‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఫేం, నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు షాకిచ్చింది. ఆయనకు తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. తన భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల భరణం చెల్లించాలని కోర్టు గతంలోనే ఆదేశించింది. అయితే, కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు కూడా హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్లుగా పృథ్వీ రాజ్ భార్యతో విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుంది. అయితే, 2017లో శ్రీలక్ష్మి కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.
(ఇదీ చదవండి: దునియా విజయ్ కేసులో నేడు తుది తీర్పు.. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ)
పృథ్వీరాజ్ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటూనే చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నీ తమ తల్లిదండ్రులే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక ఆయన తరచూ తనని వేధించేవాడని, 2016 ఏప్రిల్ 5న ఇంట్లో నుంచి తనని బయటకు పంపించడంతో తన పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
(ఇదీ చదవండి: హత్య కోసం రూ. 30 లక్షలు సుపారీ ఇచ్చిన దర్శన్.. భర్త కోసం రోదిస్తున్న భార్య )
అలాగే తన భర్త సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని, అతని నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన ఫ్యామిలీ కోర్టు.. పృథ్వీరాజ్ తన భార్యకు నెలకు 8 లక్షలు రూపాయలు, అంతేగాక ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి ఆమెకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, శ్రీలక్ష్మీకి భరణం చెల్లించాల్సిన పృథ్వీరాజ్ విఫలం అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను విజయవాడ ఫ్యామిలీ కోర్టు జారీ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment