బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్ కపుల్ తమ రిలేషన్‌కి ఎండ్ కార్డ్ వేసేశారు. బాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హ్రోత్రా బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు కియారా బ్రేకప్ వార్తలు నిజమే అంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.
కాగా షేర్షా మూవీతో కలిసి తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్దార్థ్‌లు ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత పెళ్లి చేసుకునే కపుల్ వీళ్లేనంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి షాక్ ఇస్తూ కియారా- సిద్దార్థ్‌లు విడిపోయినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment