
ప్రముఖ బాలీవుడ్ నటి మోనా సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. త్రీ ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లో మోనా సింగ్ నటించింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా.. ఇటీవలే మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2లో మోనా సింగ్ కనిపించింది. బాలీవుడ్‌లో సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భామ సినిమాల్లోనూ ఛాన్సులు కొట్టేసింది. ఆమె కొనుగోలు చేసి కారు విలువ దాదాపు కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment