ముంబై : ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ కోర్టులో ఏడ్చేశాడు. రేప్ కేసులో ఒషివొరా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు ఈనెల 9 వరకు కస్టడీ విధించింది. కోర్టు ప్రొసిడింగ్స్ జరుగుతుండగా కరణ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచించాడని అతడి ప్రియురాలు ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు సోమవారం కరణ్‌ను అరెస్ట్ చేశారు. యువతిని లైంగికంగా వేధించడమే కాకుండా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించినట్టు అతడిపై కేసు నమోదైంది.
డేటింగ్ యాప్‌లో తమకు పరిచయమైన కరణ్‌తో 2016 నుంచి తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనను రేప్ చేశాడని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఒషివొరా పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఐపీసీ 376(రేప్), 384 (దోపిడీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నాడని 2018, అక్టోబర్‌లో మొదటిసారి కరణ్‌పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. మానసికంగా తనను వేధిస్తోందని ఆమెపై కరణ్ కూడా కేసు పెట్టాడు. మహేష్ భట్ టీవీ షో స్వాభిమాన్’తో కెరీర్ మొదలుపెట్టిన కరణ్ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి పాపులరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment