Karan Oberoi
-
అది చూసే ప్రేమలో పడ్డా.. పెళ్లనగానే రిజెక్ట్.. ఎందుకంటే?: నటుడు
ఒకప్పుడు మోనా సింగ్, కరణ్ ఒబెరాయ్ ప్రేమికులు. కల్మషం లేని నవ్వు చూసి కరణ్ ఫిదా అయ్యాడు. దేనికైనా బిందాస్‌గా వ్యవహరించే తన వైఖరి చూసి ఆశ్చర్యపోయాడు. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు ముగ్ధుడయ్యాడు. గుండెలో పెట్టి చూసుకుంటాను, పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. అంతే నిష్కల్మమైన నవ్వుతో నో చెప్పేసరికి కుంగిపోయాడు.ఆ సీరియల్ టైంలో..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు కరణ్. అతడు మాట్లాడుతూ.. జెస్సీ జైసీ కోయ్ నహీ సీరియల్ సెట్లో మా మధ్య ప్రేమ మొదలైంది. ఒక మనిషితో ఎక్కువసేపు కలిసుంటే మనకు తెలియకుండానే ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. మోనా మంచి యాక్టర్. తను చాలా సరదాగా ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేది. అది నాకు బాగా నచ్చేది. ఇంక ప్రేమలో పడకుండా ఎలా ఉంటాను? ఎప్పుడూ బిందాస్‌గా ఉండేది. చాలాకాలం వరకు మేము బాగానే ఉన్నాను. అలా అని విడిపోయాక మేమేమీ శత్రువులమైపోలేదు.అర్థం చేసుకోలేకపోయా..అప్పట్లో తనొక సెన్సేషన్. అప్పుడప్పుడే కెరీర్లో ఎదుగుతోంది. ఆ సమయంలో నేను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాను. కుదరదని చెప్పింది. తనెందుకు రిజెక్ట్ చేసిందో అప్పుడర్థం చేసుకోలేకపోయాను.. కానీ తర్వాత తెలిసొచ్చింది. ఆమె కెరీర్‌పై ఫోకస్ చేయాలనుకుంది. అందులో తప్పేం లేదు కదా! ఆ వయసులో అంత లోతుగా ఆలోచించేవాళ్లం కాదు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. సినిమాకాగా అప్పట్లో మోనా.. క్యా హువా తేరా వాద, ఇత్నా కరోనా ముజే ప్యార్, ప్యార్ కో హో జానే దో, కవచ్.. కాలి శక్తియోన్ సే.. వంటి సీరియల్స్‌లో నటించింది. 3 ఇడియట్స్, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఇటీవలే విడుదలైన హారర్ కామెడీ ముంజ్యాలోనూ మెప్పించింది. 40 ఏళ్ల వయసు పైబడినా అటు కరణ్- ఇటు మోనా.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం.చదవండి: నటుడు పృథ్వీకి బిగ్ షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ.. -
‘ఆ నటుడిపై లైంగిక దాడి కేసు బూటకం’
సాక్షి, ముంబై : ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్‌ను నటి పూజా బేడీ సమర్ధించారు. ఒబెరాయ్‌పై అక్రమంగా లైంగిక దాడి కేసు నమోదు చేశారని, ఇది పూర్తిగా నకిలీ కేసని ఆమె వ్యాఖ్యానించారు. కాగా కరణ్ ఒబెరాయ్‌ను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. కోర్టు నిర్ణయాన్ని కరణ్ క్లోజ్ ఫ్రెండ్ పూజా బేడీ స్వాగతిస్తూ తాము ఇప్పుడు బెయిల్ కోసం అప్పీల్ చేస్తామని చెప్పారు. నిరాధార ఆరోపణతో కరణ్ ఒబెరాయ్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కాగా పలు టీవీ సీరియల్స్‌లో నటించిన కరణ్‌ను ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కరణ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తన అభ్యంతరకర వీడియోలను బహిర్గతం చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని 2016 నుంచి అతనితో సన్నిహితంగా ఉంటున్న మహిళ ఈ ఫిర్యాదు చేశారు. -
కోర్టులో ఏడ్చేసిన నటుడు
ముంబై : ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ కోర్టులో ఏడ్చేశాడు. రేప్ కేసులో ఒషివొరా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు ఈనెల 9 వరకు కస్టడీ విధించింది. కోర్టు ప్రొసిడింగ్స్ జరుగుతుండగా కరణ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచించాడని అతడి ప్రియురాలు ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు సోమవారం కరణ్‌ను అరెస్ట్ చేశారు. యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించినట్టు అతడిపై కేసు నమోదైంది. డేటింగ్ యాప్‌లో తమకు పరిచయమైన కరణ్‌తో 2016 నుంచి తాము రిలేషన్షిప్లో ఉన్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనను రేప్ చేశాడని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఒషివొరా పోలీస్ స్టేషన్లో అతడిపై ఐపీసీ 376(రేప్), 384 (దోపిడీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని 2018, అక్టోబర్‌లో మొదటిసారి కరణ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. మానసికంగా తనను వేధిస్తోందని ఆమెపై కరణ్ కూడా కేసు పెట్టాడు. మహేష్ భట్ టీవీ షో స్వాభిమాన్’తో కెరీర్ మొదలుపెట్టిన కరణ్ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి పాపులరయ్యాడు. -
రేప్ కేసులో నటుడు అరెస్ట్
ముంబై : ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్‌ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రేప్ కేసుతో సంబంధం ఉన్నట్టు కరణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.