనికైనా బిందాస్‌గా వ్యవహరించే తన వైఖరి చూసి ఆశ్చర్యపోయాడు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు ముగ్ధుడయ్యాడు. గుండెలో పెట్టి చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. అంతే నిష్కల్మమైన నవ్వుతో నో చెప్పేసరికి కుంగిపోయాడు.ఆ సీరియల్ టైంలో..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు కరణ్. అతడు మాట్లాడుతూ.. జెస్సీ జైసీ కోయ్ నహీ సీరియల్ సెట్లో మా మధ్య ప్రేమ మొదలైంది. ఒక మనిషితో ఎక్కువసేపు కలిసుంటే మనకు తెలియకుండానే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. మోనా మంచి యాక్టర్. తను చాలా సరదాగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఇంక ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను? ఎప్పుడూ బిందాస్‌గా ఉండేది. చాలాకాలం వరకు మేము బాగానే ఉన్నాను. అలా అని విడిపోయాక మేమేమీ శత్రువులమైపోలేదు.అర్థం చేసుకోలేకపోయా..అప్పట్లో తనొక సెన్సేషన్. అప్పుడప్పుడే కెరీర్లో ఎదుగుతోంది. ఆ సమయంలో నేను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాను. కుదరదని చెప్పింది. తనెందుకు రిజెక్ట్ చేసిందో అప్పుడర్థం చేసుకోలేకపోయాను.. కానీ తర్వాత తెలిసొచ్చింది. ఆమె కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంది. అందులో తప్పేం లేదు కదా! ఆ వయసులో అంత లోతుగా ఆలోచించేవాళ్లం కాదు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. సినిమాకాగా అప్పట్లో మోనా.. క్యా హువా తేరా వాద, ఇత్నా కరోనా ముజే ప్యార్, ప్యార్ కో హో జానే దో, కవచ్.. కాలి శక్తియోన్ సే.. వంటి సీరియల్స్‌లో నటించింది. 3 ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఇటీవలే విడుదలైన హారర్ కామెడీ ముంజ్యాలోనూ మెప్పించింది. 40 ఏళ్ల వయసు పైబడినా అటు కరణ్- ఇటు మోనా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.చదవండి: నటుడు పృథ్వీకి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ.. -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
ప్రముఖ బాలీవుడ్ నటి మోనా సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. త్రీ ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో మోనా సింగ్ నటించింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా.. ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2లో మోనా సింగ్ కనిపించింది. బాలీవుడ్లో సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భామ సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఆమె కొనుగోలు చేసి కారు విలువ దాదాపు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ స్టార్ హీరోను గట్టిగా లాగిపెట్టి కొట్టా.. అందరూ షాక్..: నటి
బాలీవుడ్ నటి మోనా సింగ్.. 3 ఇడియట్స్ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమెపై ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు హీరో ఆమిర్ ఖాన్.. వీడియో కాల్లో ప్రియురాలు ఇచ్చే సలహాలతో డెలివరీ చేస్తాడు. ఈ సీన్ సినిమాలో విపరీతంగా పండింది. తాజాగా ఈ సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది మోనా సింగ్. హీరోనే కొట్టమన్నాడు.. '3 ఇడియట్స్‌లో నేను పురిటి నొప్పులతో టేబుల్‌పై పడుకుని అల్లాడిపోయే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు అందరూ వారివారి అనుభవాలను చెప్పారు. నా భార్య ఇలా చేసింది.. అని చెప్పుకుంటూ పోతున్నారు. రాజ్‌కుమార్ హిరానీ సర్ అయితే తన భార్య తన్నిందని చెప్పాడు. మాధవన్ తన భార్య కొరికిందన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండని అడిగాను. అందుకు ఆమిర్ సర్.. మోనా, నువ్వు నన్ను కొట్టు అన్నాడు. సరేనని, చెంప మీద కొట్టాను. యాక్టింగ్‌లో లీనమైపోయాడు.. కానీ అతడు గట్టిగా కొట్టమని హెచ్చరించాడు. నేను నా బలం కూడదీసుకుని లాగిపెట్టి కొట్టాను. దీంతో ఆయన బాడీగార్డ్ షాకై నన్ను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమిర్ సర్ మాత్రం తన యాక్టింగ్‌లో లీనమైపోయాడు. ఆ సన్నివేశం చాలా సహజంగా రావాలనుకున్నాడు, అనుకున్నట్లుగానే అంతే సహజంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన స్టార్స్ మాతో పాటు రిహార్సల్స్ చేసేవారు. స్టార్స్‌లా ఫీలయ్యేవారే కాదు' అని చెప్పుకొచ్చింది మోనా. ఈ సినిమా సంచలన విజయంతో పాటు మూడు జాతీయ అవార్డులు సాధించింది. చదవండి: ప్రముఖ నటి కన్నుమూత... బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో -
లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి
బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయింది నటి మోనా సింగ్. 'జెస్సీ జైస్సీ కోయ్ నహీ' అనే సీరియల్‌తో క్లిక్ అయిన మోనా ఎక్కువగా రియాలిటీ షోలలో మెరిసింది. గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమా చేసిన ఈ నటి ఇటీవల 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది. కఫాస్ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మోనా సింగ్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డాను. సీరియల్స్‌లో నటించే సమయంలోనే వేధింపులను ఎదుర్కొన్నాను. అప్పుడు నేను ఆడిషన్స్ కోసం పుణె నుంచి ముంబై వచ్చేదాన్ని. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను కలిశాను. వాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు, నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది, కొన్నిసార్లు భయమేసేది కూడా! ఆడవాళ్లు ఎంత అమాయకులైనా, బలహీనులైనా.. అక్కడేం జరుగుతుందనేది ముందే పసిగట్టగలరు. మా అంచనా తప్పు కాదు! కొన్నిసార్లు వాళ్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే.. వీళ్లబారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా.. అని భయంతో వణికిపోయేదాన్ని. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అని ఈ సంఘటనల వల్ల మనం నిరాశకు లోనై వెనకడుగు వేయకూడదు, అనుకున్నది సాధించాలి. నేనూ అదే చేశాను. ప్రయత్నం విరమించకుండా నా కల సాకారం చేసుకున్నాను. ఇప్పటికీ ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది మోనా సింగ్. View this post on Instagram A post shared by Mona Singh (@monajsingh) చదవండి: బ్రెయిన్ స్ట్రోక్.. మాట పడిపోవడంతో ఇంటికే పరిమితం.. స్టార్ హీరో చెప్పిన అనుభవాలు బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్ -
ఘనంగా నటి మోనా సింగ్ వివాహం
ముంబై: టీవీ నటి మోనా సింగ్ (38) తన చిరకాల స్నేహితుడైన శ్యామ్ గోపాలన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు. దక్షిణాదికి చెందిన బ్యాంకర్ శ్యామ్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకకు గౌరవ్ గేరా, మిక్కీ దుడానీ హాజరయ్యారు. ఇక మోనా సింగ్ ఎరుపు రంగు లెహంగాతో పెళ్లిదుస్తుల్లో మెరిసిపోయారు. డీజే పాటలకు ఆమె నటి రక్షందా ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఇటీవల మోనా సింగ్ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amandeep Singh Narang (@narangamandeepsingh) on Dec 27, 2019 at 12:50am PST కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మోనా సింగ్.. త్రీ ఇడియట్స్ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ సోదరిగా నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం అమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. జెస్సీ జైసీ కోయి నహీ అనే సీరియల్‌తో బుల్లితెర తెరంగ్రేటం చేసిన మోనా.. ఆ తర్వాత రాధా కీ బెటియా కుచ్ కర్సక్తీ హై, క్యా హువా తేరా వాదా, ఇత్నా కరో నా ముజ్హే ప్యార్, ప్యార్ కో హో జానేదో, కవచ్.. కాలీ శక్తియోసే అనే కొన్ని ప్రముఖ సీరియల్స్‌తో పాటు పలు వెబ్ సిరీస్, రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. View this post on Instagram Here are some inside videos of the newly-wed couple, Mona Singh and Shyam😍❤ What do you think of the bride's twirl?😍 @pinkvillatelly❤ . . . . . #monasingh #shyam #wedding #marriage #gorgeous #bride #groom #husband #wife #actor #celebs #celebrities #stars #actress #beautiful #lehenga #twirling #pinkvilla #pinkvillatelly A post shared by Pinkvilla Telly (@pinkvillatelly) on Dec 27, 2019 at 3:10am PST -
స్నేహితుడిని పెళ్లాడనున్న నటి
ముంబై: టీవీ నటి మోనా సింగ్ శుక్రవారం పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తన చిరకాల స్నేహితుడు శ్యామ్‌ను ఆమె వివాహమాడనున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మోనా సింగ్ మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మోనా స్నేహితులు గౌరవ్ గేరా, ఆశిష్ కపూర్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో పింక్ కుర్తా ధరించి.. చేతులకు మెహందీతో... కాబోయే భర్తతో ఫొటోలకు ఫోజిచ్చిన మోనా సింగ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మోనా సింగ్(38).. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ అక్కగా నటించి గుర్తింపు పొందారు. బుల్లితెర, వెండితెరతో పాటు నాటకరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇక దక్షిణ భారతదేశానికి చెందిన బ్యాంకర్ శ్యామ్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె.. డిసెంబరు 27న అతడిని పెళ్లిచేసుకోనున్నారు. అయితే కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాగా పెళ్లి తర్వాత కూడా మోనా కెరీర్‌ను కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్- కరీనా కపూర్ల చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. View this post on Instagram Mona ki Mehndi 🥰 #monakishadi A post shared by Gaurav gera (@gauravgera) on Dec 26, 2019 at 12:27am PST -
సోనమ్.. ద హంగ్రీ యంగ్ ఉమన్
బాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మెన్ గురించి జనాలకు తెలుసు. అయితే, సోనమ్ కపూర్ తనకు తానే ‘హంగ్రీ యంగ్ ఉమన్’గా చెప్పుకుంటోంది. ఆకలి వేయనంత వరకే తాను స్థిమితంగా ఉంటానని, ‘ఆకలేస్తే నేను నాలా ఉండను’ అంటోంది. ‘స్నికర్స్’ చాక్లెట్స్కు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్న సోనమ్, అపరిమితంగా చాక్లెట్లు సరఫరా చేస్తామని చెప్పడంతోనే ఈ కంపెనీ చాక్లెట్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పుకున్నానని మీడియాకు అసలు సంగతి చెప్పేసింది. రంగస్థలంపై మోనా చూపు బాలీవుడ్ భామలంతా సినీ అవకాశాల కోసం పోటాపోటీ ప్రయత్నాలు చేస్తుంటే, మోనా సింగ్ మాత్రం తన రూటే సెపరేటు అంటోంది. బుల్లితెరతో ప్రారంభించి, ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తున్న మోనా, తాజాగా ‘జెడ్ ప్లస్’లో నటిస్తోంది. ఇక రంగస్థలంపై తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నానని ఆమె చెబుతోంది. ‘జెడ్ ప్లస్’లో నటిస్తున్న ముకేశ్ తివారీ, అదిల్ హుస్సేన్, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి వారంతా రంగస్థలం నుంచే వచ్చారని, వారి స్ఫూర్తితోనే ఒక నాటకంలో నటించాలనుకుంటున్నానంది. ‘విరాసత్’ నటి అమెరికాలో డీజే విరాసత్, హసీనా మాన్ జాయేగీ వంటి సినిమాల్లో నటించిన పూజా బత్రా ఇప్పుడు అమెరికాలో స్థిరపడి, అక్కడ డీజే అవతారమెత్తింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజెల్స్‌లో ఉంటోంది. అమెరికాలో ఉంటున్న భారతీయుల కోసం సొంతంగా బాలీవుడ్ మ్యూజిక్ రేడియో స్టేషన్ ప్రారంభించి, దాని ద్వారా శ్రోతలను డీజేగా అలరిస్తోంది. ఇక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్లే బాలీవుడ్ నటీనటులను ఆహ్వానిస్తూ, వారిని డీజేలుగా పెట్టి కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. -
ప్రతిసారీ గర్భవతిని కాలేను: మోనా సింగ్
త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుందా? అందులో కరీనా కపూర్ అక్కగా నటించిన మోనాసింగ్ పాత్ర సినిమాకు చాలా కీలకం. అందులోనూ ఆమె బిడ్డను కనే సన్నివేశాన్ని దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ చాలా అద్భుతంగా తీశారు. 2009లో వచ్చిన ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్‌గా నిలిచింది. రెండేళ్ల తర్వాత మోనాసింగ్ మళ్లీ వెండితెర మీదకు వస్తోంది. ఈసారి ఆదిల్ హుస్సేన్ భార్యగా ఆమె నటిస్తోంది. అయితే.. త్రీ ఇడియట్స్ లాంటి హిట్ సినిమాలో చేసినా.. రెండేళ్ల పాటు వెండితెరకు ఎందుకు దూరంగా ఉన్నారంటే.. ఈ మధ్యలో కూడా తనకు పాత్రలు వచ్చాయి గానీ, వాటిలో చాలావరకు గర్భిణి పాత్రలే వచ్చాయని తెలిపింది. అన్ని సినిమాల్లోనూ తాను గర్భిణి పాత్రలు పోషించలేను కదా అని ప్రశ్నించింది. మిగిలిన వాళ్లలా తాను బుల్లితెరను వదిలిపెట్టబోనని, అటు టీవీ సీరియళ్లు, ఇటు సినిమాలు రెండూ చేస్తానని మోనాసింగ్ చెప్పింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మంచి పాత్ర లభించడంతో మళ్లీ వెండితెరమీదకు వస్తున్నట్లు తెలిపింది.