priya banerjee
-
'రానా నాయుడు' బ్యూటీ రిలేషన్ కన్ఫర్మ్.. పెళ్లి అప్పుడే!
కొన్నాళ్ల ముందు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో రానాని టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి.. బాగా హైలెట్ అయింది. ఈమెని ఇంతకుముందు ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. అవును ఓ పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ యంగ్ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్) మూడేళ్లుగా కలిసే 'ప్రతీక్ నేను గత మూడేళ్లుగా కలిసున్నాం. మా బంధంపై పెద్దగా డిస్కషన్ జరగకూడదని.. రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అఫీషియల్‌గా మా లవ్‌ని ప్రకటించాం. మాకు అనవసరమైన ప్రచారం అక్కర్లేదని భావించి ఇన్నాళ్లు ఊరుకున్నాం. ప్రతీక్ నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాం. తనకు పనిమీద ఫోకస్ ఎక్కువ. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు' త్వరలో పెళ్లి 'రిలేషన్లో ఉన్నాం కదా మా పెళ్లి జరుగుతుంది. అయితే అది ఎప్పుడనేది మేం టైమ్ చూసుకుని ప్రకటిస్తాం. ప్రస్తుతానికైతే ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోం' అని నటి ప్రియా బెనర్జీ చెప్పుకొచ్చింది. పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడాదిలోనే విడిపోయారు. View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) (ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?) -
ప్రియా జోరు.. మాములుగా లేదుగా!
వివిధ రంగాల్లో స్థిరపడాలనుకున్న ఎంతోమంది సినిమా రంగంలో రాణించడం కామన్. అనుకోకుండా వచ్చిన అవకాశం, వారిని స్టార్స్గానూ మారుస్తోంది. అలాంటి వారిలో ఒకరే.. డాన్సర్ కావాలనుకొని యాక్ట్రెస్‌గా.. వెబ్‌స్టార్‌గా ఎదిగిన ప్రియా బెనర్జీ.. ►కెనడాలో పుట్టిన బెంగాలీ అమ్మాయి ప్రియా. ► ఆమె తండ్రి.. సింగర్ కావాలనే తన కలను కూతురి ద్వారా నిజం చేసుకోవాలనుకున్నాడు. ఆరేళ్ల వయసు నుంచే ప్రియకు సంగీతం, నాట్యంలో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు. ► తండ్రి కోరిక మేరకు సింగర్ కాకపోయినా.. డాన్సర్‌గా స్థిరపడాలనుకుంది ప్రియ. అయితే, 2011లో ‘మిస్ వరల్డ్ కెనడా’ అందాల పోటీల్లో పాల్గొనడం, ‘మిస్ ఫొటోజెనిక్’ టైటిల్ గెలుచుకోవడం, వెంటనే ఓ యాడ్ షూట్లో నటించే అవకాశం రావడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోవడంతో డాన్సర్ కంటే ముందు యాక్ట్రెస్ అయింది. ► 2013లో ‘కిస్’ సినిమాతో తెలుగు వెండితెరపై మొదటిసారి మెరిసి, వెంటనే ‘జోరు’, ‘అసుర’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. తను మాత్రం బాలీవుడ్లో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ► 2015లో ‘జజ్బా’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, వరుస చాన్స్‌లతో బిజీ అయిపోయింది. ► ఇదే జోరు.. వెబ్ ప్రపంచంలోనూ చూపించింది . 2017లో ‘సోషల్’ అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయి, ‘రెయిన్’, ‘లవ్ బైట్స్’, ‘బేకాబూ–2’లతో దూసుకుపోయింది. ► ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘లెవన్త్ అవర్’తో ప్రేక్షకులను అలరిస్తోంది. సోల్ లేని కథలో లీడ్ రోల్ చేయడం కంటే, ఖాళీగా కుర్చోవడం మంచిది. నా దృష్టిలో కథ, కథనం అనేవి చాలా ముఖ్యం. అవి నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తా. – ప్రియా బెనర్జీ -
కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ
‘గుండెల్లో గోదారి’తో ప్రశంసలందుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర రెండో ప్రయత్నం ‘జోరు’. సందీప్‌కిషన్, ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్ రాశీ ఖన్నా, సుష్మా, ప్రియా బెనర్జీ ముఖ్యతారలు. ఈ నెల 7న రిలీజ్ కానున్న చిత్రం గురించి, దర్శకుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘నా తొలి చిత్రానికి భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. నేటి యువతరం కోరుకొనే రీతిలో ప్రతి సన్నివేశం ‘జోరు’గా సాగుతుంది. ఒకే పాత్రను ముగ్గురు పోషించడమనే వినూత్న కాన్సెప్ట్ అనుసరించాం. పాత్రల మధ్య గందరగోళంతో ప్రేక్షకు లకు బోలెడంత వినోదం వస్తుంది’’ అని వివరించారు. కథా పరంగా ముగ్గురు నాయికలకూ ప్రాధాన్యమున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు అశోక్, నాగార్జున మాట్లాడుతూ,‘‘సినిమా చకచకా సాగుతుంది. బ్రహ్మానందం, సప్తగిరి, పృథ్వీరాజ్ కామెడీ మరో హైలైట్’’ అని పేర్కొన్నారు. -
జోరు మూవీ పోస్టర్స్
-
సందీప్ కిషన్ 'జోరు' స్టిల్స్
-
సందీప్ కిషన్ 'జోరు' ఆడియో ఆవిష్కరణ
-
'కిస్' మూవీ స్టిల్స్
అడివి శేష్ (పంజా ఫేం), ప్రియ బెనర్జి (మిస్ కెనడ) జంటగా నటించిన సినిమా 'కిస్'. ఈ చిత్రానికి సాయికిరణ్ అడివి (వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు డైరెక్టర్) నిర్మాత. అడివి శేష్ దర్శకుడు. -
ఒక రోజు జర్నీలో...
‘‘నేను ముంబైలో ఉన్నప్పుడు ఓ అర్ధరాత్రి ఓ మాస్ అబ్బాయి, ఓ క్లాస్ అమ్మాయి మాట్లాడుకోవడం విన్నాను. వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. కామన్‌మేన్‌కి ఈజీగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’’ అని అడివి శేష్ చెప్పారు. అడివి శేష్, ప్రియా బెనర్జీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కిస్’. అడివి శేష్ స్వీయదర్శకత్వంలో అడివి సాయికిరణ్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికిరణ్ అడివి మాట్లాడుతూ -‘‘ ‘కిస్’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ఒకమ్మాయికి, అబ్బాయికి మధ్య ఒక రోజు జరిగిన జర్నీని సింపుల్ రొమాంటిక్ స్టోరీగా తెరకెక్కించాం. ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: షెనీల్ దియో, సహనిర్మాత: ఆనంద్ బచ్చు, నిర్వహణ: భవానీ అడవి.