యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది! | Kangana Ranaut As Air Force Pilot Is On A Mission To Safeguard India | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: యుద్ధ విమాన పైలెట్‌గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!

Published Sun, Oct 8 2023 11:23 AM | Last Updated on Sun, Oct 8 2023 11:55 AM

Kangana Ranaut As Air Force Pilot Is On A Mission To Safeguard India  - Sakshi

ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్‌గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. 

(ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్‌గా కంగనా.. ‘తేజస్‌’ వచ్చేస్తుంది!)

ట్రైలర్‌ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్‌లో కంగనా రనౌత్‌ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్‌గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement