ఆ స్టార్‌ హీరోను గట్టిగా లాగిపెట్టి కొట్టా.. అందరూ షాక్‌..: నటి | Mona Singh slapped Aamir Khan During 3 Idiots Delivery Scene | Sakshi
Sakshi News home page

Mona Singh: ప్రసవం చేస్తుండగా ఆ స్టార్‌ హీరో చెంప చెల్లుమనిపించా..

Published Sun, Dec 3 2023 1:44 PM | Last Updated on Sun, Dec 3 2023 1:57 PM

Mona Singh slapped Aamir Khan During 3 Idiots Delivery Scene - Sakshi

బాలీవుడ్‌ నటి మోనా సింగ్‌.. 3 ఇడియట్స్‌ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమెపై ఓ కీలకమైన సన్నివేశం ఉంటుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెకు హీరో ఆమిర్‌ ఖాన్‌.. వీడియో కాల్‌లో ప్రియురాలు ఇచ్చే సలహాలతో డెలివరీ చేస్తాడు. ఈ సీన్‌ సినిమాలో విపరీతంగా పండింది. తాజాగా ఈ సన్నివేశం గురించి చెప్పుకొచ్చింది మోనా సింగ్‌.

హీరోనే కొట్టమన్నాడు..
'3 ఇడియట్స్‌లో నేను పురిటి నొప్పులతో టేబుల్‌పై పడుకుని అల్లాడిపోయే ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ చిత్రీకరించేటప్పుడు అందరూ వారివారి అనుభవాలను చెప్పారు. నా భార్య ఇలా చేసింది.. అని చెప్పుకుంటూ పోతున్నారు. రాజ్‌కుమార్‌ హిరానీ సర్‌ అయితే తన భార్య తన్నిందని చెప్పాడు. మాధవన్‌ తన భార్య కొరికిందన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండని అడిగాను. అందుకు ఆమిర్‌ సర్‌.. మోనా, నువ్వు నన్ను కొట్టు అన్నాడు. సరేనని, చెంప మీద కొట్టాను.

యాక్టింగ్‌లో లీనమైపోయాడు..
కానీ అతడు గట్టిగా కొట్టమని హెచ్చరించాడు. నేను నా బలం కూడదీసుకుని లాగిపెట్టి కొట్టాను. దీంతో ఆయన బాడీగార్డ్‌ షాకై నన్ను అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమిర్‌ సర్‌ మాత్రం తన యాక్టింగ్‌లో లీనమైపోయాడు. ఆ సన్నివేశం చాలా సహజంగా రావాలనుకున్నాడు, అనుకున్నట్లుగానే అంతే సహజంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన స్టార్స్‌ మాతో పాటు రిహార్సల్స్‌ చేసేవారు. స్టార్స్‌లా ఫీలయ్యేవారే కాదు' అని చెప్పుకొచ్చింది మోనా. ఈ సినిమా సంచలన విజయంతో పాటు మూడు జాతీయ అవార్డులు సాధించింది.

చదవండి:  ప్రముఖ నటి కన్నుమూత... బెడ్‌పై లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ... చివరి వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement