‍Actress Priya Banerjee Confirms Relation With Prateek - Sakshi
Sakshi News home page

Priya Banerjee: ఆ హీరోయిన్‌ మాజీ బాయ్‌ఫ్రెండ్.. ఇప్పుడు ఈమెతో!

Published Thu, Aug 3 2023 12:35 PM | Last Updated on Thu, Aug 3 2023 5:00 PM

‍Actress Priya Banerjee Confirms Relation With Prateek - Sakshi

‍కొన్నాళ్ల ముందు 'రానా నాయుడు' వెబ్ సిరీస్ రిలీజైంది. ఇందులో రానాని టెంప్ట్ చేసే పాత్రలో నటించిన ఓ అమ్మాయి.. బాగా హైలెట్ అయింది. ఈమెని ఇంతకుముందు ఎక‍్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు అనుకున్నారు. అవును ఓ పదేళ్ల క్రితం కిస్, జోరు, అసుర తదితర సినిమాలు చేసిన ప్రియా బెనర్జీకి ఇక్కడ పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. ఓ యంగ్ హీరోతో లవ్ కన్ఫర్మ్ చేసింది. 

(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఈ శుక్రవారం 18 మూవీస్)

మూడేళ్లుగా కలిసే
'ప్రతీక్ నేను గత మూడేళ్లుగా కలిసున్నాం. మా బంధంపై పెద్దగా డిస్కషన్ జరగకూడదని.. రిలేషన్ గురించి బయటకు చెప్పలేదు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం రోజున అఫీషియల్‌గా మా లవ్‌ని ప్రకటించాం. మాకు అనవసరమైన ప్రచారం అక్కర్లేదని భావించి ఇన్నాళ్లు ఊరుకున్నాం. ప్రతీక్ నేను ప్రస్తుతం కెరీర్‌‌పై దృష్టి పెట్టాం. తనకు పనిమీద ఫోకస్ ఎక్కువ. తానేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు'

త్వరలో పెళ్లి
'రిలేషన్‌లో ఉన్నాం కదా మా పెళ్లి జరుగుతుంది. అయితే అది ఎప్పుడనేది మేం టైమ్ చూసుకుని ప్రకటిస్తాం. ప్రస్తుతానికైతే ప్రేమలో చాలా సీరియస్ గా ఉన్నాం. ఈ ఏడాది మాత్రం పెళ్లి చేసుకోం' అని నటి ప్రియా బెనర్జీ చెప్పుకొచ్చింది. పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ తరహా పాత్రలు చేస్తున్న ప్రతీక్.. గతంలో హీరోయిన్ అమీ జాకన్స్‌తో డేటింగ్ చేసినట్లు టాక్. 2019లో సన్యా సాగర్ అనే నిర్మాతని పెళ్లి చేసుకున్నాడు కానీ ఏడాదిలోనే విడిపోయారు. 

(ఇదీ చదవండి: 'జైలర్'.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement