Fact Check: Is Sidharth Malhotra, Kiara Advani Broken Up Full Details Inside - Sakshi
Sakshi News home page

Kiara Advani-Sidharth Malhotra: బ్రేకప్‌ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే..

Published Tue, Apr 26 2022 9:11 PM | Last Updated on Wed, Apr 27 2022 11:07 AM

Fact Check: Is Sidharth Malhotra, Kiara Advani Broken Up Details Inside - Sakshi

Is Sidharth Malhotra, Kiara Advani Broken Up: బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ కియారా అద్వానీ, సిద్దార్థ్‌ మల్హోత్రాల బ్రేకప్‌ బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌ నిలిచింది. కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్న ఈ జంట క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోయారంటూ వార్తలు రావడంతో ఈ జంట ఫ్యాన్స్‌ షాక్‌కు గురవుతున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే ఇలా ఎవరి దారి వారదే అని విడిపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది స్పష్టత లేదు.

చదవండి: అందుకే ‘జెర్సీ’లో నటించనని చెప్పా: రష్మిక వివరణ

కానీ, బ్రేకప్‌ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు స్పందించకపోవడంతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వారందరికి ఊరటనిస్తూ ఈ జంట విడిపోలేదని వారి సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్‌లు కలిసి లేరనేది వాస్తవమే కానీ, అది గొడవల వల్ల కాదని చెబుతున్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉండటం కారణంగా కొద్ది రోజులు ఈ జంట విడిగా ఉంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ షూటింగ్‌లో భాగంగా టర్కిలో ఉండగా.. కియారా తన తాజా చిత్రం  ‘భూల్ భులయ్యా-2’ మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉందట.

చదవండి: పిల్లలతో వెకేషన్‌లో శ్రీజ కొణిదెల.. ఫోటోలు వైరల్‌

అందువల్లే వీరిద్దరు కలుసుకోవడం లేదని, సిద్ధార్థ్‌ టర్కి నుంచి రాగానే మీకే క్లారిటీ వస్తుందని కియారా, సిద్ధార్థ్‌ల మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ నుంచి సమాచారం. కాగా వీరిద్దరు తొలిసారి జంటగా నటించిన షేర్షా మూవీ షూటింగ్‌ సమయంలో కియారా, సిద్ధార్థ్‌లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్‌ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్‌ వీళ్లేనంటూ బీటౌన్‌లో ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్‌ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు ఒక్కసారిగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement