
సాక్షి, ముంబై : ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేశాడన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్‌ను నటి పూజా బేడీ సమర్ధించారు. ఒబెరాయ్‌పై అక్రమంగా లైంగిక దాడి కేసు నమోదు చేశారని, ఇది పూర్తిగా నకిలీ కేసని ఆమె వ్యాఖ్యానించారు. కాగా కరణ్ ఒబెరాయ్‌ను ముంబై కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. కోర్టు నిర్ణయాన్ని కరణ్ క్లోజ్ ఫ్రెండ్ పూజా బేడీ స్వాగతిస్తూ తాము ఇప్పుడు బెయిల్ కోసం అప్పీల్ చేస్తామని చెప్పారు.
నిరాధార ఆరోపణతో కరణ్ ఒబెరాయ్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేశారని ఆమె ఆరోపించారు. కొందరు మహిళలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కాగా పలు టీవీ సీరియల్స్‌లో నటించిన కరణ్‌ను ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కరణ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తన అభ్యంతరకర వీడియోలను బహిర్గతం చేస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడని 2016 నుంచి అతనితో సన్నిహితంగా ఉంటున్న మహిళ ఈ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment