
ప్రముఖ బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్.. తన చిన్ననాటి స్నేహితురాలు, రానా నాయుడు వెబ్ సిరీస్ నటి ప్రియా బెనర్జీని ఆయన పెళ్లాడారు. ముంబయిలోని బాంద్రాలో జరిగిన వీరి పెళ్లి వేడుకలో సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. దివంగత నటి స్మితా పాటిల్ కుమారుడే ప్రతీక్ బాబర్. తాజాగా తన వివాహానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ప్రతీక్. ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఫిబ్రవరి 14న శుక్రవారం జరిగింది. ఫిబ్రవరి 12న మొదలైన హల్దీ, మెహందీ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగాయి.
దాదాపు మూడు సంవత్సరాల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రియా పుట్టినరోజున నవంబర్ 28న ఓ రెస్టారెంట్‌లో ప్రపోజ్ చేసినట్లు ప్రతీక్ వెల్లడించాడు. ఆ తర్వాత వీరు తమ రిలేషన్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. అయితే పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్ బాబర్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్‌తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో మెప్పించిన ప్రియా బెనర్జీ. ఈ సిరీస్‌లో రానాని టెంప్ట్ చేసే అమ్మాయి పాత్రలో నటించింది. కానీ అంతకు ముందే కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి తెలుగులో పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా నటుడు ప్రతీక్ బాబర్‌ను పెళ్లాడింది. ప్రతీక్ బాబర్ హిందీలో జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment