అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్‌.. ఎందుకంటే?: నటుడు | Karan Oberoi Reveals Reason Behind Why Mona Singh Rejected His Marriage Proposal, Deets Inside | Sakshi
Sakshi News home page

నటితో బ్రేకప్‌.. కారణం బయటపెట్టిన నటుడు.. పెళ్లికి ఎందుకు నో చెప్పిందంటే?

Jun 13 2024 1:42 PM | Updated on Jun 13 2024 2:41 PM

Karan Oberoi Reveals Reason why Mona Singh Rejected His Marriage Proposal

మోనా మంచి యాక్టర్‌. తను చాలా సరదాగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఇంక ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను? ఎ

ఒకప్పుడు మోనా సింగ్‌, కరణ్‌ ఒబెరాయ్‌ ప్రేమికులు. కల్మషం లేని నవ్వు చూసి కరణ్‌ ఫిదా అయ్యాడు. దేనికైనా బిందాస్‌గా వ్యవహరించే తన వైఖరి చూసి ఆశ్చర్యపోయాడు. తన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు ముగ్ధుడయ్యాడు. గుండెలో పెట్టి చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్‌ చేశాడు. అంతే నిష్కల్మమైన నవ్వుతో నో చెప్పేసరికి కుంగిపోయాడు.

ఆ సీరియల్‌ టైంలో..
తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు కరణ్‌. అతడు మాట్లాడుతూ.. జెస్సీ జైసీ కోయ్‌ నహీ సీరియల్‌ సెట్‌లో మా మధ్య ప్రేమ మొదలైంది. ఒక మనిషితో ఎక్కువసేపు కలిసుంటే మనకు తెలియకుండానే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. మోనా మంచి యాక్టర్‌. తను చాలా సరదాగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఇంక ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను? ఎప్పుడూ బిందాస్‌గా ఉండేది. చాలాకాలం వరకు మేము బాగానే ఉన్నాను. అలా అని విడిపోయాక మేమేమీ శత్రువులమైపోలేదు.

అర్థం చేసుకోలేకపోయా..
అప్పట్లో తనొక సెన్సేషన్‌. అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతోంది. ఆ సమయంలో నేను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాను. కుదరదని చెప్పింది. తనెందుకు రిజెక్ట్‌ చేసిందో అప్పుడర్థం చేసుకోలేకపోయాను.. కానీ తర్వాత తెలిసొచ్చింది. ఆమె కెరీర్‌పై ఫోకస్‌ చేయాలనుకుంది. అందులో తప్పేం లేదు కదా! ఆ వయసులో అంత లోతుగా ఆలోచించేవాళ్లం కాదు అని చెప్పుకొచ్చాడు.

సీరియల్స్‌.. సినిమా
కాగా అప్పట్లో మోనా.. క్యా హువా తేరా వాద, ఇత్నా కరోనా ముజే ప్యార్‌, ప్యార్‌ కో హో జానే దో, కవచ్‌.. కాలి శక్తియోన్‌ సే.. వంటి సీరియల్స్‌లో నటించింది. 3 ఇడియట్స్‌, లాల్‌ సింగ్‌ చద్దా వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఇటీవలే విడుదలైన హారర్‌ కామెడీ ముంజ్యాలోనూ మెప్పించింది. 40 ఏళ్ల వయసు పైబడినా అటు కరణ్‌- ఇటు మోనా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.

చదవండి: నటుడు పృథ్వీకి బిగ్‌ షాక్‌.. అరెస్ట్ వారెంట్‌ జారీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement