ముంబై: టీవీ నటి మోనా సింగ్ శుక్రవారం పెళ్లిపీటలు ఎక్కనున్నారు. తన చిరకాల స్నేహితుడు శ్యామ్‌ను ఆమె వివాహమాడనున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన మోనా సింగ్ మెహందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మోనా స్నేహితులు గౌరవ్ గేరా, ఆశిష్ కపూర్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన వీడియోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో పింక్ కుర్తా ధరించి.. చేతులకు మెహందీతో... కాబోయే భర్తతో ఫొటోలకు ఫోజిచ్చిన మోనా సింగ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మోనా సింగ్(38).. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ అక్కగా నటించి గుర్తింపు పొందారు. బుల్లితెర, వెండితెరతో పాటు నాటకరంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇక దక్షిణ భారతదేశానికి చెందిన బ్యాంకర్ శ్యామ్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె.. డిసెంబరు 27న అతడిని పెళ్లిచేసుకోనున్నారు. అయితే కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాగా పెళ్లి తర్వాత కూడా మోనా కెరీర్‌ను కొనసాగించనున్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్- కరీనా కపూర్‌ల చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఆమె నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment