బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయింది నటి మోనా సింగ్. 'జెస్సీ జైస్సీ కోయ్ నహీ' అనే సీరియల్‌తో క్లిక్ అయిన మోనా ఎక్కువగా రియాలిటీ షోలలో మెరిసింది. గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమా చేసిన ఈ నటి ఇటీవల 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది. కఫాస్ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది.
ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మోనా సింగ్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డాను. సీరియల్స్‌లో నటించే సమయంలోనే వేధింపులను ఎదుర్కొన్నాను. అప్పుడు నేను ఆడిషన్స్ కోసం పుణె నుంచి ముంబై వచ్చేదాన్ని. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను కలిశాను. వాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు, నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది, కొన్నిసార్లు భయమేసేది కూడా!
ఆడవాళ్లు ఎంత అమాయకులైనా, బలహీనులైనా.. అక్కడేం జరుగుతుందనేది ముందే పసిగట్టగలరు. మా అంచనా తప్పు కాదు! కొన్నిసార్లు వాళ్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే.. వీళ్లబారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా.. అని భయంతో వణికిపోయేదాన్ని. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అని ఈ సంఘటనల వల్ల మనం నిరాశకు లోనై వెనకడుగు వేయకూడదు, అనుకున్నది సాధించాలి. నేనూ అదే చేశాను. ప్రయత్నం విరమించకుండా నా కల సాకారం చేసుకున్నాను. ఇప్పటికీ ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది మోనా సింగ్.
చదవండి: బ్రెయిన్ స్ట్రోక్.. మాట పడిపోవడంతో ఇంటికే పరిమితం.. స్టార్ హీరో చెప్పిన అనుభవాలు
బాలయ్య హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment