ప్రతిసారీ గర్భవతిని కాలేను: మోనా సింగ్ | cannot become pregnant in all movies, says mona singh | Sakshi
Sakshi News home page

ప్రతిసారీ గర్భవతిని కాలేను: మోనా సింగ్

Published Wed, Nov 5 2014 10:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ప్రతిసారీ గర్భవతిని కాలేను: మోనా సింగ్

ప్రతిసారీ గర్భవతిని కాలేను: మోనా సింగ్

త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుందా? అందులో కరీనా కపూర్ అక్కగా నటించిన మోనాసింగ్ పాత్ర సినిమాకు చాలా కీలకం. అందులోనూ ఆమె బిడ్డను కనే సన్నివేశాన్ని దర్శకుడు రాజ్కుమార్ హిరానీ చాలా అద్భుతంగా తీశారు. 2009లో వచ్చిన ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్గా నిలిచింది. రెండేళ్ల తర్వాత మోనాసింగ్ మళ్లీ వెండితెర మీదకు వస్తోంది. ఈసారి ఆదిల్ హుస్సేన్ భార్యగా ఆమె నటిస్తోంది.

అయితే.. త్రీ ఇడియట్స్ లాంటి హిట్ సినిమాలో చేసినా.. రెండేళ్ల పాటు వెండితెరకు ఎందుకు దూరంగా ఉన్నారంటే.. ఈ మధ్యలో కూడా తనకు పాత్రలు వచ్చాయి గానీ, వాటిలో చాలావరకు గర్భిణి పాత్రలే వచ్చాయని తెలిపింది. అన్ని సినిమాల్లోనూ తాను గర్భిణి పాత్రలు పోషించలేను కదా అని ప్రశ్నించింది. మిగిలిన వాళ్లలా తాను బుల్లితెరను వదిలిపెట్టబోనని, అటు టీవీ సీరియళ్లు, ఇటు సినిమాలు రెండూ చేస్తానని మోనాసింగ్ చెప్పింది. ఇప్పుడు ఇన్నాళ్లకు మంచి పాత్ర లభించడంతో మళ్లీ వెండితెరమీదకు వస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement