ముంబై: టీవీ నటి మోనా సింగ్ (38) తన చిరకాల స్నేహితుడైన శ్యామ్ గోపాలన్‌ను శుక్రవారం వివాహం చేసుకున్నారు. దక్షిణాదికి చెందిన బ్యాంకర్ శ్యామ్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఆమె.. పంజాబీ సంప్రదాయంలో పెళ్లాడారు. ఈ వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకకు గౌరవ్ గేరా, మిక్కీ దుడానీ హాజరయ్యారు. ఇక మోనా సింగ్ ఎరుపు రంగు లెహంగాతో పెళ్లిదుస్తుల్లో మెరిసిపోయారు. డీజే పాటలకు ఆమె నటి రక్షందా ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ఇటీవల మోనా సింగ్ మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన మోనా సింగ్.. త్రీ ఇడియట్స్ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ సోదరిగా నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం అమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. జెస్సీ జైసీ కోయి నహీ అనే సీరియల్‌తో బుల్లితెర తెరంగ్రేటం చేసిన మోనా.. ఆ తర్వాత రాధా కీ బెటియా కుచ్ కర్‌సక్‌తీ హై, క్యా హువా తేరా వాదా, ఇత్‌నా కరో నా ముజ్హే ప్యార్, ప్యార్ కో హో జానేదో, కవచ్.. కాలీ శక్తియోసే అనే కొన్ని ప్రముఖ సీరియల్స్‌తో పాటు పలు వెబ్ సిరీస్, రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment